గాదె- మహిళా మంత్రుల సంవాదం
హైదరాబాద్: తెలంగాణ మహిళా మంత్రులతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మధ్య శాసనసభ ప్రాంగణంలో ఆసక్తికర సంవాదం నడిచింది. కేబినెట్ సమావేశానికి ఎందుకు రాలేదని మంత్రులు డీకే అరుణ, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలను గాదె వెంకటరెడ్డి ప్రశ్నించారు. మంత్రి పదవులకు రాజీనామా చేసి నిరసన తెలపొచ్చు కదా అని అడిగారు. అయితే వెంకటరెడ్డి వ్యాఖ్యలకు మహిళా మంత్రులు దీటుగా స్పందించారు.
ఢిల్లీలో సమైక్య నిరసన తెలిపేందుకు ముందు మీరెందుకు రాజీనామా చేయలేదని వారు ఎదురు ప్రశ్నించారు. విభజన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకుండా చూడాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహా సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ఎంపీలు బుధవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మౌనదీక్ష చేసిన సంగతి తెలిసిందే.