
వంద నియోజకవర్గాల్లో విజయం సాధిస్తాం..
సాక్షి, హైదరాబాద్ :టీఆర్‌ఎస్ వంద స్ధానాల్లో విజయం సాధిస్తుందని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 50 రోజుల్లో వంద సభలను ఏర్పాటు చేసి తమ ఆలోచనలను ప్రజల ముందుంచుతామన్నారు. టీఆర్‌ఎస్ భవన్‌లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో విపక్షాలపై విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ పేదల గురించి ఆలోచించదని ఆరోపించారు. సమైక్య పాలనలో సంక్షేమం కుంటుపడటంతో తాము అణగారిన వర్గాలను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పుకొచ్చారు. సంపద పెంచడం..పేదలకు పంచడం తమ విధానమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని విపక్షాలకు సవాల్ విసిరారు.