తెలంగాణ అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం ఆసక్తికర వాదనలు చోటుచేసుకున్నాయి. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత డీకే అరుణ ఈ పిటిషన్ దాఖలు చేశారు. శాసనసభను సమావేశపరచకుండా, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకుండానే అసెంబ్లీని రద్దు చేశారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది నీరుప్‌రెడ్డి వాదించారు.