governer narasimhan
-
గవర్నర్‌కు స్వల్ప అస్వస్థత
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తన తల్లి పిండ ప్రదాన కార్యక్రమం కోసం భార్య విమలా నరసింహన్‌తో కలిసి ఆయన బిహార్‌లోని గయ వెళ్లారు. పిండ ప్రదాన కార్యక్రమంలో భాగంగా ఒకరోజు ముందు నుంచి కఠిన ఉపవాసం ఉన్నా రు. సోమవారం పిండ ప్రదాన కార్యక్రమంతో పాటు పలు పూజల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా వాంతులు చేసుకున్నారు. దీంతో అధి కారులు ఆయన్ను స్థానిక మగధ్ వైద్య కళాశాలకు తరలించి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించారు. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎలాంటి సమస్య లేదని నిర్ధారించారు. రక్తపోటు, పల్స్ నార్మల్‌గా ఉండటంతో గవర్నర్ వ్యక్తిగత వైద్యుడ్ని సంప్రదించి డిశ్చార్జ్ చేసినట్టు వైద్య కళాశాల డిప్యూటీ సూపరింటెండెంట్ తెలిపారు. అనంతరం అక్కడి నుంచి గవర్నర్ దంపతులు ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశం కానున్నారు. త్వరలో కేంద్రం గవర్నర్ల సదస్సును నిర్వహించనుంది. దేశంలోనే సీనియర్ గవర్నర్ అయినందున నరసింహన్ సలహాలు, సూచనలు స్వీకరించేందుకు రాష్ట్రపతి ఆయన్ను ఆహ్వానించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా గవర్నర్ సమావేశమయ్యే అవకాశం ఉంది. -
ఆహ్లాదకరంగా ‘ఎట్ హోం’
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ నరసింహన్ దంపతులు గురువారం రాజ్‌భవన్‌లో ఇచ్చిన తేనీటి విందుకు (ఎట్ హోం) సీఎం కేసీఆర్‌తోపాటు పలువురు మంత్రులు, వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. సుమారు గంటన్నర పాటు సాగిన ఎట్‌హోం కార్య క్రమంలో గవర్నర్ దంపతులు నరసింహన్, విమలా నరసింహన్ అతిథుల వద్దకు వెళ్లి పేరుపేరునా స్వాగతం పలికారు. జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభం కాగా.. సీఎం కేసీఆర్‌తోపాటు గవర్నర్ దంపతులు ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన వేదిక వద్దకు చేరుకున్నారు. తమిళనాడు మాజీ గవర్నర్, మాజీ సీఎం రోశయ్యతో పాటు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ పార్టీల నేతలను పలకరించిన సీఎం కేసీఆర్.. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఐటీ కంపెనీ అధినేత బీవీఆర్ మోహన్‌రెడ్డితో సుదీర్ఘంగా సంభాషించారు. అతిథులను పలకరించిన అనంతరం.. గవర్నర్ నరసింహన్, కేసీఆర్ 25నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఇద్దరి నడుమ ఆసక్తికర చర్చ సాగిందని చెబుతున్నా.. భేటీ వివరాలు మీడియాకు వెల్లడి కాలేదు. కేసీఆర్‌తో జానారెడ్డి కరచాలనం, పక్కన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలిసే సందర్భం రావట్లేదు! ఎట్‌హోం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వివిధ పార్టీల నేతలను గవర్నర్, సీఎం కేసీఆర్ పలకరించారు. ఆహ్లాదకరంగా సాగిన కార్యక్రమంలో గవర్నర్, సీఎం, నేతల నడుమ పలుసార్లు ఆసక్తికర సంభాషణ జరిగింది. సీఎల్పీ మాజీ నేత జానారెడ్డిని ఎలా ఉన్నారంటూ సీఎం కేసీఆర్ పలకరించగా.. ఇప్పుడు మనం కలిసే సందర్భం రావడం లేదని జానారెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో అసెంబ్లీలో అప్పుడో, ఇప్పుడో కలిసే సందర్భం వచ్చేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మమ్ములను కూడా దృష్టిలో పెట్టుకోండని గవర్నర్‌తో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ వ్యాఖ్యానించగా.. అలాంటిదేమీ లేదని గవర్నర్ అన్నారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, గవర్నర్ మధ్య కూడా సుమారు 2 నిమిషాల పాటు ఆసక్తికర సంభాషణ కొనసాగింది. తరలివచ్చిన ప్రముఖులు కార్యక్రమంలో తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు నేతలతో పాటు, ప్రభుత్వాధికారులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఉమ్మడి ఏపీ శాసన మండలి మాజీ ఛైర్మన్ చక్రపాణి, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, బడుగుల లింగయ్య యాదవ్, బండ ప్రకాశ్, సంతోష్‌కుమార్, ఎంపీలు నామా నాగేశ్వర్రావు, రేవంత్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులతోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, క్రీడాకారులు మిథాలీరాజ్, పుల్లెల గోపీచంద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పాల్గొన్నారు. -
గవర్నర్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్రోద్యమాన్ని స్మరించుకోవడంతో పాటు దేశ అభ్యు న్నతికి పునరంకితం కావాల్సిన రోజన్నారు. ఎన్నో తరాల దేశ భక్తుల నిస్వార్థ పోరాటాలు, త్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. దేశభక్తులందరినీ స్మరించుకునే సమయమని గవర్నర్ అన్నారు. నేడు రాజ్‌భవన్‌లో రక్షాబంధన్ వేడుకలు రాజ్‌భవన్‌లోని దర్బార్ హాలులో గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రక్షాబంధన్ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొననున్నారు. -
రాష్ట్రపతికి సీఎం జగన్ సాదర స్వాగతం
సాక్షిప్రతినిధి, తిరుపతి: వీవీఐపీలతో తిరుపతి పురవీధులు శనివారం రద్దీగా మారాయి. భారత ప్రథమ పౌరుడు రామనాథ్ కోవింద్, తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచ్చేశారు. దేవదేవుడు శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునే నిమిత్తం భారత రాష్ట్రపతి దంపతులు శనివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ దంపతులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి విమానాశ్రయం నుంచి నేరుగా రోడ్డు మార్గంలో తిరుచానూరు చేరుకున్నారు. అక్కడ రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ బసంత్‌కుమార్, కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త, ఆలయ ప్రధాన అర్చకులు, ఇతర అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి, కపిలతీర్థం చేరుకుని శ్రీకపిలేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఇదివరకు నీలం సంజీవరెడ్డి, శంకర్‌దయాళ్‌శర్మ, ప్రణబ్‌ముఖర్జీ ముగ్గురు రాష్ట్రపతులు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ జాబితాలో నాలుగో రాష్ట్రపతిగా రామనా«థ్ కోవింద్ చేరారు. అనంతరం రోడ్డు మార్గాన తిరుమల చేరుకున్న ఆయన ఆదివారం ఉదయం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి పర్యటనకు పటిష్ట భద్రత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ పర్యటన నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట బందోబస్తు చేపట్టింది. నలుగురు ఎస్పీ స్థాయి అధికారులు, ఆరుగురు ఏఎస్సీలు, 22 మంది డీఎస్పీలు, 35 సీఐలు, 75 మంది ఎస్ఐలు, 300 మంది ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 400 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 200 మంది స్పెషల్ పోలీసులు, 3 కంపెనీల ఏపీఎస్పీ సిబ్బంది, ఇతర జిల్లాల నుంచి వచ్చిన మరో 475 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. రాష్ట్రపతి భద్రత నిమిత్తం 1,692 మందితో బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలుకుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి గంట ముందే చేరుకున్న సీఎం రాష్ట్రపతి రామనాథ్‌కోవింద్ తిరుమల పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటుండడంతో స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి సాయంత్రం 4.30గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, ఎంపీలు విజయసాయిరెడ్డి, మి«థున్‌రెడ్డి వచ్చారు. రేణిగుంటకు చేరుకున్న సీఎంకు డెప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి, ఏ.శ్రీనివాసులు, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, నవాజ్‌బాషా, ఆదిమూలం, కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త, డీఐజీ క్రాంతి రాణా టాటా, ఎస్పీలు అన్బురాజన్, వెంకట అప్పలనాయుడు, తిరుపతి నగర కమిషనర్ గిరీషా తదితరులు స్వాగతం పలికారు. రాష్ట్రపతికి స్వాగతం పలికి తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడకు బయలుదేరి వెళ్లారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన ప్రముఖులు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతి దంపతులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, డెప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, బల్లి దుర్గాప్రసాద్‌రావు, తిరుపతి, చంద్రగిరి, చిత్తూరు, శ్రీకాళహస్తి, మదనపల్లె, సత్యవేడు ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. ఏ శ్రీనివాసులు, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, నవాజ్‌బాషా, ఆదిమూలం తదితరులు స్వాగతం పలికారు. -
హైటెక్ సిటీ మెట్రో రైలు ప్రారంభోత్సం
-
హై'టెక్'కు మెట్రో రైలు పరుగులు
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ వాసుల కలల మెట్రో రైలు బుధవారం హైటెక్ సిటీకి పరుగులు పెట్టింది. ఉదయం 9.30 గంటలకు అమీర్‌పేట్ ఇంటర్‌ఛేంజ్ మెట్రోస్టేషన్లో జరిగే కార్యక్రమంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జెండా ఊపి లాంఛనంగా రైలును ప్రారంభించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి హడావుడి, ప్రచారం, ఆర్బాటం లేకుండా గవర్నర్ మెట్రో రైలును ఆరంభించారు. అనంతరం హైటెక్ సిటీ వరకు గవర్నర్ మెట్రో రైలులో ప్రయాణిస్తున్నారు. అయితే ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ఈ మార్గంలో మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. కాగా మొత్తం 10 కి.మీ. మార్గంలో అమీర్‌పేట్‌తో కలిపి 9 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. హైటెక్‌సిటీకి మెట్రో పరుగుతో ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాల్లో పనిచేస్తున్న లక్షలాదిమంది ఉద్యోగులకు ట్రాఫిక్ చిక్కులు తప్పనున్నాయి. ప్రారంభంలో ఈ మార్గంలో నిత్యం లక్ష మంది రాకపోకలు సాగిస్తారని, మరికొన్ని రోజుల్లో రద్దీ రెండు లక్షల మార్కును దాటుతుందని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఆయా మెట్రో స్టేషన్లలో పార్కింగ్ ఇబ్బందులు మెట్రో ప్రయాణికులకు చుక్కలు చూపేలా ఉన్నాయి. ఇంటి నుంచి వ్యక్తిగత వాహనాల్లో ఆయా స్టేషన్లకు చేరుకున్నవారికి ఆయా స్టేషన్ల వద్ద పరిమితంగానే పార్కింగ్ స్థలం అందుబాటులో ఉండడంతో ఇబ్బందులు తప్పవన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి.. ఆటోలు, క్యాబ్‌లు, బస్సుల్లోనే మెట్రో స్టేషన్లకు చేరుకుంటే పార్కింగ్ చిక్కులు తప్పుతాయని మెట్రో అధికారులు సెలవిస్తుండడం గమనార్హం. త్వరలో ఆయా స్టేషన్ల వద్ద స్మార్ట్ పార్కింగ్ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. -
‘టీటీడీ అక్రమాలపై విచారణ జరిపించాలి’
సాక్షి, హైదరాబాద్ : పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్ర - తెలంగాణ బీజేపీ నేతలు మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. టీటీడీలో అక్రమాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని తెలిపారు. వీటి వెనక రాజకీయ ప్రమేయం ఉందని ఆరోపించారు. గత నెల టీటీడీలో టికెట్ల కుంభకోణం వెలుగు చూసినప్పటికి ఏపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్ను ఆదేశించాల్సిందిగా గవర్నర్‌ను కోరామని మంత్రి దత్తాత్రేయ తెలిపారు. ఈవోకు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. టీటీడీలో జరుగుతున్న అక్రమాల వల్ల భక్తులకు తిరుమల దేవస్థానం పట్ల నమ్మకం సన్నగిల్లుతుందనిదత్తాత్రేయ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తిరుమలలో జరిగిన అన్యాయాలు, అక్రమాలపై తాను చర్యలు తీసుకున్నట్లు మాజీ డీజీపీ దినేష్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం వెలుగు చూసిన టికెట్ల కుంభకోణంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. -
గవర్నర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ ప్రజలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇరు రాష్ట్రాల ప్రజల జీవితాల్లో కొత్త సంవత్సరం సుఖసంతోషాలు, ఐశ్వర్యాన్ని తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో సంతోషాలు వెల్లివిరియాలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత ముందుకు పోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరిసేలా దీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు ఏపీ సీఎం నూతన సంవత్సర శుభాకాంక్షలు సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు, దేశ, విదేశాల్లో ఉన్న తెలుగువారికి ముఖ్యమంత్రి చంద్రబాబు 2019 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గత విజయాలను సమీక్షించి, నవ సంకల్పాలతో భవిష్యత్ నిర్మించుకొనేందుకు వచ్చిన శుభ సమయమే కొత్త సంవత్సరమని ఆయన అభివర్ణించారు. రాష్ట్రాభివృద్ధిని కొనసాగించేందుకు మళ్లీ తమకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలతో గడపాలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుఖసంతోషాలతో గడపాలని ఆయన భగవంతుడిని ప్రార్థించారు. పాత సంవత్సరంలో మంచిని కొనసాగిస్తూ నూతన సంవత్సరంలో కూడా అందరికి మంచి జరగాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నూతన ఉత్తేజంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. హోంమంత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు హోంమంత్రి హోంమంత్రి మహమూద్ అలీ సోమవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరమంతా అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా గడపాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు అలీ పేర్కొన్నారు. -
పోలీస్ అమరవీరులకు నివాళులర్పించిన గవర్నర్ నరసింహన్
-
హరికృష్ణకు నివాళులర్పించిన సినీ,రాజకీయ ప్రముఖులు
-
పీడీ ఖాతాల స్కామ్‌పై సీబీఐ విచారణ జరిపించాలి
-
గవర్నర్‌ను కలిసిన టీకాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలు సోమవారం ఇరురాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుపై కోర్టు తీర్పు, అలాగే తెలంగాణలో అకాల వర్షాల వల్ల జరిగిన పంటనష్టంపై గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు. అయితే గవర్నర్‌తో జరిగిన సమావేశాన్ని ఎమ్మెల్యే సంపత్‌కుమార్ బహిష్కరించారు. ఆయన లోనికి వెళ్లకుండా రాజ్‌భవన్ బయటే ఉండిపోయారు. గవర్నర్‌తో భేటీ అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దు అంశంపై హైకోర్టు తీర్పు వచ్చినా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. ఇదే అంశంపై గవర్నర్‌ను కలిసినట్టు తెలిపారు. సంపత్ కుమార్, కోమటిరెడ్డిల సభ్యత్వం పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరామన్నారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. కార్యదర్శికి వినతిపత్రం మరోవైపు ఇద్దరు ఎమ్మెల్యేల శాసన సభ్యత్వం రద్దుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల చేత ఎన్నుకోబడి, ప్రజల సమస్యలను సభ దృష్టికి తీసుకురావల్సిన గౌరవ సభ్యుల సభ్యత్వాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. కోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర పరిపాలన యంత్రాంగం వెంటనే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరినట్టు ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా కోర్టు తీర్పును అమలు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చినట్లు భట్టి పేర్కొన్నారు. -
బాలకృష్ణ వ్యాఖ్యలపై బీజేపీ సీరియస్
సాక్షి, విశాఖ: ప్రధాని నరేంద్రమోదీపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతాపార్టీ తీవ్రంగా పరిగణించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ధర్మ పోరాట దీక్ష పేరుతో చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ.. మోదీ శిఖండిలా, కొజ్జాలా రాజకీయాలు చేస్తూ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని తీవ్రంగా ఆరోపించారు. దీంతో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యాలపై రాష్ట్ర బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో శనివారం విశాఖ పర్యటనలో ఉన్న గవర్నర్ నరసింహన్‌తో బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ధర్మ పోరాట దీక్షలో మోదీపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే విష్టుకుమార్‌రాజు, ఎమ్మెల్సీ మాధవ్‌లు ఈ సందర్భంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం బీజేపీ నేతలు మాట్లాడుతూ.. రాజ్యాంగం పట్ల గౌరవం లేని వ్యక్తి ప్రజాప్రతినిధిగా కొనసాగే హక్కు లేదని పేర్కొన్నారు. -
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ రచ్చరచ్చ
-
గవర్నర్ టీడీపీ భజన చేస్తున్నారు
-
బడ్జెట్ సమావేశాల్లోపు కొత్త గవర్నర్ రావాల్సిందే!
సాక్షి, విశాఖపట్నం: బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను టార్గెట్ చేశారు. గవర్నర్ నరసింహన్‌ను వెంటనే మార్చాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల్లోపు కొత్త గవర్నర్‌ను నియమించాలని ఆయన అల్టిమేటం జారీచేశారు. ఏపీ ప్రభుత్వం రూపొందించిన నాలా బిల్లు విషయమై గవర్నర్ తీరుపై విష్ణుకుమార్ రాజు విమర్శలు చేశారు. సంక్రాంతి పండుగ లోపు నాలా బిల్లును గవర్నర్ ఆమోదించి పంపాలని కోరారు. నాలా బిల్లుపై గవర్నర్ నరసింహన్‌కు ఏపీ సర్కార్‌కు మధ్య లేఖల యుద్ధం కొనసాగుతోంది. నాలా బిల్లుపై గవర్నర్ ఆమోదం పొందేందుకు ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 3 నెలల కిందట పలు సలహాలు చేర్చి.. నాలా బిల్లును రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ నరసింహన్ కు పంపింది. అయితే ఏపీ ప్రభుత్వం సలహాలను గవర్నర్ తోసిపుచ్చి దాన్ని తిప్పిపంపారు. దీంతో ఈ బిల్లుపై అసెంబ్లీలో ఆర్డినెన్స్‌ను ఆమోదించి.. గవర్నర్ నరసింహన్ కు ప్రభుత్వం మరోసారి పంపింది. కానీ గవర్నర్ మళ్లీ ఈ బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాను ఈ బిల్లు విషయమై గతంలో చేసిన సూచనలు పరిగణనలోకి తీసుకోలేదని గవర్నర్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యవహారం కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
గాంధీలో వైద్యం చేయించుకున్న గవర్నర్
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ మరోసారి గాంధీ ఆస్పత్రికి వచ్చారు. ఈఎన్టీ వైద్య పరీక్షల నిమిత్తం ఆయన సోమవారం గాంధీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు గాంధీ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం గవర్నర్ ఐసీయూను సందర్శించి, అక్కడ రోగులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. కాగా గత ఏడాదిలో కూడా గాంధీకి వచ్చిన నరసింహన్ కాలికి ఆనె(కార్న్)తో రావడంతో ఆపరేషన్ చేయించుకున్నారు. -
వేద పరిమళం
పుట్టపర్తి అర్బన్: వేద అధ్యయనంతోనే ధర్మ స్థాపన సాధ్యమని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. మనిషికి యోగా, ప్రాణాయామం ఎంత ముఖ్యమో వేదాలు, వేద పారాయణం అంతేనన్నారు. హింసను వీడితేనే శాంతి నెలకొల్ప వచ్చన్నారు. పుట్టపర్తి సత్యసాయి జయంతి వేడుకలను పురస్కరించుకుని ప్రశాంతి నిలయంలో తొలి అంతర్జాతీయ వేద సమ్మేళనం సోమవారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్‌కు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆర్జే రత్నాకర్రాజు, ప్రసాదరావు, చక్రవర్తి, విజయభాస్కర్, సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమీష్‌పాండే తదితరులు ఘన స్వాగతం పలికారు. సాయికుల్వంత్ హాలులో నిర్వహిస్తున్న రెండు రోజుల వేద సమ్మేళనాన్ని గవర్నర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తూ వేదాలకు పుట్టినిల్లు అయిన భారత దేశంలో తొలిసారిగా నిర్వహిస్తున్న వేద సమ్మేళనంలో తాను పాల్గొనం సంతోషంగా ఉందన్నారు. పుట్టపర్తికి వస్తే ఏదో తెలియని శక్తి వస్తుందన్నారు. వివిధ దేశాల నుంచి విచ్చేసిన మత గురువులు, ప్రచారకర్తలు తమ మతాల సారాంశాన్ని వివరించారు. ముఖ్యంగా హిందూ, ముస్లిం, క్రిస్లియన్, జైన, సిక్కులు, బౌద్ధులు, పార్శులు ఇలా వివిధ దేశాలకు చెందిన 16 మతాల పెద్దలు విచ్చేసి సర్వమత ప్రార్థనలు చేశారు. ప్రేమతత్వంతో ప్రపపంచాన్ని జయించవచ్చు ప్రేమతత్వంతో ప్రపంచాన్ని జయించవచ్చని మతపెద్దలు పేర్కొన్నారు. విశ్వశాంతి, సౌభ్రాతృత్వం కాంక్షిస్తూ జరిగిన సర్వమత ప్రార్థనల్లో వారు మాట్లాడుతూ ఏ మతంలోనైనా భగవంతుడు ప్రేమ, సత్యం, ధర్మం, శాంతి వంటి వాటితోనే బోధనలు చేశారని, ఇక్కడా సత్యసాయి బాబా అవే బోధించారన్నారు. ‘అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు’ సూక్తిని అందరూ తప్పక పాటించాలన్నారు. ప్రస్తుత మానవ జాతికి సేవ, ఐక్యత అనేవి అత్యంత ముఖ్యమైన అంశాలన్నారు. సర్వమత ప్రార్థనల్లో న్యూ ఢిల్లీకి చెందిన రామక్రిష్ణమిషన్ సెక్రెటరీ స్వామి శాంతాత్మానంద, హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలకు చెందిన కర్మగేలేయుతుక్, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా నుంచి 7వ చాంగగిల్టెన్రింపో, బెంగళూరు జోరోస్ట్రెయిన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రేయర్ వకిల్, కోల్‌కతకు చెందిన ఆలిండియా ఇమాం అసోసియేషన్ ప్రెసిడెంట్ మౌలానా షఫిక్ ఖాస్మి, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ ప్రొఫెసర్ అలీ మహమ్మద్ నఖ్వీ, ఢిల్లీ కమిషన్ ఫర్ ఇంటర్ఫెయిత్ కమిషన్ సెక్రెటరీ ఫాదర్ ఫెలిక్స్ జోన్స్, అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ నుండి గ్లాని గురుబచన్‌సింగ్, న్యూ ఢిల్లీ జ్యోదాహిం హానరర్ సెక్రెటరీ రబ్బీ ఇషాక్ మాలేకర్, అహింసా విశ్వభారత్ ఫౌండర్ ఆచార్య లోకేష్ముని, అజ్మీర్ షరీఫ్ చైర్మన్ హాజీ సయ్యద్, సల్మాన్, వెస్ట్‌బెంగాల్ ఆలిండియా ఇమాం అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ మౌలానా అబ్దుల్ రెహ్మన్, కర్ణాటకకు చెందిన స్టేట్ బాహా సెక్రెటరీ దినేష్రావ్, అక్షరధాంస్వామి నారాయన్ ట్రస్టీలు భారత్ సి మెహతా, కునాల్ భట్, ఢిల్లీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ రాష్ట్ర అధ్యక్షులు జతీందర్ చీమా తదితరులు పాల్గొన్నారు. సమస్యలకు వేదాల్లో పరిష్కారం పుట్టపర్తి అర్బన్: మానవాళి ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకూ వేదాల్లో పరిష్కారాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో కూలంకశంగా చర్చించారు. న్యూఢిల్లీ యూజీసీ ప్రొఫెసర్ డాక్టర్ రాంగోపాల్, యూఎస్ఏ కలరాడో యూనివర్సిటీ ఫ్రొఫెసర్ జాన్కిన్మణి, మలేషియా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ కన్సల్టెంట్ జగదీషన్ శ్రీవెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ సన్నిధానం సుదర్శనశర్మ తదితరులు ప్రసంగించారు. నీటి ఎద్దడి నివారణకు వేదాల్లో సూచించిన పరిష్కారాలు, ప్రస్తుత కాలంలో వేదాలకు ఉన్న ప్రాముఖ్యత, వ్యవసాయానికి, వాతావరణానికి వేద శాస్త్ర పరిజ్ఞానం ఏవిధంగా ఉపయోగపడుతుందనే అంశాలపై సూచనలు చేశారు. ఆహార కొరతకు ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయనే అంశాలను చర్చించారు. నేడు లైవ్‌లో ప్రధాని ప్రసంగం వేద సమ్మేళనంలో రెండో రోజు మంగళవారం పలువురు శాస్త్రవేత్తలు, ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయి. సాయంత్రం 4.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగం లైవ్‌లో వీక్షించవచ్చు. ఢిల్లీ నుంచి ఆయన విశ్వశాంతి, సర్వమత ప్రార్థనలు, వేద సమ్మేళనం తదితర అంశాలపై ప్రసంగించనున్నారని ట్రస్టీ నాగానంద పేర్కొన్నారు. అనంతరం తమిళనాడు భక్తులు నిర్వహించే ‘రుద్రతత్వం–ఏకత్వం’ అనే నాటిక ఉంటుందన్నారు. వేద తత్వాలపై ఎగ్జిబిషన్‌ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. దాదాపు 35 భాగాలుగా ఉన్న స్టాల్స్‌ను ప్రారంభిస్తారు. సాయి మార్గంలో సర్వమత సమ్మేళనం బుక్కపట్నం: సర్వ మతాల సారాంశం ఒక్కటే నని సత్యసాయిబాబా పలికిన మాటలు సత్యాలని, మత సామరస్యం కోసం ఆయన చూపిన దారి భావి తరాలకు పూల బాట అని పలువురు మత పెద్దలు, గురువులు అభిప్రాయపడ్డారు. పుట్టపర్తిలో సోమవారం జరిగిన వేద సమ్మేళన కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి పలువురు మత పెద్దలు, గురువులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. సేవా కార్యక్రమాలు ఆదర్శం పుట్టపర్తి అర్బన్: సత్యసాయి భక్తులు సేవా కార్యక్రమాల్లో తరిస్తున్నారు. బాబా జయంతి వేడుకలకు తరలివస్తున్న అశేష భక్తులకు అవసరమైన సేవలందించటానికి వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు ముందుకొచ్చారు. బాబా జీవించి ఉన్నప్పటి నుంచే ఈ కార్యక్రమాలు జరిగేవి. అన్నప్రసాదాల పంపిణీ, వైద్యసేవలు, తాగునీటి సరఫరా, విస్తర్లు తీసేసి, గ్లాసులు శుభ్రపరిచి, చెత్తాచెదారం తొలగించి, మొక్కల సంరక్షణ, నడవలేని వారిని దగ్గరుండి తీసుకెళ్లేటటువంటి పనులు చేస్తున్నారు. సత్యసాయి సంస్థల్లో వేలాది మంది సేవాదల్ సిబ్బంది పని చేస్తున్నారు. పుట్టపర్తికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలూ అందిస్తూ సేవ చేస్తున్నారు. స్త్రీ, పురుష భేదం లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల వారూ ఇక్కడ సామాన్య భక్తుని వలె సేవ చేయడం బహుశా దేశంలోనే ఎక్కడా లేదంటే అతిశయోక్తి కాదు. ఉపరాష్ట్రపతి రాకకు సర్వం సిద్ధం పుట్టపర్తి అర్బన్: సత్యసాయిబాబా 92వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈ నెల 22న వస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేశారు. బుధవారం మధ్యాహ్నం సత్యసాయి విమానాశ్రయంలో వెంగళమ్మచెరువు గ్రామానికి సంబంధించి అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించనున్నారు. 2016 మేలో ఆయన వెంగళమ్మచెరువు గ్రామానికి అభివృద్ధి పనుల కోసం రూ.80 లక్షలు మంజూరు చేశారు. దీంతో ఆ గ్రామంలో సిమెంటు రోడ్లు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ సుబహాన్ చెప్పారు. దీంతో అక్కడి అభివృధ్ది పనులను ఉపరాష్ట్రపతి ప్రారంభించనున్నట్లు తెలిపారు. అక్కడి నుండి విడిది చేయడానికి శ్రీనివాస గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. ఇందు కోసం ప్రత్యేకంగా తారు రోడ్డు లేయర్ వేసే పనులు పూర్తయ్యాయి. విమానాశ్రయం నుంచి రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించిన సత్యసాయి ఆర్చీవ్స్ ఆర్కియాలజీ మ్యూజియంను కూడా సిద్ధం చేశారు. అక్కడకు వెళ్లడానికి తారురోడ్డు లేయర్ వేసే పనులు పూర్తి చేశారు. అక్కడి నుంచి సాయికుల్వంత్ హాల్లో సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొని తిరిగి వెళ్లనున్నారు. భక్త జనసంద్రం పుట్టపర్తి అర్బన్: ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి భక్తజనసంద్రంతో నిండిపోతోంది. సత్యసాయి జయంతి వేడుకలను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు. బాబా శివైక్యం పొందిన తర్వాత ఎన్నడూ లేనంతగా ఈసారి భక్తులు పుట్టపర్తి చేరుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ప్రత్యేక రైళ్లు, బస్సుల సంఖ్య పెంచింది. ఇప్పటికే మహిళా దినోత్సవం రోజున పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. రెండు రోజుల అంతర్జాతీయ వేద సమ్మేళనానికి వేదపండితులే సుమారు 15 వేల మంది విచ్చేశారు. దీంతో పట్ణణంతో పాటు ప్రశాంతి గ్రామంలో సైతం లాడ్జీలు నిండిపోయాయి. ప్రశాంతి నిలయంలో అందిస్తున్న అన్నప్రసాదాలతో జనం అంతా ప్రశాంతి నిలయానికే పరిమితమయ్యారు. భద్రత కట్టుదిట్టం పుట్టపర్తి అర్బన్: బాబా జయంతి వేడుకలకు విచ్చేస్తున్న వీఐపీల భద్రతా ఏర్పాట్లను పరిశీలించడానికి ఎస్పీ అశోక్‌కుమార్ పుట్టపర్తికి విచ్చేశారు. సోమవారం ఉదయం తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రాక సందర్భంగా ముందస్తుగా భద్రతను పెంచారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ వీఐపీలతో పాటు రాష్ట్ర గవర్నర్, ఉప రాష్ట్రపతి ఈ నెల 22న విచ్చేస్తున్న దృష్ట్యా సుమారు 500 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పుట్టపర్తిలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ మాల్యాద్రి, డీఎస్పీలు రామవర్మ, శ్రీలక్ష్మి, నాగసుబ్బన్న, సీఐలు ఆంజనేయులు, రవీంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గవర్నర్ నరసింహన్‌కు మాతృవియోగం
-
గవర్నర్ నరసింహన్‌కు మాతృవియోగం
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తల్లి విజయలక్ష్మి (94) శుక్రవారం కన్నుమూశారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను పరామర్శించారు. ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటించారు. అనంతరం ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్‌తోపాటు పలు రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలు నరసింహన్‌ను ఫోన్ చేసి పరామర్శించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు ఈటల, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీశ్‌రావు, కేటీఆర్, శాసనసభాపక్ష నేత జానారెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, ఏపీ మంత్రులు లోకేశ్, మాణిక్యాలరావు, ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి కళా వెంకట్రావు, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు విజయలక్ష్మి భౌతికకాయానికి నివాళులర్పించి గవర్నర్‌ను పరామర్శించారు. గవర్నర్ తల్లి విజయలక్ష్మి తన మరణానంతరం కళ్లను దానం చేయాలని కోరడంతో నగరంలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వైద్య నిపుణులు వాటిని సేకరించారు. తన తల్లి అస్తికలను శనివారం త్రివేణి సంగమం గోదావరిలో కలిపేందుకు గవర్నర్ కాళేశ్వరానికి వెళ్లనున్నట్లు తెలిసింది. అంతిమ యాత్రలో సీఎం కేసీఆర్ గవర్నర్ తల్లి విజయలక్ష్మి అంతిమ యాత్రలో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి వర్గ సహచరు లంతా పాల్గొన్నారు. అనంతరం పంజగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలకు హాజరయ్యారు. -
ఢిల్లీకి చేరుకున్న గవర్నర్ నరసింహన్
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బుధవారం ఢీల్లీకి చేరుకున్నారు. రేపటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న గవర్నర్ల సదస్సులో పాల్గనడానికి ఆయన ఇక్కడికి వచ్చారు. రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో జరగనున్న ఈ సదస్సులో గవర్నర్ పాల్గొననున్నారు. ఈ సదస్సులో పాల్గొనడానికి అన్ని రాష్ట్రాల గవర్నర్లు హాజరు కానున్నారు. -
నేరళ్ల ఘటనలో ఎస్పీని మంత్రి కేటీఆర్ రక్షిస్తున్నారు..
హైదరాబాద్: సిరిసిల్ల రాజన్న జిల్లాలోని నేరెళ్ల దళితులపై జరిగిన దాడి ఘటనలో ఎస్పీని మంత్రి కేటీఆర్ రక్షిస్తున్నారని అఖిలపక్ష నాయకులు సోమవారం గవర్నర్ నరసింహాన్‌కు ఫిర్యాదు చేశారు. తెలంగాణలో దళితుల జీవితాలకు విలువ లేకుండా పోయిందని, ఇసుక మాఫియాతో కేటీఆర్‌కు సంబంధాలున్నాయని గవర్నర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నేరెళ్ల దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వారిలో ఎస్పీ పాత్ర ఉందని, లారీని తగలబెట్టిన వారిని వదిలేసి అమయాకులను అరెస్ట్ చేశారని వారు గవర్నర్‌ను కోరారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేలా డీజీపీని ఆదేశించాలని, బాధితులకు ప్రభుత్వం తగిన నష్టపరిహారం చెల్లించేలా కృషి చేయాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని, బాధితులకు పరిహారం చెల్లించి భద్రత కల్పించాలని కోరారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, ఎల్.రమణ, లక్ష్మణ్, చాడ వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు. -
రాజ్‌భవన్‌లో రాఖీ వేడుకులు
-
రాజ్‌భవన్‌లో రాఖీ వేడుకులు
హైదరాబాద్: రాజ్‌భవన్‌లో విద్యార్థినులు రాఖీ వేడుకలు నిర్వహించారు. గవర్నర్ నరసింహన్‌కు బ్రహ్మకుమారీలు, పాఠశాలల విద్యార్థినులు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. -
సినారే మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి
-
సినారే మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి
హైదరాబాద్: ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఆకస్మిక మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్ నరసింహన్ సినారే మృతి పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 'ఇలాంటి సమయంలో వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను. ఆయన రాసిన విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ్ అవార్డు రావడం తెలుగు జాతికి గర్వకారణం' అని అన్నారు. సినారె మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సాహిత్య రంగంలో సినారె కృషి ఎన్నటికీ మరువలేనిదని కొనియాడారు. అధ్యాపకుడు, సాహితీవేత్త, కవి, సినీ గేయ రచయితగా సినారె ఎనలేని కృషి చేశారన్నారు. సినారె సేవలు మరువలేనివి సి.నారాయణరెడ్డి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాహిత్య రంగానికి సినారె చేసిన ఎనలేనివన్నారు. ఎన్టీఆర్‌తో సినారె ఎంతో సన్నిహితంగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. రచయితగా, రాజ్యసభ సభ్యుడిగా సినారె చేసిన సేవలు చరిత్రలో మిగిలిపోతాయన్నారు. సి.నారాయణరెడ్డి మృతిపట్ల ఏపీ మంత్రులు లోకేశ్, చినరాజప్ప, స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తదితరులు సంతాపం ప్రకటించారు. -
‘చంద్రబాబు మూడేళ్ల పాలనలో 300 హత్యలు’
కర్నూలు: కర్నూలు జిల్లాలో హత్యా రాజకీయాలు ఎక్కువవుతున్నాయని గవర్నర్ నరసింహన్ వద్ద వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడేళ్ల పరిపాలనలో 300 హత్యలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల హత్యలపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కర్నూలులోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. శాంతిభద్రతలు రాష్ట్రంలో ఏ విధంగా క్షీణించాయో గవర్నర్‌కు వివరించినట్లు చెప్పారు. పోలీసులు అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో పనిచేస్తున్నారని, అందుకే శాంతిభద్రతలు లోపిస్తున్నాయని మండిపడ్డారు. -
స్పెషల్ ఫోర్త్ ఎస్టేట్ విత్ గవర్నర్
-
సంచలనాలకు పోకూడదు...
-
గవర్నర్‌తో ఏపీ, తెలంగాణ ప్రతినిధుల భేటీ
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్‌తో ఏపీ, తెలంగాణ ప్రతినిధుల కమిటీ సమావేశం ముగిసింది. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్ పాల్గొనగా ఏపీ మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. చర్చలు సామరస్య పూర్వకంగా జరిగాయని, కోర్టులు, అధికారుల కంటే గవర్నర్ సమక్షంలో సమస్యలు పరిష్కరించుకోవడమే మంచిదనే అభిప్రాయంతో ఉన్నామని యనమల పేర్కొన్నారు. రెండుసార్లు హైదరాబాద్‌లో భేటీ అవుతామని, తర్వాతి సమావేశం అమరావతిలో ఉంటుందని చెప్పారు. తొమ్మిది, పదో షెడ్యూల్ సంస్థలు, ఉద్యోగుల సమస్యలు, హైకోర్టు విభజనతో పాటు అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించామని తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 9న మరోసారి సమావేశం కానున్నారు. -
లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న గవర్నర్
యాదాద్రి: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుక్రవారం యాదగిరి గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు పుర్ణకుంభంతో స్వాగతం పలికారు. అర్చకుల ఆశీర్వచనం అనంతరం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దే పనులను ఆయన పరిశీలించారు. -
రాజ్‌భవన్‌లో ఘనంగా వేడుకలు
హైదరాబాద్: రాజ్‌భవన్‌లో కొత్త సంవత్సరం వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న పలువురు ప్రముఖులు, ప్రజలు గవర్నర్ నరసింహన్ దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రజల సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు దేశానికి రోల్ మోడల్‌గా నిలువాలని ఆకాంక్షించారు. పరస్పర సహకారంతో అభివృద్ధి సాధించాలని సూచించారు. -
సాక్షాత్తు గవర్నర్ సంతకం ఫోర్జరీ!
హైదరాబాద్: సాక్షాత్తూ తెలుగు రాష్ట్రాల గవరర్ నరసింహన్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడో ప్రబుద్ధుడు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటు ఇప్పిస్తానంటూ మరంరాజు రాఘవరావు అనే వ్యక్తి పలువురిని మోసం చేశాడు. దీంతో సీఐడీ అధికారులు శనివారం అతన్ని అరెస్టు చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లు, రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సీట్లు మంజూరైనట్టు గవర్నర్ పేరిట ఫోర్జరీ సంతకాలతో అతను నకిలీ లేఖలు రాసినట్టు సీఐడీ గుర్తించింది. గతంలోనూ పలు మోసాలు చేసినట్టు రాఘవరావుపై చీటింగ్ కేసులు నమోదయ్యాయి. -
నృసింహుని సన్నిధిలో నరసింహన్
మంగళగిరి: రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మీ నృసింహస్వామి వారిని శుక్రవారం దర్శించుకున్నారు. ఆయనకు పాలకవర్గ సభ్యులు, ఆలయ ఈవో పానకాలరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
తాపేశ్వరం నుంచి బయల్దేరిన మహా లడ్డు
ఖైరతాబాద్: శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్న ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ నరసింహన్ దంపతులు సోమవారం ఉదయం 9.30 గంటలకు తొలి పూజ నిర్వహిస్తారని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు. అనంతరం సాధారణ భక్తులు దర్శనం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. తాపేశ్వరం నుంచి బయల్దేరిన ఖైరతాబాద్ లడ్డూ.. ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతికి తాపేశ్వరం సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు సమర్పిస్తున్న 500కిలోల లడ్డూ ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక వాహనంలో నగరానికి బయల్దేరింది. తాపేశ్వరంలో ప్రత్యేక పూజలు, ఊరేగింపు మధ్య బయల్దేరిన లడ్డూ ప్రసాదం సోమవారం గవర్నర్ తొలిపూజ అనంతరం మహాగణపతికి నైవేద్యంగా సమర్పించననున్నట్లు మల్లిబాబు తెలిపారు. -
గవర్నర్ దంపతుల పుష్కర స్నానం
-
గవర్నర్ దంపతుల పుష్కర స్నానం
విజయవాడ : ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు కృష్ణా పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించారు. సతీ సమేతంగా బుధవారం విజయవాడలోని పున్నమి ఘాట్‌కు చేరుకున్న గవర్నర్ పుష్కర స్నానం ఆచరించి కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గవర్నర్ దంపతులు దుర్గమ్మను దర్శించుకున్నారు. వారికి స్వాగతం పలికిన ఈవో సూర్యకుమారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కనక దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అందరికి తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానన్నారు. రెండు సంవత్సరాల్లో వరుసగా గోదావరి, కృష్ణా పుష్కరాల్లో పుణ్య స్నానం చేసే అవకాశం రావడం అదృష్టమన్నారు. పుష్కర ఏర్పాట్లు బాగున్నాయని కితాబిచ్చారు. -
'అర్హత లేకుండానే అందలమెక్కాడు.. దించండి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఇంచార్జీ కార్యదర్శిగా కొనసాగే అర్హత శాసన సభ డిప్యూటీ కార్యదర్శి కే సత్యనారాయణ రావుకు లేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. సత్యనారాయణ అవినీతి, అక్రమాలు, ఆర్థిక నేరాలతోపాటు ఆయన విద్యార్హతలను కూడా ప్రశ్నిస్తూ ఆయన రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు లేఖ రాశారు. ఓ పక్క అవినీతి అక్రమాలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటూ.. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతూ సరైన అర్హతలు లేకుండానే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఇంఛార్జీ సెక్రటరీగా కే సత్యనారాయణ రావు (ఆంధ్రప్రదేశ్ శాసన సభ డిప్యూటీ సెక్రటరీ) కొనసాగుతున్నారని రామకృష్ణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదికన కే సత్యనారాయణ రావును ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఇంఛార్జీ సెక్రటరీగా, డిప్యూటీ సెక్రటరీగా కొనసాగిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కే సత్యనారాయణరావు ఎన్నో అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని, చట్ట విరుద్ధంగా వ్యవహరించారని లేఖలో పేర్కొన్నారు. ఆయనపై ఇప్పటికే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఓ క్రిమినల్ కేసు కూడా ఉందని.. ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులకు శ్రీవెంకటేశ్వర కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి చెందిన భూముల విషయంలో అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డారని 2012లో కేసు నమోదైందని చెప్పారు. ఈ కేసులో సత్యనారాయణ ఏ 2గా ఉన్నారని చెప్పారు. అయితే, అరెస్టు నుంచి బయటపడేందుకు హైకోర్టుకు కూడా వెళ్లారని వివరించారు. ఈ కేసులో పోలీసులు చార్జీషీటు కూడా వేశారని, కానీ, ఈ కేసు కోర్టులో విచారణలో ఉండగానే అనూహ్యంగా ప్రభుత్వంలో అత్యున్నత పదవుల్లో కొనసాగుతున్నారని, ఆయన చేసిన అక్రమాల నుంచి తప్పించుకున్నారని ఆరోపించారు. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఎలా ఆ పదవుల్లో కొనసాగిస్తున్నారని, ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారని ప్రశ్నించారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి సత్యనారాయణరావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు తన ఆంధ్రప్రదేశ్ శాసన సభ కార్యదర్శిగా పనిచేసేందుకు ఉండాల్సిన అర్హతలు కూడా సత్యనారాయణరావుకు లేవని అన్నారు. ఈ పదవీ చేపట్టాలంటే కచ్చితంగా లా డిగ్రీ ఉండాలని.. కానీ అది ఆయనకు లేదని గుర్తు చేశారు. అందుకే తాను గతంలో ఆయన విద్యార్హతల గురించి పబ్లిక్ ఇన్పర్మేషన్ ఆఫీసర్ ద్వారా ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేసినా బదులు రాలేదని, ఆయనకు కూడా ఆ వివరాలు తెలపలేదని.. దీని ప్రకారం ఆయన డిప్యూటీ సెక్రటరీగా కొనసాగే అర్హతలు లేవనే విషయం తేటతెల్లమవుతుందని.. దీనిపై విచారణ జరిపించి ఆయన విద్యార్హతలు తేల్చాలని గవర్నర్ ను కోరారు. -
'ఆ అగ్గిలో బాబు బూడిదవడం ఖాయం'
-
'ఆ అగ్గిలో బాబు బూడిదవడం ఖాయం'
విజయవాడ: గవర్నర్ నరసింహన్ పై కాంగ్రెస్ పార్టీ నేత సీ రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటంలో గవర్నర్ విఫలమయ్యారని అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మెప్పుకోసమే గవర్నర్ పనిచేస్తున్నారని చెప్పారు. రాజధాని నిర్మాణం బాగుందని గవర్నర్ ఎలా సర్టిఫికెట్ ఇస్తారని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో రైతులు పడుతున్న బాధలు మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఫిరాయింపులపై గవర్నర్ ఎందుకు నోరు మెదపడం లేదని రామచంద్రయ్య ప్రశ్నించారు. బీసీలు, కాపుల మధ్య చంద్రబాబు అగ్గిపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆ అగ్గిలో చంద్రబాబు బూడిదవడం ఖాయం అని రామచంద్రయ్య అన్నారు. -
కరువుపై రేపు గవర్నర్ సమీక్ష
హైదరాబాద్: తెలంగాణలో కరువు, నీటి ఎద్దడిపై రేపు గవర్నర్ నరసింహన్ సమీక్ష నిర్వహించనున్నారు. రెవిన్యూ విపత్తు నిర్వహణశాఖల ఉన్నతాధికారులతో గవర్నర్ సమావేశం నిర్వహిస్తారు. కరువును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఏమేం చర్యలు తీసుకుంటుందనే అంశాలను గవర్నర్ సమీక్షలో తెలుసుకోనున్నారు. -
దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్
ఇంద్రకీలాద్రి: విజయవాడ కనకదుర్గమ్మను తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ బుధవారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి వచ్చిన ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేశారు. బుధవారం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో గవర్నర్ పాల్గొననున్నారు. -
'చెప్పుకున్నంత గొప్పగా లేదు'
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్ధేశించి గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగం చెప్పుకున్నంత గొప్పగా లేదని బీజేపీ శాసన సభాపక్ష నేత లక్ష్మణ్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో నే గవర్నర్ ప్రసంగంలో చదివి వినిపించారని ఆయన ఏద్దేవా చేశారు. ఆయన ప్రసంగంలో ఎక్కడా దళితులకు మూడెకరాల భూమి ప్రస్తావనే లేదని ఈ సందర్భంగా లక్ష్మణ్ తెలిపారు. -
'తెలంగాణ దూసుకెళుతోంది'
హైదరాబాద్: ఎన్నో ఆశల మధ్య తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని గవర్నర్ నరసింహన్ అన్నారు. గురువారం ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ సమావేశాల తొలిరోజున ఆయన ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు. 21 నెలలుగా ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేపట్టి అభివృద్ధి పథంలో దూసుకెళుతోందని అన్నారు. తాజాగా గోదావరి నదిపై ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్రతో తెలంగాణ చరిత్రాత్మక ఒప్పందం చేసుకుందని అన్నారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ముఖ్యంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ప్రాజెక్టులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. డబుల్ బెడ్ రూం, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ వంటి గొప్ప పథకాలు అమలు చేస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపట్ల జాతీయ స్థాయిలో కూడా ఆసక్తి చూపుతోందని అన్నారు. హైదరాబాద్‌లో 4 కొత్త సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుచేయడం జరుగుతుందన్నారు. శిశు మరణాల రేటు తగ్గింపునకు కృషి చేస్తోందని అన్నారు. ఇంకా ఏమన్నారంటే... 2026నాటికి రోజుకు ఇంటికి 100 లీటర్ల మంచి నీరు లక్ష్యం మిషన్ భగీరధకు అధిక ప్రాధాన్యం ఉంటుంది ప్రతి ఇంటికి నీటి కుళాయి ఏర్పాటు వ్యవసాయానికి రోజుకు 9గంటల ఉచిత విద్యుత్ కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే లక్ష్యం టీఎస్ ఐపాస్ తో రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు సింగిల్ విండోతో వేగంగా పరిశ్రమలకు అనుమతులు.. ఏర్పాటు కొత్త విద్యుత్ ప్రాజెక్టులకు భూసేకరణ పూర్తి గచ్చిబౌలిలో టీహబ్‌తో యువతకు లబ్ధి రాష్ట్రంలో 11.7శాతం వృద్ధి రేటు రాష్ట్ర ప్రజల ఆశలకు అనుగుణంగా బడ్జెట్ విద్యుత్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం ఇచ్చినట్లుగానే కాలేజీలకు కూడా టెక్స్ టైల్ హబ్ గా వరంగల్ అభివృద్ధి అన్ని జిల్లా కేంద్రాలకు నాలుగు లేన్ల రోడ్ల ఏర్పాటు షీ టీమ్స్ తో ఈవ్ టీజింగ్ కు కళ్లెం... మొత్తంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుంది. -
గాంధీ ఆస్పత్రిలో గవర్నర్ ఆకస్మిక తనిఖీలు
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి పనిచేస్తున్న తీరుపట్ల రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తీవ్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్ పేషెంట్ వార్డులో సౌకర్యాల లేమి ఉందని, ఎందుకు రోగులపట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ నరసింహన్ శుక్రవారం గాంధీ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం గాంధీ ఆస్పత్రికి వచ్చిన ఆయన ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్, అత్యవసర వార్డులో కలియతిరిగి అక్కడ రోగులకు అందుతున్న చికిత్సా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ కేవీ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సౌకర్యాలు లేమి గురించి మంత్రి లక్ష్మారెడ్డితో గవర్నర్ ఫోన్లో మాట్లాడారు. భవిష్యత్ లో కూడా ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు చేస్తానని ఆస్పత్రి సిబ్బందికి చెప్పారు. ఈ సమయంలో మీడియా ప్రతినిధులను లోపలికి అనుమతించలేదు. దీంతో ఆయన మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. -
సింహాద్రి అప్పన్న సేవలో గవర్నర్ దంపతులు
విశాఖపట్నం : రథసప్తమి వేడుకల సందర్భంగా గవర్నర్ నరసింహన్ దంపతులు ఆదివారం ఉదయం సింహాచలంలోని సింహాద్రి అప్పన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్ దంపతులకు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం లభించింది. అప్పన్నను దర్శించుకున్న అనంతరం వారు రథసప్తమి వేడుకల్లో పాల్గొన్నారు. -
విడిపోయిన కొద్ది రోజుల్లేనే రికార్డు వృద్ధి..
విజయవాడ: ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలమే ఈ వేడుక అని గణతంత్ర దినోత్సవ వేడుకలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ అన్నారు. మంగళవారం ఉదయం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈకార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ నేడు భారతీయులందరికీ గొప్ప పండుగ అని అభివర్ణించారు. తెలుగు భాష ఎంతో మధురమైనదని చెప్పారు. అనంతరం ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాలను వివరించారు. రాష్ట్ర విభజన జరిగిన 19 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రికార్డు వృద్ధిని సాధించిందని చెప్పారు. ఐదు నెలల్లో పట్టి సీమ పూర్తయిందని, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడమే ధ్యేయమని చెప్పారు. అన్ని రంగాల్లో సమీకృత అభివృద్ధి సాధించారని చెప్పారు. పంటసంజీవని పేరిట నీటి కుంటల పనులు ప్రారంభించినట్లు చెప్పారు. రాష్ట్రంలో రెండంకెల వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కరువు రహిత రాష్ట్రంగా ఏపీని మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. విశాఖ సీఐఐ సదస్సులో 4.7లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు కేంద్ర సంస్థలు స్థాపించినట్లు చెప్పారు. రాష్ట్రంలో పేద బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినట్లు చెప్పారు. -
టీఆర్ఎస్పై చర్యలు తీసుకోండి
అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది.. గవర్నర్‌కు టీటీడీపీ ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ చేస్తున్న అప్రజాస్వామిక, రాజ్యాంగ ఉల్లంఘనలపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ టీడీపీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కోరింది. అర్హులైన ఓటర్లను తొలగించడం మొదలుకొని ప్రచారం వరకు రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ టీఆర్ఎస్ వ్యవహరిస్తోందని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, ఎంపీ సీహెచ్.మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, రమేష్ రాథోడ్, ఎం.అరవింద్ కుమార్ గౌడ్, ఎం.అమరనాథ్ బాబు తదితరులు సోమవారం గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసి, ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరిగేలా చూడాలని కోరారు. ఎదురుతిరిగిన వారిపై దాడులు: ఆర్మూర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్‌రెడ్డిపై పోటీ చేసిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి తలారి సత్యం అనుమానాస్పద మరణంపై విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరారు. అలాగే గతంలో స్పీకర్ మధుసూదనాచారి అనుచరులు కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను బెదిరించారని, ఎమ్మెల్సీ సలీం శంషాబాద్ తహసీల్దార్‌ను బెదిరించడం, బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య, వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు, మంత్రి జగదీశ్‌రెడ్డిలు కూడా అధికారులను, విలేకరులను వేధించారని ఆరోపించారు. -
హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి
హైదరాబాద్: భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిదికోసం హైదరాబాద్ విచ్చేశారు. శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రణబ్‌కు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, మంత్రులు తదితరులు స్వాగతం పలికారు. ఈ నెల 31వరకు హైదరాబాద్‌లోనే రాష్ట్రపతి బస చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత చండీయాగానికి రాష్ట్రపతి హాజరు కానున్నారు. ఏపీ, కర్ణాటకలో జరిగే పలు కార్యక్రమాల్లో కూడా రాష్ట్రపతి పాల్గొంటారు. -
నేడు సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి రాక
హైదరాబాద్: శీతాకాలం విడిది నిమిత్తం భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు సాయంత్రం 5గంటలకు హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ హకీంపేట విమానాశ్రయంలో ప్రణబ్ కు స్వాగతం పలకనున్నారు. ఈ నెల 31వరకు హైదరాబాద్‌లోనే రాష్ట్రపతి బస చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న ఆయుత చండీయాగానికి కూడా రాష్ట్రపతి హాజరు కానున్నారు. ఏపీ, కర్ణాటకలో జరిగే పలు కార్యక్రమాల్లో కూడా రాష్ట్రపతి పాల్గొంటారు. -
గవర్నర్ తో కేసీఆర్ భేటీ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఆయుత చండీయాగంపై ఆయన గవర్నర్ తో చర్చించారు. డిసెంబర్ లో జరిగే చండీయాగానికి రావాలని ముఖ్యమంత్రి గవర్నర్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలు రాజకీయ పరమైన అంశాలపై కూడా వారి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. -
గ్రామజ్యోతికి గవర్నర్ అభినందన
24న మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటన రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను ఆహ్వానించిన మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘గ్రామజ్యోతి’ కార్యక్రమాన్ని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అభినందించారు. తాను సైతం గ్రామజ్యోతిలో పాల్గొనేందుకు వస్తానని.. గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుంటానని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావుకు మాటిచ్చారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలంలోని హజీపేట, కిషన్‌నగర్ గ్రామాల్లో పర్యటించేందుకు ఆయన అంగీకరించారు. శుక్రవారం ఉదయం మంత్రి కేటీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలుసుకున్నారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొనేందుకు రావాలని గవర్నర్‌ను ఆహ్వానించారు. గ్రామాల్లో సమూల మార్పులు తెచ్చి సమగ్రాభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని మంత్రి వివరించారు. పారిశుద్ధ్య, తాగునీరు, విద్య, వైద్యం వంటి ప్రజల కనీస అవసరాలతో పాటు మౌలిక వసతులు, సహజ వనరుల నిర్వహణ వంటి కీలకమైన ఏడు అంశాల్లో అభివృద్ధికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు గవర్నర్‌కు చెప్పారు. కాగా, నాలుగు రోజులుగా గ్రామజ్యోతి గురించి తెలుసుకుంటున్నానని చెప్పిన గవర్నర్, ఈ కార్యక్రమాన్ని అభినందించారు. అలాగే సెప్టెంబర్ 7న హైదరాబాద్‌లో జరగనున్న టీ-హబ్ ప్రారంభోత్సవానికి కూడా రావాల్సిందిగా గవర్నర్ నరసింహన్‌ను మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. మంత్రితోపాటు గవర్నర్‌ను కలసిన వారిలో ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, టీ-హబ్ డెరైక్టర్లు ఉన్నారు. -
బాబు ఆటంకాలు సృష్టిస్తున్నారు : కేసీఆర్
-
'గవర్నర్‌కు అన్ని అధికారాలున్నాయి'
న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ఈ కేసు విషయంలో గవర్నర్ నరసింహన్‌కు కీలక సూచనలు ఇచ్చారు. ఈ కేసును నరసింహన్ స్వయంగా పరిశీలించవొచ్చని, పర్యవేక్షించవచ్చని సూచించారు. విభజనం చట్టం సెక్షన్ 8 ప్రకారం గవర్నర్‌కు ఈ అధికారం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి రాజధానిలో రెండు రాష్ట్రాల పోలీసులకు కూడా అధికారాలు ఉన్నాయనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు. శాంతిభద్రతలపై రెండు రాష్ట్రాల పోలీసులను పిలిపించే అధికారం గవర్నర్‌కు ఉందని ఆయన ఓ జాతీయ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. -
తిరుమలకి వీఐపిల తాకిడి
-
గవర్నర్‌ను కలసిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, గవర్నర్ నరసింహన్‌ను కోరారు. బుధవారం సాయంత్రం ఆయన రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఈనెల 16వ తేదీ నుంచి చేపట్టనున్న ఈ కార్యక్రమానికి గవర్నర్‌ను సీఎం ఆహ్వానించారు. కాగా, గురువారం స్వచ్ఛ హైదరాబాద్‌పై నగరంలోని ప్రజాప్రతినిధులతో సీఎం సమావేశమవనున్నారు. -
గవర్నర్ విమానాన్ని వెనక్కి రప్పించారు..
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రయాణిస్తున్న విమానాన్ని వెనక్కి రప్పించటం విమర్శలకు దారి తీస్తోంది. ప్రయాణికుల లగేజ్ లోడ్ చేయటంలో శంషాబాద్ విమానాశ్రయ సిబ్బంది నిర్లక్ష్యం వ్యవహరించిన తీరు వివాదానికి తెరలేపింది. వివరాలు.. గవర్నర్ నరసింహన్ మూడురోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ బయల్దేరారు. అయితే విమానం అరగంట ప్రయాణించిన అనంతరం ప్రయాణికుల లగేజ్ లోడ్ చేయలేదని.. వెనక్కి రావాల్సిందిగా పైలట్‌కు సమాచారం అందటంతో మళ్లీ శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. లగేజ్ లోడ్ అయిన అరగంట తర్వాత విమానం ఢిల్లీ బయల్దేరింది. అయితే గవర్నర్ ప్రయాణిస్తున్న విమానాన్ని వెనక్కి రప్పించటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా విచారణకు ఆదేశించింది. మరోవైపు తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఈ సంఘటనపై ఆరా తీస్తున్నారు. -
జర్నలిస్టుల కోసం 'విధి నా సారధి'
హైదరాబాద్: మాజీ సంపాదకుడు పొత్తూరి వెంకటేశ్వరరావు రచించిన తన స్వీయ చరిత్ర 'విధి నా సారధి' పుస్తకం శుక్రవారం పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించారు. ఈ పుస్తకం పత్రికా విలేకరులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. వార్తలు సెన్సేషనల్‌గా ఉండకుండా ప్రజల సమస్యలు తీర్చేలా ఉండాలని చెప్పారు. మీడియాను తప్పుపట్టడం తన ఉద్దేశం కాదని, ప్రజలకు మంచి వార్తలు అందించాలనే తాను ఈ విషయం చెప్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా పాల్గొన్నారు. -
కార్పోరేట్ వైద్యం అందరికీ అందాలి: గవర్నర్
హైదరాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందడం లేదని గవర్నర్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. కార్పోరేట్ ఆసుప్రతులు మెట్రో నగరాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా తమ వైద్యసేవలను అందించాలని ఆయన బుధవారమిక్కడ అన్నారు. కార్పోరేట్ వైద్యం అన్నివర్గాల వారికి అందేలా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నరసింహన్ సూచించారు. ఇరవై వేల కార్నియా మార్పిడిలతో రికార్డు సృష్టించిన ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన బృందాన్ని గవర్నర్ సన్మానించారు. కంటికి చికిత్స చేసి చూపునివ్వడం అంటే ప్రపంచానికి వెలుగునివ్వటమే అని ఆయన అన్నారు.