
బుట్టను అల్లుతున్న మహిళతో మాట్లాడుతున్న మదన్‌రెడ్డి
సాక్షి,చిలప్‌చెడ్(నర్సాపూర్): నర్సాపూర్ నియోజక వర్గంలో అభివృద్ధి లేదన్న రేవంత్‌కు రోడ్లు, బస్‌డిపో, వంద పడకల ఆసుపత్రి. మండలాల్లో చెరువులు, కుంటలు, భగీరధ నీళ్లు, చెక్‌డ్యాంలు, గిరిజన తండాల అభివృద్ధి, తదితర విషయాలు కనబడక పోవడం ఏంటాని, తనను ఫామ్ హౌస్ కాపల కుక్క అనడం ఎంతవరకు సమంజసమో అతని విజ్ఞతకే వదిలేస్తున్నాని మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన చిలప్‌చెడ్ మండలంలో ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలకు తాను చేసిన అభివృద్ధి గురించి తెలిస్తే చాలని, ఓట్ల దొంగకు తెలియాల్సిన అవసరం లేదని మదన్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో మండల టిఅర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎఎంసీ చైర్మెన్ హంసీబాయి, రాజిరెడ్డి, నర్సింహ్మరెడ్డి, లక్ష్మణ్, విశ్వంబర, పరుశరాంరెడ్డి, కిష్టారెడ్డి, యాదగిరి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు..
మంగళవారం ముందుగా చిలప్‌చెడ్ మండలంలోని జగ్గంపేటలో ప్రచారం ప్రారంభించిన మదన్‌రెడ్డి గ్రామంలోని నల్లపోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించిన ఆయన అమ్మవారి ఆశీస్సులతో మండలంలో ప్రచారాన్ని కోనసాగించారు. అక్కడి నుంచి మండల పార్టీ నాయకులతో, కార్యకర్తలతో భారీగా బైక్ ర్యాలీతో బయలుదేరిన ఆయన మండలంలోని ఆయా గ్రామాలలో ప్రచారాన్ని కోనసాగించారు. జగ్గంపేట గ్రామంలో సుమారు 100 మంది యువకులు మదన్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు.