
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రద్దు తీర్మానానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాజ్‌భవన్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ను ఈసీ, అసెంబ్లీ కార్యదర్శికి రాజ్‌భవన్ వర్గాలు పంపాయి. ఈ మేరకు గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. ఆ వివరాలు.. తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు గవర్నర్‌ను ఈ రోజు(06-09-2018) కలిసి తెలంగాణ రాష్ట్ర తొలి అసెంబ్లీని రద్దు చేయాల్సిందిగా తీర్మానించిన ప్రతిని గవర్నర్‌కు సమర్పించారు. సీఎంతోపాటు ఆయన మంత్రివర్గం చేసిన సిఫారసును గవర్నర్ ఆమోదించారు. కేసీఆర్‌తోపాటు ఆయన మంత్రివర్గాన్ని ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగించాల్సిందిగా గవర్నర్ కోరారు. గవర్నర్ వినతికి కేసీఆర్ అంగీకరించారు అని రాజ్‌భవన్ తన ప్రకటనలో వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment