హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. అసెంబ్లీ రద్దు చేయడం రాజ్యాంగ విరుద్దమంటూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. కాంగ్రెస్ నేతలు డీకె అరుణ, శశాంక్ రెడ్డిలు శాసనసభ రద్దును సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం ప్రభుత్వ, ఫిటిషనర్ల వాదనలు విన్న ధర్మాసనం అన్ని ఫిటిషన్లను కొట్టివేసింది. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ఇటీవలే కొట్టివేసి తెలిసిందే.