sunitha laxmareddy
-
అవసరమైతే ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు కావొచ్చు
సాక్షి, హైదరాబాద్: ‘బహిష్కరణలు, సస్పెన్షన్లు, మార్షల్స్ అవసరం లేకుండా సభ నడపాలనేది మా ప్రభుత్వ ఆలోచన. కానీ అలాంటి అవసరం, సందర్భం వస్తే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. అవసరాన్ని బట్టి ఎమ్మెల్యేల సభ్యత్వం కూడా రద్దు కావొచ్చు. ఏ నిర్ణయమైనా సమయం, సందర్భాన్ని బట్టి ఉంటుంది. శాసనసభలో నేను ఒక్కమాట కూడా అసభ్యంగా మాట్లాడలేదు. నేను మాట్లాడిన దాంట్లో అన్ పార్లమెంటరీ పదం లేదు..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం శాసనసభ వాయిదా అనంతరం ఆయన తన చాంబర్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై సభలో చేసిన వ్యాఖ్యలు, ఇతర అంశాలపై స్పందించారు.నేను వాళ్ల పేర్లు ప్రస్తావించలేదు‘మోసానికి పర్యాయపదం సబిత అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. నన్ను కాంగ్రెస్‌లోకి రమ్మని చెప్పిన సబిత అక్క నాకు అండగా ఉండాల్సింది పోయి పార్టీ మారింది. నా ఎన్నికల బాధ్యత తీసుకుంటానని చెప్పి నేను నామినేషన్ వేసేటప్పటికే వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారు. సునీతా లక్ష్మారెడ్డి కోసం 2018 ఎన్నికల్లో ప్రచారానికి పోతే నా మీద కౌడిపల్లి, నర్సాపూర్‌లో రెండు కేసులు పెట్టారు. అధికార పార్టీలోకి వెళ్లి మహిళా కమిషన్ పదవి తీసుకున్న సునీత తాను ఎమ్మెల్యే అయినా తన ప్రచారం కోసం వెళ్లిన తమ్ముడి మీద కేసులు తీయించలేదు. ఈ నేపథ్యంలోనే అక్కల మాటలు నమ్మి నేను మోసపోయాను అని కేటీఆర్‌కు చెప్పా. నేను వాళ్ల పేర్లు ప్రస్తావించలేదు. సబిత వ్యక్తిగత విషయాలను మాట్లాడినందుకే, నేను మిగతాది పూర్తి చేశా..’ అని సీఎం చెప్పారు.కేసీఆర్‌ను ఫ్లోర్‌లీడర్‌గా తొలగించాలి‘సబితక్కకు అవమానం, అన్యాయం జరిగి అవేదన చెందితే కేసీఆర్, హరీశ్‌రావు అసెంబ్లీకి ఎందుకు డుమ్మా కొట్టారు. సభలోకి వచ్చి సబితక్కకు అండగా నిలబడకుండా, పార్టీ సభ్యులను పట్టించుకోకుండా కేసీఆర్ ఎందుకు పత్తా లేకుండా పోయారు. సభలో మాట్లాడేందుకు కేటీఆర్, హరీశ్‌రావు చాలు అనుకుంటే, కేసీఆర్‌ను ఫ్లోర్‌లీడర్ పదవి నుంచి తొలగించాలి. కేసీఆర్‌కు రాష్ట్రం పట్ల బాధ్యత, పట్టింపు లేదు. కేసీఆర్‌కు అధికారం తప్ప ప్రజలను పట్టించుకోవాలనే మంచి ఆలోచన లేదు..’ అని రేవంత్ విమర్శించారు. విపక్ష సభ్యులకే ఎక్కువ సమయంఒక రోజు 17 గంటలపైనే సభ జరగడాన్ని బట్టి చూస్తే వారం రోజులకు పైగా సభ జరిగినట్లే. ఎన్ని రోజులు సమావేశాలు జరిగాయనే దానికంటే ఎన్ని గంటలు జరిగిందనేదే ముఖ్యం. గడిచిన పదేళ్లతో పోలిస్తే అసెంబ్లీని ప్రజాస్వామికంగా నడుపుతున్నాం. సభలో విపక్ష సభ్యులకే ఎక్కువ సమయం ఇచ్చాం. బీఆర్ఎస్ తరపున కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి ముగ్గురు కలిసి ఆరు గంటల సేపు మాట్లాడారు. నాతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు.. ముగ్గురం కలిసినా అంతసేపు మాట్లాడలేదు’ అని సీఎం చెప్పారు. కలిసినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదుగద్వాల ఎమ్మెల్యే తిరిగి బీఆర్ఎస్లో చేరుతున్నారనే వార్తపై స్పందిస్తూ.. ‘టీ తాగేందుకు కలుసుకోవటం, రాజకీయాలకు, పార్టీల్లో చేరటానికి సంబంధం లేదు. ఇటీవల ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నా చాంబర్‌కు వచ్చి టీ తాగారు. అంతమాత్రాన వారు మా పార్టీలో చేరినట్లా..?’ అని రేవంత్ ప్రశ్నించారు.ప్రజాస్వామికంగా అసెంబ్లీ సమావేశాలు‘గతంలో బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ సభ్యత్వాలు రద్దు చేశారు. నన్ను కూడా ఒక సెషన్ మొత్తం సస్పెండ్ చేయడంతో నా నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరుగుతుందని హైకోర్టులో పిటిషన్ వేశా. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసనసభలోనూ ఎమ్మెల్యేగా ఉన్నా. కానీ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు పూర్తి ప్రజాస్వామికంగా, బాధ్యతగా జరిగాయి. చర్చను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినా మేము బాధ్యతగా వ్యవహరించాం. ఈసారి బడ్జెట్ సమావేశాలు తక్కువ రోజులు జరిగినా బడ్జెట్, పద్దులు, ద్రవ్య వినిమయ బిల్లుపై అందరికీ మాట్లాడే అవకాశం దొరకడంతో వీలైనంత చర్చ జరిగింది. -
సునీత లక్ష్మారెడ్డికి క్యాబినెట్ హోదా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళ కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డికి క్యాబినెట్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 5 సంవత్సరాల పదవీ కాలం తో పాటు మంత్రి హోదా లో ఉండే అన్నీ వసతులు ఆమెకు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి ఉన్నారు. -
‘కారె’క్కిన సునీతా లక్ష్మారెడ్డి
సాక్షి, మెదక్ : సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఇప్పటికే పార్టీలోని కీలక నేతలంతా ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్లో చేరారు. సోమవారం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో.. కార్యకర్తలతో కలిసి గులాబీ కండువా కప్పుకున్నారు. సునీత చేరికతో మెదక్‌లో టీఆర్‌పార్టీ మరింత బలోపేతమవుతుందంటున్నారు విశ్లేషకులు. ఈ సందర్భంగా సునీతా లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ.. ‘కష్టపడి పనిచేసే వారికి కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు లేదు. 50 ఏళ్లలో సాధ్యం కానీ అభివృద్ధిని కేసీఆర్ నాలుగేళ్లలో చేసి చూపారు. మెదక్ జిల్లా అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో చేరుతున్నాన’ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, మెదక్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మాదేవేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. సునీతా లక్ష్మారెడ్డితో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే గత కొన్ని రోజులుగా సునీతా టీఆర్ఎస్లో చేరతారనే వార్తలు వినిపించాయి. తొలుత ఆమె బీజేపీలో చెరతారనే ప్రచారం జరిగింది. కానీ కార్యకర్తల అభిప్రాయం మేరకు ఆమె టీఆర్ఎస్లో చేరడానికే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఈ నెల 3న మెదక్ నర్సాపూర్‌లో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరతారని భావించారు. కానీ ఈ లోపే సోమవారం ఆమె గులాబీ కండువా కప్పుకున్నారు. -
టీఆర్ఎస్లోకి సునీతా లక్ష్మారెడ్డి!
సాక్షి, మెదక్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మెతుకుసీమలో కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)తో మంగళవారం ఆమె హైదరాబాద్‌లో సమావేశమైనట్లు తెలిసింది. చర్చల అనంతరం సీఎం కేసీఆర్‌తోనూ ఆమె ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. వచ్చే నెల మూడో తేదీన నర్సాపూర్‌లో జరిగే మెదక్ లోక్‌సభ నియోజకవర్గ బహిరంగ సభలో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరనున్నట్లు సమాచారం. అయితే.. సునీతా లక్ష్మారెడ్డి ‘కారు’ఎక్కనున్నారనే సమాచారంతో కాంగ్రెస్‌కు చెందిన పలువురు కీలక నేతలు ఆమెను బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఫోన్లో ఆమె అందుబాటులో లేకపోవడంతో ఆమె అనుచరులు, బంధువుల వద్దకు వెళ్లి మాట్లాడినట్లు తెలుస్తోంది. హ్యాట్రిక్ విజయం సునీతా లక్ష్మారెడ్డి మూడు పర్యాయాలు (1999, 2004, 2009) కాంగ్రెస్ నుంచి నర్సాపూర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో సీపీఐకి చెందిన చిలుముల కృష్ణారెడ్డిపై 13,274 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి హ్యాట్రిక్ రికార్డు సొంతం చేసుకున్నారు. అయితే 2014 సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నిక, ఆ తర్వాత ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. అంచెలంచెలుగా ఎదిగిన సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్‌లో అనేక పదవులు నిర్వహించారు. తొలుత బీజేపీలోకి అంటూ.. ఇటీవల గద్వాల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి డీకే.అరుణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. ఆమెతో కలసి సునీతా లక్ష్మారెడ్డి గతంలో మంత్రిగా పనిచేశారు. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉండటంతో సునీత లక్ష్మారెడ్డి సైతం బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని ఆమె ఖండించారు. అయితే.. అరుణ ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ సునీత ససేమిరా అన్నట్లు తెలిసింది. కేటీఆర్‌తో వరుస భేటీలు.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పార్టీ పటిష్టతపై కె.తారకరామారావు ప్రత్యేక దృష్టి సారించారు. దీనిలో భాగంగా జిల్లాల వారీగా పార్టీ నాయకులు, ముఖ్య అనుచరులతో సమావేశాలు జరుపుతున్నారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంపై ఆయన మరింత దృష్టి పెట్టారు.ఈ క్రమంలో ఇటీవల సునీతా లక్ష్మారెడ్డి మూడు, నాలుగు పర్యాయాలు కేటీఆర్‌ను కలసి చర్చి ం చినట్లు తెలిసింది. పార్టీ పటిష్టతలో భాగంగా టీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్నామని.. తగిన ప్రాధాన్యత కల్పిస్తామని ఆమెతో కేటీఆర్ అన్నట్లు సమాచారం. అంతేకాకుండా సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో కూడా ఫోన్లో మాట్లాడించినట్లు తెలిసింది. -
సునీతారెడ్డి లెక్కలేసుకున్నారు..
నర్సాపూర్: ఎన్నికలు పూర్తవడంతో నర్సాపూర్ నుంచి పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓట్ల లెక్కలు వేసుకోవడంలో బిజీ బిజీగా గడిపారు. శనివారం ఉదయం టీఆర్ఎస్ అభ్యర్థి చిలుముల మదన్‌రెడ్డి తన స్వగ్రామమైన కౌడిపల్లిలో కుటుబం సభ్యులతో గడుపగా, కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డి తన స్వగ్రామమైన శివ్వంపేట మండలం గోమారంలో తన కుటుంబ సభ్యులతో గడిపారు. మధ్యాహ్నం తర్వాత నర్సాపూర్‌కు చేరుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలతో పోలింగ్ సరళి తెలుసుకుంటూ మెజారిటీపై లెక్కలు వేస్తూ బిజీ బిజీగా గడిపారు. ఎవరికి వారు గెలపుపై ధీమా వ్యక్తం చేశారు.నర్సాపూర్ టీఆర్ఎస్ అభ్యర్థి చిలుములమదన్‌రెడ్డి శనివారం నర్సాపూర్‌లోని మణికొండ ఫంక్షన్‌హాలులో నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మండలాల వారీగా సమీక్ష జరిపారు. గ్రామ స్థాయి నాయకులతో సమావేశమై ఆయా గ్రామాల్లో తనకు ఎన్ని ఓట్లు వస్తాయో అడిగి తెలుసుకున్నారు. సునీతారెడ్డి సమీక్ష.. మధ్యాహ్నం నియోజకవర్గానికి చేరుకున్న సునీతారెడ్డి మండలానికి చెందిన నాయకులు కార్యకర్తలతో వరుస సమీక్షలు నిర్వహించారు. గ్రామాల వారీగా పోలింగ్ సరళిపై ఆరా తీశారు. అన్ని మండలాల్లో తమకే మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
చేసిన పనులే గెలిపిస్తాయి
నర్సాపూర్: గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసి చేపట్టిన అభివృద్ధి, పనులే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని పేదలకు మేలు చేసే పథకాలు తనను ప్రస్తుత ఎన్నికలలో గెలిపిస్తాయని నర్సాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి సునీతారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగిసినందున ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. తాను ఎన్నికల ప్రచారానికి ఏ గ్రామానికి వెళ్లిన ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ఇంటింటి ప్రచారంలో సైతం పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారని చెప్పారు. చాలా చోట్ల హారతులు ఇచ్చి ఆదరించారని ఆమె చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుఖాయమనీ పేర్కొన్నారు. చేరికలతో బలం పెరగింది.. ప్రజల నుంచి ఆదరణ నిండుగా ఉందని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలో ఇంటింటి ప్రచారం చేశామని ఆమె తెలిపారు. కాగా నియోజకవర్గంలోని పార్టీ నాయకులు తనతో పాటు ప్రచారంలో పాల్గొన్నారని నాయకులు కార్యకర్తలు ఈసారి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలన్న తపనతో ఉన్నారని అందుకు అనుగుణంగా గట్టిగా కృషి చేశారని ఆమె చెప్పారు. కాగా తాము ప్రతిపక్షంలో ఉన్నా ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు తమ కాంగ్రెస్ పార్టీలో చేరారని వారి చేరిక తమకు మరింత బలాన్ని చేకూర్చిందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రజలకు మేలు చేసే అంశాలతో మేనిఫెస్టో.. ప్రజల ఆదరణ, కార్యకర్తలందరి కృషి ఫలితంగా తాను భారీ మెజారిటీతో గెలుస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కాగా తాను గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన సేవలను ప్రజలు గుర్తుంచుకున్నారని ఆమె చెప్పారు. మేనిఫెస్టోలో వృద్ధ దంపతులిద్దరికి పింఛను, దళితులకు ఉచిత కరెంటు, విద్యార్థులకు స్కాలర్షిప్పులు, రేషన్ షాపుల ద్వారా ఒక్క రూపాయికే ఏడు కిలోల సన్న బియ్యంతో పాటు ఉద్యోగాల భర్తీ, ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపరిష్కారానికి ప్రాధాన్యత తదితర అంశాలన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయని అన్నారు. ఇతర పార్టీల మేనిఫెస్టోలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజల ను ఆకట్టుకుందని ఆమె పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి చెందే విధంగా ఉన్నందున నియోజకరవ్గంలోని అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరిస్తున్నారి పేర్కొన్నారు. చేసిన పనులే గెలిపిస్తాయ తాను ఏ గ్రామానికి ప్రచారానికి వెల్లిన బ్రహ్మరథం పడుతూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని, తనను గెలిపిస్తామని హామీ ఇస్తున్నారని సునీతారెడ్డి చెప్పారు. తనకు ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీతోనే పోటీ ఉంటుందని సునీతారెడ్డి పేర్కొన్నారు. కాగా టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు తన విజయానికి దోహదపడుతాయని ఆమె చెప్పారు. టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పాలనను గాలికొదిలేసి సచివాలయానికి రాకుండా ఇంటి నుంచి పరిపాలన సాగించడంతో రాష్ట్రంలో పరిపాలన సరైన దిశగా సాగనందున ప్రజలలో వ్యతిరేకతను పెంచిందని ఆమె చెప్పారు. సీఎం ఒక్కసారి కూడా రాలేదు.. నర్సాపూర్‌ను సీఎం దత్తత తీసుకుంటున్నట్లు గత ఎన్నికలప్పుడు ప్రకటించి ఒక్కసారైనా నియోజకవర్గంలో పర్యటించకపోవడం విచారకరమని అన్నారు. కాగా టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నెరవేర్చనందున ప్రజలు ఆ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకతతతో ఉన్నారని ఆమె చెప్పారు. తమ పార్టీ ఇచ్చిన హామిలు నెరవేర్చుతుందని ప్రజలలో నమ్మకం ఉందని తాము ఏ హామీ ఇచ్చిన నెరవేరుస్తామని ఆమె చెప్పారు. కాగా ప్రస్తుత ఎన్నికలలో తాను గెలుస్తానని గెలిచాక నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలతో పాటు ప్రజలు ఎదుర్కోంటున్న సమçస్యలను గురింతచి పరిష్కరిస్తానని, మేనిఫెస్టోలోని పథకాలు పకడ్బందీగా అమలు చేయించి ప్రజలకు చేరేలా చూస్తానని ఆమె హామీ ఇచ్చారు. -
నీటి పారుదల మంత్రిగా ఏం చేశారు?
గజ్వేల్: మంత్రిగా పనిచేసిన కాలంలో సునీతారెడ్డి జిల్లాకు ఒరగబెట్టిందేమీలేదని, ప్రస్తుతం నర్సాపూర్‌లో మదన్‌రెడ్డి తిరిగి భారీ మెజార్టీతో గెలవబోతున్నారని రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గురువారం రాత్రి పట్టణంలోని ప్రజ్ఞా గార్డెన్స్‌లో నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందు పదేళ్లలో మీరు చేసిన అభివృద్ధి, నాలుగేళ్లలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుందామంటూ సునీతారెడ్డికి సవాల్ చేశారు. మీ పాలనలో ఎరువులు, విత్తనాల కొరత, దొంగరాత్రి కరెంటు తప్ప ప్రజలకు ఒరిగిందేమీలేదన్నారు. నీటి పారుదలశాఖ నిర్వహించినా ఒక్క చెరువు కట్టను కూడా బాగుచేయలేకపోయారని విమర్శించారు. మాట తప్పడం కాంగ్రెస్ నైజమైతే... ప్రజలకు చెప్పింది అక్షరాల నెరవేర్చడం టీఆర్ఎస్ ఘనత అంటూ పేర్కొన్నారు. పోరాడి తెలంగాణను సాధించడమేగాకుండా 24గంటల కరెంటు ఇస్తామంటే... ఇచ్చినం. కల్యాణలక్ష్మీ పథకం కులం, మతం తారతమ్యం లేకుండా అందజేసినం. కేసీఆర్ కిట్ అందజేసి పేదల కళ్లల్లో ఆనందం చూసినం. రైతు బీమా, రైతు బంధు అమలు చేసి అన్నదాతలకు అండగా నిలిచినం. మిషన్ భగీరథతో స్వచ్ఛమైన నీటిని అందించగలిగామని వివరించారు. అందువల్లే టీఆర్ఎస్పై ప్రజల్లో నేడు చెరగని విశ్వాసం ఉందన్నారు. నేడు కాంగ్రెసోళ్లు ఇది కాలేదు... అది కాలేదంటే జనం నవ్వుకుంటున్నారని విమర్శించారు. మీ చెవుల్లో పువ్వులు పెట్టుకోగలుగుతారేమో కానీ.. ప్రజల కళ్లకు గంతలు కట్టలేరంటూ మండిపడ్డారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్కు పది స్థానాలు జగదేవ్‌పూర్(గజ్వేల్): గజ్వేల్ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులను చూసే ఇతర పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం రాత్రి జగదేవ్‌పూర్ మండలం రాయవరం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చంద్రంతో పాటు కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు 40 మంది మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్‌లోని ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలసలు పెరిగాయని చెప్పారు. సీఎం కేసీఆర్ ఇటివల గజ్వేల్ నియోజకవర్గ టీఆర్స్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం అనంతరం ప్రతిపక్ష పార్టీలన్ని ఖాళీ అవుతున్నాయని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో పది స్థానాలకు పది టీఆర్ఎస్ ఖాతాలో చేరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశా రు. కార్యక్రమంలో జగదేవ్‌పూర్ మండల ఎన్నికల సమన్వయకర్త రాధాకృష్ణశర్మ, మండలాధ్యక్షులు రంగారెడ్డి, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. గజ్వేల్ దశ మార్చిన ఘనత టీఆర్ఎస్దే గజ్వేల్: కేసీఆర్ ఆధ్వర్యంలో గజ్వేల్‌లో చేపట్టిన అభివృద్ధిని కార్యకర్తలు, నాయకులు గడపగడపకు తీసుకెళ్లాలని రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. గురువారం గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ హరితా రెస్టారెంట్ వద్ద టీఆర్ఎస్ నాయకులు ఊడెం కృష్ణారెడ్డి నేతృత్వంలో అనంతరావుపల్లి, బూర్గుపల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్, టీడీపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ గజ్వేల్‌కు కొత్తరూపు తీసుకొచ్చిన ఘనత టీఆర్ఎస్కే దక్కిందన్నారు. ఒకప్పుడు కనీస అవసరాలకు దూరంగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని నేడు అభివృద్ధిలో రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దగలిగామన్నారు. కేసీఆర్ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిన వినూత్న పథకాలన్నీ ఇక్కడ నుంచే ప్రారంభించడం ఈ ప్రాంత ప్రజలకు గర్వకారణమన్నారు. ఒకప్పుడు గుర్తింపు లేకుండా ఉన్న గజ్వేల్ ప్రాంతం.. కేసీఆర్ ప్రాతినిథ్యంతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించిందని చెప్పారు. ఇదే అభివృద్ధి పరంపర కొనసాగాలంటే ప్రజలంతా మూకుమ్మడిగా కేసీఆర్ అభ్యర్థిత్వాన్ని బలపర్చి లక్ష ఓట్ల మెజార్టీని కానుకగా ఇవ్వాలన్నారు. నాయకులు, కార్యకర్తలు 20 రోజుల పాటు శక్తివంచన లేకుండా శ్రమిస్తే ఆ తర్వాత ఐదేళ్లు కడుపులో పెట్టి చూసుకుంటామని హామీ ఇచ్చారు. పార్టీలో పనిచేసే కార్యకర్తలు, నాయకులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ నియోజకవర్గాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలు ప్రజాసమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టలేదని చెప్పారు. నేడు ప్రజలకు అభివృద్ధి తీరు స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘తాగుబోతు సీఎం నుంచి తెలంగాణకు విముక్తి కల్పించండి’
సాక్షి, మెదక్ : తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతు ముఖ్యమంత్రి నుంచి విముక్తి చేయడాలని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కోరారు. సోమవారం నర్సాపూర్ నియోజకవర్గంలోని శివ్వంపేటలో నిర్వహించిన రోడ్డు షోలో కాంగ్రెస్ నాయకురాలు సునీతా రెడ్డితో కలిసి రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సాపూర్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానన్న కేసీఆర్ ఏ సమస్యలను తీర్చలేదని ఆరోపించారు. ఆయనకు ఏ సమస్యలు పట్టవని, ఫామ్ హౌజ్‌లో కూర్చొని తాగడం ఒక్కటే తెలుసని ఎద్దేవా చేశారు. తాగుబోతుల చేతుల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలన్నారు. కేసీఆర్ దగ్గర గూలాం గిరి చేసే మదన్ రెడ్డి కావాలో.. అసెంబ్లీలో నర్సాపూర్ సమస్యల కోసం కొట్లాడే సునీతా రెడ్డి కావాలో ఆలోచించడంటూ ప్రజలను కోరారు. కర్రు కాల్చి కారు గుర్తుకు వాత పెట్టాల్సిన సందర్భం వచ్చిందన్నారు. ప్రజాశీర్వాదంతో నర్సాపూర్‌లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు బంగారు తెలంగాణలో పుస్తెలు అమ్ముకోవాల్సి వస్తోంది బంగారు తెలగాంణలో మెడలో పుస్తెల తాడు అమ్ముకోవాల్సి వచ్చిందని కాంగ్రెస్ నాయకురాలు సునీత లక్ష్మారెడ్డి విమర్శించారు. జనం చచ్చారో, బతికారో పట్టించుకోని కేసీఆర్‌కు ఓటు వేయవద్దు అంటూ కాంగ్రెస్ విజ్ఞప్తి చేశారు. తన భర్త మరణం తర్వాత రాజకీయాలకు దూరంగా ఉందామనుకున్నాను.. కానీ ప్రజల కోసం తిరిగి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. రీజనల్ రింగ్ రోడ్ ఆలోచన కాంగ్రెస్ హయాంలోదేనని వెల్లడించారు. ఎన్నికల ప్రచార ర్యాలీ విజయోత్సవ ర్యాలీగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణలో మెడలో పుస్తెలు అమ్ముకోవాల్సి వచ్చిందన ఆరోపించారు. నర్సాపూర్ పౌరుషాల పోరుగ్డడ అని గుర్తు చేశారు. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ
సంగారెడ్డి రూరల్ : కర్ణాటకలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని బీజేపీ అడ్డదారులు తొక్కుతూ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు.అధికార దాహంతో గవర్నర్ అధికారాలను దుర్వినియోగం చేస్తూ.. సంఖ్యా బలం తక్కువగా ఉన్న బీజేపీ చేత ప్రభుత్వం ఏర్పాటు చేయించడం సమంజసం కాదన్నారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోతిరెడ్డిపల్లిలోని జాతీయ రహదారి చౌరస్తాపై భైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో మేఘాలయా, గోవా, మణిపూర్‌లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉన్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతం కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు సంఖ్యా బలం లేకున్నా గవర్నర్ తన అధికారాలను దుర్వినియోగం చేస్తూ బీజేపీచేత ప్రమాణ స్వీకారం చేయించడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు 15 రోజుల్లో మెజారిటీ నిరూపించుకోకుండా ఒకే రోజులో బల నిరూపణ చేపట్టాలని ఆదేశించడం వారికి చెంప పెట్టులాంటిదన్నారు. కాంగ్రెస్, జేడీఎస్పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ నాయకులు డబ్బులను ఎరవేస్తూ తమవైపు లాక్కొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేలను హెలిక్యాప్టర్‌లో తరలిస్తుంటే ఏటీసీ నుంచి సిగ్నల్స్ ఇవ్వకపోవడం బీజేపీ కుట్రే అన్నారు. ప్రజలంతా గమనిస్తున్నారని, అవినీతిలో కూరుకుపోయిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ ఆందోళనతో రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేసి ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో మహిళ కాంగ్రెస్‌జిల్లా అధ్యక్షురాలు నిర్మల జయప్రకాశ్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శశికళ యాదవ్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి అనంతకిషన్, జిన్నారం జెడ్పీటీసీ ప్రభాకర్, పటాన్చెరు కార్పొరేటర్ శంకర్‌యాదవ్, నాయకులు మునిపల్లి సత్యనారాయణ, ఆంజనేయులు, శంకర్‌రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
'శ్రీకాంతాచారి తల్లిని అవమానించారు'
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్రని, పార్టీని పాతరెయ్యడం ఎవరికీ సాధ్యంకాదని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలు టీఆర్ఎస్కు బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలను గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని, లేకుంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం వల్లే మీకు తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి చనిపోయిన తర్వాత ఆయన భార్య సుచరితా రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరితే ఇవ్వకపోవడం మానవత్వమా అని నిలదీశారు. భర్తను కోల్పోయిన మహిళను పరామర్శించడం కనీస సంప్రదాయమని, సుచరితారెడ్డికి ఇచ్చే గౌరవం ఇదేనా అని లేఖలో పేర్కొన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే వారి కుటుంబసభ్యుల్లో ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయం ఉమ్మడి రాష్ట్రంలో ఉండేదని, కానీ టీఆర్ఎస్ వాళ్లు మానవత్వం మరచి మరణించినవారిపై విమర్శలు చేయడం కుసంస్కారానికి నిదర్శనమని విమర్శించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతా చారి తల్లికి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయే సీటు ఇచ్చి అవమానించిందని ఆరోపించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతైనా ఆమెను ఎమ్మెల్సీని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఓడిపోయిన వారికి, ఇతర పార్టీల నుంచి వలస వచ్చినవారికి, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన తుమ్మల నాగేశ్వరరావు వంటివారికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారని.. అమరవీరుల త్యాగం, ఓడిపోయిన శ్రీకాంతా చారి తల్లి గుర్తుకురాలేదా? ఇదేనా మానవత్వం అని దుయ్యబట్టారు. పాలేరులో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము లేకనే 10 మంది మంత్రులు, 60 మంది ఎమ్మెల్యేలు అక్కడ తిష్టవేశారని, దీన్నిబట్టి కాంగ్రెస్ విజయం ఖాయమని జోస్యం చెప్పారు. అమలు కానీ హామీలతో ప్రజలను మభ్యపెడుతూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న టీఆర్ఎస్ను పాతరేయడానికి పాలేరు ప్రజలు సిద్ధంగా ఉన్నారని సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలు లేఖలో హెచ్చరించారు. -
'తెలంగాణ ఎందుకొచ్చిందా అనిపిస్తోంది'
నర్సాపూర్ (మెదక్): రైతుల ఆత్మహత్యలు చూస్తుంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చామా అనిపిస్తోందని మాజీ మంత్రి, మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సునీతాలక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధ కలిగిస్తోందన్నారు. గురువారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 1200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, మెదక్ జిల్లాలోనే 180 మంది ఆత్మహత్య చేసుకున్నారని వాపోయారు. ఆత్మహత్య చేసుకున్న బాధిత రైతు కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందడం లేదని ఆమె ఆరోపించారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు ముఖ్యమే అయినా.. రైతుల కష్టాలు తీర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపూ లేదా అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలోని 263 మండలాల్లో కరువు పరిస్థితులు ఉండగా.. జిల్లాలో అన్ని మండలాల్లో కరువు పరిస్థితులున్నాయన్నారు. తాము అధికారంలో ఉండగా ఆంధ్ర నాయకుల కొమ్ము కాస్తున్నామని ఆరోపించే వారు.. ఇప్పుడు ఎవరి కొమ్ము కాస్తున్నారని ప్రశ్నించారు. -
సెర్ప్ ఉద్యోగులకు వేతనాలు పెంపు
మంత్రి సునీతా లక్ష్మారెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)లో పనిచేసే దిగువస్థాయి ఉద్యోగుల వేతనాలు పెంచాలని ‘సెర్ప్’ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయించింది. ఐకేపీ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సెర్ప్‌లోని ఎల్-1, ఎల్-2 కేటగిరీల్లో పనిచేసే ఉద్యోగులకు వేతనాలు పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. ఎల్-1 ఉద్యోగులకు రూ.1,500, ఎల్-2 ఉద్యోగులకు వెయ్యి రూపాయల చొప్పున వేతనాన్ని పెంచుతున్నట్టు వెల్లడించారు. వీరితోపాటు వీఓఏలకు రూ.రెండు వేల వేతనం చెల్లించాలని కూడా తీర్మానించినట్లు వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న ఆరోగ్య కార్డులను సెర్ప్ ఉద్యోగులకూ కల్పిస్తామని, వీరికి రూ.రెండు లక్షల పరిమితి ఉంటుందని మంత్రి తెలిపారు. మహిళా ఉద్యోగులను వేధిస్తే నిర్భయ చట్టం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సమావేశం తీర్మానించిందన్నారు. -
మరో 50 అమృత హస్తం కేంద్రాలు: సునీతా లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో 50 అమృత హస్తం కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. ఇప్పటికే 120 కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయంలో రెండు రోజులుగా జరుగుతున్న ప్రాజెక్టు డెరైక్టర్ల సమావేశానికి గురువా రం ఆమె హాజరయ్యారు. గర్భిణిలు విధిగా అమృతహస్తం కేంద్రానికి వచ్చి ఆహారా న్ని తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మహిళలు గర్భవతులుగా ఉన్నప్పుడే బ్యాంకు ఖాతాలు ఏర్పాటు చేయించాలని... ఆడపిల్ల పుడితే వెంటనే ఆధార్‌కార్డు ఇప్పించాలని సూచిం చారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు జరపాలని ప్రాజెక్టు డెరైక్టర్లను ఆమె ఆదేశించారు. రాష్ట్రంలో బాలికలపై దాడులు జరిగినప్పుడు అండగా నిలవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ సమావేశంలో ముఖ్యకార్యదర్శి నీలం సహానీ, కమిషనర్ చిరంజీవి చౌదరి పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించేంత వరకు ఆధార్ కార్డుల జారీ ప్రక్రియనూ నిలిపేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని విన్నవించారు. అలాగే విద్యార్థులు ఉపకార వేతనాలకు ఆధార్‌ను తప్పనిసరిగా సమర్పించాలంటూ ప్రభుత్వం ఒత్తిడి చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు. ప్రజల సమాచారాన్ని సేకరిస్తున్న కేంద్రం..గోప్యత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపించట్లేదని, దీనివల్ల సమాచార దుర్వినియోగం జరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఆధార్‌కార్డును తప్పనిసరి చేయడం సరికాదంటూ సుప్రీం ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో తుది తీర్పు వచ్చేవరకు పాత పద్ధతిలోనే వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాకు చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టుకు పిటిషనర్ విన్నవించారు.