కేటీఆర్‌.. కాంగ్రెస్‌ ముందు నీ అనుభవమెంత?: జగ్గారెడ్డి | Congress Jagga Reddy Serious Comments On BRS KTR | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌.. కాంగ్రెస్‌ ముందు నీ అనుభవమెంత?: జగ్గారెడ్డి

Published Tue, Nov 26 2024 6:48 PM | Last Updated on Tue, Nov 26 2024 7:41 PM

Congress Jagga Reddy Serious Comments On BRS KTR

సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌ పార్టీ కల్పవృక్షం లాంటిది. కేటీఆర్‌, హరీష్‌ రావు కోతల రాయుళ్లు అంటూ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అలాగే, కాంగ్రెస్‌ వ్యూహాల ముందు కేటీఆర్‌ ఆలోచన, అనుభవం ఎంత? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్‌ ఇవ్వడం వల్లే కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టి మీ(బీఆర్‌ఎస్‌) నెత్తి మీద పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో పెకలిస్తామని అంటారా?. అధికారంలో ఉన్నా.. లేకున్నా కాంగ్రెస్ నేతలందరూ గంభీరంగానే ఉంటారు. కేటీఆర్, హరీష్ రావు కోతలు కోసే కోతల రాయులు. కాంగ్రెస్ పార్టీ కల్పవృక్షం లాంటిది. కాంగ్రెస్ పార్టీ లాంటి మర్రి చెట్టును కేటీఆర్ పీకేస్తా అనడం సాధ్యమా?.

కేటీఆర్ వయసు ఎంత? కాంగ్రెస్ వయసు ఎంత?. కాంగ్రెస్ వ్యూహాల ముందు కేటీఆర్ ఆలోచన, అనుభవం ఎంత?. కాంగ్రెస్ పార్టీ వయసులో కేటీఆర్ వయసు పావు వంతు. రాజకీయం కోసం నిందలు వేయడాన్ని కూడా మేం తప్పు పట్టడం లేదు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ లేదా టీడీపీ ప్రభుత్వం ఏర్పడేది. రాష్ట్రం రావడం వల్లే కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. మా పాలనపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు.

బీఆర్ఎస్ పార్టీ ఇంకో ఇరవై ఏళ్తు ప్రతిపక్షంగా కొనసాగాలి. కాంగ్రెస్ వ్యూహాలు అంతుచిక్కవు. మా వ్యూహాలు ఎవరికి అర్థం కావు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బ్యూరోక్రాట్స్ సంతోషంగా నిద్రపోయే రోజులు వచ్చాయి. అధికారులను మానసికంగా కుంగదీసి కలెక్టర్లను మోకాళ్లపై కూర్చోపెట్టిన ఘనత బీఆర్ఎస్ నాయకులది. ఈ భూమి మీద మనుషులు ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. దేశంలో ఉన్న అనేక రాజకీయ పార్టీలు కాంగ్రెస్ అధికారంలోకి రావాలి.. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాయి’ అని కామెంట్స్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement