sunitha laxma reddy
-
‘సీఎం రేవంత్‌ను వంద సార్లైనా కలుస్తాం’
సాక్షి, తెలంగాణభవన్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఇటీవల మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. ఈ క్రమంలో వారు కాంగ్రెస్‌లో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పందించారు. ఇవన్నీ తప్పుడు ప్రచారం అంటూ వారు ఖండించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి రేవంత్‌ను మర్యాదపూర్వకంగానే కలిశాం. ప్రజా సమస్యలపై చర్చించేందుకే రేవంత్‌ను కలిశాం. సెక్యూరిటీ, ప్రొటోకాల్ సమస్యలపై కలిసి మాట్లాడాం. మేము శ్రమశిక్షణతో పనిచేసే నాయకులం. మా పరువుకు భంగం కలిగేలా ప్రవర్తిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మాకు పార్టీ మారే ప్రసక్తే లేదు. అలాంటి ఆలోచన కూడా మాకు లేదు. మాపై అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారు. మేము కేసీఆర్ వెంటే ఉంటాం. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాం. మా నాయకుడు ఎప్పుడూ కేసీఆరే. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తాం. ఆమ నియోజకవర్గాల్లో సమస్యలు, అభివృద్ధి అంశాల్లో సహకరించాలని సీఎం రేవంత్‌ను కోరాం. కొందరు వ్యక్తులు ఈ విషయాన్ని రాజకీయం చేశారు. రేవంత్ రెడ్డి కేవలం కాంగ్రెస్ పార్టీ కాదు.. తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యమంత్రి. ప్రతిపక్షంలో ఉంటే సీఎంను, మంత్రులను కలవకూడదా?. సీఎం రేవంత్.. ప్రధాని, కేంద్ర మంత్రులను కలవడం లేదా?. ఈ అంశంపై మేము వివరణ ఇవ్వడం లేదు.. మా కార్యకర్తలకు క్లారిటీ ఇస్తున్నాం. నేను నాలుగు సార్లు ఎమ్మెల్యే, మంత్రిగా చేసినా ఇబ్బందులు పడుతున్నాం. కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యేలు కాకుండా కాంగ్రెస్ నాయకులు పంచుతున్నారు. ప్రజల ఓట్లతో మేము ఎమ్మెల్యేలుగా గెలిచాం. నిన్నటి నుంచి వస్తున్న వార్తలను చూస్తే బాధ వేస్తోంది’ అంటూ కామెంట్స్ చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ పార్టీకా? రాష్ట్రానికా?. మాకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం ఏముంది?. సీఎంను మాత్రమే కాదు, ప్రజా సమస్యల కోసం మంత్రులను సైతం కలిశాము. కలుస్తూనే ఉంటాం. సమస్యల పరిష్కారం కోసం ఇంకా వందసార్లు అయినా ముఖ్యమంత్రిని కలుస్తాం. ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి 15 రోజులు అవుతున్నా మాకు నీళ్ళు ఇవ్వలేదు. నేడు కొండా సురేఖ మాజిల్లా పర్యటనకు వస్తున్నారు.. ఎమ్మెల్యేలు లేకుండా ఓడిపోయిన అభ్యర్థికి ప్రోటోకాల్ ఇస్తున్నారు. ఆరు గ్యారెంటీ పథకాలు కాదు.. 13 గ్యారెంటీ పథకాలు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తే మేమే సన్మానం చేస్తాం. దుబ్బాకలో మొన్నటి వరకు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఉంటే ఆయనకు ప్రోటోకాల్ మేము ఇచ్చాము. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేది గులాబీ జెండానే. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు చేస్తాం. మేమున్నంత వరకు కేసీఆర్, గులాబీ జెండాను వదులం’ అని కామెంట్స్ చేశారు. -
బీఆర్ఎస్ అభ్యర్థి సునితా లక్ష్మారెడ్డి కుమారుడి వాహనంపై రాళ్ల దాడి
-
బీఆర్ఎస్ నర్సాపూర్ అభ్యర్థి ఖరారు
సాక్షి, హైదరాబాద్: నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి పేరును భారత రాష్ట్ర సమితి ఖరారు చేసింది. ఈ మేరకు స్వయంగా పేరు ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. బుధవారం ఆమెకు బీఫామ్ అందజేశారు. ప్రస్తుతం నర్సాపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మదన్ రెడ్డికి.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. పార్టీలో అంతర్గత సర్దుబాటు చేస్తూ, అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కోర్ కమిటీ సభ్యులు భేటీ అవుతున్నారు. ఈ క్రమంలోనే నర్సాపూర్ టికెట్‌ను సునీతా లక్ష్మారెడ్డికి ఇవ్వాలని సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ మదన్ రెడ్డి నాతో పార్టీలో మొదటినుంచి కొనసాగుతున్న సీనియర్ నాయకుడు. 35 ఏండ్లనుంచి నాతో సన్నిహితంగా కొనసాగుతున్న నేతగా నాకు అత్యంత ఆప్తుడు. నాకు కుడి భుజం లాంటి వాడు. సోదర సమానుడు. పార్టీ ఆలోచనలను గౌరవించి నర్సాపూర్ ఎన్నికలను తన భుజ స్కందాలమీద వేసుకుని సునీత లక్ష్మారెడ్డి ని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత తీసుకున్నందుకు సంతోషంగా వుంది. ప్రస్థుతం కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ గా కొనసాగుతున్న పార్లమెంటరీ స్థానం నుండి మదన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ కీలక సభ్యులకు, కార్యవర్గానికి అభినందనలు. వారి సీనియారిటిని పార్టీ గుర్తించి గౌరవించినందుకు పార్టీ మఖ్య కార్యవర్గాన్ని అభినందిస్తున్నా. మెదక్ జిల్లాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా కేవలం నర్సాపూర్ లోనే కాకుండా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వారు పాపులర్ లీడర్. వివాద రహితుడు సౌమ్యుడు మదన్ రెడ్డి గారి సేవలను పార్టీ మరింత గొప్పగా వినియోగించుకోవాల్సివుంది. చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటూ కీలక సమయంలో ఐక్యంగా ముందుకు పోవడం ద్వారా మదన్ రెడ్డి గారు పార్టీ ప్రతిష్టను మరింత ఇనుమడింప చేశారు. వారికి నా ధన్యవాదాలు అభినందనలు అని కేసీఆర్ తెలిపారు. వాకిటి సునీతా లక్ష్మారెడ్డి గతంలో కాంగ్రెస్‌లో ఉన్నారు. మూడుసార్లు నర్సాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్సార్, కొణిజెట్టి రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు సీఎంలుగా ఉన్నప్పుడు మంత్రిగా పని చేశారు. 2019లో బీఆర్ఎస్లో చేరారామె. తెలంగాణ ప్రభుత్వంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా, సభ్యురాలిగా ఆమె పని చేశారు. -
మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తొలి చైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి నియమితులయ్యారు. ఆమెతో పాటు మరో ఆరుగురిని సభ్యు లుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. షహీనా అఫ్రోజ్, కుమ్ర ఈశ్వరీబాయి, కొమ్ము ఉమాదేవి యాదవ్, సుధం లక్ష్మి, గద్దల పద్మ, కటారి రేవతీరావు కమిటీలో ఇతర సభ్యులు. కమిషన్ చైర్మన్‌తో పాటు ఆరుగురు సభ్యులూ పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఐదేళ్లు పదవి లో ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రా ష్ట్ర ఆవిర్భావానికి ముందు 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా త్రిపురాన వెంకట రత్నం పనిచేశారు. రాష్ట్ర వి భజన నేపథ్యంలో 2018 మార్చి వరకు ఆమె కొనసాగారు. ఆ తర్వాత తెలంగాణలో మహి ళా కమిషన్‌కు చైర్పర్సన్ నియామకం జరగలేదు. దీంతో సుమారు నాలుగేళ్లుగా కమిషన్ క్రియాశీల కార్యకలాపాలకు దూరంగా ఉంది. ముగ్గురు సీఎంల కేబినెట్లో మంత్రిగా.. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన సునీతా లక్ష్మారెడ్డి 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఏపీలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివ ర్గంలో చిన్న నీటి పారుదల, మహి ళా శిశు సంక్షేమ శాఖల మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభ జన తర్వాత 2014, 2018లో నర్సాపూర్ శాసన సభ స్థానం నుంచి, 2015లో మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరారు. కమిటీ సభ్యులుగా నియమి తులైన గద్దల పద్మ ఉమ్మడి వరంగల్ జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. షహీనా అఫ్రోజ్ (మార్కె ట్ కమిటీ మాజీ చైర్పర్సన్), కొమ్ము ఉమాదేవి యాదవ్ (టీఆర్ఎస్ మహిళా కార్మిక విభాగం), సుధం లక్ష్మి (నిజా మాబాద్), రేవతీ రావు (కరీంనగర్) టీఆర్ఎస్లో క్రియాశీలంగా పనిచేస్తున్నారు. మహిళా హక్కుల పరిరక్షణకు కృషి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తొలి చైర్‌పర్సన్‌గా తనను నియమించడంపై మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళల హక్కుల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా తనను ఈ పదవిలో నియమించిన సీఎం కేసీఆర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే.. ఏళ్ల తరబడి తెలంగాణ మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్‌ను నియమించకపోవడాన్ని సవాలు చేస్తూ ఆర్.రమ్యారావు అనే సామాజిక కార్యకర్త హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ఈ ఏడాది నవంబర్ 18లోగా మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్‌ను నియమించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను పాటించకపోవడం పై చీఫ్ జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్ నేతృత్వంలోని బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, డిసెంబర్ 31ని గడువుగా నిర్దేశించింది. గడువులోగా నియామకం జరగని పక్షంలో సీఎస్ కోర్టుకు రావాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ జనవరి 4వ తేదీకి కేసు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్‌తో పాటు మరో ఆరుగురిని సభ్యులుగా నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
కాంగ్రెస్‌కు గట్టి షాక్
సాక్షి, మెదక్: మెతుకుసీమ ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. ఇందిరాగాంధీ ఇక్కడి లోక్‌సభ నుంచి బరిలో నిలిచి ఎంపీగా విజయం సాధించడమే కాకుండా ప్రత్యేక పరిస్థితుల్లో ప్రధానమంత్రి పదవిని సైతం చేపట్టారు. అలాంటి జిల్లాలో కాంగ్రెస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రధానంగా ‘గులాబీ’ ఆకర్ష్‌తో విలవిల్లాడుతోంది. బడా నేతల నుంచి మొదలు దిగువ శ్రేణి నాయకుల వరకు చేయిచ్చి కారెక్కతుండడంతో కాంగ్రెస్ ఖాళీ అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి వాకిటి సునీత లక్ష్మారెడ్డి సోమవారం కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), స్టార్ క్యాంపెయినర్, మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, నర్సాపూర్, మెదక్ ఎమ్మెల్యేలు చిలుముల మదన్‌రెడ్డి, పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో ఆమె టీఆర్ఎస్ కండువా కప్పుకొన్నారు. ఈ పరిణామం కాంగ్రెస్‌కు షాక్ అనే చెప్పొచ్చు. కష్టకాలంలో కాంగ్రెస్‌కు అండగా ఉన్న ఆమె పార్టీని వీడిన నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్ ఖాళీ అయినట్లేననే చర్చ జోరుగా సాగుతోంది. అనుచరగణంతో సహా.. సునీతారెడ్డి 1999లో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. సీపీఐ అభ్యర్థి, దివంగత చిలుముల విఠల్‌రెడ్డిపై విజయం సాధించారు. 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో్ల వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధిం చారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి చిలుముల మదన్‌రెడ్డి చేతిలో ఓటమి చవిచూ శారు. అనంతరం మెదక్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రెండోసారి మదన్‌రెడ్డి చేతిలోనే ఓడిపోయారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి, రోçశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టడమేకాదు రాష్ట్ర మహిళాæ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, కన్వీనర్‌గా పార్టీకి సేవలందించారు. కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ఇటీవలే ప్రకటించిన ఆమె సోమవారం టీఆర్ఎస్లో చేరారు. సునీతలక్ష్మారెడ్డితోపాటు నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు సైతం ఆమె వెంటే నడిచారు. ‘గులాబీ’ తీర్థం పుచ్చుకున్న వారిలో యువజన కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు సంతోష్‌రెడ్డి, కొల్చారం జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ రజని, పలు మండలాల పార్టీ అధ్యక్షులు, ఇతర నాయకులు సత్యనారాయణగౌడ్, సూరారం నర్సింహులు, అహ్మద్, యాదా గౌడ్, ఎల్లం, నర్సింçహారెడ్డి, హన్మంతరెడ్డి, ప్రవీణ్ తదితరులతోపాటు పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. చంద్రపాల్‌తోపాటు.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మెదక్ మున్సిపాలిటీ, ఏఎంసీ మాజీ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ సోమవారం టీఆర్ఎస్లో చేరారు. 38 ఏళ్లపాటు కాంగ్రెస్‌కు విశేష సేవలందించిన ఆయన తగిన గుర్తింపు లేదని కొన్నాళ్లపాటు మౌనంగా ఉన్నారు. ఈ క్రమంలో పట్టణంలోని టీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రెడ్డి తదితరుల సమక్షంలో ‘గులాబీ’ కండువా కప్పుకొన్నారు. ఆయనతోపాటు పట్టణం, వివిధ మండలాలకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సర్పంచ్‌లు కూడా టీఆర్ఎస్లో చేరారు. ఈ క్రమంలో జిల్లాలో కాంగ్రెస్ ఇక కనుమరుగైనట్లేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణుల్లో నైరాశ్యం ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన చాలా మంది నేతలు వలస బాట పట్టారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన నేతలు టీఆర్ఎస్లో చేరడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. పార్టీలో ఉన్న నేతలు కూడా శ్రేణుల్లో ధైరాన్ని నింపే ప్రయత్నం చేయకపోవడంతో వారి చూపు ఇతర పార్టీల వైపు ఉన్నట్లు తెలుస్తోంది. -
టీఆర్ఎస్లోకి సునీతా లక్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పార్టీని వీడిన సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందుకోసం ఆమె సీఎం కేసీఆర్‌ను కూడా కలిశారు. ఏప్రిల్ 3వ తేదీన నర్సాపూర్‌లో జరిగే ఎన్నికల ప్రచార సభలో ఆమె టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. కాగా, కొంతకాలం నుంచి ఆమె కాంగ్రెస్‌ను వీడుతున్నట్టు వార్తలు వచ్చినప్పటికీ.. ఆమె వాటిని ఖండించిన సంగతి తెలిసిందే. పలువురు బీజేపీ నాయకులు సైతం సునీతను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆమె టీఆర్ఎస్లో చేరాలనే నిర్ణయం తీసుకున్నారు. -
మాది దమ్మున్న ప్రభుత్వం : హరీష్
సాక్షి, మెదక్ : కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణ ప్రజలకు కన్నీళ్లు, టీఆర్ఎస్ గెలిస్తే తాగు నీళ్లు వస్తాయని ఆపధర్మ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం నర్సాపూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో పదేళ్లు మంత్రిగా ఉన్న సునిత లక్ష్మారెడ్డి నర్సాపూర్‌కు కనీసం బస్‌డిపోను కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. సునిత హయాంలో ఇక్కడ జరిగిన అభివృద్ధిపై చర్చకు కాంగ్రెస్ సిద్దమా అని సవాలు విసిరారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నర్సాపూర్‌ను దత్తత తీసుకుంటాననడం హాస్యస్పదమన్నారు. కాంగ్రెస్‌లో సీట్ల గొడవ ఇంకా ఆగిపోలేదని.. త్వరలో కాళేశ్వరం నీళ్లతో తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ కోసం పదవులకు రాజీనామాలు చేసింది టీఆర్ఎస్ నేతలని.. కాంగ్రెస్ నేతలు కాదని గుర్తుచేశారు. తెలంగాణకు వ్యతిరేకమైన టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఇక్కడి ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు. తమది దమ్మున్న ప్రభుత్వమని.. నర్సాపూర్ అభివృద్ధికి 25 కోట్లు ఖర్చు చేసినట్లు హరీష్ వెల్లడించారు. -
సునిత హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు కాంగ్రెస్ సిద్దమా
-
నేడు సునీతారెడ్డి నామినేషన్
సాక్షి, నర్సాపూర్: కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి సునీతారెడ్డి పేరును సోమవారం ప్రకటించింది. ఆమె 1999లో మొదటి సారి నర్సాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వరుసగా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు. సునీతారెడ్డి ఈనెల 14న నామినేషన్ దాఖలు చేయనున్నారని తెలిసింది. పేరు: వాకిటి సునీతాలక్ష్మారెడ్డి భర్త పేరు: దివంగత లక్ష్మారెడ్డి (శివ్వంపేట మాజీ జెడ్పీటీసీ) గ్రామం: గోమారం, శివ్వంపేట మండలం కుటుంబ నేపథ్యం: మామ దివగంత వాకిటి రాంచంద్రారెడ్డి, శివ్వంపేట ఎంపీపీ (వాకిటి రాంచంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి గోమారం సర్పంచులుగా పనిచేశారు.) కొడుకులు: శ్రీనివాస్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి కోడళ్లు: కీర్తిరెడ్డి, రుత్విక్‌రెడ్డి పుట్టినతేదీ, స్థలం: 05–04–1968, సికింద్రాబాద్ విద్యార్హతలు: బీఎస్సీ, వనిత మహావిద్యాలయం, హైదరాబాద్ రాజకీయ చరిత్ర: 1999లో జరిగిన ఎన్నికలలో నర్సాపూర్ నుంచి మొదటి సారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి సీపీఐ అభ్యర్థి చిలుముల విఠల్‌రెడ్డిపై గెలుపొందారు. (నర్సాపూర్ నుంచి మొదటి మహిళ ఎమ్మెల్యేగా చరిత్ర కెక్కారు.) 2004, 2009లో జరిగిన సాధారణ ఎన్నికలలో పోటీ చేసి గెలుపొంది ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారు. 2009లో రాష్ట్ర మైనర్ ఇర్రిగేషన్ మంత్రిగా పని చేశారు. 2010 నుంచి 2014 వరకు ఐకేపీ, పింఛన్లు, వికలాంగుల మంత్రిగా పని చేశారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. 2014 నుంచి మెదక్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. -
నీళ్లను దోచుకెళ్తే చూస్తూ ఊరుకోం..
మెదక్‌రూరల్ : ఇసుక దోపిడీ, భూముల దోపిడీ చాలదన్నట్లు టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు నీళ్లను దోపిడీ చేస్తున్నారని మాజీ మంత్రి, డీసీసీ అధ్యక్షురాలు సునీతాలక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగూరు జలాలను విడుదల చేయాలని, 885 జీఓను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ మండలం మాచవరం శివారులోని ఎమ్ఎన్ కెనాల్ వద్ద కాంగ్రెస్ నేతలు జలదీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సునీతాలక్ష్మారెడ్డి, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డి మాట్లాడుతూ సింగూరు జలాలను వెంటనే విడుదల చేసి అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం ప్రారంభమై నెలన్నర గడుస్తున్నా.. నీళ్లు విడుదల చేయకపోవడంతో వేసిన నాట్లు వేసినట్లే ఎండిపోతున్నాయన్నారు. కెనాల్ పరిధిలోని నార్లు సైతం ముదురుతున్నాయన్నారు. సింగూరులో 29 టీఎంసీల నీరు ఉంటే 15 టీఎంసీల నీటిని మంత్రి హరీశ్‌రావు కరీంనగర్‌కు తరలించారన్నారు. దీంతో 14 టీఎంసీల నీరు మాత్రమే సింగూరులో ఉందన్నారు. 16.5 టీఎంసీల నీరు ఉంటేనే ఘనపురం కాల్వలోకి సింగూరు జలాలను విడుదల చేయాలంటూ 885 జీఓను తీసుకురావడం దుర్మార్గమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మెదక్ జిల్లా రైతులపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. నిబంధనలను తుంగలో తొక్కుతుందని విమర్శించారు. కేసీఆర్‌ను సీఎం చేయడం, హరీశ్‌రావును మంత్రిని చేయడం, పద్మాదేవేందర్‌రెడ్డిని ఉపసభాపతిని చేయడమే రైతులు చేసిన పాపమా అని ప్రశ్నించారు. ఓట్లేసి గెలిపించిన రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. చెరుకు రైతుల జీవితాల్లో చేదు సింగూరు డెడ్ స్టోరేజీలో ఉన్నప్పుడు కూడా రైతులకు నీళ్లు వదిలిన ఘనత కాంగ్రెస్‌దన్నారు. సింగూరు జలాలు రైతుల హక్కు అని, మరో ఐదు రోజుల్లో సింగూరు నీటిని విడుదల చేయకుంటే రైతులతో కలిసి ప్రజాఉద్యమం చేస్తామని హెచ్చరించారు. పోరాడి సాదించుకున్న రాష్ట్రంలో తెలంగాణ పాలకులు నీళ్లను దోచుకెళ్తుంటే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యేదాక రైతులు పంటలు పండించుకోవద్దా ? అన్ని ప్రశ్నించారు. జిల్లా రైతులపై కక్ష్య సాధింపు చర్యలు చేపడుతున్నారు. 100 రోజుల్లో చెక్కర ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి చెరుకు రైతుల జీవితాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేదు నింపిందన్నారు. రైతు వ్యతిరేక విధానాలను త్వరలో ఎండగడతామన్నారు. అనంతరం కలెక్టరేట్‌కు రైతులతో కలిసి పాదయాత్రగా వెళ్లి డీఆర్వో రాములుకు వినతి పత్రం అందజేశారు. అక్కడి నుంచి మెదక్ పట్టణంలో రాస్తారోకో చేయగా పోలీసులు కాంగ్రెస్ శ్రేణులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు బట్టి జగపతి, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, సుప్రభాత్రావు, చంద్రపాల్, మామిళ్ల ఆంజనేయులు, మ్యాడం బాలకృష్ణ, ఆంజనేయులు, శ్యాంసుందర్, శ్రీకాంత్, నరేందర్, మార్గం నాగరాజు, మేకల అంజనేయులు, శ్రీనివాస్‌గౌడ్, కృష్ణ మెదక్, పాపన్నపేట, కొల్చారం రైతులు ఉన్నారు. జలదీక్షకు అనూహ్య స్పందన జలదీక్షకు మెదక్, పాపన్నపేట, కొల్చారం మండలాల నుండి వందల సంఖ్యలో రైతులు తరలివచ్చారు. సభా ప్రాంగణంలో రైతులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు టీఆర్ఎస్ రైతు వ్యతిరేక విధానాలపై ధ్వజమెత్తారు. మెదక్–నర్సాపూర్ ప్రధాన రహదారిపై వంటవార్పు కార్యక్రమం నిర్వహించి భోజనాలు చేశారు. కాంగ్రెస్ నేతలతో పాటు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం వల్ల ఎమ్ఎన్ కెనాల్ కిక్కిరిసింది. సింగూరు నీటిని విడుదల చేసి పంట పొలాలను సస్యశామం చేయాలని డిమాండ్ చేశారు. -
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం
హత్నూర(సంగారెడ్డి): 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేయడం ఖాయమని మాజీ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సునీతాలక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం హత్నూర మండలం చందాపూర్ గ్రామంలోని వివిధ యువజన సంఘాల సభ్యులు, యువకులు సుమారు 25 మంది ఆ గ్రామ మాజీ ఉపసర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గొల్లకృష్ణ ఆధ్వర్యంలో హైదరాబాద్ తరలివెళ్లి సునీతారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతు తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజావ్యతిరేక పాలన సాగించడంతో నేటి యువతరం కాంగ్రెస్ పార్టీలో రోజుకో గ్రామం నుంచి చేరడమే 2019 ఎన్నికలకు శుభసూచికమన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడకుండా పార్టీ అభివృద్ధి కోసం పని చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌పార్టీ మండల శాఖ అధ్యక్షులు కొన్యాల నర్సింహారెడ్డి, మాజీ ఎంపీపీ ఆంజనేయులు, ఎంపీటీసీ ఆశయ్య, సర్పంచ్ రాములు, నాయకులు రాంచంద్రారెడ్డి, కృష్ణ, విప్లవకన్నతో పాటు చందాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మెదక్‌లో మరోసారి టీఆర్ఎస్ ఘనవిజయం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెతుకుసీమలో ‘కొత్త గులాబీ’ పరిమళించింది. టీఆర్ఎస్ పార్టీకే ప్రజలు మరోసారి పట్టం కట్టారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై జిల్లా ఓటర్లు సంపూర్ణ విశ్వాసం ప్రకటించారు. మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో పోలింగ్ శాతం తగ్గినా.. ప్రత్యర్థుల మీద ఆ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. ఏకపక్షంగా సాగిన ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి 3,61,286 ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి రెండో స్థానంలో, బీజేపీ అభ్యర్థి తూర్పు జగ్గారెడ్డి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఈ ఇద్దరు అభ్యర్థులు ఓటమి పాలైనప్పటికీ డిపాజిట్లు రావడంతో పరువు దక్కినట్టయింది. గత సాధారణ ఎన్నికలతో పోలిస్తే టీఆర్ఎస్ పార్టీకి ఉప ఎన్నికలో 0.2 శాతం ఓట్లు అదనంగా వచ్చాయి. గత ఎన్నికల్లో ఆ పార్టీకి 55 శాతం ఓట్లు రాగా, ఈసారి 55.2 శాతం ఓట్లు వచ్చాయి. పోటీలో నిలబడిన అభ్యర్థులు ఎవరూ తమకు నచ్చలేదని 10,687 మంది ఓటర్లు ‘నోటా’కు ఓటు వేశారు. మంగళవారం మొత్తం 22 రౌండ్లలో జరిగిన ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యత కనబరిచారు. గజ్వేల్, సిద్దిపేట, మెదక్, పటాన్చెరు, సంగారెడ్డి, దుబ్బాక, నర్సాపూర్ నియోజకవర్గాల్లో ప్రభాకర్‌రెడ్డికి మెజార్టీ ఓట్లు లభించాయి. ఓటమిని ముందే ఊహించిన సునీతా లక్ష్మారెడ్డి, జగ్గారెడ్డి ఓట్ల లెక్కింపు కేంద్రానికి కూడా రాలేదు. ముగ్గురిలో ఇద్దరు కారు గుర్తుకే.. మొత్తం 10,46,114 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోగా ప్రతి ముగ్గురిలో ఇద్దరు కారు గుర్తుకే ఓటేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి 5,71,810 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 2,10,524 ఓట్లు, బీజేపీ అభ్యర్థి తూర్పు జగ్గారెడ్డికి 1,86,343 ఓట్లు వచ్చాయి. గత సాధారణ ఎన్నికల్లో 77.35 శాతం పోలింగ్ కాగా, అప్పుడు కేసీఆర్‌కు 3.97 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. అదే మెజార్టీని తిరిగి సాధించాలని టీఆర్ఎస్ పావులు కదిపింది. అయితే ఈ సారి 9.56 మేర పోలింగ్ శాతం తగ్గింది. ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంతోనే పోలింగ్ శాతం తగ్గిందని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. రైతు వ్యతిరేకత బలంగా ఉందని, తమకే మెజార్టీ ఓట్లు పడతాయని, టీఆర్ఎస్ పార్టీ భారీగా నష్టపోతారని ప్రతిపక్షాలు అంచనా వేశాయి. కేసీఆర్ వంద రోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అనే వాదనను తెరమీదకు చెప్పి భారీ ప్రచారం చేశారు. నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కూడా మెదక్ ప్రజల తీర్పు మా పాలనకు రెఫరెండమే అని ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో మెదక్ ఉప ఎన్నిక ప్రత్యేకతను సంతరించుకుంది. అయితే ప్రతిపక్షాల అంచనాలను మెదక్ జిల్లా ప్రజలు తలకిందులు చేశారు. త్రుటిలో తప్పింది... బీజేపీ అభ్యర్థి తూర్పు జగ్గారెడ్డి ‘డిపాజిట్’ గండం నుంచి త్రుటిలో బయటపడ్డారు. అభ్యర్థులకు డిపాజిట్లు దక్కాలంటే పోలయిన మొత్తం ఓట్లలో కనీసం 6 వంతు ఓట్లు రావాలి. ఉప ఎన్నికలో మొత్తం 10,46,114 ఓట్లు పోలయ్యాయి. ఆరో వంతు అంటే 1,74,353 ఓట్లు రావాలి. అనూహ్యంగా జగ్గారెడ్డికి 1,86,343 ఓట్లు రావటంతో డిపాజిట్ దక్కింది. జగ్గారెడ్డి సంగారెడ్డి నియోజకవర్గంపై భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇక్కడ తనకు ఆధిక్యత వస్తుందని అంచనా వేశారు. అయితే సంగారెడ్డిలో 18,849 ఓట్లు వెనుకబడిపోయారు. ఇక కాంగ్రెస్ పార్టీని సాంప్రదాయక ఓట్లు ఆదుకున్నాయి. డిపాజిట్ ఓట్ల కంటే సునీతారెడ్డికి 36,171 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. సునీతారెడ్డి తన సొంత నియోజకవర్గం నర్సాపూర్ మీద ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి బాగా కలిసి వస్తుందని భావించారు. కానీ అక్కడ టీఆర్ఎస్కు 6,443 ఓట్ల ఆధిక్యత లభించింది. టీఆర్ఎస్కు 73,710 ఓట్లు రాగా, సునీతారెడ్డికి 67,267 ఓట్లు మాత్రమే వచ్చాయి. సత్తా చాటిన సిద్దిపేట సిద్దిపేట మునుపటి సత్తా చాటింది. కొత్త ప్రభాకర్‌రెడ్డికి తిరుగులేని ఆధిక్యతను తెచ్చిపెట్టింది. టీఆర్ఎస్ ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి కాంగ్రెస్, బీజేపీలు సిద్దిపేటనే టార్గెట్ చేశాయి. మరో వైపు మంత్రి హరీష్‌రావు సిద్దిపేటను పూర్తిగా తన కార్యకర్తలకు అప్పజెప్పి ఆయన సంగారెడ్డి, పటాన్చెరు, నర్సాపూర్ మీదనే దృష్టి సారించారు. అనుకున్నట్టుగానే సిద్దిపేట నియోజకవర్గంలో భారీగా పోలింగ్ తగ్గటంతో ప్రతిపక్ష నాయకులు తమ వ్యూహం ఫలించినట్టుగానే భావించారు. టీఆర్ఎస్ మెజారిటీకి గండి పడ్డట్లేనని అనుకున్నారు. కానీ ప్రజా తీర్పు వేరేలా ఉంది. ఇక్కడ మొత్తం 1,35,593 ఓట్లు పోల్ కాగా.. ఇందులో 70 శాతం ఓట్లు అంటే 93,759 ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. మూడు నెలల కిందట జరిగిన ఎన్నికల్లో కూడా సిద్దిపేటలో టీఆర్ఎస్కు 70 శాతం ఓట్ల ఆధిక్యత రావటం గమనార్హం. పోస్టల్ బ్యాలెట్‌లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం... పోస్టల్ బ్యాలెట్లలోనూ టీఆర్ఎస్కు ఆధిక్యమే లభించింది. ఎన్నికల అధికారులు ముందుగా పోస్టల్ బ్యాలెట్లనే లెక్కించారు. మొత్తం 22 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రాగా అందులో 10 టీఆర్ఎస్కు, 9 బీజేపీకి, ఒకటి కాంగ్రెస్‌కు దక్కాయి. రెండు ఓట్లు చెల్లలేదని అధికారులు ప్రకటించారు. -
'సునీతా లక్ష్మారెడ్డి బలమైన నేత'
హైదరాబాద్: మెదక్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులతో పోలిస్తే తమ పార్టీ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి బలమైన నేత అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. మెదక్ ఉప ఎన్నికలపై చర్చించేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు గురువారం గాంధీభవన్ లో సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించామని షబ్బీర్ అలీ చెప్పారు. ఎన్నిక ముగిసే వరకు నేతలు మండలాల్లోనే మకాం వేస్తారని తెలిపారు. టీఆర్ఎస్ తరపున కొత్త ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి జగ్గారెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. -
'రెండు మూడు రోజుల్లోనే అభ్యర్ధి ఎంపిక'
హైదరాబాద్: మెదక్ ఎంపీ స్థానానికి రెండు మూడు రోజుల్లోనే అభ్యర్ధి ఎంపిక పూర్తవుతుందని మాజీ మంత్రులు గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. అభ్యర్థిని ఎంపిక చేసేందుకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన ఓ హోటల్లో బుధవారం మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలు సమావేశమ్యయారు. పోటీకి చాలా మంది ఆసక్తిగా ఉన్నారని, వారి పేర్లను హైకమాండ్‌కు నివేదిస్తామని గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ హామీలు అమలు కాకపోవడం కాంగ్రెస్‌కు అనుకూలంగా మారనుందని తెలిపారు. అభ్యర్ధి ఎవరైనా జిల్లా కాంగ్రెస్ నేతలంతా పార్టీ గెలుపు కోసం ఐక్యంగా కృషి చేస్తామని చెప్పారు. -
గాదె- మహిళా మంత్రుల సంవాదం
హైదరాబాద్: తెలంగాణ మహిళా మంత్రులతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మధ్య శాసనసభ ప్రాంగణంలో ఆసక్తికర సంవాదం నడిచింది. కేబినెట్ సమావేశానికి ఎందుకు రాలేదని మంత్రులు డీకే అరుణ, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలను గాదె వెంకటరెడ్డి ప్రశ్నించారు. మంత్రి పదవులకు రాజీనామా చేసి నిరసన తెలపొచ్చు కదా అని అడిగారు. అయితే వెంకటరెడ్డి వ్యాఖ్యలకు మహిళా మంత్రులు దీటుగా స్పందించారు. ఢిల్లీలో సమైక్య నిరసన తెలిపేందుకు ముందు మీరెందుకు రాజీనామా చేయలేదని వారు ఎదురు ప్రశ్నించారు. విభజన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండా చూడాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహా సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ఎంపీలు బుధవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మౌనదీక్ష చేసిన సంగతి తెలిసిందే. -
సీఎం వ్యాఖ్యలు బాధాకరం
నర్సాపూర్, న్యూస్‌లైన్: రాష్ట్ర శాసనసభలో ప్రత్యేక తెలంగాణ ముసాయిదా బిల్లుపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలు బాధాకరమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి అన్నా రు. ఆమె గురువారం సాయంత్రం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తే సీమాంధ్రలో కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లుతుందని తెలిసే సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. పార్టీ నాయకుడిగా, సీఎంగా ఉంటూ తాను రాష్ట్ర విభజనకు వ్యతిరేకమని ప్రకటించడం సబబుకాదన్నారు. మంత్రి బాలరాజు సభలో మాట్లాడుతూ తాను సమైఖ్యవాదిని అయినా పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించడం అభినందించారు. రాష్ట్రపతి 30వరకు గడువు పెంచడం పట్ల ఆమె స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు నిదర్శనమని చెప్పారు. జగన్నాథరావు ఆశయాలు కొనసాగిస్తాం స్థానిక కాంగ్రెస్ నాయకుడు, దివంగత మాజీ డిప్యూటీ సీఎం జగన్నాథరావు రెండవ వర్ధం తిని పురస్కరించుకుని గురువారం సాయంత్రం మంత్రి సునీతాలక్ష్మారెడ్డి నర్సాపూర్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంత్రి వెంట సర్పంచ్ వెంకటరమణారావు, కాంగ్రెస్ నాయకులు ఆంజనేయులుగౌడ్, సత్యంగౌడ్, శ్రీనివాస్‌గుప్తా, అనిల్‌గౌడ్, నయీం, విష్ణువర్ధన్‌రెడ్డి,వెంకటేశం పాల్గొన్నారు. మాజీ డిప్యూటీ సీఎంకు ఘన నివాళి స్థానిక కాంగ్రెస్ నాయకుడు, దివంగత మాజీ డిప్యూటీ సీఎం చౌటి జగన్నాథరావు రెండో వర్ధంతి సందర్భంగా గురువారం స్థానిక ఆయన విగ్రహం వద్ద ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలు పార్టీల నాయకులు ఘనంగా నివాళ్లర్పించారు. ఆయన భార్య వనమాల, కుమారుడు శ్రీనివాసరావు, కోడలు రమాదేవితోపాటు ఇతర కుటుంబ సభ్యులతో పాటు ఆయా పార్టీల నాయకులు పాల్గొని జగన్నాథరావు విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. -
అంగన్వాడీల్లో ‘బాలామృతం’
చిన్నారులకు సెరెలాక్ తరహా పౌష్టికాహారం: మంత్రి సునీతా లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో ‘బాలామృతం’ పథకాన్ని అమలు చేస్తున్నామని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి చెప్పారు. పథకం కింద చిన్నారులకు గోధుమలు, పల్లీపొడి, పాలపొడి, చక్కెర, నూనెలతో కూడిన సెరెలాక్ తరహా మిశ్రమ పౌష్టికాహారాన్ని అందజేస్తామని తెలిపారు. శనివారం సచివాలయంలో శిశు సంక్షేమ శాఖ రూపొందించిన కొత్త కేలండర్‌ను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిగా బాధ్యతలు తనకు సంతృప్తినిచ్చాయని చెప్పారు. కోడిగుడ్డు ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో అంగన్వాడీలకు సరఫరా కోసం నిర్ణయించిన ధర సీలింగ్‌ను తొలగించినట్లు వెల్లడించారు. నల్లగొండ జిల్లా పెదవూర మండలం ఏనెమీద తండా అనాథాశ్రమంలోని బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డ ట్యూటర్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేస్తామన్నారు. తెలంగాణ బిల్లుపై చర్చ మొదలైంది: అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ మొదలైనట్టేనని మంత్రి సునీతా లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని స్పీకర్ కూడా చెప్పారన్నారు. స్పీకర్ చెప్పిన విధంగా తెలంగాణ బిల్లుపై చర్చ కొనసాగుతోందంటే చర్చ ప్రారంభమైనట్లే కదా అని ప్రశ్నించారు.