dissolution of Assembly
-
ఏపీ శాసనసభ రద్దు
ఎన్టీఆర్, సాక్షి: ఆంధ్రప్రదేశ్ శాసన సభ రద్దు అయ్యింది. ఈ మేరకు 15వ అసెంబ్లీని రద్దు చేస్తూ బుధవారం మధ్యాహ్నాం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు.వాస్తవానికి 15వ శాసనసభ గడువు జూన్ 16వ తేదీతో ముగియాల్సి ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు జరగడం, ఫలితాలు వెలువడడం, కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడున్న అసెంబ్లీని రద్దు చేయాల్సి రావడం అనివార్యమైంది. -
పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దు.. తాత్కాలిక ప్రధాని ఎవరు?
ఇస్లామాబాద్: పాకిస్తాన్ అసెంబ్లీని రద్దు చేసే ముందు ప్రధాని షెబాజ్ షరీఫ్ ప్రతిపక్ష నాయకుడు రజా రియాజ్ తో ఈరోజు సమావేశం కానున్నారు. వీరిద్దరూ కలిసి ఈ సమావేశంలో అసెంబ్లీ రద్దు తర్వాత పాక్ ఆపద్ధర్మ ప్రధాని ఎవరనేది నిర్ణయిస్తారు. ఆగస్టు 11న పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ రద్దు విషయాన్ని రాష్ట్రపతి అరిఫ్ అల్వి దృష్టికి తీసుకెళ్తూ ఆయనకు లేఖ రాయనున్నారు ప్రస్తుత ప్రధాని షెబాజ్ షరీఫ్. అంతకు ముందే అసెంబ్లీ రద్దయిన తర్వాత ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించడానికి, ఎన్నికలు నిర్వహించడానికి తాత్కాలిక ప్రధానిని నియమించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ఇందులో భాగంగా ఆయన ప్రతిపక్ష నేత రజా రియాజ్ తో ఈరోజు చర్చించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తైన వెంటనే షెబాజ్ షరీఫ్ ప్రధాని పదవికి రాజీనామా చేస్తారు. తాత్కాలిక ప్రధాని రేసులో ఉన్నవారిలో మాజీ ఆర్ధిక శాఖ మంత్రి హఫీజ్ షేక్, నవాజ్ షరీఫ్ వద్ద ఆర్ధిక కార్యదర్శిగా పనిచేసిన తరీక్ బజ్వా, 2018లో తాతకాలిక ప్రధానిగా పని చేసిన మాజీ విదేశీ వ్యవహారాల కార్యదర్శి జలీల్ అబ్బాస్ జిలానీ, పాకిస్తాన్ మాజీ ప్రధాన న్యాయమూర్తి తస్సాదక్ హుస్సేన్ జిలాని, మాజీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మాకేబుల్ బఖీర్, నవాజ్ షరీఫ్ వ్యక్తిగత సహాయకుడు ఫవాద్ హాసన్ ఫవాద్, మాజీ విదేశాంగ శాఖమంత్రి హుస్సేన్ హరూన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. డిసెంబరులో పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో ఎన్నికల ఏర్పాటుకు కొంత సమయం దొరుకుతుందన్న ఉద్దేశ్యంతో అసెంబ్లీని రద్దు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది షెబాజ్ షరీఫ్ ప్రభుత్వం. ప్రభుత్వం రద్దైన మరుక్షణమే పాకిస్తాన్ ఎలక్షన్ కమీషన్ రంగంలోకి దిగి తదుపరి ప్రభుత్వ ఎన్నిక కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. పూర్తి పదవీకాలం పూర్తైన తర్వాత అయితే ఎన్నికలు 60 రోజుల్లోనే నిర్వహిచాల్సి ఉంటుంది. అలా కాకుండా ముందస్తుగా ఎన్నికలకు వెళ్తే మాత్రం పాక్షితం ఎన్నికల కమిషన్ కు 90 రోజుల గడువు ఉంటుంది. ఈలోపే వారు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది కూడా చదవండి: 27 ఏళ్ల తర్వాత థాయ్ యువరాజు రీఎంట్రీ.. అందు కోసమేనా? -
ఇమ్రాన్ యార్కర్..: పాక్‌లో రాజకీయ సంక్షోభం...
నెల రోజులుగా పదవీ గండం ఎందుర్కొంటున్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (69) కీలక సమయంలో తనలోని కెప్టెన్‌ను పూర్తిస్థాయిలో బయటికి తీశారు. అవిశ్వాస తీర్మానంపై డిప్యూటీ స్పీకర్‌తో పదునైన యార్కర్ వేయించారు. ఆ తీర్మానం చెల్లదనే నిర్ణయంతో విపక్షాలను డిప్యూటీ స్పీకర్ క్లీన్‌బౌల్డ్ చేయగానే జాతీయ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేసి ఇన్నింగ్స్‌ను ముందుగానే డిక్లేర్ చేసేశారు. అందుకు అధ్యక్షుడు ఆమోదముద్ర వేయడంతో దేశంలో ముందస్తు ఎన్నికల నగారా మోగింది. ఇదంతా రాజ్యాంగ విరుద్ధమంటూ విపక్షాలు మండిపడ్డాయి. ఇమ్రాన్ యార్కర్‌ను నో బాల్‌గా ప్రకటించాలంటూ సుప్రీంకోర్టు తలుపు తట్టాయి. ఈ నేపథ్యంలో సోమవారం జరగబోయే విచారణపై అంతటా ఉత్కంఠ నెలకొంది. ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం కీలక మలుపు తిరిగింది. ఇమ్రాన్‌ఖాన్‌పై విపక్షాలిచ్చిన అవిశ్వాస తీర్మానంపై నిర్ణయం తీసుకునేందుకు ఆదివారం జరిగిన జాతీయ అసెంబ్లీ కీలక సమావేశం అనూహ్య పరిణామాలకు వేదికైంది. డజనుకు పైగా అధికార పార్టీ సభ్యులు కూడా తీర్మానానికి మద్దతివ్వడంతో ఇప్పటికే మైనారిటీలో పడిన ఇమ్రాన్ ప్రభుత్వం బలపరీక్షలో ఓడటం లాంఛనమేనని అంతా భావించారు. స్పీకర్ అసద్ ఖైజర్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించవచ్చన్న అనుమానంతో సమావేశం మొదలవగానే విపక్షాలు ఆయనపై అవిశ్వాస నోటీసు కూడా ఇచ్చాయి. దాంతో సమావేశానికి అధ్యక్షత వహించిన డిప్యూటీ స్పీకర్ ఖాసిం ఖాన్ సూరి, తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించి విపక్షాలకు ఊహించని షాకిచ్చారు. ‘‘తీర్మానం దేశ రాజ్యాంగానికి, నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. కానీ అదలా లేదని న్యాయ మంత్రి స్పష్టంగా చెప్పారు. అది విదేశీ కుట్రలో భాగంగా రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. అందుకే తీర్మానాన్ని తిరస్కరిస్తున్నా’’ అని ప్రకటించారు. ఆ వెంటనే సభను వాయిదా వేశారు. దీనిపై విపక్షాలన్నీ భగ్గుమన్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ దుయ్యబట్టాయి. నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేదాకా సభను వీడేది లేదన్నాయి. సభలో గలాభా జరుగుతండగానే ఇమ్రాన్ హుటాహుటిన అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీని కలిసి జాతీయ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేయడం, అందుకు ఆయన ఆమోదముద్ర వేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఇమ్రాన్ ఇచ్చిన వరుస షాకులతో నోరెళ్లబెట్టడం విపక్షాల వంతైంది. పాక్ చరిత్రలో ఇప్పటిదాకా ఏ ప్రధానీ పూర్తికాలం పాటు పదవిలో కొనసాగలేదు. షెడ్యూల్ ప్రకారం పాక్‌లో 2023 ఆగస్టులో ఎన్ని కలు జరగాల్సి ఉంది. ఇమ్రాన్ 2018 ఆగస్టు 18న దేశ 22వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. విదేశీ కుట్ర భగ్నం: ఇమ్రాన్ జాతీయ అసెంబ్లీ రద్దు సిఫార్సు అనంతరం ఇమ్రాన్ జాతిని ఉద్దేశించి క్లుప్తంగా ప్రసంగించారు. అవిశ్వాస తీర్మానం ముసుగులో ప్రభుత్వాన్ని మార్చేందుకు జరిగిన విదేశీ కుట్రను విజయవంతంగా అడ్డుకున్నట్టు ప్రకటించారు. దేశ భవితవ్యాన్ని అవినీతి శక్తులు నిర్ణయించలేవన్నారు. ఎన్నికలకు సిద్ధమవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అవిశ్వాస తీర్మానం నిజానికి విదేశీ కుట్రలో భాగమని అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ ఆరోపించారు. తీర్మానం నెగ్గి ప్రభుత్వం పడిపోగానే ఇమ్రాన్‌ను అరెస్టు చేయడానికి కుట్ర జరిగిందన్నారు. దాన్ని భగ్నం చేశామని, 90 రోజుల్లోపు ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. ఇమ్రాన్ 15 రోజుల పాటు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారన్నారు. ఈ పరిణామాలతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని సైన్యం అధికార ప్రతినిధి బాబర్ ఇఫ్తికర్ ప్రకటించారు. అధ్యక్షుడు, డిప్యూటీ స్పీకర్‌కు సుప్రీం నోటీసులు జాతీయ అసెంబ్లీ రద్దును విపక్షాలన్నీ తీవ్రంగా ఖండించాయి. ఇమ్రాన్‌ను దేశద్రోహి అంటూ విపక్ష నేతలు షాబాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో జర్దారీ, మరియం ఔరంగజేబ్ తదితరులు దుమ్మెత్తిపోశారు. పిరికి నిర్ణయాల ద్వారా తన తప్పిదాలను పరోక్షంగా అంగీకరించారని దుయ్యబట్టారు. డిప్యూటీ స్పీకర్ నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ విపక్షాలు సుప్రీంకోర్టులో సంయుక్తంగా పిటిషన్ దాఖలు చేశాయి. అత్యవసరంగా విచారణకు స్వీకరించి తక్షనం తీర్పు వెల్లడించాలని కోరాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అసాధారణ రీతిలో ఆదివారం ప్రత్యేకంగా సమావేశమైంది. మొత్తం ఉదంతంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉమర్ అతా బందియాల్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టింది. జాతీయ అసెంబ్లీ రద్దు విషయంలో అధ్యక్షుడు, ప్రధాని తీసుకున్న నిర్ణయాలు తమ తుది తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. అధ్యక్షుడు, డిప్యూటీ స్పీకర్ తదితరులకు నోటీసులు జారీ చేసి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈలోపు ఎలాంటి రాజ్యాంగవిరుద్ధ చర్యలకూ పాల్పడొద్దని ఇరు వర్గాలనూ ఆదేశించింది. రాజ్యాంగ విరుద్ధమే: నిపుణులు డిప్యూటీ స్పీకర్ చర్య, జాతీయ అసెంబ్లీ రద్దుకు ఇమ్రాన్ సిఫార్సు రెండూ రాజ్యంగ విరుద్ధమేనని పాక్ న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నందుకు ఆర్టికల్ 6 ప్రకారం వారిద్దరిపై న్యాయ విచారణ జరిగే చాన్సుందని సుప్రీంకోర్టు బార్ అధ్యక్షుడు అషన్ భూన్ అన్నారు. మైనారిటీలో పడటమే గాక పార్లమెంటులో అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్న ప్రధానికి సభ రద్దుకు సిఫార్సు చేసే అధికారం ఉండదని ప్రముఖ న్యాయ నిపుణుడు, కేంద్ర మాజీ మంత్రి అభిషేక్ మను సింఘ్వి కూడా అభిప్రాయపడ్డారు. మరోవైపు పంజాబ్ ప్రావిన్స్ గవర్నర్ చౌధరి సర్వర్‌ను ఇమ్రాన్ బర్తరఫ్ చేశారు. అవిశ్వాసం నుంచి అవిశ్వాసం దాకా... 2021లో ఇమ్రాన్ తొలిసారి అవిశ్వాస పరీక్ష గట్టెక్కిన నాటి నుంచి జాతీయ అసెంబ్లీ రద్దు దాకా పాకిస్థాన్‌లో జరిగిన కీలక రాజకీయ పరిణామాలు... ► 2021 మార్చి 3: సెనేట్ ఎన్నికల్లో ఆర్థిక మంత్రి అబ్దుల్ హఫీజ్‌పై విపక్ష నేత యూసుఫ్ రజా గిలానీ నెగ్గడంతో తొలిసారి అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్న ఇమ్రాన్ ప్రభుత్వం ► మార్చి 6: అవిశ్వాస పరీక్షను నెగ్గిన ఇమ్రాన్ ► 2022 మార్చి 8: ద్రవ్యోల్బణం అదుపులో విఫలమయ్యారంటూ ఇమ్రాన్‌పై మరోసారి విపక్షాల అవిశ్వాస తీర్మానం ► మార్చి 19: విపక్ష కూటమికి మద్దతు ప్రకటించిన పలువురు అధికార పీటీఐ ఎంపీలకు ఇమ్రాన్ షోకాజ్ నోటీసులు ► మార్చి 25: అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించకుండానే సభను వాయిదా వేసిన స్పీకర్ ► మార్చి 27: తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు విదేశీ శక్తులు కుట్ర పన్నాయని ఇమ్రాన్ ఆరోపణ ► మార్చి 28: జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విపక్ష నేత షాబాజ్ షరీఫ్ ► మార్చి 30: కీలక భాగస్వామ్య పక్షం విపక్షాలతో చేతులు కలపడంతో మెజారిటీ కోల్పోయిన ఇమ్రాన్ ప్రభుత్వం ► ఏప్రిల్ 1: తనకు ప్రాణహాని ఉందని ఇమ్రాన్ ఆరోపణ ► ఏప్రిల్ 3: అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించిన డిప్యూటీ స్పీకర్ ఖసీం సూరి. జాతీయ అసెంబ్లీ రద్దుకు ఇమ్రాన్ సిఫార్సు, అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆమోదం. వారి నిర్ణయాలు తమ విచారణకు లోబడి ఉంటాయన్న సుప్రీంకోర్టు. -
హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
-
సభకు చెప్పకుండా అసెంబ్లీ రద్దు చేయొచ్చా?
సాక్షి, హైదరాబాద్: శాసనసభ అభిప్రాయం, ఆమోదం తీసుకోకుండానే అసెంబ్లీని ముందస్తుగా రద్దు చేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకోవచ్చో లేదో చెప్పాలని హైకోర్టు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు సంబంధించిన వివరాలను తమ ముందుంచాలని అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావుకు సూచిస్తూ తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు ఎన్నికల కోసం 9 నెలల ముందుగానే అసెంబ్లీని రద్దు చేయడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ సిద్దిపేట జిల్లాకు చెందిన పోతుగంటి శశాంక్‌రెడ్డి, ఆర్.అభిలాష్‌రెడ్డిలు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది పి.నిరూప్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దు చేయడం వల్ల ఓటుహక్కు నమోదు గడువును ఎన్నికల సంఘం కుదించిందని, ఫలితంగా రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం పోయిందని, తద్వారా వారు ఈ ఎన్నికల్లో ఓటు వేసే హక్కును కోల్పోయారని వివరించారు. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు పూర్తయ్యే వారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఓ షెడ్యూల్‌ను విడుదల చేసిందని, దీని ప్రకారం ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు. అనంతరం ముందస్తు ఎన్నికల నేపథ్యంలో 2019 జనవరి 1 గడువును 2018 జనవరి 1గా కుదిస్తూ గత నెల 8న తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి మెమో జారీ చేశారని, దీనిని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని కోర్టును కోరారు. ఇలా ఓటు హక్కును హరించే అధికారం ఎవ్వరికీ లేదన్నారు. ఏ యువత వల్ల తెలంగాణ రాష్ట్రం సాకారమైందో, ఇప్పుడు ఆ యువతకే ఓటుహక్కు లేకుండా పోయిందని చెప్పారు. రద్దుపై సభ అభిప్రాయం తెలుసుకోవాలి... అసెంబ్లీని రద్దు చేస్తూ మంత్రిమండలి సిఫారసు చేసిందని, దీనికి గవర్నర్ ఆమోదం తెలిపారని నిరూప్‌రెడ్డి వివరించారు. వాస్తవానికి అసెంబ్లీని రద్దు చేయాలనుకున్నప్పుడు ఆ విషయాన్ని సభకు తెలియజేసి, ఆమోదం తీసుకోవాల్సిన అవసరం ఉందని, కానీ ముఖ్యమంత్రి ఆ పని చేయకుండా తన ఇష్టమొచ్చినట్లు వ్యవహరించారని పేర్కొన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ప్రజాభీష్టం మేరకే ఎన్నికయ్యారని, అసెంబ్లీ రద్దు విషయం వారికి పత్రికల్లో చూస్తే గాని తెలియలేదని వివరించారు. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో సభకు కారణాలు తెలియచేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని స్పష్టంచేశారు. సాధారణ ఎన్నికలప్పుడు రెండు అసెంబ్లీలకు మధ్య ఆరు నెలల వ్యవధి ఉండాలని, కానీ ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడు ఆరు నెలల వ్యవధి అవసరం లేదని, కాబట్టి ఇంత హడావుడిగా ఎన్నికలు పెట్టాల్సిన అవసరం లేదని నివేదించారు. 2014 ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు 63 మంది గెలిచారని, ఆ తరువాత ఇది 90కి చేరిందని, ఫిరాయింపులను ప్రోత్సహించడం వల్లే అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిందని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘ఈ పాయింట్‌ను ఇప్పటి వరకు ఎవ్వరూ లేవనెత్తలేదు. ఇది ఓ విస్తృత అంశం. దీనిని భిన్న కోణంలో చూడాలి. కాబట్టి ఈ అంశంపై మేం పూర్తిస్థాయిలో వాదనలు వింటాం’ అని స్పష్టం చేసింది. జాతకాలను తేల్చేది ఆ 10 శాతం మందే నిరూప్‌రెడ్డి తన వాదనలను కొనసాగిస్తూ.. తెలంగాణలో మొత్తం 2.81 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఎన్నికల సంఘం నిర్ణయం వల్ల దాదాపు 10 శాతం మంది ఓటుహక్కు కోల్పోయారని, ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తుల జాతకాలను ఈ 10 శాతం మంది ఓటర్లే తీవ్రస్థాయిలో ప్రభావితం చేస్తారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. తప్పులన్నీ సవరించి ఓటర్ల జాబితాను తయారుచేసి ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించడం వల్ల వచ్చిన నష్టం ఏమీలేదని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. శాసనసభ అభిప్రాయం, ఆమోదం తీసుకోకుండానే అసెంబ్లీ రద్దుపై మంత్రిమండలి నిర్ణయం తీసుకోవచ్చో లేదో చెప్పాలని ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు ఏజీ రామచంద్రరావును ఆదేశించింది. ఇది ప్రధాన అంశమని, దీనిని తేల్చిన తర్వాతే ఓటర్ల చేర్పులు, తీసివేతలు, జాబితాల తయారీ విషయానికొస్తామని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. -
ఎన్నికలపై జోక్యం చేసుకోలేం
సాక్షి, హైదరాబాద్: హడావుడిగా తెలంగాణ అసెం బ్లీకి ఎన్నికలు వద్దని.. పార్లమెంటుతో పాటే శాసనసభకు ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘా న్ని ఆదేశించాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడంలో జరిగిన చట్ట ఉల్లంఘనలు ఏమిటో చెప్పకుండా ఎన్నికలను నిర్వహించరాదంటే ఎలా అంటూ పిటిషనర్‌ను ధర్మాసనం నిలదీసింది. ఇతర రాష్ట్రాలతో కలిపి ఎన్నికలు నిర్వహించాలో లేక జమిలి ఎన్నికలు నిర్వహించాలో అన్నది కోర్టులు నిర్ణయించలేవని తేల్చి చెప్పింది. కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైనదని, దాని విధుల్లో తాము జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. చట్ట ఉల్లంఘన జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు చూపకుండా దాఖలు చేసే వ్యాజ్యాలను తాము అనుమతించలేమంటూ పిటిషన్‌ను కొట్టేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సందేహాల నివృత్తికి కోర్టును వేదికగా చేసుకుని ఈ వ్యాజ్యం దాఖలు చేసినట్లు అనిపిస్తోందని.. దీని వెనుక రాజకీయ ఎజెండా ఏమైనా ఉందా అంటూ ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. శాసనసభ రద్దయిన నేపథ్యంలో హడావుడిగా అసెంబ్లీకి ఎన్నికలు వద్దని, పార్లమెంటుతో పాటే అసెంబ్లీ ఎన్నికలు (జమిలి) కలిపి నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రీనివాసరెడ్డి వాదనలు వినిపించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. శాసనసభ రద్దు, ముందస్తు ఎన్నికలకు వెళ్లడంలో జరిగిన చట్ట ఉల్లం ఘనలు ఏమిటని ప్రశ్నించింది. ప్రభుత్వ ముం దస్తు ఎన్నికల నిర్ణయం, గవర్నర్ అసెంబ్లీ రద్దు ఉత్తర్వులు గానీ, ఈసీ పనితీరులో గానీ ఎక్కడైనా చట్ట ఉల్లంఘనలు జరిగినట్లు ఆధారాలుంటే చూపాలని కోరింది. కీలక అంశం కాబట్టే ఈసీకి నోటీసులిచ్చాం.. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్ని ఏపీలో విలీనం చేసిన తర్వాత లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పునర్వ్యస్థీకరణ చేయలేదని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలో కీలక అంశం ముడిపడి ఉందని, అందుకే తాము స్పందించి కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేశామని హైకోర్టు గుర్తు చేసింది. చట్ట ఉల్లంఘనలకు సంబంధించి ఆధారాలుంటే తప్ప ఈసీ విధుల్లో జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు పలు తీర్పులిచ్చిందని తెలిపింది. -
పరిశీలనలో అసెంబ్లీ రద్దు: టిజి వెంకటేష్
హైదరాబాద్: అసెంబ్లీని రద్దు చేసే అంశాన్నీ ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారని మంత్రి టిజి వెంకటేష్ చెప్పారు. బిల్లును అసెంబ్లీలో చర్చించడానికి రాష్ట్రపతి ఎన్నిరోజులు గడువు ఇస్తారనే దానిపై తమ వ్యూహం ఉంటుందన్నారు. 45 రోజుల సమయం ఇవ్వకపోతే రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. సీమాంధ్ర ఎంపీలు ఐక్యంగా ఉంటడంతో సమైక్యాంధ్రకు అనుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. తెలంగాణ బిల్లును అసెంబ్లీలో గట్టెక్కించేందుకు దిగ్విజయ్ సింగ్ జరిపే మంతనాలు ఫలించవని చెప్పారు. గెలిచే అవకాశాలుంటేనే సీఎం కొత్తపార్టీ పెడతారన్నారు.