chiranjeevi chowdary
-
నేడు పట్టు పరిశ్రమశాఖ కమిషనర్ రాక
హిందూపురం అర్బన్ : పట్టు పరిశ్రమశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి శుక్రవారం హిందూపురం విచ్చేస్తున్నట్టు సెరికల్బర్ అధికారి బీఎన్ ప్రసాద్ తెలిపారు. స్థానిక పట్టుగూళ్ల మార్కెట్‌ను ఉదయం సందర్శించి తర్వాత కిరికెరలోని పట్టుపరిశ్రమ పరిశోధన కేంద్రంలో డివిజనల్ అధికారుల సమావేశానికి హాజరవుతారు. ఏడాదిలో చేసిన అభివృద్ధి పనులు అలాగే వచ్చే ఆర్థికసంవత్సవంలో చేపట్టాల్సిన పనులపై చర్చిస్తారు. -
అంగన్వాడీల పనివేళల్లో మార్పు
ఇందూరు, న్యూస్‌లైన్ : వేసవిని దృష్టిలో ఉంచుకుని అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్న పిల్లలు ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉండే అంగన్వాడీ పని వేళల్లో మార్పులు చేశారు. వేసవి కాలం ముగిసే వరకు ఇక నుంచి ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు వరకు అంగన్వాడీ కేంద్రాలను నడిపించాలని ఐసీడీఎస్ కమిషనర్ చిరంజీవి చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని సోమవారం జిల్లా ఐసీడీఎస్ కార్యాలయానికి పంపించారు. మే నెల నుంచి వేసవి ముగిసే వరకు ఈ సమయ వేళలను పాటించాలని, పిల్లలకు పౌష్టికాహారం పంపిణీలో కార్యకర్తలు, ఆయాలు ఎలాంటి అంతరాయం కలుగకుండా చూడాలని ఐసీడీఎస్ పీడీ రాములు జిల్లాలోని అంగన్వాడీ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా కార్యకర్తలకు, ఆయాలకు, లింక్ వర్కర్లకు పెండింగ్‌లో ఉన్న ఫిబ్రవరి, మార్చి నెలల వేతనాలను ఈ నెల 15వ తేదీలోగా విడుదల చేసి వారి ఖాతాల్లో వేయాలని ఐసీడీఎస్ కమిషనర్ పీడీ రాములుకు ఆదేశాలు ఇచ్చారు. కార్యక్తలకు, ఆయాలకు 15 రోజుల సెలవులు అంగన్వాడీ కార్యకర్తలకు, ఆయాలకు 15 రోజుల పాటు వేసవి సెలవులు ఇచ్చినట్లు ఐసీడీఎస్ పీడీ రాములు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే ఒకటి నుంచి 15వ తేదీ వరకు కార్యకర్తలు, 15 నుంచి 30వ తేదీ వరకు ఆయాలు సెలవులో వెళ్లాలని సూచించారు. ప్రస్తుతం కార్యకర్తలు సెలవులో ఉన్నందున ఆయాలే అంగన్వాడీలను నడపాలని, ఆయాలు సెలవులో వెళ్లినప్పుడు కార్యకర్తలు నడపాలన్నారు. ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం చేసి, అంగన్వాడీలను నడపకుంటే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
మరో 50 అమృత హస్తం కేంద్రాలు: సునీతా లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో 50 అమృత హస్తం కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. ఇప్పటికే 120 కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయంలో రెండు రోజులుగా జరుగుతున్న ప్రాజెక్టు డెరైక్టర్ల సమావేశానికి గురువా రం ఆమె హాజరయ్యారు. గర్భిణిలు విధిగా అమృతహస్తం కేంద్రానికి వచ్చి ఆహారా న్ని తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మహిళలు గర్భవతులుగా ఉన్నప్పుడే బ్యాంకు ఖాతాలు ఏర్పాటు చేయించాలని... ఆడపిల్ల పుడితే వెంటనే ఆధార్‌కార్డు ఇప్పించాలని సూచిం చారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు జరపాలని ప్రాజెక్టు డెరైక్టర్లను ఆమె ఆదేశించారు. రాష్ట్రంలో బాలికలపై దాడులు జరిగినప్పుడు అండగా నిలవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ సమావేశంలో ముఖ్యకార్యదర్శి నీలం సహానీ, కమిషనర్ చిరంజీవి చౌదరి పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించేంత వరకు ఆధార్ కార్డుల జారీ ప్రక్రియనూ నిలిపేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని విన్నవించారు. అలాగే విద్యార్థులు ఉపకార వేతనాలకు ఆధార్‌ను తప్పనిసరిగా సమర్పించాలంటూ ప్రభుత్వం ఒత్తిడి చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు. ప్రజల సమాచారాన్ని సేకరిస్తున్న కేంద్రం..గోప్యత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపించట్లేదని, దీనివల్ల సమాచార దుర్వినియోగం జరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఆధార్‌కార్డును తప్పనిసరి చేయడం సరికాదంటూ సుప్రీం ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో తుది తీర్పు వచ్చేవరకు పాత పద్ధతిలోనే వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాకు చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టుకు పిటిషనర్ విన్నవించారు. -
అంగన్వాడీల్లో ‘ప్రత్యేక’ పోషకాహారం
ఇందూరు, న్యూస్‌లైన్ : పోషకాహార లోపంతో బాధపడే పిల్లలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పుష్టికరంగా తయారు చేసేందుకు ప్రత్యేక పోషకాహారం అందించాలని నిర్ణయిం చింది. జిల్లాలో పోషకాహార లోపంతో బాధపడుతున్న 3,051 మంది పిల్లలకు ఈనెలాఖరునుంచి ప్రత్యేక పోషకాహారం అందనుంది. ఈ మేరకు ఐసీడీఎస్ కమిషనర్ చిరంజీవి చౌదరి నుంచి జిల్లా పీడీకి ఆదేశాలు అందాయి. 3,051 మంది పిల్లలకు పాలపొడి.. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పటి వరకు అందిస్తున్న పౌష్టికాహారం, గుడ్డుతో పాటు మరికొన్ని పౌష్టికాహారాలను అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సర్వేద్వారా గుర్తించిన 3,051 మంది బలహీనమైన పిల్లలకు ప్రత్యేకంగా పాలపొడి అందించనున్నారు. వీరికి రోజుకు 14నుంచి 16 గ్రాముల పాలపొడిని మూడు నెలలపాటు అందిస్తారు. ఇందుకుగాను ఒక్కొక్కరికి నెల కు రూ. 75 చొప్పున ఖర్చు చేయనున్నారు. పాల పౌడర్ పం పిణీ బాధ్యతను జిల్లాలోని ఏపీ డెయిరీకి అప్పగించారు. నెలాఖరులోగా అంగన్వాడీ కేంద్రాలకు పాల పొడిని పం పిణీ చేస్తారు. తర్వాత కూడా పిల్లల బరువులో మార్పు లేకపోతే మరో మూడు నెలలు పాలపొడి అందిస్తారు. అందరికీ శెనగలు.. అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న( 3 నుంచి 5 ఏళ్లలోపువారు) పిల్లలందరికీ శెనగలు సరఫరా చేయనున్నారు. వీటిని ఉడకబెట్టి ఒక్కో విద్యార్థికి రోజుకు 15 గ్రాముల చొప్పున అందిస్తారు. జిల్లాలో 43,956 మంది పూర్వ ప్రాథమిక విద్య అభ్యసిస్తున్నారు. సరుకులు రాగానే.. -రాములు, పీడీ, ఐసీడీఎస్ పోషణలోపంతో బాధపడుతున్న పిల్లలకు పాల పౌడర్ అందించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. అంగన్వాడీల్లోని పిల్లలందరికీ శెనగలు అందించనున్నాం. నెలాఖరు వరకు సరుకులు వస్తాయి. తర్వాత అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసి, పిల్లలకు అందేలా చూస్తాం.