సాక్షి, హైదరాబాద్: అధికారంలో లేకున్నా ఆ మైకం నుంచి హరీష్ రావు ఇంకా బయటకు రావడం లేదని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. తెలంగాణలో ప్రతిపక్షాలు రాజకీయం చేయడానికి ఇదే సమయం కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు చాలా వ్యత్యాసం ఉంది అని చెప్పుకొచ్చారు.
కాగా, జగ్గారెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘ప్రతిపక్ష నేతలు ఖమ్మంలో పర్యటించి ప్రజల నుంచి వచ్చిన సూచనలను ప్రభుత్వానికి ఇవ్వండి. ప్రతిపక్షం ఎలా ఉండాలి అనేది కాంగ్రెస్ పక్షాన నేను ట్రైనింగ్ ఇస్తాను. హరీష్ ఇంకా అధికారం ఉందనే మైకంలోనే ఉన్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షం మొదట ప్రజలను సేఫ్ జోన్‌లోకి తేవాలి. ప్రతిపక్షాల రాజకీయానికి ఇది సమయం కాదు. ప్రభుత్వం మీద బురద చల్లెందుకు బీఆర్‌ఎస్ లేనిపోని మాటలు చెబుతోంది.
మన రాష్ట్ర ప్రతిపక్ష నాయకు కేసీఆర్ ఇంట్లో ఉంటే బీఆర్‌ఎస్ నేతలు బయట కామెంట్స్ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు చాలా తేడా ఉంది. కాంగ్రెస్ వాస్తవాలకు దగ్గరగా ఉంటుంది. కాంగ్రెస్ శ్రద్ధగా పని చేస్తుంది. కానీ, ప్రచారానికి ప్రయారిటీ ఇవ్వదు. బీఆర్‌ఎస్ నేతలు 90 శాతం పబ్లిసిటీ చేసి.. 10శాతం పని చేస్తారు. ప్రభుత్వం ప్రజలను కాపాడేందుకు వంద శాతం ప్రయారిటి ఇస్తుంది.
ఐదు రోజుల నుంచి వర్షాలు తెలంగాణ, ఆంధ్రలో కురుస్తున్నాయి. పెద్ద మొత్తంలో వర్షాలు రావడంతో చెరువులు, వాగులు, అలగులు పడుతున్నాయి. జంట నగరాల్లో కూడా ఇప్పుడు వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి. ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షం కారణంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఇండ్లు మునిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి మూడు రోజులుగా వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. సహాయక చర్యలు అందిస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంలో వరద ప్రాంతాల్లో పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే.. అన్ని శాఖల సమన్వయంతో పని చేస్తున్నారు. ఇప్పటికే 7వేల కోట్ల నష్టం జరిగింది. తక్షణ సాయం కోసం కేంద్రం రెండు వేల కోట్లు విడుదల చేయాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ రాశారు’ అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment