మొత్తం కేటాయింపుల్లో రూ.21,960 కోట్లు అంగన్‌వాడీ, పోషణ్ 2.0కే..
న్యూఢిల్లీ : మహిళా, శిశు అభివృద్ధి శాఖకు నిధుల కేటా యింపులు స్వల్పంగా పెరిగాయి. 2025–26 బడ్జెట్‌లో కేంద్రం రూ.26,889.69 కోట్లు కేటా యించింది. 2024–25లో సవరించిన అంచనా రూ.23,182.98 కోట్లు కాగా, తాజాగా బడ్జెట్‌లో మరో రూ.3,706.71 కోట్లు పెంచారు. మొత్తం కేటాయింపుల్లో రూ.21,960 కోట్లను ‘సాక్షం అంగన్‌వాడీ’, పోషణ్ 2.0 కార్య క్రమాలకు ఖర్చు చేయనున్నారు. చిన్నారులు, కౌమార దశలోని బాలికల్లో పోషకాహార లేమిని అరికట్టా లని, శిశు సంరక్షణను బలో పేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయ బోతోంది. సాక్షం అంగన్‌వాడీ, పోషణ్ 2.0 కార్యక్రమాలతో ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా 8 కోట్ల మంది బాలలు, కోటి మంది గర్భిణులు, బాలింతలు, 20 లక్షల మంది కౌమార బాలికలు ప్రయోజనం పొందుతారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం–జన్‌మన్)కు అదనంగా రూ.120 కోట్లు కేటాయించారు.
ఈ నిధులను 75 గిరి జన జాతుల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి వ్యయం చేస్తారు. గిరిజనాభివృద్ధి కోసం ధార్తి అబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్‡్ష అభియాన్‌కు రూ.75 కోట్లు కేటాయించారు. బాలల రక్షణ సేవలకు గాను ‘మిషన్ వాత్సల్య’ కోసం గతేడాది రూ.1,391 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.1,500 కోట్లు కేటాయించారు.
మహిళా వ్యాపారవేత్తలకు రూ.2 కోట్ల రుణం తొలిసారి వ్యాపారవేత్తలుగా మారిన మహిళలకు, ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం రూ.2 కోట్ల టర్మ్ లోన్ మంజూరు చేయనుంది. 5 లక్షల మందికి ఈ రుణాలు ఇవ్వనున్నారు. సూక్ష్మ, మధ్య తరహా, భారీ పరిశ్రమల కోసం ‘మాన్యుఫాక్చరింగ్ మిషన్’ నెలకొల్పనున్నట్లు వెల్లడించారు.
‘మిషన్ శక్తి’కి రూ.3,150 కోట్లు
మహిళా సాధికారతే ధ్యేయంగా ‘మిషన్ శక్తి’ అమలుకు రూ.3,150 కోట్లు కేటాయించారు. బేటీ బచావో.. బేటీ పడావో, వన్‌స్టాప్ సెంటర్లు, నారీ ఆదాలత్‌లు, ఉమెన్ హెల్ప్‌లైన్, మహిళా పోలీసు వాలంటీర్లకు రూ.629 కోట్లు ఖర్చు చేస్తారు. స్వధార్ గృహాలు, ప్రధాని మాతృ వందన యోజన, వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు, నేషనల్ క్రెష్ స్కీమ్‌కు రూ.2,521 కోట్లు వెచ్చిస్తారు.
నిర్భయ నిధికి రూ.30 కోట్లు, జాతీయ మహిళా కమిషన్‌కు రూ.28 కోట్లు, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు రూ.25 కోట్లు కేటాయించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కో–ఆపరేషన్, చైల్డ్ డెవలప్‌మెంట్‌కు రూ.90 కోట్లు, సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ (సీఏఆర్‌ఏ)కు రూ.14.49 కోట్లు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment