rajbhavan
-
మమతా బెనర్జీ ‘నాట్ మై కప్ ఆఫ్ టీ’.. గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీని వ్యక్తి గతంగా గౌరవిస్తానని, ఆమెతో వృత్తి పరమైన సంబంధాలు ఉన్నాయని, అయితే రాజకీయవేత్త మమతా బెనర్జీ.. నాట్ మై కప్ ఆఫ్ టీ’ అని అన్నారు.మమతా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఆనంద బోస్ వ్యతిరేకిస్తున్నారు. ఈ తరుణంలో ఢిల్లీలో జరిగిన గవర్నర్ల సమావేశం అనంతరం పీటీఐతో జరిపిన ఇంటర్వ్యూలో గవర్నర్ ఆనంద్ బోస్ మాట్లాడారు. మమతా బెనర్జీతో ఉన్న సంబంధాల గురించి అడిగిన ప్రశ్నకు ఆనంద్ బోస్ మాట్లాడారు.మీరు ఏ మమతా బెనర్జీ గురించి అడుగుతున్నారు. నా ముందు ముగ్గురు మమతా బెనర్జీలు ఉన్నారు. ఒకరు వ్యక్తి మమతా బెనర్జీ..ఆమెతో నాకు మంచి అనుబంధం ఉంది. రెండవ వ్యక్తి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..ఆమెతో నాకు వృత్తిపరమైన సంబంధాలు ఉన్నాయి. మూడవ వ్యక్తి రాజకీయ నాయకురాలు మమతా బెనర్జీ నాట్ మై కప్ ఆఫ్ టీ అని వ్యాఖ్యానించారు.వరుస వివాదాలుగత కొంతకాలంగా సీఎం మమతకు..గవర్నర్ ఆనందబోస్ మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. ప్రభుత్వం పంపిన బిల్లుల్ని గవర్నర్ ఆమోదించడం లేదని మమతా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతోపాటు రాజ్ భవన్లో ఆనందబోస్ ఓ మహిళాతో అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు గుప్పించింది. ఈ వరుస పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆనందబోస్ పశ్చిమబెంగాల్ ప్రభుత్వంపై కోల్‌కతా హైకోర్టులో దావా వేశారు. విచారణ చేపట్టిన కోర్టు హైకోర్టు ఆగష్టు 14 వరకు మధ్యంతర ఉత్తర్వులో గవర్నర్‌కు వ్యతిరేకంగా ఎటువంటి పరువు నష్టం కలిగించే లేదా తప్పుడు ప్రకటన చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. STORY | Concept of passive governor is gone: West Bengal Governor CV Anand BoseREAD: https://t.co/GNKBobRarN pic.twitter.com/niOE5dO3D4— Press Trust of India (@PTI_News) August 4, 2024 -
రాజ్‌భవన్‌కు ప్రగతిభవన్ చాలా దగ్గరగా ఉందన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై.. ఇంకా ఇతర అప్డేట్స్
-
తెలంగాణ: రాజ్‌భవన్‌కు వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: వైఎస్ఆర్టీపీ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. రేపు(గురువారం) రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. గవర్నర్ తమిళిసై తమిళిసై సౌందరరాజన్‌ను ఆమె భేటీ కానున్నారు. ఈ మేరకు అపాయింట్మెంట్ ఖరారు అయినట్లు సమాచారం. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై వైఎస్ షర్మిల.. గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. అక్రమంగా తనను అదుపులోకి తీసుకున్నారని, ఆ టైంలో వ్యవహరించిన తీరును ఆమె గవర్నర్‌కు వివరించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అరెస్టుపై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ఆమె కారులో ఉండగానే.. లాక్కుంటూ వెళ్లిన దృశ్యాలు కలవరపెట్టాయని ఆమె ట్వీట్లో పేర్కొన్నారు. వైఎస్ఆర్టీపీ చీఫ్, మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె శ్రీమతి వైఎస్ షర్మిల అరెస్టుపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె కారు లోపల ఉన్నప్పుడు ఆ కారును దూరంగా లాగుతున్న దృశ్యాలు కలవరపెట్టాయి.@realyssharmila @PMOIndia @TelanganaDGP — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) November 30, 2022 -
నా ఫోన్లూ ట్యాపింగ్.. తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ‘‘నా వద్ద ఏడీసీగా పనిచేసిన తుషార్ భాసన్ పేరును, రాజ్‌భవన్‌ను ‘టీఆర్ఎస్ న్యూస్’ అనే అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలోకి లాగారు. అందులో రాజ్‌భవన్ పాలుపంచుకుందని ఆరోపణలు చేశారు. నా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు. తుషార్ కొద్దిరోజుల కింద హైదరాబాద్‌కు వచ్చి నన్ను కలవాలని రెండు మూడు రోజులు కాల్ చేశారు. ఇలా నాకు ఎవరెవరు కాల్ చేస్తున్నారో వాళ్లు (రాష్ట్ర ప్రభుత్వం) కనుక్కున్నారు. నా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక పరిస్థితులు నెలకొని ఉన్నాయి’’ అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన ఆరోపణలు చేశారు. రాజ్‌భవన్ పారదర్శకమైన కార్యాలయమని, తాను అలాంటి కార్యకలాపాల్లో పాల్గొనలేదని స్పష్టం చేశారు. కావాలంటే తన ఫోన్ ఇచ్చేస్తానని, చూసుకోవచ్చని.. అంతా పారదర్శకంగా వ్యవహరిస్తానని పేర్కొన్నారు. బుధవారం గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు గవర్నర్ మాటల్లోనే.. ‘‘బిల్లులను ఆమోదించడానికి ఎలాంటి టైం లిమిట్ లేదు. ఆమోదించే వ్యక్తులకు వాటిని మదింపు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. నాకు అవసరమైనంత సమయాన్ని తీసుకుంటాను. నేను బిల్లులపై కూర్చున్నానని, సూపర్ పవర్ అని తప్పుడు ప్రచారాలు చేశారు. ఆరు బిల్లులు పంపించారు. ఒకదాని తర్వాత ఒక బిల్లును పరిశీలిస్తున్నా. నేను నియామకాల ప్రక్రియకు అడ్డంకిగా మారినట్టు తప్పుడు ప్రచారం చేశారు. కేవలం ఒకే నెల అయింది. బిల్లులను మదించడానికి నాకు సమయం వద్దా? బిల్లు పంపించి సింపుల్‌గా ఆమోదించేయాలంటే కుదరదు. వివరాలు కావాలి. వర్సిటీలకు చాన్స్‌లర్‌గా నాకు అన్ని హక్కులు ఉన్నాయి. రిక్రూట్మెంట్ బోర్డుకు సరైన వ్యక్తి ఉండాలి కదా. నా ఒత్తిడితోనే ప్రభుత్వంలో కదలిక గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు నుంచే వర్సిటీల్లో బోధన, బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని కోరుతూనే ఉన్నాను. వీసీలందరితో మాట్లాడి వర్సిటీల పరిస్థితులపై ప్రభుత్వానికి పెద్ద రిపోర్టు కూడా పంపాను. ఆ రిపోర్టు ప్రధాన ఎజెండా పోస్టుల భర్తీయే. నేను పదేపదే ఒత్తిడి చేయడంతోనే ఎనిమిదేళ్లు ఖాళీగా ఉన్న 13 వర్సిటీల వీసీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది స్పష్టత మాత్రమే కోరాను వర్సిటీల్లో నియామకాలకు ఇప్పటికే ఒక విధానం ఉండగా కొత్త బోర్డు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? ఎలా ఏర్పాటు చేస్తారు, ఏ పద్ధతిని అనుసరిస్తారు?దీనికి చట్టబద్ధత ఉంటుందా? యూజీసీ ఒప్పుకుంటుందా? చైర్మన్‌గా ఎవరిని నియమిస్తారు? ఏం ప్రొటోకాల్‌ను పాటిస్తారు? ఏటా నియామకాలు చేస్తారా? యూనివర్సిటీ కేంద్రంగా నియామకాలుంటాయా? అన్ని వర్సిటీలను కలిపి కేంద్రీకృతంగా నియామకాలు చేపడతారా? వీటిపై స్పష్టత రావాలి. ఒకవేళ న్యాయపరమైన చిక్కులొస్తే బోధన, బోధనేతర సిబ్బంది లేక విద్యార్థులు ఇబ్బందిపడతారు. సత్వర నియామకాల కోసమే బోర్డు అని మీరు అంటున్నారు. బోర్డు ఏర్పాటుకు చాలా సమయం పడుతుంది. పారదర్శకంగా నియామకాలు జరగాలి. పక్షపాతం వల్ల అర్హులైన విద్యావేత్తలు నష్టపోరాదు. అందుకే బిల్లు విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత కోరాను. ఆరేడు నెలలుగా బిల్లులు ఆపినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కేవలం ఒక నెల, ఆపై కొన్ని రోజులు మాత్రమే అయింది. రోజూ అనుమానాల నివృత్తి కోసం కొంత సమయం గడుపుతున్నాను. ప్రత్యేక బోర్డులు కలిగిన రాష్ట్రాలను సంప్రదిస్తే.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కిందే అవి పనిచేస్తున్నట్టు తెలిసింది. ప్రజాప్రయోజనాల రీత్యానే స్పష్టత కోరుతూ మంత్రికి లేఖ రాశాను. ఇలాగైతే ప్రగతిభవన్‌కు ప్రజల గొంతు చేరుతుందా? నేను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నానని, లేఖ అందలేదని మంత్రి (సబితా ఇంద్రారెడ్డి) అనడం ఆశ్చర్యం కలిగించింది. సీఎం నుంచి లేఖ మంత్రికి చేరడానికి, రాజ్‌భవన్ నుంచి గవర్నర్ గొంతు మంత్రికి చేరడానికే ఇంత జాప్యం జరిగితే.. ప్రజల గొంతు ప్రగతిభవన్‌కు ఎలా చేరుతుంది? గవర్నర్ లేఖ రాశారా, లేదా? అని మంత్రి తెలుసుకుని ఉండాల్సింది. వాస్తవం తెలుసుకోకుండా రాజ్‌భవన్‌ను అప్రతిష్టపాలు చేయాలనుకుంటున్నారు. బిల్లుపై స్పష్టత కోసమే మంత్రిని రమ్మన్నాను. అగ్నివీర్ పథకంపై సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆందోళన చేస్తున్న వారిని రాజ్‌భవన్ ఎదుట ఆందోళన చేయాలంటూ (టీఆర్ఎస్) అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి పిలుపునివ్వడాన్ని గుర్తుంచుకోవాలి. ముందు ప్రభుత్వ వర్సిటీలను పట్టించుకోండి ప్రభుత్వ వర్సిటీల్లో మెస్‌లు, హాస్టళ్లు దుర్భరంగా ఉన్నాయి. బెడ్లు, టేబుళ్లు. ట్యూ బ్లైట్లు లేవు. పారిశుధ్యం లేదు. కలుషిత ఆహారం నిత్యకృత్యమైంది. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు వర్సిటీలను అభివృద్ధి చేసేందుకు బిల్లు తెస్తారా? వాటి సంఖ్యను పెంచాలనుకుంటారా? ఎందుకు? విద్య వ్యాపారం కాదని సుప్రీంకోర్టు అన్నది. ముందు ప్రభు త్వ వర్సిటీల దుస్థితిని పట్టించుకోండి. ఆ తర్వాత ప్రైవేటు బిల్లు గురించి ఆలోచిద్దాం. గవర్నర్లే వీసీలుగా ఉండాలి వర్సిటీల చాన్స్లర్లుగా గవర్నర్లే ఉండాలి. వారిని తొలగించి సీఎంలను నియమించడంపై విస్తృత చర్చ జరగాలి. సెక్యులరిజంపై వ్యాఖ్యలు చేసినంత మాత్రాన తమిళనాడు గవర్నర్‌ను భర్తరఫ్ చేయాలని అక్కడి ప్రభు త్వం కేంద్రానికి లేఖ రాయాల్సిన అవసరం లేదు’ అని తమిళిసై స్పష్టం చేశారు. తెలుగు ప్రజల గురించి అలా అనలేదు తమిళనాడులో తెలుగు ప్రజలు ఆధిపత్యం చెలాయిస్తున్నారని తాను చెప్పలేదని, తన మాటలను వక్రీకరించారని ఓ ప్రశ్నకు గవర్నర్ తమిళిసై బదులిచ్చారు. తాను కేవలం మాతృభాష గురించి మాట్లాడానని వివరించారు. ఇక ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా నిరసనలు తెలపాలంటూ పలువురు పిలుపునివ్వడంపై గవర్నర్ స్పందించారు. ప్రధాని పర్యటనతో రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు వస్తాయని, దీనిని సానుకూల దృక్పథంతో చూడాలని సూచించారు. అందుకే ఖైదీల క్షమాభిక్షను తిరస్కరించా.. కేంద్ర హోంశాఖ నిబంధనలను పాటించకపోవడంతోనే ఖైదీల క్షమాభిక్ష ప్రతిపాదనలను తిరస్కరించినట్టు గవ ర్నర్ స్పష్టం చేశారు. జీవిత ఖైదీలను వెంటనే విడుదల చేయడం కుదరదని.. క్షణికావేశంలో నేరాలు చేసిన వారికే క్షమాభిక్ష వర్తిస్తుందని పేర్కొన్నారు. చదవండి: మంత్రి గంగులపై ఫిర్యాదు చేసింది నేనే -
తెలంగాణ రాజ్ భవన్ లో బతుకమ్మ సంబరాలు
-
రాజ్‌భవన్.. నివురుగప్పిన నిప్పు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తనపై వివక్ష చూపుతోందంటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వంపై నేరుగా ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు గవర్నర్ల పాత్ర, ప్రభుత్వాలతో సంబంధాలకు సంబంధించిన అంశాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. నిజానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తమిళిసై స్థాయిలో బహిరంగంగా విమర్శలు చేసిన, ఆవేదన వ్యక్తం చేసిన గవర్నర్ మరొకరు లేరు. నాడు రామ్‌లాల్ నుంచి.. ఉమ్మడి ఏపీ, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటివరకు పనిచేసిన గవర్నర్లలో అత్యంత వివాదాస్పదుడిగా రామ్‌లాల్ పేరును చెబుతుంటారు. ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా రద్దు చేసిన గవర్నర్‌గా ఆయన చరిత్రకెక్కారు. తర్వాత కుముద్‌బెన్ జోషి గవర్నర్‌గా ఉన్నప్పుడూ నాటి ఎన్టీఆర్ ప్రభుత్వంతో పలు విషయాల్లో విభేదించి వార్తల్లో నిలిచారు. రాజ్‌భవన్‌లో జోగినులకు వివాహం జరిపించి సంచలనం సృష్టించారు. కొంతకాలం నాటి సీఎం ఎన్టీఆర్‌తో కుముద్‌బెన్ కోల్డ్‌వార్ సాగింది. నరసింహన్ హయాంలో.. ఉమ్మడి ఏపీ గవర్నర్‌గా నరసింహన్ పనిచేసిన కాలంలో పలుమార్లు రాజ్‌భవన్‌కు, ప్రభుత్వానికి మధ్య విభేదాలు వచ్చాయి. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న ఆ సమయంలో నరసింహన్ కొంత కఠినంగా వ్యవహరించారు. ఇక్కడి పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు పంపించారు. ఆయన హయాంలోనే రాష్ట్ర విభజన జరగడంతో.. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల బాధ్యతలను కొంతకాలం చూసుకున్నారు. ఈ సమయంలో హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై వివాదం తలెత్తినప్పుడు.. సెక్షన్–8 ప్రయోగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇక తెలంగాణ ప్రభుత్వం ఆమోదం కోసం పంపించిన మున్సిపల్ చట్టంపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తిప్పి పంపారు. మార్పులు చేసి తీసుకెళితే ఆమోదించారు. ప్రస్తుత గవర్నర్ తమిళిసై కూడా.. ప్రభుత్వం పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తే, ఆయనకు తగిన అర్హతలు లేవంటూ తిప్పిపంపారు. మరోవైపు పశ్చిమబెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర (ఉద్ధవ్‌ఠాక్రే సీఎంగా ఉండగా), కేరళ రాష్ట్రాల గవర్నర్లు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా పలు అంశాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో విభేదించి వివాదాస్పదులుగా నిలిచారు. ఇదీ చదవండి: గవర్నర్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రుల ఆగ్రహం.. -
హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణస్వీకారం చేశారు. మంగళవారం ఉదయం 10.15 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు కార్యక్రమానికి హాజరై నూతన సీజేకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటివరకు సీజేగా బాధ్యతలు నిర్వహించిన జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయిన విషయం తెలిసిందే. తదుపరి సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేరును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం మే 17న సిఫారసు చేయగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇటీవల ఆమోదించారు. ఈ మేరకు ఆయన నియామకాన్ని ప్రకటిస్తూ గత వారం కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. అసోంకు చెందిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ 2011 అక్టోబర్ 17న గువాహటి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013లో పూర్తిస్థాయి న్యాయమూర్తి అయ్యారు. 2021 అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు 8 నెలల తర్వాత తెలంగాణ హైకోర్టు ఐదో ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్, సీఎం..చిరునవ్వులు, ముచ్చట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు 8 నెలల విరామం తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్లడం రాజకీయంగా ప్రాధా న్యత సంతరించు కుంది. గవర్నర్‌తో విభేదాల నేపథ్యంలో సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేసీఆర్ వెళ్తారా..? లేదా అన్న అంశం చర్చనీ యాంశమైన సంగతి తెలిసిందే. ఆ చర్చకు తెరదించుతూ సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్ తమిళిసైని ఆప్యాయంగా పలకరించి పూలబొకే అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్, సీఎంలు పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొద్దిసేపు క్లుప్తంగా సంభాషించారు. ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాజ్‌భవన్‌లో గవర్నర్, ముఖ్యమంత్రి సుహృద్భావ వాతావరణంలో మాట్లాడుకున్నారని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. చివరిసారిగా జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు తమిళిసైతో సీఎం భేటీ కాలేదు. గవర్నర్ తన అధికార పరిధిని అతిక్రమించి పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని, రాజ్‌భవన్‌ను బీజేపీ కార్యకలా పాలకు అడ్డాగా మార్చారని రాష్ట్ర మంత్రులు గతంలో బహిరంగంగా ఆరోపణలు చేశారు. ఇందుకు ప్రతిగా.. రాష్ట్ర ప్రభుత్వం తనకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదని, మహిళ అని చిన్నచూపు చూస్తోందని గవర్నర్ తమిళిసై విమర్శించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీగా కౌశిక్‌రెడ్డి పేరును సిఫారసు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై ఆమోదిం చకుండా పక్కన పెట్టడం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగాన్ని ప్రభుత్వం రద్దు చేయడం, గవర్నర్ జిల్లా పర్యటనల సమయంలో కలెక్టర్లు, ఎస్పీలు హాజరుకాకపోవడం, గవర్నర్ ప్రజాదర్బార్ నిర్వహించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. -
ఏఐసీసీ గేట్లు బద్ధలు కొట్టిన పోలీసులు!.. కాంగ్రెస్ ఆగ్రహం
ఢిల్లీ: ఢిల్లీ పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఈడీ విచారణ నేపథ్యంలో.. కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే.. కాంగ్రెస్ కార్యకర్తలను ఏఐసీసీ కార్యాలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం, ఆపై కార్యాలయంలోనే కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బుధవారం నిరసనలు కొనసాగుతున్న సమయంలో.. అక్బర్‌రోడ్డు వద్ద ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ముందు ఢిల్లీ పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. ఒకానొక టైంలో ఏఐసీసీ గేట్లు బద్ధలు కొట్టి పోలీసులు కార్యాయంలోకి వచ్చి, తమ నేతలను అరెస్ట్ చేసినట్లు కాంగ్రెస్ ఆరోపణలకు దిగింది. ఈ పరిణామంపై పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా తీవ్రంగా స్పందించారు. అసలు పార్టీ కార్యాలయంలోకి పోలీసులు ఎలా వస్తారని నిలదీశారు. పోలీసులు గుండాల్లా ప్రవర్తించారని మండిపడ్డారాయన. #WATCH Congress leader Sachin Pilot detained by police amid protests by party workers over the questioning of Rahul Gandhi by the Enforcement Directorate in the National Herald case#Delhi pic.twitter.com/smlKTJ62hS — ANI (@ANI) June 15, 2022 కాంగ్రెస్ ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఏఐసీసీ కార్యాలయం దగ్గర చాలా మంది వ్యక్తులు పోలీసులపై బారికేడ్లు విసిరారు. కాబట్టి గొడవ జరిగి ఉండవచ్చు. అంతేగానీ పోలీసులు ఏఐసీసీ కార్యాలయంలోకి వెళ్లి లాఠీఛార్జ్ చేయలేదు. పోలీసులు ఎలాంటి బలప్రయోగం చేయడం లేదు. మాతో సమన్వయం చేసుకోవాలని వారికి విజ్ఞప్తి చేస్తాం అని ఎస్పీ హుడా, స్పెషల్ సీపీ (ఎల్‌అండ్‌ఓ) తెలిపారు. మరోవైపు ఈడీ కార్యాలయం వద్ద టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. #WATCH | Delhi: Many people threw barricades at police near AICC office, so there might've been a scrimmage. But police didn't go inside the AICC office & use lathi charge. Police are not using any force. We will appeal to them to coordinate with us...: SP Hooda, Special CP (L&O) pic.twitter.com/umkUd7pAzz — ANI (@ANI) June 15, 2022 ఇదిలా ఉంటే.. ఏఐసీసీ కార్యాలయం వద్ద జరిగిన పరిణామంపై కాంగ్రెస్ నిరసనలకు పిలుపు ఇచ్చింది. గురువారం రాజ్భవన్ల ముట్టడికి ఏఐసీసీ పిలుపు ఇచ్చింది. ఈ పిలుపులో భాగంగా.. తెలంగాణలో రాజ్‌భవన్ ఎదుట కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేపట్టనున్నాయి. రాహుల్‌పై కేంద్రం కక్ష సాధింపు చర్యకు పాల్పడుతోందని తెలంగాణ కాంగ్రెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. -
ముదిరిన పంచాయితీ..
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు రాష్ట్ర ప్రభుత్వానికి నడుమ సాగుతున్న ‘పంచాయితీ’ ముదిరి పాకాన పడింది. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వతీరు, టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై గవర్నర్ తీవ్రం గా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం తనను గౌరవించడం లేదని, రాజ్యాంగబద్ధంగా పనిచేయడం లేదనే రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఇందుకు ప్రతిగా కొందరు రాష్ట్ర మంత్రులు కూడా అదే స్థాయిలో స్పందిస్తున్నారు. రాజ్‌భవన్ బీజేపీ పార్టీ కార్యాలయంలా మారిందని విమర్శలు గుప్పిస్తున్నారు. మోదీ, అమిత్ షాతో భేటీపై ఆసక్తి రాష్ట్ర ప్రభుత్వం తన పట్ల అనుసరిస్తున్న తీరుపై తమిళిసై గతంలోనే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడంతోపాటు రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకల సందర్భంగా.. తాను శక్తిమంతురాలినని, బలవంతంగా ఎవరూ తన తలవంచలేరంటూ స్వ రం పెంచారు. అదే సమయంలో సీఎం, మంత్రులతో చర్చకు సిద్ధమని, ఎవరికైనా రాజ్‌భవన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని కూడా అన్నారు. తాజాగా రెండు రోజులు ఢిల్లీలో మకాం వేసి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా ను కలవడం ద్వారా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేపారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడం మొదలు మండలి ప్రొటెమ్ చైర్మన్ నియామకం, బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడం, మేడారం జాతర, యాదగిరిగుట్ట పర్యటనలో ప్రొటోకాల్‌కు తిలోదకాలివ్వడం తదితర అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. వీటిపై ఫిర్యాదులతోపాటు ప్రభుత్వ పా లన వైఫల్యాలు, శాంతిభద్రతలు, డ్రగ్స్, అవినీతి వంటి అం శాలపై గవర్నర్ నివేదిక సమర్పించినట్లు తెలిసింది. మీకే కాదు..మాకూ అవమానమే! రాష్ట్రంలో తనకు ఎదురైన అవమానాల గురించి కేంద్ర పెద్దలకు గవర్నర్ వివరించగా.. ‘ఈ అవమానం మీకే కాదు.. మాకూ జరిగినట్టు భావిస్తున్నాం’ అని వారు బదులిచ్చారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరిగేలా రోడ్డు, రైలు మార్గాల్లో రాష్ట్రం నలుమూలలా పర్యటించేందుకు గవర్నర్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు, విజ్ఞాపనలను స్వీకరించడానికి వచ్చే నెల నుంచి రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ వివాదం రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. (చదవండి: బీజేపీ బెటాలియన్ ఏదైనా నాతో యాదాద్రికి వచ్చిందా?) -
సీఎం కేసీఆర్ సారొస్తారొస్తారా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉగాది రాజకీయాలు రంజుగా మారాయి. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు రాజ్‌భవన్‌లో ముందస్తు ఉగాది వేడుకలను తలపెట్టిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ఆహ్వానించడం ఆసక్తి రేపుతోంది. సీఎంతోపాటు రాష్ట్ర మంత్రులు, విపక్షాల ముఖ్య నేతలు, ఇతర రంగాల ప్రముఖులకు కూడా రాజ్‌భవన్ నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. అయితే విభేదాల కారణంగా చాలా కాలంగా రాజ్‌భవన్ గడప తొక్కని సీఎం కేసీఆర్.. ఇప్పుడు గవర్నర్ ఆహ్వా నం మేరకు వెళతారా, లేదా అన్నదానిపై చర్చ జరుగుతోంది. ‘నూతన సంవత్సరం సందర్భంగా పాత చేదు జ్ఞాపకాలను మరిచి కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలని పెద్దలు అంటుంటా రని.. పరస్పరం ఆరోపణలు చేసుకునే స్థాయికి వెళ్లిన గవర్నర్, సీఎం మధ్య విభేదాలు ఉగాదితో సమసిపోతాయా?, కొనసాగుతాయా? అన్నది శుక్రవారం తేలిపోతుంద’ని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రాజ్‌భవన్ ఉత్సవాలకు వచ్చే అవకాశం ఉంది. ఇలా ఒకరిపై ఒకరు నిత్యం విమర్శలు చేసుకునే నేతలంతా ఎదురుపడే నేపథ్యంలో మరింత ఆసక్తి నెలకొంది. మరోవైపు సీఎం కేసీఆర్ శనివారం ప్రత్యేకంగా ప్రగతిభవన్‌లోని జనహితలో ఉగాది వేడుకలను తలపెట్టారు. దానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు. దానికి ఎవరెవరు హాజరువుతారనే దానిపై చర్చ జరుగుతోంది. విభేదాలకు చెక్ పడేనా? గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు సృష్టిస్తున్నారని, బీజేపీ రాజకీయాలకు రాజ్‌భవన్ అడ్డాగా మారిందని ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వమే గవర్నర్‌గా తనకు అందాల్సిన గౌరవాన్ని ఇవ్వడం లేదని తమిళిసై అంటున్నారు. ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డి పేరును రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసినప్పుడు గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంచడంతో రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య విభేదాలు మొదటిసారిగా బహిర్గతమయ్యాయి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం, ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడినప్పటి నుంచి దూరం పెరిగినట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇక సామాన్యుల నుంచి విన్నపాలు స్వీకరించడానికి రాజ్‌భవన్ గేటు వద్ద గ్రివెన్స్ బాక్స్ ఏర్పాటు చేయడం ప్రభుత్వానికి రుచించలేదు. ఇక గణతంత్ర వేడుకల సందర్భంగా ప్రభుత్వం పంపే ప్రసంగాన్ని గవర్నర్ చదవాల్సి ఉంటుంది. కానీ కోవిడ్ నేపథ్యంలో గణతంత్ర దినాన్ని సాదాసీదాగా నిర్వహించాలని, గవర్నర్ ప్రసంగం అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గవర్నర్ ఇందుకు భిన్నంగా గణతంత్ర వేడుకల్లో సొంతంగా ప్రసంగించారు. అందులో రాష్ట్రంలో వైద్య సదుపాయాలు మెరుగుపడాల్సి ఉందని గవర్నర్ పేర్కొనడం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. ప్రభుత్వ పెద్దలు కూడా దీనిపై తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. ఈ క్రమంలోనే గవర్నర్ ప్రసంగం లేకుండానే శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. దానిని గవర్నర్ తప్పుపట్టారు కూడా. మరోవైపు సమ్మక్క–సారక్క జాతరలో పాల్గొనడానికి హెలికాప్టర్ కావాలని గవర్నర్ కోరితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఈ వరుస ఘటనల నేపథ్యంలో రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య విభేదాలు ముదిరాయన్న అభిప్రాయం నెలకొంది. ఇలాంటి సమయంలో ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్‌ను గవర్నర్ ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. -
రాజ్‌భవన్‌లో గవర్నర్ పురోహిత్‌ను కలిసిన చన్నీ
-
రాజ్‌భవన్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు (ఫోటోలు)
-
రాజ్‌భవన్‌లో.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..
-
రాజ్‌భవన్ పాఠశాలను సందర్శించిన గవర్నర్ తమిళిసై
-
చలో రాజ్‌భవన్: పోలీసుల ఓవరాక్షన్.. పరిగెత్తించి మరీ
Revanth Reddy Protest: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ శుక్రవారం చలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కార్యక్రమానికి హాజరవుతున్న కార్యకర్తలను, నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడమే కాక అరెస్ట్‌లకు దిగుతున్నారు. ముందుగా అనుమతి తీసుకుని.. శాంతియుతంగా నిరసన తెలపుతున్న తమను పోలీసులు అడ్డుకోవడం ఏంటని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ ప్రెసెడింట్ రేవంత్ రెడ్డి ట్విట్టర్లో షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనిలో ఇందిరా పార్క్ దగ్గర నిరసన తెలపుతున్న వెంకట్ బల్మూర్ అనే కాంగ్రెస్ కార్యకర్తను పోలీసులు రోడ్డు మీద పరిగెత్తించి మరీ అరెస్ట్ చేశారు. ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయడం కోసం దాదాపు ఏడేనిమిది మంది పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అనంతరం వెంకట్‌ని బలవంతంగా అక్కడ నుంచి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోని రేవంత్ రెడ్డి తన ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. ‘‘పోలీసులు దారుణ ప్రవర్తనకు నిదర్శనం ఈ వీడియో. ముందస్తు అనుమతితో శాంతియుతంగా నిరసన చేస్తున్న కార్యకర్తలను అరెస్ట్ చేశారు. పోలీసులు టీఆర్ఎస్ సర్కార్‌కు గులాం గిరి చేస్తున్నారు’’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. -
రాజ్‌భవన్ గేటుకు కాంగ్రెస్ జెండాలు, అధికారులు సీరియస్
సాక్షి, హైదరాబాద్: పెట్రో ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు చేపట్టిన చలో రాజ్‌భవన్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఇందిరాపార్క్ నుంచి రాజ్‌భవన్‌కు ర్యాలీకి కాంగ్రెస్ శ్రేణులు యత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆధ్వర్వంలో కాంగ్రెస్ చేపట్టిన నిరసనను పోలీసులు నిలువరించారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎలాగైనా చలో రాజ్‌భవన్ కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ యత్నించగా, దానిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో సహా పలువురు ముఖ్య నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్‌లు అప్రజాస్వామికం. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ చేపట్టిన చలో రాజభవన్‌కు వస్తున్న వేలాది మంది నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరా పార్కు వద్ద ధర్నా కోసం అనుమతికి దరఖాస్తు చేశామన్నారు. పోలీసులు.. గృహ నిర్బంధాలు, అరెస్టులు చేయడం రాజరిక పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. మరోవైపు పోలీసులను నుంచి తప్పించుకుని వచ్చిన కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్‌భవన్ గేటుకు కాంగ్రెస్ జెండాలు కట్టడం చర్చనీయాంశమైంది. అంబర్ పెట్ పోలీస్ స్టేషన్ లో రేవంత్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్... జెండాలు కట్టిన వారిపై చర్యలు ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. భద్రతా వైఫల్యంపై సమీక్ష నిర్వహించారు. అధికారుల ఫిర్యాదుతో కాంగ్రెస్ జెండాలు పెట్టిన ఇద్దరిపైనా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే, రాజ్‌భవన్ గేట్ బయట ఉన్న సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిసింది. కాంగ్రెస్ ధర్నా నేపథ్యంలో హుటాహుటిన సీసీ కెమెరాలు మరమ్మతు చేపట్టినట్టు సమాచారం. -
విద్యతోనే చిన్నారుల సమగ్ర అభివృద్ధి: బిశ్వభూషణ్ హరిచందన్
సాక్షి, అమరావతి: బాల్యం నుంచే సంపూర్ణ విద్యను అందించటం ద్వారా చిన్నారుల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. సంపూర్ణ విద్యతో జీవితంలో శ్రేష్ఠత’ అనే అంశంపై ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం నిర్వహించిన అంతర్జాతీయ విద్యా సదస్సులో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ముఖ్యఅతిథిగా వర్చవల్ విదానంలో రాజ్ భవన్ నుంచి పాల్గొన్నారు. గవర్నర్ మట్లాడుతూ ఆలోచనాపరులు, తత్వవేత్తలు ఊహించినట్లుగా కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్న ప్రపంచం, మనం ఇంతకు ముందు చూసిన ప్రపంచానికి భిన్నంగా మారుతుందన్నారు. సంపూర్ణ అభివృద్ధి సాధించిన పిల్లలు మేధో, మానసిక, శారీరక, భావోద్వేగ, ఆధ్యాత్మిక సామర్థ్యాలను కలిగి ఉండటం ద్వారా రోజువారీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవటానికి సిద్దంగా ఉంటారని గవర్నర్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులలో పిల్లలలో నెలకొంటున్న ఒత్తిడి, ఆందోళన వారిలో అనిశ్చితికి దారితీస్తుందని, వారు నిర్బంధ వాతావరణంలో పెరగటం వల్లే ఈ పరిస్ధితులు ఏర్పడుతున్నాయని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలు తల్లిదండ్రులకు తమ చిన్నారుల భవిష్యత్తు పట్ల ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. భయం, ఆందోళన, అనిశ్చితి ఉన్న ఈ కాలంలో జీవితాన్ని ఇచ్చే విద్య అన్న అంశంపై దృష్టి పెడుతూ ఆధ్యాత్మిక, నైతిక విలువలను బోధించడం ద్వారా సమాజంలో దైవత్వాన్ని వ్యాప్తి చేయడానికి బ్రహ్మ కుమారిస్ చేస్తున్న కృషిని ప్రశంసనీయమన్నారు. చదవండి: షాకింగ్: భార్యను చెల్లిగా పరిచయం చేస్తూ పెళ్లి, ఆ పై.. -
రాజ్ భవన్ ముట్టడికి రైతుసంఘాల పిలుపు : ఢిల్లీ
-
తెలంగాణ : గవర్నర్ తమిళసైతో కాంగ్రెస్ నేతల బృందం భేటీ
-
గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్‌తో రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఇటీవల గవర్నర్ బాబాయి, తమిళనాడులోని కన్యాకుమారి ఎంపీ వసంత్‌కుమార్ మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. రాజ్‌భవన్‌కు వచ్చి సంతాపం తెలిపిన ముఖ్యమంత్రికి గవర్నర్ తమిళిసై ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి వెంట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌కుమార్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. అగస్తీశ్వరంలో అంత్యక్రియలు కాగా కరోనా వైరస్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వసంత్‌కుమార్ శుక్రవారం రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఆదివారం ఉదయం కన్యాకుమారి జిల్లా అగస్తీశ్వరంలో జరగనున్నాయి. ఇక పదవీకాలం ముగియకుండా మరణించిన ప్రజాప్రతినిధుల నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగడం సహజం. అయితే వసంతకుమార్ ప్రాతినిధ్యం వహించిన కన్యాకుమారీ లోక్‌సభ నియోజకవర్గంలో అర్థ శతాబ్ధం విరామం తర్వాత ఉప ఎన్నికల పరిస్థితి చోటుచేసుకోవడం గమనార్హం. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వసంత్‌కుమార్ గెలుపొందగా, ఆయన పదవీకాలం ఇంకా నాలుగేళ్లు ఉంది. -
పరిస్థితి అదుపులోనే..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా నియంత్రణకు, రోగులకు నాణ్యమైన చికిత్స అందించడానికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఎంతమందికైనా చికిత్స అందించేందుకు సంసిద్ధతతో ఉన్నామన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు పూర్తి నియంత్రణలోనే ఉన్నాయని, భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో సుమారు గంటన్నర పాటు సమావేశమయ్యారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ఇతర వర్తమాన అంశాలపై సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. కరోనా రోగులకు ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యమైన చికిత్స అందిస్తున్నామని, కొందరు చేస్తున్న దుష్ప్రచారం వల్ల ప్రజలు హైరానాపడి ప్రైవేటు, కార్పొరేట్ ఆస్ప త్రుల చుట్టూ తిరుగుతున్నారని ముఖ్యమంత్రి గవర్నర్‌కు వివరించినట్టు సమాచారం. 1,200 మంది పీజీ వైద్యులతో పాటు 200 మంది పీహెచ్సీ వైద్యులను నియమించి ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేయనున్నామని గవర్నర్‌కు నివేదించారు. కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తుచేశారు. కొత్త సచివాలయ భవన సముదాయం నిర్మించడానికి ఏడాదిగా చేస్తున్న ప్రయత్నాలకు ఎట్టకేలకు అన్ని చిక్కు లు తొలగిపోయాయని, రాష్ట్ర అవసరాలకు తగ్గట్టు అద్భుతరీతిలో కొత్త సచివాలయ భవన సముదా య నిర్మాణానికి త్వరలో పనులు ప్రారంభించను న్నామని గవర్నర్ దృష్టికి సీఎం తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతిభవన్‌తో పాటు గవర్నర్ కార్యాలయం రాజ్‌భవన్‌లో కొందరు ఉద్యోగులు కరోనా బారినపడిన విషయం ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. జిల్లాకో ప్లాస్మా బ్యాంకు ఏర్పాటు చేయాలి: గవర్నర్ జిల్లాకు ఒక ప్లాస్మా బ్యాంకును ఏర్పాటుచేయాలని, ప్లాస్మా దాతలకు ప్రోత్సాహకాలు అందించా లని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సూచించినట్టు సమాచారం. కొన్ని రోజులుగా తాను నిర్వహించిన సమావేశాలు, సదస్సుల్లో వివిధ రంగాల నిపుణుల నుంచి వచ్చిన సలహా సూచనలను గవర్నర్ ఈ సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వారు వైద్య పరీక్షల కోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ కష్టాలు పడుతున్నారని, విస్తృత రీతిలో పరీక్షలు నిర్వహించాలని గవర్నర్ కోరినట్టు తెలిసింది. మొబైల్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని, ఇంటి నుంచి బయటకు రావడానికి ఇబ్బందిపడే వారికి ఇళ్ల వద్దే పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించినట్టు సమాచారం. ఏదైనా ప్రాంతంలో గణనీయ సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడితే ఆ ప్రాంతం పరిధిలోని ప్రజలందరికీ పరీక్షలు నిర్వహించాలని గవర్నర్ విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. అలాగే, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఫీజుల దోపిడీ, బెడ్ల కృత్రిమ కొరతపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో కమిటీ వేసి ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని గవర్నర్ కోరినట్టు తెలిసింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్ల లభ్యత, వినియోగం, ఖాళీ బెడ్ల సంఖ్యను ఎప్పటికప్పుడు రోగులు తెలుసుకునేలా పారదర్శకమైన విధానాన్ని తీసుకురావాలని గవర్నర్ కోరినట్టు తెలిసింది. -
క్వారంటైన్లో మహారాష్ట్ర గవర్నర్
ముంబై : మహారాష్ట్ర రాజ్‌భవన్‌లో 18 మంది సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన వారిలో గవర్నర్‌తో సన్నిహితంగా మెలిగిన సిబ్బంది కూడా ఉన్నారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌లకు కరోనా పాజిటివ్ రావడంతో వారిని నానావతి ఆస్పత్రికి తరలించిన అనంతరం గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన వార్తలతో మహారాష్ట్రలో కరోనా తీవ్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. మహారాష్ట్రలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. కోవిడ్-19 కేసులు ఏకంగా 2,50,000కు చేరువవడతో రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది. కరోనా కట్టడికి పుణే జిల్లాలో జులై 13 నుంచి పదిరోజుల లాక్‌డౌన్‌ను ప్రకటించారు. థానే జిల్లాలో కూడా లాక్‌డౌన్‌ను ఈనెల 19 వరకూ పొడిగించారు. దేశంలో నమోదైన కరోనా కేసుల్లో 90 శాతం కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో నమోదైనవే. ఇక 49 జిల్లాల్లోనే 80 శాతం కరోనా వైరస్ కేసులున్నాయని కోవిడ్-19పై ఏర్పాటైన మంత్రుల బృందం పేర్కొంది. చదవండి :కోవిడ్-19 : మందుల కొరతకు చెక్ -
ఏపీ గవర్నర్‌తో ట్రైనీ ఐఏఎస్‌ల భేటీ
సాక్షి, విజయవాడ : సమాజంలోని పేద వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేయవలసిన అతి పెద్ద బాధ్యత అఖిల భారత సర్వీసుల అధికారులపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. ఐఎఎస్ అధికారిగా పని చేయటం అంటే అత్యున్నత పౌర సేవకు అవకాశం పొందినట్లు భావించాలన్నారు. ప్రజా సమస్యలను సానుకూల దృక్పధంతో పరిశీలించగలిగినప్పుడే పరిష్కారాలు లభిస్తాయని గవర్నర్ పేర్కొన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించబడి, రాష్ట్ర సచివాలయంలో శిక్షణ పొందుతున్న ఐఎఎస్ అధికారులు సోమవారం రాజ్ భవన్లో గవర్నర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ముస్సోరీలో వీరు తీసుకోవలసిన రెండవదశ తప్పనిసరి శిక్షణా కార్యక్రమం వాయిదా పడింది. ఈ క్రమంలో వారిని రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలోని వివిధ విభాగాలలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. (ట్రైనీ ఐఏఎస్‌లతో సీఎం జగన్ సమావేశం) ట్రైనీ ఐఎఎస్ అధికారులతో గవర్నర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చూడాలన్నారు. విధుల నిర్వహణలో మార్గదర్శక శక్తిగా రూపుదిద్దుకోవాలని సూచించారు. ప్రజా పరిపాలనలో పారదర్శకతకు కట్టుబడి ఉండాలని గవర్నర్ అన్నారు. జాతీయ సమైక్యతను ప్రోత్సహించడానికి, సాంఘిక సమానత్వం, మత సామరస్యం, ప్రాంతీయ అభివృద్ధి సాధనకు సివిల్ సర్వీస్ అధికారులు బాధ్యత వహించాలని గవర్నర్ అన్నారు. అనంతరం సీనియర్ ఐఎఎస్ అధికారి, గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాను ప్రత్యేకంగా కలిసి విభిన్న అంశాలపై సలహాలు, సూచనలు తీసుకున్నారు. గవర్నర్‌ను కలిసిన వారిలో అనుపమ అంజలి, ప్రతిష్ట మమగైన్, హిమాన్హు కౌశిక్, కల్పనా కుమారి, సూరజ్ డిజి, వైదిఖేర్, నుపర్ ఎకె శివాస్, మౌర్య నారపురెడ్డి, ఇమ్మడి పృధ్వీ తేజ్, ఖేతన్ ఘర్గ్, భార్గవ్ టి అమిలినేని, జాహ్నవి తదితరులు ఉన్నారు. -
ముస్లిం సోదరులకు ఏపీ గవర్నర్ శుభాకాంక్షలు
సాక్షి, రాజ్‌భవన్: క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికనే రంజాన్ పర్వదినం అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఆయన ఆదివారం రాజ్‌భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసం ‘ఈద్ ఉల్ ఫితర్’ ముగిసిన శుభవేళ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర ఖురాన్ బోధనలు యుగ యుగాలుగా మానవాళిని ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. రంజాన్ మాస పవిత్రతతో ప్రతి వ్యక్తి మానసిక పరివర్తన చెంది ప్రేమమూర్తిగా మారుతాడని ఆయన అన్నారు. రంజాన్ మాసంలో ఆధ్యాత్మిక ఆరాధనతో అనుబంధం మరింత బలపడుతుందని గవర్నర్ చెప్పారు. క్రమశిక్షణను అనుసరిస్తూ శాంతి, సౌభ్రాతృత్వాన్ని లోకానికి చాటడంలో రంజాన్ మాసం ప్రత్యేకంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కఠోర ఉపవాసవ్రతం సహనాన్ని పెంచుతుందని గవర్నర్ తెలిపారు. సర్వమానవాళి సమానత్వాన్ని చాటుతూ, దాతృత్వాన్ని అలవరచే పండుగ రంజాన్ అని ఆయన చెప్పారు. రంజాన్ పండుగ వేళ ఇస్లాంను గౌరవించే ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిసస్తునన్నానని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. -
మా ఫ్యామిలీలో ఆరుగురికి కరోనా: కర్నూలు ఎంపీ
కర్నూలు (రాజ్‌విహార్): తన కుటుంబ సభ్యుల్లో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. కర్నూలు నర్సింగరావుపేటలో ఉన్న తన సోదరుల కుటుంబ సభ్యులకు కరోనా సోకిందని, వీరంతా రాష్ట్ర కోవిడ్ హాస్పిటల్ (కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి)లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. కాగా ఎంపీ తండ్రి, సోదరుడితో పాటు మరో నలుగురికి కరోనా సోకగా వీరంతా, క్షేమంగానే ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కోవిడ్ ఆస్పత్రిలో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించిందన్నారు. (బయట తిరిగితే క్వారంటైన్కే ! ) కర్నూలులో కరోనా కేసులు ఎక్కువైపోతున్నాయని మీడియాలో వస్తున్న వార్తల వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారని, అయితే దీని గురించి భయపడాల్సిన పనిలేదని ఆయన అన్నారు. అమెరికా, స్పెయిన్‌లో కరోనా మరణాలు ఎక్కువగా ఉండటాన్ని చూసి ఇక్కడి వారెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. భారత్‌లో బీసీజీ వ్యాక్సిన్ వాడుతుండటం వల్ల ఇక్కడి ప్రజలకు రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుందని, అమెరికా లాంటి పరిస్థితి ఇక్కడ రాదని వివరించారు. లాక్ డౌన్ ఆంక్షలను రెడ్ జోన్లలో పొడిగించి.. గ్రీన్ జోన్లలో విడతల వారీగా ఎత్తివేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు రాజ్‌భవన్‌కు చెందిన నలుగురు సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. చీఫ్ సెక్యూరిటీ అధికారితో పాటు నర్సింగ్ సిబ్బందికి కరోనా సోకింది. (కేసులు అధికంగా నమోదైనా ఆందోళన చెందొద్దు)