సాక్షాత్తు గవర్నర్‌ సంతకం ఫోర్జరీ! | one person arrested over governer forgery signature | Sakshi
Sakshi News home page

సాక్షాత్తు గవర్నర్‌ సంతకం ఫోర్జరీ!

Published Sat, Dec 17 2016 7:06 PM | Last Updated on Wed, Oct 3 2018 6:52 PM

సాక్షాత్తు గవర్నర్‌ సంతకం ఫోర్జరీ! - Sakshi

సాక్షాత్తు గవర్నర్‌ సంతకం ఫోర్జరీ!

హైదరాబాద్‌: సాక్షాత్తూ తెలుగు రాష్ట్రాల గవరర్‌ నరసింహన్‌ సంతకాన్ని ఫోర్జరీ చేశాడో ప్రబుద్ధుడు. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ సీటు ఇప్పిస్తానంటూ మరంరాజు రాఘవరావు అనే వ్యక్తి పలువురిని మోసం చేశాడు. దీంతో సీఐడీ అధికారులు శనివారం అతన్ని అరెస్టు చేశారు.

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లు, రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సీట్లు మంజూరైనట్టు గవర్నర్‌ పేరిట ఫోర్జరీ సంతకాలతో అతను నకిలీ లేఖలు రాసినట్టు సీఐడీ గుర్తించింది. గతంలోనూ పలు మోసాలు చేసినట్టు రాఘవరావుపై చీటింగ్‌ కేసులు నమోదయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement