సాక్షి, హైదరాబాద్ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 105 మంది అభ్యర్ధులను ప్రకటిస్తున్నామని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ రద్దు రోజే అభ్యర్ధులను ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు కేటాయించామన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రమే టికెట్ నిరాకరించామన్నారు. హుస్నాబాద్ బహిరంగ సభతో ప్రచారానికి శ్రీకారం చుడతామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉందన్నారు. అనేక త్యాగాల, పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామన్నారు. తెలంగాణ అభివృద్ధిని ప్రధాని, పలు రాష్ర్టాల సీఎంలు ప్రశంసించారన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులపై విపక్షాలు ప్రజల్ని తప్పుదారి పట్టించాయని విమర్శించారు. స్వల్పకాలంలోనే తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందన్నారు.
దేశంలోనే నెంబర్ వన్‌గా తెలంగాణ దూసుకుపోతోందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలో కమీషన్లు దండుకున్నామని విపక్షాలు బురదచల్లుతూ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. అంతకుముందు క్యాబినెట్ సమావేశంలో అసెంబ్లీని రద్దు చేస్తూ ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించారు. కేబినెట్ తీర్మానాన్ని రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌కు సీఎం కేసీఆర్ అందించారు. కేబినెట్ తీర్మానాన్ని గవర్నర్ ఆమోదిస్తూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్‌ను గవర్నర్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment