d sreenivas
-
'డీఎస్ నిర్ణయం బాధాకరం'
నిజామాబాద్: తమ నేత ధర్మపురి శ్రీనివాస్ పార్టీని వీడిపోవటం బాధాకరమని కాంగ్రెస్ నేతలు కె.సురేష్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత అన్నారు. బుధవారం సాయంత్రం వారు నిజామాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. డీఎస్ తన నిర్ణయాన్ని మార్చుకుని, పార్టీలోనే కొనసాగాలని వారు కోరారు. పార్టీ హైకమాండ్‌పై ఆయన చేసిన విమర్శలు సరికావని వారు తెలిపారు. మెరుగైన అవకాశాల కోసం పార్టీని వీడి వెళ్లి పోతున్న ఆయన...విమర్శించటం పద్ధతి కాదని చెప్పారు. పార్టీ నాయకత్వం ఆయనకు అన్యాయం చేయలేదని చెప్పారు. అయితే, తామెవరమూ పార్టీని వదిలి టీఆర్ఎస్లో చేరటం లేదని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం చేసేందుకు అందరం కలిసి కృషి చేస్తామని పేర్కొన్నారు. -
డీఎస్ ఆశలపై నీళ్లు?
టీపీసీసీ పీఠం దక్కుతుందా! తెలంగాణకు సీఎం అవుతారా ఆందోళనలో అనుచరులు తెరపైకి వచ్చిన కేసీఆర్ పేరు రెండు పార్టీలలో జోరుగా చర్చ ఢిల్లీ పరిణామాలతో కలవరం కాంగ్రెస్ రాజకీయాలలో కీలకంగా వ్యవహరించే పీసీసీ మాజీ చీఫ్ధర్మపురి శ్రీనివాస్ ఆశలు అడియాసలు కానున్నాయా? తెలంగాణ రాష్ట్రంలో తొలుత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, తర్వాత సీఎం కావాలనుకుంటున్న ఆయన కలలు కల్లలు కానున్నాయా? హైకమాండ్‌లో లాబీయింగ్ చేయగల సత్తా ఉన్నా.. ఆయనకు ఈసారి చుక్కెదురు కానుందా? అంటే... అవుననే అంటున్నారు ఆ పార్టీ సీనియర్ నేతలు, రాజకీయ విశ్లేషకులు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు నేపథ్యం లో టీపీసీసీ అధ్యక్ష పీఠంపై కన్నేసిన డి.శ్రీనివాస్ ఆ దిశ గా హైకమాండ్ వద్ద లాబీయింగ్ చేస్తున్నట్లు ప్రచారం ఉంది. ఢిల్లీ పెద్దలను ఒప్పించి మెప్పించగలనన్న ధీమా ఉన్నట్లు ఆయన అనుచరులు చెప్తుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా, రెండు రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం అనంతరం కేసీఆర్‌కు ఆ పదవి కట్టబెడతారనే ప్రచారం డీఎస్‌సహా జిల్లాలోని ఆయన అనుచరులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ కమిటీకి కేసీఆర్ పేరు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ సమేతంగా రెండు రోజుల క్రితం కాంగ్రెస్ అధినే త్రి సోనియాగాంధీ, తదితర నేతలను కలిసిన విషయం విదితమే. ఈ సందర్భంగా రకరకాల ఊహాగానాలకు తెరలేసింది. కీలక అంశాలపై చర్చించేం దు కు వెళ్లినట్లు కేసీఆర్ పార్టీ వర్గాలకు సమాచారం ఇచ్చినా, తె లంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపేందుకు కుటుంబసభ్యులతో వెళ్లి సోనియాను కలిసినట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. తె లంగాణ బిల్లు పార్లమెంట్లో ఆమోదించేకంటే ముందు నుంచే కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం అవుతుందన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు తెలంగాణ రాష్ట్ర కాం గ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఇస్తారనే ఊహాగానాలు కాంగ్రెస్, టీఆర్ఎస్లలో చర్చనీయాంశంగా మారాయి. ప్రత్యక్ష ఎన్నికలలో చుక్కెదురే ప్రత్యక్ష ఎన్నికలలో డీఎస్‌కు పలుమార్లు చుక్కెదురైంది. పీసీ సీ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికలకు సా రథ్యం వహించిన ఆయనకు నామినేటెడ్ పదవులు, తెలంగాణ ఉద్యమం, బీసీ నేతగానే ఆయనకు హైకమాండ్‌పై పట్టు చిక్కిందే తప్ప, ప్రత్యక్ష ఎన్నికలు అచ్చి రాలేదు. బ్యాం కు ఉద్యోగిగా ఉన్న ఆయన 1983లో నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్‌తో రాజకీయ అరంగేట్రం చేశారు. ఎనిమిది పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి మూడుసార్లే గెలుపొం దారు. 1983లో తొలిసారే టీడీపీ అభ్యర్థి డి.సత్యనారాయణపై ఓటమి పాలయ్యారు. 1985లో జరిగిన ఉప ఎన్నికలకు దూరంగా ఉన్న ఆయన1989లో టీడీపీ అభ్యర్థి సత్యనారాయణపై విజయం సాధించారు. 1994లో సతీష్పవార్పై ఓటమిపాలైన డీఎస్, 1999, 2004లో వరుసగా గెలుపొం దారు. నియోజకవర్గాల పునర్విభజనలో అర్బన్‌గా మారిన నిజామాబాద్ నుంచి 2009, 2010 ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణపై ఓటమి చెందారు. 2011 అక్టోబర్‌లో శాసనమండలి సభ్యునిగా ఎన్నిక య్యారు. ఇపుడు టీపీసీసీ పీఠంపై కన్నేశారు. తాజాగా తెరపైకి టీ ఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు రావడంతో ఆయన ఆశలపై నీళ్లు జల్లినట్లేనన్న చర్చ రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతోంది. -
ఈ దుస్థితికి కిరణే కారణం: డీఎస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, సీమాంధ్రల్లో ఏర్పడిన గందరగోళ పరిస్థితికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డే కారణమని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఆరోపించారు. కిరణ్ తన స్వార్థం కోసం ప్రజల మధ్య రాగద్వేషాలు పెరిగేలా చేశారని చెప్పారు. క్యాంపు కార్యాలయాన్ని రాజకీయాలకు వాడుకున్నారని మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోనియాగాంధీ పట్టుదల, సంకల్పం వల్లే ప్రత్యేక రాష్ట్ర ఏర్పా టు జరుగుతోందన్నారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేయడం, ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. -
టీఆర్ఎస్ విలీనానికి సమయం వచ్చింది: డీఎస్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్ర సమితి)ని విలీనం చేసే సమయం ఆసన్నమైందని పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఉద్ఘాటించారు. కాంగ్రెస్ అధిష్టానం ఈ వ్యవహారంపై దృష్టిసారించినట్టు చెప్పారు. పార్టీఈ అధినేత్రి సోనియా గాంధీతో శుక్రవారం ఇక్కడ డీఎస్ సమావేశమయ్యారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం పదవికి రాజీనామా అనంతరం రాష్ట్ర పరిణామాలు, పార్టీ పరిస్థితిపై సోనియా అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. భేటీ అనంతరం డీఎస్ మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణను ఏర్పాటు చేశారని జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల ఆకాంక్షను సోనియా నెరవేర్చారన్నారు. సోనియాకు గీతారెడ్డి, ఆమోస్ కృతజ్ఞతలు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు జె.గీతారెడ్డి, కె.ఆర్.ఆమోస్ సైతం శుక్రవారం వేర్వేరుగా సోనియాగాంధీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
విభజించండి అని చెప్పింది సీమాంధ్ర కాంగ్రెస్ నేతలే : డి.శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని విభజించడం మినహా మరో మార్గం లేదని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలే అధినేత్రి సోనియాగాంధీకి చెప్పారని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ వెల్లడించారు. తన సమక్షంలోనే వారు ఆ మాటలు చెప్పారని పేర్కొన్నారు. అయినా వారి పేర్లను తానిప్పుడు బయటపెట్టదల్చుకోలేదన్నారు. ఇప్పుడు ఆ నేతలు సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భిన్నంగా మాట్లాడుతూ ఉండొచ్చని తెలిపారు. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రులు రాజీనామా చేసినట్లు వస్తున్న వార్తలను శుక్రవారం మీడియా సమావేశంలో డీఎస్ కొట్టిపారేశారు. ‘‘మంత్రులు రాజీనామా చేశారా? అదంతా ఒట్టిమాట. ఎవరూ రాజీనామా చేయరండీ. వాళ్లు చేసింది తక్కువ.. మీడియాలో చూపుతోంది ఎక్కువ’’అని అన్నారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించాలని సీఎం చెబుతున్న మాటలను డీఎస్ తోసిపుచ్చారు. ‘‘తెలంగాణపై నిర్ణయమే జరగదని అన్నారు కదా! అలాగే కేబినెట్ నోట్ కూడా ఇప్పట్లో రాదన్నారు. ఏమైంది? వచ్చింది కదా.. కేంద్రం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంది. రోడ్‌మ్యాప్ ప్రకారమే వెళుతోంది. నిజానికి అసెంబ్లీలో విభజన తీర్మానమే ఉండదు. రాజ్యాంగం ప్రకారం కేంద్ర కేబినెట్ విభజన నోట్‌ను ఆమోదించి రాష్ట్రపతికి పంపుతుంది. ఆ తరువాత రాష్ట్రపతి శాసనసభ అభిప్రాయం మాత్రమే కోరతారు. పార్టీల అభిప్రాయమా? వ్యక్తుల అభిప్రాయమా? అనేది వారి ఇష్టం. అంతే తప్ప ఓటింగ్ ఉండదు. ఒకవేళ ఒత్తిడి చేసి ఓటింగ్ తీసుకున్నా దానిని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం కేంద్రానికి లేదు’’ అని వివరించారు. సీమాంధ్ర నేతలు ఇప్పటికైనా సమైక్యవాదాన్ని పక్కనపెట్టి విభజనవల్ల తలెత్తే సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తే మంచిదన్నారు. కేంద్రానికి విభజన ఎంత ముఖ్యమో సీమాంధ్ర అభివృద్ధి కూడా అంతే ముఖ్యమని, అందులో భాగంగా పెద్ద ఎత్తున ప్యాకేజీతో ఆ ప్రాంతాన్ని ఊహించని విధంగా అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. నిజాం కాలంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, దానిలో సీమాంధ్రుల పాత్ర ఏమీ లేదని డీఎస్ చెప్పారు.