
నవంబర్‌లోనే అసెంబ్లీ ఎన్నికలు..
సాక్షి, హైదరాబాద్ : రాష్ర్ట అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరుగుతాయని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ అన్నారు. ఈ ఏడాది నవంబర్‌లో ఎన్నికలు జరిగి డిసెంబర్ మొదటివారంలో ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయని అంచనా వేశారు. మధ్యప్రదేశ్, రాజస్ధాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే రాష్ర్టంలో ఎన్నికలు జరుగుతాయన్నారు.
తెలంగాణ ప్రగతి రధ చక్రం ఆగకుండా కొనసాగాలంటే రాష్ర్టం మళ్లీ టీఆర్‌ఎస్‌కే అప్పగించాలని ప్రజలను కోరారు. తెలంగాణకు మేలు చేసే నిర్ణయాలనే తాము తీసుకుంటామనే విశ్వాసం ప్రజలకు ఉందన్నారు. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీలన్నింటినీ నెరవేర్చామని చెప్పుకొచ్చారు. మేనిఫెస్టోలో పొందుపరచని పలు పధకాలను ప్రవేశపెట్టామన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలను మేనిఫెస్టోలో లేకున్నా ప్రభుత్వం చేపట్టిందని గుర్తుచేశారు.