kishan reddy
-
Adani Row: ‘అమెరికా మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు’
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనలో ఏం చేశారో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే, అదానీ అంశంపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని నేడు తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిశారు. అనంతరం, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర నేతలతో ప్రధాని మోదీ చర్చించారు. తెలంగాణలో అభివృద్ధి పనులపై ఆరా తీశారు. అభివృద్ది విషయంలో సానుకూల ధోరణితో పని చేయాలన్నారని చెప్పుకొచ్చారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాదిలో ఏం చేశారో రేవంత్ రెడ్డి చెప్పాలి. వంద రోజులలో ఆరు గ్యారెంటీల అమలులో విఫలమయ్యారు. నాది బీజేపీ డీఎన్ఏ.. మీలాగా పది పార్టీలు మారిన డీఎన్ఏ కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలపై డిసెంబర్ 1 నుంచి 5 వరకు ప్రచారం చేస్తాం. ఇప్పటికైనా సీఎం రేవంత్, విపక్షాలను తిట్టే బదులు పాలనపై దృష్టి పెట్టాలి.విషాహారం తిని విద్యార్థులు చనిపోవడానికి గల కారణాలపై దృష్టి సారించాలి. ఎమ్మెల్యేల ఫిరాయింపులను నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు దొందూ దొందే అన్న చందంగా వ్యవహరిస్తున్నాయి అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇదే సమయంలో అదానీ అంశంపై కూడా కిషన్ రెడ్డి స్పందించారు. అదానీ అంశంలో అమెరికా మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అక్కడ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. అదానీపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. కొన్ని శక్తులు కుట్ర పూరితంగా ఈ ఆరోపణలు చేస్తున్నాయి. మా దేశంపై ఎలా ఆరోపణలు చేస్తారు. పార్లమెంటు సమావేశాలకు ముందుగానే ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
పొలిటికల్ హైడ్రామా.. BRSకు షాకిచ్చిన ఆరూరి రమేష్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు జెట్ స్పీడ్ వేగంతో మారిపోతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ నేత ఆరూరి రమేష్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆయన ఏ క్షణంలోనైనా ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలిసే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే, ఆరూరి విషయంలో నిన్న(బుధవారం) హైడ్రామా జరిగింది. ఆరూరి బీజేపీలో చేరుతున్నాయనే సమాచారం రావడంతో ఆయన ఇంటికి బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సహా పలువురు నేతలు వెళ్లారు. అనంతరం, నాటకీయ పరిణామాల మధ్య ఆరూరిని హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. అనంతరం, మాజీ సీఎం కేసీఆర్‌తో ఆరూరి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌తో ఆరూరి మాట్లాడినా ఆయన కాంప్రమైజ్ కాలేదు. దీంతో, ఆరూరి బీఆర్ఎస్ను వీడాలని నిర్ణయించుకున్నారు. ఇక, అంతకుముందే ఆరూరి.. బీజేపీ నేతలతో టచ్‌లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ కోసం ఆరూరి ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డిని ఏ క్షణంలోనైనా ఆరూరి కలిసే అవకాశం ఉంది. అనంతరం, ఆరూరి ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. -
రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి కొనసాగింపు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డిని కొనసాగించాలని ఆ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్టు సమాచారం. కాగా అందుకు ఆయన అంగీకరించారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. గతంలో బండి సంజయ్ స్థానంలో నియమించినప్పుడే.. శాసనసభ ఎన్నికల దాకే ఆ బాధ్యతలు నిర్వహిస్తానని కిషన్‌రెడ్డి నాయకత్వానికి చెప్పారని, అదీగాక ఈ ఎన్నికల్లో పార్టీ ఆశించిన ఫలితాలు సాధించక పోవడంతో తనను బాధ్యతల నుంచి తప్పించాల్సిందిగా కోరారని తెలిసింది. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి పూర్తి సమయం కేటాయించాలని కిషన్‌రెడ్డి భావిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికలు ముగిసేదాకా కొనసాగాలని నాయకత్వం ఆయనకు నచ్చజెప్పినట్టు సమాచారం. దీంతో పార్లమెంటు ఎన్నికల దాకా కొనసాగేందుకు ఆయన ఒప్పుకున్నట్టుగా పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరో 3, 4 నెలల్లోనే ఈ ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఫిబ్రవరిలోనే షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండడంతో.. ఇంత తక్కువ వ్యవధిలో కొత్త అధ్యక్షుడు కుదురుకోవడం సాధ్యం కాదని బీజేపీ నాయకత్వం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. కీలకమైన ఎన్నికలు కావడంతో పాటు తెలంగాణ నుంచి అధిక సీట్లు (గతంలో గెలిచిన 4 సీట్ల కంటే ఎక్కువగా) గెలిచేందుకు అవకాశం ఉందన్న అంచనాల మధ్య కిషన్‌రెడ్డినే కొనసాగించాలని భావించినట్టు సమాచారం. -
లోకేష్-అమిత్‌షా భేటీపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ ఇటీవల అమిత్‌షాను కలిసిన సంగతి తెలిసిందే. అయితే నారా లోకేష్ కేంద్రమంత్రిని కలవడంలో తన పాత్ర ఏమి లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అమిత్‌షాను పదేపదే అపాయింట్మెంట్ అడిగింది లోకేషేనని తెలిపారు. ఢిల్లీలో ఉన్న పది రోజుల్లో లోకేష్ పలుమార్లు అమిత్‌షా అపాయింట్మెంట్ కోసం విజ్ఞప్తి చేశారని చెప్పారు. తొలుత హోంమంత్రి బిజీ షెడ్యూల్ కారణంగా లోకేష్‌ను కలవలేదన్నారు. తెలుగురాష్ట్రాల్లో ఉన్న ఏకైక కేంద్రమంత్రిగా తాను ఆ సమావేశానికి హాజరయ్యానని వివరించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డే తనను అమిత్‌షా దగ్గరకు తీసుకెళ్లారని లోకేష్ గతంలో చెప్పడంతో ఆయన ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. కేంద్ర హోంమంత్రిగా అమిత్‌షా చాలామందిని కలుస్తారని, ప్రత్యర్థులు అపాయింట్మెంట్ అడిగినా ఇస్తారని స్పష్టం చేశారు కిషన్‌రెడ్డి. -
ప్రధాని మోదీ వ్యాఖ్యలు దిగ్భ్రాంతిని కలిగించాయి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ విభజన అంశంపై మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే.. ప్రధాని మోదీ వ్యాఖ్యలు దిగ్భ్రాంతిని కలిగించాయని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోదీ అవమానించడం ఇదే తొలిసారి కాదని అన్నారు. మోదీ...తెలంగాణ విరోధి! తెలంగాణ మీద పదే పదే ప్రధానికి అదే అక్కసు ఎందుకని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. అమృతకాల సమావేశాలని పేరుపెట్టి.. విషం చిమ్మడం సంస్కారహీనమని అన్నారు. తెలంగాణ అంటేనే గిట్టనట్టు, పగబట్టినట్టు.. మా పుట్టుకను ప్రశ్నించడం పద్ధతేనా? అని మోదీ వ్యాఖ్యలను ఆక్షేపించారు. తల్లిని చంపి బిడ్డను తీశారని అజ్ఞానం, అహంకారంతో ఇంకెన్నిసార్లు మా అస్తిత్వాన్ని అవమానిస్తారని దుయ్యబట్టారు. పోరాడి దేశాన్ని ఒప్పించి మెప్పించి.. సాధించుకున్న స్వరాష్ట్రం పట్ల ఎందుకంత చులకన భావం మీకని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రతిసారి పనిగట్టుగొని మా ఆత్మగౌరవాన్ని గాయపర్చడం సబబు కాదని అన్నారు. మోదీ...తెలంగాణ విరోధి! తెలంగాణ మీద పదే..పదే అదే అక్కసు ఎందుకు ప్రధాని..? అమృతకాల సమావేశాలని పేరుపెట్టి విషం చిమ్మడం ఏం సంస్కారం ..? తెలంగాణ అంటేనే గిట్టనట్టు..పగబట్టినట్టు మా పుట్టుకను ప్రశ్నించడం పద్ధతేనా..? తల్లిని చంపి బిడ్డను తీసారని అజ్ఞానం..అహంకారంతో ఇంకెన్నిసార్లు మా… https://t.co/3tNjBJSVOK — KTR (@KTRBRS) September 18, 2023 తెలంగాణపై ఎంత కోపమో.. అప్పర్ భద్ర, పోలవరం, కెన్‌బెత్వాకు జాతీయ హోదాఇచ్చి.. మధ్యలో తెలంగాణకు మొండిచేయి ఎందుకు? మేం చేసిన పాపమేందని కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బయ్యారంలో ఉక్కు ఫాక్టరీ ఉరేసి, గిరిజన వర్సిటీ పెట్టకుండా నానబెట్టి.. ఆదివాసులపై కక్ష సాధిస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్‌కు ఆర్బిట్రేషన్ సెంటర్ వస్తే ఓర్వలేరు. మీరు నిధులివ్వరు. సొంత ఆర్థిక వనరులు సమకూర్చుకుంటే ఆంక్షలు విధిస్తారని దుయ్యబట్టారు. కాజీపేట కోచ్ ఫాక్టరీని గుజరాత్‌కు తరలించుకుపోయి దశాబ్దాల కలని కల్లలు చేసిన మీ దుర్మార్గాన్ని క్షమించగలమా? 157 మెడికల్ కాలేజీల్లో ఒక్కటి ఇవ్వకుండా గుండు సున్నా చేశారంటే.. మీకు తెలంగాణపై ఎంత కోపమో అని మంత్రి కేటీఆర్ అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్‌తో ఊదరగొట్టే బీజేపీకి తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు కూడా రావని అన్నారు. డిపాజిట్లు కోల్పోవడంలో మళ్లీ సెంచరీ కొట్టడం పక్కా అని ఎద్దేవా చేశారు. మోదీ అలా అనలే: కిషన్ రెడ్డి ప్రధాని మోదీ ఎవర్నీ విమర్శించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చెప్పారు. సంతోష వాతావరణంలో బీజేపీ మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటును సామరస్యంగా చేయలేకపోయిందని మాత్రమే మోదీ అన్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ లో జరిగిన విషయాలను మాత్రమే మోదీ చెప్పారు.. విభజన బిల్లు సమయంలో పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు పెప్పర్ స్ప్రే చేశారు.. కారం, నీళ్ళు చల్లారు.. తలుపులు మూశారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. 'ట్విట్టర్ లేకుంటే బ్రతకను, అమెరికాలో ట్విట్టర్ నేర్చుకున్నట్లు, ట్విట్టర్ కోసమే బ్రతుకుతున్నట్లు మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. తెలంగాణ విమోచన దినానికి, సమైక్యతకు తేడా కేసీఆర్ కు అర్థం కావడం లేదు.. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కు ప్రధాని మోదీ మాటలు అర్థం చేసుకునే పరిస్థితి లేదు' అని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇదీ చదవండి: బీఆర్ఎస్ Vs కాంగ్రెస్.. నేతల మధ్య పొలిటికల్ వార్ -
రాష్ట్ర రక్షణకు మేధావులు బీజేపీలోకి రావాలి..
సాక్షి, హైదరాబాద్: కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజల రక్తం తాగుతోందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఒక చేత్తో ఆసరా పెన్షన్ ఇచ్చి, మరో చేతిలో మద్యం బాటిల్ పెట్టి కేసీఆర్ సర్కారు డబ్బులు లాగేసుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంలో భూములు, మద్యం అమ్మనిదే ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. విద్యుత్ చార్జీలు, ఆరీ్టసీ, భూముల రిజిస్ట్రేషన్, ఇంటిపన్ను ఇలా.. అన్ని రకాల చార్జీలను పెంచి ప్రజలపై ప్రభు త్వం తీరని భారం మోపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి, ముఖ్యనేతలు బండి సంజయ్, కె.లక్ష్మణ్, ధర్మపురి అర్వింద్ సమక్షంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు కుమారుడు డా.చెన్నమనేని వికాస్‌రావు, ఆయన భార్య డా. దీప బీజేపీలో చేరారు. వారికి కిషన్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రోజువారీ ఖర్చుల కోసం కూడా.. భూముల వేలం ద్వారా డబ్బు సమకూర్చుకుంటోన్న దుస్థితి నెలకొందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక అవసరాల కోసం ఓఆర్ఆర్ రింగ్ రోడ్డును తాకట్టు పెట్టడం దారుణమన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం తెలంగాణలోని విద్యావంతులు, మేధావులు బీజేపీలోకి రావాలని ఆహా్వనిస్తున్నామని ఆయన పిలుపునిచ్చారు. ఏ బాధ్యతనిచ్చినా స్వీకరిస్తాం: డాక్టర్ వికాస్ బీజేపీ అగ్రనేతలు వాజ్‌పేయి, అద్వానీ, మురళీ మనోహర్జోషి వంటి పెద్దల ప్రభావం తనపై ఉందని పారీ్టలో చేరిన డాక్టర్ వికాస్ తెలిపారు. తాను, తన భార్య డా.దీప ప్రజలకు మరింత సేవ చేసేందుకు బీజేపీలో చేరామని, రాబోయే రోజుల్లో అప్పగించే బాధ్యతలను మనస్ఫూర్తిగా నిర్వర్తిస్తామని చెప్పారు. ఎన్నికలెప్పుడొచ్చినా బీజేపీ గెలుపు తథ్యం : బండి సంజయ్ తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ గెలుపు తథ్యమని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనపట్ల ప్రజలు పూర్తిగా విసిగిపోయారనీ, రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలే ఇందుకు నిదర్శనమన్నారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో రామరాజ్యం రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. డా.వికాస్, దీపల చేరికతో రాజన్న సిరిసిల్లలోని రెండు నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి: డా. కె. లక్ష్మణ్ దేశంలో మోదీ ప్రభుత్వ సుపరిపాలనకు ఆకర్షితులై, ప్రజలకు మరింత సేవా చేయాలనే సంకల్పంతో డాక్టర్ వికాస్, దీప దంపతులు బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలోని విద్యావంతులు ముఖ్యంగా యువత రాజకీయ రంగంలోకి రావాలని విలువలతో కూడిన రాజకీయాలు, జవాబుదారీతనంతో కూడిన రాజకీయాలు వారితోనే సాధ్యమన్నారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ బలోపేతం: ఎంపీ అర్వింద్ వేములవాడ ప్రాంతంలో సామాజిక, సేవా కార్యక్రమాలను చేపడుతున్న డాక్టర్ దీప, వికాస్ దంపతుల చేరికతో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బీజేపీ మరింత బలోపేతమవుతుందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి చెప్పారు. -
కేసీఆర్ బలం, బలహీనతలు తెలుసు: ఈటల
సాక్షి, హైదరాబాద్: తనపై విశ్వాసముంచి బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ, జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షా, జాతీ య సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌లకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ధన్యవాదాలు తెలిపారు. ‘తెలంగాణ అంతరంగం, సమస్యలు తెలిసిన వాడిని. కేసీఆర్ బలం, బలహీనతలు తెలుసు. ఒక కార్యకర్తగా నా బాధ్య తను సంపూర్ణంగా నిర్వహిస్తా. కిషన్‌రెడ్డి సీనియర్ నాయకులు.. ఆయనతో కలిసి పని చేస్తాం’ అని ఈటల పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు నడ్డా, అమిత్ షా తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా ఎగురేయాలని నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లోనే అంకురార్పణ చేశారన్నారు. బండి సంజయ్ నాయకత్వంలో నాలుగు ఎన్నికల్లో గెలిచాం. తెలంగాణలో గెలిస్తే బీజేపీ.. లేదంటే బీఆర్ఎస్ గెలిచింది తప్ప కాంగ్రెస్ గెలవలేదు. బీఆర్ఎస్ను ఓడించే సత్తా ఒక్క బీజేపీకి మాత్రమే ఉంది. బీఆర్ఎస్ గెలిస్తే ఒక కుటుంబానికి లాభం. బీజేపీ గెలిస్తే ప్రజలకు లాభం. దేశానికి ఒక ఓబీసీ ప్రధానిని అందించిన పార్టీ బీజేపీ. అధిష్టానం మా మీద పెట్టిన విశ్వాసాన్ని శక్తి వంచన లేకుండా నిలుపుకుంటాం. కిషన్‌రెడ్డితో కలిసి శభాష్ అనే విధంగా పని చేస్తాం’ అని ఈటల స్పష్టం చేశారు. చదవండి: Kishan Reddy: అందుకే కిషన్‌రెడ్డికి బీజేపీ బాధ్యతలు, ఈటలకు కీలక పదవి -
కమల దళపతి కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలు, ప్రచారానికి ఫుల్స్టాప్ పెడుతూ బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. బండి సంజయ్ స్థానంలో.. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న గంగాపురం కిషన్‌రెడ్డిని రాష్ట్ర పార్టీ చీఫ్‌గా నియమించింది. ఇదే సమయంలో పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యతలు అప్పగించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ మంగళవారం మధ్యాహ్నం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన బండిని త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతుండగా, దీనిపై మరో రెండు, మూడురోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. అనుభవం, అణుకువ ప్రామాణికంగా.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడి మార్పు సహా పలు కమిటీల నియామకంపై బీజేపీ అధిష్టానం గడిచిన నెల రోజులుగా చర్చోపచర్చలు కొనసాగించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లు ఈ అంశాలపై దృష్టి పెట్టారు. రాష్ట్ర నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార బీఆర్ఎస్ను ఢీ కొట్టాలంటే మార్పు చేర్పులు అవసరమని కొందరు పార్టీ నేతలు అధిష్టానానికి సూచించారు. రాష్ట్ర నాయకత్వంపై తమ అసంతృప్తిని కొందరు అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో నేతల మధ్య సమన్వయ లేమిని జాతీయ నాయకత్వం పరిగణనలోకి తీసుకుందని, సంజయ్‌ను తప్పించాలనే నిర్ణయానికి వచ్చిందని సమాచారం. కాగా ఈటల రాజేందర్, డీకే అరుణ సహా మరొకొందరి పేర్లు పరిశీలించిన బీజేపీ అధిష్టానం చివరికి పార్టీలో సుదీర్ఘ అనుభవం, అణుకువ, విధేయతలు ప్రామాణికంగా తీసుకుని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. యువ మోర్చా రాష్ట్ర, జాతీయ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించడం, మూడుసార్లు ఎమ్మెల్యే ఉండటం, గతంలోనూ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయడం, ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా ఉండటం, అన్నింటికన్నా ముఖ్యంగా తెలంగాణలో బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో కిషన్‌రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపింది. అయితే కిషన్‌రెడ్డిని కేంద్ర మంత్రిగా కొనసాగిస్తారా? లేక తొలగిస్తారా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. బీజేపీలో జోడు పదవుల వ్యవహారం లేనందున ఆయన్ను కేంద్ర కేబినెట్ నుంచి తొలగిస్తారని ప్రచారం జరుగుతున్నా దీన్ని ఎవరూ ధ్రువీకరించడం లేదు. దీనిపైనా రెండు, మూడురోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. చదవండి: బండి సంజయ్ ను ఎందుకు తప్పించారు? అన్నీ పరిగణనలోకి తీసుకుని ఈటలకు బాధ్యతలు రాష్ట్ర అధ్యక్ష పదవికి తొలినుంచి బలమైన పోటీదారుగా ఉన్న ఈటల రాజేందర్‌ను అత్యంత కీలకమైన ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా బీజేపీ నియమించింది. రాష్ట్రంలో అధికంగా ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, అందులోనూ అత్యంత కీలకమైన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారవడం, సీఎం కేసీఆర్‌ను ఎదిరించి పార్టీలోంచి బయటకు వచ్చి పోరాడుతున్న నేతగా పేరుండటం, అన్ని పార్టీలు, వర్గాలు, తెలంగాణ ఉద్యమ సంఘాలతో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం ఈటల ఎంపికకు కలిసొచ్చిందని చెబుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకునే ఎన్నికల ప్రచార బాధ్యతలు, వ్యూహాల ఖరారు, అభ్యర్థుల ఎంపిక అంశాలపై పట్టు ఉండే ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యతలు ఆయనకు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. నడ్డాతో సంజయ్ భేటీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు సహా పలు ఇతర అంశాలపై చర్చించేందుకు అధిష్టానం పెద్దల పిలుపు మేరకు ఢిల్లీకి వచ్చిన బండి సంజయ్ మంగళవారం మధ్యాహ్నం పార్టీ జాతీయ కార్యాలయంలో జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే అధ్యక్ష పదవికి సంజయ్ రాజీనామాను తీసుకున్నారు. కొత్త అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి ఎంపికకు గల కారణాలు, మున్ముందు పార్టీలో, కేంద్ర పదవుల్లో కల్పించే ప్రాధాన్యం, ఇతర అంశాలను సంజయ్‌కు నడ్డా వివరించారు. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో చోటు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నా దీనిపై స్పష్టత రాలేదు. భేటీ అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడకుండానే అక్కడినుంచి వెళ్లిపోయారు. ఇక అదే సమయంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు సైతం నడ్డాతో భేటీ అయినట్లు తెలిసింది. ఎస్టీ సామాజికవర్గం నుంచి ఆయనకు కేబినెట్లో చోటు దక్కుతుందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్న సమయంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. -
కర్ణాటకలో మా పొరపాట్లు కొన్ని ఉన్నాయి అందుకే ఇలా జరిగింది
-
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
-
యోగ గొప్పతనం ఏంటో చెప్పిన విశ్వక్ సేన్ శ్రీలీల..
-
బీజేపీ ని ఆడిపోసుకోవడమే కేసిఆర్ పనిగా పెట్టుకున్నాడు
-
కన్ఫ్యూషన్ లో బీజేపీ
-
కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ సవాల్
-
హైదరాబాద్ అంటే హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ కాదు!
ముషీరాబాద్ (హైదరాబాద్): హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ కాదని హైద రాబాద్ నగరం పేదలు నివసించే బస్తీల్లో, కాలనీల్లో ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వీటి అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ముషీరా బాద్ నియోజకవర్గంలోని అడిక్‌మెట్, రాంనగర్ డివిజన్లలోని పలు బస్తీలు, కాలనీల్లో అధికారు లతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సంద ర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. పేదలు, చిన్ని చిన్న ఉద్యోగులు నివసించే కాలనీలు, బస్తీలు నిర్ల క్ష్యానికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధి అంటే హైటెక్‌సిటీ అభివృద్ధి అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. నిజమైన హైదరాబాద్ అంటే ఓల్డ్‌సిటీ, ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్పేట్, సికింద్రాబాద్, సనత్‌నగర్‌లతోపాటు అనేక ప్రాంతాలున్నాయన్నారు. మెయిన్రోడ్లమీద రంగులు పూసి హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడికి వెళ్లినా డ్రైనేజీ, వర్షపునీరు, కలుషిత మంచినీరు, రోడ్లపై గుంతలు, వీధిలైట్ల సమస్యలను చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్ నుంచే 80 శాతం రెవెన్యూ వస్తోంటే.. నగర అభివృద్ధికి 8 శాతం నిధులు కూడా ఖర్చుపెట్టడం లేదని చెప్పారు. హైదరాబాద్‌లోని రెండు ప్రధాన శాఖ లైన జీహెచ్ఎంసీ, జలమండలి అప్పుల ఊబిలో చిక్కి చిన్న చిన్న పనులకు సైతం నిధులు విడుదల చేయలేని దుస్థితి నెలకొందని దుయ్యబట్టారు. అందువల్ల ప్రభుత్వం బస్తీల్లో ఉండే నిజమైన హైద రాబాద్ అభివృద్ధికి కృషిచేయాలని కోరారు. చదవండి: నాడు టీడీపీలో.. నేడు కాంగ్రెస్‌లో.. చంద్రబాబుతో మాకు సంబంధం లేదు -
రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్న తెలంగాణ అభివృద్ధి ఆగదు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
-
టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదిగింది
ఆమనగల్లు: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో మంగళ వారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో నియంతృత్వ, అవినీతి కుటుంబ పాలన కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదిగిందని, వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండే ముఖ్యమంత్రిని తీసుకొస్తామని, రాష్ట్ర అభివృద్ధే ఎజెండాగా బీజేపీ పాలన సాగిస్తుందని చెప్పారు. తమ ఆత్మగౌరవాన్ని కల్వకుంట్ల కుటుంబం వద్ద తాకట్టు పెట్టినట్లయిందని ప్రజలు వాపోతున్నారన్నారు. కీలకమైన 15 శాఖలు కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్ వద్ద ఉన్నాయని, మిగతా మంత్రుల వద్ద మామూలు శాఖలు ఉన్నాయని, ఆ ముగ్గురు మినహా కేబినెట్లో మంత్రులంతా జీరోలే అని ఆయన విమర్శించారు. మతపరమైన రిజర్వేషన్లకు తమ పార్టీ వ్యతిరేకమని, రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. శ్రీశైలం జాతీయ రహదారికి రూ.1720 కోట్లు హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిలో తుక్కుగూడ నుంచి డిండి వరకు 85 కిలోమీటర్ల రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించడానికి రూ.1720 కోట్లు మంజూరైనట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 788 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి రూ.16571 కోట్లు, కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ వరకు 79 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.886 కోట్లు మంజూరైనట్లు కిషన్‌రెడ్డి వివరించారు. చదవండి: హరీశ్‌రావు.. దమ్ముంటే దుబ్బాకలో పోటీచెయ్ -
గడ్కరీ కార్యక్రమంలో జైశ్రీరామ్ నినాదాలు
హైదరాబాద్: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్న ఓ కార్యక్రమంలో ‘జై శ్రీరామ్’ నినాదాలు హోరెత్తాయి. ఓ కార్యక్రమం కోసం గడ్కరీ హైదరాబాద్‌కు వచ్చారు. మైకులో తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతుండగా.. ‘జై శ్రీరామ్, భారత్‌మాతాకి జై’ అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. అక్కడే ఉన్న మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జోక్యం చేసుకుని అందరూ ప్రశాంతంగా ఉండాలని వారించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు నినాదాలు ఆపేశారు. శుక్రవారం జాతీయ రహదారుల శంకుస్థాపన కార్యక్రమంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ఆ బొగ్గుబ్లాక్‌ను రాష్ట్రమే ప్రైవేటుకు అప్పగించింది: కిషన్‌రెడ్డి
భూపాలపల్లి అర్బన్/భూపాలపల్లి: సింగరేణిలోని తాడిచెర్ల బొగ్గుబ్లాక్‌ను రాష్ట్ర ప్రభుత్వమే ప్రైవేట్‌కు అప్పగించిందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించా రు. మరో 4 బొగ్గుబ్లాక్‌లను ప్రైవేట్‌కు అప్పగించవద్దని రాష్ట్రం దరఖాస్తు చేసుకుంటే వాటిని సింగరేణికి అప్పగించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సింగరేణిని, కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. బీఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణివ్యాప్తంగా చేపడుతున్న కార్మిక చైతన్య యాత్రను సోమవారం భూపాలపల్లి ఏరియాలో నిర్వహించారు. మధ్యాహ్నం ఏరియాలోని కేటీకే ఐదో గనిలో జరిగిన యాత్రలో కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. గని ఆవరణలో కార్మికులతో ఏర్పాటుచేసిన సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. విద్యుత్ సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన రూ.23వేల కోట్లు చెల్లించడంలో రాప్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందన్నారు. కేంద్రప్రభుత్వ పరిధిలోని కోల్ఇండియా సంస్థలకు కల్పిస్తున్న హక్కులు, సౌకర్యాలను రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు కల్పించడంలో విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కార్మికుల ఆదాయపన్ను చెల్లిస్తామని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాలతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని దుయ్యబట్టారు. కాగా, కిషన్‌రెడ్డి రేగొండ మండలంలోని పాండవులగుట్టను సందర్శించారు. గుట్ట అభివృద్ధికి అవసరమైన నిధులపై జిల్లా అటవీ అధికారిని అడిగి తెలుసుకున్నారు. మీ దౌర్జన్యం ప్రజల తిరుగుబాటుతో పతనం ప్రజల తిరుగుబాటుతో టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ దౌర్జన్యం పతనం కాక తప్పదని, నియంతృత్వ పోకడ, అహంకారం, కుటుంబపాలన త్వరలోనే పోతుందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం భూపాలపల్లి మున్సిపాలిటీ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. సింగరేణి కార్మికులను సీఎం కేసీఆర్ మోసం చేశారని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయలేదని, కనీస క్వార్టర్స్ సౌకర్యం కల్పించడం లేదని, యూనివర్సిటీ ఏర్పాటు చేయలేదన్నారు. -
నగ మెరిసేనా!
సాక్షి, సిటీబ్యూరో: నిజాం నగలు మన ముంగిటకు రానున్నాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రదర్శిస్తున్న ఆభరణాలను హైదరాబాద్‌కు తీసుకొచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. అనువైన స్థలం, రక్షణ కల్పిస్తే భాగ్యనగరానికి నగలు తీసుకురావడానికి ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో నిజాం నగల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఆరో స్థానంలో ఉన్న నిజాంకు భారీగా ఆస్తులున్నాయి. వీటి విలువ ఏకంగా 11,80,000 కోట్లుగా అంచనా. ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ 1967లో 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఇప్పటివరకు(ఆల్‌టైం) భారతీయుల్లోనే అత్యంత సంపన్నుల్లో ఆయన ఒకరిగా నిలిచారు. కేవలం 2012లో ఆస్తుల విలువను మదించడం ద్వారా నిజాం ఆస్తుల లెక్కను తేల్చారు. రూ.218 కోట్లకు కేంద్రం కొనుగోలు ప్రస్తుతం నిజాం నగలు కేంద్ర ప్రభుత్వ అదీనంలో ఉన్నాయి. 1995లో భారత ప్రభుత్వం వీటిని రూ.218 కోట్లకు కొనుగోలు చేసింది, 1967లో ఉస్మాన్ అలీఖాన్ మరణానంతరం నిజాం ట్రస్టీలు ప్రసిద్ధిగాంచిన ఈ ఆభరణాల విక్రయానికి అంగీకరించారు. 1970లో వీటిని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. దీంతో నిజాం జ్యువెలరీ ట్రస్టీ వీటిని జాతీయ, విదేశీ సంస్థలకు విక్రయించాలని భావించారు. ఈ క్రమంలో నిజాం మనవరాలు ఫాతిమా ఫౌజియా జోక్యంతో ఆభరణాల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. 465 ముత్యాలు పొందుపర్చిన సత్లాడ.. 173 రకాల వజ్రాభరణాలు, వెండి వస్తువులు వీటిలో ఉన్నాయి. తలపాగా ఆభరణాలు, నెక్లెస్‌లు, చెవి పోగులు, ఆర్మ్ బ్యాండ్లు, కంకణాలు, గంటలు, బటన్లు, కఫ్ లింక్‌లు, చీలమండలు, వాచ్ చైన్, ఉంగరాలు, ముత్యాలు, వైఢూర్యాలు, పగడాలు తదితర నగలున్నాయి. నిజాంలు, వారి వారసులు ధరించిన ఆభరణాల్లో ముఖ్యంగా వజ్రాలు కూడా ఇందులో ఉన్నాయి. వీటిలో ఏడు తీగల బస్రా ముత్యాలహారాన్ని సత్లాడ అని పిలుస్తారు. ఇందులో 465 ముత్యాలను పొందుపర్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రం.. 184.75 క్యారెట్ల బరువున్న ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద వజ్రం జాకబ్ డైమండ్ విలువైన వస్తువులలో ఒకటి. వీటిని కొనుగోలు చేసిన కేంద్రం.. ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ దీనిని ప్రదర్శిస్తోంది. ఆభరణాలను తిలకించే సమయంలోనూ కేవలం 50 మందినే అనుమతిస్తోంది. విలువైన వారసత్వ సంపద కావడంతో జాగ్రత్తగా కాపాడుతోంది. నిజాం నగలను హైదరాబాద్‌కు తెప్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం గతంలో ప్రయత్నాలు చేశారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ కూడా రాశారు. తాజాగా నగరానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. నిజాం నగలను హైదరాబాద్‌కు తీసుకురావడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించిన నేపథ్యంలో వీటి తరలింపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వాటి ప్రదర్శనకు అనువైన స్థలం, భద్రత ఏర్పాట్లను కల్పిస్తే.. నగల తరలింపునకు చొరవ చూపుతామని కిషన్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కేంద్రం తరపున ఏపీకి కిషన్ రెడ్డి హామీ
-
అలంపూర్ క్షేత్రానికి మహర్దశ: కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అలంపూర్ జోగుళాంబ ఆలయాలకు మహర్దశ రానుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ ఆదివారం హైదరాబాద్‌లోని దిల్కుషా అథితి గృహంలో మంత్రి కిషన్‌రెడ్డికి జోగుళాంబ దేవి రక్షా కంకణం, ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. అలంపూర్ జోగుళాంబ ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీమ్ మంజూరు చేసిందని చెప్పారు. అతి త్వరలోనే తాను కుటుంబ సమేతంగా జోగుళాంబ దేవిని దర్శించుకుంటానన్నారు. -
పర్యాటక ప్రాంతాల్లో కరోనా నియమాలు పాటించాల్సిందే..
సాక్షి, న్యూఢిల్లీ: పర్యాటక ప్రదేశాల్లో సందర్శకులు కరోనా నియమాలను తప్పనిసరిగా పాటించాలని కేంద్ర పర్యాటక, సాం స్కృతిక శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతికదూరం పాటించాలని కోరారు. అధికార యంత్రాంగంతోపాటు ప్రజల భాగస్వామ్యంతోనే కరోనాను జయించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం ఢిల్లీలోని జాతీయ పురావస్తు కేంద్రాన్ని సందర్శించిన అనంతరం కిషన్‌రెడ్డి, కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయమంత్రి మీనాక్షి లేఖి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భారతదేశ చరిత్ర అంతా పురావస్తు శాఖ కేంద్రంలో రికార్డు అయిందని, స్వాతంత్య్ర పోరాటఘట్టాలు, రాజ్యాంగానికి సంబంధించిన సంతకాల ప్రతులు ఇక్కడే ఉన్నాయని చెప్పారు. నేషనల్ ఆరై్కవ్స్ ఆఫ్ ఇండియాలో 18 కోట్ల పేజీలు, 57 లక్షల ఫైళ్లు, 64 వేల అధ్యయనాలు, లక్షా ఇరవై వేల మ్యాపులు ఉన్నాయని తెలిపారు. మనదేశం స్వాతంత్య్రం సాధించి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దేశచరిత్రను డిజిటలైజ్ చేస్తున్నామని వివరించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కొత్త నిర్మాణాలు వచి్చనప్పటికీ, చారిత్రక సంపదను కాపాడుకొనేందుకు కృషి చేస్తామన్నారు. పురావస్తు శాఖ అడ్డంకులు తొలగించాలి: శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి సోమవారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని ఢిల్లీలో కలిశారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాచీన ఆలయాలకు అడ్డంకిగా మారిన పురావస్తు శాఖ నిబంధనలపై చర్చించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి దంపతులకు శాలువా కప్పి సత్కరించారు. -
ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన స్వాత్మనందేంద్ర
-
నా హయాంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నాం : కిషన్ రెడ్డి