చిన్నారులకు సెరెలాక్ తరహా పౌష్టికాహారం: మంత్రి సునీతా లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు అంగన్‌వాడీ కేంద్రాల్లో ‘బాలామృతం’ పథకాన్ని అమలు చేస్తున్నామని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి చెప్పారు. పథకం కింద చిన్నారులకు గోధుమలు, పల్లీపొడి, పాలపొడి, చక్కెర, నూనెలతో కూడిన సెరెలాక్ తరహా మిశ్రమ పౌష్టికాహారాన్ని అందజేస్తామని తెలిపారు. శనివారం సచివాలయంలో శిశు సంక్షేమ శాఖ రూపొందించిన కొత్త కేలండర్‌ను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిగా బాధ్యతలు తనకు సంతృప్తినిచ్చాయని చెప్పారు. కోడిగుడ్డు ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో అంగన్‌వాడీలకు సరఫరా కోసం నిర్ణయించిన ధర సీలింగ్‌ను తొలగించినట్లు వెల్లడించారు. నల్లగొండ జిల్లా పెదవూర మండలం ఏనెమీద తండా అనాథాశ్రమంలోని బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డ ట్యూటర్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేస్తామన్నారు.
తెలంగాణ బిల్లుపై చర్చ మొదలైంది: అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ మొదలైనట్టేనని మంత్రి సునీతా లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని స్పీకర్ కూడా చెప్పారన్నారు. స్పీకర్ చెప్పిన విధంగా తెలంగాణ బిల్లుపై చర్చ కొనసాగుతోందంటే చర్చ ప్రారంభమైనట్లే కదా అని ప్రశ్నించారు.
అంగన్‌వాడీల్లో ‘బాలామృతం’
Published Sun, Jan 5 2014 2:40 AM | Last Updated on Sat, Jun 2 2018 8:36 PM
Advertisement