సాక్షి, మెదక్ : తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతు ముఖ్యమంత్రి నుంచి విముక్తి చేయడాలని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కోరారు. సోమవారం నర్సాపూర్ నియోజకవర్గంలోని శివ్వంపేటలో నిర్వహించిన రోడ్డు షోలో కాంగ్రెస్ నాయకురాలు సునీతా రెడ్డితో కలిసి రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సాపూర్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానన్న కేసీఆర్ ఏ సమస్యలను తీర్చలేదని ఆరోపించారు. ఆయనకు ఏ సమస్యలు పట్టవని, ఫామ్ హౌజ్‌లో కూర్చొని తాగడం ఒక్కటే తెలుసని ఎద్దేవా చేశారు.
తాగుబోతుల చేతుల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలన్నారు. కేసీఆర్ దగ్గర గూలాం గిరి చేసే మదన్ రెడ్డి కావాలో.. అసెంబ్లీలో నర్సాపూర్ సమస్యల కోసం కొట్లాడే సునీతా రెడ్డి కావాలో ఆలోచించడంటూ ప్రజలను కోరారు. కర్రు కాల్చి కారు గుర్తుకు వాత పెట్టాల్సిన సందర్భం వచ్చిందన్నారు. ప్రజాశీర్వాదంతో నర్సాపూర్‌లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు
బంగారు తెలంగాణలో పుస్తెలు అమ్ముకోవాల్సి వస్తోంది
బంగారు తెలగాంణలో మెడలో పుస్తెల తాడు అమ్ముకోవాల్సి వచ్చిందని కాంగ్రెస్ నాయకురాలు సునీత లక్ష్మారెడ్డి విమర్శించారు. జనం చచ్చారో, బతికారో పట్టించుకోని కేసీఆర్‌కు ఓటు వేయవద్దు అంటూ కాంగ్రెస్ విజ్ఞప్తి చేశారు. తన భర్త మరణం తర్వాత రాజకీయాలకు దూరంగా ఉందామనుకున్నాను.. కానీ ప్రజల కోసం తిరిగి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. రీజనల్ రింగ్ రోడ్ ఆలోచన కాంగ్రెస్ హయాంలోదేనని వెల్లడించారు. ఎన్నికల ప్రచార ర్యాలీ విజయోత్సవ ర్యాలీగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణలో మెడలో పుస్తెలు అమ్ముకోవాల్సి వచ్చిందన ఆరోపించారు. నర్సాపూర్ పౌరుషాల పోరుగ్డడ అని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment