టీఆర్‌ఎస్‌లోకి సునీతా లక్మారెడ్డి | Sunitha Laxma Reddy Ready To Join TRs | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లోకి సునీతా లక్మారెడ్డి

Published Tue, Mar 26 2019 12:06 PM | Last Updated on Tue, Mar 26 2019 1:54 PM

Sunitha Laxma Reddy Ready To Join TRs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు పార్టీని వీడిన సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందుకోసం ఆమె సీఎం కేసీఆర్‌ను కూడా కలిశారు. ఏప్రిల్‌ 3వ తేదీన నర్సాపూర్‌లో జరిగే ఎన్నికల ప్రచార సభలో ఆమె టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నారు.

కాగా, కొంతకాలం నుంచి ఆమె కాంగ్రెస్‌ను వీడుతున్నట్టు వార్తలు వచ్చినప్పటికీ.. ఆమె వాటిని ఖండించిన సంగతి తెలిసిందే. పలువురు బీజేపీ నాయకులు సైతం సునీతను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆమె టీఆర్‌ఎస్‌లో చేరాలనే నిర్ణయం తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement