సాక్షి, హైదరాబాద్: రైతుల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదన్నారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రాజకీయ పరిపూర్ణత లేని నాయకుడిగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. కొండా సురేఖపై ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదంటూ హితవు పలికారు.
మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కొండా సురేఖను రెచ్చగొట్టి కేసీఆర్, కేటీఆర్‌లు విమర్శలు చేయించుకుంటున్నారు. వ్యక్తిగత జీవితంలోకి వెళ్లి విమర్శలు చేసుకోవడం పద్దతి కాదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులకు దండలు వేసిన వాళ్లందరినీ అలానే అనుకుంటారా?. రాజకీయ పరిపూర్ణత లేని నాయకుడిగా కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నాడు. కొండా సురేఖకు ఇప్పటికైనా క్షమాపణలు చెప్పి.. ఇప్పటికైనా ఈ వివాదాన్ని బీఆర్‌ఎస్ ఆపాలి.
తెలంగాణలో రుణమాఫీ 18వేల కోట్లు మాఫీ చేశాం. డేటా సరిగా లేకపోవడంతో మిగిలిన రుణమాఫీ చేయలేకపోయాం. రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కేసీఆర్ వదిలి వెళ్లారు. తెలంగాణ బీజేపీకి పట్టు లేదు. కాబట్టి ఉనికి కోసం బీజేపీ రైతు దీక్షతో ప్రయత్నాలు చేసింది. రైతుల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదు. ప్రధాని మోదీ ప్రతీ పేద వాడి అకౌంట్‌లో 2లక్షలు వేస్తా అన్నారు. పదేళ్లు ప్రధానిగా ఉండి ఎందుకు చేయలేదు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.. చేయలేదు. రైతుల ఆదాయం డబుల్ చేస్తాం అన్నారు, చేశారా?. రైతు నల్ల చట్టాలు తెచ్చింది మీరు కదా?.
రైతుల మీదకు వెహికల్‌తో చంపింది మీరు కదా.. ఎప్పుడు ఎందుకు బీజేపీ రాష్ట్ర నాయకులు మాట్లాడలేదు. ధరలు పెరిగినా ప్రజలు ఓట్లు వేసి 8 సీట్లు ఇచ్చేసరికి.. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలకు కళ్ళు నెత్తికి ఎక్కాయి. బీజేపీ నేతలు నటిస్తున్నారు.. డ్రామా ఆర్టిస్టులు. తెలంగాణ రైతులకు మా విజ్ఞప్తి. రేవంత్ సర్కార్ చేసే ప్రయత్నాలకు అండగా ఉండండి. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ కుటుంబం గురించి తెలుసు. దేశాన్ని 52 ఏళ్ల పాటు రాహుల్ గాంధీ కుటుంబం పాలించింది. మీ మాదిరి రాహుల్ గాంధీ కుటుంబం అని భావించకండి. గాంధీ కుటుంబం మీద పగా పట్టిన మోదీ.. సభ్యత్వం రద్దు చేసి ఆయన ఉండే బంగ్లా ఖాళీ చేయించారు. రాహుల్ గాంధీ చరిత్ర తెలుసుకో.. ఎందుకు నోరు పారేసుకుంటున్నావు కేటీఆర్. మూసీ సుందరీకరణ డబ్బుతో రాహుల్ గాంధీ బతుకుతాడా?. దీంతో, ఏమైనా అర్థం ఉందా?’ అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: వాళ్లు ఆడబిడ్డలు కాదా.. మంత్రి కొండా సురేఖకు సబిత కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment