'సునీతా లక్ష్మారెడ్డి బలమైన నేత' | Sunitha Laxma Reddy strong leader for Medak by poll | Sakshi
Sakshi News home page

'సునీతా లక్ష్మారెడ్డి బలమైన నేత'

Published Thu, Aug 28 2014 8:33 PM | Last Updated on Tue, Oct 16 2018 3:09 PM

'సునీతా లక్ష్మారెడ్డి బలమైన నేత' - Sakshi

'సునీతా లక్ష్మారెడ్డి బలమైన నేత'

హైదరాబాద్: మెదక్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులతో పోలిస్తే తమ పార్టీ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి బలమైన నేత అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. మెదక్ ఉప ఎన్నికలపై చర్చించేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు గురువారం గాంధీభవన్ లో  సమావేశమయ్యారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించామని షబ్బీర్ అలీ చెప్పారు. ఎన్నిక ముగిసే వరకు నేతలు మండలాల్లోనే మకాం వేస్తారని తెలిపారు. టీఆర్ఎస్ తరపున కొత్త ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి జగ్గారెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement