బీజేపీ ముస్లిం వ్యతిరేకి కాదు.. | Union Minister Kishan Reddy Said BJP Was Not Anti Muslim | Sakshi
Sakshi News home page

బీజేపీ ముస్లిం వ్యతిరేకి కాదు..

Published Mon, Jan 20 2020 12:12 PM | Last Updated on Mon, Jan 20 2020 12:30 PM

Union Minister Kishan Reddy Said BJP Was Not Anti Muslim - Sakshi

సాక్షి, చౌటుప్పల్‌: కేవలం ఎంఐఎం పార్టీపై మాత్రమే తమ పోరాటమని.. ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదనీ కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, ఓవైసీ బ్రదర్స్ కలిసి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మెజార్టీ మున్సిపాలిటీ స్థానాల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2023 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని... లక్ష మంది ఓవైసీలు, కేసీఆర్ లు వచ్చినా బీజేపీ హవా అడ్డుకోలేరని కిషన్‌ రెడ్డి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement