assembly dissolved
-
ఆరు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ రద్దు!
నేరేడుచర్ల: రాష్ట్రంలో ఆరు నెలల్లో అసెంబ్లీ రద్దు కావడం ఖాయమని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు. గురువారం ఆయన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని పెంచికల్‌దిన్నె, కల్లూరు, దాసారం, యల్లారం, ముకుందాపురం, బురుగులతండా, సోమారం, చిల్లేపల్లి, బొడలదిన్నె, జగనతండా గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్లె ప్రగతి పూర్తిగా విఫలమైందని, సర్పంచ్‌లను ఇబ్బంది పెట్టే విధంగా ఈ కార్యక్రమం ఉందని పేర్కొన్నారు. గతంలో చేసిన పనుల బిల్లులు ఇప్పటి వరకూ రాకపోవడంతో సర్పంచ్‌లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పల్లె ప్రగతి కార్యక్రమాలకు వెళ్లేందుకు భయపడుతున్నారని తెలిపారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, పింఛన్లు పూర్తి స్థాయిలో అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులతో పాటు కౌలు రైతులకు ఎకరానికి రూ.15వేల రైతు బంధు ఇస్తామన్నారు. భూమిలేని రైతు కూలీలకు, జాబ్‌కార్డులున్న ఉపాధి హామీ కూలీలకు ఉపాధి పనులు కల్పించడంతో పాటు ఏడాదికి ఒక్కొక్కరికి రూ.12వేల చొప్పున అందిస్తామని చెప్పా రు. కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు ఇచ్చేలా చూస్తామన్నారు. అలాగే రైతులకు పంట బీమాతో పాటు ఏకకాలంలో 2లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అభయాస్తం పథకాన్ని పునరుద్ధరించడంతో పాటు మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలిచ్చి, బకాయిలను చెల్లిస్తామని పేర్కొన్నారు. -
బిహార్ మంత్రివర్గం రాజీనామా
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శుక్రవారం ఆ రాష్ట్ర గవర్నర్ ఫగూ చౌహాన్ని కలిశారు. తన మంత్రివర్గ రాజీనామాను సమర్పించి, అసెంబ్లీని రద్దుచేయాలని సిఫారసు చేశారు. దీంతో బిహార్‌లో నితీశ్ నేతృత్వంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. నితీశ్ రాజీనామాను గవర్నర్ ఆమోదించి, ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంత వరకు తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. అంతకుముందు సీఎం అధికార నివాసంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు జేడీయూ, బీజేపీ, హెచ్ఏఎం, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీల నాయకులు భేటీ అయ్యారు. కొత్త ఎన్నికైన ఎన్డీయే ఎమ్మెల్యేలంతా ఆదివారం మధ్యాహ్నం సమావేశమై నితీశ్‌ను తమ నేతగా ఎన్నుకోనున్నారు. బిహార్‌లో జేడీయూ కన్నా బీజేపీ 31 స్థానాలు అధికంగా గెలుపొందినప్పటికీ, ప్రధాని, బీజేపీ అధిష్టానం నితీశ్ కుమార్‌నే కాబోయే ముఖ్యమంత్రిగా ప్రకటించడం విశేషం. ఉప ముఖ్యమంత్రిగా దళిత వర్గానికి చెందిన బీజేపీ నేత కామేశ్వర్ చౌపాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయనకు సంఘ్‌పరివార్‌తో అనుబంధం ఉంది. ఇలా ఉండగా, స్వతంత్ర ఎమ్మెల్యే చకాయ్ సుమిత్ సింగ్ ఎన్డీయేకి మద్దతు ప్రకటించారు. -
కోమటిరెడ్డి, సంపత్‌ల కేసులో అప్పీళ్లు మూసివేత
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ తాజా మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.సంపత్‌కుమార్‌లను శాసనసభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానాన్ని రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు మూసివేసింది. అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో ఈ అప్పీళ్లపై విచారణ జరిపి ప్రయోజనం లేదన్న హైకోర్టు వీటిని మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాము ఈ అప్పీళ్లను మూసివేసిన నేపథ్యంలో కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని కూడా మూసివేసేందుకు చర్యలు తీసుకోవాలని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో సింగిల్ జడ్జిని కోరింది. తమను సభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానం, తదానుగుణ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ కోమటిరెడ్డి, సంపత్‌లు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి, బహిష్కరణ తీర్మానం, తదానుగుణ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. అయితే ఈ తీర్పు ప్రకారం తమ పేర్లను శాసనసభ్యుల జాబితాలో చేర్చలేదని, ఇది కోర్టు ధిక్కారమేనంటూ కోమటిరెడ్డి, సంపత్‌లు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావులకు కోర్టు ధిక్కారం కింద ఫాం 1 నోటీసులు జారీ చేసి, వారి వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చారు. దీంతో సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం, సింగిల్ జడ్జి తీర్పుతో పాటు ఇరువురు కార్యదర్శులకు కోర్టు ధిక్కారం జారీ చేసిన ఫాం 1 నోటీసుల అమలుపై కూడా స్టే విధించింది. తాజాగా ఈ అప్పీళ్లు సోమవారం విచారణకు రాగా, కోమటిరెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో ఈ వ్యాజ్యాలను మూసివేయవచ్చని తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఆ మేర అప్పీళ్లను మూసివేస్తూ ఉత్తర్వులిచ్చింది. -
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ రద్దు ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమే!
జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పర్చే అవకాశాన్ని రాజకీయపార్టీలకు ఇవ్వకుండా అసెంబ్లీని రద్దుపరచడం ద్వారా గవర్నర్ సత్పాల్ మాలిక్ వాస్తవానికి రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారు. ప్రధానమంత్రి కార్యాలయం ఆ సమయంలో ఏం కోరుకుంటోందో దాన్ని మాత్రమే గవర్నర్ పాటించినట్లుంది. గవర్నర్ తన చర్యను సమర్థించుకోవడమే కాకుండా, పీడీపీ, ఎన్సీ, కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు పంపిన ఉత్తరాన్ని ఫ్యాక్స్ మిషన్ పనిచేయనందున స్వీకరించలేకపోయినట్లు ప్రకటించడం ఆవేదన కలిగించే విషయం. జమ్మూ కశ్మీర్ అనేది సైనిక సమస్య కాదు, పాలనాపరమైన సమస్య కాదు. అదొక రాజకీయ సమస్య. పరస్పర చర్చలద్వారానే దాన్ని పరిష్కరించాలి. జమ్మూ కశ్మీర్లో నూతన ప్రభుత్వాన్ని ఏర్పర్చడానికి రాజకీయ పార్టీలను అనుమతించకుండా ఆ రాష్ట్ర గవర్నర్ తీసుకున్న రాజ్యాంగ వ్యతిరేక చర్య కశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుగొనడంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వానికి ఆసక్తి లేదని స్పష్టం చేస్తోంది. దానికంటే ఎన్నికల్లో జాతీయవాద మనోభావాలను వాడుకోవడం పట్లే దానికి ఆసక్తి ఉన్నట్లుంది. ఇది ఒక రాష్ట్రంలో లేక ఒక నిర్దిష్ట సామాజిక బృందం అనుభవిస్తున్న చారిత్రక వేదన పట్ల దేశంలోని ఇతర ప్రాంతాల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతూ సమస్యకు మరిం తగా నిప్పు రాజేస్తున్నట్లుగా ఉంది. జమ్మూకశ్మీర్‌లో రాజకీయ పార్టీలను చర్చలబల్ల వద్దకు తీసుకొచ్చి ప్రభుత్వ ఏర్పాటు కోసం సాధ్యమైనన్ని ప్రయత్నాలు చేసివుండాలని మనలో చాలామంది భావన. జాతీయ ప్రయోజనాల రీత్యా జాతీయ పార్టీలని చెప్పుకుంటున్నవి ఆ రాష్ట్ర ప్రజల మనోభావాలను గౌరవించి ద్వితీయపాత్రకు మాత్రమే పరిమితం కావలసి ఉంది. కానీ బీజేపీ నేరుగా రాష్ట్రాన్ని పాలిం చడానికి రాజకీయ సంప్రదింపులు జరిపే ఉద్దేశంతోనే సత్పాల్ మాలిక్‌ని జమ్మూ కశ్మీర్‌కు గవర్నర్‌గా పంపించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆయన లక్ష్యం కశ్మీర్ రాజకీయ పార్టీలను హిందుత్వ రాజకీయ ప్రయోజనాల కోసం విభజించడమే. సాజిద్ లోనేని దాంట్లోభాగంగానే ప్రోత్సహించారు. ఆ రకంగా నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ వంటి స్థానిక రాజకీయ పార్టీల ఆధిపత్యానికి గండి కొట్టవచ్చని, లేదా తగ్గించవచ్చని భావించారు. తన ప్రజలపైనే యుద్ధం చేస్తూ, వ్యవస్థల విశ్వసనీయతనే విధ్వంసం చేయడానికి పూనుకున్న ప్రభుత్వాన్ని మనం ఎక్కడైనా చూశామా? హింసాత్మక ఘటనలు పెరిగాయి కాబట్టి కశ్మీరులో గత నాలుగేళ్లుగా పరిస్థితి దిగజారిపోలేదని, కశ్మీర్ సమస్య పరి ష్కారానికి కేంద్రం ఏరకమైన ఆసక్తీ చూపకపోవడమే అక్కడ అశాంతికి కారణమని మనందరికీ తెలుసు. కశ్మీర్ సమస్య పట్ల కఠిన పరిష్కారమే మార్గమని, అంటే సాయుధ బలగాలకు స్వేచ్ఛ ఇచ్చి వారెప్పుడు కోరుకుంటే అప్పుడు రాజకీయ ప్రక్రియను అనుమతించని విధంగా పరిష్కరించాలని ఆర్ఎస్ఎస్ మేధో బృందం చాలవరకు భావిస్తోంది. కశ్మీర్.. యుద్ధం ద్వారా గెలవాల్సిన ప్రాంతంగా సంఘ్ పరివార్ భావిస్తోంది. భారత్‌లో మన బానిసత్వానికి గుర్తుగా మిగిలిన ఇస్లామ్ చిహ్నాలను పూర్తిగా రద్దు చేయాలంటూ రాత్రింబవళ్లు మొత్తుకుంటున్న సంఘ్ భక్తపరివార్కి ఇలాంటి తరహా విజయం సంతృప్తినిస్తుం దని ఆర్ఎస్ఎస్ భావన. అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచిన తర్వాత ఉన్నట్లుండి గవర్నర్‌కు రాష్ట్రంలో ఇక సుస్థిర ప్రభుత్వం సాధ్యం కాదని స్ఫురించిందంటే కేంద్రం ఆజ్ఞలకు వెన్నెముక లేని గవర్నర్ పూర్తిగా లొంగిపోయినట్లే లెక్క. పైగా ఇతర ప్రతిపక్ష పార్టీలు పంపిన ఉత్తరాలను గవర్నర్ తిరస్కరించారు. వాస్తవానికి మునుపెన్నడూ లేనంత రాజకీయ ఐక్యతను ప్రదర్శించిన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు ఉమ్మడిగా వెళ్లి గవర్నర్‌ను కలవాలని నిర్ణయించాయి. కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి మరో ఆలోచన ఉన్నట్లుంది. కశ్మీర్ నుంచి ఈశాన్య భారత్ వరకు హిందుత్వ ప్రభుత్వాన్ని స్థాపించాలనే అమిత్‌షా, నరేంద్రమోదీల స్వప్న సాకారం చేయడానికి జమ్మూకశ్మీర్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం ఆశిం చింది. ప్రభుత్వాన్ని ఏర్పర్చే అవకాశాన్ని రాజకీయపార్టీలకు ఇవ్వకుండా అసెంబ్లీని రద్దుపరచడం ద్వారా మాలిక్ వాస్తవానికి రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారు. ప్రధానమంత్రి కార్యాలయం ఆ సమయంలో ఏం కోరుకుంటోందో దాన్ని మాత్రమే గవర్నర్ పాటించినట్లుంది. గవర్నర్ తన చర్యను సమర్థించుకోవడమే కాకుండా, పీడీపీ, ఎన్సీ, కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు పంపిన ఉత్తరాన్ని ఫ్యాక్స్ మిషన్ పనిచేయనందున స్వీకరించలేకపోయినట్లు ప్రకటించడం ఆవేదన కలిగించే విషయం. పైగా ఆర్ఎస్ఎస్ నియమించిన రామ్ మాధవ్ సమస్యపట్ల ఏమాత్రం అవగాహన లేకుండానే మీడియా వద్దకు హుటాహుటిన పరుగెత్తుకెళ్లి, పాకిస్తాన్ ఆదేశాల ప్రకారమే ఆ మూడు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పర్చాలని కోరుకుంటున్నట్లుగా ఆరోపించి అభాసుపాలయ్యారు. రామ్‌మాధవ్ వ్యవహరించిన తీరు కశ్మీర్ సమస్య పట్ల బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధీ లేదన్న విషయాన్ని ప్రతిబింబిస్తోంది. సంవత్సరాలపాటు రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వాన్ని, కొద్ది నెలలక్రితం వరకు భాగస్వామిగా అధికారం చలాయించిన పార్టీని జాతి వ్యతిరేకమైనదిగా ఎలా ముద్రవేస్తారు? జమ్మూకశ్మీర్ వ్యవహా రాల్లో వేలుపెట్టేందుకు రామ్ మాధవ్ లాంటి వ్యక్తిని నియమించినప్పుడే కేంద్రప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో మనం అర్థం చేసుకున్నాం. బీజేపీతో సమస్య ఏమిటంటే అది ప్రజాతీర్పుకు వెన్నుపోటు పొడిచింది. గుజరాత్ బుడగ పేలిపోయింది. అభివృద్ధి ఎజెండా గాల్లో కలిసింది. మన వ్యవస్థలు తమ స్వతంత్రప్రతిపత్తిని, బలాన్ని కోల్పోతున్నాయి. ప్రజలమీద యుద్ధం ప్రకటించి ప్రభుత్వమే వ్యవస్థలను విధ్వంసం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అది జమ్మూ కశ్మీర్‌ను కోరుకుంటోంది కానీ కశ్మీర్ ప్రజలతో మాట్లాడాలని భావించదు. భారత్‌లోని సవర్ణులతో కశ్మీర్గురించి చర్చించాలని అనుకుంటోది తప్పితే కశ్మీర్ ప్రజలతో మాట్లాడాలని అనుకోవడం లేదు. ఇక ఆర్ఎస్ఎస్ జాతీయవాద నమూనా ప్రకారం, వారికి కశ్మీరీ ముస్లింలతో పని లేదు, అక్కడి ప్రజలతో పనిలేదు కానీ అఖండభారత్‌లో భాగంగా కశ్మీర్ భౌగోళిక ప్రాంతం మాత్రమే వారిక్కావాలి. ఒకవేళ వారు ప్రజల గురించి ఆలోచించినప్పటికీ జమ్మూలోని హిందువుల గురించే ఆలోచిస్తారు. ఇంతకంటే మించిన వంచన లేదు. ఇప్పుడు కశ్మీర్‌కి కావలసింది భారత్ నుంచి ఒక ప్రేమాస్పదమైన వెచ్చటి కౌగిలింత మాత్రమే. యువతకు ఉద్యోగం, అవకాశాలు అవసరం. రాజకీయ వాణిని వినాలి. రాజకీయ చర్చలపట్ల విశ్వాసం ప్రకటించినందుకే అక్కడ ఎంతోమంది సాహస జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ కశ్మీర్ సైనిక సమస్య, పాలనాపరమైన సమస్య కాదు. అదొక రాజకీయ సమస్య. చర్చలద్వారానే దాన్ని పరిష్కరించాలి. రాజ్యాంగాన్ని, చట్టపాలనను విశ్వసిస్తున్న రాజకీయ పార్టీల ప్రతిష్టను మసకబార్చి మీరు చేసేదేమీ ఉండదు. ద్వేషానికి, హింసకు వ్యతిరేకంగా పోరాడుతూ అనేకమంది నేతలను కోల్పోయిన కశ్మీర్ రాజకీయపార్టీలపై మరకలువేయడానికి ప్రయత్నిస్తే తర్వాత మీరు మాట్లాడేందుకు మనిషి కూడా మిగలడు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు కశ్మీర్లో ఇలాంటి అంగుష్టమాత్రపు రాజకీయాల్లో మునగకూడదు. -విద్యాభూషణ్ రావత్, మానవ హక్కుల కార్యకర్త, జర్నలిస్టు -
పాక్ కనుసన్నల్లో కశ్మీర్ పార్టీలు
న్యూఢిల్లీ/శ్రీనగర్: కశ్మీర్ అసెంబ్లీ రద్దయ్యాక గురువారం రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. పాకిస్తాన్ ప్రోద్బలంతోనే బద్ధ శత్రువులైన పీడీపీ, ఎన్సీలు చేతులు కలిపేందుకు సిద్ధమయ్యాయన్న బీజేపీ నాయకుడు రామ్ మాధవ్ వ్యాఖ్యలపై ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణల్ని రుజువుచేయాలని లేదంటే క్షమాపణ చెప్పాలన్నారు. దీంతో రామ్ మాధవ్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరిగే అవకాశాలున్నాయని వచ్చిన నివేదికల్ని బహిర్గతం చేయాలని గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను ఒమర్ కోరారు. కశ్మీర్ ప్రాంతీయ పార్టీలు పాక్ కనుసన్నల్లో పనిచేస్తున్నాయన్న బీజేపీ వ్యాఖ్యలపై రాష్ట్ర మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. బీజేపీతో పొత్తుపెట్టుకున్నప్పుడు మాత్రం పీడీపీ, ఎన్సీల దేశభక్తి, విశ్వసనీయతను ఆ పార్టీ ప్రశ్నించలేదని అన్నారు. ‘ఒక పార్టీ జాతీయవాదం, దేశభక్తిని ఎలా నిర్ణయిస్తారు. కేంద్రంతో ఉంటే దేశభక్తులు.. లేకుంటే జాతి వ్యతిరేకులా?’ అని సూటిగా ప్రశ్నించారు. కలసి పోటీచేయగలరా?: రామ్ మాధవ్ బీజేపీ, ఎన్సీల మధ్య ట్వీటర్ వేదికగా మాటల యుద్ధం జరిగింది. పీడీపీ, ఎన్సీల స్నేహం నిజమైనదైతే వచ్చే ఎన్నికల్లో కూడా ఆ రెండు పార్టీలు కలసి పోటీచేయాలని కశ్మీర్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జీ రామ్ మాధవ్ సవాలు విసిరారు. ప్రభుత్వ ఏర్పాటుకు కలసిరావాలని కశ్మీర్ ప్రాంతీయ పార్టీలకు పాక్ నుంచి ఆదేశాలు అందాయన్నారు. పాక్ సూచనల మేరకు ఎన్సీ, పీడీపీలు స్థానిక సంస్థల ఎన్నికల్ని బహిష్కరించాయన్నారు. మాధవ్ ఆరోపణల్ని ఒమర్ అబ్దుల్లా తిప్పికొడుతూ ‘ ఐబీ, రా, సీబీఐ లాంటి సంస్థలు మీ నియంత్రణలోనే ఉన్నాయి. ధైర్యముంటే మీ ఆరోపణల్ని నిరూపించే సాక్ష్యాలు బయటపెట్టండి’ అని డిమాండ్ చేశారు. దీనికి మాధవ్ బదులిస్తూ ‘ మీ దేశభక్తిని శంకించడం లేదు. కానీ పీడీపీ, ఎన్సీల మధ్య హఠాత్తుగా పుట్టుకొచ్చిన ప్రేమ సందేహాలకు తావిస్తోంది. విదేశీ ఒత్తిడి లేదని లేదంటున్నారు కాబట్టి నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నా. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పోటీచేసి మీ మధ్య స్నేహం నిజమైనదే అని నిరూపించండి’ అని అన్నారు. ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు.. కేంద్రం ఒత్తిడితోనే అసెంబ్లీని రద్దుచేశారన్న ఆరోపణల్ని గవర్నర్ తోసిపుచ్చారు. ‘భారీ స్థాయిలో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు నివేదికలొస్తున్నాయి. ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు. తెరచాటుగా చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయి. తన వర్గం ఎమ్మెల్యేలను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) సాకుతో బెదిరిస్తున్నారని మెహబూబా ఆరోపించారు. మరో వర్గం ఎమ్మెల్యేలకు గుర్తుతెలియని వారు భారీగా డబ్బు ఆశ చూపారు. ఈ బేరసారాలు 20 రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి’ అని మీడియాకు వివరించారు. మే లోపే ఎన్నికలు: సీఈసీ కశ్మీర్లో మే లోపు ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. లోక్‌సభ ఎన్నికల కన్నా ముందే అక్కడ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రావత్ చెప్పారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అసెంబ్లీ రద్దయితే ఆరు నెలల్లోపు ఎన్నికలు జరగాలి. కశ్మీర్ విషయంలో ఆ గడువు మే వరకు ఉంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొనే పోలింగ్ తేదీల్ని ఖరారుచేస్తామని రావత్ చెప్పారు. అసెంబ్లీ రద్దయిన ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు చెబుతోందని, తెలంగాణలోనూ ఇదే నియమాన్ని వర్తింపజేస్తున్నామని తెలిపారు. మెహబూబాకే మేలు! కశ్మీర్ రాజకీయ డ్రామాలో మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీదే విజయమా? కాంగ్రెస్, ఎన్సీ మద్దతుతో ఆమె ముఖ్యమంత్రి కాకుండా గవర్నర్ సత్యపాల్ మాలిక్ అడ్డుకోవడం తాత్కాలికమేనా? అంటే..అసెంబ్లీ రద్దు పరోక్షంగా బీజేపీకి ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పీపుల్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సజ్జన్ గని లోన్ని సీఎం చేసి కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటుచేయాలనుకున్న బీజేపీ ప్రయత్నాలకు అసెంబ్లీ రద్దుతో గండిపడినట్లయింది. పీడీపీ, ఎన్సీ, కాంగ్రెస్‌లు తమకున్న ఎమ్మెల్యేల బలంతోనే ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నాయని, ఈ ఆలోచన ప్రతిపాదిత కూటమికి మేలు చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. జూన్ 19న పీడీపీ–బీజేపీ సంకీర్ణం కుప్పకూలిన తరువాత పీడీపీ అస్తిత్వ సంక్షోభంలో కూరుకుపోయింది. పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జన్ గని బీజేపీతో చేతులు కలిపి సీఎం అవుతారనే ప్రచారంతో..కొందరు పీడీపీ సభ్యులు ఆయన గూట్లో చేరారు. బుధవారం మధ్యాహ్నం వరకు అత్యంత నిరాశాజనకంగా ఉన్న పీడీపీ శిబిరంలో ఒక్కసారిగా ఆశావహ వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్, ఎన్సీల మద్దతు తనకు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరుతూ గవర్నర్‌కు లేఖ రాయడం ద్వారా ముఫ్తీ.. సజ్జద్ ఫ్రంట్‌లోకి మరిన్ని వలసల్ని నిలువరించారు. గవర్నర్ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయాలని మెహబూబా యోచిస్తున్నట్లు సమాచారం. -
పండుగ పూట రాజ్‌భవన్ ఖాళీ..
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ అసెంబ్లీని రద్దు చేస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్న గవర్నర్ సత్యపాల్ మాలిక్ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. అసెంబ్లీ రద్దు నిర్ణయం సరైన సమయంలోనే జరిగిందని చెప్పుకొచ్చారు. గత కొద్ది నెలలుగా అసెంబ్లీని రద్దు చేయాలని కోరిన మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని సిద్ధాంత వైరుధ్యాలతో కూడిన పార్టీలతో కలిసి కోరుతున్నారని గవర్నర్ పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరుతూ తాను చేసిన ఫోన్ కాల్స్, ఫ్యాక్స్ సందేశాలకు గవర్నర్ బదులివ్వలేదన్న మెహబూబా ముఫ్తీ ఆరోపణలపై ఆయన స్పందించారు. ఈద్ రోజు రాజ్‌భవన్‌లో ఎవరూ లేరని, కనీసం తనకు ఆహారాన్ని అందించేందుకూ ఎవరూ అందుబాటులో లేరని, ఆమె ఈద్ ముందు రోజు తనను సంప్రదించి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. తాను ఫ్యాక్స్ సందేశాన్ని అందుకున్నా తన నిర్ణయంలో మార్పు ఉండేది కాదని వ్యాఖ్యానించారు. ఫిరాయింపులు, పేలవమైన సర్ధుబాట్లతో కూడిన ప్రభుత్వ ఏర్పాటును అనుమతించరాదని తాను గట్టిగా నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. కాగా 87 మంది సభ్యులున్న అసెంబ్లీలో తమ పార్టీ పీడీపీకి కాంగ్రెస్ నుంచి 12 మంది, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి 15 మంది ఎమ్మెల్యేల మద్దతుతో 56 మంది సభ్యులున్నారని, దీంతో తమ కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత సంఖ్యాబలం ఉందని గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇక పీపుల్స్ కాన్ఫరెన్స్‌కు చెందిన సజద్ లోన్ సైతం ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని గవర్నర్‌కు కోరారు. ఇద్దరు సభ్యులున్న పీపుల్స్ కాన్ఫరెన్స్‌కు బీజేపీ ఎమ్మెల్యేలు 25 మంది, ఇతర ఎమ్మెల్యేలు 18 మంది మద్దతు పలుకుతున్నారని సజద్ లోన్ తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. కాగా ముఫ్తీ సర్కార్‌కు బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో ఈ ఏడాది జూన్ నుంచి జమ్ము కశ్మీర్ గవర్నర్ పాలనలో ఉన్న విషయం తెలిసిందే. గవర్నర్ అప్పట్లో అసెంబ్లీని రద్దు చేయకుండా సుప్త చేతనావస్ధలో ఉంచారు. -
గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం..
సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్లో రాజకీయ సంక్షోభం న్యాయపోరాటం దిశగా సాగుతోంది. జమ్ము కశ్మీర్ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని సీనియర్ కాంగ్రెస్ నేత మనీష్ తివారీ ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కోరినందునే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. గవర్నర్ నిర్ణయాన్ని న్యాయస్ధానంలో సవాల్ చేస్తామన్నారు. జమ్ము కశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చే భిన్న సిద్ధాంతాలతో కూడిన పార్టీల ఆధ్వర్యంలో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యమని అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అధికారాన్ని దక్కించుకునేందుకే ఆయా పార్టీలు కలుస్తున్నాయని, బాధ్యతాయుత ప్రభుత్వాన్ని అందించేందుకు కాదన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు ఊపందుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే గవర్నర్ నిర్ణయాన్ని పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. -
జమ్మూకశ్మీర్‌లో అనూహ్య పరిణామాలు
-
అసెంబ్లీ రద్దు.. గవర్నర్ అనూహ్య నిర్ణయం
శ్రీనగర్: కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న జమ్మూకశ్మీ ర్ రాజకీయాలు బుధవారం ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల మధ్య గవర్నర్ సత్యపాల్ మాలిక్ అసెంబ్లీని రద్దు చేశారు. అంతకుముందు.. కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలించి, రాష్ట్రంలో బద్ధ శత్రువులైన పీడీపీ, నేషనల్ కాన్ఫెరెన్స్‌లు ఒక్కటై, కాంగ్రెస్‌తో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్, ఎన్సీతో కలసి ప్రభుత్వా న్ని ఏర్పాటు చేస్తానంటూ పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ గవర్నర్ మాలిక్‌కు లేఖ కూడా రాశారు. మరోవైపు, ఈ కూటమిని అడ్డుకునే లక్ష్యంతో.. బీజేపీ, 18 మంది ఇతరుల మద్దతుతో తాను కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలనని పీపుల్స్ కాన్ఫెరెన్స్ నేత సజ్జాద్ లోన్ ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో పీడీపీకి 28, కాంగ్రెస్‌కు 12, ఎన్సీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మెజారిటీకి 44 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా, ఈ కూటమికి 55 మంది ఎమ్మెల్యేలున్నారు. కాగా, అసెంబ్లీలో బీజేపీకి 25 మంది, పీపుల్స్ కాన్ఫెరెన్స్‌కు ఇద్దరు, సీపీఎంకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో పీడీపీ– బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన నేపథ్యంలో జూన్ 19న రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించారు. ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఉండేందుకు అసెంబ్లీని సుప్త చేతనావస్థలో ఉంచారు. ‘ఇతరుల’ మద్దతుంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫెరెన్స్ కూడా తమకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని గవర్నర్‌కు రాసిన లేఖలో పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. మరోవైపు, ఇద్దరు ఎమ్మెల్యేల పీపుల్స్ కాన్ఫెరెన్స్ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. తమకు 25 సభ్యుల బీజేపీతో పాటు 18కి పైగా ఇతర సభ్యుల మద్దతుందని ఆ పార్టీ నేత సజ్జాద్ లోన్ గవర్నర్‌కు తెలిపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయం సంచలనం సృష్టించింది. గవర్నర్ నిర్ణయం నిర్ణయం నేపథ్యంలో.. ఎన్నికల ప్రకటనకు ముందే రాష్ట్రంలో ఎన్నికల నియమావళిని తక్షణమే అమలులోకి తెచ్చే అవకాశంపై యోచిస్తున్నట్లు ఎన్నికల సంఘం అధికారి ఒకరు తెలిపారు. బేరసారాలకు అవకాశం ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరిగే అవకాశం ఉండటం, విరుద్ధ భావజాలాలున్న పార్టీలు స్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచలేవన్న నమ్మకంతోనే అసెంబ్లీని రద్దుచేయాల్సి వచ్చిందని రాజ్‌భవన్ నుంచి ప్రకటన వెలువడింది. మెజారిటీని నిరూపించుకునేందుకు ఒకటి కన్నా ఎక్కువ వర్గాలు ముందుకు రావడం ప్రభుత్వ నిలకడపై ప్రభావం చూపుతుందని మరొక కారణంగా పేర్కొంది. మరోవైపు, కాంగ్రెస్– పీడీపీ–ఎన్సీ కూటమి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని బీజేపీ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి కవీందర్ గుప్తా ఆరోపించారు. దుబాయిలో పాకిస్తాన్ ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఈ మూడు పార్టీల నేతలు కలిశారన్నారు. కలవరపడ్డ బీజేపీ: ముఫ్తీ కశ్మీర్లో మహాకూటమి ఏర్పాటు ఆలోచన బీజేపీని కలవరపాటుకు గురిచేసిందని పీడీపీ అధ్యక్షురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. తన లేఖను స్వీకరించలేకపోయిన గవర్నర్ కార్యాలయంలోని ఫ్యాక్స్ మిషన్ అసెంబ్లీ రద్దు ఉత్తర్వుల్ని మాత్రం వెంటనే జారీచేసిందని ఎద్దేవా చేశారు. -
అసెంబ్లీ రద్దు అనుచితం
సరిగ్గా అయిదు నెలలక్రితం పీడీపీ–బీజేపీ కూటమి ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత జమ్మూ– కశ్మీర్లో రాజకీయం వేడెక్కింది. చకచకా జరిగిన పరిణామాల పర్యవసానంగా హఠాత్తుగా బుధవారం అసెంబ్లీ రద్దయింది. ఎప్పుడూ పరస్పరం కత్తులు నూరుకునే ప్రాంతీయ పక్షాలు మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీడీపీ, ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్‌లు కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేయడం మొదలు పెట్టగానే బీజేపీ నాయకత్వం అప్రమత్తమైంది. ఫలితంగా పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు సజ్జాద్ గని లోన్ ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇప్పించాలంటూ వాట్సాప్ మాధ్యమం ద్వారా గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు లేఖ పంపారు. తాము లేఖ ఇవ్వబోతే గవర్నర్ కార్యాలయం స్పందించలేదని, దాన్ని ఫ్యాక్స్ చేయడానికి ప్రయత్నిస్తే అవాంతరాలు వచ్చాయని మెహబూబా చెబుతున్నారు. కేంద్రంలో ఉండే ప్రభుత్వాలు రాష్ట్రాల్లో తమకనుకూలమైన పరిస్థితులు ఉంటే ఒకరకంగా, లేనట్టయితే మరో రకంగా వ్యవహరించడం మన దేశంలో రివాజుగా మారింది. ఈ సంస్కృతిని ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీయే అయినా ఇతర పక్షాలు కూడా అందుకు భిన్నంగా లేవు. ఇష్టానుసారం ప్రభుత్వాలను బర్తరఫ్ చేయడం, బలహీనులకు అధికారం కట్టబెట్టడం ఆనవాయితీ అయింది. ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డాక ఈ ధోరణికి కాస్త అడ్డుకట్ట పడినా పూర్తిగా సమసిపోలేదు. ఇప్పుడు జమ్మూ–కశ్మీర్ గవర్నర్ చేసింది ఇటువంటిదే. 87మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుచేసే పార్టీకి లేదా కూటమికి కనీసం 44మంది మద్దతు అవసరం. సభలో 28మంది సభ్యులున్న పీడీపీ, 12మంది సభ్యులున్న కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. 15మంది సభ్యులున్న నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) దీనికి బయటినుంచి మద్దతిస్తానని చెప్పింది. అంటే మొత్తంగా ఈ పార్టీలకు 56మంది ఎమ్మెల్యేలున్నట్టు లెక్క. అటు సజ్జాద్ తమకు 25మంది సభ్యులున్న బీజేపీతోపాటు మరో 18మంది ఎమ్మెల్యేల మద్దతున్నదని గవర్నర్‌కు పంపిన లేఖలో చెప్పారు. అంటే ఆ పక్షం తమకు 44మంది సభ్యుల బలం ఉందని చెప్పింది. ఇక్కడ న్యాయంగా గవర్నర్ విశ్వసించాల్సింది ఎవరిని? సజ్జాద్ పార్టీకి ఆయనతోపాటు మరో ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. ఈ ఇద్దరికీ బీజేపీ మద్దతు ఉన్నట్టు అర్ధమవుతూనే ఉంది. కానీ మరో 18మంది ఎక్కణ్ణుంచి వచ్చినట్టు? సజ్జాద్ వారి పేర్లు ఇచ్చారా? ఆ ఎమ్మెల్యేల నుంచి వచ్చిన మద్దతు లేఖలు గవర్నర్‌కి సమర్పించారా? ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధపడిన రెండు పక్షాల్లో ఎవరికీ సుస్థిర ప్రభుత్వాన్ని నెలకొల్పే సత్తా లేదన్న నిర్ణయానికి ఆయనెలా వచ్చినట్టు? వాస్తవానికి పీడీపీలో చీలిక తీసుకొచ్చి, తమ సన్నిహితుడు సజ్జాద్ గని లోన్‌కు అధికార పగ్గాలు కట్టబెట్టాలని బీజేపీ కొంతకాలంగా అనుకుంటోంది. ప్రస్తుత అసెంబ్లీ గడువు 2020 డిసెంబర్‌తో ముగుస్తుంది. ప్రస్తుతానికి సజ్జాద్‌తో నెట్టుకొచ్చి, ఆ తర్వాత అసెంబ్లీని రద్దు చేయించి ఆర్నెల్లలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలతోపాటు దానికి కూడా ఎన్నికలు జరిపించాలని బీజేపీ వ్యూహం రచించింది. ఈ విషయం మీడియాలో గుప్పుమన్నా పీడీపీలో మొదట్లో పెద్దగా కదలిక లేదు. తగినంత రాజకీయ అనుభవం లేకనో, తమ పార్టీనుంచి ఎవరూ బయటికి పోరన్న ధీమానో... మొత్తానికి మెహబూబా నిర్లిప్తంగా ఉండిపోయారు. కానీ మంగళవారం ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, ఎంపీ ముజఫర్ హుస్సేన్ బేగ్ చేసిన ప్రకటనతో ఆమె మేల్కొన్నారు. సజ్జాద్ తన కుమారుడితో సమానమని ఆయన చెప్పడంతో కొందరు ఎమ్మెల్యేలు జారుకునేలా ఉన్నారని మెహబూబాకు అర్ధమైంది. అందుకే బుధవారం ఆదరా బాదరాగా కాంగ్రెస్, ఎన్సీలను కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ రాజకీయాల సంగతెలా ఉన్నా...జమ్మూ–కశ్మీర్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న సున్నితమైన ప్రాంతం. అక్కడ అటు వేర్పాటువాదం, ఇటు ఉగ్రవాదం దశాబ్దాలుగా సమస్యగా మారాయి. అందుకే అక్కడ అస్థిరత నెలకొన్నప్పుడు ప్రధాన రాజకీయ పక్షాలు, కేంద్ర ప్రభుత్వమూ ఆచి తూచి అడుగులేయాలి. తమకు అలవాటైన రాజకీయపుటెత్తులు అక్కడ ప్రయోగిస్తే పరిస్థితి వికటిస్తుంది. అది దేశ ప్రయో జనాలకు చేటు తెస్తుంది. తాజా పరిణామాలపై బీజేపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు విపరీత ధోరణులతో ఉన్నాయి. రాష్ట్రంలోని మూడు ప్రధాన పక్షాలూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామ నడంలో కుట్ర దాగున్నదని అనడం అత్యంత దారుణం. ప్రజలెన్నుకున్న పార్టీలు తమ విభేదాలు మరిచి ఒకటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనడం ఏమంత అపరాధం? ఎలాంటి కుట్ర? వాస్తవానికి జమ్మూ–కశ్మీర్లో ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల్లో గవర్నర్ పాలన కన్నా ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వం ఉండటం అత్యవసరం. రెండేళ్ల వ్యవధి ఉండగానే అసెంబ్లీ రద్దు చేయడం తప్పుడు సంకేతాలు పంపుతుంది. గవర్నర్ అన్ని ప్రత్యామ్నాయాలూ పరిశీలించి, ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికీ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసే సత్తా లేదని సంతృప్తి చెందాక ఆ నిర్ణయా నికొస్తే ఎవరూ అభ్యంతరం చెప్పరు. అందుకోసం అసెంబ్లీని సమావేశపరిచి అక్కడే బలా బలాలు తేలిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేది. కానీ దానికి విరుద్ధంగా జమ్మూ–కశ్మీర్లో బూటకపు ప్రజాస్వామ్యం నడుస్తున్నదన్న వేర్పాటువాదుల ప్రచారానికి బలం చేకూర్చే విధంగా రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారే వ్యవహరించడం విడ్డూరం. అసెంబ్లీ రద్దు అంశాన్ని ఏ పార్టీ అయినా కోర్టులో సవాలు చేస్తే గవర్నర్ నిర్ణయం న్యాయ పరీక్షకు నిలబడుతుందా అన్నది సందేహమే. రాజకీయ పక్షాల బలాబలాలు తేలాల్సింది చట్టసభల్లో తప్ప రాజ్భవన్లలో కాదని పలుమార్లు న్యాయ స్థానాలు స్పష్టం చేశాయి. అయినా స్వీయ రాజకీయ ప్రయోజనాలకోసం ఎంతకైనా తెగించటం అధికారంలో ఉన్నవారికి అలవాటైపోయింది. ఇది విచారకరం. -
అసెంబ్లీ రద్దుపై హైకోర్టులో సర్కారుకు ఊరట
-
‘కేబినెటే’ ఫైనల్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను ఉమ్మడి హైకోర్టు కొట్టేసింది. అసెంబ్లీ రద్దుకు మంత్రి మండలి సిఫారసు చేసినప్పుడు రాజ్యాంగంలోని అధికరణ 174(2)(బీ) కింద.. రద్దు ఉత్తర్వులు జారీచేసే అధికారం గవర్నర్‌కు ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. సభ రద్దు విషయంలో గవర్నర్.. సభను హాజరుపరిచి సభ్యుల అభిప్రాయాలను, ఆమోదాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆర్టికల్ 163(1) ప్రకారం కేబినెట్ సలహా మేరకు గవర్నర్ వ్యవహరిస్తారని, అయితే ఎప్పుడు విచక్షణాధికారాలను ఉపయోగించాలో అప్పుడే ఆయన ఆ అధికారులను ఉపయోగిస్తారని పేర్కొంది. ఈ ఆర్టికల్ ప్రకారం.. కేబినెట్ నిర్ణయాన్ని అమలుచేయడం మినహా.. గవర్నర్‌కు మరో ప్రత్యామ్నాయం లేదని వెల్లడించింది. అనవసర సందర్భాల్లో ఆయన తన విచక్షణాధికారాలను ఉపయోగించాల్సిన అవసరం లేదని తెలిపింది. కేబినెట్ సలహాలను పాటించాల్సిన అవసరం లేని సందర్భాల్లో మాత్రమే.. ఆయన తన విచక్షణాధికారాలను ఉపయోగిస్తారని స్పష్టం చేసింది. అందువల్ల.. అసెంబ్లీ రద్దు సమయంలో గవర్నర్ సభను హాజరుపరచాల్సిందేనన్న.. పిటిషనర్ల వాదన చెల్లుబాటు కాదని తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్ల ధర్మాసనం శుక్రవారం ఈ తీర్పు వెలువరించింది. కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని.. దీనివల్ల 20 లక్షల మంది యువత తమ ఓటు హక్కును కోల్పోతారంటూ సిద్దిపేట జిల్లాకు చెందిన పోతుగంటి శశాంక్‌రెడ్డి, ఆర్.అభిలాష్‌రెడ్డిలు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజా మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ సైతం రాష్ట్రపతి పాలన డిమాండ్ చేస్తూ పిల్ వేశారు. వీటిపై వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం మధ్యాహ్నం పై తీర్పును వెలువరించింది. అసెంబ్లీ రద్దు రాజ్యాంగబద్ధమే! ‘తెలంగాణ అసెంబ్లీని మంత్రి మండలి సలహా మేరకు గవర్నర్ రద్దు చేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆయన రాజ్యంగబద్ధంగానే ఇచ్చారు. అసెంబ్లీ రద్దు విషయంలో న్యాయస్థానాల జోక్యం ఎంత మాత్రం అవసరం లేదని భావిస్తున్నాం. అసెంబ్లీ రద్దు వెనుక దురుద్దేశాలు, అసాధారణ కారణాలుంటే తప్ప గవర్నర్ ఉత్తర్వుల్లో జోక్యం తగదని గతంలో ఈ హైకోర్టు ధర్మాసనమే తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో మేం పూర్తిగా ఏకీభవిస్తున్నాం’అని ధర్మాసనం తెలిపింది. శాసనపరమైన నిర్ణయాన్ని మార్చలేం ‘ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 21 ప్రకారం ఓటర్ల జాబితా, ప్రచురణ నిరంతరం జరిగే ప్రక్రియ. ఓటరు అర్హత తేదీని చట్ట సభలు ప్రతీ ఏడాది జనవరి 1గా నిర్ణయించాయి. దీనిని ఒక్కో ఎన్నిక కోసం ఒక్కో రకంగా మార్చడానికి వీల్లేదు. మరో తేదీని నిర్ణయించే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి లేదు. ఇదే సమయంలో అర్హత తేదీని ఆర్టికల్ 226 కింద కోర్టులు ఇచ్చే ఉత్తర్వుల ద్వారా కూడా మార్చడానికి వీల్లేదు. 2019 జనవరిలో కూడా ఎన్నికలు నిర్వహించవచ్చునని, తద్వారా ఆ ఏడాది జనవరి 1వ తేదీకి ఓటరుగా అర్హత ఉన్న వారికి జాబితాలో చోటు దక్కుతుందంటున్నారు. కానీ.. వాదన మమ్మల్ని సంతృప్తిపరచలేదు. అర్హత తేదీ నిర్ణయం శాసనపరమైన నిర్ణయం. దీనిని ఒక్కో ఎన్నిక కోసం ఒక్కో రకంగా మార్చడం వీలులేదు. ఓటర్ల జాబితా తయారీ, మార్పులు, చేర్పులు తదితర విషయాలు న్యాయస్థానాలకు సంబంధించిన వ్యవహారాలు కాదు. ఇదే విషయాన్ని ఇటీవలే ఓ కేసు విచారణ సందర్భంగా స్పష్టంగా చెప్పాం’అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఈ నిర్ణయాలను గుర్తుచేస్తూ.. తమ ముందున్న వ్యాజ్యాలను కొట్టేస్తున్నట్లు తెలిపింది. -
మూఢనమ్మకాల ఆధారంగా అసెంబ్లీ రద్దు...
సాక్షి, హైదరాబాద్: మంత్రి మండలి సిఫార్సు మేరకు అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టులో మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అసెంబ్లీ రద్దును రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ న్యాయవాది కొమిరెడ్డి రాంచందర్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందు లో ఆపద్ధర్మ సీఎం కె.చంద్రశేఖర్‌రావును వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ సీఎస్, గవర్నర్ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి, ప్రధాన ఎన్నికల అధికారి తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యంపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. అసెంబ్లీ రద్దుకు గల కారణాలు కేసీఆర్ వెల్లడించలేదని, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా రద్దు జరిగిందని పిటిషనర్ పేర్కొన్నారు. ‘ముఖ్యమంత్రి ప్రజా ప్రయోజనాల ఆధారంగా కాకుండా మూఢనమ్మకాలు, జ్యోతిష్యం, సంఖ్యా శాస్త్రాలపై ఉన్న నమ్మకాల ఆధారంగా అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ రద్దు సీఎం వ్యక్తిగత నిర్ణయం. ఈ నిర్ణయానికి ముందు ఆయన అసెంబ్లీ అభిప్రాయం తెలుసుకోలేదు. మం త్రి మండలి ఉమ్మడి నిర్ణయం కూడా కాదు. కేసీఆర్ ఎప్పుడో నిర్ణయం తీసేసుకుని నిబంధనల ప్రకారం ఆమోదం కోసం ఏదో మొక్కుబడి మంత్రి మండలి సమావేశం నిర్వహించారు. 6వ నంబర్‌పై ఉన్న నమ్మకం కొద్దీ మంత్రి మండలి సమావేశాన్ని సెప్టెం బర్ 6న నిర్వహించారు. 105 మందికి టికెట్లు ప్రకటించారు. శాసనసభ రద్దు విషయంలో గవర్నర్ తన విచక్షణాధికారాలను ఉపయోగించవచ్చు. పరిస్థితుల ను బట్టి రాష్ట్రపతి పాలనకు సైతం గవర్నర్ సిఫార్సు చేయవచ్చు. లోక్‌సభ ఎన్నికలు 2019 మేలో జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ రద్దుపై పునరాలోచన చేయాలని గవర్నర్ మంత్రి మండలిని కోరి ఉండొ చ్చు. రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ ఆమోదం తెలపడం అప్రజాస్వామికం. అసెంబ్లీ రద్దుతో రాష్ట్రంలో ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం హడావుడిగా తయారు చేస్తోంది. అర్హులైన చాలా మందికి ఓటర్ల జాబితాలో స్థానం కల్పించలేదు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని అసెంబ్లీ రద్దును రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించం డి’ అని కోర్టును పిటిషనర్ అభ్యర్థించారు. -
అసెంబ్లీ రద్దు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
-
అసెంబ్లీ రద్దుపై పిటిషన్: హైకోర్టులో వాదనలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం ఆసక్తికర వాదనలు చోటుచేసుకున్నాయి. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత డీకే అరుణ ఈ పిటిషన్ దాఖలు చేశారు. శాసనసభను సమావేశపరచకుండా, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకుండానే అసెంబ్లీని రద్దు చేశారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది నీరుప్‌రెడ్డి వాదించారు. శాసనసభను సమావేశపరచకుండా అసెంబ్లీని ఎలా రద్దు చేస్తారని పిటిషనర్ ప్రశ్నించారు. కాగా తెలంగాణ అసెంబ్లీ ముందస్తు రద్దును సవాల్ చేస్తూ భారీగా పిటిషన్స్ దాఖలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ చర్యను తప్పుపడుతూ దాదాపు 200 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్) దాఖలయ్యాయి. కాగా తెలంగాణ ఓటర్ల జాబితా సవరణపై దాఖలైన పిటిషన్‌పై నేడు విచారణ కొనసాగింది. ఈ పిటిషన్‌పై ఈసీ కౌంటర్ దాఖలు చేయగా, దీనిపై వాదనలు వినిపించేందుకు తమకు గడువు ఇవ్వాలని పిటిషనర్ కోరగా విచారణను కోర్టు వాయిదా వేసింది. 10న విచారణ అసెంబ్లీ రద్దు పై కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కొమ్మి రెడ్డి రాములు సుప్రీంకోర్టు లో పిటీషన్ దాఖలు చేశారు. సుప్రీం ఆదేశాలతో హైకోర్టు లంచ్ మోషన్ పిటీషన్ గా స్వీకరించి బుధవారం విచారణను చేపట్టనుంది.70 లక్షల ఓట్లు ఓటర్ల జాబితాలో గల్లంతయ్యాయని పిటిషనర్లు ఆరోపించారు. కాగా అసెంబ్లీ రద్దుపై దాఖలైన పిటిషన్లు అన్నింటిపై బుధవారం హైకోర్టు విచారిస్తుంది. -
ప్రశ్నించడమే ‘ముందస్తు’కు కారణమైతే ఎలా?
ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు ప్రశ్నించడం. అలా ప్రశ్నించడమే తప్పని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ అంటున్నారు. అసెంబ్లీ రద్దును ప్రశ్నించినందుకే ప్రజలను, ప్రజాసంఘాలను ఆయన నిందిస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు కాంగ్రెసే కారణమంటున్నారు. అసలు కారణం చెప్పడం లేదు. కేంద్రం, గవర్నర్, కేసీఆర్ కలిసి ముందస్తు ఎన్నికలకు తెర తీశారు. ఈ మొత్తం వ్యవహారంలో గవర్నర్ పాత్ర అనుమానాస్పదంగానే ఉంది. రద్దుకు ముందు కేసీఆర్ బదిలీల ద్వారా నియమించుకున్న అధికారులు కూడా వారితో చేతులు కలిపితే తెలంగాణకు అపార నష్టం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికలు నవంబర్‌లో వస్తాయని అసెంబ్లీ రద్దు రోజే ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆయన మాటలు నిజం కాకుండా ప్రజాస్వామిక వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం బలపడేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. అభిప్రాయాలు మార్చుకో వడం తెలంగాణ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు నైజం. పెద్ద నోట్ల రద్దు సమ యంలో, జీఎస్టీ విష యంలో ఆయన మాట మార్చారు. ప్రజలకు మేలు చేస్తాయని చెబుతున్న జమిలి ఎన్నికలపై కూడా ఆయన మాటపై నిలబడలేదు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలపై లా కమిషన్ చైర్మన్ జస్టిస్ బీఎస్ చౌహాన్ రాసిన లేఖకు కేసీఆర్ జులై ఆరున జవాబిస్తూ జమిలి ఎన్నికలకు తాను అనుకూ లమని చెప్పారు. శాసనసభ, లోక్‌సభకు విడివిడిగా ఎన్నికల నిర్వహణ వల్ల నాలుగు నుంచి ఆరు నెలల కాలం అదనంగా వెచ్చించాల్సి వస్తోందని, జిల్లాల యంత్రాంగమంతా ఎన్నికల పనుల్లో మునిగి పోతుందని ముఖ్యమంత్రి తన లేఖలో చక్కగా వివ రించారు. జమిలి ఎన్నికలపై నిర్వహించిన సమావేశా నికి టీఆర్ఎస్ తరఫున హాజరైన ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ కూడా తర్వాత జమిలి ఎన్నికలతో లాభాలుంటాయని, విడివిడిగా నిర్వహిస్తే నష్టాలుం టాయని మాట్లాడారు. అయితే, జమిలి ఎన్నికలపై తాను వెలిబుచ్చిన అభిప్రాయానికి వ్యతిరేకంగా సరిగ్గా రెండు నెలలకు సెప్టెంబర్ ఆరున కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేయించారు. విడివిడిగా ఎన్నికలు జరిపితే రాష్ట్రానికి, ప్రజలకు, పార్టీలకు, అభ్యర్థులకు నష్టమని తన లేఖలో చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు అదే పరిస్థితి తీసుకొచ్చారు. ముందస్తు ఎన్నికల కారణంగా రాబోయే మూడు నెలల కాలం అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సరిపోతుంది. ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే లోక్‌సభ ఎన్నికలకు ఆరు నెలల సమయం పడుతుంది. తర్వాత వచ్చే ఆరు నెలల కాలంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల హడా వుడి ఉంటుంది. ఈ లెక్కన సుమారు ఏడాది కాలం జాతీయ, రాష్ట్ర ఎన్నికలకే సరిపోతుంది. ఈ సంవ త్సర కాలంలో ప్రభుత్వాధికారులు ఇతర పనులన్నీ వదిలేసి, యుద్ధప్రాతిపదికన జరిగే ఎన్నికల విధు ల్లోనే నిమగ్నమైపోవాల్సి ఉంటుంది. అన్నిటికీ మించి ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుంచి అమలులోకి వచ్చే ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా అభివృద్ధి స్తంభించిపోతుంది. ప్రజా సంక్షే మంపై నిర్ణయాలు తీసుకోవడం కుదరదు. ప్రజా ధనం భారీగా ఖర్చవుతుంది. ఈ విషయాలన్నీ ఆప ద్ధర్మ సీఎంగా ఉన్న కేసీఆర్‌కు తెలుసని ఆయన లా కమిషన్‌కు రాసిన లేఖ చదివితే అర్థమవుతుంది. జమిలి ఎన్నికలు జనానికి మేలు చేస్తాయన్న తన అభిప్రాయం రెండు నెలలకే మార్చుకోవడానికి కారణాలేంటో కేసీఆరే చెప్పాలి. దాదాపు నాలుగైదు నెలలు ముందే వస్తున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా జరిగే నష్టాలకు తాను ఎందుకు ఆహ్వానం పలికా నన్న అంశంపై కేసీఆర్ వివరణ ఇచ్చి తీరాలి. జమిలి ఎన్నికలపై తన అభిప్రాయం ఎందుకు మారిందీ వివరించకుండా ముందస్తుకు తాను వెళ్లడానికి కారణం కాంగ్రెసేని కేసీఆర్ చెప్పడం ఆయన వక్ర రాజకీయ విధానానికి నిదర్శనం. తాను అసెంబ్లీని రద్దు చేయించబోతున్నాననే విషయంపై మీడియాకు లెక్కలేనన్ని లీకులు ఇచ్చారు. రద్దు ఎప్పుడు, ఎలా జరుగుతుందనే విషయంపై గంటలు, నిమిషాలవా రీగా మీడియాకు లోపాయికారిగా తెలిపి మరీ అసెం బ్లీని రద్దు చేశారు. ఈ పనికి ముందు ప్రగతి నివేదన పేరుతో తన బలప్రదర్శనకు ప్రయత్నించారు. ఇది విజయవంతం కాకున్నా తన కార్యక్రమంలో మాత్రం మార్పు లేకుండా శాసనసభను రద్దుచేయించారు. తన ప్రభుత్వాన్ని, అసెంబ్లీని రద్దు చేసుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి మాత్రం కారణం తాను కాదని, కాంగ్రెసేనని చెప్పడం కేసీఆర్‌కే చెల్లింది. కాంగ్రెస్ తాను ఏం చేసినా నిలదీస్తోందని, తన నిర్ణయాల వెనుక ఉండే నిజాల నీడల జాడలను వెతుకుతోందని, ఒక్క మాటలో చెప్పాలంటే అడుగ డుగునా తనను ప్రశ్నిస్తోందని కేసీఆర్ ఆక్రోశించారు. ఆయన మాటలే నిజమనుకున్నా, బాధ్యతగల ప్రతి పక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడంలో తప్పే ముంది? నేడు ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నా, రేపటి ఎన్నికల తర్వాత ఆ స్థానంలోకి టీఆర్ఎస్ రావచ్చు. కాని, ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా దాని ప్రధానమైన పని ప్రశ్నించడమే. తన చేతకానితనాన్ని కప్పిపుచ్చు కోవడానికే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాంగ్రెస్‌పై నింద లేస్తున్నారు. కేసీఆర్ స్వయంగా చెప్పిన విషయాలను బట్టి కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చిన ఐదేళ్లలో తొలి ఆరు నెలల కాలం ఏమీ అర్థం కాని అయోమయస్థితిలో వృథాగా పోయింది. ముందస్తు రద్దు కారణంగా మరో పది నెలలు గడచిపోయాయి. ఈ లెక్కన ఐదు సంవత్సరాల్లో ఏడాదిన్నర కాలాన్ని ముఖ్యమంత్రి తన అసమర్ధత కారణంగా వృథా చేశారు. ఇప్పుడు లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు ఒకే సారి జరగని పరిస్థితిని సృష్టించడంతో భవిష్యత్తులో జరిగే ఎన్నికలు కూడా విడివిడిగా నిర్వహించక తప్పదు. జమిలి ఎన్నికలను పక్కన పెట్టి తాను విడిగా ఎన్నికలకు వెళ్లాలనుకునే పథకం వెనుక కుట్ర కోణం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార దుర్వి నియోగం చేసి, సానుకూల ఫలితాలు సాధించడం ఆయన ప్రధాన ఉద్దేశం. ఇందుకు అసెంబ్లీ రద్దు ప్రకటనకు ముందే తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. గత ఎన్నికల్లో తెలంగాణ ప్రజలను ప్రభావితం చేసిన రెండు పడకగదుల ఇళ్లు, మూడెకరాల భూమి, లక్ష ఉద్యోగాలు అనే ప్రధాన హామీలను నెరవేర్చక పోయినా, మళ్లీ ఎలాగైనా అధికారం దక్కించుకోవా లని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అధికారుల పనితీరును బట్టి కాకుండా తన పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీల బదిలీలు జరిగాయి. శాసనసభ రద్దుకు మంత్రివర్గ తీర్మాన లేఖను గవర్నర్‌కు ఇచ్చిన తర్వాత ఆపద్ధర్మ ప్రభుత్వం లేదా ప్రత్యామ్నాయ ఏర్పాటు విషయంలో ఏం చేయాలనే అంశంపై గవర్నర్ కేంద్రాన్ని సంప్రదించలేదు. ఆప ద్ధర్మ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు బాధ్య తలు వెంటనే అప్పగించడం, సంబంధించిన ఉత్త ర్వులు మీడియాకు అందడం క్షణాల్లో జరిగిపో యాయి. ఎన్నికలు నవంబర్‌లో వస్తాయని అసెంబ్లీ రద్దు రోజే ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆయన మాటలు నిజం కాకుండా ప్రజాస్వామిక వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం బలపడేలా చర్యలు తీసుకోవా ల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. వ్యాసకర్త టీపీసీసీ ప్రధాన కార్యదర్శి -దాసోజు శ్రావణ్ -
ఇద్దరూ ముందుగానే అనుకున్నారా?
సాక్షి, హైదరాబాద్: సీఎం హోదాలో కేసీఆర్ అసెంబ్లీ రద్దు లేఖ ఇచ్చిన వెంటనే గవర్నర్ నరసింహన్ సంతకం పెట్టడమేంటని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత డి.కె.సమరసింహారెడ్డి ప్రశ్నించారు. ఆర్టికల్ 356 ప్రకారం విచారణ చేయకుండా అసెంబ్లీ రద్దును ఎలా ఆమోదిస్తారని ఆయన అన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం, గవర్నర్ల వ్యవహారం చూస్తుంటే ఇద్దరూ అనుకునే ముందస్తుగా రద్దు చేశారని అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. అసలు అసెంబ్లీని ఎందుకు రద్దు చేశారో చెప్పలేకపోతున్నారని, అసెంబ్లీలో తగిన సంఖ్యాబలం ఉండి, రాష్ట్ర ఆదాయం 21.9 శాతం పెరిగితే రద్దు చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలు నిజాయితీగా జరగాలంటే రాష్ట్రపతి పాలన విధించాలని, కేంద్రం ఈ విషయంలో వెంటనే చొరవ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్–టీడీపీలు పొత్తు పెట్టుకుంటాయంటే కేసీఆర్‌లో భయం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. టీడీపీతో తాము పొత్తు పెట్టుకోవడాన్ని కేసీఆర్ తప్పుపడుతున్నారని, మరి టీఆర్ఎస్, టీడీపీ కలిసి పోటీ చేసినప్పుడు ఏమైందని వ్యాఖ్యానించారు. తాము చేస్తే శృంగారం.. వేరొకరు చేస్తే వ్యభిచారమనే రీతిలో కేసీఆర్ వ్యవహరిస్తున్నారని డి.కె. విమర్శించారు. -
నవంబర్‌లో శాసనసభ ఎన్నికలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయడంతో ముందస్తు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఈ ఏడాది నవంబర్లోనే రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. నవంబర్లోనే ఎన్నికలు జరిపేలా ఓటర్ల జాబితా షెడ్యూల్‌ను సవరించింది. సాధారణ షెడ్యూల్ కంటే మూడు నెలల ముందుగానే ఈ ప్రక్రియను పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టింది. 2019 సాధారణ ఎన్నికల కోసం గతంలో ప్రకటించిన షెడ్యూల్లో ఈ మేరకు మార్పులు చేసింది. అక్టోబరు 8న ఓటర్ల తుది జాబితాను ఖరారు చేయనుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) రజత్‌కుమార్ ఈ మేరకు శనివారం కొత్త షెడ్యూల్ జారీ చేశారు. 2018 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండేవారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో పేరు ఉన్నవారికే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుందని స్పష్టంచేశారు. ఓటరు జాబితాలో పేరుతో పాటు గుర్తింపు కార్డు కూడా ఉండాలని పేర్కొన్నారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఓటరు నమోదు ప్రక్రియ జరుగుతుందని రజత్‌కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. ఓటరు జాబితా రూపకల్పన షెడ్యూల్ పూర్తి కాగానే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత గరిష్టంగా 50 రోజులలోపు ఫలితాల ప్రకటనతో పాటు మొత్తం ప్రక్రియ పూర్తి చేయనుంది. ఓటరు జాబితా తాజా షెడ్యూల్ ప్రకారం చూస్తే డిసెంబర్ మొదటి వారంలోపే ఎన్నికల ఫలితాలు సైతం వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. ఓటర్ల జాబితా షెడ్యూల్లో మార్పులు చేసిన నేపథ్యంలో ఓటర్ల నమోదు విషయంలోనూ ఎన్నికల కమిషన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సెస్టెంబర్ 15, 16 తేదీల్లో గ్రామసభలు, స్థానిక సంస్థలో ఓటరు నమోదు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. 2018 జనవరి 1 ఆధారం... కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి ఏటా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను నిర్వహిస్తుంది. జనవరి 1వ తేదీ ఆధారంగా 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పిస్తుంది. ప్రతి ఏటా జనవరి మొదటి వారంలో తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తుంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితా షెడ్యూల్ ప్రక్రియలో మార్పులు జరిగాయి. పాత షెడ్యూల్ ప్రకారం 2019 జనవరి 1ని క్వాలిఫైయింగ్ తేదీగా నిర్ధారించగా, తాజా మార్పుల నేపథ్యంలో 2018 జనవరి 1 వరకు 18 ఏళ్లు నిండినవారికి మాత్రమే ఓటు హక్కు కల్పించనున్నారు. సాధారణ ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 1న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసింది. తాజా మార్పుల నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో రూపొందించిన ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. -
ఇండెంట్లు వచ్చాక నోటిఫికేషన్లు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1, గ్రూప్–2 సహా ఆర్థిక శాఖ అనుమతిచ్చిన పలు పోస్టులకు సంబంధించి కొత్త జోన్ల ప్రకారం ఆయా శాఖల నుంచి ఇండెంట్లు వచ్చాకే నోటిఫికేషన్లు జారీ చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. కేంద్రం ఇటీవల రాష్ట్రంలో కొత్త జోన్లకు ఆమోదం తెలిపినందున వాటి ప్రకారం పోస్టులను పునర్విభజన చేయాల్సి ఉంటుందని చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి, ఆయా శాఖలకు కమిషన్ లేఖలు రాసినట్లు సమాచారం. కొత్త జోన్ల ప్రకారం రోస్టర్ వివరాలిస్తే నోటిఫికేషన్లు జారీ చేస్తామని పేర్కొన్నట్లు సమాచారం. అసెంబ్లీ రద్దు అంశం నోటిఫికేషన్ల జారీకి అడ్డుకాదని, ఆర్థిక శాఖ ఆమోదం తెలిపితే, వివిధ దశల్లో ఉన్న పోస్టుల భర్తీ యథావిధిగా కొనసాగుతుందని టీఎస్పీఎస్సీ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా గ్రూప్–1 పోస్టులను రాష్ట్ర కేడర్ నుంచి మల్టీ జోన్‌కు మార్పు చేయడం, కొన్ని జోనల్ కేడర్‌లో పోస్టులను మార్పు చేసినందున కొత్త జోన్ల ప్రకారం వాటన్నింటినీ పునర్విభజన చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 140 వరకు ఉన్న గ్రూప్–1 పోస్టులు ఏ మల్టీ జోన్లో ఎన్ని పోస్టులు వస్తాయి.. వాటిని జనాభా ప్రాతిపదికన విభజించాలా.. మరేదైనా ఉందా.. అన్న విషయాన్ని ప్రభుత్వం, ఆయా శాఖలు తేల్చుకొని విభజించాల్సి ఉంటుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. జోనల్ పోస్టులను కూడా కొత్త జోన్ల ప్రకారం ఎలా విభజించాలన్నది నిర్ణయించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, ఆయా శాఖలు నిర్ణయించి కొత్త జోన్ల ప్రకారం రోస్టర్, పోస్టుల కేటాయింపుతో కూడిన ఇండెంట్లు ఇచ్చాకే నోటిఫికేషన్లు జారీ చేయొచ్చని టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ పునర్విభజన ప్రక్రియను ప్రభుత్వం, ఆయా శాఖలు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాయో.. ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. కొన్ని జిల్లా పోస్టులకు మాత్రం పెద్దగా ఇబ్బంది లేకపోయినా జిల్లాల వారీగా రోస్టర్ ఇస్తే వాటి భర్తీకి నోటిఫికేషన్లను జారీ చేసే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. -
ముందస్తు కసరత్తు: ఢిల్లీకి రజత్ కుమార్
సాక్షి, హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల నిర్వహణ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు, అవసరాలపై 31 జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమావేశమైంది. ఈవీఎంల పనితీరు, సిబ్బంది అవసరాలు, శాంతిభద్రతల సమస్యలపై సమీక్ష చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో మొదటిసారి వీవీపీఏటీ ప్రవేశపెడుతున్న క్రమంలో వాటిపై కలెక్టర్లకు అవగాహన కల్పించారు. ఢిల్లీకి రజత్ కుమార్ అసెంబ్లీ రద్దు నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. అసెంబ్లీ రద్దైన క్రమంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్‌కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణపై రజత్ కుమార్‌తో సీఈసీ చర్చించనుంది. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం పిలుపు మేరకు రజత్ కుమార్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. -
డిసెంబర్లోనే ఎన్నికలు..?
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై శుక్రవారం జరిగే భేటీలో ఎన్నికల కమిషన్ (ఈసీ) చర్చించనుంది. అన్ని అంశాలను పరిశీలించిన మీదట ఈసీ కీలక నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణలో సత్వరమే ఎన్నికలు నిర్వహించాలా లేక మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరపాలా అనే అంశంపై ఈసీ కసరత్తు సాగించనుంది. ఈసీ ప్రతి మంగళవారం, శుక్రవారం సమావేశమయ్యే క్రమంలో తెలంగాణ అసెంబ్లీ రద్దు అనంతర పరిణామాలు,ఎన్నికల నిర్వహణపై నేటి సమావేశంలో చర్చకు రావచ్చని సీనియర్ అధికారి వెల్లడించారు. తుది నిర్ణయం తీసుకునే ముందు పండుగలు, పరీక్షలు, వాతావరణం వంటి పలు అంశాలను ఈసీ బేరీజు వేస్తుందని చెప్పారు. జూన్ 2019 వరకూ అసెంబ్లీకి గడువున్నాపార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు విముఖత చూపుతూ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అసెంబ్లీ రద్దుకు పూనుకున్నారు. అసెంబ్లీని రద్దు చేస్తూ గురువారం రాష్ట్ర కేబినెట్ చేసిన తీర్మానాన్ని సీఎం కేసీఆర్ గవర్నర్‌కు అందచేశారు. అసెంబ్లీ రద్దు తీర్మానానికి ఆమోదముద్ర వేసిన గవర్నర్ నరసింహన్ తదుపరి ప్రభుత్వం ఏర్పడేవరకూ ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కేసీఆర్‌ను కోరిన విషయం తెలిసిందే. -
పొలిటికల్ గేమ్‌లో నిలిచేదెవరు ? గెలిచేదెవరు?
-
‘లిక్కర్ ఆదాయాన్ని కూడా ఆర్థిక ప్రగతేనన్న కేసీఆర్’
సాక్షి, న్యూఢిల్లీ : అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. పోయే కాలమొచ్చి కేసీఆర్ శాసన సభను రద్దు చేశారని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైన కేసీఆర్ ముందస్తు ఎన్నికల పేరుతో మోసం చేస్తున్నారని అన్నారు. తొమ్మిది నెలల ముందుగా ఎన్నికలకు వెళ్తున్న కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నాలుగున్నరేళ్ల పాలన అబద్ధాలు, మోసాలతో నిండిపోయిందని అన్నారు. అధికారం నుంచి దిగిపోతున్నప్పుడు కూడా కేసీఆర్ అబద్ధాలు చెప్పడాన్ని ప్రజలు గమనించాలని అన్నారు. ఆర్థికంగా తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్తున్న కేసీఆర్ మాటలు వంద శాతం అబద్ధమని చెప్పారు. లిక్కర్ అమ్మాకాల్లో, రైతు ఆత్మహత్యల్లో, అప్పుల్లో తెలంగాణను కేసీఆర్ నెంబర్ వన్ స్థానంలో నిలిపారని ధ్వజమెత్తారు. తెలంగాణ కంటే 6 రెట్లు అధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ మద్యం అమ్మకాల ద్వారా 19 వేల కోట్ల ఆదాయం పొందుతుంటే.. నాలుగు కోట్ల తెలంగాణ 20 వేల కోట్ల ఆదాయం పొందుతోందని తెలిపారు. లిక్కర్ దందాలను కూడా ఆర్థిక వృద్ధి అని చెప్తున్న కేసీఆర్ దిగజారుడు తనం సిగ్గుచేటని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిలో తెలంగాణ నెంబర్‌వన్ స్థానంలో నిలిచిందని అబద్ధాలు చెప్తున్న కేసీఆర్ ఎన్ని హామీలు నెరవేర్చాడో చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పిన కేసీఆర్‌కు ఆ వర్గం వారు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గిరిజనుకుల 3 ఎకరాల భూమి, ఇంటింటికి ఉద్యోగం, డబుల్ బెడ్ రూం ఇళ్లు, ముస్లిం, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు.. ఈ హామీలు ఎంతవరకు నెరవేర్చారని ఉత్తమ్ కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. గాంధీ కుటుంబాన్ని తిట్టడం అనైతికం తెలంగాణ ఇచ్చిన గాంధీ కుటుంబాన్ని తిట్టిన కేసీఆర్ బాగుపడడని ఉత్తమ్ అన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై కేసీఆర్ చేస్తున్న అహకార పూరిత, అవమానకర వ్యాఖ్యలను యావత్ తెలంగాణ సమాజం ఖండిస్తోందని అన్నారు. బందిపోటు దొంగల ముఠాలాగా.. కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుందని విమర్శించారు. రాబోయే ఎన్నికలు నలుగురు సభ్యులున్న కేసీఆర్ కుటుంబానికి, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్య పోరు అని వ్యాఖ్యానించారు. -
డీఎస్‌పై సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
-
అసెంబ్లీ రద్దు..105 స్థానాలకు అభ్యర్ధుల ప్రకటన..