J Geeta Reddy
-
మాజీ మంత్రి గీతారెడ్డి దంపతులకు కరోనా
సాక్షి, జహీరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జె.గీతారెడ్డి కరోనా బారిన పడ్డారు. సోమవారం ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు. తనతో పాటు తన భర్త రాంచంద్రారెడ్డికి పాజిటివ్ వచ్చినట్లు గీతారెడ్డి తెలిపారు. హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. ఇటీవల తనను కలిసిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. బీజేపీ నేత కె.లక్ష్మణ్‌కు కరోనా ముషీరాబాద్(హైదరాబాద్): బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఓబీసీ మోర్చా జాతీ య అ«ధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం జ్వరం, దగ్గు, బాడీ పెయిన్స్ తదితర లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఈ సందర్భంగా లక్ష్మణ్ సూచించారు. విషయం తెలుసుకున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఫోన్లో లక్ష్మణ్‌ను పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఐదుగురు కార్పొరేటర్లు పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
'ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది'
హైదరాబాద్: సిరిసిల్లలో లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ పర్యటనతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కి ఎక్కడ తగలాలో అక్కడ తగిలిందని తెలంగాణ పీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రావణ్ విమర్శించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దొంగ ఇసుక వ్యాపారం చేసేవాళ్లకి కూడా పౌరుషం ఉంటే ఎట్లా అని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం మీద మీకు నమ్మకం ఉందా.. ఉద్యమ సమయంలో మీరు దాడులు చేసినప్పుడు ఆంధ్ర పాలకులు మిమ్మల్ని ఇలానే కొట్టారా అని సూటిగా అడిగారు. కేటీఆర్ దమ్ముంటే రాజీనామా చేయాలని ఆయనకు డిపాజిట్ వస్తే ముక్కును నేలకు రాస్తానని సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఆంధ్ర పోలీసులు ఇలా చెయ్యలేదని అన్నారు. కాంగ్రెస్‌ను విమర్శించడం దారుణం: గీతారెడ్డి టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం దారుణమని మాజీ మంత్రి జె. గీతారెడ్డి అన్నారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. అక్రమ ఇసుక రవాణా అపాల్సింది పోయి ఇలా చెయ్యడం సబబేనా అని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తోందా, దళితులు అంటే ఇంత చిన్న చూపా సూటిగా అడిగారు. కేటీఆర్‌కు ఇది తగునా, ఇలాంటి వాటిపై స్పందించలేరా.. మానవత్వం లేని ఇలాంటి సంఘటనలు కనీసం ఖండించలేరా అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ను ప్రశ్నించే అర్హత ఇంకా కేటీఆర్‌కు రాలేదని అన్నారు. మాజీ స్పీకర్ మీరాకుమార్ సిరిసిల్ల పర్యటన విజయవంతం అయిందన్నారు. అంత పెద్ద నాయకురాలు స్వయంగా జైల్లో ఉన్న వారిని, బాధితులను పరమర్శించించారని.. అలాంటి వ్యక్తితో అబద్దాలు చెప్పించామని టీఆర్ఎస్ నాయకులు అనడం దారుణమన్నారు. -
'రెండు మూడు రోజుల్లోనే అభ్యర్ధి ఎంపిక'
హైదరాబాద్: మెదక్ ఎంపీ స్థానానికి రెండు మూడు రోజుల్లోనే అభ్యర్ధి ఎంపిక పూర్తవుతుందని మాజీ మంత్రులు గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. అభ్యర్థిని ఎంపిక చేసేందుకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన ఓ హోటల్లో బుధవారం మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలు సమావేశమ్యయారు. పోటీకి చాలా మంది ఆసక్తిగా ఉన్నారని, వారి పేర్లను హైకమాండ్‌కు నివేదిస్తామని గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ హామీలు అమలు కాకపోవడం కాంగ్రెస్‌కు అనుకూలంగా మారనుందని తెలిపారు. అభ్యర్ధి ఎవరైనా జిల్లా కాంగ్రెస్ నేతలంతా పార్టీ గెలుపు కోసం ఐక్యంగా కృషి చేస్తామని చెప్పారు. -
టీఆర్ఎస్ విలీనానికి సమయం వచ్చింది: డీఎస్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్ర సమితి)ని విలీనం చేసే సమయం ఆసన్నమైందని పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఉద్ఘాటించారు. కాంగ్రెస్ అధిష్టానం ఈ వ్యవహారంపై దృష్టిసారించినట్టు చెప్పారు. పార్టీఈ అధినేత్రి సోనియా గాంధీతో శుక్రవారం ఇక్కడ డీఎస్ సమావేశమయ్యారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం పదవికి రాజీనామా అనంతరం రాష్ట్ర పరిణామాలు, పార్టీ పరిస్థితిపై సోనియా అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. భేటీ అనంతరం డీఎస్ మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణను ఏర్పాటు చేశారని జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల ఆకాంక్షను సోనియా నెరవేర్చారన్నారు. సోనియాకు గీతారెడ్డి, ఆమోస్ కృతజ్ఞతలు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు జె.గీతారెడ్డి, కె.ఆర్.ఆమోస్ సైతం శుక్రవారం వేర్వేరుగా సోనియాగాంధీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
రెండు రోజుల్లో ‘తెలంగాణ’
పెరగనున్న ఉద్యోగ అవకాశాలు మంత్రి గీతారెడ్డి వెల్లడి జహీరాబాద్, న్యూస్‌లైన్: రెండు రోజుల్లో తెలంగాణ కల సాకారం కాబోతున్నదని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జె.గీతారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ దృఢ నిశ్చయంతో ఉన్నారన్నారు. తెలంగాణ రాష్టం వచ్చిన అనంతరం యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయన్నారు. ఆరు దశాబ్దాల కాలంగా ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం సాగుతోందని, వేయి మందికి పైగా యువకులు బలిదానం చేశారని తెలిపారు. ఇక తెలంగాణ కల సాకారం కాబోతోందన్నారు. దీంతో బాధ్యత కూడా మరింత పెరుగుతుందన్నారు. కాగా జహీరాబాద్ ప్రాంతంలో విద్యాభివ ృద్ధికి క ృషి చేస్తున్నట్లు రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జె.గీతారెడ్డి అన్నారు. మహిళా డిగ్రీ కళాశాల, ఐటీఐ, ఉర్దూ మీడియం టీటీసీ కళాశాలలను మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలను సాధించాలని కోరారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెట్టుకున్న ఆశలను విద్యార్థులు కష్టపడి నెరవేర్చాలన్నారు. విద్యతో పాటు క్రమశిక్షణు కూడా అలవర్చుకోవాలన్నారు. యువతే దేశానికి పట్టుగొమ్మలన్నారు. వచ్చే ఎన్నికల్లో పనిచేసే వారికే పట్టం కట్టాలన్నారు. ఐదు సంవత్సరాల కాలంగా జహీరాబాద్ నియోజకవర్గంలో అనేక అభివ ృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినట్టు తెలిపారు. డిగ్రీ కళాశాలకు వచ్చేందుకు రోడ్డు సదుపాయం లేనందున కొత్తగా రోడ్డు నిర్మాణానికి మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వక్తగా విచ్చేసిన డాక్టర్ వెంకటేశ్వర్లు, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరాజులతో పాటు లెక్చరర్లు పాల్గొన్నారు. -
బిల్లుల కోసం సోనియాపై ఒత్తిడి తెండి
* సర్వే, గీతారెడ్డిలను కోరిన టీజీవో నేతలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బిల్లును పార్లమెంట్లో పెట్టేలా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై ఒత్తిడి తేవాలని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ, రాష్ట్ర మంత్రి గీతారెడ్డిలను తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) నాయకులు శ్రీనివాసగౌడ్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం కోరింది. ఇందుకోసం ఈనెల 19లోపు ఢిల్లీ వెళ్లిరావాలని విన్నవించింది. సర్వే సత్యనారాయణను మహేంద్రహిల్స్‌లోని ఆయన నివాసంలో, మంత్రి గీతారెడ్డిని మారేడ్‌పల్లిలోని ఆమె నివాసంలో గురువారం కలిసిన టీజీవో బృందం ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. తెలంగాణ రాష్ట్ర పక్రియ వేగవంతమవుతోందని, పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని గీతారెడ్డి చెప్పారు. తెలంగాణపై ఎలాంటి భయాందోళనలు అక్కర్లేదని భరోసా ఇచ్చారు. ఈ విషయంలో సీమాంధ్రుల కుట్రలను తిప్పికొడతామని చెప్పారు. సర్వే సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. 2013లోనే తెలంగాణ ఏర్పడుతుందని చెప్పారు. బిల్లు ఆమోదానికి తన వంతు కృషి చేస్తానన్నారు. హైదరాబాద్‌లో ఉన్నవారంతా మావారే.. హైదరాబాద్‌లో ఉన్నవారంతా తమవారేనని, ఎవరూ ఎక్కడికీ పోనక్కర్లేదని, తాము రక్షణగా ఉంటామని టీజీవో నేత శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. సర్వే నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు సీమాంధ్ర రాజకీయ బ్రోకర్లు సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా వారిలో భయాందోళనలు కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా తెలంగాణ బిల్లును ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోకానీ లేదా శీతాకాల సమావేశాల్లోకానీ ఆమోదించేలా చర్యలు చేపట్టాలని సర్వేను ఆయన కోరారు. -
సీఎం వ్యాఖ్యలపై గీతారెడ్డి నో కామెంట్
పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని మంత్రి జె. గీతారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనపై ఎవరెన్ని మాటలు మాట్లాడినా పట్టించుకోవాల్సినసరం లేదని ఆమె అన్నారు. మెదక్ జిల్లా జహీరాబాద్‌లో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో సహజ వనరులు, బొగ్గు గనులు పుష్కలంగా ఉన్నాయని ఆమె తెలిపారు. రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు గీతారెడ్డి నిరాకరించారు. సీమాంధ్రకు చెందిన ఎంపీలు, మంత్రులకు విభజన గురించి ముందే తెలుసునని గీతారెడ్డి నిన్న హైదరాబాద్‌లో అన్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతంలో తలెత్తిన ఉద్యమాలు, ఇతర పరిణామాలు, వాటి వెనుక ఎవరున్నారనే అంశాలపై కేంద్రం, కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక నిఘా పెట్టిందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సహా అందరిపైనా అధిష్టానం పెద్దలు కన్నేసి ఉంచారని పేర్కొన్నారు. తెలంగాణలో నివసిస్తున్న సీమాంధ్రులకు ఎలాంటి భయాందోళనలు అక్కర్లేదని, రాష్ర్టం విడిపోయాక కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, సీమాంధ్రుల రక్షణకు పార్టీ, ప్రభుత్వం తరఫున తాము భరోసా ఇస్తున్నామని చెప్పారు.