
సమీక్ష నిర్వహిస్తున్న సునీతారెడ్డి
నర్సాపూర్: ఎన్నికలు పూర్తవడంతో నర్సాపూర్ నుంచి పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓట్ల లెక్కలు వేసుకోవడంలో బిజీ బిజీగా గడిపారు. శనివారం ఉదయం టీఆర్‌ఎస్ అభ్యర్థి చిలుముల మదన్‌రెడ్డి తన స్వగ్రామమైన కౌడిపల్లిలో కుటుబం సభ్యులతో గడుపగా, కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డి తన స్వగ్రామమైన శివ్వంపేట మండలం గోమారంలో తన కుటుంబ సభ్యులతో గడిపారు. మధ్యాహ్నం తర్వాత నర్సాపూర్‌కు చేరుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలతో పోలింగ్ సరళి తెలుసుకుంటూ మెజారిటీపై లెక్కలు వేస్తూ బిజీ బిజీగా గడిపారు. ఎవరికి వారు గెలపుపై ధీమా వ్యక్తం చేశారు.నర్సాపూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి చిలుములమదన్‌రెడ్డి శనివారం నర్సాపూర్‌లోని మణికొండ ఫంక్షన్‌హాలులో నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మండలాల వారీగా సమీక్ష జరిపారు. గ్రామ స్థాయి నాయకులతో సమావేశమై ఆయా గ్రామాల్లో తనకు ఎన్ని ఓట్లు వస్తాయో అడిగి తెలుసుకున్నారు.
సునీతారెడ్డి సమీక్ష..
మధ్యాహ్నం నియోజకవర్గానికి చేరుకున్న సునీతారెడ్డి మండలానికి చెందిన నాయకులు కార్యకర్తలతో వరుస సమీక్షలు నిర్వహించారు. గ్రామాల వారీగా పోలింగ్ సరళిపై ఆరా తీశారు. అన్ని మండలాల్లో తమకే మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment