ముషీరాబాద్ (హైదరాబాద్): హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ కాదని హైద రాబాద్ నగరం పేదలు నివసించే బస్తీల్లో, కాలనీల్లో ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వీటి అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ముషీరా బాద్ నియోజకవర్గంలోని అడిక్‌మెట్, రాంనగర్ డివిజన్‌లలోని పలు బస్తీలు, కాలనీల్లో అధికారు లతో కలిసి పాదయాత్ర నిర్వహించారు.
ఈ సంద ర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. పేదలు, చిన్ని చిన్న ఉద్యోగులు నివసించే కాలనీలు, బస్తీలు నిర్ల క్ష్యానికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధి అంటే హైటెక్‌సిటీ అభివృద్ధి అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. నిజమైన హైదరాబాద్ అంటే ఓల్డ్‌సిటీ, ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్‌పేట్, సికింద్రాబాద్, సనత్‌నగర్‌లతోపాటు అనేక ప్రాంతాలున్నాయన్నారు. మెయిన్‌రోడ్లమీద రంగులు పూసి హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎక్కడికి వెళ్లినా డ్రైనేజీ, వర్షపునీరు, కలుషిత మంచినీరు, రోడ్లపై గుంతలు, వీధిలైట్ల సమస్యలను చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్ నుంచే 80 శాతం రెవెన్యూ వస్తోంటే.. నగర అభివృద్ధికి 8 శాతం నిధులు కూడా ఖర్చుపెట్టడం లేదని చెప్పారు. హైదరాబాద్‌లోని రెండు ప్రధాన శాఖ లైన జీహెచ్‌ఎంసీ, జలమండలి అప్పుల ఊబిలో చిక్కి చిన్న చిన్న పనులకు సైతం నిధులు విడుదల చేయలేని దుస్థితి నెలకొందని దుయ్యబట్టారు. అందువల్ల ప్రభుత్వం బస్తీల్లో ఉండే నిజమైన హైద రాబాద్ అభివృద్ధికి కృషిచేయాలని కోరారు.
చదవండి: నాడు టీడీపీలో.. నేడు కాంగ్రెస్‌లో.. చంద్రబాబుతో మాకు సంబంధం లేదు
Comments
Please login to add a commentAdd a comment