సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో 50 అమృత హస్తం కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. ఇప్పటికే 120 కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయంలో రెండు రోజులుగా జరుగుతున్న ప్రాజెక్టు డెరైక్టర్ల సమావేశానికి గురువా రం ఆమె హాజరయ్యారు. గర్భిణిలు విధిగా అమృతహస్తం కేంద్రానికి వచ్చి ఆహారా న్ని తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మహిళలు గర్భవతులుగా ఉన్నప్పుడే బ్యాంకు ఖాతాలు ఏర్పాటు చేయించాలని... ఆడపిల్ల పుడితే వెంటనే ఆధార్‌కార్డు ఇప్పించాలని సూచిం చారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు జరపాలని ప్రాజెక్టు డెరైక్టర్లను ఆమె ఆదేశించారు. రాష్ట్రంలో బాలికలపై దాడులు జరిగినప్పుడు అండగా నిలవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ సమావేశంలో ముఖ్యకార్యదర్శి నీలం సహానీ, కమిషనర్ చిరంజీవి చౌదరి పాల్గొన్నారు.
సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించేంత వరకు ఆధార్ కార్డుల జారీ ప్రక్రియనూ నిలిపేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని విన్నవించారు. అలాగే విద్యార్థులు ఉపకార వేతనాలకు ఆధార్‌ను తప్పనిసరిగా సమర్పించాలంటూ ప్రభుత్వం ఒత్తిడి చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు. ప్రజల సమాచారాన్ని సేకరిస్తున్న కేంద్రం..గోప్యత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపించట్లేదని, దీనివల్ల సమాచార దుర్వినియోగం జరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఆధార్‌కార్డును తప్పనిసరి చేయడం సరికాదంటూ సుప్రీం ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో తుది తీర్పు వచ్చేవరకు పాత పద్ధతిలోనే వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాకు చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టుకు పిటిషనర్ విన్నవించారు.
మరో 50 అమృత హస్తం కేంద్రాలు: సునీతా లక్ష్మారెడ్డి
Published Fri, Oct 11 2013 12:44 AM | Last Updated on Fri, Jun 1 2018 7:32 PM
Advertisement
Advertisement