Hitech City
-
HYD: మైండ్ స్పేస్ భవనం వద్ద టెకీ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హైటెక్ సిటీలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. మైండ్ స్పేస్ టవర్‌పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. హైటెక్ సిటీలో వద్ద ఉన్న మైండ్ స్పేస్ టవర్‌లో 13వ ఫ్లోర్ నుంచి దూకి టెకీ వంగ నవీన్ రెడ్డి(24) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నవీన్ రెడ్డి ఎన్సీఆర్ యోయిస్ కంపెనీలో పని చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
ఈ బర్మా ఫుడ్.. క్రేజీ టేస్ట్!
సాక్షి, సిటీబ్యూరో: వినూత్న వంటకాలను ఆస్వాదించే వారి సంఖ్య ఈ మధ్య పెరిగింది. సిటీ లైఫ్‌లోని పాశ్చాత్య ఒరవడులకు గతకాలపు అభిరుచులను అద్ది వడ్డించే పసందైన రుచులకు ఆదరణ పెరిగింది. ఇలాంటి రెస్టారెంట్లు, ఫుడ్ స్పాట్స్‌కు నగరంలో మంచి క్రేజ్ ఉంది. ఐతే ఇలాంటి అంశాలతో కొన్ని రెస్టారెంట్లు నగరంలో ఇప్పటికే ఆదరణ పొందుతుండగా.. వారసత్వ వంటకాలకు అధునాతన హంగులద్ది వడ్డించే బర్మా బర్మా రెస్టారెంట్ హైటెక్ సిటీలో సందడి చేస్తోంది. అంతేగాకుండా బర్మీస్ వంటకాల రుచి తెలిసిన ఫుడ్ లవర్స్‌కు క్రేజీ స్పాట్‌గా మారింది.బర్మా సంస్కృతికి ప్రతీకగా.. ఖౌసూయ్, టీ లీఫ్ సలాడ్, సమోసా సూప్, మాండలే నూడిల్ బౌల్, బర్మీస్ ఫలూడా వంటి వంటకాలు ఇప్పడు చాలామందికి ఫేవరెట్ డిషెస్గా మారాయి. పరాటాతో టోహు మాష్, కొబ్బరి క్రీమ్‌తో స్టిక్కీ రైస్, మెకాంగ్ కర్రీ, కుంకుమపువ్వు–సమోసా, చీజ్‌కేక్ వంటి నోరూరించే రుచులకు నాలెడ్జ్ సిటీలోని బర్మా కేరాఫ్ అడ్రస్‌గా మారింది. బర్మాలో ప్రసిద్ది చెందిన ఈ విభిన్న రుచులు నగరంలో ప్రారంభించడం విశేషం. ఆసియాలోని అతిపెద్ద ఐటీ పార్కులలో ఒకటైన నగరాన్ని తన గమ్యస్థానంగా ఎంచుకోవడం, ఆహారాన్ని ఆస్వాదించడంలోనూ నగరవాసుల వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తోంది.బర్మా సంప్రదాయ ప్రతీకలైన బర్మీస్ స్వరాలతో పాటు అక్కడి వీధులు, గృహాల నుంచి ప్రేరణ పొందిన యాంబియన్స్‌తో ఆహ్లాద ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. బర్మీస్ ప్రత్యేకతల నుంచి అత్యుత్తమంగా ఎంపిక చేసిన ఆరి్టసానల్ ‘టీ’లు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక్కడి స్ట్రీట్ ఫుడ్ మొదలు తరతరాలుగా ఆదరణ పొందుతున్న గిరిజన, వారసత్వ వంటకాలు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఉడికించిన అరటి ఆకు పాకెట్స్(కయునిన్ మావో) సిగ్నేచర్‌గా నిలుస్తుంది.సంస్కృతుల సమ్మేళనం..వలస ఆహార సంస్కృతులు, స్వదేశీ పదార్థాలతో సమ్మిళితమైన గతకాలపు హోమ్‌స్టైల్ వంటలు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుండగా ఇక్కడి బెస్ట్ సెల్లర్స్‌లో ‘మామిడి సలాడ్, స్పైసీ టీ లీఫ్, అవకాడో సలాడ్, లోటస్ రూట్ చిప్స్, సమోసా సూప్, బ్రౌన్ ఆనియన్, రంగూన్ బేక్డ్ మిల్క్’ ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. చిన్ననాటి స్నేహితులైన చిరాగ్ ఛజెర్, అంకిత్ గుప్తాల ఆలోచనల్లోంచి ఆవిష్కృతమైన బర్మా బర్మా.. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, అహ్మదాబాద్‌లో విస్తరించింది.ముఖ్యంగా కోల్‌కతాలో ఎన్నడూ లేనివిధంగా బర్మీస్ సంస్కృతికి జీవం పోస్తోందని సహవ్యవస్థాపకులు అంకిత్ గుప్తా పేర్కొన్నారు. 2023లో అందించిన కొండే నాస్ట్ ట్రావెలర్ టాప్ రెస్టారెంట్ అవార్డ్స్‌లో బర్మా బర్మా 34వ స్థానంలో నిలిచిందని అన్నారు. వంటకాలు పులుపు, కారం రుచులతో.. కాఫీర్ లైమ్లు, బాలాచాంగ్ మిరియాలు, పొద్దుతిరుగుడు విత్తనాలు తదితరాలను వినియోగిస్తాం. సిటీలో బర్మా నుంచి తీసుకొచ్చిన బాండెల్ చీజ్, పికిల్డ్ ప్లం, బాలచాంగ్ పెప్పర్స్, లాఫెట్ వంటి బర్మీస్ పదార్థాల రుచులతో నగరవాసులను యాంగోన్ వీధులకు తీసుకెళతామని వివరించారు. -
Virat Kohli: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. సిటీలో కోహ్లి రెస్టారెంట్
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి కేవలం క్రికెటర్‌గానే కాకుండా వ్యాపారవేత్తగానూ రాణిస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో సంస్థలో పెట్టుబడులు పెట్టిన ఈ ఢిల్లీ బ్యాటర్.. వన్ 8 కమ్యూన్ పేరిట రెస్టారెంట్ చైన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఆతిథ్య రంగంలో కొత్త ఒరవడిని సృష్టిస్తూ అద్బుతమైన మెనూతో ఆహార ప్రియులను ఆకట్టుకుంటున్న వన్ 8 కమ్యూన్ ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా ఎంట్రీ ఇచ్చింది.కోహ్లికి హైదరాబాద్ అంటే కూడా చాలా ఇష్టంనగరంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో గల నాలెడ్జ్ సిటీలో ఈ రెస్టారెంట్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వన్ 8 కమ్యూన్లో కోహ్లి భాగస్వామి వర్తిక్ తిహారా మాట్లాడుతూ.. ‘‘సౌత్‌లో మొదట బెంగళూరులో మా రెస్టారెంట్ ఓపెన్ చేశాం.అక్కడి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఆ స్ఫూర్తితో హైదరాబాద్‌లోనూ ఆరంభించాం. కోహ్లికి హైదరాబాద్ అంటే కూడా చాలా ఇష్టం. ఐపీఎల్ కోసం ఇటీవలే ఇక్కడికి వచ్చాడు కూడా! ఇక్కడి ఫుడ్, సిటీ వైబ్.. అన్నీ తను చాలా ఎంజాయ్ చేస్తాడు. కుదిరితే మరో ఏడు నుంచి ఎనిమిది నెలల్లో ఇక్కడే మరో రెస్టారెంట్ కూడా ప్రారంభిస్తాం’’ అని ‘సాక్షి’కి తెలిపారు.అతడి ఫేవరెట్ డిష్ ఇదేఅదే విధంగా.. గ్లోబల్ మెనూతో పాటు 20 రకాల స్థానిక రుచులతో తమ మెనూను నింపేశామని.. ప్రఖ్యాత హైదరాబాదీ బిర్యానీతో పాటు సోయా హలీం ఇక్కడ మరో స్పెషాలిటీ అని తెలిపారు. కోహ్లికి ఉన్న అభిమాన గణాన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు ఫుడ్ ఎంజాయ్ చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వర్తిక్ తిహారా పేర్కొన్నారు.ఇక విరాట్ కోహ్లి వెజిటేరియన్ ఎక్కువగా ఇష్టపడతాడని.. మష్రూమ్ డిమ్సమ్ అతడి ఫేవరెట్ డిష్ అని తెలిపారు. పాన్ ఇండియా లెవల్లో అన్ని రకాల వంటకాలను కోహ్లి ఆస్వాదిస్తాడని పేర్కొన్నారు. రికార్డుల రారాజుగా పేరొందిన రన్‌మెషీన్ కోహ్లి ఫిట్నెస్, డైట్ విషయంలో పక్కాగా ఉంటాడన్న విషయం తెలిసిందే.భోజనం బాగుందంటూ కితాబులుఇదిలా ఉంటే.. వన్ 8 కమ్యూన్ ఇప్పటికే ఢిల్లీ, ముంబై, పుణే, కోల్‌కతా, బెంగళూరు తదితర నగరాల్లో కొలువు దీరింది. ఇక హైదరాబాద్‌లోనూ ఇప్పటికే కింగ్ కోహ్లి అభిమానులు ఈ రెస్టారెంట్‌ను సందర్శిస్తున్నారు. ఫుడ్, పార్టీ ప్లేస్ అన్నీ ఆహ్లాదకరంగా ఉన్నాయని.. భోజనం కూడా చాలా రుచిగా ఉందని చెబుతున్నారు.చదవండి: విరాట్ కోహ్లి ఆర్సీబీని వీడాలి.. ఆ జట్టులో చేరాలి: ఇంగ్లండ్ స్టార్ -
ఐ బౌటిక్ లో సినీ ప్రముఖులు మరియు మోడల్స్ సందడి (ఫోటోలు)
-
మాదాపూర్‌లో రెండు భారీ భవనాల కూల్చివేత..!
-
ఆ భూములకు మార్కెట్ ధర నిర్ణయించండి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో కమ్మ, వెలమ కుల సంఘాలకు కేటాయించిన భూములకు మార్కెట్ విలువను నిర్ణయించాలని సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. జీవో 571 ప్రకారం మార్కెట్ ధరను అంచనా వేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ చేపట్టిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించాలని ఆదేశించింది. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదన్న గత ఉత్తర్వులను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే నిర్మాణాలు చేసి ఉంటే అవి తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఖానామెట్‌లో కమ్మ, వెలమ కుల సంఘాల కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదెకరాల చొప్పున కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రిటైర్డు ప్రొఫెసర్ ఎ.వినాయక్‌రెడ్డి పిల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం మరోసారి సోమవారం విచారణ చేపట్టింది. అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. కుల సంఘాలకు భూకేటాయింపు అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. 2012, సెప్టెంబర్ 14 నాటి జీవో 571 మేరకు ప్రభుత్వం ఈ సంఘాలకు ఇచ్చిన భూములకు మార్కెట్ విలువను నిర్ణయిస్తామని, ఇందుకు అనుమతించాలని కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ వినతిని ఆమోదించవద్దని కోరారు. అనంతరం ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. -
హైటెక్ సిటీ: ప్రాణం తీసిన అతివేగం.. యువతి మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అతి వేగం ఓ యువతి ప్రాణాలను బలితీసుకుంది. నిండు ప్రాణం గాలిలో కలిసింది. హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌పై హైస్పీడ్‌లో వెళ్తున్న స్కూటీ సైడ్వాల్ను ఢీకొనడంతో వాహనం వెనుక కూర్చున్న యువతి ఫ్లైఓవర్‌పై నుంచి పడిపోయి మృతిచెందింది. వివరాల ప్రకారం.. మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లోయర్ ట్యాంక్‌బండ్‌లో నివాసం ఉంటున్న స్వీటీ పాండే(22) ఓ ప్రైవేట్ ఉద్యోగి. గురువారం సాయంత్రం వెస్ట్ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన స్నేహితుడు రాయన్ ల్యూకెతో కలిసి స్కూటీపై జేఎన్టీటీయూ కూకట్పల్లి నుంచి బయలుదేరింది. యువకుడు ఐకియా వైపు వెళ్తూ వాహనాన్ని వేగంగా నడిపాడు. హైటెక్ సిటీ చౌరస్తా వద్ద ఉన్న ఫ్లైఓవర్ వద్దకు రాగానే వాహనం అదుపు తప్పి ప్రొటెక్షన్ వాల్‌ను ఢీకొన్నది. ఈ క్రమంలో బైక్‌పై వెనుక కూర్చున్న స్వీటీ పాండే ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి ఫ్లైఓవర్ పైనుంచి రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంలో స్కూటీ నడుపుతున్న రాయన్ ల్యూకే కూడా తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో, వారిద్దరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో స్వీటీ పాండే తలకు తీవ్ర గాయం కావడంతో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా తరలించినట్టు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ప్రమాదవశాత్తు కిందపడి గర్భిణి మృతి -
కేబుల్ బ్రిడ్జికి వెళ్తున్నారా.. పోలీసుల హెచ్చరిక ఇదే..
సాక్షి, హైదరాబాద్: వాహనదారులను సైబరాబాద్ పోలీసులు మరోసారి హెచ్చరించారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను నిలిపితే జరిమానా విధించనున్నట్టు తెలిపారు. ఎవరైనా కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను పార్కింగ్ చేస్తే 9490617346 అనే నెంబర్‌కు వాట్సాప్ చేయాలని సూచించారు. వివరాల ప్రకారం.. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, ప్రమాదాలను నిలువరించేందుకు సైబరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను పార్కింగ్ చేయరాదని పోలీసులు హెచ్చరించారు. పార్కింగ్ చేసిన వాహనాలకు భారీ జరిమానా విధిస్తామని తేల్చిచెప్పారు. క్యారేజ్‌వే వద్ద వాహనాలను పార్క్ చేయడం వల్ల ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందన్నారు. అక్రమంగా వాహనాలను పార్కింగ్ చేస్తే భారీ జరిమానా విధిస్తామని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. అయితే కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను పార్కింగ్ చేసి, ఇతరులకు ఇబ్బంది కలిగించినట్లు ప్రజల దృష్టికి వస్తే నేరుగా తమకు ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు సూచించారు. 9490617346 అనే నెంబర్‌కు వాట్సాప్ చేయాలని తెలిపారు. ఇదే సమయంలో ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు స్పష్టం చేశారు. Traffic movement on the Cable bridge is smooth. We request commuters not to park vehicles on carriageway which obstructs traffic flow. If any are found parking illegally on the bridge will attract a hefty penalty. Public can also report these issues through WhatsApp 9490617346. pic.twitter.com/UZiy5MjMQd — CYBERABAD TRAFFIC POLICE (@CYBTRAFFIC) August 8, 2023 -
Hyderabad: హైటెక్ సిటీలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ కంపెనీలకు నిలయమైన హైటె క్ సిటీ సైబర్ టవర్స్‌కు కూతవేటు దూరంలోని ఓ మార్కెటింగ్ కంపెనీలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు రావడంతో కలకలం రేగింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు, ఫైర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సైబర్ టవర్స్ ఎదురుగా ఉన్న రోహిణి లేఅవుట్లోని ఓ భవనం మూడో అంతస్తులో మూవింగ్ నీడిల్ అనే మార్కెటింగ్ కంపెనీ ఉంది. ఆపైఅంతస్తులో ఇదే కంపెనీకి చెందిన క్యాంటీన్, కెఫెటేరియాను నిర్వహిస్తున్నారు. అయితే శనివారం రాత్రి 8.30 గంటలకు క్యాంటీన్లో మంటలు చెలరేగాయి. అదిచూసిన స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. గంటసేపు శ్రమించి మంటలను అదుపుచేశారు. క్యాంటీన్లోని ఏసీలో షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదం సంభవించిందని, ఫరీ్నచర్ పూర్తిగా కాలిపోయిందని అధికారులు తెలిపారు. శనివారం కావడంతో ఉద్యోగులెవరూ లేరని, ప్రాణనష్టం తప్పిందని వెల్లడించారు. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: వివేకా కేసు: గంగిరెడ్డిని కలిసేందుకు సునీత ప్రయత్నం!) -
హైటెక్‌సిటీ మెట్రోస్టేషన్లో యూఎస్ వీసా దరఖాస్తు కేంద్రం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్లో అమెరికా వీసా దరఖాస్తు కేంద్రం ఆదివారం ప్రారంభం కానుంది. వీసా అప్లికేషన్ సెంటర్‌గా పిలిచే ఈ కేంద్రంలో అమెరికాకు వెళ్లాలనుకునేవారి వేలిముద్రల సేకరణ, వీసా దరఖాస్తు పత్రాల సమర్పణ, ఇంటర్వ్యూ తదితర సేవలను అందించనున్నట్లు మెట్రో అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేంద్రాన్ని అమెరికా కాన్సులేట్ అధికారులు ఏర్పాటుచేశారన్నారు. స్టేషన్ మధ్యభాగం (కాన్కోర్స్)లో ఈ కేంద్రం ఏర్పాటు చేస్తున్నా రు. కాగా ప్రస్తుతం ఈ కేంద్రం బేగంపేట్‌లోని కాన్సులేట్ సమీపంలోని గౌరా గ్రాండ్ భవన్లో ఉన్న విషయం విదితమే. నగరవాసులు, మెట్రో ప్రయాణికులు ఈ కేంద్రాన్ని వినియోగించుకోవాలని మెట్రో అధికారులు కోరారు. చదవండి: Hyderabad: మలక్‌పేట హోటల్లో అగ్ని ప్రమాదం.. కార్మికుడి మృతి -
హైదరాబాద్ అంటే హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ కాదు!
ముషీరాబాద్ (హైదరాబాద్): హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ కాదని హైద రాబాద్ నగరం పేదలు నివసించే బస్తీల్లో, కాలనీల్లో ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వీటి అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ముషీరా బాద్ నియోజకవర్గంలోని అడిక్‌మెట్, రాంనగర్ డివిజన్లలోని పలు బస్తీలు, కాలనీల్లో అధికారు లతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సంద ర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. పేదలు, చిన్ని చిన్న ఉద్యోగులు నివసించే కాలనీలు, బస్తీలు నిర్ల క్ష్యానికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధి అంటే హైటెక్‌సిటీ అభివృద్ధి అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. నిజమైన హైదరాబాద్ అంటే ఓల్డ్‌సిటీ, ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్పేట్, సికింద్రాబాద్, సనత్‌నగర్‌లతోపాటు అనేక ప్రాంతాలున్నాయన్నారు. మెయిన్రోడ్లమీద రంగులు పూసి హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడికి వెళ్లినా డ్రైనేజీ, వర్షపునీరు, కలుషిత మంచినీరు, రోడ్లపై గుంతలు, వీధిలైట్ల సమస్యలను చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్ నుంచే 80 శాతం రెవెన్యూ వస్తోంటే.. నగర అభివృద్ధికి 8 శాతం నిధులు కూడా ఖర్చుపెట్టడం లేదని చెప్పారు. హైదరాబాద్‌లోని రెండు ప్రధాన శాఖ లైన జీహెచ్ఎంసీ, జలమండలి అప్పుల ఊబిలో చిక్కి చిన్న చిన్న పనులకు సైతం నిధులు విడుదల చేయలేని దుస్థితి నెలకొందని దుయ్యబట్టారు. అందువల్ల ప్రభుత్వం బస్తీల్లో ఉండే నిజమైన హైద రాబాద్ అభివృద్ధికి కృషిచేయాలని కోరారు. చదవండి: నాడు టీడీపీలో.. నేడు కాంగ్రెస్‌లో.. చంద్రబాబుతో మాకు సంబంధం లేదు -
ఐటీ ఉద్యోగులకు షాక్.. అప్పటి నుంచి 100 శాతం వర్క్ ఫ్రమ్ ఆఫీస్!
సాక్షి, సిటీబ్యూరో: ఐటీ క్యాపిటల్‌గా మారిన గ్రేటర్ సిటీలో వచ్చే ఏడాది జనవరి నుంచి వంద శాతం ఉద్యోగులు ఆఫీసు నుంచి పనిచేసేలా నగరంలోని ఐటీ కంపెనీలు చర్యలు ప్రారంభించాయి. ఈ మేరకు ఉద్యోగులకు వర్తమానాలు పంపినట్లు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్(హైసియా) వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఇప్పటివరకు హైబ్రీడ్ విధానంలో.. అంటే సుమారు 70 నుంచి 80 శాతం మంది ఆఫీసుకు వచ్చి పనిచేస్తుండగా.. మరో 20 నుంచి 30 శాతం మంది వర్క్‌ఫ్రం హోం కొనసాగిస్తున్నారు. వీరిలోనూ పలువురు కార్యాలయంలో అత్యవసర సమావేశాలకు హాజరయ్యేందుకు వారంలో ఒకటి రెండు మార్లు ఆఫీసులకు వస్తున్నారు. ప్రస్తుతం మహానగరం పరిధిలో అన్ని వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు పూర్తిస్తాయిలో కొనసాగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. కాగా వర్క్‌ఫ్రం హోం అయినప్పటికీ ఆయా కంపెనీలు, ఉద్యోగుల ఉత్పాదకత, ఎగుమతులు ఏమాత్రం తగ్గలేదని హైసియా వర్గాలు పేర్కొనడం విశేషం. ఐటీలో నయా ట్రెండ్ ఇలా... నగరంలో కార్పొరేట్, బడా, చిన్న ఐటీ కంపెనీలు సుమారు 1500 వరకు ఉన్నాయి. వీటిల్లో సుమారు 7 లక్షల మంది ఉపాధి పొందుతున్నట్లు అంచనా. ఈ ఏడాది జూన్–అక్టోబరు మధ్యకాలంలో ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారుతోన్న ఉద్యోగులు 20 నుంచి 25 శాతానికి పెరిగినట్లు హైసియా వర్గాలు తెలిపాయి. దిగ్గజ కంపెనీలుగా పేరొందిన టీసీఎస్,ఇన్ఫోసిస్ కంపెనీలు సైతం ఈజాబితాలో ఉండడం గమనార్హం. కొన్ని కంపెనీల్లో ఈ ట్రెండ్ 27 శాతం మేర నమోదైందట. అనుభవం గడించిన ఉద్యోగులు ఇతర కంపెనీలకు వలసలు పోతుండగా..ఫ్రెషర్స్ ఈ కంపెనీల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. ఈపరిణామం ఈ రంగంలో కొత్తేమీ కానప్పటికీ ఇటీవల మరింత పెరగడం విశేషమని నిపుణులు చెబుతున్నారు. ప్రాజెక్టుల జోరు పెరిగింది.. నిపుణులైన ఐటీ ఉద్యోగులు వలసబాట పట్టడానికి ప్రధాన కారణం నూతన ప్రాజెక్టులేనని ఐటీ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం నగరంలో పలు కంపెనీలు డిజిటల్ టెక్నాలజీని అధికంగా అమలు చేస్తున్న కారణంగానే ఐటీ ప్రాజెక్టులు అనూహ్యంగా పెరిగాయి. అమెరికా,యూరప్,కెనడా,ఆ్రస్టేలియా దేశాలకు చెందిన సంస్థలకు నగరంలోని పలు కంపెనీలు ఔట్సోర్సింగ్ ప్రాజెక్టులు చేపడుతున్నాయి. వీటికి ప్రాజెక్టుల సంఖ్య పెరగడంతో నిపుణులైన ఉద్యోగులకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ప్రధానంగా కృత్రిమ మేథ,మిషన్ లెరి్నంగ్,బ్లాక్‌చైన్,సైబర్‌సెక్యూరిటీ సంబంధిత ప్రాజెక్టులకు డిమాండ్ పెరిగిందట. ఇందులో అనుభవం ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉండడం విశేషం. డిజిటల్ టెక్నాలజీ నిపుణులకు తాజాగా 30 శాతం మేర డిమాండ్ పెరగడం ఐటీలో నయా ట్రెండ్. -
Hyderabad: కేపీహెచ్‌బీ.. ఇదో హైరైజ్ కాలనీ
ఆసియాలోనే అతి పెద్ద కాలనీగా రూపొందిన కేపీహెచ్‌బీ కాలనీ నగరంలోనే ప్రసిద్ధిగాంచిన నివాస ప్రాంతంగా ఏర్పడింది. సామాన్యుడి నుంచి కోటీశ్వరుడి వరకు స్థానమున్న ఈ కాలనీలో గంజి, బెంజి మిళితమై నివాసకేంద్రంగా ఉండటం విశేషం. ఒకప్పుడు రాళ్లూ రప్పలు, చెట్టూ చేమలతో చిట్టడవిగా ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం ఆకాశ హర్మ్యాలకు చిరునామాగా మారింది. విభిన్న సంస్కృతుల మేళవింపుతో దేశ, విదేశాల వారికి ఆవాసంగా ఉంది. మహా నగరానికే మణిమకుటంగా వెలుగొందుతోంది కేబీహెచ్‌బీ కాలనీ. దాని ప్రస్థానమిదీ.. 1969లో 1,326 ఎకరాలను అప్పటి ప్రభుత్వం రైతుల నుంచి సేకరించింది. 1978లో హౌసింగ్ బోర్డు పేద, మద్య తరగతి ప్రజలకు నివాసం కోసం నో లాస్, నో ప్రాఫిట్ పేరుతో ఇళ్ల నిర్మాణం కోసం శ్రీకారం చుట్టింది. హుడా నిబంధనల ప్రకారం 40 శాతం ఖాళీ స్థలాలను వదిలి మిగిలిన ప్రాంతాన్ని ప్లాట్లుగా విభజించింది. అనంతరం 1981– 82 ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పట్లో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, ఇళ్లు లేని వారు ఎంతోమంది హౌసింగ్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నారు. - మొదట్లో కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్– 1, ఫేజ్– 2 ఇళ్ల నిర్మాణం చేపట్టింది. అప్పటికి దరఖాస్తులు మిగిలిపోవటంతో 3, 4 ఫేజుల నిర్మాణం చేపట్టింది. అప్పట్లోనే 100 ఎకరాల స్థలాన్ని జేఎన్టీయూకు కేటాయించింది. అనంతరం 5వ, 6వ ఫేజులో హెచ్ఐజీల పేరుతో పెద్ద ప్లాట్లను వేలం వేసింది. లాటరీ పద్ధతి ద్వారా ప్లాట్లు కేటాయిస్తూ హౌసింగ్ బోర్డు నిర్ణయం తీసుకొంది. 15 ఫేజుల్లో లాటరీ పద్ధతిలో కమర్షియల్ స్థలాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించారు. హౌసింగ్ బోర్డుకు గుండె లాంటి కూకట్‌పల్లిలో హౌసింగ్ బోర్డు ఆదాయం సమకూర్చుకునేందుకు బహిరంగ వేళాన్ని ప్రోత్సహించింది. దీంతో పోటాపోటీగా స్థలాల విక్రయాలు జరిగాయి. స్పైనల్ రోడ్డుతో మహర్దశ.. కూకట్పల్లి నుంచి కేపీహెచ్‌బీ మీదుగా హైటెక్ సిటీ వరకు 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్పైనల్ రోడ్డు నిర్మాణం కోసం చేసిన శంకుస్థాపన ఈ రోజు వేలల్లో ఉన్న సామాన్యులను కోటీశ్వరులుగా చేసింది. స్పైనల్ రోడ్డుకు ముందు 10 వేల రూపాయలకు ఇళ్లు కొనాలన్నా హడలిపోయే ప్రజలు స్పైనల్ రోడ్డు నిర్మాణంతో గజం లక్ష రూపాయలకు చేరింది. అప్పట్లో రాష్ట్రంలోనే హౌసింగ్‌బోర్డు వేసిన వేలంలో గజం ధర లక్ష రూపాయలకు పలకటం ఆశ్చర్యానికి గురి చేసింది. ఒకవైపు ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్, మరోవైపు మెట్రో రైల్వే స్టేషన్, ఇంకో వైపు హైటెక్ సిటీకి వెళ్లే హైస్పీడ్ రహదారి, మరో వైపు స్పైనల్ రోడ్డు నిర్మాణంతో హౌసింగ్ బోర్డు దశ మారిపోయింది. రాష్ట్రంలోనే అతిపెద్ద వ్యాపార కేంద్రంగా కూకట్పల్లి ప్రఖ్యాతి గాంచింది. దీనికి తోడు ప్రతిష్టాత్మకమైన జేఎన్టీయూ యూనివర్సిటీ ఇక్కడే ఉండటంతో జేఎన్టీయూ అనుబంధ కళాశాలలు కూడా సమీపంలోనే ఉండటంతో ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్‌గా మారింది. సకల సౌకర్యాలకు నెలవు.. తెలంగాణలోనే మొట్టమొదట గేటెడ్ కమ్యూనిటిల నిర్మాణం కూడా ఈ ప్రాంతం నుంచే ప్రారంభమయ్యాయి. అత్యంత ఎత్తైన 42 అంతస్థుల భవన నిర్మాణాలు చోటుచేసుకోవటమే కాకుండా గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఇక్కడ నిర్మాణం కావటంతో ఈ ప్రాంతానికి మహర్దశ పలికింది. ప్రభుత్వం 50 శాతానికిపైగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. కొన్ని డ్లూప్లెక్స్ నిర్మాణాలు చేపట్టారు. ముఖ్యంగా లోదా కాలనీ, రెయిట్ట్రీ పార్కు (మలేసియా టౌన్ షిప్), హిందూ ఫార్చ్యూన్, వన్ సిటీ కాలనీ వంటి ప్రాంతాలు అధునాతనంగా నిర్మించటంతో అధిక శాతం సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఈ ప్రాంతం పట్ల ఆకర్షితులయ్యారు. హైటెక్ సిటీకి సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇక్కడ రోడ్లు్ల, పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, ప్లే గ్రౌండ్స్, క్లబ్ హౌస్, మీటింగ్ హౌస్‌లను ఏర్పాటు చేయటంతో సామాన్యుడితో పాటు కోటీశ్వరులకు కూడా కావాల్సిన వస్తువులు అందుబాటులో లభిస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు, సినీ రంగ ప్రముఖులు కూడా ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. హౌసింగ్ బోర్డు కాలనీ ఒకవైపు ఓఆర్ఆర్ సమీపంలో ఉండటమే కాకుండా ముంబై జాతీయ రహదారికి ఆనుకొని ఉండటంతో ఈ ప్రాంతం మరో అబిడ్స్‌ను తలపిస్తోంది. ఇక్కడ అక్షరాలా లక్షకు పైగా జనాభా నివాసం ఉంటారంటే అతిశయోక్తి లేదు. అతిపెద్ద నివాస కేంద్రం.. కూకట్‌పల్లికి చుట్టు పక్కల పారిశ్రామిక ప్రాంతాలైన సనత్‌నగర్, బాలానగర్, జీడిమెట్ల, పాశమైలారం, బొల్లారం, పటాన్ చెరు, కాజిపల్లి, బొంతపల్లి ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొనటంతో ఇక్కడి కారి్మకులకు నివాస యోగ్యమైన ప్రాంతంగా కేపీహెచ్‌బీ అవతరించింది. దీంతో ఈ ప్రాంతానికి మరింత డిమాండ్ పెరిగింది. మాదాపూర్, గచి్చబౌలి ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు రావటంతో మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇక్కడే బీహెచ్‌ఇయల్ ఆర్ అండ్, ఎన్ఆర్ఎస్ఏ, ఎంఎస్ఎమీ, బీహెచ్ఈఎల్, ఐడీపీఎల్, ఐడీఎల్, బీడీఎల్ ప్రభుత్వరంగ సంస్థలు సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతాన్ని నివాస కేంద్రంగా ఏర్పరచుకున్నారు. కోస్తాంధ్రవాసులకు అడ్డా.. నగరంలో నూతనంగా ఇళ్లు నిర్మించుకోవాలన్నా, సామాన్యుడికి అవసరమయ్యే ఇళ్లు అద్దెకు కావాలన్నా ఇతర ప్రాంతాల నుంచి వలస వచి్చన ప్రజలు ఈ ప్రాంతాన్నే ప్రధాన అడ్డాగా ఎంపిక చేసుకుంటున్నారు. ఇక్కడ విద్యారంగంతో పాటు వ్యాపార రంగం, కార్మికరంగం, ప్రజలు ఎక్కువగా నివాసముంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వారు కూడా ఈ ప్రాంతంలోనే నివాసముంటూ జీవనోపాధికి బాటలు వేసుకుంటున్నారు. ఇక్కడ నివాసముంటూ హాస్టళ్లలో బ్యాచ్లర్స్ జీవితాలను గడుపుతూ ఏదో ఒక రంగంలో ఉపాధి వెదుక్కొని ఇక్కడే వివాహం చేసుకొని నివాసాలు ఏర్పాటు చేసుకోవటం విశేషం. కోస్తా, రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల వారు ఇక్కడే నివాసం ఉండటంతో ఆ ప్రాంతానికి సంబంధించిన హోటల్స్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవటం విశేషం. గుంటూరు గోంగూర, రాగి సంకటి, నాటు కోడి పులుసు, గోదావరి ఘుమఘుమలు, రొయ్యల పులుసు, పాలమూరు చికెన్ గ్రిల్స్, హైదరాబాద్ బిర్యానీతో పాటు అన్ని వంటలకు కేరాఫ్‌గా ఈ ప్రాంతం నిలిచింది. ఇక్కడ సకల సౌకర్యాలు లభించటంతో కేవలం కేపీహెచ్‌బీ ప్రాంతంలోనే వెయ్యికి పైగా హాస్టల్స్ ఏర్పడటం విశేషం. ఇలా.. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ తెలంగాణ ప్రాంతంలోనే అతిపెద్ద ఆదాయ వనరుగా ఏర్పడటం విశేషం. -
సైబర్ మాయ.. లక్షలు పాయె
సాక్షి, హిమాయత్‌నగర్: ‘‘నగరానికి చెందిన పావని ఫోన్ నంబర్‌ను ఓ వ్యక్తి వాట్సప్ గ్రూప్‌లో యాడ్ చేశాడు. మీరు చెప్పినట్లుగా విని నేను పెట్టుబడి పెట్టి ఇప్పుడు కోటీశ్వరుడిని అయ్యానంటూ ఏవో కొన్ని స్క్రీన్ షాట్స్ పోస్ట్ చేయడం. వీటిని చూసిన పావని తాను కూడా ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరాలిని కావొచ్చనే ఆశతో డబ్బు పెట్టి మోసపోయింది.’’ ‘‘నాలుగు రోజుల క్రితం హైటెక్‌సిటీలోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా చేసే యువతికి ఇన్‌స్ట్రాగామ్‌లో ఓ వ్యక్తి పరిచయమై క్రిప్టోలో డబ్బు పెట్టమన్నాడు. అతగాడి మాటలకు బుట్టలో పడ్డ యువతి పలు దఫాలుగా రూ.92లక్షలు పెట్టుబడి పెట్టినాక మాయగాడి ఇన్‌స్ట్రాగామ్, వాట్సప్ మాయమైంది.. అప్పటికి గాని యువతికి అర్థం కాలేదు తాను మోసపొయినట్లు’’. ఈ రెండు ఉదాహారణలే కాదు ఇలా వారంలో పది, పదిహేను మంది ఇన్వెస్ట్మెంట్, క్రిప్టో కరెన్సీ వలలో పడి మోసపోయిన బాధితులు సైబర్‌క్రైం పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మోసపోతున్న వారిలో వందకు వందశాతం విద్యావంతులే ఉండటం అందులోనూ ఐటీ రంగానికి చెందిన వారు, వ్యాపార రంగానికి చెందిన వారు ఉండటం మరింత హాస్యాస్పదానికి గురిచేస్తుంది. కోటీశ్వరులైనట్లుగా నకిలీ ఆధారాలతో బురిడీ ముక్కూ మెహం తెలియని కొందరు వ్యక్తులు ఈ మోసాలకు పాల్పడుతున్నారు. వీరిలో ఎక్కువ సంఖ్యలో నైజీరియన్లు ఉంటుంటే మిగత వారు రాజస్థాన్, యూపీ, అస్సాంలకు చెందిన వారు ఉంటున్నారు. ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించిన నకిలీ బ్యాంక్ స్టేట్మెంట్స్, డబ్బు వచ్చినట్లుగా వారికి వారే వాట్సప్ చాటింగ్‌లో గొప్పలు చెప్పుకోవడం వంటివి చేస్తున్నారు. పెట్టుబడి పెడుతున్న వారిని నమ్మించేందుకు రూ.5వేలకు 10వేలు ఇవ్వడం లేదా రూ.10వేలకు 20వేలు ఇవ్వడం చేస్తున్నారు. ఇదిగో లాభాలు వస్తున్నాయి కదా అంటూ ఏమాత్రం ఆలోచించకుండా లక్షల రూపాయిలు పెట్టేస్తూ అప్పులపాలౌవుతున్నారు. హెచ్చరిస్తున్నాం అయినా వలలో పడిపోతున్నారు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమీషనరేట్లకు సంబంధించిన ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ అధికారిక పేజీల్లో ఇన్వెస్ట్మెంట్లు, క్రిప్టో కరెన్సీలు చేసి మోసపోవద్దంటూ పోలీసులు పోస్టులు పెడుతున్నారు. ఆయా కమీషనరేట్ పరిధిలోని పోలీసుస్టేషన్లకు సంబం«ధించిన వారు కూడా అవగాహాన కలి్పస్తున్నారు. ప్రజలు ఎవరూ కూడా వీటిని పట్టించుకోవడం లేదు. కొత్తవారితో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటూ లక్షల రూపాయిలు మోసపోతున్నారు. – కేవీఎం ప్రసాద్, సైబర్‌క్రైం ఏసీపీ -
మాదాపూర్‌లో హైటెక్ దందా.. కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ!
సాక్షి, హైదరాబాద్: ఉన్నత చదువులు చదివి.. ఎన్నో ఆశలతో కొత్త జీవితం ప్రారంభించాలనుకున్న వారికి ఊహంచని షాక్ తగిలింది. ఐటీ కొలువు వచ్చిందని.. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేదని భావించిన ఉద్యోగులకు కంపెనీ భారీ షాకిచ్చింది. డబ్బులు వసూలు బోర్డు తిప్పేసింది. వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న ధన్యోన్ ఐటీ టెక్నాలజీ సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. అయితే, అంతకుముందు.. సదరు ఐటీ కంపెనీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావాలంటూ ఫేస్బుక్లో ప్రకటన ఇచ్చింది. దీంతో పలువురు నిరుద్యోగులు, ఆశావహులు కంపెనీని సంప్రదించారు. ఈ క్రమంలో కంపెనీ యాజమాన్యం వారికి భారీ ప్యాకేజీలు ఆఫర్ చేసింది. ఉద్యోగం ఫైనల్ చేసుకున్న వారితో కంపెనీ డీల్ కుదుర్చుకుంది. సదరు కంపెనీ యాజమాన్యం ఉద్యోగం పేరుతో దాదాపు 200 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ. 2 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం. డబ్బులు ఇచ్చిన వారికి ఆఫర్ లెటర్స్ సైతం పంపించినట్టు తెలుస్తోంది. రోజులు గుడుస్తున్నా.. ఆఫీస్ నుంచి పిలుపురాకపోవడంతో బాధితులు.. తాము మోసపోయినట్లు గుర్తింపు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. -
హైటెక్ సిటీ సమీపంలో MMTS రైలు ఢీకొని ముగ్గురు మృతి
-
హైటెక్ సిటీ సమీపంలో ప్రమాదం.. ఎఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి
సాక్షి, హైదరాబాద్: హైటెక్ సిటీ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. వీరు రైల్వే ట్రాక్‌పైనుంచి వెళ్తుండగా రైలు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను వనపర్తికి చెందిన రాజప్ప, శ్రీను, కృష్ణగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం భౌతికకాయాలను ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారా? లేక ప్రమాదానికి గురయ్యారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే మృతుల్లో ఒకరి వద్ద మద్యం సీసాలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో రైల్వేస్టేషన్‌కు సమీపంలోని మూలమలుపులో పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. చదవండి: ఆటోలో వచ్చి బాలికను కిడ్నాప్ చేసిన కిరాతకులు.. గదిలో బంధించి 3 నెలలపాటు సామూహిక అత్యాచారం -
ఇక సాఫీ జర్నీ
సాక్షి, హైదరాబాద్: కైతలాపూర్ ఆర్ఓబీని మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించనున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. హైటెక్ సిటీ– బోరబండ స్టేషన్ల మధ్య నిర్మించిన ఆర్ఓబీతో కూకట్పల్లి, హైటెక్ సిటీల మధ్య సాఫీ ప్రయాణం సాధ్యం కానుంది. జేఎన్టీయూ జంక్షన్, మలేషియన్ టౌన్షిప్ జంక్షన్, హైటెక్‌సిటీ ఫ్లై ఓవర్, సైబర్‌టవర్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ చిక్కులు తగ్గుతాయని అధికారులు పేర్కొన్నారు. సనత్‌నగర్, బాలానగర్, సికింద్రాబాద్‌ల నుంచి వచ్చేవారు మూసాపేట వద్ద డైవర్ట్ అయి కైతలాపూర్ మీదుగా మాదాపూర్ మెయిన్‌రోడ్ చేరుకోవచ్చు. తద్వారా 3.5 కి.మీ దూరం తగ్గడంతోపాటు గంట ప్రయాణ సమయం కలిసి వస్తుంది. ఎస్సార్డీపీలో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.86 కోట్లు. ఎస్సార్డీపీ ద్వారా చేపట్టిన 41 పనుల్లో ఇప్పటి వరకు 29 పూర్తయినట్లు అధికారులు పేర్కొన్నారు. వాటిలో ఏడు ఆర్ఓబీ/ఆర్‌యూబీలున్నాయన్నారు. (చదవండి: సిటీలో డీడీసీ... మాదకద్రవ్యాలపై స్పెషల్ డ్రైవ్) -
ఐటీ కారిడార్లలో వజ్ర పరుగులు.. చార్జీలు ఎంతంటే?
సాక్షి, హైదరాబాద్: నగరంలో వజ్ర ఏసీ బస్సులు సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. గతంలో హైదరాబాద్ నుంచి వరంగల్, నిజామాబాద్ తదితర దూర ప్రాంతాలకు నడిచిన ఈ బస్సులను నగరంలో నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. క్యాబ్‌లకు ఎక్కువగా డిమాండ్ ఉండే హైటెక్ సిటీ, ఐటీ కారిడార్లలో వీటిని నడుపుతున్నారు. ఐటీ దిగ్గజ సంస్థల్లో పనిచేసే సాఫ్ట్వేర్ నిపుణులు, వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఆయా సంస్థల నుంచి సమీపంలోని మెట్రో స్టేషన్లకు, ప్రధాన ప్రాంతాలకు చేరుకొనేలా ఇవి అందుబాటులో ఉంటాయి. సుమారు 5 లక్షల మందికిపైగా ప్రయాణికులు.. ► సాధారణంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజు సుమారు 1,500 బస్సులు ఐటీ పారిశ్రామిక ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. సుమారు 5 లక్షల మందికిపైగా ప్రయాణికులు నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్లకు ప్రయాణం చేస్తారు. కోవిడ్ కారణంగా ఐటీ సంస్థలను మూసివేసి వర్క్‌ఫ్రమ్ హోమ్ ప్రకటించడంతో ఈ మార్గంలో ప్రజా రవాణా కూడా స్తంభించింది. (క్లిక్: జూన్‌లో కరోనా కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం) ► కొంతకాలంగా కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఐటీ సంస్థల కార్యకలాపాలను పునరుద్ధరించారు. రాకపోకలు పెరిగాయి. ఈ క్రమంలో క్యాబ్‌లు, ఆటోలు తదితర ప్రైవేట్ వాహనాల నుంచి ఎదురయ్యే పోటీని ఎదుర్కొనేందుకు ఆర్టీసీ ప్రస్తుతం వజ్ర మినీ ఏసీ బస్సులను ఈ మార్గంలో నడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. ప్రయాణికులకు అనుగుణంగా.. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మెట్రో, ఇతర మార్గాల్లో జేఎన్టీయూకు చేరుకొనే ప్రయాణికులు అక్కడి నుంచి వేవ్‌రాక్ వరకు వెళ్లేందుకు అనుగుణంగా వజ్ర బస్సులు ఉంటాయి. సైబర్టవర్స్, మైండ్‌స్పేస్, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, డీఎల్ఎఫ్, ఇన్ఫోసిస్, విప్రో, ఐసీఐసీఐ, అమెజాన్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని పలు ప్రాంతాలకు తక్కువ చార్జీలతో ప్రయాణం చేయవచ్చు. (క్లిక్: ఇకపై ఆ లైసెన్సుల జారీ కఠినతరం) బస్సుల వేళలు.. జేఎన్టీయూ నుంచి వేవ్ రాక్ వరకు.. ఉదయం 8, 8.30, 9.50, 10.20, సాయంత్రం 4.25, 4.55, 6.15, 6.45 గంటలకు బస్సులు బయలుదేరుతాయి. వేవ్‌రాక్ నుంచి జేఎన్టీయూ వరకు... ఉదయం 8.50, 9.20, సాయంత్రం 3.35, 4.05, 5.25, 5.55 గంటలకు బస్సులు బయలుదేరుతాయి. చార్జీలు జేఎన్టీయూ నుంచి మైండ్‌స్పేస్‌కు రూ.20, జేఎన్టీయూ నుంచి వేవ్‌రాక్‌కు రూ.40, మైండ్‌స్పేస్ నుంచి వేవ్‌రాక్‌కు రూ.20. వీకెండ్లో సమతామూర్తి వద్దకు సిటీబస్సులు ఓ నెటిజన్ విజ్ఞప్తికి స్పందించిన ఆర్టీసీ ఎండీ ముచ్చింతల్‌లోని కొలువైన సమతామూర్తి విగ్రహం వద్దకు వీకెండ్ సిటీ బస్సులు నడపాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధికారులను ఆదేశించారు. సమతామూర్తి విగ్రహం వద్దకు నేరుగా ఆర్టీసీ బస్సుల్లేవని, క్యాబ్‌లో వెళ్లేందుకు రూ.1000 వరకు ఖర్చవుతుందని ఓ నెటిజన్ ట్విట్టర్లో ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు సజ్జనార్ సానుకూలంగా స్పందించారు. ‘ఆర్టీసీ పట్ల మీ ఆసక్తికి ధన్యవాదాలు’ అంటూ అభినందించారు. -
హైదరాబాద్‌లో వర్క్ ఫ్రం ఆఫీస్.. బ్యాక్ టు ‘ట్రాఫిక్ రూల్స్’
సాక్షి, హైదరాబాద్: దశల వారీగా ‘వర్క్ ఫ్రం ఆఫీస్’ పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులూ సన్నద్ధమవుతున్నారు. ఐటీ కారిడార్‌లో క్రమగా వాహనాల రద్దీ పెరుగుతోంది. వ్యక్తిగత వాహనాలు, ట్రావెల్ బస్సులలో ఉద్యోగులు కార్యాలయాలకు హాజరవుతుండటంతో ఐటీ కారిడార్ జంక్షన్లలో ఉదయం, సాయంత్రం సమయాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. ఇప్పటికే ఆయా కారిడార్లలోని ట్రాఫిక్ కూడళ్ల వద్ద పని చేయని సిగ్నల్స్, సీసీ కెమెరాలను రిపేరు చేసి పోలీసులు నిర్వహణకు సిద్ధం చేశారు. రెండున్నరేళ్ల తర్వాత... ► కరోనా ప్రభావంతో మొదలైన వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని ముగించేందుకు ఐటీ కంపెనీలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ► దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెలాఖరు నుంచి ఉద్యోగులు దశల వారీగా ఉద్యోగులు హాజరయ్యేలా కంపెనీలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ► తొలుత సగం మంది ఉద్యోగులను వారం విడిచి వారం ఆఫీసులకు వచ్చేలా.. క్రమంగా హాజరు శాతాన్ని పెంచుతూ.. రెండు మూడు నెలల్లో పూర్తి స్థాయిలో ఉద్యోగులు ప్రత్యక్ష విధులు నిర్వర్తించేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. ► సిటీ నలుమూలల నుంచి ప్రతి రోజు ఐటీ, ఇతర ఉద్యోగులు ఐటీ కారిడార్‌కు వస్తుంటారు. దీంతో మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి ట్రాఫిక్ పీఎస్‌ల పరిధిలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. (క్లిక్: హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ భారీ డేటా సెంటర్) ► ఐటీ కారిడార్‌లో ద్విచక్ర వాహనాలతో పాటు కార్ల రద్దీ పెరగనుంది. ఇందుకు తగ్గట్టుగానే జంక్షన్లు, సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్ జాం కాకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పని చేయని సిగ్నళ్లు, పాడైపోయిన కెమెరాలను బాగు చేయడంతో పాటూ, వార్షిక సర్వీస్‌లను చేసే పనిలో నిమగ్నమయ్యారు. కొత్తగా మూడు సెక్టార్లు.. ప్రస్తుతం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 10 ట్రాఫిక్ పీఎస్‌లు ఉన్నాయి. ఐటీ కారిడార్‌లో కొత్తగా మూడు ట్రాఫిక్ సెక్టార్లు ఏర్పాటు చేశారు. సిటీ నలుమూలల నుంచి ప్రతి రోజు ఉద్యోగులు మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి వంటి ప్రాంతాలకు వస్తుంటారు. దీంతో ఆయా ట్రాఫిక్ పీఎస్‌ల పరిధిలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ స్టేషన్ల పరిధిలోని ఆఫీసర్లు, సిబ్బందిపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త సెక్టార్లు ఏర్పాటు చేస్తే సిబ్బందిపై ఒత్తిడి తగ్గి, ట్రాఫిక్ నియంత్రణ సులువవుతుందని అధికారులు భావించారు. మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి ట్రాఫిక్ పోటీస్ స్టేషన్ల పరిధిలో కొత్తగా మూడు సెక్టార్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ► మాదాపూర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో రాయదుర్గం సెక్టార్ ► గచ్చిబౌలి పీఎస్ పరిధిలో నార్సింగి సెక్టార్ ► కూకట్పల్లి పీఎస్ పరిధిలో కేపీహెచ్‌బీ సెక్టార్‌ను ఏ ర్పాటు చేశామని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ► ఒక్కో సెక్టార్‌కు ఒక ఇన్స్పెక్టర్, ఇద్దరు ఎస్ఐలు, 45 మంది కానిస్టేబుళ్లు కేటాయించారు. (క్లిక్: హైదరాబాద్‌లో అడుగుపెట్టిన లండన్ బేస్డ్ యూనికార్న్ కంపెనీ) -
తప్పతాగి ర్యాష్ డ్రైవింగ్
-
హైటెక్ సిటీలో కారు బీభత్సం.. ఫుట్‌పాత్‌పై ఎగిరిపడ్డ ఆటో
సాక్షి, హైదరాబాద్: హైటెక్ సిటీ రహేజా మైండ్‌స్పేస్ వద్ద ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న యువకులు రాష్ డ్రైవింగ్ చేస్తూ తమ ఆడి కారుతో ముందున్న ఆటోను ఢీకొట్టారు. దీంతో ఆటో ఫుట్‌పాత్ మీదకు ఎగిరిపడి నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఉమేశ్ కుమార్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా ప్రమాదానికి కారణమైన యువకులు కారును అక్కడే వదిలి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఉమేశ్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కాగా ఉమేశ్ కుమార్ మృతికి కారణమైన వారిని విడిచిపెట్టొద్దని అతని బందువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీకెమెరాల ఫుటేజీ ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు వారికి వివరించారు. చదవండి: అరాచకం.. స్కూటర్‌ను ఢీకొట్టాడని చితకబాదారు; వీడియో వైరల్ -
హైటెక్ సిటీ: విదేశీ యువతులతో వ్యభిచారం
మాదాపూర్: హైటెక్ సిటీలోని ఓ స్టార్ హోటల్‌పై యాంటీ హ్యూమన్ ట్రాకింగ్ టీమ్ దాడి చేసి విదేశీ యువతులు, మోడళ్లతో నిర్వహిస్తున్న ఓ వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేసింది. నిర్వాహకుడు పరారీ కాగా, ఐదుగురు యువతులను, ఒక విటుడిని అదుపులోకి తీసుకొని మాదాపూర్ పోలీసులకు అప్పగించింది. మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... మాదాపూర్‌లోని ఓ స్టార్ హోటల్లో ఉజబెకిస్తాన్‌కు చెందిన ముగ్గురు యువతులు, ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతుల పేరిట ఐదు రూమ్‌లు బుక్ చేశారు. నిర్వాహకులు అర్నవ్, ప్రిన్స్‌లు ఫోన్లో విటులతో మాట్లాడి హోటల్‌కు రప్పించి యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారు. ఇదిలా ఉండగా, సోమవారం సాయంత్రం 5 గంటలకు సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాకింగ్ టీమ్ సదరు హోటల్‌పై దాడి చేసింది. వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉజబెకిస్తాన్‌కు చెందిన ముగ్గురు యువతులు, ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకుంది. విటుడు షేక్‌పేట్‌కు చెందిన జ్ఞాన శేఖర్ మణికంఠన్(44)ను పోలీసులు అరెస్టు చేశారు. హోటల్ గదులలో రూ.29,560 నగదు, కండోమ్ ప్యాకెట్లు, సెల్‌ఫోన్ స్వా«దీనం చేసుకున్నారు. కాగా, యువతులను రెస్క్యూ హోంకు తరలిస్తామని సీఐ తెలిపారు. పరారీలో ఉన్న నిర్వాహకుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హైటెక్ సిటీ: వాహనదారులకు తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: కేపీహెచ్‌బీ నుంచి హైటెక్ సిటీకి వెళ్లే దారిలో నూతనంగా రూ.66.59 కోట్లతో పూర్తి చేసిన హైటెక్ సిటీ రైల్వే అండర్ బ్రిడ్జి(ఆర్యూబీ)ని సోమవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఉండే మార్గంలో దాదాపు 410 మీటర్ల పొడవు, 20.60 మీటర్ల వెడల్పు కలిగిన ఈ ఆర్యూబీ ప్రారంభంతో వాహనదారులకు ఊరట లభించనుంది. ప్రస్తుతం ఈ ఆర్యూబీ ప్రారంభంతో ఇప్పటికే అధిక ట్రాఫిక్ ఉన్న హైటెక్ సిటీ, ఎంఎంటీఎస్ స్టేషన్ మార్గంలో కష్టాలు తీరనున్నాయి. ఇక జేఎన్టీయుహెచ్ నుంచి హైటెక్ సిటీకి వెళ్లే దారిలోని ఈ రైల్వే బ్రిడ్జి కింద గతంలో చిన్నపాటి వర్షం పడితే ఇక్కడి కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయి ట్రాఫిక్ సమస్య తలెత్తేది. ప్రతిరోజు దాదాపుగా 40 వేల లీటర్ల నీరు ఊరుతూ ఉండేది. అదే విధంగా చిన్నపాటి వర్షం కురిసినా వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి ఉండేది కాదు. ప్రస్తుతం ఈ నీటిని నిల్వ చేయటానికి సమీపంలోనే పెద్ద సంపును నిర్మించారు. ఈ సంపులో నిల్వ చేసిన నీటిని మూసాపేట సర్కిల్లో నాటిన హరితహారం మొక్కలకు అందించనున్నారు. చదవండి: సర్పంచ్ పాడె మోసిన మంత్రి జగదీశ్ రెడ్డి -
‘ఆ రూట్లో.. ట్రామ్ లేదా బీఆర్టీఎస్ ఏర్పాటు’
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి జేఎన్టీయూ నుంచి హైటెక్‌సిటీ వరకు ఎలివేటెడ్ పద్ధతిలో బీఆర్టీఎస్ కారిడార్ గాని ట్రామ్ ట్రాన్స్‌పోర్టు విధానాన్ని కాని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన శాసనసభకు తెలిపారు. జేఎన్టీయూ నుంచి హైటెక్‌సిటీ మార్గంలో మెట్రో కారిడార్ నిర్మించాలని, తీవ్ర రద్దీ పెరిగిన సుచిత్ర కూడలి నుంచి కూడా ఈ తరహా ఏర్పాటు అవసరమని, కానీ అక్కడ మెట్రో నిర్మాణానికి వీలుగా స్థలం లేనందున కనీసం ఎంఎంటీఎస్నైనా ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ సభ్యుడు వివేకానంద కోరారు. జేఎన్టీయూ నుంచి హైటెక్‌సిటీ వైపు రద్దీ తీవ్రంగా ఉన్నందున అక్కడ ప్రత్యేక వ్యవస్థ అవసరమని, అయితే ట్రామ్ మార్గాన్ని గాని ఎలివేటెడ్ కారిడార్ ద్వారా బీఆర్టీఎస్ విధానాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు మంత్రి పేర్కొన్నారు. మెట్రో రైళ్లలో పాస్‌ను ప్రవేశపెట్టే అంశం కూడా పరిశీలనలో ఉందని, ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా రాత్రివేళ వాటి సమయాన్ని పొడిగించే యోచనలో ఉన్నామన్నారు. ప్రస్తుతం 20 వేల ద్విచక్రవాహనాలు, 400 కార్లు నిలిపేందుకు వీలుగా వివిధ ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లలో పార్కింగ్ సౌకర్యం కల్పించామని, త్వరలో 20 ప్రాంతాల్లో మల్టీలెవల్ పార్కింగ్ టవర్లు నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు వ్యయం రూ.14,500 కోట్లు కాగా, వయబిలిటీ గ్యాప్ ఫండ్‌గా 10 శాతం మొత్తాన్ని కేంద్రప్రభుత్వం భరించిందని, అందులోనూ ఇంకా రూ.2 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. ఎంజీబీఎస్ నుంచి 5 కి.మీ. దూరంలో ఉన్న ఫలక్‌నుమా వరకు వీలైనంత త్వరలో మెట్రో రైలు కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.