పరిశీలనలో అసెంబ్లీ రద్దు: టిజి వెంకటేష్
హైదరాబాద్: అసెంబ్లీని రద్దు చేసే అంశాన్నీ ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారని మంత్రి టిజి వెంకటేష్ చెప్పారు. బిల్లును అసెంబ్లీలో చర్చించడానికి రాష్ట్రపతి ఎన్నిరోజులు గడువు ఇస్తారనే దానిపై తమ వ్యూహం ఉంటుందన్నారు. 45 రోజుల సమయం ఇవ్వకపోతే రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
సీమాంధ్ర ఎంపీలు ఐక్యంగా ఉంటడంతో సమైక్యాంధ్రకు అనుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. తెలంగాణ బిల్లును అసెంబ్లీలో గట్టెక్కించేందుకు దిగ్విజయ్ సింగ్ జరిపే మంతనాలు ఫలించవని చెప్పారు. గెలిచే అవకాశాలుంటేనే సీఎం కొత్తపార్టీ పెడతారన్నారు.