గ్రేటర్ వాసుల కలల మెట్రో రైలు బుధవారం హైటెక్ సిటీకి పరుగులు పెట్టింది. ఉదయం 9.30 గంటలకు అమీర్‌పేట్ ఇంటర్‌ఛేంజ్ మెట్రోస్టేషన్‌లో జరిగే కార్యక్రమంలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ జెండా ఊపి లాంఛనంగా రైలును ప్రారంభించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి హడావుడి, ప్రచారం, ఆర్బాటం లేకుండా గవర్నర్ మెట్రో రైలును ఆరంభించారు. అనంతరం హైటెక్ సిటీ వరకు గవర్నర్ మెట్రో రైలులో ప్రయాణిస్తున్నారు. అయితే ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ఈ మార్గంలో మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.