కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణ ప్రజలకు కన్నీళ్లు, టీఆర్‌ఎస్ గెలిస్తే తాగు నీళ్లు వస్తాయని ఆపధర్మ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం నర్సాపూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో పదేళ్లు మంత్రిగా ఉన్న సునిత లక్ష్మారెడ్డి నర్సాపూర్‌కు కనీసం బస్‌డిపోను కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. సునిత హయాంలో ఇక్కడ జరిగిన అభివృద్ధిపై చర్చకు కాంగ్రెస్ సిద్దమా అని సవాలు విసిరారు.