
రాజ్‌భవన్‌లో ఘనంగా వేడుకలు
హైదరాబాద్: రాజ్‌భవన్‌లో కొత్త సంవత్సరం వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న పలువురు ప్రముఖులు, ప్రజలు గవర్నర్ నరసింహన్ దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రజల సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు దేశానికి రోల్ మోడల్‌గా నిలువాలని ఆకాంక్షించారు. పరస్పర సహకారంతో అభివృద్ధి సాధించాలని సూచించారు.