
సాక్షి, హైదరాబాద్: తనపై విశ్వాసముంచి బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ, జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షా, జాతీ య సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌లకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ధన్యవాదాలు తెలిపారు. ‘తెలంగాణ అంతరంగం, సమస్యలు తెలిసిన వాడిని. కేసీఆర్ బలం, బలహీనతలు తెలుసు. ఒక కార్యకర్తగా నా బాధ్య తను సంపూర్ణంగా నిర్వహిస్తా. కిషన్‌రెడ్డి సీనియర్ నాయకులు.. ఆయనతో కలిసి పని చేస్తాం’ అని ఈటల పేర్కొన్నారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు నడ్డా, అమిత్ షా తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా ఎగురేయాలని నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లోనే అంకురార్పణ చేశారన్నారు. బండి సంజయ్ నాయకత్వంలో నాలుగు ఎన్నికల్లో గెలిచాం. తెలంగాణలో గెలిస్తే బీజేపీ.. లేదంటే బీఆర్‌ఎస్ గెలిచింది తప్ప కాంగ్రెస్ గెలవలేదు. బీఆర్‌ఎస్‌ను ఓడించే సత్తా ఒక్క బీజేపీకి మాత్రమే ఉంది. బీఆర్‌ఎస్ గెలిస్తే ఒక కుటుంబానికి లాభం. బీజేపీ గెలిస్తే ప్రజలకు లాభం. దేశానికి ఒక ఓబీసీ ప్రధానిని అందించిన పార్టీ బీజేపీ. అధిష్టానం మా మీద పెట్టిన విశ్వాసాన్ని శక్తి వంచన లేకుండా నిలుపుకుంటాం. కిషన్‌రెడ్డితో కలిసి శభాష్ అనే విధంగా పని చేస్తాం’ అని ఈటల స్పష్టం చేశారు.
చదవండి: Kishan Reddy: అందుకే కిషన్‌రెడ్డికి బీజేపీ బాధ్యతలు, ఈటలకు కీలక పదవి