
ఈ దుస్థితికి కిరణే కారణం: డీఎస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, సీమాంధ్రల్లో ఏర్పడిన గందరగోళ పరిస్థితికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డే కారణమని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఆరోపించారు. కిరణ్ తన స్వార్థం కోసం ప్రజల మధ్య రాగద్వేషాలు పెరిగేలా చేశారని చెప్పారు. క్యాంపు కార్యాలయాన్ని రాజకీయాలకు వాడుకున్నారని మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోనియాగాంధీ పట్టుదల, సంకల్పం వల్లే ప్రత్యేక రాష్ట్ర ఏర్పా టు జరుగుతోందన్నారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేయడం, ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.