narsapur constituency
-
టీఆర్ఎస్లో పోటాపోటీ.. ప్రజాక్షేత్రంలో బిజీగా నేతలు
సాక్షి, మెదక్: అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న టీఆర్ఎస్ నియోజకవర్గ నేతలు పోటాపోటీ కార్యక్రమాలకు తెరలేపారు. బహిరంగంగా ఎక్కడా విభేదాలు కనబడకున్నా.. అంతర్గతంగా ఎవరికి వారు ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నట్లు చర్చసాగుతోంది. స్థానికంగా జరిగే కార్యక్రమాలకు హాజరవుతూ జనం మధ్యలో ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పటికే మెదక్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరిసుభాష్‌రెడ్డి నర్సాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునితాలక్ష్మారెడ్డి మధ్య వర్గ విభేదాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ప్రజల మద్దతుకై ఆరాటం ► అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల గడువున్నా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నేతలు ఇప్పటి నుంచే ప్రజల మద్దతును కూడగట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ► మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు టికెట్ ఆశిస్తు న్న ముఖ్య నాయకులు ఆయా నియోజకవర్గాల్లో ముమ్మరంగా పర్యటిస్తూ, ఏ చిన్న అవ కాశం ఉన్నా వదులుకోకుండా హాజరవుతున్నారు. ► ఎవరి వర్గాన్ని వారు కాపాడుకుంటూ పోటీపోటీగా అధికార, ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటుండడంతో రాజకీయవర్గాల్లో విస్తృతంగా చర్చ మొదలైంది. మెదక్ నియోజకవర్గంలో.. ► మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి ఇప్పటికే జిల్లా పార్టీ పగ్గాలను సీఎం కేసీఆర్ అప్పగించటంతో నియోజకవర్గంతో పాటు ఇతర ముఖ్య పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ బీజీగా గడుపుతున్నారు. ► ప్రతీ మంగళవారం క్యాంపు కార్యాలయంలో మీ కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పద్మాదేవేందర్‌రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదానం, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. ► అవకాశం దొరికినప్పుడల్లా మెదక్ జిల్లాకు రైలు, మెడికల్ కళాశాల మంజూరు తదితర పనులపై ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ► సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి జన్మదినం సందర్భంగా గతేడాది ఆగస్టులో ఆయన వర్గీయులు నియోజకవర్గంలో భారీ ర్యాలీ, కటౌట్లతో హంగామా చేశారు. ► తమ వర్గీయులతో కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందిస్తూ ప్రజల మెప్పు పొందుతున్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ సమస్యలపై దృష్టి పెడుతున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో... ► సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునితా లక్ష్మారెడ్డి పోటాపోటీగా పర్యటనలు చేస్తూ, స్థానికంగా ఎక్కువ సమయం ఉండేలా చూసుకుంటున్నారు. ► నర్సాపూర్‌లో మహిళా కమిషన్ చైర్పర్సన్ సు నితా లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలను ఆమె వర్గీయులు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ► మరోవైపు మదన్‌రెడ్డి అనుయాయులు ఆయన పుట్టిన రోజున ఆలయాల్లో పూజలు చేశారు. నర్సాపూర్ నుంచి చాకరిమెట్ల వరకు కాలినడకన వెళ్లి పూజలు నిర్వహించారు. ► మెదక్‌లో పద్మాదేవేందర్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డిలు, నర్సాపూర్‌లో మదన్‌రెడ్డి, సునితా లక్ష్మారెడ్డి ఎవరికి వారు ప్రజల్లో ఉంటూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ► ఈ క్రమంలో అధికార పక్షానికి చెందిన ఇద్దరు నేతలు రెండు వర్గాలుగా ఏర్పడడంతో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ రెండు నియోజకవర్గాలు.. ► జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజక వర్గాలు ఉన్నా, మెదక్ మాత్రమే పూర్తిస్థాయి నియోజకవర్గంగా కొనసాగుతోంది. ► మెదక్ నియోజకవర్గంలోని హవేళిఘనాపూర్, రామాయంపేట, పాపన్నపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట మండలాలతో పాటు మెదక్, నర్సాపూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ► నర్సాపూర్ నియోజక వర్గంలో నర్సాపూర్, శివ్వంపేట, వెల్దూర్తి, కొల్చారం, కౌడిపల్లి, చిలిపిచెడ్, నర్సాపూర్ మున్సిపాలితో పాటు హత్నూర మండలం ఉన్నా, పాలనా సౌలభ్యం కోసం దానిని సంగారెడ్డి జిల్లాలో కలిపారు. ► గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్, మనోహరబాద్లను, దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంట, నార్సింగ్ మండలాలను, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పెద్దశంకరంపేట మండలాన్ని, అందోల్ నియోజకవర్గంలోని టేక్మాల్, రేగోడు, అల్లాదుర్గ్, మండలాలను మెదక్ జిల్లాలో కలిపారు. ► ఇటీవల ఏర్పడిన మాసాయిపేట మండలంతో కలిపి జిల్లాలో 21 మండలాలు, 4 మున్సిపాలిటీలు మెదక్ జిల్లాలో కొనసాగుతున్నాయి. (క్లిక్: అధికార పార్టీలో ధిక్కార స్వరం.. ‘కారు’కు ఏమైంది?) -
తొలి ఫలితం నరసాపురం, మదనపల్లి
సాక్షి, అమరావతి: ఓట్ల లెక్కింపులో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం అందరికంటే ముందుగా తేలిపోనుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో 13 రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. కర్నూలు నియోజకవర్గంలో అత్యధికంగా 33 రౌండ్లు పూర్తి చేయాల్సి ఉన్నందున ఫలితం చివరన వెలువడే అవకాశముంది. పులివెందుల, నందిగామ, ఆళ్లగడ్డ, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 30 రౌండ్లకుపైగా పట్టే అవకాశం కనిపిస్తోంది. జిల్లాల్లో చిత్తూరు ఫలితం ముందుగా.. సాధారణంగా కౌంటింగ్ హాళ్లలో ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. ఈసారి ఓట్ల లెక్కింపు త్వరగా పూర్తి చేసేందుకు కౌంటింగ్ హాళ్లను బట్టి టేబుళ్ల సంఖ్యను పెంచుకోవడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. చిత్తూరు జిల్లాలో కొన్నిచోట్ల 16 నుంచి 20 వరకు టేబుళ్లను ఏర్పాటు చేశారు. దీంతో అన్నిటి కంటే ముందుగా చిత్తూరు జిల్లా ఫలితాలు వెలువడే అవకాశముంది. మదనపల్లి, పుంగనూరు, చంద్రగిరి, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 టేబుళ్లను సిద్ధం చేయడంతో ఫలితాలు వేగంగా వెలువడనున్నాయి. కృష్ణా జిల్లా నందిగామలో అత్యల్పంగా 7 టేబుళ్లను ఏర్పాటు చేశారు. చాలా నియోజకవర్గాల్లో 18 నుంచి 24 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. ఇలా తెలుసుకోవచ్చు.. ఎన్నికల సరళి, ఫలితాలను ఎప్పటికప్పుడు తెలియచేసేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఒక రౌండు లెక్కింపు పూర్తి కాగానే ఫలితాలను కౌంటింగ్ కేంద్రం వద్ద మైక్‌లో వెల్లడించడంతోపాటు మీడియా ప్రతినిధులకు కనిపించేలా డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రతి రౌండు ఫలితాలను ‘సువిధ’ యాప్‌లో కూడా అప్లోడ్ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఫలితాలను తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను, యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. https:// results. eci. gov. in వెబ్సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. ‘ఓటర్స్ హెల్ప్ లైన్’ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా కూడా ఫలితాల సరళిని తెలుసుకోవచ్చు. -
సునీతారెడ్డి లెక్కలేసుకున్నారు..
నర్సాపూర్: ఎన్నికలు పూర్తవడంతో నర్సాపూర్ నుంచి పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓట్ల లెక్కలు వేసుకోవడంలో బిజీ బిజీగా గడిపారు. శనివారం ఉదయం టీఆర్ఎస్ అభ్యర్థి చిలుముల మదన్‌రెడ్డి తన స్వగ్రామమైన కౌడిపల్లిలో కుటుబం సభ్యులతో గడుపగా, కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డి తన స్వగ్రామమైన శివ్వంపేట మండలం గోమారంలో తన కుటుంబ సభ్యులతో గడిపారు. మధ్యాహ్నం తర్వాత నర్సాపూర్‌కు చేరుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలతో పోలింగ్ సరళి తెలుసుకుంటూ మెజారిటీపై లెక్కలు వేస్తూ బిజీ బిజీగా గడిపారు. ఎవరికి వారు గెలపుపై ధీమా వ్యక్తం చేశారు.నర్సాపూర్ టీఆర్ఎస్ అభ్యర్థి చిలుములమదన్‌రెడ్డి శనివారం నర్సాపూర్‌లోని మణికొండ ఫంక్షన్‌హాలులో నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మండలాల వారీగా సమీక్ష జరిపారు. గ్రామ స్థాయి నాయకులతో సమావేశమై ఆయా గ్రామాల్లో తనకు ఎన్ని ఓట్లు వస్తాయో అడిగి తెలుసుకున్నారు. సునీతారెడ్డి సమీక్ష.. మధ్యాహ్నం నియోజకవర్గానికి చేరుకున్న సునీతారెడ్డి మండలానికి చెందిన నాయకులు కార్యకర్తలతో వరుస సమీక్షలు నిర్వహించారు. గ్రామాల వారీగా పోలింగ్ సరళిపై ఆరా తీశారు. అన్ని మండలాల్లో తమకే మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
చేసిన పనులే గెలిపిస్తాయి
నర్సాపూర్: గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసి చేపట్టిన అభివృద్ధి, పనులే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని పేదలకు మేలు చేసే పథకాలు తనను ప్రస్తుత ఎన్నికలలో గెలిపిస్తాయని నర్సాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి సునీతారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగిసినందున ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. తాను ఎన్నికల ప్రచారానికి ఏ గ్రామానికి వెళ్లిన ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ఇంటింటి ప్రచారంలో సైతం పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారని చెప్పారు. చాలా చోట్ల హారతులు ఇచ్చి ఆదరించారని ఆమె చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుఖాయమనీ పేర్కొన్నారు. చేరికలతో బలం పెరగింది.. ప్రజల నుంచి ఆదరణ నిండుగా ఉందని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలో ఇంటింటి ప్రచారం చేశామని ఆమె తెలిపారు. కాగా నియోజకవర్గంలోని పార్టీ నాయకులు తనతో పాటు ప్రచారంలో పాల్గొన్నారని నాయకులు కార్యకర్తలు ఈసారి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలన్న తపనతో ఉన్నారని అందుకు అనుగుణంగా గట్టిగా కృషి చేశారని ఆమె చెప్పారు. కాగా తాము ప్రతిపక్షంలో ఉన్నా ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు తమ కాంగ్రెస్ పార్టీలో చేరారని వారి చేరిక తమకు మరింత బలాన్ని చేకూర్చిందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రజలకు మేలు చేసే అంశాలతో మేనిఫెస్టో.. ప్రజల ఆదరణ, కార్యకర్తలందరి కృషి ఫలితంగా తాను భారీ మెజారిటీతో గెలుస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కాగా తాను గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన సేవలను ప్రజలు గుర్తుంచుకున్నారని ఆమె చెప్పారు. మేనిఫెస్టోలో వృద్ధ దంపతులిద్దరికి పింఛను, దళితులకు ఉచిత కరెంటు, విద్యార్థులకు స్కాలర్షిప్పులు, రేషన్ షాపుల ద్వారా ఒక్క రూపాయికే ఏడు కిలోల సన్న బియ్యంతో పాటు ఉద్యోగాల భర్తీ, ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపరిష్కారానికి ప్రాధాన్యత తదితర అంశాలన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయని అన్నారు. ఇతర పార్టీల మేనిఫెస్టోలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజల ను ఆకట్టుకుందని ఆమె పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి చెందే విధంగా ఉన్నందున నియోజకరవ్గంలోని అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరిస్తున్నారి పేర్కొన్నారు. చేసిన పనులే గెలిపిస్తాయ తాను ఏ గ్రామానికి ప్రచారానికి వెల్లిన బ్రహ్మరథం పడుతూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని, తనను గెలిపిస్తామని హామీ ఇస్తున్నారని సునీతారెడ్డి చెప్పారు. తనకు ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీతోనే పోటీ ఉంటుందని సునీతారెడ్డి పేర్కొన్నారు. కాగా టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు తన విజయానికి దోహదపడుతాయని ఆమె చెప్పారు. టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పాలనను గాలికొదిలేసి సచివాలయానికి రాకుండా ఇంటి నుంచి పరిపాలన సాగించడంతో రాష్ట్రంలో పరిపాలన సరైన దిశగా సాగనందున ప్రజలలో వ్యతిరేకతను పెంచిందని ఆమె చెప్పారు. సీఎం ఒక్కసారి కూడా రాలేదు.. నర్సాపూర్‌ను సీఎం దత్తత తీసుకుంటున్నట్లు గత ఎన్నికలప్పుడు ప్రకటించి ఒక్కసారైనా నియోజకవర్గంలో పర్యటించకపోవడం విచారకరమని అన్నారు. కాగా టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నెరవేర్చనందున ప్రజలు ఆ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకతతతో ఉన్నారని ఆమె చెప్పారు. తమ పార్టీ ఇచ్చిన హామిలు నెరవేర్చుతుందని ప్రజలలో నమ్మకం ఉందని తాము ఏ హామీ ఇచ్చిన నెరవేరుస్తామని ఆమె చెప్పారు. కాగా ప్రస్తుత ఎన్నికలలో తాను గెలుస్తానని గెలిచాక నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలతో పాటు ప్రజలు ఎదుర్కోంటున్న సమçస్యలను గురింతచి పరిష్కరిస్తానని, మేనిఫెస్టోలోని పథకాలు పకడ్బందీగా అమలు చేయించి ప్రజలకు చేరేలా చూస్తానని ఆమె హామీ ఇచ్చారు. -
నర్సాపూర్‌లో రసవత్తర ‘పోరు’
నర్సాపూర్ నియోజకవర్గంలో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్నారు. ఇక్కడి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మహాకూటమి తరఫున మాజీ మంత్రి, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారెడ్డి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి సింగాయపల్లి గోపి, బీఎల్ఎఫ్ నుంచి అజ్జమర్రి మల్లేశం బరిలో నిలిచారు. ప్రభుత్వ పథకాలు, నియోజకవర్గంలో చేసిన అభివృద్ధే మరోసారి తన గెలుపునకు బాటలు వేస్తాయని సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి చెబుతుండగా, మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, ప్రభుత్వ వైఫల్యాలు కలిసి వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు సునీతారెడ్డి. ఎవరికి వారు గెలుపుపై భరోసాతో ఉన్నారు. సాక్షి, మెదక్: కమ్యూనిస్టు కంచుకోటగా నర్సాపూర్‌కు పేరుంది. సీపీఐ నుంచి విఠల్‌రెడ్డి ఇక్కడి నుంచి ఐదుమార్లు గెలుపొందారు. దివంగత మాజీ డిప్యూటీ సీఎం జగన్నాథరావు ఇక్కడి వారే. నియోజకవర్గం పరిధిలో మొత్తం 8 మండలాలు, నర్సాపూర్ మున్సిపాలిటీ ఉంది. తాజా మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి నాలుగున్నరేళ్లలో సీఎం కేసీఆర్‌తో సాన్నిహిత్యంతో నియోజకవర్గానికి దాదాపు రూ. 2 వేల కోట్ల నిధులు తీసుకు వచ్చి పలు అభివృద్ధిపనులు చేపట్టారు. టీఆర్ఎస్ అధిష్టానం ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో ఆయనకే మరోసారి టికెట్ ఇచ్చి బరిలో దించింది. మహాకూటమి తరపున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి సునీతారెడ్డి బరిలో నిలిచారు. బీజేపీ నుంచి సింగాయపల్లి గోపీ, బీఎల్ఎఫ్ నుంచి అజ్జమర్రి మల్లేశం పోటీ చేస్తున్నారు. ప్రధాన పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ నడుమనే సాగే అవకాశం ఉంది. అభివృద్ధే అస్త్రంగా తాజా మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి.. ప్రభుత్వ వైఫల్యాలే ఆయుధంగా మహాకూటమి అభ్యర్థి సునీతా రెడ్డి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇద్దరు గెలపు మాదంటే మాదనే ధీమాతో ముందుకు సాగుతున్నారు. వాకిటి సునీతారెడ్డి(కాంగ్రెస్ అభ్యర్థి) మాజీ మంత్రి సునీతారెడ్డి నర్సాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మూడు పర్యాయాలు గెలుపొందారు. భర్త లక్ష్మారెడ్డి మృతితో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె 1999లో మొదటి సారిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు.ఆ ఎన్నికల్లో సీపీఐ నేత విఠల్‌రెడ్డిపై గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన 2004, 2009 ఎన్నికల్లోనూ సునీతారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో సునీతారెడ్డి ఓటమిపాలయ్యారు. మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు తనదేనన్న దీమాతో ముందుకు సాగుతున్నారు. సింగాయపల్లి గోపి (బీజేపీ అభ్యర్థి) వెలమ సామాజిక వర్గానికి చెందిన సింగాయపల్లి గోపీ బీజేపీ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. బీజేపీ జిల్లా స్థాయిలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన 2009 ఎన్నికల్లో బీజేపీ నుంచి ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం జరబోయే ఎన్నికల్లో మరోమారు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు తనను గెలిపిస్తాయని ఆయన ఆశతో ఉన్నారు. సోమన్నగారి లక్ష్మి(బీఎస్పీ అభ్యర్థి) కొల్చారం మండలం పైతర గ్రామానికి చెందిన సోమన్నగారి లక్ష్మీ బీఎస్పీ తరపున మొదటి సారిగా ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి నర్సాపూర్ టికెట్ కోసం పోటీ పడ్డారు. టికెట్ దక్కకపోవటంతో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేశారు. ఆతర్వాత పార్టీ పెద్దల సూచనలతో నామినేషన్ ఉపసహరించుకుని మదన్‌రెడ్డి గెలుపుకోసం పనిచేశారు. ఈ సారి సైతం టీఆర్ఎస్ టికెట్ దక్కకపోవటంతో బీఎస్పీ తరపున పోటీ చేస్తున్నారు. బీసీ ఓటర్లు తనకు అండగా ఉంటారని ఆమె భావిస్తున్నారు. అజ్జమర్రి మల్లేశం(సీపీఎం) సీపీఐ(ఎం) పార్టీ తరపున మొదటి సారిగా అజ్జమర్రి మల్లేశం ఎమ్మెల్యేగా పోటీ పడుతున్నారు. హత్నూర మండలం కాసాల గ్రామానికి చెందిన మల్లేశం సీపీఎం పార్టీలో కొనసాగుతున్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన నర్సాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు తనను గెలిపిస్తాయని ఆయన నమ్మకంగా ఉన్నారు. అభివృద్ధి పనులు.. సంక్షేమ పథకాలు.. రూ.430 కోట్లతో నియోకజవర్గం గుండా వెళ్లే జాతీయ రహదారి నిర్మాణ పనులు సాగుతున్నాయి. రూ.10 కోట్లతో నర్సాపూర్‌లో బస్‌డిపో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో రూ.41.47 కోట్లతో చెరువుల పునరుద్ధ్దరణ పనులు చేపట్టారు. రూ.74 కోట్లతో మంజీరా నదిపై కొత్తగా పది చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. రూ.1.67 కోట్లతో నర్సాపూర్ మార్కెట్‌యార్డులో అభివృద్ధి పనులు చేపట్టారు. నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిని 130 పడకలకు అప్‌గ్రేడ్ చేశారు. రూ.1.70 కోట్లతో గిరిజన బాలుర పోస్టు మెట్రిక్ కళాశాల నిర్మాణం పనులు చేపట్టారు. రూ.54 కోట్లతో గిరిజన తండాల్లో రహదారుల నిర్మాణం చేపట్టారు. సంగారెడ్డి–నర్సాపూర్–తూప్రాన్ రోడ్డు విస్తరణ పనులను రూ.25 కోట్లతో చేపట్టారు. పంచాయతీరాజ్ నిధుల ద్వారా సుమారు రూ.20 కోట్లతో నియోజకవర్గంలో రహదారుల నిర్మాణం పనులు చేపట్టారు. 3031 మంది లబ్ధిదారులకు సబ్సిడీ గొర్రెలు అందించారు. 115 మంది రైతులకు సబ్సిడీ ట్రాక్టర్లను అందజేశారు. ప్రధాన సమస్యలు.. నియోజకవర్గంలో ప్రవహిస్తున్న మంజీరా నదిపై ఎత్తిపోతల పథకాల పనులు పనిచేయటంలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. నర్సాపూర్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నట్లు కేసీఆర్ ప్రకటించినప్పటికీ ఒక్క సారి సైతం నియోజకవర్గంలో పర్యటించలేదన్న అసంతృప్తి స్థానికుల్లో ఉంది. నియోజకవర్గంలో మిషన్‌భగీరథ ద్వారా పూర్తిస్థాయిలో ఇంకా ఇంటింటికి తాగునీరు అందలేదు. డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదు. నియోజకవర్గాన్ని డివిజన్ కేంద్రంగా ప్రకటించినా ఇంకా పూర్తిస్థాయిలో కార్యాలయాలు ఏర్పాటు కావాల్సి ఉంది. సిట్టింగ్ ప్రొఫైల్ కేసీఆర్‌కు సన్నిహితుడైన తాజా మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి స్వస్థలం కౌడిపల్లి. సీపీఐ నేత, దివంగత ఎమ్మెల్యే చిలుముల విఠల్‌రెడ్డి సోదరుడైన మదన్‌రెడ్డి ఉపసర్పంచ్‌గా రాజకీయ జీవితం ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఆ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జిగా, జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్రపార్టీలో వివిధ హోదాల్లో ఉన్నారు. ఆ సమయంలో ప్రస్తుత సీఎం కే.చంద్రశేఖర్‌రావుతో సన్నిహితంగా మెలిగారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉమ్మడి మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా పనిచేశారు. 1999, 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చవిచూశారు. 2012లో మదన్‌రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా పోటీచేసిన మదన్‌రెడ్డి 14,217 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో మరోమారు తలపడుతున్నారు. భారీ నీటిపారుదల శాఖా మంత్రి హరీష్‌రావు స్వయంగా నర్సాపూర్ నియోకజవర్గంలో పార్టీ గెలుపుకోసం వ్యూహారచన చేస్తున్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాం నింపుతున్నారు. మదన్‌రెడ్డిని ముందుండి నడిపిస్తున్నారు. 2014 పోల్గ్రాఫ్ మొత్తం ఓటర్లు: 2,08,623 పోలైన ఓట్లు: 1,75,053 వాకిటి సునీతారెడ్డి(కాంగ్రెస్) 71,673 చిలుముల మదన్‌రెడ్డి (టీఆర్ఎస్) 85,890 మెజార్టీ: 14,217 2018 ఓట్ గ్రాఫ్ మొత్తం ఓటర్లు: 2,01,580 మహిళా ఓటర్లు 1,02,312 పురుష ఓటర్లు 99,624 ఇతరులు: 4 పోలింగ్ కేంద్రాలు: 277 -
మాది దమ్మున్న ప్రభుత్వం : హరీష్
సాక్షి, మెదక్ : కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణ ప్రజలకు కన్నీళ్లు, టీఆర్ఎస్ గెలిస్తే తాగు నీళ్లు వస్తాయని ఆపధర్మ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం నర్సాపూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో పదేళ్లు మంత్రిగా ఉన్న సునిత లక్ష్మారెడ్డి నర్సాపూర్‌కు కనీసం బస్‌డిపోను కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. సునిత హయాంలో ఇక్కడ జరిగిన అభివృద్ధిపై చర్చకు కాంగ్రెస్ సిద్దమా అని సవాలు విసిరారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నర్సాపూర్‌ను దత్తత తీసుకుంటాననడం హాస్యస్పదమన్నారు. కాంగ్రెస్‌లో సీట్ల గొడవ ఇంకా ఆగిపోలేదని.. త్వరలో కాళేశ్వరం నీళ్లతో తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ కోసం పదవులకు రాజీనామాలు చేసింది టీఆర్ఎస్ నేతలని.. కాంగ్రెస్ నేతలు కాదని గుర్తుచేశారు. తెలంగాణకు వ్యతిరేకమైన టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఇక్కడి ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు. తమది దమ్మున్న ప్రభుత్వమని.. నర్సాపూర్ అభివృద్ధికి 25 కోట్లు ఖర్చు చేసినట్లు హరీష్ వెల్లడించారు. -
సునిత హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు కాంగ్రెస్ సిద్దమా
-
‘మెదక్’లో ఒక్కడు
సాక్షి, మెదక్: అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. విడుదలైన వెంటనే మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించారు. మొదటి రోజు జిల్లాలో ఒకే ఒక్క నామినేషన్ దాఖలయింది. మెదక్ అసెంబ్లీ నియోకజవర్గంనుంచి పోటీకి బీఎల్ఎఫ్ అభ్యర్థి దూడ యాదేశ్వర్ నామినేషన్ వేశారు. నర్సాపూర్ నియోజకవర్గంలో మొదటి రోజు ఎలాంటినామినేషన్లు దాఖలు కాలేదు. యాదేశ్వర్ మెదక్ పట్టణంలోని బీఎల్ఎఫ్ కార్యాలయం నుంచి ర్యాలీగా రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వచ్చారు. రిటర్నింగ్ ఆఫీసర్ వీరబ్రహ్మచారికి నామినేషన్ పత్రాలనుఅందజేశారు. ఆయన వెంట బీఎల్ఎఫ్ నాయకులు చుక్క రాములు తదితరులు ఉన్నారు. అయితే నామినేషన్లు వేసేందుకు ఎమ్మెల్యే అభ్యర్థులు మంచి ముహుర్తాలు వెతుక్కుంటున్నారు. సిద్ధాంతులనుసంప్రదించి తమ జాతకాలకు అనుగుణంగా మంచి రోజులను తెలుసుకుంటున్నారు. నామినేషన్లు వేసేందుకు ఈనెల 14, 18, 19 తేదీల్లో అనుకులంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా తేదీల్లోనామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు సిద్ధం అవుతున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈనెల 14న గజ్వేల్‌లో నామినేషన్ వేయనున్నారు. 14న పద్మాదేవేందర్‌రెడ్డి తరఫున నాయకులు నామినేషన్ వేయనున్నారు. 19న పద్మాదేవేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌రెడ్డి సైతం 14, 19 తేదీల్లో నామినేషన్లు వేయనున్నట్లు తెలుస్తోంది. -
ఉద్దండుల గడ్డ
నర్సాపూర్నియోజకవర్గం 1952లో ఏర్పడగా ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. 11 సార్లు సీపీఐ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా పోటీ పడ్డాయి. ఐదుసార్లు సీపీఐకి చెందిన ఒకే అభ్యర్థి చిలుముల విఠల్‌రెడ్డి గెలుపొంది రికార్డు సృష్టించారు. 1999లో జరిగిన ఎన్నికల్ల విఠల్‌రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డి విజయం సాధించి కమ్యూనిస్టుల కోటను కైవసం చేసుకున్నారు. అనంతరం 2004, 2009 ఎన్నికల్లో సైతం సునీతారెడ్డి గెలిచి హ్యాట్రిక్ విజయం అందుకున్నారు. అనంతరం మంత్రి పదవి చేపట్టారు. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన విఠల్‌రెడ్డి సీపీఐ శాసనసభ పక్ష నేతగా పనిచేయగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగన్నథరావుకి డిప్యూటీ సీఎం పదవి వరించింది. రాయరావు నరసన్న పేరుతో నర్సాపూర్.. సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల్ల మండలం నల్లవల్లి గ్రామానికి చెందిన దేశ్‌ముఖ్‌ల వంశీయుడైన రాయరావు నరసన్న 1590సంవత్సరంలో ఇక్కడ గ్రామం కోసం పునాదులు వేశారని తెలిసింది. అయన పేరు మీదే నర్సాపూర్ ఏర్పడింది. చుట్టూ దట్టమైన అడవులు.. ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు నర్సాపూర్ అటవీ రేంజ్ పరిధిలో 19,147 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉండేవి. కాగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో పాటు అటవి శాఖలోని రేంజ్‌లను చిన్నవిగా చేయడంతో ప్రస్తుతం సుమారు 5450 హెక్టార్లకు తగ్గాయి. చిరకాల ప్రత్యర్థులుగా నిలిచిన విఠల్‌రెడ్డి, జగన్నాథరావు.. నర్సాపూర్ శాసన సభ నియోజకవర్గం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 14సార్లు ఎన్నికలు జరుగగా 8సార్లు సీపీఐ అభ్యర్తిగా విఠల్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్తిగా జగన్నా«థరావులు పోటీ పడ్డారు. ఐదు సార్లు విఠల్ రెడ్డి గెలుపొందగా, మూడు సార్లు జగన్నాథరావు విజయం సాధించారు. ఖాతా తెరవని టీడీపీ.. నర్సాపూర్ నియోజకవర్గంలో టీడీపీ ఇంతవరకు ఒక్కసారి కూడా గెలుపొందలేదు. పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి రాష్ట్ర స్థాయిలో సీపీఐతో పొత్తు ఉండడం, నర్సాపూర్‌లో సీపీఐకి మంచి పట్టు ఉండడంతో నర్సాపూర్ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా సీపీఐకే కేటాయించడంతో 1994 వరకు టీడీపీకి పోటీచేసే అవకాశం 1999, 2004లో జరిగిన ఎన్నికల్లో నర్సాపూర్ నుంచి చిలుములమదన్‌రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. కాగా 2009 ఎన్నికల నాటికి రాష్ట్రంలో టీడీపీతో సీపీఐ, టీఆర్ఎస్కు పొత్తు కుదరడంతో నర్సాపూర్‌ను సీపీఐకి కేటాయించారు. కూటమి అభ్యర్తిగా సీపీఐకి చెందిన చిలుములకిషన్రెడ్డి పోటీ చేసి ఓటమి చెందారు. డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిన జగన్నాథరావు.. నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన చౌటి జగన్నాథరావు, ఒక సారి ఎమ్మెల్సీగా సైతం ఎన్నికయ్యారు. 1972లో ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం రాష్ట్ర శాసనసభకు డిప్యూటీ స్పీకర్‌గా ఎంపికయ్యారు. 1974లో తెలంగాణ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్‌గా సైతం నియమితులయ్యారు. కాగా 1980లో అంజయ్య క్యాబినెట్లో ఎక్సైజ్ మంత్రిగా పని చేశారు. 1982లో భవనం వెంకట్రాంరెడ్డి క్యబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. సీపీఐ శాసనసభా పక్షనేతగా విఠల్‌రెడ్డి నర్సాపూర్‌కు చెందిన సీపీఐ నాయకుడు, దివంగత చిలుముల విఠల్‌రెడ్డి నర్సాపూర్ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాగా ఆయన రాష్ట్ర శాసనసభ సీపీఐ పక్ష నాయకుడిగా, ఉప నాయకుడిగా వ్యవహరించి నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చారు. మంత్రిగా పని చేసిన సునీతారెడ్డి.. 1999లో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందిన సునీతారెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. 2009లో రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ మంత్రిగా పని చేశారు. 2010 నుంచి ఐకేపీ, పింఛన్లు, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా పని చేíశారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా పనిచేశారు. తొలి, మలి దశ ఉద్యమాల్లో పాల్గొన్న ప్రజలు.. నర్సాపూర్ నియోజకవర్గం పలు ఉద్యమాలకు నెలువుగా నిలిచింది. 1969లో కొనసాగిన తొలి దశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సైతం ఈ ప్రాంత వాసులు పాల్గొని తమ బాణీ వినిపించారు. కాగా మలిదశ ఉద్యమంలో సైతం ఈప్రాంతంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. నర్సాపూర్ అడవులు నక్సలైట్లకు నెలవు.. గతంలో నర్సాపూర్ నియోజకవర్గంలోని అడవులు నక్సలైట్లకు కేంద్రాలుగా ఉండేవి. నియోజకవర్గ పరిధిలో నర్సాపూర్ ఏరియా దళంతో పాటు గుమ్మడిదల్ల ట్రేడే యూనియన్ దళాలు ఇక్కడ పని చేసేవి. కాగా కొల్చారం ఏరియాలో జనశక్తి నక్సలైట్ల ప్రాభల్యం ఉండేది. -
విమర్శలు విజ్ఞతకే వదిలేస్తున్నా
సాక్షి,చిలప్‌చెడ్(నర్సాపూర్): నర్సాపూర్ నియోజక వర్గంలో అభివృద్ధి లేదన్న రేవంత్‌కు రోడ్లు, బస్‌డిపో, వంద పడకల ఆసుపత్రి. మండలాల్లో చెరువులు, కుంటలు, భగీరధ నీళ్లు, చెక్‌డ్యాంలు, గిరిజన తండాల అభివృద్ధి, తదితర విషయాలు కనబడక పోవడం ఏంటాని, తనను ఫామ్ హౌస్ కాపల కుక్క అనడం ఎంతవరకు సమంజసమో అతని విజ్ఞతకే వదిలేస్తున్నాని మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన చిలప్‌చెడ్ మండలంలో ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలకు తాను చేసిన అభివృద్ధి గురించి తెలిస్తే చాలని, ఓట్ల దొంగకు తెలియాల్సిన అవసరం లేదని మదన్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో మండల టిఅర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎఎంసీ చైర్మెన్ హంసీబాయి, రాజిరెడ్డి, నర్సింహ్మరెడ్డి, లక్ష్మణ్, విశ్వంబర, పరుశరాంరెడ్డి, కిష్టారెడ్డి, యాదగిరి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు.. మంగళవారం ముందుగా చిలప్‌చెడ్ మండలంలోని జగ్గంపేటలో ప్రచారం ప్రారంభించిన మదన్‌రెడ్డి గ్రామంలోని నల్లపోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించిన ఆయన అమ్మవారి ఆశీస్సులతో మండలంలో ప్రచారాన్ని కోనసాగించారు. అక్కడి నుంచి మండల పార్టీ నాయకులతో, కార్యకర్తలతో భారీగా బైక్ ర్యాలీతో బయలుదేరిన ఆయన మండలంలోని ఆయా గ్రామాలలో ప్రచారాన్ని కోనసాగించారు. జగ్గంపేట గ్రామంలో సుమారు 100 మంది యువకులు మదన్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. -
జగన్ ఎదుట టీడీపీ కార్యకర్త ఏం చేశాడంటే..
సాక్షి, నరసాపురం : మట్టి నుంచి మరుగుదొడ్ల దాకా అన్నింటా అవినీతికి పాల్పడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంటికొక ఉద్యోగం ఇస్తానని, లేనిపక్షంలో నెలకు 2 వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నఅబద్ధపు వాగ్ధానాలను గుర్తుచేసుకుంటూ తెలుగుదేశం పార్టీ (టీడీపీ)పై జనం మండిపడుతున్నారు. వాణిజ్య సదస్సుల ద్వారా వేల కోట్ల పెట్టుబడులు, లక్షల్లో ఉద్యోగాలు సాధించామని సొంత డప్పుకొట్టుకుంటున్న ఏపీ సీఎం తీరును యువత ఎక్కడిక్కడే ప్రశ్నిస్తున్నారు. ‘బాబు చేతిలో మోసపోయామన్నా...’ అంటూ జననేతకు గోడు చెప్పుకుంటున్నారు. చంద్రబాబూ.. ఇటు చూడు : 176వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో ప్రజలతో మమేకం అయ్యారు. కొప్పర్రు శివారు(నైట్ క్యాంప్) నుంచి బుధవారం ఉదయం కొప్పర్రు నుంచి లిఖితపూడి, సరిపల్లి మీదుగా పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో మురళీకృష్ణ అనే టీడీపీ కార్యకర్త జననేతను కలుసుకుని తన కష్టాన్ని చెప్పుకున్నాడు. ‘చంద్రబాబూ చూడు..’ అంటూ టీడీపీ సభ్యత్వ కార్డును చింపేసి, నేలకేసి కొట్టాడు. ఎందుకిలా చేశాడు? : ‘‘నా పేరు మురళీకృష్ణ. మాది విజయవాడ. భీమవరంలోని మా బంధువుల జ్యూస్ షాప్‌లో కూలీగా పనిచేస్తున్నాను. టీడీపీని నమ్మి మోసపోయాను. జెండాలు కట్టడం దగ్గర్నుంచి అన్ని పనులూ చేశాను. చదువుకున్న నాకు ఏదో ఒక బతుకుదెరువు చూపిస్తామన్న టీడీపీ నాయకులు.. డబ్బులిస్తేనేగానీ ఉద్యోగం లేదని అంటున్నారు. మూడు లక్షలు ఇస్తే విజయవాడ కార్పొరేషన్‌లోనో, మంగళగిరి రిజిస్ట్రేషన్ ఆఫీసులోనో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం పెట్టిస్తామని చెబుతున్నారు. నా దగ్గర అంతస్థోమత లేదు..’’ అంటూ ఆ యువకుడు చెప్పుకొచ్చాడు. ఏపీలో రాబోయే ప్రజా ప్రభుత్వంలో మురళీకృష్ణ లాంటి తమ్ముళ్లందరికీ న్యాయం దక్కుతుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. -
నేతల్లో కదలిక
‘కారు..చిచ్చు’ కథనంతో అంతరంగం బట్టబయలు నర్సాపూర్ విభజనపై స్పష్టమైన అభిప్రాయాలు సాక్షి, సంగారెడ్డి: ‘కారు.. చిచ్చు’ శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం నర్సాపూర్ నియోజకవర్గంతో పాటు జిల్లావ్యాప్తంగా రాజకీయవర్గాలు, ప్రజల్లో చర్చనీయాంశమైంది. అంతేకాదు నర్సాపూర్ విభజనపై నిన్నటి వరకు మనసులో మాట బయటపెట్టని నేతలు ‘సాక్షి’ కథనంతో తమ అంతరంగాన్ని బయపెట్టారు. ప్రజలకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలన్నారు. జిల్లా పునర్విభజనలో నర్సాపూర్ మండలాన్ని మొదట సంగారెడ్డి జిల్లాలో కలపాలని ఆపై మనసు మార్చుకున్న ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆదివారం కౌడిపల్లిలో మరోసారి తన మనసులోని మాటను బయటపెట్టారు. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గంలోని ఆరు మండలాలను మెదక్ జిల్లాలో కలపాలని, నర్సాపూర్‌ను డివిజన్ కేంద్రం చేయాలని స్పష్టం చేశారు. మరోవైపు నర్సాపూర్ మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపాలని పట్టుదలగా ఉన్న టీఆర్ఎస్ జిల్లా సారథి మురళీయాదవ్ సైతం తన మనోభావాలను వెల్లడించారు. నర్సాపూర్ విభజనకు సంబంధించి సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి హరీశ్‌రావు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనకు శిరోధార్యమని సంగారెడ్డిలో విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే సునీతారెడ్డి సైతం నర్సాపూర్ విభజనపై ఆదివారం హత్నూరలో మాట్లాడారు. నర్సాపూర్, హత్నూర మండలాలను సంగారెడ్డి జిల్లాలో కలపాలని, నర్సాపూర్, హత్నూర, శివ్వంపేట, గుమ్మడిదల, జిన్నారంను కలిపి నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ చేయాలని డిమాండ్ చేశారు. నర్సాపూర్‌కు చెందిన ముగ్గురు కీలక నేతలు నియోజకవర్గ విభజనపై స్పష్టమైన వైఖరిని వెలిబుచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న చర్చ ప్రారంభమైంది. అధికార పార్టీ నేతలది చెరోదారి నర్సాపూర్ నియోజకవర్గం విభజన ముసాయిదా వెలువడినప్పటి నుంచి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్ మధ్య విభేదాలు రేకెత్తాయి. నర్సాపూర్, హత్నూర మండలాలను సంగారెడ్డి జిల్లాలో కలపాలని మురళీయాదవ్ మొదటి నుంచి పట్టుదలగా ఉన్నారు. ఆ మేరకు నర్సాపూర్ మండలాన్ని సంగారెడ్డిలో కలిపేందుకు ఎమ్మెల్యే మదన్‌రెడ్డిని ఒప్పించి.. అధిష్టానానికి లేఖ సైతం ఇప్పించారు. నర్సాపూర్ మండలాన్ని సంగారెడ్డిలో కలుపుతున్నట్లు ముసాయిదా వెలువడటం, తన సొంత మండలమైన కౌడిపల్లిని తూప్రాన్ డివిజన్లో కలపడం ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి రుచించ లేదు. దీంతో యూటర్న్ తీసుకుని నర్సాపూర్ నియోజకవర్గాన్ని తథాతథంగా కొనసాగిస్తూ మెదక్‌లో కలపాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. మరోవైపు మురళీయాదవ్ నర్సాపూర్ మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపాలని పట్టుదలగా ఉన్నారు. ఆ మేరకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, విభజనకు సంబంధించి సీఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. నర్సాపూర్‌కు చెందిన ఇద్దరు టీఆర్ఎస్ నేతలు చెరో వైఖరితో ఉన్నారు. దీంతో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న చర్చ టీఆర్ఎస్ పార్టీ నేతల్లో మొదలైంది. అయితే, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే సునీతారెడ్డి నర్సాపూర్, హత్నూర మండలాలను సంగారెడ్డి జిల్లాలో కలపాలని డిమాండ్ చేయటం మురళీయాదవ్ వర్గానికి కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. నర్సాపూర్ నియోజకవర్గ పరిణామాలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇంటలిజెన్స్ నివేదికలు తెప్పించుకుంటున్నట్లు సమాచారం. నర్సాపూర్ విభజనపై ఎమ్మెల్యే, జెడ్పీ చైర్పర్సన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్ వైఖరి, స్థానికుల అభిప్రాయాలు, అభ్యంతరాలు, ఆందోళనలపై ప్రభుత్వం ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. యథాతధంగా ఉంచాలి నియోజకవర్గంలోని ఆరు మండలాలను యథాతధంగా ఉంచుతూ కొత్తగా ఏర్పాటు చేసే మెదక్ జిల్లాలో కలిపి, నర్సాపూర్‌ను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలి. ఒకే నియోజకవర్గంలో ఎమ్మెల్యే, జెడ్పీ చైర్పర్సన్ ఉన్నారని నియోజకవర్గం విడదీయవద్దు. - సి.మదన్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే. సీఎం నిర్ణయం శిరోధార్యం మెదక్ జిల్లా విభజన విషయంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు తీసుకున్న నిర్ణయమే శిరోధార్యం. నర్సాపూర్‌కు సంబంధించి సీఎం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటా. పార్టీలోని నేతలు కట్టుబడి ఉండాలి. - మురళీయాదవ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రెవెన్యూ డివిజన్ చేయాలి నర్సాపూర్‌తో పాటు హత్నూర, శివ్వంపేట మండలాలను సంగారెడ్డి జిల్లాలో కలపాలి. అలాగే జిన్నారం, గుమ్మడిదల మండలాలను కలిపి నర్సాపూర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలి. - సునీతారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు -
సునీతకు స్వగ్రామంలో ఎదురు దెబ్బ
నర్సాపూర్, న్యూస్‌లైన్: నర్సాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు అనుకూల పవనాలు వీచగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీచినట్లు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. నర్సాపూర్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించి ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచి ఓటమి చెందిన మాజీ మంత్రి సునీతారెడ్డికి స్వగ్రామంలో సైతం వ్యతిరేక పవనాలు వీచాయి. గతంలో ఆమె చేతిలో రెండుసార్లు ఓటమి చవిచూసి మూడో సారి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన చిలుముల మదన్‌రెడ్డి కారు జోరుతో విజయం సాధించారు. అయితే సునీతారెడ్డి స్వగ్రామమైన గోమారంలో మూడు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా ఒకే పోలింగ్ స్టేషన్లో ఆమెకు ఆధిక్యత వచ్చింది. 239 పోలింగ్ స్టేషన్లో ఆమెకు 469 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి చిలుముల మదన్‌రెడ్డికి 336ఓట్లు వచ్చాయి. 240 పోలింగ్ స్టేషన్లో కాంగ్రెస్‌కు 135 ఓట్లు మాత్రమే రాగా టీఆర్స్కు 366 ఓట్లు,240(ఎ) పీఎస్‌లో కాంగ్రెస్‌కు 284 ఓట్లు, టీఆర్ఎస్కు 311ఓట్లు రావడంతో అక్కడ సైతం టీఆర్ఎస్ హవా కొనసాగిందని స్పష్టమవుతుంది. అలాగు గోమారం పక్క గ్రామాలైన బిజిలీపూర్‌లో స్వల్ప ఆధిక్యత రాగా నవాబుపేట గ్రామంలో సుమారు నాల్గు వందల ఓట్ల ఆధిక్యత లభించింది. కాగా మండలానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యులైన నారాగౌడ్, ఉమాదేవి, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు శ్రీరాంరెడ్డి స్వగ్రామాల్లో టీఆర్ఎస్కే ఆధిక్యత లభించింది. మదన్‌రెడ్డి స్వగ్రామమైన కౌడిపల్లిలో మూడు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా మూడింటిలో టీఆర్ఎస్కు 1328ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 560 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సీడీసీ చైర్మన్ చిలుముల దుర్గారెడ్డి కౌడిపల్లికి చెందిన వారే అయినప్పటికీ అక్కడ టీఆర్ఎస్కు భారీగానే ఓట్లు వచ్చాయి. కాగా నర్సాపూర్ మాజీ వ్యవసాయ మార్కెట్ కమీటీ చైర్మన్ నారాయణరెడ్డి స్వగ్రామమైన చిట్కుల్లో, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు మాణిక్యరెడ్డి స్వగ్రామమైన గౌతాపూర్‌లో, మరో సీనియర్ నాయకుడు విశ్వంబరస్వామి స్వగ్రామమైన సోమక్కపేటలలో సైతం టీఆర్ఎస్కు ఆధిక్యత లభించింది. నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్‌లో కాంగ్రెస్ సర్పంచ్ ఉన్నప్పటికీ టీఆర్ఎస్కు ఆధిక్యత లభించింది. ఇక్కడ కాంగ్రెస్‌కు 3558 ఓట్లు రాగా టీఆర్ఎస్కు 4320ఓట్లు లభించాయి. కొన్ని నెలల క్రితం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నర్సాపూర్ పంచాయతీ సర్పంచ్‌గా రమణారావును గెలిపించుకుని పంచాయతీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆత్మకమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు గౌడ్ స్వగ్రామమైన రెడ్డిపల్లిలో టీఆర్ఎస్కు సుమారు రెండు వందల ఓట్లు అధికంగా వచ్చాయి. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌గుప్తా స్వగ్రామంలో కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్‌కన్నా 94 ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఇదిలాఉండగా కొల్చారం మండలంలోని కాంగ్రెస్ నాయకులు ఇంద్రసేనారెడ్డి, మల్లారెడ్డి గ్రామాల్లో టీఆర్ఎస్కు స్వల్ప ఆధిక్యత రాగా ఇతర నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, రమేష్, నరేందర్‌రెడ్డి తదితరులు తమ గ్రామాల్లో కాంగ్రెస్‌కు ఆధిక్యత సంపాదించిపెట్టారు. అలాగే వెల్దుర్తి మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు అనంతరెడ్డి స్వగ్రామమైన బండపోసాన్‌పల్లిలో కాంగ్రెస్‌కు 69ఓట్ల ఆధిక్యత లభించింది. రామాయంపేట ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్‌రెడ్డి స్వగ్రామమైన రామాంతపూర్‌లో టీఆర్ఎస్కు కాంగ్రెస్ కన్నా 188ఓట్లు అధికంగా వచ్చాయి. మండల కేంద్రమైన వెల్దుర్తిలో కాంగ్రెస్ నాయకుడు శంకర్‌గౌడ్ ఊరిలో ఆరు పీఎస్‌లు ఏర్పాటు చేయగా సుమారు 350ఓట్ల ఆధిక్యత టీఆర్ఎస్కు లభించింది. హత్నూర మండల కేంద్రంలో కాంగ్రెస్‌కన్నా టీఆర్ఎస్కు ఐదు వందల ఓట్లు అధికంగా వచ్చాయి. గతంలో హత్నూర జెడ్పీటీసీ,ఎంపీపీ అధ్యక్ష పదవులు కాంగ్రెస్ అధీనంలో ఉన్నప్పటికీ టీఆర్ఎస్కు ఆధిక్యత రావడం గమనార్హం. హత్నూర మాజీ జెడ్పీటీసీ ఆంజనేయులు స్వగ్రామమైన బోర్పట్లలో 323 ఓట్లు, మరో నాయకుడు అళ్వారయ్య స్వగ్రామంలో కాసాలలో టీఆర్ఎస్కు 288ఓట్లు అధికంగా వచ్చాయి. అదే మండలంలోని డాక్టర్ గోవర్దన్‌రావు, నర్సింహారెడ్డి స్వగ్రామాల్లో టీఆర్ఎస్కు స్వల్ప ఆధిక్యత లభించింది. -
నర్సాపూర్ నియోజకవర్గంలో జోరుగా అభివృద్ధిపనులు
నర్సాపూర్, న్యూస్‌లైన్: స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి వి.సునీతాలక్ష్మారెడ్డి కృషి ఫలితంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఆమె మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు రూ.18 వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. నియోజకవర్గంలో విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు గాను సుమారు ఇరవై సబ్ స్టేషన్లతో పాటు పెద్దగొట్టిముక్ల, గోమారం గ్రామాల సమీపంలో సుమారు వెయ్యి కోట్లతో 400 కేవీ సబ్ స్టేషన్‌ను మంజూరు చేయించారు. అలాగే వెల్దుర్తి మండలంలోని హల్ది ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల పునరుద్ధరణ కోసం రూ.8 కోట్ల 30 లక్షలు మంజూరు చేయించగా పనులు కొనసాగుతున్నాయి. పంచాయతీ రోడ్ల అభివృద్ధికి రూ.45 కోట్లు, ఆర్అండ్బీ రోడ్ల కోసం రూ. 25 కోట్లు, చెక్‌డ్యాంలు, చెరువుల మరమ్మతుల కోసం రూ.40 కోట్లు మంజూరు చేయించారు. మంచి నీటి సమస్య పరిష్కరించేందుకు గాను ఆర్డబ్ల్యూఎస్ కింద పైపులైన్లు, ఇతర నీటి సరఫరా కోసం 70 కోట్ల రూపాయలు, విద్యాభివృద్ధిలో భాగంగా పాఠశాలలకు అదనపు గదులు, కొత్త భవనాల కోసం 25 కోట్ల రూపాయలు మంజూరు చేయించగా పనులు కొనసాగుతున్నాయి. పలు బ్రిడ్జిల నిర్మాణానికి గాను రూ. 33 కోట్లు మంజూరు చేయించారు. అలాగే గత నాలుగున్నర ఏళ్లలో సుమారు 15వేల ఇండ్లు శాశ్వత గృహ నిర్మాణ పథకం ద్వారా పేదలకు ఇళ్లు అర్హులకు 18వేల దీపం కనెక్షన్లు మంజూరు చేయించారు. బాధ్యతగా చేస్తున్నా మంత్రి : సునీతాలక్ష్మారెడ్డి నన్ను ప్రజలు విశ్వాసంతో మూడు సార్లు గెలిపించారు. వారి సమస్యలను పరిష్కరిస్తాననే నమ్మకం ఉంది. అందుకే సుమారు 1800 కోట్ల రూపాయలతో పనులు చేయించా. పనులు కొనసాగుతున్నాయి. వారి నమ్మకాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నా. అంతకు ముందు నియోజకవర్గం ఎంతో వెనుకబడి ఉండేది. ప్రజల సమస్యలు పరిష్కరించడం నా బాధ్యత. నన్ను గెలిపించి నందుకు కృతజ్ఞతగా భావిస్తున్నా. అందరి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నా.