
సునీతారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన యువజన సంఘాల సభ్యులు
హత్నూర(సంగారెడ్డి): 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేయడం ఖాయమని మాజీ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సునీతాలక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం హత్నూర మండలం చందాపూర్ గ్రామంలోని వివిధ యువజన సంఘాల సభ్యులు, యువకులు సుమారు 25 మంది ఆ గ్రామ మాజీ ఉపసర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గొల్లకృష్ణ ఆధ్వర్యంలో హైదరాబాద్ తరలివెళ్లి సునీతారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతు తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజావ్యతిరేక పాలన సాగించడంతో నేటి యువతరం కాంగ్రెస్ పార్టీలో రోజుకో గ్రామం నుంచి చేరడమే 2019 ఎన్నికలకు శుభసూచికమన్నారు.
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడకుండా పార్టీ అభివృద్ధి కోసం పని చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌పార్టీ మండల శాఖ అధ్యక్షులు కొన్యాల నర్సింహారెడ్డి, మాజీ ఎంపీపీ ఆంజనేయులు, ఎంపీటీసీ ఆశయ్య, సర్పంచ్ రాములు, నాయకులు రాంచంద్రారెడ్డి, కృష్ణ, విప్లవకన్నతో పాటు చందాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.