సాక్షి హైదరాబాద్: కాంగ్రెస్ కార్యకర్తల్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు? రేవంత్‌రెడ్డిని తిడితే మా కార్యకర్తలు వాళ్ల నాలుకలు కోస్తారంటూ ఆ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌ను చెడ్డగొట్టాలని బీఆర్‌ఎస్ నేతలు చూస్తున్నారంటూ మండిపడ్డారు.
‘‘రేవంత్‌ను ఎవరైనా పనికిమాలిన వాడు అంటే సహించేది లేదు. సీఎంపై కేసీఆర్, కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుకు కోస్తాం. బీఆర్‌ఎస్ నేతలు.. హైదరాబాద్ ప్రజల మూడ్‌ను ఖరాబ్ చేశారు. గాంధీ, కౌశిక్ రెడ్డి వ్యవహారం బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారం. వినాయక నిమజ్జనం కోసం కష్టపడుతుంటే.. బీఆర్ఎస్ అనవసర పంచాయతీలు చేస్తున్నారు. వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని డిస్టబ్ చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది’’ అంటూ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: హైదరాబాద్ ప్రజలపై సీఎం రేవంత్ పగ: కేటీఆర్
‘‘పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కండువాలు కప్పే సాంప్రదాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో లేదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్త సాంప్రదాయాని కేసీఆర్ తెరలేపాడు. 2014-18 వరకు కాంగ్రెస్ ఎంపీలు 4, ఎమ్మెల్యేలు 25, ఎమ్మెల్సీ 18 మందిని బీఆర్ఎస్‌లో చేర్చుకున్నప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎందుకు మాట్లాడలేదు?. పార్టీ మారిన వారికి మంత్రి పదవి ఇచ్చింది కేసీఆర్ కాదా.. పార్టీ ఫిరాయింపులకు ఆధ్యుడు కేసీఆర్ కాదా.. శాసన పక్షాన్ని విలీనం చేసుకునే కుట్రకు కేసీఆర్ కారణం. కేటీఆర్ చరిత్ర తెలుసుకో.. కేసీఆర్ సీఎం అయిన రోజే రాజకీయాలలో విలువలు నశించాయి. బీజేపీ డైరెక్షన్‌లో కేసీఆర్.. కాంగ్రెస్‌కు వెన్నుపోటు పోడిచారు’’ అంటూ జగ్గారెడ్డి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment