కాంగ్రెస్ పార్టీలో టీఆర్‌ఎస్(తెలంగాణ రాష్ట్ర సమితి)ని విలీనం చేసే సమయం ఆసన్నమైందని పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఉద్ఘాటించారు.
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో టీఆర్‌ఎస్(తెలంగాణ రాష్ట్ర సమితి)ని విలీనం చేసే సమయం ఆసన్నమైందని పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఉద్ఘాటించారు. కాంగ్రెస్ అధిష్టానం ఈ వ్యవహారంపై దృష్టిసారించినట్టు చెప్పారు. పార్టీఈ అధినేత్రి సోనియా గాంధీతో శుక్రవారం ఇక్కడ డీఎస్ సమావేశమయ్యారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం పదవికి రాజీనామా అనంతరం రాష్ట్ర పరిణామాలు, పార్టీ పరిస్థితిపై సోనియా అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. భేటీ అనంతరం డీఎస్ మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణను ఏర్పాటు చేశారని జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల ఆకాంక్షను సోనియా నెరవేర్చారన్నారు.
సోనియాకు గీతారెడ్డి, ఆమోస్ కృతజ్ఞతలు
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు జె.గీతారెడ్డి, కె.ఆర్.ఆమోస్ సైతం శుక్రవారం వేర్వేరుగా సోనియాగాంధీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.