సాక్షి, సంగారెడ్డి: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో తెలంగాణలో కూడా హస్తం నేతలు స్పీడ్ పెంచారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో కొందరు సీనియర్లను కూడా పార్టీలోకి ఆహ్వానించింది. మరోవైపు.. కొంత మంది హస్తం నేతలు కాంగ్రెస్‌ను వీడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. బీఆర్‌ఎస్‌లో చేరునున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ సర్కార్ వైపు జగ్గారెడ్డి మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ఇక, కొంతకాలంగా జగ్గారెడ్డి.. బీఆర్‌ఎస్ నేతలతో సఖ్యతగా ఉండటం విశేషం. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి జగ్గారెడ్డి సంగారెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా, పార్టీ మార్పు వార్తలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నా.. వాటిని జగ్గారెడ్డి ఖండించకపోవడం ఆసక్తికరంగా మారింది. ఇదే, పార్టీ మార్పు అంశానికి మరింత బలాన్ని చేకూర్చుతోంది.
ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్‌గా నియమించినప్పటి నుంచే జగ్గారెడ్డి సీరియస్‌గా ఉన్నారు. ఈ క్రమంలో బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేశారు. ఇక, కాంగ్రెస్ హైకమాండ్‌కు కూడా పలు సందర్భాల్లో జగ్గారెడ్డి లేఖలు రాశారు. రేవంత్‌ను టీపీసీసీ చీఫ్‌గా నియమించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక, ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పలు కార్యక్రమాల్లో కూడా జగ్గారెడ్డి యాక్టివ్‌గా కనిపించకపోవడం గమనార్హం. ఒకానొక సమయంలో కేసీఆర్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలపై కూడా జగ్గారెడ్డి సానుకూలంగా స్పందించి.. గులాబీ సర్కార్‌ను అభినందించడం విశేషం.
ఇది కూడా చదవండి: కేసీఆర్ సార్ ‘మదిలో’ ఎవరు..? అందరిలోనూ హై టెన్షన్..!
Comments
Please login to add a commentAdd a comment