
'రెండు మూడు రోజుల్లోనే అభ్యర్ధి ఎంపిక'
హైదరాబాద్: మెదక్ ఎంపీ స్థానానికి రెండు మూడు రోజుల్లోనే అభ్యర్ధి ఎంపిక పూర్తవుతుందని మాజీ మంత్రులు గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. అభ్యర్థిని ఎంపిక చేసేందుకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన ఓ హోటల్‌లో బుధవారం మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలు సమావేశమ్యయారు.
పోటీకి చాలా మంది ఆసక్తిగా ఉన్నారని, వారి పేర్లను హైకమాండ్‌కు నివేదిస్తామని గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ హామీలు అమలు కాకపోవడం కాంగ్రెస్‌కు అనుకూలంగా మారనుందని తెలిపారు. అభ్యర్ధి ఎవరైనా జిల్లా కాంగ్రెస్ నేతలంతా పార్టీ గెలుపు కోసం ఐక్యంగా కృషి చేస్తామని చెప్పారు.