
'విభజన అనివార్యమైతే సీఎం కొత్త పార్టీ పెట్టొచ్చు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విభజన అనివార్యమైతే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని మంత్రి టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ విభజన జరిగితే ప్రస్తుతం ఉన్న నేతలు కొత్త పార్టీల్లోకి వెళ్లడం కష్టమన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఎంపీల రాజీనామాలపై భిన్నంగా స్పందించారు. సీమాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఎంపీలు రాజీనామాలు చేయడం సరికాదన్నారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లును వ్యతిరేకించడానికి ఎంపీలు పదవిల్లో కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అసెంబ్లీకి టీ.ముసాయిదా బిల్లు మాత్రమే వస్తోందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు పార్టీలకతీతంగా ఒకే వేదికపైకి రావాలని టీజీ తెలిపారు.
రాజకీయాల్లో ఉంది సన్యాసం కోసం కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమైక్యాంధ్ర కోసం ఢిల్లీలో లక్షల మందితో నిరసన కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.