Anganwadi centre
-
అంగన్వాడీ కేంద్రాలు ఒంటి పూట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను ఒంటిపూట నిర్వహించేలా ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణలోని విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలు, మన రాష్ట్రంలోని విద్యాసంస్థలను ఈ నెల 15 నుంచి ఒంటిపూట నిర్వహిస్తున్నారు. మన రాష్ట్రంలో ఆరేళ్లలోపు చిన్నారులు ఉండే అంగన్వాడీ కేంద్రాలను రెండు పూటలా నిర్వహిస్తుండటంతో పిల్లల ఇబ్బందులపై ‘అంగన్వేడీ’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. మొదట ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రాలను ఒంటిపూట నిర్వహించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం... ‘సాక్షి’ కథనంతో స్పందించి మంగళవారం నుంచే అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో అంగన్వాడీ కేంద్రాలను మంగళవారం నుంచి మే 31వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించేలా అన్ని జిల్లాల అధికారులు, అంగన్వాడీ టీచర్లకు వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు పంపించారు. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు మే 1 నుంచి 15 వరకు, ఆయాలకు మే 16 నుంచి 31వ తేదీ వరకు 15 రోజులు చొప్పున సెలవులు ఇవ్వాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. -
బాబుపై కదంతొక్కిన అంగన్వాడీలు
-
అంగన్వాడీ చిన్నారి ‘చికెన్ ఫ్రై’ రిక్వెస్ట్.. స్పందించిన ప్రభుత్వం
తిరువనంతపురం: అంగన్వాడీలో పెడుతున్న తిండి విషయంలో ఓ చిన్నారి చేసిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఆ దెబ్బకు ప్రభుత్వం కదిలి వచ్చింది. అంగన్వాడీ మెనునూ మార్చేయాలని నిర్ణయించింది.కేరళ అంగన్వాడీ సెంటర్లలో మెనూ మార్చే అంశంపై అక్కడి విద్యా శాఖ సమీక్ష జరుపుతోందట. అందుకు కారణం.. శంకూ అనే ఓ చిన్నారి వీడియో వైరల్ కావడమే. స్వయానా ఆ రాష్ట్ర ఆరోగ్య, శిశు మహిళా సంక్షేమ శాఖ మంత్రి వీణా జార్జ్( Veena George) ఆ చిన్నారి వీడియోకు స్పందించి.. ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం.అంగన్వాడీలో ప్రతీసారి ఉప్మా పెడుతున్నారని, దానికి బదులు.. బిర్యానీ, చికెన్ ఫ్రై కావాలంటూ ఆ చిన్నారి విజ్ఞప్తి చేశాడు. అమాయకంగా ఆ బుడ్డోడు చెప్పిన మాటలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా షేర్ అయ్యాయి. చివరకు.. ఆ వీడియో ప్రభుత్వం దాకా వెళ్లింది. దీంతో వీణా జార్జ్ స్పందించారు.അംഗൻവാടിയിൽ, ഉപ്പുമാവ് മാറ്റി ബിരിയാണിയുംപൊരിച്ച കോഴിയും വേണം എന്നുഈ അമ്പോറ്റി പൊന്നിന്.🤗♥️🥰😘ഈ പരാതി ആരോടു പാറയും മല്ലയ്യാ. 🤔🤔 pic.twitter.com/FPYoXHB3tJ— 🖤 🍁 സുമ 🍁🖤 (@Suma357381) February 1, 2025అంగన్వాడీలో పిల్లలకు ఇప్పటికే కేరళ ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తోంది. ఇప్పటికే పాలు గుడ్లు అందిస్తున్నాం. అయితే.. చిన్నారి శంకూ చేసిన విజ్ఞప్తిని కూడా పరిగణనలోకి తీసుకుంటాం. మెనూను కచ్చితంగా సమీక్షిస్తాం. ఆ వీడియోను చూశాక.. చాలామంది మాకు ఫోన్లు చేశారు. అతనికి బిర్యానీ, చికెన్ ఫ్రై ఇప్పిస్తామని అన్నారు. అంగన్వాడీలో పిల్లలకు అన్నిరకాల పోషకాలు అందాల్సిన అవసరం ఉంది. అందుకే మెనూలో మార్పులు తప్పకుండా చేస్తాం అని అన్నారామె.అయితే.. అవసరమైతే జైల్లో ఖైదీలకు అందించే పెట్టే ఫుడ్‌ను తగ్గించి.. ఇలాంటి పిల్లలకు పెట్టాలంటూ ఆమె కామెంట్ సెక్షన్లో కొందరు పోస్టులు పెడుతుండడం గమనార్హం. -
తాగునీటికి తిప్పలు.. ఒకటికొస్తే అవస్థలు
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాల్లో ప్రాథమిక సౌకర్యాల కల్పన ప్రహసనంగా మారింది. సరైన వసతులు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ... నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంటోంది. ఫలితంగా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణిలు, బాలింతలకు ఇబ్బందులు తప్పడం లేదు. కనీసం తాగునీటి సౌకర్యం, మూత్రశాలలు లేకపోవడంతో గర్భిణులు, బాలింతలు వేచి ఉండలేక ఇళ్లకెళ్లిపోతున్నారు. రాష్ట్రంలోని 7,021 అంగన్వాడీ కేంద్రాల్లో టాయిలెట్ల నిర్మాణం, 1,811 కేంద్రాలకు తాగునీటి వసతి ఏర్పాటు కోసం పనులు చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. 2024–25లో రూ.10 కోట్ల నిధులు కూడా విడుదల చేసింది. కానీ పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగియనున్నా వేగం పుంజుకోవడం లేదు. పురోగతి లేని పనులు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందించడంతో పాటు పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కేంద్రాలను నిర్వహిస్తారు. వీటిల్లో చిన్నారులతో పాటు గర్భిణులు, బాలింతలకు సైతం పౌష్టికాహారాన్ని అందిస్తారు. సమగ్ర పౌష్టికాహారాన్ని అక్కడే వండి పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ చాలాచోట్ల వండిన ఆహారానికి బదులుగా ముడిసరుకునే అందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో సరైన వసతులు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలోనే అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి వసతి, టాయిలెట్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని కొన్ని కేంద్రాలకు వీటిని మంజూరు చేసింది. 7,021 కేంద్రాలకు టాయిలెట్లు మంజూరు చేయగా... ఇందులో కేవ లం 1,015 టాయిలెట్లకు సంబంధించిన నిర్మాణ పనులు మాత్రమే పూర్తయ్యాయి. 1,738 కేంద్రాల నిర్మాణ పనులు వివిధ దశల్లో కొనసాగుతుండగా..4,268 కేంద్రాల్లో పనులు ప్రారంభానికే నోచుకోలేదు.అదేవిధంగా 1,864 అంగన్వాడీ కేంద్రాలకు తాగునీటి వసతికి సంబంధించి పనులు మంజూరు కాగా కేవలం 289 మాత్రమే పూర్తయ్యాయి. మరో 406 కేంద్రాల్లో పనులు కొనసాగుతుండగా.. 1,169 కేంద్రాల్లో అసలు ప్రారంభమే కాలేదు. పాలకవర్గాలు లేకపోవడమే కారణం? ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి పనులు ప్రారంభించకుంటే మంజూరైన నిధులు మురిగిపోయే ప్రమాదం ఉంది. గత సంవత్సరం ఫిబ్రవరి నెల నుంచి గ్రామ పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నాయి. తాజాగా మున్సిపాలిటీల్లో కూడా ప్రత్యేక పాలన ప్రారంభమైంది. అంగన్వాడీల్లో వసతుల కల్పనలో స్థానిక సంస్థల పాత్రే కీలకం. కానీ పాలకమండళ్లు లేకపోవడం, ప్రత్యేక పాలన కొనసాగుతుండడంతో అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం ఏర్పాటు, టాయిలెట్ల నిర్మాణ పనులపై ప్రభావం పడిందని అధికారులు పేర్కొంటున్నారు.మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల పరిధిలోని చౌదర్పల్లి అంగన్వాడీ కేంద్రం పరిస్థితి ఇదీ. ఇక్కడ 22 మంది చిన్నారులున్నారు. టాయిలెట్ అసంపూర్తిగా ఉండటంతో రోడ్డుపైనే లఘుశంక తీర్చుకుంటున్నారు. ఈ కేంద్రంలో తాగునీటి వసతి కూడా లేకపోవడంతో చిన్నారులు, ఈ కేంద్రానికి వచ్చే బాలింతలు, గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. -
మహిళా, శిశు అభివృద్ధికి రూ.26,889కోట్లు
న్యూఢిల్లీ : మహిళా, శిశు అభివృద్ధి శాఖకు నిధుల కేటా యింపులు స్వల్పంగా పెరిగాయి. 2025–26 బడ్జెట్లో కేంద్రం రూ.26,889.69 కోట్లు కేటా యించింది. 2024–25లో సవరించిన అంచనా రూ.23,182.98 కోట్లు కాగా, తాజాగా బడ్జెట్లో మరో రూ.3,706.71 కోట్లు పెంచారు. మొత్తం కేటాయింపుల్లో రూ.21,960 కోట్లను ‘సాక్షం అంగన్వాడీ’, పోషణ్ 2.0 కార్య క్రమాలకు ఖర్చు చేయనున్నారు. చిన్నారులు, కౌమార దశలోని బాలికల్లో పోషకాహార లేమిని అరికట్టా లని, శిశు సంరక్షణను బలో పేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయ బోతోంది. సాక్షం అంగన్వాడీ, పోషణ్ 2.0 కార్యక్రమాలతో ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా 8 కోట్ల మంది బాలలు, కోటి మంది గర్భిణులు, బాలింతలు, 20 లక్షల మంది కౌమార బాలికలు ప్రయోజనం పొందుతారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం–జన్మన్)కు అదనంగా రూ.120 కోట్లు కేటాయించారు. ఈ నిధులను 75 గిరి జన జాతుల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి వ్యయం చేస్తారు. గిరిజనాభివృద్ధి కోసం ధార్తి అబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్‡్ష అభియాన్‌కు రూ.75 కోట్లు కేటాయించారు. బాలల రక్షణ సేవలకు గాను ‘మిషన్ వాత్సల్య’ కోసం గతేడాది రూ.1,391 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.1,500 కోట్లు కేటాయించారు. మహిళా వ్యాపారవేత్తలకు రూ.2 కోట్ల రుణం తొలిసారి వ్యాపారవేత్తలుగా మారిన మహిళలకు, ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం రూ.2 కోట్ల టర్మ్ లోన్ మంజూరు చేయనుంది. 5 లక్షల మందికి ఈ రుణాలు ఇవ్వనున్నారు. సూక్ష్మ, మధ్య తరహా, భారీ పరిశ్రమల కోసం ‘మాన్యుఫాక్చరింగ్ మిషన్’ నెలకొల్పనున్నట్లు వెల్లడించారు.‘మిషన్ శక్తి’కి రూ.3,150 కోట్లు మహిళా సాధికారతే ధ్యేయంగా ‘మిషన్ శక్తి’ అమలుకు రూ.3,150 కోట్లు కేటాయించారు. బేటీ బచావో.. బేటీ పడావో, వన్‌స్టాప్ సెంటర్లు, నారీ ఆదాలత్‌లు, ఉమెన్ హెల్ప్‌లైన్, మహిళా పోలీసు వాలంటీర్లకు రూ.629 కోట్లు ఖర్చు చేస్తారు. స్వధార్ గృహాలు, ప్రధాని మాతృ వందన యోజన, వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు, నేషనల్ క్రెష్ స్కీమ్‌కు రూ.2,521 కోట్లు వెచ్చిస్తారు. నిర్భయ నిధికి రూ.30 కోట్లు, జాతీయ మహిళా కమిషన్‌కు రూ.28 కోట్లు, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు రూ.25 కోట్లు కేటాయించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కో–ఆపరేషన్, చైల్డ్ డెవలప్మెంట్కు రూ.90 కోట్లు, సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ (సీఏఆర్ఏ)కు రూ.14.49 కోట్లు కేటాయించారు. -
మీటర్లలో ‘సర్వీస్’ మాయ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ మీటర్లు అమర్చిన విద్యుత్ పంపిణీ సంస్థలు వాటికి సర్వీస్ నంబర్లు లేవనే విషయాన్ని చాలా ఆలస్యంగా గుర్తించాయి. ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సర్కిల్ పరిధిలో ఈ భాగోతం వెలుగు చూసింది. దీనిపై నివేదిక సమర్పించాలని ఈసీడీసీఎల్ సీఎండీ ఐ.పృథ్వీతేజ్ అధికారులను ఆదేశించగా.. వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అమలాపురం ఆపరేషన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు అమలాపురం సర్కిల్ ఎస్ఈ ఎస్.రాజబాబు మెమో జారీ చేశారు. ఇప్పటికైనా ‘మోస్ట్ అర్జంట్ మేటర్’గా పరిగణించి ఏడు రోజుల్లోగా మీటర్లను పరిశీలించి నివేదిక ఇవ్వాలని అందులో స్పష్టం చేశారు. కాగా.. రాష్ట్రవ్యాప్తంగా వేలాది అంగన్వాడీ కేంద్రాల్లో సర్వీస్ నంబర్ లేకుండా మీటర్లు అమర్చి, బిల్లులు ఇవ్వకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నారని తెలుస్తోంది. మరికొన్ని సర్వీసులకు బిల్లులు జారీ చేసినా వాటిని వినియోగదారులకు ఇవ్వలేదు. దీని వెనుక భారీ కుంభకోణం ఉందని తెలుస్తోంది. ప్రాణాలతోనూ చెలగాటం రాష్ట్రవ్యాప్తంగా 55,605 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. దాదాపు 35 లక్షల మంది ఆరేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఈ కేంద్రాలకు వస్తుంటారు. దాదాపు 1.30 లక్షల మంది అంగన్వాడీ సిబ్బంది నిత్యం ఈ కేంద్రాల్లోనే విధులు నిర్వర్తిస్తుంటారు. అలాంటిచోట విద్యుత్ మీటర్లు 6 అడుగులకు పైగా ఎత్తులో అమర్చాలి. కా..నీ చిన్న పిల్లలుంటారనే కనీస ఇంగితం కూడా లేకుండా ఈ కేంద్రాల్లో కేవలం 3 అడుగులు ఎత్తులోనే మీటర్లు ఏర్పాటు చేశారు.మొత్తం బిల్లు ఇప్పుడు ఇస్తాం కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు బిల్లులు కూడా రూపొందించాం. కానీ.. ఆ బిల్లులను ఎవరికీ ఇవ్వలేదు. కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు మీటర్లు ఇచ్చినప్పటికీ సర్వీసు నంబర్ ఇవ్వలేదు. కొన్నేళ్లుగా రీడింగ్ తీయకపోయినా ఆ సమాచారం మీటర్లో నిక్షిప్లమై ఉంటుంది. దాని ఆధారంగా మొత్తం బిల్లును ఇప్పుడు జారీ చేస్తాం. – రవికుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అమలాపురం ఆపరేషన్ డివిజన్ -
అంగన్వాడీల్లో కొలువుల భర్తీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలను పటిష్టం చేసే దిశగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ చర్యలకు ఉపక్రమించింది. పూర్వ ప్రాథమిక (ప్రీ ప్రైమరీ) విద్యను పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. పూర్తిస్థాయిలో సిబ్బంది నియామకంపై దృష్టిపెట్టింది. ఈ మేరకు అంగన్వాడీల్లో పనిచేస్తున్న సిబ్బంది, ఖాళీలు, రిటైర్మెంట్ల వివరాల సేకరణ చేపట్టింది. లెక్కలపై స్పష్టత వచ్చాక భర్తీకి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. పనిచేస్తున్నది ఎందరు.. ఖాళీలెన్ని? రాష్ట్రంలో 149 సమీకృత శిశు అభివృద్ధి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా.. ఇందులో 31,711 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు. వీటన్నింటిలో పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ తాజాగా క్షేత్రస్థాయిలో శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారు(సీడీపీఓ)లను ఆదేశించింది.ఆయా ప్రాజెక్టుల వారీగా వివరాలను సమర్పించాలని సూచించింది. ప్రస్తుతం పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్, హెల్పర్ల వివరాలు, ఖాళీలు, సెంటర్లోని రిజర్వేషన్లు, ఈ ఏడాదిలో పదవీ విరమణ పొందుతున్న వారు, ఇప్పటికే పదవీ విరమణకు అర్హత సాధించి విధుల్లో కొనసాగుతున్న వారి వివరాలన్నీ సమర్పించాలని ఆదేశించింది.ఇప్పటికే పలు ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారం జిల్లా సంక్షేమాధికారులకు చేరగా.. త్వరలో కమిషనరేట్‌కు సమరి్పంచేందుకు సిద్ధమవుతున్నారు. ఖాళీల లెక్కలు తేలితే.. అక్కడున్న రిజర్వేషన్లకు అనుగుణంగా టీచర్, హెల్పర్ ఖాళీల భర్తీకి చర్యలు వేగవంతం చేయవచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,800 అంగన్వాడీ టీచర్, హెల్పర్ ఖాళీలు ఉన్నట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మినీ కేంద్రాల అప్‌గ్రేడేషన్‌తో.. రాష్ట్రంలో 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిని ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. ప్రధాన అంగన్వాడీ కేంద్రంలో ఒక టీచర్, ఒక హెల్పర్ పనిచేస్తుంటే... మినీ అంగన్వాడీ కేంద్రంలో ఒక టీచర్ మాత్రమే ఉంటారు. ఈ మినీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేశాక హెల్పర్ పోస్టు కూడా ప్రభుత్వం మంజూరు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఈ పోస్టుల లెక్కలు తేలలేదు. అప్‌గ్రెడేషన్ ప్రక్రియ పూర్తయితే మొత్తంగా హెల్పర్ పోస్టుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.రిటైర్మెంట్ల వివరాలపైనా..అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణకు సంబంధించిన ప్యాకేజీ పెంచనున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పలు సందర్భాల్లో వెల్లడించారు. ఆ ఫైలు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. దీనితో గడువు తీరినా చాలా మంది పదవీ విరమణ తీసుకోలేదు. ఈ క్రమంలో పదవీ విరమణ పొందాల్సినవారి వివరాలను కూడా సమర్పించాలని, ఇప్పటికే రిటైర్ అయినవారి వివరాలను అందించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. -
టీజీ ఫుడ్స్ కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే సరుకుల్లో నాణ్యత పట్ల కఠినంగా వ్యవహరిస్తామని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో తెలంగాణ ఫుడ్స్ విభాగంపై ఆమె సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ఫుడ్స్‌కు సరఫరా చేస్తున్న సరుకుల్లో నాణ్యత లేదంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఫుడ్స్‌కు సరఫరా చేస్తున్న పప్పు, నూనె తదితరాల సరఫరాకు నామినేటెడ్ పద్ధతిలో కాంట్రాక్టర్లను ఎంపిక చేయడంపైనా మంత్రి మండిపడ్డారు. ప్రతి అంశాన్ని టెండర్ ప్రాతిపదికనే చేపట్టాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినప్పటికీ వైఖరి మార్చుకోకపోవడాన్ని తప్పుబడుతూ సంబంధిత అధికారులను మంత్రి సీతక్క మందలించారు. అదేవిధంగా టీజీఫుడ్స్ విభాగంలో కారుణ్య నియామకాలు, పదోన్నతుల విషయంలోనూ అవకతవకలు జరిగాయనే అంశం తన దృష్టికి వచ్చిందన్నారు. ఇటీవల భువనగిరిలో బాలామృతం దారి మళ్లింపు ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అనంతరం మహిళా సమాఖ్య సభ్యులకు యూనిఫాం చీరలకు సంబంధించి డిజైన్లను పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా 63 లక్షల మంది సభ్యులకు ఈ చీరలు ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రాంచంద్రన్, కమిషనర్ కాంతివెస్లీ తదితరులు పాల్గొన్నారు. హామీలను అమలు చేయండి.. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం సచివాలయంలో వారు మంత్రి సీతక్కను కలిశారు. అంగన్వాడీ టీచర్ల వేతనాలను రూ.18 వేలకు పెంచాలని, ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయాలని కోరారు. మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అభివృద్ధి చేసినప్పటికీ ఆ మేరకు వేతనాలు చెల్లించలేదని, దాదాపు ఏడు నెలల బకాయిలను తక్షణమే చెల్లించాలన్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచి్చనట్లు యూనియన్ ప్రతినిధులు వెల్లడించారు. -
సీ ఫర్ కలెక్టర్... సీ ఫర్ క్రియేటివిటీ
‘తీరిక లేనంత పనుల్లో బిజీగా ఉన్నాను’ అని చెప్పడం సులభం. ‘తీరిక చేసుకోవడం’ మాత్రం కష్టం. అయితే కొన్ని ఇష్టాలు ఆ కష్టాన్ని దాటి కాలాన్ని మనకు అప్పగిస్తాయి. కలెక్టర్‌గా తీరికలేనంత పనుల్లో తలమునకలైప్పటికీ తనలోని క్రియేటివిటీని కాపాడుకుంటున్న కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి కోయ, ఉర్దూ భాషలు నేర్చుకుంది. వ్యక్తిత్వ వికాస కోణంలో పిల్లల పాటలు రాస్తోంది. ఉద్యోగ బాధ్యతలకు సృజనాత్మకత జోడిస్తోంది.దేశంలో ఏ అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లినా ‘ఏ అంటే ఆపిల్, బీ అంటే బాల్’ అని చదువుతారు పిల్లలు. కరీంనగర్లో అలా కాదు. ‘ఏ ఫర్ యాక్టివ్. బీ ఫర్ బ్రైట్. సీ ఫర్ క్రియేటివ్’ అంటూ ఇంగ్లిష్ ఆల్ఫాబెట్స్‌కు సరికొత్త పదాలతో పాడుతారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఈ పాట రాశారు. ఐదేళ్ల క్రితం తన కుమారుడు నైతిక్ పుట్టినప్పుడు మదిలో మెదిలిన పాటకు ఆమె అక్షర రూపం ఇచ్చారు. ఇదే పాటను తన కుమారుడికి నేర్పించే క్రమంలో కలెక్టరేట్ సిబ్బందికి కొత్తగా అనిపించింది. ‘పాట సృజనాత్మకంగా ఉంది. పిల్లలు ఆసక్తిగా నేర్చుకుంటారు. ఈ పాటని జిల్లాలోని అన్ని అంగన్ వాడీ సెంటర్లలో పిల్లలకు నేర్పిస్తే బాగుంటుంది’ అని అడిగారు. అందుకు సత్పతి సరే అన్నారు.ఆక్షరాలే ఆట పాటలై...అప్పటికే అంగన్ వాడీల బలోపేతంపై పమేలా సత్పతి దృష్టి సారించారు. చిన్నారులకు పోషకాహారం లోపం రాకుండా బలవర్ధ్దక ఆహారంతో పాటు ఆటపాటలతో కూడిన చదువును అందించాలనుకున్నారు. ఇటీవల ‘ఏ ఫర్ యాక్టివ్’ పాటను వీడియో రూపంలో విడుదల చేశారు. పిల్లలకు ఈ పాట ఎంతో నచ్చి ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు. ఇది కేవలం పాట మాత్రమే కాదు..పాట రూపంలో ఎన్నో విషయాలను పిల్లలకు సులభంగా చెబుతున్న పాఠం.బహు భాషలలో శభాష్ అనిపించుకుంటూ...‘ఇది చాలు’ అనుకునే వాళ్లు ఉన్నచోటే ఉండిపోతారు. ఇంకా ఏదో తెలుసుకోవాలి...అనే తపన ఉన్న వాళ్లు ఎంతో ముందుకు వెళతారు. కలెక్టర్ పమేలా రెండో కోవకు చెందిన వ్యక్తి. ఎప్పుడూ ఏదో నేర్చుకోవాలని తపించే జ్ఞానపిపాసీ. ఆమె మాతృభాష ఒడియా. హిందీ, ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడుతారు. తెలుగు రాయగలరు, చదవగలరు. బాధలు తెలుసుకోవడానికి కోయ భాష నేర్చుకుంది...భద్రాచలంలో పనిచేసే సమయంలో అక్కడ గిరిజనుల బాధలు వారి నోట నుంచి తెలుసుకునేందుకు కోయ భాష నేర్చుకున్నారు పమేలా. అంతేకాదు...కోయ భాషలో పాటలు రాసే స్థానిక రచయితలనుప్రాంపోత్సహించి ఎన్నో ఆల్బమ్‌లు రూపొందించి విడుదల చేయించారు. కరీంనగర్‌కు వచ్చాక ఆమెకు ఉర్దూ నేర్చుకోవాలనే ఆసక్తి కలిగింది. అనుకున్నదే తడవుగా ట్యూటర్‌ను వెదికారు. ఉర్దూలో అక్షరాలు నేర్చుకుని బేసిక్ కోర్సు పూర్తి చేశారు. ‘మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ’ నుంచి ఉర్దూలో డిప్లమా చేశారు. భవిష్యత్‌లో మరిన్ని కోర్సులు చేసి ఉర్దూలో ప్రావీణ్యాన్ని సాధించాలనుకుంటున్నారు. తెలంగాణలో నిజాం రాజుల కాలంలో రాసిన రెవెన్యూ రికార్డులు ఉర్దూలోనే ఉన్నాయి. అలాంటి వాటిని చదివి అర్థం చేసుకుంటే అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉర్దూ నేర్చుకోవడమే కాదు తెలుగు గొలుసు రాతను అధ్యయనం చేస్తున్నారు పమేలా సత్పతి.‘సృజనాత్మక కళలు, ఉద్యోగ నిర్వాహణ బాధ్యతలు ఒకే ఒరలో ఇమడవు’ అని అపోహ పడేవారికి కలెక్టర్ పమేలా సత్పతి రాసిన పాట....మేలుకొలుపు మాట. ‘కచ్చితంగా సాధ్యమే’’ అని బలంగా చెప్పే మాట.‘సృజన మానసికవికాసానికే కాదు...అభివృద్ధికి కూడా’ అని చెప్పే బంగారు బాట. వారి మనసు చదవాలంటే...నాకు ఏప్రాంపాంతంలో పనిచేసినా ఆప్రాంపాంత ప్రజల భాష, సంస్కృతి, సంప్రదాయల గురించి తెలుసుకోవడం ఇష్టం. వారి సంస్కృతి, సంప్రదాయాలతో మమేకం అయినప్పుడే వారి హృదయాలను అర్థం చేసుకోగలం. సమస్యలను పరిష్కరించగలం. ప్రతిప్రాంపాంతానికి తనదైన విశిష్ఠత ఉంటుంది. ఆ విశిష్ఠతను అభిమానించడం అంటే ఇష్టం. చాలామంది పేదప్రజలకు మాతృభాష తప్ప వేరే భాష రాకపోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పేద ప్రజల సేవ కోసం వచ్చే అధికారులకు బహు భాషలతో పరిచయం అవసరం. వారి భాషను అర్థం చేసుకోగలిగితే వారి సమస్యను లోతుగా అర్థం చేసుకోగలం.– పమేలా సత్పతి, కలెక్టర్, కరీంనగర్– భాషబోయిన అనిల్‌కుమార్‘సాక్షి’ ప్రతినిధి, కరీంనగర్ -
విశాఖలో ఆశ వర్కర్ల నిరసనలు..లోకేష్ గాలి తీసేసిన ఆశావర్కర్
-
నేను ప్రత్యేకాధికారిని.. చెప్పినట్టు వినండి
సీటీఆర్ఐ: నేనే ప్రత్యేక అధికారిని.. నేను చెప్పినట్లు వినాలి.. లేదంటే మీ ఉద్యోగాలు ఊడిపోతాయంటూ కొన్ని రోజులుగా ఒక వ్యక్తి హల్చల్ చేస్తున్నాడు. అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి అక్కడ ఉన్న సిబ్బందిని తనిఖీల పేరిట భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే.. మూడు రోజులుగా కొవ్వూరులోని అరికిరేవులు, చాగల్లు, తాళ్లపూడిలోని 124 అంగన్వాడీ కేంద్రాలకు ఒక వ్యక్తి వచ్చి తాను ప్రత్యేక అధికారిని అని, రికార్డులు తనిఖీ చేయడానికి వచ్చానని సిబ్బందికి తెలిపాడు. అంతే కాకుండా తన మాట వినకపోతే ఉద్యోగాలు పోతాయని బెదిరించాడు. అక్కడున్న అంగన్వాడీ సిబ్బందితో సెలీ్ఫలు దిగమని బలవంతం చేశాడు. తనిఖీల్లో ఇదో భాగమని, సెల్ఫీలు దిగకపోతే తనిఖీలు పూర్తి కాదని బెదిరించాడు. దీంతో హడలిపోయిన అంగన్వాడీ సిబ్బంది ఇతను నిజంగానే ప్రభుత్వ అధికారి అనుకుని తనిఖీలకు అనుమతి ఇచ్చారు. కానీ ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కె.బేబీరాణి దృష్టికి తీసుకు రావడంతో ఆమె అంగన్వాడీ పీడీకి తెలిపారు. చివరికి అతను నకిలీ అధికారి అని గుర్తించారు. వారంతా కలసి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ప్రశాంతికి వినతిపత్రం ఇచ్చి సమస్యను వివరించారు. వెంటనే స్పందించిన కలెక్టర్ అతనెవరో తెలుసుకుని పోలీసు కేసు పెట్టాలని ఆదేశించారు. -
అంగన్ వాడీల్లో పురుగులు గుడ్లు..
-
అంగన్వాడీలకు గుడ్ న్యూస్
-
మూడో కాన్పులోనూ ఆడపిల్ల.. ఆపై అమ్మకం?
తిరుమలాయపాలెం: అన్ని రంగాల్లో ఆడపిల్లలు రాణిస్తున్న ఈ తరుణంలోనూ పెంచే శక్తి లేకనో.. మరేదైనా కారణమో తెలియదో కానీ తల్లిదండ్రులే తమ పాప చనిపోయినట్లుగా తప్పుడు సమాచారం ఇచ్చి అమ్మేసినట్లు తెలుస్తోంది. అయితే, ఆశా కార్యకర్త, అంగన్వాడీ కార్యకర్తకు అందిన సమాచారంతో ఆరా తీయగా ఈ విషయం బయటపడగా, అధికారులు మందలించడంతో వారు తమ బిడ్డను తిరిగి తెచ్చుకున్నారని ప్రచారం జరుగుతోంది. వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మేకలతండాకు చెందిన ఓ గిరిజన దంపతులకు గతంలో ఇద్దరు అమ్మాయిలు ఉండగా, బాబు కోసం ఎదురుచూశారు. అయితే, గత మార్చిలో జరిగిన మూడో కాన్పులోనూ ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రసవం జరిగినట్లు తెలుస్తుండగా ఆడ శిశువు అని తెలియగానే ఆస్పత్రి సిబ్బంది సహకారంతో మహబూబాబాద్ జిల్లాలోని ఓ కుటుంబానికి అమ్మేసినట్లు సమాచారం. కాగా, బిడ్డను తీసుకున్న వారు ఈ దంపతులకు బంధువులేనని తెలుస్తోంది. ఆపై శిశువు పుట్టుకతోనే చనిపోయిందని ఆశా కార్యకర్తకు తప్పుడు సమాచారం ఇవ్వడమేకాక అంగన్వాడీ కేంద్రంలో మాత్రం తల్లీబిడ్డ పేరిట పౌష్టికాహారం తీసుకుంటున్నారని సమాచారం. అయితే, ఆనోటఈనోట విషయం బయటకు రావడంతో ఆశా కార్యకర్త వెళ్లి పాప మరణ ధృవపత్రం కావాలని అడగడం.. అంతేకాక అంగన్వాడీ కార్యకర్తకు సైతం తెలియడంతో ఆమె ఐసీడీఎస్ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో వారు పాప తల్లిదండ్రులకు ఫోన్ చేసి తమ కార్యాలయానికి రావాలని పట్టుబట్టగా పాపను అమ్మిన విషయం తెలిసిపోయిందనే భయంతో అమ్మేసిన పాపను రప్పించి ఐసీడీఎస్ అధికారుల వద్దకు వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పాప అమ్మకం విషయాన్ని అధికారులకు ఎందుకు చెప్పావంటూ తల్లిదండ్రులు, వారి బంధువులు అంగన్వాడీ కార్యకర్తను దుర్భాషలాడుతూ ఇక్కడ ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తామంటూ బెదిరించినట్లు తెలిసింది. ఈ విషయమై ఐసీడీఎస్ అధికారులను వివరణ కోరగా పూర్తిస్థాయిలో విచారణ చేపట్టడంతో పాపను తల్లిదండ్రులు పెంచుకునేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. -
ప్రీస్కూల్స్‌గా అంగన్వాడీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను క్రమంగా పూర్వ ప్రాథమిక పాఠశాలలు (ప్రీ స్కూల్స్)గా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. జాతీయ విద్యా విధానం–2020కు అనుగుణంగా వీటిని అభివృద్ధి చేసేలా రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. తొలి విడత కింద ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలో ఉన్న వాటిని ప్రీస్కూల్స్‌గా అప్‌గ్రేడ్ చేసే దిశగా చర్యలు వేగవంతం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల సమీపంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల సమాచారాన్ని క్రోడీకరించిన రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ.. ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఈ కేంద్రాల ఆధునీకరణకు అవసరమైన మౌలిక వస తులు,నిధులు...తదితర అంశాలతో ప్రతిపాదనలను ప్రాథమికంగా ఖరారు చేశారు. వీటిని ప్రభుత్వ ఆమోదం కోసం పంపినట్లు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో.. జూన్ 6 తర్వాత ప్రభుత్వం ఆమోదం పొందే అవకాశం ఉన్నట్లు తెలిపాయి.వసతులకు రూ.30 కోట్లుప్రస్తుతం తెలంగాణలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు న్నాయి. వీటిలో 15,640 కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల పరిధిలో కొనసాగుతున్నాయి. వీటిల్లోనే సూత్రప్రాయంగా ప్రీ స్కూల్ విద్యను అమలు చేసేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాచరణ రూపొందించింది. వీటి పరిధిలోని 3 లక్షల మంది 3 – 6 సంవత్సరాల మధ్యనున్న చిన్నారులకు ప్రీస్కూల్ విద్యను అందించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో భాగంగా కార్పెట్ల కొనుగోలు కోసం రూ.3.57 కోట్లు బడ్జెట్ అవసరమని ప్రతిపాదించింది. పుస్తకాలు, పఠన సామాగ్రి, బుక్ ర్యాక్స్ కోసం రూ.7.53 కోట్లు ప్రతిపాదించింది. ఆయా కేంద్రాలకు కొత్తగా రంగులు వేసేందుకు సమగ్ర శిక్షా విభాగంతో అవగాహన చేసుకుంది. పిల్లలకు ప్రత్యేక యూనిఫాం కోసం రూ.6.90 కోట్లు, ప్రతి అంగన్వాడీ కేంద్రంలో రెండు టేబుల్స్ ఇతర సామాగ్రి ఏర్పాటు కోసం రూ.12.96 కోట్లు ప్రతిపాదించింది. మొత్తంగా రూ.30 కోట్ల విలువైన ప్రతిపాదనలు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రభుత్వానికి సమర్పించింది.కొత్త టీచర్లా? ప్రస్తుత సిబ్బందేనా?ప్రీస్కూల్స్‌లో విద్యాబోధనకు శిక్షణ పొందిన టీచర్ల ఆవశ్య కత ఉంది. ప్రస్తుతం అంగన్వాడీల్లో పనిచేస్తున్న టీచర్లు, హెల్పర్లు పదో తరగతి అర్హతతో విధుల్లో చేరినవారే. ఈ క్రమంలో ప్రీ ప్రైమరీ విద్యాబోధనకు కొత్తగా టీచర్లను నియ మిస్తారా? లేక ఇప్పుడున్న వారితో నిర్వహిస్తారా? అనే అంశంపై స్పష్టత లేదు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సమర్పించిన ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదం దక్కిన తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
అంగన్వాడీల్లో బయోమెట్రిక్, సీసీ కెమెరాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో బయో మెట్రిక్ హాజరు చేపట్టాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అన్ని అంగన్ వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఉండేలా చూడాలని, అవసర మైనచోట కొత్త భవనాలను నిర్మించాలని సూచించారు. శనివారం సచివాలయంలో మహిళాభివృద్ధి, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖలపై సీఎం సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించడ మే లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని 35వేల అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం దుర్వినియోగం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించా రు. ఈ మేరకు అంగన్వాడీల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారు లకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ‘ఉపాధి హామీ’ లింకేజీతో సొంత భవనాలు రాష్ట్రంలో 12,315 అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయని, వాటికి శాశ్వత ప్రాతిపదికన సొంత భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఉపాధి హామీ పథకం నిధులను జోడించి మొదటి ప్రాధాన్యతగా అంగన్వాడీ భవన నిర్మాణాలు చేçపట్టాలన్నారు. రాష్ట్రమంతటా ఎక్కడ చూసినా ఒకేలా అంగన్వాడీ కేంద్రాల బ్రాండింగ్ ఉండాలని.. ఇందుకోసం ప్రత్యేక డిజైన్ రూపొందించాలని సూచించారు. అవసరమైతే ఆరేళ్ల లోపు చిన్నారులకు ప్రీప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే అందించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు. ఆరు నెలలకోసారి వారోత్సవాలు.. మహిళా శిశుసంక్షేమ శాఖ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆరు నెలలకోసారి ప్రత్యేక వారోత్సవాలు నిర్వహించి విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఇక దివ్యాంగులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లను పక్కాగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో మరిన్ని వృద్ధాశ్రమాల ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. సమీక్షలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, సీఎస్ శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అంగన్వాడీల వేతన వెతలు!
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు వేతనాల కోసం అల్లాడుతున్నారు. మూడు నెలలుగా వేతనాలు అందకపోగా... అంతకు ముందు సమ్మె కాలానికి సంబంధించిన వేతన బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో ఆర్థికంగా సతమతమవుతున్నారు. అందాల్సిన వేతనాల కోసం రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్‌కు నిత్యం వినతులు వెల్లువెత్తుతున్నాయి. కానీ రాష్ట్ర కార్యాలయంలోని ఉన్నతాధికారుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 58,000మంది అంగన్వాడీ సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో దాదాపు 58,500 మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పనిచేస్తున్నారు. మూడు నెలల కిందటి వరకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రతి నెలా పదో తేదీ లోపు వేతనాలు అందించేవారు. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లకు గౌరవ వేతన రూపంలో రూ.13,650, హెల్పర్లకు 7,800 చొప్పున నెలవారీగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. వీరికి ఏడాదికి రూ.850 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తున్నారు. బడ్జెట్ లేదంటూ... ప్రస్తుతం మూడు నెలలుగా టీచర్లు, హెల్పర్లకు వేతనాలు నిలిచిపోయాయి. బడ్జెట్ సమస్యతో వేతనాలు నిలిచిపోయాయంటూ కమిషనరేట్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఫైలు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉందని, అది పరిష్కారమైతేనే వేతనాలు విడుదలవుతాయని అంటున్నారు. అయితే ఎన్నిరోజుల్లో సమస్యకు పరిష్కారం దక్కుతుందో యంత్రాంగం వద్ద కూడా స్పష్టత లేదు. ప్రతినెలా ఒకటో తేదీనే చెల్లించాలి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రతి నెలా ఒకటో తేదీనే గౌరవవేతనం అందించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నట్లుగా అదేరోజు చెల్లించాలి. మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో చాలామంది అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో సమ్మె చేసిన కాలానికి సంబంధించిన బకాయిలను కూడా వెంటనే చెల్లించాలి. – టేకుమల్ల సమ్మయ్య, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
జగనన్న మా కుటుంబానికి ఎంతో మేలు చేశారు: జయ భూషణ
-
‘నా ఉద్యోగం నేను చేసుకుంటా..’
సీతమ్మధార (విశాఖ ఉత్తర): ‘నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లను. నాకు జీతం కావాలి. నా ఉద్యోగం నేను చేసుకుంటాను’ అని విశాఖపట్నంలోని రేసపువానిపాలెం అంగన్వాడీ కేంద్రం ఆయా దేవిక తేల్చి చెప్పింది. సహచరులు సమ్మె చేస్తున్నా కూడా ప్రజలకు అత్యవసర సేవలు ఆగకూడదన్న ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాన్ని తెరిచి విధుల్లో చేరింది. సమ్మె కారణంగా జీవీఎంసీ 24వ వార్డు రేసపువానిపాలెం అంగన్వాడీ సెంటర్‌ను మూసివేయాల్సి వచ్చింది. ఆ కేంద్రంలోని ఆయా దేవిక శుక్రవారం అంగన్వాడీ కేంద్రాన్ని తెరిచి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్న సమయంలో కొందరు యూనియన్ నాయకులు ఆమెను అడ్డుకుని అంగన్వాడీ కేంద్రానికి తాళం వేశారు. మళ్లీ కేంద్రాన్ని తెరిస్తే ఆయాకు మద్దతుగా ఉన్న కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి ఇంటిని 500 మంది అంగన్వాడీలతో కలిసి ముట్టడిస్తామని ఆమెను యూనియన్ నేతలు హెచ్చరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లనని చెప్పిన ఆయా దేవిక ధైర్యంగా శనివారం కూడా అంగన్వాడీ కేంద్రాన్ని తెరిచి పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందజేసి తన విధులను యథావిధిగా నిర్వర్తించారు. -
AP: ఎస్మా పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు
-
విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో తెరుచుకున్న అంగన్వాడీ కేంద్రాలు
-
అంగన్వాడీలకు అడిగినవన్నీ..
సాక్షి, అమరావతి : బడుగు బలహీనవర్గాలకు మేలుచేసే అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, వాటిలో సేవలందిస్తున్న వర్కర్లు, ఆయాలపట్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలి నుంచీ సానుకూల వైఖరితోనే వ్యవహరిస్తోంది. ఆ కేంద్రాలను ఆధునీకరించడంతోపాటు అంగన్వాడీలకు మెరుగైన జీతాలిచ్చింది కూడా సీఎం జగన్ ప్రభుత్వమే. చంద్రబాబు జమానాకంటే సీఎం జగన్ పాలనలోనే వీరి వేతనాలు పెరిగాయి. ఎలాగంటే.. 2014 నుంచి 2016 వరకు ఈ వర్కర్లకు కేవలం రూ.4,200 మాత్రమే గౌరవ వేతనం ఇచ్చిన చంద్రబాబు 2016లో కంటితుడుపు చర్యగా రూ.ఏడు వేలకు పెంచారు. అప్పటి నుంచి రెండేళ్ల మూడు నెలలపాటు అదే అరకొర జీతంతో సరిపెట్టారు. 2018లో తన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా అంగన్వాడీలకు గౌరవ వేతనం పెంచుతానని ప్రతిపక్ష హోదాలో వైఎస్ జగన్ ప్రకటించడంతో అప్పుడుగానీ చంద్రబాబుకు వారి జీతాలు గురించి గుర్తురాలేదు. దీంతో ఎన్నికలకు ఆర్నెల్ల ముందు హడావుడిగా వేతనాలు పెంచినట్లు మోసపూర్తింగా జీవో ఇచ్చారు కానీ, అమలు చేయలేదు. 2019లో అధికారం చేపట్టిన వైఎస్ జగన్ తెలంగాణా కంటే అధికంగా ఇస్తామన్న మాట నిలబెట్టుకుంటూ వర్కర్లకు రూ.11,500, హెల్పర్లకు రూ.7వేలు చొప్పున పెంచి అందిస్తున్నారు. టీడీపీ హయాంలో అరకొర జీతాలతో అవస్థలుపడిన అంగన్వాడీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇలా వేతనాలు పెంచి నాలుగున్నరేళ్లుగా ఆ మొత్తాన్ని అందిస్తోంది. నీతిఆయోగ్ ప్రశంసలు.. గత ప్రభుత్వం కంటే ప్రస్తుత ప్రభుత్వంలోనే అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సగటు వేతనం భారీగా పెరిగింది. అంతేకాదు.. అంగన్వాడీల నిర్వహణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ టాప్ అని నీతిఆయోగ్ ప్రశంసించింది. అంగన్వాడీ వర్కర్లకు అత్యధిక వేతనాలిస్తున్న రాష్ట్రాల్లో దేశంలోనే ఏపీ ఆరవ స్థానంలోను, హెల్పర్ల వేతనాల్లో నాల్గవ స్థానంలో ఉండటం విశేషం. ఒక్క మాటలో చెప్పాలంటే.. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోనే అంగన్వాడీలకు అసలైన మేలు జరిగింది. అత్యాధునికంగా అంగన్వాడీ కేంద్రాలు.. అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టింది. ♦ నాడు–నేడు ద్వారా అత్యాధునికంగా తీర్చిదిద్దుతోంది. వీటికి అవసరమైన వస్తువులు, స్టేషనరీకి 48,770 మెయిన్ కేంద్రాలకు రూ.500 చొప్పున.., 6,837 మినీ కేంద్రాలకు రూ.250 చొప్పున మొత్తం 55,607 కేంద్రాలకు రూ.7.81కోట్లు మంజూరు చేసింది. ♦ సొంత భవనాల నిర్వహణ, చిన్నపాటి మరమ్మతులకు 21,206 కేంద్రాలకు (ఒక్కొక్క దానికి రూ.3వేలు చొప్పున) మొత్తం రూ.6.36 కోట్లు విడుదల చేసింది. ♦ అద్దె భవనాల్లో ఉన్న గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని 16,575, పట్టణాల్లోని 6,705 అంగన్వాడీ కేంద్రాలకు రూ.66.54 కోట్ల అద్దె బకాయిలు చెల్లించింది. ♦ అవకాశం ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మారుస్తోంది. అంగన్వాడీల మేలు కోరిన ప్రభుత్వం.. వేతనాల పెంపే కాదు.. అంగన్వాడీలు అడిగిన డిమాండ్లను సైతం సీఎం వైఎస్ జగన్ పెద్ద మనస్సుతో ఆమోదించి అమలుచేస్తున్నారు. అంగన్వాడీల మేలు కోరి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా (ఈ నెల 20న) మరికొన్ని ఉత్తర్వులు జారీచేసింది. అవేమిటంటే.. ♦అంగన్వాడీ సహాయకులను కార్యకర్తలుగా నియమించేందుకు వయో పరిమితిని 45 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలకు పెంచుతూ జీఓఎంఎస్–44 జారీచేసింది. ♦ సెక్టార్, యూనిట్ సమావేశాలకు హాజరయ్యేందుకు టీఏ, డీఏలు ఇవ్వాలన్న అంగన్వాడీల కోరికపై సానుకూలంగా స్పందించి మెమో నెంబర్.2303564/2023 జారీచేసింది. ♦ అంగన్వాడీ వర్కర్లకు నెలకు ఒకసారి, హెల్పర్లకు రెండు నెలలకు ఒకసారి టీఏ, డీఏలు చెల్లించాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. ♦ వీటితోపాటు అంగన్వాడీ వర్కర్లు, సహాయకుల ఉద్యోగ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. ♦ అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్ల సర్వీసు విరమణ తర్వాత వన్‌టైం బెనిఫిట్ రూ.50 వేలను రూ.1 లక్షకు పెంచింది. ♦ సహాయకుల సర్విసు విరమణ తర్వాత వన్‌టైం బెనిఫిట్ రూ.20వేల నుంచి రూ.40 వేలకు పెంచింది. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ప్రతి ఒక్కరికీ యూనిఫారం (ఆరు చీరలు చొప్పున) అందించేందుకు రూ.16 కోట్లను ఖర్చుచేసింది. వారి విధులు సజావుగా నిర్వహించడానికి, మంచి సేవలు అందించడానికి ఈ ప్రభుత్వం రూ.85.47 కోట్లతో 56,984 స్మార్ట్ఫోన్లు కొని, అందించింది. డేటా ఛార్జీలను ప్రభుత్వమే భరిస్తూ అదనంగా ఏడాదికి రూ.12కోట్లు చెల్లిస్తోంది. ♦ ఈ ఏడాది నుంచి వర్కర్లు, హెల్పర్లకు జీవిత బీమా వర్తింపజేస్తోంది. ప్రమాద బీమాగా రూ.2 లక్షల వరకూ చెల్లిస్తోంది. ♦ అంగన్వాడీల ద్వారా నాణ్యమైన సరుకుల పంపిణీని పర్యవేక్షించేందుకు దాదాపు 500 మంది సూపర్వైజర్లను కూడా నియమించింది. ♦ గర్భవతులు, బాలింతలు, పిల్లలకు గతంలోలా వండి ఇచ్చే ఇబ్బంది లేకుండా టేక్‌హోం రేషన్ పద్ధతిని అమల్లోకి తెచ్చింది. దీనివల్ల వారికి పనిభారం తగ్గింది. 2023 నుంచి డ్రై రేషన్ అందిస్తోంది. ♦ మంచి పనితీరు కనబర్చిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రోత్సాహకంగా నెలకు రూ.500 ఇస్తోంది. ఇలా ఏడాదికి సుమారు రూ.27.8 కోట్లు ప్రోత్సాహకాలుగా చెల్లిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి పదోన్నతులు.. ఇక అంగన్వాడీలకు 2013 నుంచి పదోన్నతులు ఇవ్వలేదు. టీడీపీ ప్రభుత్వంలో దీన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే ప్రమోషన్లు ఇచ్చింది. మరోవైపు.. 560 గ్రేడ్–2 సూపర్వైజర్ పోస్టులను భర్తీచేసింది. ఇదే సందర్భంలో ఈ సూపర్వైజర్ పోస్టులకు పరీక్షలు రాసే వారి వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ వారికి అనుకూల నిర్ణయం తీసుకుంది. తొమ్మిదేళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వయో పరిమితి పెంపు చాలా ఉపయోగపడింది. ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులను అర్హులుగా గుర్తించి వారికి రూ.1,313 కోట్లు అందించింది. ఇక నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అమలుచేసిన జగనన్న విద్యాదీవెన, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ రైతుభరోసా, జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ తదితర పథకాలను వారికి కూడా వర్తింపజేయడం గమనార్హం. -
అంగన్వాడీలను అందంగా తీర్చిదిద్దాలి
సాక్షి, అమరావతి: ‘మన అంగన్వాడీ నాడు–నేడు’ రెండో దశలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రెండో దశలో అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కమిషనర్(మౌలిక సదుపాయాలు) కె.భాస్కర్ సాంకేతిక మార్గదర్శకాలను సోమవారం జారీచేశారు. ‘మన అంగన్వాడీ నాడు–నేడు’ రెండో దశలో రూ.214.22 కోట్లతో 20,534 కేంద్రాల రూపురేఖలు మార్చనున్నట్లు మార్గదర్శకాల్లో స్పష్టంచేశారు. ఈ పనులకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులు, అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్లను ఆదేశించారు. మొత్తం 20,534 అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు ప్రధాన, చిన్న మరమ్మతు పనులను ఈ నెలాఖరులోపు గుర్తించాలని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న టాయిలెట్లో రన్నింగ్ వాటర్ సమస్యలు, రక్షిత మంచినీటి పైపులు, సంప్‌లు, ఎలక్ట్రికల్ వైరింగ్, ట్యూబ్‌లైట్లు, సీలింగ్ ఫ్యాన్లు, పెయింటింగ్, శ్లాబ్, ఫ్లోరింగ్, గోడలకు మరమ్మతులు వంటివి ఈ నెలాఖరులోగా గుర్తించాలని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. ఈ నెల మూడో వారంలో కమిటీల సమావేశాలు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పిల్లల తల్లులతో కమిటీలు నియమించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఒక్కో కమిటీలో ముగ్గురు తల్లులు, సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్, వార్డు కార్యదర్శి, అంగన్వాడీ వర్కర్, మహిళా శిశు సంక్షేమశాఖ సూపర్వైజర్, మహిళా పోలీసు, సమీపంలోని స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఉండాలని తెలిపారు. ఆ కమిటీల పేరుతో జాతీయ బ్యాంకుల్లో ఖాతాలను తెరవాలని సూచించారు. ఈ నెల మూడో వారంలో తల్లుల కమిటీల సమావేశాలను ఏర్పాటుచేసి అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టాల్సిన మరమ్మతు పనులను గుర్తించడంతోపాటు వాటికి అంచనాలను రూపొందించి తీర్మానం చేసి అంగన్వాడీ సూపర్వైజర్కు సమర్పించాలని ఆదేశించారు. ఈ నెల చివరి వారంలో మరమ్మతు పనుల అంచనాలను సమగ్ర శిక్ష పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు. అంచనాలకు జిల్లా కలెక్టర్లు పరిపాలన అనుమతులను మంజూరు చేస్తారని తెలిపారు. మరమ్మతులకు అవసరమైన మెటీరియల్‌ను స్థానికంగా కొనుగోలు చేసి పనులు చేపట్టాలని పేర్కొన్నారు. తలుపులు, కిటికీలు, వాటర్ ట్యాంకులు, పైపులైన్లు, సంప్లతోపాటు ఏమైనా పరికరాలకు మరమ్మతులు చేయడం సాధ్యం కాకపోతే కొత్తవి ఏర్పాటుచేయాలని ఆదేశించారు. మెటీరియల్ కొనుగోలు, పనుల వివరాలను ఎప్పటికప్పుడు ‘ఎం బుక్’లో నమోదు చేయాలని సచివాలయాల ఇంజినీరింగ్ అసిస్టెంట్, వార్డు కార్యదర్శులకు సూచించారు. -
పామిడి మండలాల్లో ప్రారంభమైన అంగన్వాడీ కేంద్రాలు
-
ఏపీలో వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాల అమలు భేష్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ కింద గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించే టేక్ హోమ్ రేషన్ పంపిణీ ఆంధ్రప్రదేశ్‌లో బాగా అమలవుతోందని నీతి ఆయోగ్ నివేదిక కితాబు ఇచ్చిది. వివిధ రాష్ట్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీల్లో మంచి పద్ధతులపై నీతి ఆయోగ్ నివేదిక రూపొందించింది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో రక్తహీనత, పౌష్టికాహార లేమిని పూర్తిగా తొలగించడమే లక్ష్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిగిరిజన ప్రాంతాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్, మైదాన ప్రాంతాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా పక్కాగా అమలు చేస్తోందని నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసింది. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కోసం ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ స్మార్ట్ ఫోన్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తోందని, తద్వారా టేక్ హోమ్ రేషన్ పంపిణీకి సంబంధించి బహుళ అంశాలను ట్రాక్ చేస్తున్నట్టు నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. తద్వారా రేషన్ పంపిణీ సమయంలో లీకేజీలను నిరోధించడంతో పాటు పక్కాగా ధ్రువీకరణ జరుగుతోందని నీతి ఆయోగ్ తెలిపింది. అంగన్వాడీ కేంద్రాల వారీగా అంగన్వాడీ వర్కర్లు ప్రతినెలా వివిధ వర్గాలకు చెందిన లబ్ధిదారుల వివరాలను యాప్‌లో నమోదు చేయడంతోపాటు ప్రతినెలా ఆ డేటాను నవీకరిస్తున్నట్టు నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. నీతి ఆయోగ్ ఇంకా ఏం చెప్పిందంటే.. ► ఈ–సాధన సాఫ్ట్వేర్ నుంచి లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా ప్రతినెలా టేక్ హోమ్ రేషన్ సరుకులు ఎంత పరిమాణం అవసరమో అంచనా వేస్తారు. గత నెలకు సంబంధించి నిల్వలు ఏమైనా ఉన్నాయా అనే వివరాలను పరిగణనలోకి తీసుకుని, ప్రతినెలా బడ్జెట్ అంచనాలను అభివృద్ధి చేస్తారు. ► సాఫ్ట్వేర్ డేటాతో మరోసారి రీ వెరిఫికేషన్ చేస్తున్నారు. ప్రభుత్వంలో నమోదైన సరఫరాదారులకు పాలు, గుడ్లు తదితర డ్రై రేషన్ సరుకులు అంగన్వాడీ కేంద్రాల వారీగా ఎంత పరిమాణం కావాలో తెలియజేస్తారు. ► జిల్లాల వారీగా ఏయే అంగన్ వాడీ కేంద్రాలకు ఎంత పరిమాణంలో డ్రై రేషన్ అవసరమో అంచనా మేరకు సరఫరాదారు డెలివరీ చేస్తారు. ►అవసరమైన మెటీరియల్ సరఫరా చేసారా లేదా అనే విషయాన్ని అంగన్వాడీ వర్కర్ యాప్‌లోని డేటా ఎంట్రీ ద్వారా బయోమెట్రిక్ ప్రమాణీకరణతో ధ్రువీకరిస్తారు. ►ఆ వెంటనే అంగన్వాడీ కేంద్రానికి సరఫరా అయిన టేక్ హోమ్ రేషన్ పరిమాణాన్ని మహిళా సూపర్వైజర్ తనిఖీ నిర్వహిస్తారు. ఆ తరువాత శిశు అభివృద్ధి ప్రాజెక్టు డైరెక్టర్ మరోసారి తనిఖీ నిర్వహిస్తారు. నాణ్యతను కూడా నిర్థారిస్తారు. -
మహిళాకూలీతో అంగన్వాడీ నిర్వహణ
మహమ్మదాబాద్: మహమ్మదాబాద్ మండలంలోని కంచన్‌పల్లి అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం ఓ మహిళా కూలీ టీచర్ అవతారమెత్తారు. కేంద్రంలో టీచర్, ఆయా లేకపోవడంతో ఓ కూలీని పెట్టి కేంద్రం నిర్వహణ కొనసాగించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి వెళ్లి చూడగా, మహిళా కూలీ బెత్తం చేతబట్టుకుని పిల్లలను వారించడాన్ని చూశారు. కూలీతో అంగన్వాడీ కేంద్రం నిర్వహించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వగా.. అంగన్వాడీ కేంద్రంలో కూలీని పెట్టలేదని, పక్క అంగన్వాడీ కేంద్రానికి ఇన్చార్జ్ ఇచ్చినట్లు సూపర్వైజర్ మల్లమ్మ తెలిపారు. -
అది పాము కళేబరం కాదు.. ప్లాస్టిక్
చిత్తూరు: గర్భిణికి పంపిణీ చేసిన పౌష్టిక ఆహారంలోని ఎండు ఖర్జూజ ప్యాకెట్లో వచ్చింది పాము కళేబరం కాదని, అది ప్లాస్టిక్ అని ఐసీడీఎస్ పీడీ నాగశైలజ స్పష్టం చేశారు. మండలంలోని జంబువారిపల్లె పంచాయతీ శాంతినగర్ అంగన్ వాడీ కేంద్రంలో ప్రభుత్వం సరఫరా చేసిన పౌష్టిక ఆహారంలో పాము కళేబరం అంటూ బుధవారం పచ్చ పత్రికల్లో, చానళ్లలో వార్తలు ప్రచురితమైయ్యాయి. దాంతో ఐసీడీఎస్ పీడీ శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో విచారణ చేపట్టారు. పౌష్టికాహారం అందుకున్న గర్భిణి మానసను విచారించారు. ఈ నెల నాలుగో తేదీ పంపిణీ చేశారనీ, అందులో ఎండు ఖర్జూరం ఫ్యాకెట్‌ను మంగళవారం తెరిచినట్లు ఆమె తెలిపింది. అందులో పాము లాంటి వస్తువు ఉండడంతో ఈ విషయాన్ని అంగన్వాడీ కార్యకర్త జానకి దృష్టికి తీసుకు వెళ్లినట్లు పేర్కొంది. తరువాత ఎండు ఖర్జూరం ప్యాకెట్లో పాము లాంటి వస్తువును చేతిలోకి తీసుకుని కళేబరమా లేక ఇతర వస్తువేదైనా అని పరిశీలించారు. దాని వాసన చూశారు. చేతిలో పట్టుకుని గట్టిగా విరిచారు. విరగక పోవడంతో పాము కళేబరం కాదని నిర్థారించారు. పీడీ మాట్లాడుతూ పాము కళేబరం ఐతే తునిగి ముక్కలుగా విరిగిపోయేదన్నారు. ప్యాకింగ్ సమయంలో ప్లాస్టిక్ లాంటి వస్తువు ఎండు ఖర్జూజంతో ఫ్యాక్ అయిందని అనుమానం వ్యక్తం చేశారు. ఫ్యాకెట్లో ఉన్న వస్తువు గట్టిగా అంగుళంపైగా ఉందని, అక్కడక్కడ పచ్చచుక్కలు కలిగి ఉందని, ల్యాబ్‌కు పంపుతామన్నారు. అంగన్వాడీ సిబ్బంది పరిశీలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. పాము కళేబరం ఫ్యాకెట్లో ఉంటే వాసన వచ్చేదన్నారు. పచ్చపత్రికలు ప్రభుత్వంపై బురద జల్లె ప్రయత్నం చేయడం గర్హనీయమని తెలిపారు. -
ఊరంతా మా కుటుంబమే!
విధుల్లో ఉత్తమసేవలు అందించినందుకుగాను జాతీయ స్థాయి ఉత్తమ అంగన్వాడీ టీచర్‌గా తెలంగాణలోని సూర్యాపేట జిల్లా, చివ్వెంల మండలం, ఖాసింపేట గ్రామం, రేగట్టె వెంకట రమణ ఎంపికయ్యారు. నేడు న్యూఢిల్లీలో కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుంచి పురస్కారం అందుకోనున్నారు. ఈ సందర్భంగా రేగట్టె వెంకటరమణను పలకరిస్తే తన ఇరవై మూడేళ్ల్ల కృషిని వివరించారు. ‘‘పై అధికారులు చెప్పిన పనిని సమయానుకూలంగా నూటికి నూరు శాతం పూర్తి చేస్తూ రావడం వల్లే ఈ రోజు ఈ పురస్కారం లభించింది. ఎనిమిదవ తరగతి పూర్తవుతూనే పెళ్లయ్యింది. ఇరవై మూడేళ్ల్ల క్రితం అత్తింటిలో అడుగుపెడుతూనే అంగన్వాడీ టీచర్‌గానూ చేరాను. ఆ తర్వాత మా వారు భద్రయ్య, ఇతర కుటుంబ సభ్యుల సహకారంతో డిగ్రీ వరకు చదువుకున్నాను. నాకు ఇద్దరు కూతుళ్లు. మా ఇంటినే కాదు ఊరు బాగోగులు చూసుకునే అవకాశం కూడా దక్కడం అదృష్టంగా భావిస్తాను. అందుకే, నాకు మా ఊరే కుటుంబం అయ్యింది. ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరికీ తెలిసిపోతుంది. అందరూ అందరి కోసం అన్నట్టుగా ఎన్నో కార్యక్రమాలను జరుపుతుంటాం. ఇవన్నీ ఊళ్లో అందరినీ సంఘటితం చేస్తున్నాయి. ప్రీ స్కూల్, ఆరోగ్యలక్ష్మి, ఇంటింటి అంగన్వాడీ హోమ్ విజిట్స్, పౌష్టికాహార, తల్లిపాల వారోత్సవాలు, మిల్లెట్స్ మాసం, పిల్లల చదువుకు సంబంధించి.. ఇలా ప్రతిదీ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తాం. ఏ కార్యక్రమం చేసినా నూరు శాతం సక్సెస్ అవుతుంది. ఇంటింటి ప్రోగ్రామ్.. గర్భిణులపై ఎక్కువ ఫోకస్ పెడుతుంటాం. వారి ఆరోగ్యం, పౌష్టికాహారం.. ఇంటి నుంచి ఆసుపత్రికి వెళ్లేవరకు ఎలా చూసుకోవాలో ఇంటిల్లిపాదికీ కౌన్సెలింగ్ ఇస్తాం. అలాగే పిల్లలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతుంటాం. మేం మా డైరీలో సక్సెస్ స్టోరీలు కూడా నోట్ చేస్తాం. ఒకసారి ఒక గర్భిణి పౌష్టికాహారం గురించి, తీసుకోవలసిన ఇతర జాగ్రత్తల గురించీ మేం ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఇచ్చిన పౌష్టికాహారం తీసుకోలేదు. ఆమెకు డెలివరీ అయి బరువు తక్కువతో పాప పుట్టి, చనిపోయింది. అయినా ఆమెను మళ్ళీ మళ్లీ కలుస్తూనే, విషయాలన్నీ చెబుతూ ఆమె తిరిగి కోలుకునేలా చేశాం. ఆమె మళ్లీ ప్రెగ్నెంట్ అయినప్పుడు మేం చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించింది. ఈసారి ఆరోగ్యకరమైన పాపకు తల్లి అయ్యింది. ఆ తర్వాత ఆమెనే ఊళ్లో ఎవరు ప్రెగ్నెంట్ అయినా తనలా అశ్రద్ధ చేయద్దని సూచనలు చేస్తుంటుంది. చంటిపిల్లల విషయంలోనూ తల్లులు ఒకరిద్వారా మరొకరు సూచనలు చేసుకునేలా కౌన్సెలింగ్ చేస్తుంటాం. అందరూ మా వాళ్లే.. గర్భిణులకు సీమంతాలు, స్కూల్ డే, చిల్డ్రన్ డే వంటి కార్యక్రమాలకు గ్రామపెద్దలు డబ్బులు పోగేసి మరీ చేస్తుంటారు. ర్యాలీలు, వారోత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలన్నింటికీ గ్రామపెద్దలను కలిసి చెబుతాను. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరిస్తాను. వాళ్లూ మిగతా అందరినీ కూడగట్టుకొని, మాకు మద్దతు ఇస్తారు. దీంతో ఊరంతా ఆరోగ్యంగా ఉండేలా సరైన కృషి జరుగుతోంది. కార్యక్రమాల్లో ఊరంతా ఒక్కటవుతుంది. ఆ రోజు ఎవరూ పనులకు కూడా వెళ్లరు. కార్యక్రమాలను ఓ పండగలా జరుపుతుంటారు. నేను చెప్పిన విషయాలను వినడంలోనూ, ఆచరించడంలోనూ మా ఊరంతా నాకు సహకరించడం వల్లే ఇది సాధ్యమైంది. కరోనా సమయంలోనూ తీసుకున్న జాగ్రత్తలకు రాష్ట్రస్థాయి అ«ధికారుల నుంచి ప్రశంసలు లభించాయి. బెస్ట్ అవార్డీగా... మండల, ప్రాజెక్ట్, జిల్లా స్థాయుల్లోనూ.. బెస్ట్ అంగన్వాడీ టీచర్‌గా అవార్డులు అందుకున్నాను. ఈ యేడాది జాతీయ స్థాయికి ఎన్నికైనందుకు చాలా ఆనందంగా ఉంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మిల్లెట్స్‌తో ఐటమ్స్ తయారుచేసి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లో స్టాల్స్ ఏర్పాటు చేస్తుంటాం. వాటి ప్రయోజనాలను వివరిస్తాం. దీనివల్ల ఇతర మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తుంటాయి. మా అంగన్వాడీ టీచర్స్‌కి నెలలో రెండు సమావేశాలు జరుగుతుంటాయి. వాటిలో ఊళ్లలో చేపట్టే కార్యక్రమాల వివరాలు పంచుకోవడం, ముందస్తు ప్రణాళికల గురించి చర్చించుకోవడం, నిర్ణయాల అమలుకు కృషి చేయడం మాకున్న పెద్ద బాధ్యత. దీనిని సక్రమంగా నిర్వర్తించడమే ఈ రోజు మీ అందరి ముందు నిలిపింది’’ అని ఆనందంగా వివరించింది వెంకటరమణ. – నిర్మలా రెడ్డి -
అంగన్వాడీల్లో కొత్త కొలువులు!
సాక్షి, హైదరాబాద్: మినీకేంద్రాల స్థాయి పెంచి ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కొత్త కొలువులకు అవకాశం ఏర్పడింది. రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 31,711 కేంద్రాలు ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు కాగా, 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు. ప్రధాన అంగన్వాడీ కేంద్రాల్లో ఒక టీచర్, ఒక హెల్పర్ ఉంటే.. మినీకేంద్రాల్లో మాత్రం ఒక టీచర్ ఉంటారు. ఇక్కడ హెల్పర్ ఉండరు. తాజాగా మినీ కేంద్రాల అప్‌గ్రేడ్‌తో అక్కడ హెల్పర్ పోస్టు అనివార్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖకు అప్‌గ్రేడ్ వివరాలు పంపింది. ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్చడంతో వాటికి కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ కూడా పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే కొత్తగా హెల్పర్ల నియామకం చేపట్టొచ్చు. టీచర్ల భర్తీ తర్వాతే... రాష్ట్రవ్యాప్తంగా పలు అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రిటైర్మెంట్ పాలసీతో దాదాపు రెండున్నర వేలమంది టీచర్లు పదవీ విరమణ పొందాల్సి ఉంది. ఈక్రమంలో అన్ని రకాల్లో కలిపి నాలుగువేల వరకు పోస్టులు ఖాళీగా ఉంటాయి. అయితే కొన్ని జిల్లాల్లో అంగన్వాడీ టీచర్ పోస్టులకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ నోటిఫికేషన్లు జారీ చేసి, భర్తీ ప్రక్రియ ప్రారంభించింది. అయితే వివిధ కారణాలతో ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. తాజాగా మినీ కేంద్రాల అప్‌గ్రెడేషన్‌తో హెల్పర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా, అంతకుముందే అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈమేరకు జిల్లాల వారీగా ఖాళీల వివరాలతో కూడిన ప్రతిపాదనలు సమర్పించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ జిల్లా సంక్షేమాధికారులను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సూచనలకు అనుగుణంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు. -
అంగన్వాడీలో కుళ్లిన గుడ్లు!
వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు స్వచ్ఛమైన ఆహారాన్ని అందించాలని చేపట్టిన సంకల్పాన్ని పలువురు మధ్య దళారులు చిన్నాభిన్నం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న అధికారుల నిర్లక్ష్యంతో పలువురు నీరు గార్చుతున్నారు. కొన్నె గ్రామంలో సోమవారం కోడిగుడ్లను పంపిణీ చేయగా అవి వండుకున్న వారు గుడ్లు కుళ్లిపోయి వాసన వస్తుందని, అవి తింటే అనారోగ్యం పాలుకావడం ఖాయమని వాపోతున్నారు. అధికారులు సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్య తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
అంగన్వాడీ కేంద్రాలకు నాడు–నేడు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన సదుపాయాల కల్పనకు అమలు చేస్తున్న ‘మనబడి నాడు–నేడు’ పథకాన్ని ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు విస్తరించింది. సుమారు రూ.500 కోట్లతో ఆయా కేంద్రాల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యార్థులకు అవసరమైన విద్య, క్రీడా పరికరాలను అందజేయనుంది. ప్రధాన మౌలిక సదుపాయాలైన తాగునీరు, మరుగుదొడ్లు, భవనాలకు రంగులు, కిచెన్ షెడ్లు, ఫర్నీచర్, పిల్లలకు ఆటవస్తువులను అందుబాటులోకి తీసుకొస్తారు. మొత్తం అంగన్వాడీ కేంద్రాల్లో 50,600 కేంద్రాలను నాడు–నేడులోకి తీసుకున్నారు. పాఠశాలల ప్రాంగణాల్లో ఉన్నవాటిలో 600 కేంద్రాల్లో ఇప్పటికే నాడు–నేడు పనులు పూర్తిచేశారు. మరో 1,778 కేంద్రాల్లో సదుపాయాలు కల్పించారు. కొత్తగా 1,625 భవనాలను నిర్మించనున్నారు. నూతన జాతీయ విద్యావిధానాన్ని దేశంలో అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచింది. అందులో భాగంగా విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. -
ఏపీ అంగన్ వాడీ కేంద్రాల రూపురేఖలు మారుస్తున్న సర్కార్
-
Fact Check: అడగకుండానే అంగన్వాడీలకు ఎన్నో వరాలు
సాక్షి, అమరావతి: అడగకుండానే అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే వర్కర్లు, హెల్పర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక వరాలిచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి వేతనాలు పెంచారు. పదోన్నతులు కల్పించారు. పదోన్నతుల్లో వయో పరిమితి పెంచుతూ అనేక మందికి అవకాశం కల్పించారు. పాత స్మార్ట్ ఫోన్ల స్థానంలో కొత్త స్మార్ట్ ఫోన్లు అందించారు. మునుపెన్నడూ లేని విధంగా సెలవులు మంజూరు చేశారు. బీమా కల్పించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మేలు చేసి మనసున్న సీఎంగా వైఎస్ జగన్ మన్ననలు అందుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అంగన్వాడీలను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలనే విపక్షాల కుట్ర చేశాయి. వాస్తవాలను మరుగుపరిచి వారిని రెచ్చగొడుతున్నారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీలు తమను ఆదుకున్నదెవరో చూడాల్సిన అవసరం ఉంది. అంగన్వాడీ కేంద్రాలు, వాటిలో సేవలు అందించే వర్కర్లు, హెల్పర్ల పట్ల గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహించింది? ప్రస్తుత ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోంది? అనే వాస్తవాలు ఒకసారి పరిశీలిస్తే.. బాబు జమానాలో దారుణం.. వేతనాలు పెంచాలని ఆందోళన చేపట్టిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను గుర్రాలతో తొక్కించి, లాఠీలతో కొట్టించి చెదరగొట్టిన చంద్రబాబు నిరంకుశ పాలనను ఇప్పటికీ ప్రజలు మరిచిపోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ అంగన్వాడీల ఆవేదనను, ఆక్రోశాన్ని, కన్నీళ్లను చంద్రబాబు పట్టించుకోలేదు. విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయన కనికరించలేదు. ఎన్నికల ముందు అరకొరగా జీతాలు పెంచి వాటిని అమలు చేయకుండా బకాయిలు పెట్టి వదిలేశారు. సీఎం జగన్ అమలు చేసిన కార్యక్రమాల్లో కొన్ని.. ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాకముందు, అంటే గత ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకూ అంగన్వాడీ వర్కర్ల జీతం నెలకు రూ. 7 వేలు, హెల్పర్లకు రూ. 4,500 మాత్రమే. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన మొదటి మూడు వారాల్లోనే వారికి జీతాలు పెంచుతూ ప్రభుత్వం జీవోఎంఎస్ నంబర్ 18 జారీ చేసింది. అంగన్వాడీ వర్కర్ల జీతాలు నెలకు రూ. 11,500కు, హెల్పర్లకు రూ. 7 వేలకు పెంచుతూ 2019 జూన్ 26న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ► విధి నిర్వహణలో మంచి పనితీరు కనబర్చిన అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు ప్రోత్సాహకంగా నెలకు రూ. 500 చొప్పున ప్రభుత్వం అదనంగా అందిస్తోంది. ఇందుకోసం ఏడాదికి సుమారు రూ. 27.8 కోట్లు చెల్లిస్తోంది. ► 2013 నుంచి అంగన్వాడీలకు పదోన్నతులు లేవు. గత ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే ప్రమోషన్లు ఇచ్చి 560 గ్రేడ్–2 సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేసింది. ఈ సూపర్వైజర్ పోస్టులకు పరీక్షలు రాసే వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచి ఎక్కువ మందికి అవకాశం కల్పించింది. ► అంగన్వాడీ వర్కర్లకు స్మార్ట్ఫోన్లు కూడా ఇచ్చింది. 56,984 స్మార్ట్ ఫోన్ల కొనుగోలుకు రూ. 85.47 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. అదనంగా 1 జీబీ డేటా కూడా ఇస్తోంది. ► రూ. 16 కోట్ల ఖర్చుతో ఒక్కో అంగన్వాడీ వర్కర్‌కు, హెల్పర్‌కు 6 చొప్పున యూనిఫాం శారీలు అందించే కార్యక్రమం కొనసాగుతోంది. ► అంగన్వాడీ కేంద్రాల సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చి పర్యవేక్షించడంతో పాటు వర్కర్లు, హెల్పర్లకు వార్షిక సెలవులు, ప్రసూతి సెలవులు, బీమా సౌకర్యం కల్పించి భరోసా ఇస్తున్నారు. పదవి విరమణ సమయంలో ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహం అందిస్తోంది. ► నాడు–నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న ప్రభుత్వం.. అంగన్వాడీ కేంద్రాల్లోనూ నాణ్యంగా కనీస మౌలిక సదుపాయాలను అందించేలా చర్యలు చేపట్టింది. ► 10,932 అంగన్వాడీ కేంద్రాలు (సమీపంలోని ప్రాథమిక పాఠశాలల్లోకి రీలొకేట్ అయినవి) మౌలిక సదుపాయాలు, తరగతి గదుల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మరో రూ. 500 కోట్లతో మిగిలిన 45,000 అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ పనుల్లో భాగంగా అంగన్వాడీ భవనాలకు రిపేర్లు, కొత్త మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుత్ ఉపకరణాలు, రంగులు, రక్షిత తాగునీరు, గోడలపై బొమ్మలు తదితర పనులు చేపడుతున్నారు. ► స్మార్ట్ టీవీల ఏర్పాటుతో పాటు పిల్లల్లో నేర్చుకునే విధానాలను మెరుగుపరచడానికి ప్రత్యేక కిట్లు అందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని 8.5 లక్షల మంది పిల్లలకు ఈ కిట్లను ప్రభుత్వం ఇస్తోంది. దీంతోపాటు స్పోకెన్ ఇంగ్లిష్ పాఠ్యపుస్తకాలను అందిస్తోంది. అంగన్వాడీ వర్కర్లకు శిక్షణ కార్యక్రమాల ద్వారా వారి సామర్థ్యాన్ని పెంచేలా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ► పిల్లల ఎదుగుదలను పరిశీలించేందుకు రూ. 16.04 కోట్ల ఖర్చుతో 19,236 పరికరాలను అంగన్వాడీ స్కూళ్లకు ప్రభుత్వం అందిస్తోంది. గ్రోత్ మానిటరింగ్ పరికరాల కొనుగోలు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. ► గర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు గతంలో మాదిరిగా వండి ఇచ్చే ఇబ్బంది లేకుండా టేక్ హోం రేషన్ పద్ధతిని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ► అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు చిన్నారులకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా వైద్య సేవలు కూడా అందుబాటులోకి తెచ్చింది. అంగన్వాడీల్లో మనమే బెస్ట్ –కేవీ ఉషశ్రీచరణ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, వర్కర్లు, హెల్పర్ల వేతనాల పెంపు వంటి అనేక విషయాల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ బెస్ట్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో అనేక చర్యలు చేపట్టడంతో అంగన్వాడీల వ్యవస్థ నేడు మెరుగ్గా ఉంది. అంగన్వాడీలు, ప్రభుత్వ బడుల్లో బలహీనవర్గాలకు చెందిన పిల్లలే అధికంగా ఉంటారు. ఆ వర్గాలకు చెందిన పిల్లలకు సీఎం వైఎస్ జగన్ తోడుగా నిలబడుతున్నారు. ఆయన పెద్ద మనస్సుతో తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో విప్లవాత్మక మార్పులు సంతరించుకున్నాయి. -
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో అంగన్వాడీ కోడిగుడ్లు
మహబూబాబాద్ అర్బన్: మానుకోట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో అంగన్వాడీ కోడిగుడ్లతో ఎగ్ ఫ్రైడ్‌రైస్, ఎగ్ నూడిల్స్ తయారు చేసిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. అంగన్వాడీ సెంటర్లకు సరఫరా చేసే కోడిగుడ్లు పక్కదారి పట్టకుండా స్టాంప్‌లు వేస్తున్నారు. అయితే ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో స్టాంప్ వేసి ఉన్న కోడిగుడ్లతో ఫాస్ట్‌ఫుడ్ తయారు చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా అవకతవకలు జరుగుతున్నాయడానికి ఈ ఘటనే నిదర్శనమని, ఇప్పటికై నా ఐసీడీఎస్ అధికారులు పర్యవేక్షణ పెంచి, తనిఖీలు విస్తృతం చేయాలని నెటిజన్లు, జిల్లా ప్రజలు కోరుతున్నారు. -
నామ్‌కే వాస్తేగా ‘బడి బాట’, ‘ప్రైవేటు’కే తల్లిదండ్రుల మొగ్గు
ఆదిలాబాద్‌టౌన్: ఈ సారి చిన్నారుల అడుగులు సర్కారు బడి వైపు పడలేదు.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని చేపట్టింది. దాదాపు నెల పాటు ఈ కార్యక్రమం కొనసాగించినా ఆశించిన మేర ప్రయోజనం చేకూరలేనట్టు తెలుస్తోంది. బడిబయట పిల్లలతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులను పాఠశాలల్లో చేర్పించాల్సి ఉన్నప్పటికీ విద్యా శాఖాధికారుల అలసత్వమో, ఉపాధ్యాయుల నిర్లక్ష్యమేమో గానీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మాత్రం పెరగలేదు. చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేట్‌లోనే చేర్పించారు. విద్యా శాఖాధికారుల లెక్కల ప్రకారం బడిబాటలో భాగంగా 3,717 మంది విద్యార్థులు సర్కారు బడుల్లో చేరినట్లు చెబుతున్నారు. మరోవైపు ప్రైవేట్ యాజమాన్యాలు నెల పాటు జిల్లాలోని ఆయా గ్రామాల్లో తిరుగుతూ తల్లిదండ్రులను ఒప్పించి వారి పిల్లలను తమ పాఠశాలల్లో చేర్పించుకున్నారు. ఆ తర్వాత సర్కారు ఉపాధ్యాయులు గ్రామాల్లో నామ్‌కే వాస్తేగా బడిబాట కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థుల సంఖ్య పెరగకపోవడంతో జూలై 6వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని పొడిగించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు వైపే మొగ్గు.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతులు లేకపోవడంతో తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేట్‌లోనే చేర్పించినట్లు తెలుస్తోంది. గతేడాది నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టినా ఆశించిన ఫలితాలు రాకపోవడం గమనార్హం. 1,236 అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు 13వేల మంది చిన్నారులు 1వ తరగతిలో చేరాల్సి ఉండగా, ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 2,687 మంది మాత్రమే చేరారు. మిగతా వారంతా ప్రైవేట్‌లోనే చేరినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఈసారి ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులు కేవలం 104 మంది ఉండగా, కొత్త అడ్మిషన్లు మరో 926నమోదైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇక 6 నుంచి 14 ఏళ్లలోపు బడిబయట ఉన్న 225 మంది చిన్నారులను గుర్తించినట్లు చెబుతున్నారు. అయితే వీరిలో ఎంతమంది బడిలో చేరారనే సమాచారం విద్యా శాఖాధికారుల వద్ద లేకపోవడం గమనార్హం. వెక్కిరిస్తున్న ఖాళీలతో.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. మొత్తం 3,028 మంది ఉపాధ్యాయుల పోస్టులు ఉండగా, ఇందులో 577 ఖాళీగా ఉన్నాయి. ఉపాధ్యాయులు ఉన్నచోట విద్యార్థులు లేకపోవడం.. విద్యార్థులు ఉన్నచోట ఉపాధ్యాయులు లేని పరిస్థితి. ఒక్క విద్యార్థి కూడా లేని పాఠశాలలు జిల్లాలో పది ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాగే దాదాపు ఒక్క ఉపాధ్యాయుడు లేని మరో పది వరకు పాఠశాలలు ఉండడం గమనార్హం. ఈ పాఠశాలలకు సమీపంలోని ఉపాధ్యాయులతో సర్దుబాటు చేసినా ఫలితం ఉండని పరిస్థితి. మౌలిక వసతులు కరువు.. సర్కారు బడుల్లో మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థుల సంఖ్య పెరగడం లేదని తెలుస్తోంది. జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న గ్రామాలతో పాటు దాదాపు 30 నుంచి 40కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల విద్యార్థులు సైతం జిల్లా కేంద్రంలోని ప్రై వేట్ పాఠశాలలకు వచ్చి చదువులు కొనసాగిస్తున్నా రు. ఆయా గ్రామాల నుంచి ప్రైవేట్ పాఠశాలల బ స్సులు ఉదయం విద్యార్థులను తీసుకెళ్లి, సాయంత్ర ం వదిలేస్తున్నారు. దీంతోపాటు ఆటోల్లో సైతం వి ద్యార్థులను తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు. ఆయా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా తల్లిదండ్రులు వారిని అక్కడ చేర్పించడం లేదు. తాగునీరు, మరుగుదొడ్లు, ఆటస్థలం, ఇతర మౌలిక వసతులు లేని కారణంగా మొగ్గు చూపడం లేదు. మన ఊరు–మనబడి కింద మొదటి విడతలో 237 పాఠశాలలను ఎంపిక చేసినా ఇందులో ఇప్పటివరకు కనీసం 50శాతం కూడా పూర్తి కాలేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో ఇట్టే తెలిసిపోతుంది. పకడ్బందీగా బడిబాట.. బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపడుతున్నాం. అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న, బడిబయట ఉన్న చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు చేపట్టాం. తల్లిదండ్రులు పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించాలి. మౌలిక వసతులతో పాటు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజన పథకం అందిస్తున్నాం. బడిబాటలో భాగంగా ఇప్పటివరకు 3,717 మందిని చేర్పించడం జరిగింది. జూలై 6వరకు ఈ కార్యక్రమం చేపడతాం. – ప్రణీత, డీఈవో -
బొంపల్లి అంగన్ వాడీ పోస్టు భర్తీకి మోక్షమెన్నడో?
దోమ: చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ఒక్కో కేంద్రంలో టీచర్‌తో పాటు ఆయాలను ప్రభుత్వం నియమించింది. కానీ ఏళ్ల తరబడి కొన్ని సెంటర్లలో టీచర్లు, ఆయాలు లేని కారణంగా లబ్ధిదారులకు సక్రమంగా పౌష్టికాహారం అందడం లేదు. ఇటీవల ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వేసినప్పటికీ రాజకీయ నేతల ఒత్తిడితో అధికారులు వాటిని భర్తీ చేయలేకపోయారు. నోటిఫికేషన్ వచ్చినా.. దోమ మండలంలో 42 అంగన్వాడీ కేంద్రాలు, 21 మినీ అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నాయి. అందులో బొంపల్లి అంగన్వాడీలో టీచర్ పోస్టుతో పాటు దిర్సంపల్లి, బ్రాహ్మణపల్లిలో ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఇటీవల ప్రభుత్వం అంగన్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయినా బొంపల్లి టీచర్ పోస్టుతో పాటు దిర్సంపల్లి, బ్రాహ్మణపల్లి ఆయాల పోస్టును భర్తీ చేయడంలో అధికారులు విఫలం అయ్యారు. బొంపల్లిలో ఏళ్ల తరబడి టీచర్ పోస్టు ఖాళీగా ఉండడంతో బాస్పల్లి సెంటర్లో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచరే ఇక్కడ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. రాజకీయ ఒత్తిడే కారణం? బొంపల్లి అంగన్ వాడీ టీచర్ పోస్టు భర్తీ విషయంలో రాజకీయ నాయకుల ఒత్తిడే కారణమని తెలుస్తోంది. గ్రామంలోని అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతల మధ్య అంతర్గత వార్ వలనే పోస్టు భర్తీ కావడం లేదని చర్చ జరుగుతోంది. తమకు సంబంధించిన వ్యక్తికే పోస్టు కావాలంటూ ఇద్దరు నేతలు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదులు చేసుకున్నట్లు సమాచారం. దీంతో సంబంధిత అధికారులు ఇద్దరు నేతలకు సంబంధించిన అభ్యర్థులు అర్హులు కాగా.. పోస్టు భర్తీని నిలుపుదల చేయాలంటూ జిల్లా అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా రాజకీయ నాయకుల మనుగడ కొసం అంగన్వాడీ పోస్టు భర్తీ కాకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కొత్త నోటిఫికేషన్ వేస్తాం బొంపల్లి అంగన్వాడీ కేంద్రంలో ప్రస్తుతం ఇన్చార్జి టీచర్ కొనసాగుతోంది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. గతంలో వేసిన నోటిఫికేషన్‌కు ఇద్దరు అభ్యర్థులు సెలక్ట్ కాగా.. నేతల జోక్యంతో అది ఆగిపోయింది. టీచర్ పోస్టు భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వేస్తాం. – ప్రియదర్శిని, సీడీపీఓ, పరిగి -
అంగన్వాడీల విద్యార్హత ఇంటర్
మంచిర్యాలటౌన్: అంగన్వాడీ టీచర్లు, ఆయాల నియామకంలో ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. గతంలో ఈ పోస్టులకు కనీస విద్యార్హత పదో తరగతి ఉండగా ఇంటర్మీడియెట్‌కు పెంచింది. వయోపరిమితిని 35 ఏళ్లకే పరిమితం చేస్తూ, 21 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వారికి మాత్రమే దరఖాస్తుకు అవకాశం కల్పించింది. ప్రాజెక్టుల వారీగా రిజర్వేషన్ ఖరారుకు ఆదేశాలు జారీ చేసింది. ఇకపై కొత్త మార్గదర్శకాల ప్రకారమే ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రధాన అంగన్వాడీ టీచర్‌గా పదోన్నతికి మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కనీసం ఐదేళ్లు అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసి, 45 ఏళ్లలోపు వయస్సు ఉండి, ఇంటర్మీడియెట్ విద్యార్హత ఉండాలి. ఖాళీల భర్తీకి రిజర్వేషన్, రోస్టర్ పాయింట్, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ సెంటర్ల విధి విధానాల ఖరారుకు ఆదేశాలను జారీ చేశారు. ఆయా పోస్టులకు గాను అర్హులుగా స్థానికంగా ఉన్న వివాహిత, అర్బన్ ప్రాంతాల్లో అదే వార్డుకు చెందిన వారు, గ్రామీణ ప్రాంతాల్లోనైతే అదే గ్రామ పంచాయతీకి చెందిన వారు, ఏజెన్సీలో సంబంధిత హ్యాబిటేషన్‌కు చెందిన మహిళ అయి ఉండాలి. వితంతువులు, ఒంటరి, అనాథ మహిళలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఎంపిక ప్రక్రియ కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా, ఏజెన్సీ ప్రాంతాల్లో ఐటీడీఏ పీవో సభ్యులుగా, నాన్ ట్రైబల్ ప్రాంతాల్లో ఆర్డీవో, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సభ్యులుగా వ్యవహరిస్తారు. ఖాళీల భర్తీకి నిబంధనలు జిల్లాలో 969 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, అందులో ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు 895 ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 840 మంది టీచర్లు పనిచేస్తుండగా, 55 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 738 మంది ఆయాలు ఉండగా, 157 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక మినీ అంగన్వాడీ కేంద్రాలు 74 ఉండగా, 59 మంది టీచర్లు ఉండగా, 15 మినీ అంగన్వాడీ టీచరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత ఏడాది ఖాళీగా ఉన్న గ్రేడ్–2 సూపర్వైజర్ పోస్టులకు గాను పదేళ్లు టీచర్‌గా పనిచేసి, డిగ్రీ అర్హత ఉన్న వారికి అర్హత పరీక్ష నిర్వహించి, మెరిట్ ప్రకారంగా ఎంపికై న వారిని సూపర్వైజర్లుగా విధుల్లోకి తీసుకున్నారు. 17 పోస్టులకు గాను జిల్లా నుంచి 8 మంది అంగన్వాడీ టీచర్లు పదోన్నతి పొందడంతో ఆయా కేంద్రాల్లోనూ అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీ అయ్యాయి. పక్కనే ఉన్న ఇతర అంగన్వాడీ టీచర్లకు ఇంచార్జి బాధ్యతలు అప్పగించి నిర్వహిస్తున్నారు. -
అంగన్వాడీ కేంద్రాలకు బిల్లులు ఎప్పుడిస్తారో..?
కొత్తగూడెంటౌన్: అంగన్వాడీ కేంద్రాలకు బిల్లులు చెల్లించకపోవడంతో టీచర్లపై ఆర్థికభారం పడుతోంది. బిల్లుల మంజూరు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సివస్తోంది. ప్రతి నెలా వచ్చిన వేతనంలో సగానికి పైగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని అంగన్వాడీ టీచర్లు వాపోతున్నారు. కేంద్రాల నిర్వహణకు అద్దె చెల్లింపులు, గ్యాస్, ఈవెంట్, కూరగాయలు, పోషణ్ అభియాన్, స్టేషనరీ తదితర ఖర్చులు నెలకు సుమారు రూ. 6 వేలకు పైగా వస్తున్నాయని పేర్కొంటున్నారు. జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు 1,434, మినీ కేంద్రాలు 626.. మొత్తం 2,060 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రానికి గ్యాస్ బిల్లు రూ.1200, ప్రతి నెలా 15 రోజులకు ఒక ఈవెంట్ చొప్పున రెండు ఈవెంట్లకు రూ.500, నెలకు సరిపడా కూరగాయలు రూ.600, మీటింగ్‌కు రూ.300, స్టేషనరీ ఖర్చులు ఏడాదికి రూ.1000తో పాటు పోషణ్ అభియాన్‌కు రూ.100ల చొప్పున నెలకు మొత్తం రూ.6,200 ఖర్చవుతోందని అంగన్వాడీ టీచర్లు పేర్కొంటున్నారు. అద్దె భవనాల్లో 785 కేంద్రాలు కొనసాగుతుండగా అద్దె బకాయి విడుదల చేయడం లేదు. ప్రతి అంగన్వాడీ కేంద్రం నిర్వహణకు అద్దె నెలకు ప్రాంతాన్ని బట్టి రూ. 600, రూ.1500, రూ.2 వేలు. రూ.3 వేల వరకు చెల్లించాల్సి ఉంది. కేంద్రాల నిర్వహణపై ప్రభావం అంగన్వాడీ కేంద్రాల్లో గ్యాస్‌కు సంబంధించి రూ.1,200 చొప్పున మూడు నెలల బిల్లు పెండింగ్‌లో ఉంది. ఈవెంట్ బిల్లులు 5 నెలకు రూ.2,500 చెల్లించాల్స ఉంది. ఆరోగ్యలక్ష్మి బిల్లు 3 నెలలుగా చెల్లించడంలేదు. కూరగాయల బిల్లు నెలకు రూ.600 చొప్పున ఏడాది నుంచి చెల్లించడంలేదు. జిల్లాలో 785 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఒక్కో సెంటర్‌కు ఏరియాను బట్టి రూ.600 నుంచి రూ.3 వేల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం 8 నెలలుగా అద్దె బకాయి చెల్లించడంలేదు. మీటింగ్ ఖర్చులు కూడా ఏడాది నుంచి ఇవ్వడం లేదని టీచర్లు వాపోతున్నారు. ఏడాదికాలంగా బకాయిలు చెల్లించకుండా ఉంటే తాము కేంద్రాలను ఎలా నడపాలని అంగన్వాడీ టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణపై ప్రభావం పడుతోందని చెబుతున్నారు. -
దాల్ మే కుచ్ కాలా హై!
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కందిపప్పు టెండర్ దాఖలు ప్రక్రియలో కాంట్రాక్టర్ల కుమ్మక్కు తతంగం వెలుగుచూసింది. బహిరంగ మార్కెట్ ధర కంటే దాదాపు 50 శాతం అధికంగా ధరను సూచించి కాంట్రాక్టును దక్కించుకొనేందుకు ప్రయత్నించారు. దీన్ని గుర్తించిన రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆ టెండర్ ప్రక్రియనే రద్దు చేసింది. మళ్లీ టెండర్ పిలవాలని యోచిస్తోంది. 54% పెంచేశారు...: రాష్ట్రంలోని 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వాటిలోగర్భిణులు, బాలింతలు 4,57,643 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 6,67,783 మంది నయోదయ్యారు. వారికి ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం కింద సంపూర్ణ పోషకాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్నారు. గర్భిణి/బాలింతకు రోజుకు 30 గ్రాములు, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు రోజుకు 15 గ్రాముల చొప్పున కందిపప్పును ఆహారంలో కలిపి వడ్డిస్తున్నారు. ఈ లెక్కన నెలకు సగటున 500 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం. పప్పు సరఫరాకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ టెండర్ పద్ధతిలో కాంట్రాక్టర్‌ను ఎంపిక చేస్తుంది. ఒకసారి ఎంపికైన కాంట్రాక్టర్ ఆరు నెలలపాటు కందిపప్పును సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ప్రస్తుత వార్షిక సంవత్సరం తొలి 6 నెలల కోసం గత నెల అధికారులు టెండర్ పిలవగా 8 మంది పాల్గొన్నారు. అయితే వారంతా కిలో కందిపప్పు ధరను రూ. 176కు కాస్త అటుఇటుగా పేర్కొన్నారు. గత టెండర్ ప్రక్రియలో కాంట్రాక్టర్ కోట్ చేసిన కనిష్ట ధర రూ. 114 కాగా... ఇప్పుడు ఆ ధర రూ.176కు పెరిగింది. అంటే ఏకంగా 54 శాతం అధికంగా ధర కోట్ అయింది. మరోవైపు బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు ధర రూ. 120లోపే ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు టెండర్ ప్రక్రియను రద్దు చేశారు. భవిష్యత్తులో పెరుగుతుందనే అంచనాతో... టెండర్లో పాల్గొన్న 8 మందిని వ్యక్తిగతంగా అధికారులు పిలిచి మాట్లాడగా మార్కెట్లో ప్రస్తుతం కందిపప్పు ధర తక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో పెరుగుతుందనే ఆలోచనతో ఈ రకంగా ధర కోట్ చేశామని వారు పేర్కొన్నట్లు తెలిసింది. అయితే గత రెండేళ్లలో కందిపప్పు ధర ఈ స్థాయిలో లేకపోవడం, త్వరలో పంట ఉత్పత్తులు సైతం చేతికి అందే సమయం ఉన్నప్పడు ఇంత ఎక్కువ ధరను కోట్ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు ఆ టెండర్‌ను రద్దు చేశారు. అలాగే ఈసారి కాంట్రాక్టర్ల మార్పుపైనా దృష్టి సారించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా ‘జెమ్’(గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్) నేషనల్ పోర్టల్ ద్వారా టెండర్లు పిలిచే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని... అప్పటివరకు పాత కాంట్రాక్టర్‌కే తాత్కాలికంగా సరఫరా బాధ్యత అప్పగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. -
‘విజయ’ పాలకు ఎసరు, అధికారుల తీరుపై విమర్శలు.. కావాలనే చేస్తున్నారా?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆధ్వర్యంలోని విజయ డెయిరీ పాల విక్రయాలపై కుట్ర జరుగుతోందా..?. అంగన్వాడీ కేంద్రాలకు విజయ పాలు సరఫరా కాకుండా అధికారులే అడ్డుపడుతున్నారా.. ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనాల్సి వస్తోంది. విజయ డెయిరీకి టెండర్ దక్కకుండా అధికారులే నిబంధనలు రూపొందించారన్న ఆరోపణలు వస్తున్నాయి. అంగన్ వాడీ కేంద్రాలకు పాల సరఫరా కోసం ఇటీవల ఐసీడీఎస్ ఆధ్వర్యంలో టెండర్లు ఆహా్వనించారు. కేవలం కర్ణాటక, గుజరాత్‌లకు చెందిన డెయిరీలకే టెండర్ దక్కేలా నిబంధనలు రూపొందించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి నోడల్ ఏజెన్సీగా ఉన్న హాకా ఆయా టెండర్లు పిలవాల్సి ఉండగా, దాన్ని పక్కనపెట్టి ఐసీడీఎస్ ద్వారా టెండర్లు పిలవడంపై కూడా వివాదం రేగుతోంది. ఏడాదికి 3 కోట్ల లీటర్ల విజయ పాలకు ఎసరు రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వాటిల్లో 4.57 లక్షల మంది గర్భిణీలు, బాలింతలు ఉన్నారు. 10.34 లక్షల మంది ఏడాది నుంచి నుంచి 3 ఏళ్లలోపు పిల్లలు, 6.67 లక్షలు 3 ఏళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు లబ్ది పొందుతున్నారు. వీరికి ప్రభుత్వం తరపున పాలు అందజేస్తారు. ఒక్కో తల్లికి 200 మిల్లీలీటర్ల పాలు అందజేస్తారు. అందుకోసం ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు పాలు సరఫరా చేస్తుంది. ఏడాదికి అంగన్వాడీ కేంద్రాలకు దాదాపు 3 కోట్ల లీటర్ల టెట్రాప్యాక్ పాలు సరఫరా చేస్తున్నారు. ఈ పాలను రాష్ట్రంలోని విజయ డెయిరీ వంటి సహకార డెయిరీల నుంచి సరఫరా చేయాలని నిర్ణయించారు. వాటికే ప్రాధాన్యం ఇవ్వాలని గతంలో ప్రభుత్వ జీవోలో స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు నిబంధనలు మార్చడంతో విజయ డెయిరీకి భారీగా నష్టం వాటిల్లనుంది. దాదాపు రూ.120 కోట్ల విలువైన వ్యాపారానికి గండిపడుతుందనే చెప్పాలి. సామర్ధ్యానికి మించి నిబంధనలు... 20 రోజుల క్రితం హాకా ఆధ్వర్యంలో టెండర్లు పిలిచారు. అప్పుడు సింగిల్ టెండరే వచ్చింది. దీంతో మళ్లీ టెండర్లు వేయాలనుకున్నారు. కానీ ఈసారి హాకాను పక్కనపెట్టి ఐసీడీఎస్ వర్గాలు టెండర్లకు వెళ్లాయి. విజయ డెయిరీ టెట్రాప్యాక్ పాల సామర్థ్యం రోజుకు 50 వేల లీటర్లు కాగా, టెండర్లో 3 లక్షల లీటర్ల సామర్థ్యం ఉండాలని పొందుపరిచారు. అలాగే గత మూడేళ్లలో ఏదో ఒక ఏడాది 1.5 కోట్ల లీటర్ల టెట్రాప్యాక్‌లు సరఫరా చేసిన సామర్థ్యం ఉండాలన్న నిబంధనను కూడా విధించారు. ఈ సామర్థ్యం కూడా విజయ డెయిరీకి లేదు. గతంలో ఇలాంటి నిబంధనలను విధించలేదు. కేవలం కర్ణాటక, గుజరాత్‌కు చెందిన డెయిరీలకే అనుకూలంగా నిబంధనలు ఉన్నాయని చెబుుతు న్నారు. ఈ నెల 20వ తేదీన టెండర్ దా ఖలుకు చివరి తేదీ కాగా, నిబంధనలు ఎలా ఉన్నా టెండర్లు వేస్తామని విజయ డెయిరీ వర్గాలు వెల్లడించాయి. -
అంగన్వాడీల్లో 243 పోస్టులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో 243 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 61 చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీవో), అసిస్టెంట్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఏసీడీపీవో), మహిళా–శిశు సంక్షేమ అధికారి, రీజినల్ మేనేజర్ పోస్టులు, 161 గ్రేడ్–1 సూపర్వైజర్ పోస్టులు, 21 శిశు సంరక్షణ కేంద్రాల సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. (చదవండి: ఈఏపీసెట్‌లో ‘ఇంటర్’కు వెయిటేజీ) -
అంగన్వాడీ కేంద్రాల్లో ICDS అధికారుల దందా
-
Fact Check: ‘అంగన్వాడీ’లకు ఫిబ్రవరి వరకు జీతాలిచ్చాం
సాక్షి, అమరావతి: అంగన్వాడీ కార్యకర్తలకు నాలుగు నెలలుగా జీతాలు చెల్లించడంలేదంటూ ‘ఈనాడు’ రాసిన కథనం పూర్తిగా అవాస్తవమని మహిళా, అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సంచాలకుడు బి.రవిప్రకాశ్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వాస్తవాలను వివరిస్తూ ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు ఈ ఏడాది ఫిబ్రవరి వరకు జీతాలు చెల్లించామని వివరించారు. ఎవరికీ ఎటువంటి వేతన బకాయిలు లేవన్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు గౌరవ వేతనం కింద ఇప్పటివరకు రూ.1,019 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అంతేకాకుండా అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వ కార్యక్రమాలను పూర్తిగా అమలు చేసిన కార్యకర్తలకు ప్రోత్సాహకంగా నెలకు రూ.500 చొప్పున అందిస్తున్నామన్నారు. ఇందుకోసం 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.27.80 కోట్లు విడుదల చేసినట్టు రవిప్రకాశ్‌రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం కంటే అధికంగా.. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు గత ప్రభుత్వం కంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అత్యధిక గౌరవ వేతనం ఇస్తోంది. గత ప్రభుత్వం ఐదేళ్లలో గౌరవ వేతనంగా మొత్తం రూ.2,864.94 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు రూ.4,234.93 కోట్లకు పైగా వేతనాల కోసం వెచ్చించింది. అంతేకాకుండా అధికారంలోకి రాగానే అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు వేతనాలు పెంచింది. ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ.11,500, ఆయాలకు నెలకు రూ.7,000 చొప్పున అందిస్తోంది. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు ప్రభుత్వం కల్పించిన ప్రయోజనాలు ఇవి.. రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలు, సహాయకులకు ప్రభుత్వం అనేక ప్రయోజనాలు కల్పించింది. సెలవులు: అంగన్వాడీ కేంద్రాల సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చి పర్యవేక్షించడంతోపాటు కార్యకర్తలు, సహాయకులకు ఏడాదికి 20 రోజుల వార్షిక సెలవులను ప్రభుత్వం ఇస్తోంది. గరిష్టంగా రెండు పర్యాయాలు 180 రోజులపాటు ప్రసూతి సెలవులు మంజూరు చేస్తోంది. గర్భస్రావం జరిగినప్పుడు 45 రోజులు సెలవు ఇస్తోంది. ఏటా అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు 15 రోజులు వేసవి సెలవులు మంజూరు చేస్తోంది. చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ పదోన్నతులు: అర్హులైన అంగన్వాడీ వర్కర్లను సూపర్వైజర్ గ్రేడ్–2 పోస్టుల్లో నియమిస్తున్నారు. పరీక్ష ద్వారా 100 శాతం కోటాతో భర్తీ చేస్తున్నారు. అలాగే విస్తరణ అధికారి, గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి వయోపరిమితి 50 ఏళ్ల వరకు ఉండొచ్చని వెసులుబాటు కల్పిస్తూ 2021 డిసెంబర్లో ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల పదోన్నతులకు వయోపరిమితిని 45 ఏళ్లకు పెంచింది. బీమాతో ధీమా: ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) ద్వారా 18 నుంచి 50 ఏళ్ల వయసు గల అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు రూ.2 లక్షల జీవిత బీమా సదుపాయం ఉంది. ఏదైనా కారణం వల్ల ప్రాణాపాయం, మరణం సంభవించినప్పుడు ఇది వర్తిస్తుంది. అలాగే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీఐ) కింద 18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న కార్యకర్తలు, సహాయకులకు ప్రమాద మరణానికి, శాశ్వత వైకల్యానికి రూ.2 లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ.లక్ష బీమా వర్తిస్తుంది. అంగన్వాడీ కార్యకర్త బీమా యోజన (ఏకేబీవై) కింద 51 నుంచి 59 ఏళ్ల వయసు గల కార్యకర్తలు, సహాయకులు మరణిస్తే రూ.30 వేలు బీమా వస్తుంది. పదవీ విరమణ ప్రయోజనాలు: అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు గరిష్టంగా 60 ఏళ్లు వచ్చే వరకు పనిచేయవచ్చు. 60 ఏళ్ల తర్వాత పదవీ విరమణ చేసే కార్యకర్తలకు రూ.50 వేలు, సహాయకులకు రూ.20 వేలు ప్రభుత్వం అందిస్తుంది. -
అంగన్వాడీల్లో ‘మునగ’ మెనూ
సాక్షి, అమరావతి: పోషక విలువలు అత్యధికంగా ఉండే మునగను ఆహారంలో తీసుకోవడం ద్వారా చేకూరే లాభాలను వివరిస్తూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. ప్రతి అంగన్వాడీ కేంద్రం ఆవరణలో, ఇళ్ల వద్ద మునగ చెట్ల పెంపకం చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. మునగ చెట్లను పెంచి వాటి నుంచి సేకరించిన ఆకును వారంలో రెండు రోజులపాటు అంగన్వాడీ మెనూలో చేర్చారు. మునగ ఆకు పప్పు, మునగాకు కూర ఇలా ఏదో ఒక రూపంలో అందిస్తుండటంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు విలువైన పౌష్టికాహారం అందుతోంది. మునగాకుతో మేలు ఇలా.. మునగ ఆకు ద్వారా లభించే ఐరన్ గర్భిణులు, బాలింతల్లో రక్త హీనత నివారించేందుకు దోహదం చేస్తుంది. మునగ ఆకులో ఉండే విటమిన్ ఏ కారణంగా కంటిచూపు మెరుగు పడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్, కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉండే మునగ ఆకు గర్భిణుల్లో పిండం ఆరోగ్యంగా ఎదిగేందుకు దోహదం చేయడంతోపాటు సుఖ ప్రసవం జరిగేలా ఉపకరిస్తుంది. బాలింతల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. మునగ ఆకును ఆహారంలో తీసుకోవడం వల్ల మంచి కొవ్వు పెరుగుతుంది. థైరాయిడ్ లాంటి అనేక సమస్యలు దరి చేరకుండా చేస్తుంది. వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా.. రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందచేస్తోంది. గర్భిణులు, బాలింతలు, మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు కలిపి దాదాపు 36 లక్షల మందికి అంగన్వాడీల ద్వారా మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు రోజూ తల్లులకు 200 మిల్లీ లీటర్లు, పిల్లలకు 100 మిల్లీ లీటర్ల చొప్పున పాలు అందిస్తున్నారు. మునగ పొడితో మొదటి ముద్ద అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారాన్ని అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ఆదేశాల మేరకు ప్రయోగాత్మకంగా 1,475 అంగన్వాడీల్లో మునగ చెట్ల పెంపకం చేపట్టాం. వారంలో రెండు రోజులపాటు మునగ ఆకుతో చేసిన కూర, పప్పు అందిస్తున్నాం. గర్భిణులు, బాలింతలు ప్రతి రోజూ ఆహారంలో మొదటి ముద్ద మునగ ఆకు పొడితో తీసుకునేలా ప్రోత్సహిస్తున్నాం. –ఉమాదేవి, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్, ఎన్టీఆర్ జిల్లా. -
ఆధునిక అంగన్వాడీలు
అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో బలహీన వర్గాలకు చెందిన పిల్లలే అధికంగా ఉంటారు. ఆ చిన్నారులకు తోడుగా నిలబడాల్సిన బాధ్యత మనపై ఉంది. వారి పట్ల సానుకూల ధృక్పథంతో పని చేయాలి. 10 – 12 ఏళ్ల వయస్సులో మంచి బోధన అందించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. నాడు–నేడు ద్వారా మౌలిక వసతులు కల్పించి అంగన్వాడీలను ఆధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ.1,500 కోట్లు ఖర్చు చేస్తోందని గుర్తు చేస్తూ మూడు విడతల్లో ఈ పనులను పూర్తి చేయాలని నిర్దేశించారు. పనుల్లో నాణ్యత ఉండాలని, ప్రతి మండలంలోనూ జరిగేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అంగన్వాడీల్లో టీచింగ్ క్వాలిటీపై మరింత దృష్టి సారించడంతోపాటు మాంటెస్సొరీ తరహా విద్యా విధానంపై అధ్యయనం చేయాలని సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో ఖాళీ పోస్టుల భర్తీతో పాటు పదోన్నతుల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. 63 సీడీపీవో పోస్టుల భర్తీకి అనుమతిస్తూ వీలైనంత త్వరగా వీటిని భర్తీ చేయాలని సూచించారు. విద్య, వ్యవసాయం, వైద్య ఆరోగ్య రంగాల తరహాలో మహిళా శిశు సంక్షేమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా చేపట్టిందన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్ మంగళవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ.. సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమగ్ర పర్యవేక్షణ అంగన్వాడీ కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణతో చిన్నారులకు ఆహ్లాదకరమైన మంచి వాతావరణాన్ని అందించాలి. అంగన్వాడీల ద్వారా అందించే పాలు, గుడ్లు పంపిణీలో ఎలాంటి సమస్యలు ఉండకూడదు. పంపిణీపై సమగ్ర పర్యవేక్షణ, పరిశీలన ఉండాలి. ఇందుకోసం టెక్నాలజీని వినియోగించుకుంటూ ఎస్‌వోపీలు రూపొందించుకోవాలి. ఆహారం పంపిణీలో ఎక్కడైనా లోపాలు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. సూపర్వైజర్లపై కూడా పర్యవేక్షణ ఉండాలి. ఫ్లేవర్డ్ మిల్క్ పంపిణీ అంగన్వాడీ కేంద్రాల్లో నూటికి నూరుశాతం పిల్లలకు పాల పంపిణీ జరగాలి. పిల్లలకు ఫ్లే్లవర్డ్ పాల పంపిణీని పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలి. మూడు నెలల తర్వాత రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు పూర్తిస్థాయిలో ఫ్లే్లవర్డ్ మిల్క్ పంపిణీ కావాలి. ఈ మేరకు షెడ్యూల్ రూపొందించుకోవాలి. అంగన్వాడీలలో బోధనపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆహ్లాదకరంగా ఉత్తమ బోధనా విధానాలను అందుబాటులోకి తేవాలి. స్మార్ట్ టీవీల ద్వారా డిజిటల్ పద్ధతుల్లో బోధనపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. విలేజ్, వార్డు క్లినిక్స్ సేవలు అంగన్వాడీల్లో పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటూ విలేజ్, వార్డు క్లినిక్స్ ద్వారా పర్యవేక్షణ చేపట్టాలి. చిన్నారులకు వైద్యపరంగా ఎలాంటి చికిత్స అవసరమైనా ఆరోగ్యశ్రీ వినియోగించుకుని మెరుగైన వైద్యం అందచేయాలి. ఎవరైనా తల్లీబిడ్డలు రక్తహీనత, పౌష్టికాహార లోపం లాంటి సమస్యలతో బాధపడుతుంటే నివారించేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలి. ఈ విషయంలో అంగన్వాడీలు, విలేజ్ క్లినిక్స్, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పని చేయాలి. రక్తహీనత, పౌష్టికాహారలోపం లాంటి సమస్యలు ఉన్నవారికి అందరితోపాటు ఇచ్చే ఆహారం, మందులు కాకుండా అదనంగా అందించి ఆరోగ్యం మెరుగుపడేలా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. దీనిపై సమగ్ర ఎస్‌వోపీలు రూపొందించుకోవాలి. ఈ విధానాన్ని ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలులోకి తెచ్చి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో పరిష్కారం చూపించాలి. తల్లులకు టేక్ హోం రేషన్ విధానాన్ని లోపాలకు తావులేకుండా అమలు చేయాలి. సమీక్షలో మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ బాబు.ఎ, పాఠశాల మౌలిక వసతుల శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, పౌర సరఫరాల శాఖ ఎండీ జి.వీరపాండ్యన్, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ ఎ.సిరి, మార్క్‌ఫెడ్ ఎండీ రాహుల్ పాండే తదితరులు పాల్గొన్నారు. -
పాలు ఎందుకు ఇవ్వడం లేదు?
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాలకు పాల సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో ‘మూడు నెలలుగా పాలు లేవ్’అనే శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన కథనంపై రాష్ట్ర గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. గురువారం ఉదయం ఆ శాఖ ఉన్నతాధికారులతో ఆమె ప్రత్యేకంగా సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాలకు మూడు నెలలుగా పాల సరఫరా నిలిచినందుకు గల కారణాలపై ఆరా తీశారు. పాల పంపిణీ నిలిచిపోవడంతో పిల్లలకు పౌష్టికలోపాలను అధిగమించే కార్యక్రమం నీరుగారుతుందని చెబుతూ.. తక్షణమే పాల సరఫరా పునరుద్ధరించాలని ఆమె ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, టెండరు ఖరారు, కాంట్రాక్టరు ఎంపిక అయ్యే వరకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అందుకే పాలు సరఫరా చేయలేకపోయాం... కేఎంఎఫ్ వివరణ ఊహించని పరిణామాలు చోటుచేసుకోవడం వల్లే అంగన్వాడీ కేంద్రాలకు పాలు పంపిణీ నిలిచిపోయిందని కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్(కేఎంఎఫ్) లిమిటెడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. అంగన్వాడీ కేంద్రాలకు పాల సరఫరా కాంట్రాక్టు దక్కించుకున్న తమ సంస్థ గతేడాది సెప్టెంబర్ నెల వరకు పూర్తిస్థాయిలో పక్కాగా సరఫరా చేసినట్లు వివరించింది. గతేడాది సెప్టెంబర్‌తో కాంట్రాక్టు ముగిసిందని, కానీ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ వాఖ ప్రత్యేక ఆదేశాలతో పాల పంపిణీ కొనసాగించాలని నిర్ణయించినట్లు వివరించింది. కానీ పాడి పశువులు పెద్ద సంఖ్యలో లంపిస్కిన్ వ్యాధి బారిన పడడంతో పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయిందని, దానికితోడు గత నవంబర్, డిసెంబర్లలో తీవ్ర వర్షాలు కురవడంతో పాల రవాణా పడిపోయిందని, దీంతో పాల కేంద్రాలకు కోటా రాలేదని వివరించింది. త్వరలోనే పాల పంపిణీకి చర్యలు తీసుకుంటామని కేఎంఎఫ్ వివరించింది. -
Telangana: మూడు నెలలుగా పాలు లేవ్..
వికారాబాద్‌లోని గరీబ్‌నగర్ అంగన్వాడీ కేంద్రంలో భోజనం చేస్తున్న చిన్నారులు వీరు. ఇక్కడ రెండున్నర నెలలుగా చిన్నారులతోపాటు గర్భిణులు, బాలింతలకు పాలు ఇవ్వడం లేదు. ఇదేమిటని అడిగితే పాలు అసలే రావడం లేదని నిర్వాహకులు చెప్తున్నారని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీల్లో పంపిణీ చేసే పౌష్టికాహారం సరఫరాపై రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ చేతులెత్తేసింది. దాదాపు మూడు నెలలుగా ఈ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పాలు అందడం లేదు. అంగన్వాడీల్లో నమోదైన చిన్నారులకు రోజుకు 100 మిల్లీలీటర్లు.. గర్భిణులు, బాలింతలకు రోజుకు 200 మిల్లీలీటర్ల చొప్పున పాలు సరఫరా చేయాల్సి ఉంది. వీటిని టెట్రా ప్యాకెట్ల రూపంలో లబ్ధిదారులకు అందిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ నెలాఖరుతో అంగన్వాడీ కేంద్రాలకు పాల సరఫరా కాంట్రాక్టు ముగిసింది. ఇప్పటివరకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కొత్త కాంట్రాక్టరు ఎంపిక టెండరు ఖరారు చేయలేదు. కనీసం పాత కాంట్రాక్టర్‌కే తాత్కాలికంగా పాల పంపిణీ బాధ్యతలనూ అప్పగించలేదు. క్షేత్రస్థాయిలో లబ్ధిదారులు పాలు అందించడం లేదేమిటంటూ అంగన్వాడీ టీచర్లు, ఆయాలను నిలదీస్తున్నారు. పాల బడ్జెట్ ఏటా రూ.100 కోట్లు పిల్లలు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపాన్ని అధిగమించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పాల పంపిణీ కోసం ఏటా దాదాపు రూ.100 కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రతినెలా సగటున 18.5 లక్షల లీటర్ల పాలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఒక్కో లీటరు పాలకు సగటున రూ.43, ప్యాకింగ్, రవాణా చార్జీ కింద మరో రూ.9 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థకు చెల్లిస్తోంది. ఇంత కీలకమైన, ప్రయోజనకరమైన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాల్సిన రాష్ట్ర మహిళాశిశు సంక్షేమశాఖ నిర్లక్ష్యంతో పాల పంపిణీ నిలిచిపోయింది. మూడు నెలలుగా అందక.. కాంట్రాక్టు గడువు ముగిసే క్రమంలో సదరు సంస్థ అన్ని కేంద్రాలకు పాలు పంపిణీ చేసి ఆపేసింది. ఆ స్టాకు అందుబాటులో ఉన్నంత వరకు దాదాపు అక్టోబర్ రెండో వారం వరకు అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు పాల ప్యాకెట్లను లబ్ధిదారులకు సర్దుబాటు చేశారు. తర్వాత పంపిణీ నిలిచిపోయింది. 3 నెలలుగా పాలు అందకపోవడంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనితో కాంట్రాక్టరే పాలు సరఫరా చేయడం లేదంటూ లబ్ధిదారులకు చెప్తున్నట్టు తెలిసింది. దీనిపై అధికారులను అడిగితే.. త్వరలో టెండర్లు ఖరారవుతాయని, పాల పంపిణీ మొదలవుతుందని చెప్తుండటం గమనార్హం. -
అంగన్వాడీ సెంటర్లో ఆమ్లెట్ దొంగలు!
సాక్షి, కొమరంభీం ఆసిఫాబాద్: జిల్లాలోని తిర్యాణి మండలం పరిధిలోని ఓ అంగన్వాడీ సెంటర్లో ‘ఆమ్లెట్ దొంగలు’ హల్ చేశారు. గంభీరావుపేట్ గ్రామపంచాయతీలోని అంగన్వాడీ కేంద్రంలో వీరంగం సృష్టించారు. అంగన్వాడీ కేంద్రానికి ఉన్న తాళాన్ని పలగొట్టి కేంద్రం లోపలికి ప్రవేశించి.. అక్కడే ఉన్న గుడ్లను, వంట పాత్రలు ఉపయోగించి ఉపయోగించి ఆమ్లెట్లు వేసుకున్నారు. గర్భిణీలకు, పిల్లలకు పౌష్టికాహారంలో భాగంగా ఇచ్చే గుడ్లను వాడేశారు. ఈ తరుణంలో నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని.. ఆ ఆగంతకులను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇది తాగుబోతుల పనేనని గ్రామస్తులు భావిస్తున్నారు. -
అంగన్వాడీలను తీర్చిదిద్దాలి
పిల్లలు చిన్న వయసులోనే ఏ విషయాన్ని అయినా త్వరగా గ్రహించగలుగుతారు. అందువల్ల అంగన్వాడీల నుంచే వారికి భాషపై గట్టి పునాది అందించాలి. అంటే అభ్యాస సామర్థ్యం (లర్నింగ్ ఎబిలిటీ) పొంపొందించుకునేలా మాంటిస్సోరీ విధానంతో కూడిన కరికులమ్ (బోధనాంశం) అందుబాటులోకి తేవాలి. అప్పుడే వారి మెదడు పరిణతి చెందుతుంది. చాలా విషయాలపై మంచి అవగాహన ఏర్పడుతుంది. ఇందుకు అవసరమైతే ప్రత్యేక అధికారిని నియమించాలి. ఈ మార్పుల కోసం అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలి. నాడు–నేడు కింద చేపడుతున్న పనులను వేగవంతం చేసి, సకాలంలో పూర్తి చేయాలి. ఈ దిశగా ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: అంగన్వాడీ కేంద్రాలను అన్ని సౌకర్యాలతో అద్భుతంగా తీర్చిదిద్దాలని, ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు తనిఖీలు, నాణ్యత, నాడు–నేడు పనుల పురోగతి వంటి అంశాలకు సంబంధించి కచ్చితమైన మార్పు కనిపించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యం, గృహ నిర్మాణం, మహిళా శిశు సంక్షేమ శాఖలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, వీటిలో మార్పు కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని స్పష్టం చేశారు. సిబ్బంది నియామకాలతోపాటు ఎలాంటి సహకారం అవసరమైనా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు తగ్గట్టుగానే ఫలితాలు కూడా రావాల్సి ఉందన్నారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూపర్వైజర్స్ సక్రమంగా పనిచేస్తే అంగన్వాడీల పనితీరు మెరుగు పడటంతోపాటు నాణ్యత కూడా పెరుగుతుందన్నారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన సూపర్వైజర్ల సహాయంతో అంగన్వాడీ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని సూచించారు. సూపర్వైజర్ల పనితీరుపైనా తనిఖీలు ఉండాలని చెప్పారు. అంగన్వాడీలలో చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారంతో పాటు, మంచి వాతావరణాన్ని కల్పించడం ముఖ్యం అన్నారు. సార్టెక్స్ బియ్యం సరఫరా చేయాలని, న్యూట్రిషన్ కిట్ సరఫరాలో నాణ్యత విషయంలో అస్సలు రాజీ పడొద్దని ఆదేశించారు. పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాలు అన్నింటిలోనూ నాణ్యత పెరగాలని, ఆ ఫలితాలు కనిపించాలని చెప్పారు. గతంలో కన్నా పిల్లలకు మంచి చేస్తున్నామన్న సంతృప్తి కలగాలని, ఇందు కోసం కావాల్సిన వసతులు, సదుపాయాలు పూర్తిగా కల్పించాలని స్పష్టం చేశారు. క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖాళీలు భర్తీ చేయండి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 61 సీడీపీఓ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటితో పాటు ఇంకా ఖాళీగా ఉన్న పోస్టులను సైతం వెంటనే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఏపీపీఎస్సీ ద్వారా సీడీపీఓ నియామకాలు చేపడతామని అధికారులు తెలిపారు. గత సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమీక్షలో రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, మహిళ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, పాఠశాల విద్యా శాఖ (మౌలిక సదుపాయాలు) కమిషనర్ కాటమనేని భాస్కర్, మహిళ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎ.సిరి, పౌర సరఫరాల శాఖ ఎండీ జి.వీరపాండ్యన్, మార్క్‌ఫెడ్ ఎండీ రాహుల్ పాండే తదతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
Telangana: అంగన్వాడీ పోస్టుల భర్తీలో గోల్మాల్.. ఈ ప్రశ్నలకు బదులేది?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో నిబంధనలు పాటించకుండా అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోస్టర్ పాటింపులో గందరగోళం తలెత్తిందని, మరోవైపు ఇన్స్ట్రక్టర్లకు రిజర్వ్ చేసిన పోస్టులను ఇతరులతో భర్తీ చేశారని, దివ్యాంగుల కోటాలోనూ అనర్హులను ఎంపిక చేశారంటూ అభ్యర్థులు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ ఎదుట నిరసనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇతరుల ప్రవేశానికి అనుమతి ఇవ్వకుండా కమిషనరేట్ అధికారులు సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. 434 పోస్టులకి వేలల్లో దరఖాస్తులు ►రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో 434 గ్రేడ్–2 సూపర్వైజర్(ఎక్స్టెన్షన్ ఆఫీసర్) పోస్టులకు గతేడాది సెప్టెంబర్ 30న ఆ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులను కొత్త వారితో కాకుండా ఇప్పటికే అంగన్వాడీల్లో టీచర్లుగా పనిచేస్తూ పదేళ్ల అనుభవం ఉండి పదోతరగతి ఉత్తీర్ణులైన వారికి అవకాశం కల్పించింది. ఈ పోస్టుల్లో 5 శాతం కోటాను అంగన్వాడీ ట్రైనింగ్ సెంటర్లు, మిడిల్ లెవల్ ట్రైనింగ్ సెంటర్లో పనిచేస్తున్న కోఆర్డినేటర్లు/ఇన్స్ట్రక్టర్లకు రిజర్వ్ చేయగా... మరో 15 శాతం మార్కులను ఇప్పటికే కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న సూపర్వైజర్లకు కేటాయించింది. కానీ కాంట్రా క్టు సూపర్వైజర్ ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరించడంతో వారంతా ఈ నోటిఫికేషన్ పరిధిలోకి రాకుండానే ప్రభుత్వ కొలువుల్లో చేరిపోయారు. ఇక నోటిఫికేషన్ వెలువడిన క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 23వేల మంది అంగన్వాడీ టీచర్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈ ఏడాది జనవరి రెండో తేదీన అర్హత పరీక్ష నిర్వహించిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ... ఫిబ్రవరిలో ఫలితాలను ప్రకటించింది. ఆ తర్వాత మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాలను రూపొందించి ప్రాథమిక అర్హుల జాబితా అనంతరం... ఇటీవల తుది జాబితాను విడుదల చేసి వారికి పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే తుది జాబితాలో నిబంధనలు పాటించకుండా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన తీరుపై విమర్శలు చెలరేగుతున్నాయి. ►మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో మొత్తం 434 పోస్టులకు హైదరాబాద్, వరంగల్ రీజియన్లు వేరువేరుగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. మొత్తం పోస్టుల్లో 427 పోస్టులు భర్తీ అయ్యాయి. 7 పోస్టులకు అభ్యర్థులు లేకపోవడంతో ఖాళీగా ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. భర్తీ చేసిన 427 పోస్టుల్లో 15 మంది ఇన్స్ట్రక్టర్లకు అవకాశం కల్పించారు. ►5 శాతం పోస్టులను ఇన్స్ట్రక్టర్లు/కోఆర్డినేటర్లకు అవకాశం కల్పిస్తున్నట్లు నోటిఫికేషన్లో ప్రకటించారు. ఈ క్రమంలో సగటున 22 పోస్టులు ఇన్స్ట్రక్టర్లు/కోఆర్డినేటర్లకు దక్కాల్సి ఉండగా... కేవలం 15 పోస్టులతోనే సరిపెట్టారు. అయితే రిజర్వ్ చేసిన పోస్టులను కమ్యూనిటీ రిజర్వేషన్లతో భర్తీ చేయడం.. పలు అనుమానాలకు తావిచ్చినట్లయింది. ►కొన్నిచోట్ల కమ్యూనిటీ రిజర్వేషన్ల వారీగా మెరిట్‌ను పరిశీలిస్తే తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థి అర్హత సాధించగా... అదే కేటగిరీకి చెందిన మరో అభ్యర్థికి ఎక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగం రాలేదు. ఉదాహరణకు జోన్–7 పరిధిలో ఎస్సీ కేటగిరీకి చెందిన అభ్యర్థికి 10.125 మార్కులు వచ్చినప్పటికీ ఉద్యోగం వచ్చింది. కానీ అదే ఎస్సీ కేటగిరీకి చెందిన అభ్యర్థికి 13.125 మార్కులు వచ్చినా కొలువు దక్కలేదు. ►ఇక ఖమ్మం జిల్లాలోని ఓ అభ్యర్థి దరఖాస్తులో వైకల్యం లేదని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ సదరు అభ్యర్థికి దివ్యాంగుల కోటాలో ఉద్యోగం దక్కింది. వాస్తవానికి వైకల్యం ఉన్న అభ్యర్థికి కొలువు రాలేదు. మహబూబ్‌నగర్, వికారాబాద్ తదితర జిల్లాల్లో కూడా దివ్యాంగులైన అభ్యర్థులకు అవకాశం రాలేదంటూ లబోదిబోమంటున్నారు. ►కాగా నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగానే పోస్టుల భర్తీ జరిగిందని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
ఎస్సీలకు సాయంలో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి: ఎస్సీ కుటుంబాలకు సహాయం అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్ని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక స్పష్టం చేసింది. 2021–22 ఆర్థిక ఏడాదిలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ పథకాలు, కార్యక్రమాల అమలు పురోగతిపై కేంద్రం విశ్లేషణాత్మక నివేదికను విడుదల చేసింది. లక్ష్యాల కన్నా 90 శాతంపైగా అమలు చేసిన రాష్ట్రాల పనితీరు చాలా బాగుందని, లక్ష్యాల కన్నా 80 శాతం లోపు ఉంటే ఆ రాష్ట్రాల పనితీరు బాగోలేదని నివేదిక విశ్లేషించింది. ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా దేశంలోని 20 రాష్ట్రాల్లో 37,64,308 ఎస్సీ కుటుంబాలకు సహాయం అందించగా, ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 35,92,860 ఎస్సీ కుటుంబాలకు సహాయం అందిందని నివేదిక స్పష్టం చేసింది. మరే రాష్ట్రం కనీసం లక్ష మంది ఎస్సీ కుటుంబాలకు కూడా సహాయం అందించలేదని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ తర్వాత అత్యధికంగా తమిళనాడులో 29,706 ఎస్సీ కుటుంబాలకు సహాయం అందిందని నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే.. స్వయం సహాయక సంఘాలకు భరోసా ► 2021–22 ఆర్థిక ఏడాదిలో లక్ష్యానికి మించి 8,336 శాతం మేర కొత్తగా మహిళా స్వయం సహాయక సంఘాలను ఆంధ్రప్రదేశ్ ప్రోత్సహించింది. దేశ వ్యాప్తంగా 12.41 లక్షల సంఘాలను కొత్తగా ప్రోత్సహిస్తే, అందులో 8.54 లక్షలు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. ► ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లో1.46 లక్షలు, ఇతర రాష్ట్రాలు వేల సంఖ్యలో కొత్త సంఘాలను ప్రోత్సహించాయి. రాజస్థాన్‌లో 48,979, గుజరాత్లో 38,028, ఛత్తీస్‌గఢ్‌లో 25,427, ఒడిశాలో 37,777 సంఘాలను ప్రోత్సహించారు. ► ఏపీలో 55,607 అంగన్వాడీ కేంద్రాలు నూటికి నూరు శాతం మంచి పనీతీరు కనపరిచాయి. 257 ఐసీడీఎస్ బ్లాక్‌లు (సమగ్ర శిశు అభివృద్ధి కేంద్రాలు) వంద శాతం బాగా పని చేశాయి. వ్యవసాయ పంపు సెట్లకు లక్ష్యానికి మించి 272 శాతం విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. ► 2021–22 ఆర్థిక ఏడాదిలో 24,852 పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలన్నది లక్ష్యం కాగా, ఏకంగా 67,506 పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. పీఎంజీఎస్‌వై కింద రాష్ట్రంలో 1,241 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారుల నిర్మాణం చేపట్టారు. -
Anganwadi teacher: చిరుద్యోగి పెద్ద మనసు
సేవ చేయడానికి ధనవంతులే కానక్కర్లేదు. నలుగురికి సేవ చేసే భాగ్యం లభించడం కూడా అదృష్టమే! ఇదే విషయాన్ని తన చేతల ద్వారా నిరూపిస్తోంది తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో పదేళ్ల నుంచి అంగన్వాడీ టీచర్‌గా పనిచే స్తున్న ఉమర్ సుల్తానా. తన సంపాదనలో సగ భాగం సేవా కార్యక్రమాలకే ఉపయోగిస్తూ చుట్టూ ఉన్నవారికి ఆదర్శంగా నిలుస్తున్న సుల్తానా గురించి.. మహ్మద్ ఉమర్ సుల్తానా ఓ సాధారణ అంగన్వాడి టీచర్. పదేళ్లుగా విధులను నిర్వర్తిస్తోంది. ఉన్న ఊళ్లోనే కాదు, మండలంలోని మిగతా ఊళ్లలోనూ సుల్తానాకు మంచి పేరుంది. మా మనసున్న టీచరమ్మ అంటుంటారు స్థానికులు. ఏ ఆధారం లేనివారికి ఓ దారి చూపడమే కాదు ఏ ఆసరా లేదని కుంగిపోయేవారికి ధైర్యం చెబుతూ, అండగా నిలబడుతోంది. ‘మన మాట మంచిదయితే చాలు అందరూ మనవాళ్లే’ అంటుంది ఉమర్ సుల్తానా. దౌల్తాబాద్ మండల పరిధిలోని ఇందూప్రియాల్ గ్రామంలో సుల్తానా అంగన్వాడీ టీచర్‌గా విధులను నిర్వర్తిస్తుంటే ఆమె భర్త మహ్మద్ ఉమర్ గజ్వేల్‌లో ఓ మెకానిక్ షాపు నడిపిస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. వీరేమీ ధనవంతులు కాదు, కానీ ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు తమకు చేతనైన సాయం అందించడమే కర్తవ్యంగా భావిస్తారు. గ్రామం నుంచి మొదలు... దౌల్తాబాద్, రాయపోల్, మిరుదొడ్డి, దుబ్బాక, గజ్వేల్ మండలాలలో వందకు పైన బాధిత కుటుంబాలకు సాయం అందించింది సుల్తానా. కరోనా సమయంలో గ్రామంలోని నిరుపేదలకు నిత్యవసర సరుకులు అందజేసింది. జిల్లా వ్యాప్తంగా 108 సిబ్బంది అందిస్తున్న సేవలకు గాను వారికి సన్మానం చేసింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అత్యవసరమైన వస్తువులను అందజేస్తుంది. వివిధ రకాల కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన బాలికలకు నచ్చజెప్పి, వారి తల్లిదండ్రులను ఒప్పించి తిరిగి వారు బడిలో చేరేలా ప్రోత్సహిస్తుంది. బాలికలకు అవసరమైన పుస్తకాలు, యూనిఫారమ్ కొనిస్తుంది. రక్తదానం... అత్యవసర సమయంలో తన కుటుంబంలోని వారు రక్తదానం కూడా చేస్తుంటారు. లేదంటే, తెలిసిన మిత్రుల నుండి బాధితులకు సహాయం అందేలా చేస్తుంటారు. తాము సంపాదిస్తున్న కొద్ది మొత్తంలోనే సగ భాగాన్ని సమాజ సేవకు వినియోగిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ దంపతులు. సంపాదన కన్నా ఎప్పటికీ నిలిచి ఉండేది నలుగురికి ఉపయోగపడే పనే. పెద్ద మొత్తంలో డబ్బు సాయం చేయలేకున్నా, పిడికెడు ధైర్యం ఇవ్వగలిగితే చాలు అదే కొండంత అండ అనుకుంటాను. నా ఆలోచనలకు తగినట్టు నా భర్త కూడా సహకారం అందిస్తున్నారు. ఎంత సంపాదించినా రాని తృప్తి, నలుగురి కష్టాలను పంచుకోవడంలోనే ఉంటుంది. ఆ ఆలోచనతోనే మా జీవన ప్రయాణం కొనసాగిస్తున్నాము. – సుల్తానా, అంగన్వాడి టీచర్ ఆమె సాయం మరువలేనిది అనారోగ్య కారణంతో నా భర్త మరణించాడు. తట్టుకోలేక మా అత్తమ్మ తనువు చాలించింది. ముగ్గురు పిల్లలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న మాకు మొదటగా సాయం అందించింది సుల్తానా. ఆమె ముందుకు రావడంతో మరికొంతమంది మేమూ ఉన్నామని సాయంగా వచ్చారు. మాకు ఆమె ఇచ్చిన భరోసా కొండంత బలాన్ని ఇచ్చింది. కష్టకాలంలో మా కుటుంబానికి తోడుగా నిలిచింది. –షేక్ జానీ బి, సయ్యద్ నగర్ అమ్మలా తోడైంది అమ్మా నాన్నలను కోల్పోయి అనాథగా మిగిలిన నాకు ఒక అమ్మలా తోడైంది. నాలో బాధ పోయేవరకు రోజూ పలకరించింది. ఆమె అందించిన భరోసాతోనే ఇప్పుడు నా జీవితాన్ని నిలబెట్టుకోగలిగాను. – బండారు రేణుక, మంథూర్, రాయపోల్ మండలం – గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట -
అంగన్వాడీల్లో ‘స్మార్ట్’ సేవలు
సాక్షి, పుట్టపర్తి: అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో స్మార్ట్ సేవలకు శ్రీకారం చుట్టేందుకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పని చేసే కార్యకర్తలు, సూపర్వైజర్లకు స్మార్ట్ఫోన్లను అందిస్తున్నారు. త్వరలో అధికారికంగా ఈ సేవలను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. స్మార్ట్ సేవలతో అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలకు చెక్ పెట్టడంతో పాటు పాదర్శక సేవలు అందించేలా ప్రణాళికను సిద్ధం చేశారు. జిల్లాకు 2,863 స్మార్ట్ఫోన్ల పంపిణీ జిల్లా వ్యాప్తంగా ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టులకు గానూ 2,824 అంగన్వాడీ కేంద్రాలు (మినీ, మెయిన్) ఉన్నాయి. ఈ కేంద్రాల్లోని అంగన్వాడీ కార్యకర్తల పర్యవేక్షణకు గానూ 39 మంది సూపర్ వైజర్లు ఉన్నారు. అంగన్వాడీ సేవలను విస్తృతం చేయడంలో భాగంగా వీరందరికీ 2,863 స్మార్ట్ ఫోన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. విధి నిర్వహణలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న వివిధ రకాల సేవల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆ స్మార్ట్ ఫోన్ల ద్వారా ఫీడ్ చేసి ఉన్నతాధికారులకు పంపాల్సి ఉంటుంది. పక్కాగా పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు ప్రతి రోజూ మధ్యాహ్న భోజనంతో పాటు కోడిగుడ్లు తదితర పౌష్టికాహారాన్ని అందజేస్తారు. వీటి వివరాలను వైఎస్సార్ సంపూర్ణ పోషణ ట్రాక్ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. లబ్థిదారుల హాజరు, గృహ సందర్శన కార్యక్రమాల ద్వారా గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఐరన్ మాత్రల వినియోగంపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అదనంగా తీసుకోవాల్సిన ఆహారంపై కూడా చైతన్య పరచాల్సి ఉంటుంది. అలాగే పిల్లల బరువు, ఎత్తు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంటుంది. అంతేకాక రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు స్మార్ట్ ఫోన్ల విధానం ఎంతగానో దోహదపడుతుంది. పారదర్శక సేవలు అందుతాయి జిల్లా వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పారదర్శకమైన సేవలు అందుతున్నాయి. బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు ప్రతి రోజూ మెనూ ప్రకారం పౌష్టికాహారం అందుతోంది. ఐసీడీఎస్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నీ పక్కాగా అమలు చేస్తున్నాం. స్మార్ట్ ఫోన్ల మంజూరుతో అక్రమాలకు చెక్ పడటంతో పాటు పారదర్శక సేవలు అందుతాయి. – రెడ్డి రమణమ్మ, ఇన్చార్జి పీడీ, ఐసీడీఎస్ (చదవండి: సెల్ఫీల కోసం వచ్చావా.. బాలయ్యా! ) -
అంగన్వాడీల్లో ఇక స్మార్ట్ సేవలు
కడప కోటిరెడ్డిసర్కిల్ : పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాలలో స్మార్ట్ సేవలకు శ్రీకారం చుట్టేందుకు స్త్రీ శిశు సంక్షేమశాఖ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లకు సెల్ఫోన్లను అందిస్తున్నారు. అయితే త్వరలో అధికారికంగా స్మార్ట్ ఫోన్ల సేవల కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ స్మార్ట్ సేవలతో అంగన్వాడీ కేంద్రాలలో అక్రమాలకు చెక్ పెట్టడంతోపాటు పారదర్శకంగా సేవలు అందించేలా ప్రణాళికను సిద్ధం చేశారు. 1.57 లక్షల మందికి పౌష్టికాహారం జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా అందులో అంగన్వాడీ కేంద్రాలు, మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు 2212, మినీ అంగన్వాడీ కేంద్రాలు 177 కలిసి మొత్తం 2389 కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 1,57,015 లక్షల మందికి పైగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు రోజూ పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. మధ్యాహ్న భోజనంతోపాటు కోడిగుడ్లు, ఇతర పౌష్టికాహారాన్ని పంపిణీ చేసి పేద, మధ్య తరగతి చిన్నారులు, మహిళల్లో రక్తహీనత తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం ప్రతి బడ్జెట్లో కోట్లాది రూపాయలు కూడా కేటాయిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు ఫోన్ల పంపిణీ అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం పంపిణీలో అవకతవకలు అరికట్టేందుకు ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లకు శ్రీకారం చుడుతోంది. అంగన్వాడీ కార్యకర్తలు, వారిని పర్యవేక్షించే సూపర్వైజర్లకు కూడా కొత్తగా స్మార్ట్ ఫోన్లను మంజూరు చేశారు. జిల్లాకు 2445 సెల్ఫోన్లు మంజూరయ్యాయి. వీటిని అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లకు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. 2445 స్మార్ట్ఫోన్లు జిల్లాలోని 11 ప్రాజెక్టులలో 2389 మంది కార్యకర్తలకు, 56 మంది సూపర్వైజర్లకు రాష్ట్ర ప్రభుత్వం విధుల నిర్వహణ నిమిత్తం 2445 స్మార్ట్ ఫోన్లను మంజూరు చేసింది. వీటి ద్వారా ఆయా సిబ్బంది అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న వివిధ సమాచారాన్ని ఫీడ్ చేసి ఉన్నతాధికారులకు పంపాల్సి ఉంటుంది. పక్కాగా పౌష్టికాహారం పంపిణీ జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు ప్రతిరోజు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే పౌష్టికాహారాన్ని వైఎస్సార్ సంపూర్ణ పోషణ ట్రాక్ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారులు హాజరు, గృహ సందర్శన కార్యక్రమాల ద్వారా గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఐరన్‌మాత్రల వినియోగంపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అలాగే అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారంతోపాటు అదనంగా తీసుకోవాల్సిన ఆహారంపై కూడా అవగాహన కల్పించాలి. అలాగే పిల్లల బరువు, ఎత్తు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంటుంది. ఇలా అంగన్వాడీ కేంద్రాలు అందించే ప్రతి కార్యక్రమాన్ని ఆన్లైన్లో నమోదు చేయడం ద్వారా అక్రమాలకు చెక్ పెట్టడంతోపాటు పారదర్శకమైన సేవలు అందించేందుకు మార్గం సుగమమవుతోంది. అంతేకాకుండా రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. పారదర్శకమైన సేవలు జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పారదర్శకమైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లకు స్మార్ట్ ఫోన్లను అందిస్తోంది. ఈ స్మార్ట్ సేవలతో అక్రమాలకు చెక్ పెట్టినట్లవుతుంది. అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్న పౌష్టికాహారంతోపాటు అనేక సేవా కార్యక్రమాలను పొందుపరచాల్సి ఉంటుంది. -ఎంఎన్ రాణి, ప్రాజెక్టు డైరెక్టర్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, కడప -
పారదర్శకంగా అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: అంగన్వాడీ సూపర్వైజర్(గ్రేడ్–2) పోస్టుల భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ స్పష్టం చేశారు. పోస్టుల భర్తీపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ ఆమె సోమవారం మీడియాతోమాట్లాడారు. 2013లో చేపట్టిన ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను అప్పట్లో పట్టించుకోలేదన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వాటి భర్తీకి చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. 560 పోస్టుల భర్తీకి అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు అవకాశం ఇచ్చినట్టు చెప్పారు. అర్హులైన వారినుంచి దరఖాస్తులు తీసుకుని పారదర్శకంగా రాతపరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా భర్తీచేసేలా పటిష్ట మైన చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే 560 పోస్టులకు 21 వేలకు పైగా దరఖాస్తులొచ్చాయని, వారికి ఈ నెల 18న నాలుగు జోన్లలో మాల్ ప్రాక్టీస్‌కు తావులేకుండా ఓఎంఆర్ షీట్స్ ద్వారా రాతపరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. రాతపరీక్ష 45 మార్కులతోపాటు.. మరో ఐదు మార్కులకు ఇంగ్లిష్ పై పట్టు ఏ మేరకు ఉందో తెలుసుకునేందుకు వీడియో చేసి పంపాలని నోటిఫికేషన్లో పేర్కొన్నట్టు తెలిపారు. రాతపరీక్ష తర్వాత ఒక్కో పోస్టుకు ఇద్దరి(క్వాలిఫైడ్ లిస్ట్)ని ఎంపిక చేసి వారికి సమాచారం అందించినట్టు తెలిపారు. పో స్టుల భర్తీలో రోస్టర్ విధానం, దివ్యాంగుల కోటా వంటి అన్ని నిబంధనలు పాటిస్తున్నట్టు చెప్పారు. ఇంటర్వ్యూలు ముగిశాక మార్కుల జాబితాలు వెల్లడిస్తామన్నారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు సైతం ఎటువంటి అనుమానం ఉన్నా తమ ఆన్సర్ షీట్లను కూడా పరిశీలించుకునే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థుల్లో అపోహలు, అనుమానాలు రేకెత్తించేలా అసత్య వార్తలు, తప్పుడు ప్రచారాలు తగదని ఆమె సూచించారు. -
Telangana: టార్గెట్ 100!
సాక్షి, హైదరాబాద్: మాతా, శిశు ఆరోగ్యంపై ప్రభుత్వం మరింత శ్రద్ధ చూపుతోంది. పోషకాల లోపం అధిగమించడంతో పాటు ఆరోగ్యవంతమైన తరాన్ని నిర్మించాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టింది. అంగన్వాడీ కేంద్రాల్లోని టీచర్లకు ఈ మేరకు లక్ష్యాలను నిర్దేశించింది. కేంద్రంలో నమోదైన ప్రతి లబ్ధిదారుపై నిరంతర పర్యవేక్షణ ఉంచేలా బాధ్యతలు పెట్టింది. ఒక నెల వ్యవధిలో ప్రతి అంగన్వాడీ టీచర్ సంబంధిత కేంద్రం పరిధిలోని కనీసం వంద మంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య స్థితిని అంచనా వేయాలి. లబ్ధిదారులైన గర్భిణులు, బాలింతలు, పాలిచ్చే తల్లులు, మూడేళ్లలోపు చిన్నారుల ఆరోగ్య స్థితి పరిశీలనతో పాటు చిన్నారుల బరువు తూచడం, అనారోగ్య సమస్యలు గుర్తిస్తే సమీప ఆస్పత్రులకు రిఫర్ చేయడం, అంగన్వాడీ కేంద్రం ద్వారా అందించే పోషక విలువలతో కూడిన (న్యూట్రిషన్) సరుకుల పంపిణీ పక్కాగా నిర్వహించడంలాంటి కార్యక్రమాలను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలి. ప్రతి నెలా నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసిన టీచర్లకు ప్రోత్సాహకాలను ప్రకటిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా అన్ని జిల్లాల సంక్షేమాధికారులకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సర్క్యులర్లను పంపింది. అరవై శాతం దాటితే అర్హత.. అంగన్వాడీ టీచర్లకు నిర్దేశించిన బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పోత్స్రాహకాలను ఇవ్వనుంది. ప్రతి నెలా టార్గెట్‌గా వంద లబ్ధిదారుల పరిశీలనను నిర్దేశించినప్పటికీ.. అందులో కనీసం 60 శాతం లక్ష్యం పూర్తి చేసిన వారు ప్రోత్సాహకాల పరిధిలోకి వస్తారు. వారి పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలను ఇవ్వనుంది. ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిని యూనిట్‌గా పరిగణిస్తూ ఆయా టీచర్లకు ప్రోత్సాహకాలు ఇస్తారు. నెలకు సగటున రూ.1,000 వరకు గౌరవ వేతనంతో కలిపి ఇవ్వనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల నుంచే ఈ ప్రోత్సాహకాలు ఇచ్చేలా రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ క్షేత్రస్థాయిలోని అంగన్వాడీ టీచర్ల పనితీరును మదింపు చేయనుంది. ఆన్లైన్లో నమోదు అంగన్వాడీ కేంద్రం పరిధిలోని లబ్ధిదారుల ఆరోగ్యస్థితిని టీచర్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లి రికార్డు చేస్తారు. వారి ఇంటికి వెళ్లి నిర్దేశించిన వివరాలు సేక రిస్తారు. వాటిని ఆన్లైన్లో నమోదు చేస్తారు. సలహాలు, సూచనలిస్తారు. పోషక విలు వల్లో లోపాలు గుర్తిస్తే వారికి అదనపు పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రత్యేక జాబితాలో చేరుస్తారు. అనంతరం వారి ఇంటి వద్దకు అదనపు పౌష్టికాహారాన్ని పంపి ప్రత్యేక పరిశీలన కేటగిరీలోకి చేర్చుతారు. ఆ తర్వాత క్రమం తప్పకుండా వారి ఆరోగ్యస్థితిని సమీక్షిస్తారు. ఇది నిర్దేశిత పద్ధతిలో కొనసాగుతుంది. -
సారీ..రీచార్జ్‌కు డబ్బుల్లేవు
బనశంకరి: రాష్ట్రంలో వేలాది గ్రామాలు, పట్టణాల్లో పేద బాలలకు విద్యా, పోషణ సేవలు అందిస్తున్న అంగన్వాడీలకు తీవ్ర కష్టం వచ్చింది. డిజిటలీకరణ మాటలకే పరిమితమైంది. అంగన్వాడీ కార్యకర్తలు, పర్యవేక్షకులకు అందించిన స్మార్ట్ ఫోన్లు అలంకారంగా మిగిలాయి. నిరుపేద కుటుంబాల పిల్లలు, గర్భిణీలు, బాలింతలు సమగ్ర సమాచారం మొత్తం ఆన్లైన్లో నమోదై ఉండాలని కేంద్ర ప్రభుత్వం పోషణ అభియాన పథకం ప్రారంభించింది. ప్రతి అంగన్వాడీ కి అందించిన స్మార్ట్ ఫోన్లను ప్రభుత్వం రీచార్జ్ చేయకపోవడంతో ఇంటర్నెట్ అందక పనిచేయడం లేదు. దీంతో కోట్లాది రూపాయలు ఖర్చుచేసిన పథకం లక్ష్యం నెరవేరలేదు. ఆరు నెలలుగా సమస్య పోషణ అభియాన కింద 2020లో 62,581 అంగన్వాడీ, 3,331 ఉపకేంద్రాలతో పాటు మొత్తం 65, 911 కేంద్రాల కార్యకర్తలకు శామ్సంగ్ గ్యాలక్సీ ఏ–10 ఎస్ మోడల్ స్మార్ట్‌ఫోన్, ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ సిమ్‌లను సర్కారు అందజేసింది. కొత్తగా ప్రారంభించిన 1050 అంగన్వాడీలకు ఇంకా ఇవ్వలేదు. ఈ పథకానికైన వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60–40 కింద భరిస్తాయి. ఎయిర్‌టెల్‌కు డబ్బు చెల్లించక సుమారు 6 నెలలుగా 65,911 స్మార్ట్ ఫోన్లు మూగబోయాయి. దీనిపై అంగన్వాడీలు పై అధికారులకు ఫిర్యాదు చేస్తే నిధుల కొరత అని సమాధానం వచ్చింది. రెండువారాల కిందట బెంగళూరులో జరిపిన రాష్ట్రస్థాయి అంగన్వాడీల ఆందోళలోనూ ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. మళ్లీ చేతితో ఫైళ్లు రాయడం, రికార్డుల నిర్వహణ లాంటి పనులు ప్రారంభమయ్యాయి. జీతాలు, ప్రోత్సాహక ధనానికి ఇబ్బందులే రాష్ట్రంలో 62 వేల అంగన్వాడీల్లో 1.24 లక్షల మంది అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు పనిచేస్తున్నారు. వీరికి సేవ ఆధారంగా పురస్కారాలు, గౌరవవేతనం పెంచే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. 20 ఏళ్లకు పైబడి సేవలందించినవారికి రూ.1,500, 10 నుంచి 20 ఏళ్లు సరీ్వస్ కు రూ.1,250, 10 ఏళ్లలోపు సరీ్వసు ఉన్నవారికి రూ వెయ్యి చొప్పున జీతం పెంచుతామని సీఎం బసవరాజబొమ్మై బడ్జెట్లో ప్రస్తావించారు. కానీ బడ్జెట్ ప్రవేశపెట్టి నాలుగు నెలలు గడిచినప్పటికీ గౌరవవేతనం పెంపు వీరికి అందలేదని కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు గత 3 నెలలనుంచి జీతాలు కూడా అందలేదని సమాచారం. గత వారం నుంచి చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ అందింది రెండునెలలు వేతనమేనని తెలిపారు. పెండింగ్ జీతం కూడా త్వరలోనే మంజూరు చేస్తామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ప్రియాంక తెలిపారు. స్మార్ట్ ఫోన్లకు త్వరలో రీచార్జ్ చేస్తామని మహిళా శిశుసంక్షేమ శాఖా మంత్రి హాలప్ప ఆచార్ తెలిపారు. సొంత ఖర్చుతో కొందరు నిత్యం యాప్‌లో పిల్లలు నమోదు, ఆహార సామగ్రి, గర్భిణీలు సమాచారం నమోదు చేయడానికి అనుకూలంగా ఉండేది. సిమ్ రీచార్జ్ చేయకపోవడంతో గత ఆరునెలలుగా ఇబ్బందిగా ఉందని అంగన్వాడీ కార్యకర్త లక్ష్మీ తెలిపారు. ఇబ్బందులు పడలేక కొందరు కార్యకర్తలు సొంత డబ్బుతో రీచార్జ్ చేసుకున్నట్లు చెప్పారు. (చదవండి: ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ సరదా.. రిజర్వాయర్ ఎత్తైన అంచుకు వెళ్లి ఫొటో దిగుతూ..) -
అమ్మకూ మధ్యాహ్న భోజనం
కడప కోటిరెడ్డి సర్కిల్: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులను సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు చిన్నారులకు మాత్రమే భోజనం వండి పెట్టేవారు. ఈ నెల 1 నుంచి గర్భిణులు, బాలింతలకు కూడా మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నారు. జిల్లాలో 2,389 అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణులు 17,660, బాలింతలు 17,318, ఏడాదిలోపు పిల్లలు 16,732, మూడేళ్లలోపు చిన్నారులు 57,072, ఆరేళ్లలోపు వారు 48,233 మంది ఉన్నారు. వీరిలో రక్తహీనత నివారించేందుకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారు. మెనూలో సమూల మార్పులు అంగన్వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేడి అన్నమే అందించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మెనూలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మధ్యాహ్న సమయంలో పిల్లలతోపాటు గర్భిణులు, బాలింతలకు రుచికరమైన భోజనం అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసి అమలు చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. భోజనం తర్వాత తల్లులకు 200 మి.లీ.పాలు, పిల్లలకు 100 మి.లీ. పాలు అందించాలని నిర్ణయించారు. నాణ్యమైన పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్రంలో భోజనం తయారు చేసి వడ్డిస్తున్నారు. నాణ్యమైన పౌష్టికాహారం అందించడం చిన్నారుల ఎదుగుదలకు దోహద పడుతుంది. కరోనా సమయంలో నిలుపుదల చేసిన ఈ విధానం తిరిగి ఈ నెల 1 నుంచి అమలులోకి తీసుకువచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాం. వేడి భోజనం అందించడం సంతోషదాయకం. – జి.గౌరి, గర్భిణి, కడప రోజూ గుడ్డు, పాలు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం పోషకాహారం అందిస్తుండటం సంతోషదాయకం. మాలాంటి వారికి ఎంతో ప్రయోజనకరం. మెనూలో రోజూ కోడిగుడ్డు, పాలు ఇవ్వాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం, దానిని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించడం హర్షించదగ్గ విషయం. –కె.శ్రుతి, బాలింత, కడప సద్వినియోగం చేసుకోవాలి గర్భిణులు, బాలింతలు, చిన్నారులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. అంగన్వాడీ కేంద్రాల ద్వారా మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం సూచించింది. ఇందులో భాగంగా నాణ్యమైన, రుచికరమైన భోజనం అందిస్తున్నాం. దీనిని అర్హులు సద్వినియోగం చేసుకోవాలి. – ఎంఎన్ రాణి, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐసీడీఎస్, కడప -
లబ్ధిదారుల ఇంటికెళ్లి పలకరించండి
సాక్షి, అమరావతి: అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, పిల్లలకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందించడమే కాదు.. వారి ఇళ్లకే వెళ్లి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పలకరించనున్నారు. పోషణ్ అభియాన్ 2.0 స్కీమ్‌లో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ అదనపు మార్గదర్శకాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఇంటింటికీ తిరగడం (విజిట్) లేదని పేర్కొంది. ఇకపై రోజుకు నాలుగు ఇళ్లకు తిరిగి వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకోవాలని కేంద్రం అదనపు మార్గదర్శకాలు ఇచ్చింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అన్ని అంగన్వాడీ కేంద్రాలకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీ కేంద్రాల్లో లబ్ధిదారుల యోగక్షేమాలు చూడడంతోపాటు వారి ఇంటికి వెళ్లి ఎప్పటికప్పుడు క్షేమ సమాచారం తెలుసుకోవాలని పేర్కొన్నారు. వారి ఇళ్లకే వెళ్లి క్షేమ సమాచారం తెలుసుకోవడం ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు ఎవరైనా రాకపోయినా, వారికి ఏదైనా సమస్య ఉన్నా నేరుగా తెలుసుకుని తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి రోజు కనీసం ఒక గర్భిణి, ఓ బాలింత, రెండేళ్లలోపు వయసు గల ఇద్దరు పిల్లల ఇళ్లకు విజిట్‌కు వెళ్లాలి. రోజుకు నాలుగు ఇళ్ల చొప్పున నెలలో 25 రోజులపాటు వంద విజిట్లు పూర్తి చేయాలి. కనీసం 60 శాతం అయినా వాటిని పూర్తి చేయాలనే నిబంధన విధించారు. అలా చేయకపోతే ఇన్సెంటివ్‌లు ఇవ్వకూడదని కేంద్ర ఆదేశాల్లో పేర్కొంది. ఈ హోం విజిట్‌కు సంబంధించిన అంశాలను ఐసీడీఎస్‌ల పరిధిలోని అధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. దీనితోపాటు అంగన్వాడీ కేంద్రాల్లో ఇటీవల చేపట్టిన ‘గ్రోత్ మానిటరింగ్ డ్రైవ్’నూ సమర్థవంతంగా నిర్వహించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
అమ్మకూ మధ్యాహ్న భోజనం
అనంతపురం సెంట్రల్/ రాయదుర్గం: అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం అందించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ కేవలం చిన్నారులకే భోజనం వడ్డిస్తున్నారు. శుక్రవారం నుంచి గర్భిణులు, బాలింతలకు కూడా మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నారు. జిల్లాలో 2,079 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 223 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో గర్భిణులు 21,480 మంది, బాలింతలు 19,870, ఏడాది లోపు పిల్లలు 20,728, ఏడాది నుంచి మూడేళ్ల లోపు పిల్లలు 64,960 , మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 52,140 మంది ఉన్నారు. రక్తహీనత నివారించడం కోసం వీరికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా వీరికి పౌష్టికాహారం అందిస్తున్నారు. నాణ్యమైన భోజనం సరఫరా.. అంగన్వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేడి అన్నమే అందించాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు మెనూలో సమూలమైన మార్పులు తీసుకొస్తూ ప్రభ్తుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి మధ్యాహ్న సమయంలో పిల్లలతో పాటు గర్భిణులు, బాలింతలకు కూడా రుచికరమైన భోజనం అందించడానికి అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇప్పటికే ఆయా అంగన్వాడీ కేంద్రాలకు నిత్యావసర సరుకులు చేరాయి. పాల కొరత ఉన్నప్పటికీ తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. భోజనం తర్వాత తల్లులకు 200 మిల్లీలీటర్లు పాలు, పిల్లలకు 100 ఎంఎల్ పాలు తప్పనిసరిగా అందించాలని నిర్ణయించారు. -
చిన్నారుల కళ్లల్లో చిరు దివ్వెలు.. పదేళ్లుగా ఇదే ఆనవాయితీ
సాక్షి, అమరావతి: పేదింటి పిల్లలకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడం ఆ అంగన్వాడీ స్కూల్లో పదేళ్లుగా కొనసాగుతోంది. టీచర్లు, తల్లిదండ్రులు ఆశీర్వదిస్తుంటే.. సహచర పిల్లలు శుభాకాంక్షలు చెబుతుంటే.. పుట్టిన రోజు జరుపుకొంటున్న ఆ చిన్నారి కళ్లల్లో వెలుగులు విరజిమ్మాల్సిందే కదా. అనకాపల్లి నూతన జిల్లా నాతవరం మండలం చినగొలుగొండపేట అంగన్వాడీ కేంద్రం–1కి రోజూ మాదిరిగానే 31 మంది పిల్లలు బుధవారం ఉదయాన్నే చేరుకున్నారు. వారితో పాటే జ్ఞానశ్రీ అనే విద్యార్థిని కూడా వచ్చింది. నూతన డ్రెస్‌తో వచ్చిన ఆ చిన్నారి పుట్టిన రోజు అని తెలుసుకున్న టీచర్ సత్యవేణి.. వెంటనే ఆయా శ్రీదేవితో కలిసి కేక్ కటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. తోటి చిన్నారుల సమక్షంలోనే చిన్నారి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. గత పదేళ్లుగా అక్కడ ఈ ఆనవాయితీ కొనసాగిస్తూ పుట్టిన రోజు నాడు పేదింటి బిడ్డలకు మధురానుభూతిని అందిస్తున్నారు. ఏర్పాట్లకు అయ్యే ఖర్చులతో పాటు పిల్లలందరికీ పెన్నులు, పెన్సిళ్లు, పుస్తకాలు కూడా అంగన్వాడీ టీచరే సొంతంగా సమకూర్చుతున్నారు. పుట్టిన రోజు వేడుకలు చేస్తున్నప్పుడు కపటం లేని ఆ చిన్నారుల కళ్లల్లో కనిపించే చిరునవ్వులను చూస్తే ఎంతో సంతృప్తిగా ఉంటుందని అంగన్వాడీ టీచర్ సత్యవేణి చెప్పారు. -
AP: ‘అంగన్వాడీ’ల ఆధునికీకరణ
సాక్షి, అమరావతి: మహిళలు, చిన్నారులకు సేవలందిస్తున్న అంగన్వాడీ కేంద్రాల ఆధునికీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మౌలిక వసతులతోపాటు ఆధునిక సౌకర్యాల కోసం నిధులు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో అనేక పథకాల కింద రూ.545 కోట్ల 97 లక్షల 55 వేలను బడ్జెట్లో ప్రతిపాదించిన ప్రభుత్వం ఇప్పటివరకు రూ.205 కోట్ల 21 లక్షల 74 వేలను విడుదల చేసింది. నూతన విద్యావిధానంలో భాగంగా అంగన్వాడీలు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలతో కలిసి బోధన పద్ధతిలో సమన్వయాన్ని తీసుకురావడానికి, పిల్లల మెరుగైన అభ్యాస ఫలితాల కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. చదవండి: AP: సచివాలయాలు సూపర్.. కేంద్ర మంత్రి ప్రశంసలు ఈ నేపథ్యంలోనే మొత్తం 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో 27,620 కేంద్రాలను ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఆవరణలోనే నిర్వహిస్తున్నారు. మరో 27,987 కేంద్రాలను శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ (సొంతంగా అంగన్వాడీలు)గా నిర్వహిస్తున్నారు. పాఠశాలల ఆవరణలో నిర్వహిస్తున్న వాటిలో 1,803 అంగన్వాడీ కేంద్రాలకు నాడు–నేడు కార్యక్రమంలో 3,431 అదనపు తరగతి గదులను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటి నిర్మాణానికి కసరత్తు మొదలైంది. వీటితోపాటు ఇప్పటికే 960 అంగన్వాడీ కేంద్రాల భవనాల ఆధునికీకరణ కోసం రూ.2 లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఆ నిధులతో పాత భవనాల మరమ్మతులు, మంచినీరు, మరుగుదొడ్లు, ఇతర మౌలిక వసతులు సమకూర్చనున్నారు. వీటిలో ఇప్పటివరకు 128 కేంద్రాల పనులు పూర్తయ్యాయి. 282 కేంద్రాల్లో పనులు వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో సొంత భవనాలు కలిగిన అంగన్వాడీ కేంద్రాలకు 10,472 మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఇందుకోసం రూ.15 వేల చొప్పున కేటాయించారు. 2,628 అంగన్వాడీ కేంద్రాలకు మంచినీటి కనెక్షన్లు ఏర్పాటు చేసేందుకు రూ.10 వేల వంతున నిధులు కేటాయించారు. అంగన్వాడీ కేంద్రాల తాజా పరిస్థితి రాష్ట్రంలో 257 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 55,607 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 21,197 కేంద్రాలు పాఠశాలల ఆవరణలో సొంత భవనాల్లో పనిచేస్తున్నాయి. మరో 10,652 అంగన్వాడీ కేంద్రాలు పాఠశాల తరగతి గదులు, పంచాయతీలు, ఇతర భవనాల్లో అద్దె లేకుండా నడుస్తున్నాయి. 23,758 అంగన్వాడీ కేంద్రాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. 55,607 కేంద్రాల్లో మంచినీటి వసతి ఉంది. 41,305 కేంద్రాల్లో మరుగుదొడ్లు ఉండగా.. 47,488 అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం ఉంది. అంగన్వాడీ కేంద్రాలకు ఇతోధిక నిధులు రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అవసరమైన నిధులు కేటాయిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కేంద్రంలోని పలు పథకాల ద్వారా నిధులను రాబట్టేందుకు కృషి జరుగుతోంది. అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణంతోపాటు మంచినీరు, మరుగుదొడ్డి తదితర మౌలిక వసతులు కల్పించేందుకు గట్టి ప్రయత్నం సాగుతోంది. అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి కేటాయించిన రూ.15 వేలు సరిపోవనే వినతులు రావడంతో ఆ మొత్తాన్ని రూ.30 వేలకు పెంచే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన సౌకర్యాలను కల్పించడంలో ప్రభుత్వం నిధుల కోసం వెనుకడుగు వేయడంలేదు. – డాక్టర్ ఎ.సిరి, మహిళా శిశుసంక్షేమ శాఖ సంచాలకురాలు -
అంగన్వాడీలపై ‘గ్యాస్’ బండ!
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీల్లో పౌష్టికాహార పంపిణీ నిర్వాహకులకు గ్యాస్‌బండ గుదిబండలా మారింది. ఒకవైపు వంటగ్యాస్ సిలిండర్ ధర అమాంతం పెరుగుతుండగా.. మరోవైపు ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సిన గ్యాస్ బిల్లులు సకాలంలో రాకపోవడం అంగన్వాడీ టీచర్లకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఏడాది కాలంగా రూ.10కోట్లకుపైగా గ్యాస్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో అడపాదడపా చెల్లింపులు చేస్తున్నప్పటికీ.. గ్రామీణ ప్రాంత జిల్లాల్లో మాత్రం పెండింగ్‌లో ఉ న్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. దీనిపై జిల్లా సంక్షేమాధికారుల (డీడబ్ల్యూఓ)కు వినతులు ఇస్తున్నప్పటికీ నిధులు విడుదల కాగానే చెల్లింపులు చేస్తామని చెప్పి చేతులు దులుపుకొంటున్నారు. రోజూ పోషకాహారం: రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ (సమ గ్ర శిశు అభివృద్ధి సర్వీసు) ప్రాజెక్టులున్నాయి. ఇందులో 99 ఐసీడీఎస్‌లు గ్రామీణ ప్రాంతాల్లో, 25 పట్టణ ప్రాంతా ల్లో, మరో 25 ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. అన్ని ఐసీడీఎస్‌ల పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలుండగా, ఇందులో 31,711 ప్రధాన, 3,989 మినీ అంగన్వాడీ కేం ద్రాలు. అన్ని కేంద్రాల్లో 4.57 లక్షల గర్భిణులు/బాలిం తలు, మూడేళ్లలోపు చిన్నారులు 10.34 లక్షలు, 3–6 ఏళ్లలోపు చిన్నారులు 6.67 లక్షల మంది నమోదయ్యారు. చిన్నారులకు ప్రీస్కూల్ సర్వీసులతోపాటు పౌష్టికాహారాన్ని అందిస్తుండగా.. గర్భిణులు, బాలింతలకు రోజూ అన్ని రకాల పోషకాలున్న వేడివేడి భోజనాన్ని అందిస్తున్నారు. ఈ భోజనాన్ని వండేందుకు అంగన్వాడీ కేంద్రాలకు గ్యాస్ సిలిండర్, పొయ్యిలను ప్రభుత్వం ఇచ్చింది. వీటిని ఉపయోగించి రోజువారీగా పోషకాహారాన్ని అం దించే బాధ్యతను అంగన్వాడీ టీచర్లకు అప్పగించింది. రెండు నెలలకో సిలిండర్ అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని వడ్డించి పంపిణీ చేయడంలో గ్రామీణ కేంద్రాలే ముందు వరుసలో ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లోని ఎక్కువ శాతం కేంద్రాల్లో పౌష్టికాహారాన్ని సరుకుల రూపంలో లబ్ధిదారులకు అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం వంట చేసి అప్పటికప్పుడు వడ్డిస్తున్నారు. సగటున రెండు నెలలకో సిలిండర్‌ను వినియోగిస్తున్నట్లు సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ అంగన్వాడీ టీచర్ చెప్పారు. పలు గ్రామీణ జిల్లాల్లో బిల్లులు రాకపోవడంతో టీచర్లు వ్యక్తిగతంగా డబ్బులు చెల్లించి సిలిండర్లు తీసుకుంటున్నారు. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.1,052గా ఉండగా, డెలివరీ చార్జీల కింద డీలర్లు మరో రూ.50 వసూలు చేస్తున్నారు. దీంతో సిలిండర్ ధర రూ.1,102గా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 15 వేల కేంద్రాలకు ఏడాదిగా గ్యాస్ బిల్లులు విడుదల కాలేదని టీచర్లు చెబుతున్నారు. ఈ బకాయిలు రూ.10 కోట్లకుపైగా ఉంటాయని అంచనా. వీటిని తక్షణమే విడుదల చేస్తేనే లబ్ధిదారులకు పౌష్టిక ఆహారాన్ని పంపిణీ చేస్తామని అంగన్వాడీలు అంటున్నారు. -
టీచర్ అవతారమెత్తిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి (ఫోటోలు)
-
టీచర్ అవతారమెత్తిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి
సాక్షి, విశాఖపట్నం: స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీ చరణ్ టీచర్ అవతారమెత్తారు. విశాఖలో అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె శుక్రవారం సందర్శించారు. అక్కడ చిన్నారులకు ప్రభుత్వం నుంచి అందుతున్న ఆహార పదార్థాలు ఇతర అంశాలను పరిశీలించారు. చిన్నారులతో కలిసి మెనూ భోజనాన్ని తీసుకున్నారు. అంతకు ముందు ఆమె చిన్నారులను వివిధ అంశాలపై ప్రశ్నించారు. టీచర్ మాదిరిగా వారితో రైమ్స్ చదివించారు. చిన్నారులు కూడా హుషారుగా మంత్రి ఉష శ్రీ చరణ్‌తో గడిపారు. అనంతరం ఆమె గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేశారు. అయిదేళ్లు నిండిన చిన్నారులకు ఫ్రీ గ్రాడ్యుయేషన్ చేశారు. -
పిల్లలకు కోనసీమ జిల్లా కలెక్టర్ పాఠాలు
అమలాపురం రూరల్: కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం అంగన్వాడీ విద్యార్థులకు అక్షరాలు నేర్పించారు. వారిని ముద్దాడి.. వారితో ముచ్చటించి, ఆడి పాడి మురిపించారు. బండారులంక కందులపాడు కాలనీలో అంగాన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేసి పౌష్టికాహారం నాణ్యతను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు పరిశీలనలో భాగంగా కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, కోడిగుడ్ల నాణ్యతను పరిశీలించారు. చిన్నారులను ఒడిలో కూర్చో పెట్టుకుని ముచ్చటించారు. అక్షరాలు, చిన్నచిన్న పదాలు వారితో చెప్పించి రాయించే ప్రయత్నం చేశారు. కేంద్రంలో వారికి పెడుతున్న ఆహారాన్ని అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లు తనిఖీ చేశారు. చిన్నారుల వయసుకు తగిన బరువు ఉన్నదీ లేనిదీ నేరుగా పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రం వద్ద వాతావరణం ఆహ్లాదంగా ఉండాలని, పిల్లల మానసిక అంశాలను గమనిస్తూ ఉండాలని కార్యకర్తలకు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో నిరంతరం పరిశీలించి పథకాల అమలుపై పర్యవేక్షిస్తామని ఆయన కేంద్రం నిర్వాహకులకు తెలిపారు. కలెక్టర్ వెంట సర్పంచ్ పెనుమాల సునీత, అంగన్వాడీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఒడిశా ప్రభుత్వం ముందడుగు.. వారి బాల్యానికి భరోసా!
భువనేశ్వర్: నేరారోపణతో తల్లిదండ్రులు జైలు పాలైన సందర్భాల్లో ఆయా కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఇంట్లో ఆదరణ లేక ఆ పిల్లలు కూడా నేర చరితులుగానే తయారవుతున్నారు. మరికొంత మంది రోడ్డున పడుతున్నారు. ఇటువంటి పరిస్థితులను సమూలంగా మార్చి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. నిబంధనల ప్రకారం జైలులో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న బాలలకు మధ్యాహ్న భోజనం సరఫరా చేయనున్నారు. కారాగారంలో ఉంటున్న వారి బిడ్డలు అలనాపాలనా చూసుకునేందుకు నిర్ధారిత నిబంధనల పరిధిలో ఇదే తరహా సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఖైదీల బిడ్డల చదువులు, వారి మానసిక, శారీరక ఆరోగ్యం, ఇతరేతర సంక్షేమ, సంరక్షణ కార్యకలాపాలు క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టింది. కారాగారంలో ఉంటున్న వారి బిడ్డలకు ఈ సదుపాయం వర్తిస్తుందని తెలిపారు. తల్లిదండ్రుల కారాగారవాసం 60 రోజులు పైబడితే ఈ సదుపాయం లభిస్తుంది. ఈ నేపథ్యంలో బాలల సంక్షేమానికి రాష్ట్ర మహిళ–శిశు సంక్షేమశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రధానంగా ఆరేళ్ల లోపు ఉన్న బాలల సంక్షేమం పట్ల విభాగం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. బాల నేరస్తుల చట్టం ప్రకారం శిశు సంక్షేమ కమిటీ జైలు బయట ఉన్న బాలల సంక్షేమం, సంరక్షణకు జారీ చేసిన మార్గదర్శకాల పరిధిలో ఉన్న బాలలకు మధ్యాహ్న భోజనం లభిస్తుంది. ఈ మార్గదర్శకాల వాస్తవ కార్యాచరణ సరలీకరించేందుకు జైలు ఆవరణలో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఇది నోడల్ అంగన్వాడీ కేంద్రంగా పని చేస్తుంది. జిల్లా కలెక్టర్ ఈ కార్యకలాపాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. టీకాలు.. పౌష్టికాహారం.. బాల ఖైదీలు అధికంగా ఉన్న జైళ్ల ఆవరణలో జైలు మాన్యువల్ నిబంధనల పరిధిలో తాత్కాలిక అంగన్వాడీ కేంద్రం అదనంగా ఏర్పాటు అవుతుందని విభాగం తెలిపింది. తల్లిదండ్రులతో కారాగారంలో ఉంటున్న బిడ్డలకు పౌష్టికాహారం, క్రమం తప్పకుండా టీకాలు వేయించడం చేపడతారు. తక్కువ మంది పిల్లలు ఉన్న అంగన్వాడీ కేంద్రం సిబ్బంది జైలు ఆవరణలో ఏర్పాటైన తాత్కాలిక అదనపు అంగన్వాడీ కేంద్రం కార్యకలాపాలు నిర్వహిస్తారని మహిళ–శిశు సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. తల్లి అంగీకారంతో 6 ఏళ్ల బాలలకు సంరక్షకుల చెంతనే ఉండేందుకు అనుమతిస్తారు. జిల్లా సురక్షా యూనిట్ జైలులో ఉంటున్న తల్లీబిడ్డలను అవగాహన పరిచి, అనుబంధ సౌకర్యాలు కల్పిస్తుంది. 6 నుంచి 14 ఏళ్ల బాలలకు విద్యాభ్యాసం తప్పనిసరి. తల్లిదండ్రులు కారాగారంలో ఉండి బయట ఉన్న పిల్లల చదువులకు ప్రభుత్వం నిర్వహిస్తున్న పలు విద్యా ప్రోత్సాహక పథకాలు వర్తింపజేస్తారు. బిజూ శిశుసురక్షా యోజన, ఫాస్టర్ కేర్ వంటి పథకాలు కార్యాచరణలో ఉన్నట్లు మహిళ–శిశు సంక్షేమశాఖ పేర్కొంది. తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉంటున్న బిడ్డలతో కనీసం నెలకు ఒకసారి వ్యక్తిగతంగా కలవడం లేదా ఫోన్ ద్వారా మాట్లాడటం వంటి సదుపాయం కల్పిస్తారు. జిల్లా, సర్కిల్ జైలు అధికారులు ప్రతి 3నెలలకు ఒకసారి బిడ్డల మానసిక వికాసం ఇతరేతర అంశాలను అనుబంధ వర్గాలతో సంప్రదించి సమగ్ర నివేదిక దాఖలు చేయాలని విభాగం ఆదేశించింది. -
అంగన్వాడీలకు ‘అద్దె’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాలకు అద్దె కష్టాలు పెరిగిపోతున్నాయి. ఏడాదిన్నరగా ప్రభు త్వం అద్దె నిధులు విడుదల చేయకపోవడంతో బకాయిలు కుప్పలుగా పేరుకుపోయాయి. బకాయి లు చెల్లించాలంటూ యజమానుల నుంచి ఒత్తిడి రావడంతో స్థానిక అంగన్వాడీ టీచర్లు సతమతమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో 12,400 కేంద్రాలు అద్దె భవనాల్లోనే.. 11,181 కేంద్రాలు శాశ్వత భవనాల్లో.. 12,119 కేంద్రాలు ప్రాథమిక పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లలో కొన సాగుతున్నాయి. అద్దె భవనాలను రెండు రకాలుగా వర్గీకరించిన ప్రభుత్వం ఆ మేరకు అద్దె నిధులు చెల్లిస్తోంది. గ్రామీణ ప్రాంతంలో రూ.వెయ్యి చొప్పున, పట్టణ ప్రాంతంలో గరిష్టంగా రూ.3 వేల చొప్పున సీలింగ్ విధించి నిధులు విడుదల చేస్తోంది. అంగన్వాడీ కేంద్రాలకు అద్దె కింద నెలకు సగటున రూ.2.5 కోట్లు సగటున చెల్లిస్తోంది. గత ఏడాదిన్నరగా అద్దె నిధులు విడుదల చేయకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. గతేడాది డిసెంబర్ నాటికి రూ.30 కోట్ల మేర అద్దె బకాయిలు ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. టీచర్లపై ఒత్తిడి... అంగన్వాడీ కేంద్రం కోసం అద్దె భవనాన్ని పరిశీలించి, ఖరారు చేయడం, నెలవారీగా అద్దె మొత్తాన్ని చెల్లించే ప్రక్రియంతా టీచర్ల పరిధిలోనే కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతం అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో యజమానులు టీచర్లపై ఒత్తిడి చేస్తున్నారు. బకాయిలు చెల్లించకుంటే ఖాళీ చేయాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అద్దె రూపంలో ఇచ్చే మొత్తం నామమాత్రమే అయినా సకాలంలో ఇవ్వకపోవడం వారికి ఇబ్బందికరంగా మారుతోంది. దీంతో ప్రత్యామ్నాయ భవనాల కోసం ప్రయత్నాలు చేయాల్సి వస్తోందని కొందరు టీచర్లు వాపోతున్నారు. -
అంగన్వాడీ కేంద్రంలో కలెక్టర్ బిడ్డ
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన కుమారుడి పేరును అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేయించారు. రాయిగిరి అంగన్వాడీ టీచర్లు ఇంటింటి సర్వేలో భాగంగా బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి వెళ్లగా.. కలెక్టర్ తన కుమారుడు నైతిక్ సత్పతి పేరును అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేయించారు. 35 నెలల వయసున్న కలెక్టర్ కుమారుడికి అంగన్వాడీ టీచర్లు నెలకు సరిపడా బాలామృతం, 16 గుడ్లు అందజేశారు. నైతిక్ సత్పతికి 36 నెలలు నిండిన తర్వాత (మూడేళ్లు) అంగన్వాడీ కేంద్రానికి పంపనున్నారు. -
చిన్నారి చెంప, చేతులు, పెదవులపై వాతలు.. ఎందుకంటే..
సాక్షి, యాదగిరిగుట్ట(నల్లగొండ): చిన్నారులను ప్రేమతో బుజ్జగించాల్సిన అంగన్వాడీ టీచర్ దారుణానికి ఒడిగట్టారు. అభం శుభం తెలియని చిన్నారికి వాతలు పెట్టి గాయపరిచారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని పెద్దకందుకూరు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుర్రం సుదర్శన్, అనూషల కుమార్తె అభిజ్ఞ (5) గ్రామంలోని అంగన్వాడీ సెంటర్–1కి వెళ్తోంది. రోజు మాదిరిగానే బుధవారం కూడా వెళ్లింది. ఆ చిన్నారి కేంద్రంలో ఏడ్చినందుకు సెంటర్ ఉపాధ్యాయురాలు సునీత చిన్నారి అభిజ్ఞ చెంప, రెండు చేతులు, పెదవులపై వాతలు పెట్టారు. దీంతో ఏడ్చుకుంటూ వచ్చిన చిన్నారి విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. వెంటనే కుటుంబ సభ్యులు టీచర్ తీరుపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పిల్లలపై ఇంత కిరాతకంగా వ్యవహరించిన అంగన్వాడీ టీచర్ సునీతపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, తానేమీ వాతలు పెట్టలేదని అంగన్వాడీ టీచర్ సునీత చెప్పారు. వారికి, తమకు మధ్య ఉన్న కుటుంబ గొడవలతో తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. -
అంగన్వాడీ.. ఇక డిజిటల్లీ రెడీ
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారుల ఆరోగ్య స్థితిని అంచనా వేసే పద్ధతిని ప్రభుత్వం మరింత పకడ్బందీ చేస్తోంది. ప్రస్తుతం నెల వారీగా పిల్లల ఎత్తు, బరువు కొలిచే ప్రక్రియ ఉన్నా అంతంతగానే జరుగుతుండటం, సర్కారుకు నివేదికలు సమర్పించే నాటికి ఆలస్యమవుతుండటంతో సాంకేతికతను వాడి ఈ జాప్యానికి చెక్ పెట్టాలనుకుంటోంది. ఇకపై ప్రతి చిన్నారి ఎత్తు, బరువును నెలవారీగా తూచి వివరాలను వెబ్ పోర్టల్‌లో అప్డేట్ చేయాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. దీని వల్ల పిల్లల ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు గుర్తించడంతో పాటు పౌష్టికాహార లోపాలున్న పిల్లలకు అదనపు పోషకాలు అందించే వీలుంటుందని భావిస్తోంది. 80 శాతం లక్ష్యం సాధించిన అంగన్వాడీ టీచర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని అనుకుంటోంది. వెబ్ పోర్టల్, యాప్ ద్వారా.. రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. వీటిల్లో 31,711 ప్రధాన, 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో మూడేళ్లలోపు చిన్నారులు 10.34 లక్షల మంది, 3 నుంచి 6 ఏళ్ల లోపు చిన్నారులు 6.67 లక్షల మంది ఉన్నారు. ప్రతి నెలా వీరి ఎత్తు, బరువును కొలిచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వాడబోతోంది. రాష్ట్ర స్థాయిలో వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తోంది. దీనికి అనుబంధంగా ఓ యాప్‌నూ రూపొందించనుంది. దీని ఆధారంగా వివరాలను నమోదు చేసే వీలుంటుంది. ఇందుకోసంప్రతి అంగన్వాడీ టీచర్‌కు అత్యాధునిక స్మార్ట్ ఫోన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. యాప్‌లో ఏమేముంటాయ్? ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసి పిల్లల ఎత్తు, బరువు, వయసు వివరాలను నమోదు చేసిన వెంటనే ప్రధాన సర్వర్‌లో గణాంకాలు నిక్షిప్తమవుతాయి. పిల్లల వయసు, ఎత్తు, బరువులో తేడాలుంటే వెంటనే సూచనలు ఇస్తుంది. దీంతో సదరు అంగన్వాడీ టీచర్ అప్రమత్తమై ఆయా చిన్నారులకు అదనపు పోషకాహారం అందించడం, వైద్యుల దృష్టికి తీసుకెళ్లే ఏర్పాటు చేసుకోవడం లాంటి అవకాశం ఉంటుంది. వచ్చే నెల నుంచి ఎత్తు, బరువు తూచే ప్రక్రియను క్రమం తప్పకుండా కొనసాగించాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ భావిస్తోంది. అంగన్వాడీ టీచర్లకు ఇప్పటికే శిక్షణ, అవగాహన పూర్తయింది. -
అంగన్వాడీలకు అమూల్ పాలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు అమూల్ పాలను అందించేందుకు ఏపీ డెయిరీ కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం 32,59,042 మందికి ప్రభుత్వం వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల్లో పౌష్టికాహార పంపిణీ చేస్తోంది. వీరిలో 3,24,378 మంది గర్భిణులు, 2,23,085 మంది బాలింతలు, 15,64,445 మంది మూడేళ్లలోపు చిన్నారులు, 11,47,134 మంది మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు ఉన్నారు. తల్లీ బిడ్డలకు ప్రతి నెలా పాల ప్యాకెట్లను అందిస్తున్నారు. ఆ పాలను ప్రస్తుతం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ద్వారా ఏపీకి సరఫరా చేస్తున్నారు. తొలుత 181 మిల్క్ స్టాక్ పాయింట్లకు తరలించి అక్కడి నుంచి అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి జరుగుతున్న పాల సరఫరాలో ఇబ్బందులు అధిగమించేందుకు, పారదర్శకత కోసం ఇటీవల ఏపీ డెయిరీ కార్పొరేషన్ మిల్క్ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో అమూల్ పాల సేకరణకు ఒప్పందం కుదుర్చుకోవడంతో అంగన్వాడీ కేంద్రాలకు కూడా స్థానికంగానే సరఫరా చేస్తే ఇబ్బందులు తొలుగుతాయని భావిస్తున్నారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించేలా పశ్చిమగోదావరి జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేసుకుని ప్రయోగాత్మకం(పైలట్ ప్రాజెక్ట్)గా అమలు చేయాలని భావిస్తున్నారు. ఇదే విషయమై రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు కృతికా శుక్లా మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జనవరి నుంచి అంగన్వాడీ కేంద్రాలకు అమూల్ పాలు అందించేందుకు పరిశీలన జరుగుతోందన్నారు. దీనిపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. -
అంగన్వాడి కేంద్రంలో చిన్నారి మృతి!
గజ్వేల్ రూరల్: అంగన్వాడి కేంద్రానికి వెళ్లిన నాలుగేళ్ల చిన్నారి మృతిచెందింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బయ్యారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కామల్ల రాజు–సంతోష దంపతులకు కొడుకు, కూతురు నిత్య (4) ఉన్నారు. రోజు మాదిరిగానే గురువారం ఉదయం నిత్య అంగన్వాడీ కేంద్రానికి వెళ్లింది. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో నిత్య ఎడమ కాలుకు రక్తం కారుతుండడాన్ని గమనించిన ఆయా పసుపుతో కట్టుకట్టి గదిలోకి తీసుకువెళ్లి పడుకోబెట్టింది. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలంతా భోజనం చేసిన తర్వాత 2గంటల ప్రాంతంలో నిత్యను నిద్రనుంచి లేపేందుకు ప్రయత్నించగా, లేవకపోవడంతో తల్లి సంతోషకు సమాచారం అందించారు. వారు వెంటనే వచ్చి అపస్మారక స్థితిలో ఉన్న నిత్యను గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే నిత్య మృతి చెందినట్టు తెలిపారు. నిత్య ఎడమకాలు పాదం భాగంలో పాముకాటు గుర్తులున్నాయని, తమ కూతురి మృతిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఎస్ఐ అశోక్‌కు ఇచ్చిన ఫిర్యాదులో నిత్య తల్లిదండ్రులు పేర్కొన్నారు. నిత్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
AP: చిన్నారుల బంగారు భవితకు బాటలు
సాక్షి, అమరావతి: చిన్నారుల బంగారు భవితకు బాటలు వేసేలా.. వారికి సంపూర్ణ పోషణ, సమగ్ర విద్య అందించేలా ఫౌండేషన్ పాఠశాలల ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. రాష్ట్రంలో కొత్త విద్యా విధానానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఫౌండేషన్ పాఠశాలల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలు బడిబాట పట్టనున్నాయి. ప్రాథమిక పాఠశాలల ఆవరణలోనే అదనపు తరగతి గదులు నిర్మించి వాటిలోకి అంగన్వాడీ కేంద్రాలను తరలించనున్నారు. వీటిని ఫౌండేషన్ పాఠశాలలుగా నిర్వహించనున్నారు. తొలి దశలో 5,664 అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో కలపనున్నారు. ఇందుకోసం 3,824 ప్రాథమిక పాఠశాలల ఆవరణలో 6,692 అదనపు తరగతి గదులను నిర్మించనున్నారు. వీటివల్ల రాష్ట్రవ్యాప్తంగా మూడు నుంచి ఆరేళ్లలోపు ఉన్న 1,20,165 మంది చిన్నారుల విద్యకు బలమైన పునాది పడనుంది. తొలిదశలో చేపట్టే తరగతి గదుల నిర్మాణాన్ని 2021–2022 మధ్యలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. ఒక్కో తరగతి గది నిర్మాణానికి రూ.10 లక్షలు చొప్పున మొత్తం రూ.669.20 కోట్లు ఖర్చు చేయనుంది. భవితకు బలమైన పునాది బాలల భవితకు బలమైన పునాది వేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా విధానంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే అంగన్వాడీ కేంద్రాలను సమీపంలోని ప్రాథమిక పాఠశాలల్లో కలిపి ఫౌండేషన్ స్కూళ్లుగా వాటిని మార్పు చేస్తున్నారు. తొలి దశలో 5,664 అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో కలపనున్నాం. అంగన్వాడీ కేంద్రాల తరహాలోనే ఫౌండేషన్ పాఠశాలలు బాలలకు అన్ని సౌకర్యాలు, మంచి విద్య అందిస్తాయి. అంగన్వాడీల్లో అందించే సంపూర్ణ పోషణ పథకాన్ని ఫౌండేషన్ పాఠశాలల్లోనూ అమలు చేస్తాం. ఆటపాటలతోపాటు బలమైన ఆహారం, ఆరోగ్యం, విద్యకు కేంద్రంగా ఇవి ఉంటాయి. – కృతికా శుక్లా, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ సంచాలకులు -
మృగాళ్లకు మరణ శాసనం
సాక్షి, అమరావతి: బాలికలు, మహిళలను వేధింపులకు గురిచేసే మృగాళ్లకు మరణ శాసనం తప్పదంటూ రాష్ట్ర ప్రభుత్వం గట్టి సంకేతాలు ఇస్తోంది. రాష్ట్రంలోని మహిళల రక్షణ కోసం ఇప్పటికే దిశ బిల్లు, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ ల్యాబ్ వంటి అనేక పటిష్టమైన చర్యలు చేపట్టిన సంగతి తెల్సిందే. దిశ బిల్లు అనంతరం మృగాళ్లపై తీసుకుంటున్న కఠిన చర్యలను గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించడంతోపాటు మహిళలను చైతన్యవంతం చేసేలా అనేక ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేసింది. అవగాహన కల్పిస్తున్న అంశాలివే.. ► మహిళలు, బాలికల తక్షణ రక్షణ కోసం, వారిపై అకృత్యాలకు పాల్పడిన మృగాళ్లకు శిక్ష పడేలా వేగవంతమైన చర్యల కోసం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్లవాత్మకంగా దిశ బిల్లు–2019 తీసుకొచ్చింది. ► ఇందుకోసం దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, ల్యాబ్‌లు, కోర్డులు వంటివి ఏర్పాటు చేయడం జరిగింది. ► బాలలు, మహిళలపై అకృత్యాలకు పాల్పడే మృగాళ్లపై కేసు నమోదు చేసి ఏడు రోజుల్లో పోలీస్ దర్యాప్తు, 14 రోజుల్లో న్యాయ విచారణ పూర్తి చేసేలా చర్యలు చేపట్టింది. అంటే కేసు నమోదు చేసిన 21 రోజుల్లోనే దోషికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ► మహిళలను మాటలు, చేతల ద్వారా అవమానపర్చటం, సామాజిక మాధ్యమాలు, డిజిటల్ మాధ్యమాల ద్వారా వేధించడం, సోషల్ మీడియాలో అవమానకరంగా పోస్టులు పెట్టడం, అవాంఛిత సందేశాలు పంపడం, వేధింపులకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు. ఈ కేసులో మొదటిసారి తప్పుచేసిన మృగాళ్లకు రెండేళ్లు జైలుశిక్ష, రెండోసారి తప్పుచేస్తే నాలుగేళ్ల జైలుతోపాటు జరిమానా తప్పదు. ► బాలలపై లైంగిక దాడికి పాల్పడిన మృగాళ్లకు ఐదు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు జరిమానా. ► పోలీసులు, సాయుధ బలగాలు, ప్రభుత్వ ఉద్యోగులు, జైలు అధికారులు, సంరక్షణాధికారులు, ఆస్పత్రుల యాజమాన్యాలు, సిబ్బంది వంటి వారు ఆయా ప్రాంగణాల్లో బాలలపై అకృత్యాలకు పాల్పడితే తీవ్రమైన లైంగిక దాడిగా పరిగణిస్తారు. ఇందుకు 14 ఏళ్లకు తక్కువ కాకుండా జీవితకాల కారాగార శిక్షతోపాటు జరిమానా కూడా విధించేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అత్యవసర ఫోన్ నంబర్లు అంగన్వాడీ కేంద్రాల్లో బాలలు, మహిళలు అత్యవసర రక్షణ సేవలను పొందేలా ప్రత్యేకంగా ఫోన్ నంబర్లను ప్రదర్శిస్తున్నారు. పోలీస్ సేవలకు డయల్ 100, ఫైర్ సర్వీసెస్ 101, అంబులెన్స్ డయల్ 108, అత్యవసర సేవ 112, ఉమన్ హెల్ప్‌లైన్ 181, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, సైబర్ మిత్ర 91212 11100, రోడ్డు ప్రమాదాల్లో అత్యవసర లైన్ డయల్ 1073, టూరిస్ట్ హెల్ప్‌లైన్ 1363 వంటి నంబర్లపై అందరికీ అవగాహన కల్పించి వారు వాటిని నమోదు చేసుకుని అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేలా సిద్ధం చేస్తున్నారు. -
అంగన్వాడీలో టర్పంటాయిల్ తాగి చిన్నారి మృతి
మద్నూర్(జుక్కల్): అంగన్వాడీ కేంద్రంలో ప్రమా దవశాత్తు టర్పంటాయిల్ తాగి చిన్నారి మృతి చెందింది. కామారెడ్డి జిల్లాలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం... మద్నూర్ మండలం రాచూర్‌కి చెందిన సూర్యకాంత్ కుమార్తె అదితి(5) శనివారం మినీ అంగన్వాడీ కేంద్రానికి వెళ్లింది. మధ్యాహ్నం ఆ బాలిక నోటి నుంచి నురగ రావడం గమనించిన అంగన్వాడీ కార్యకర్త నగరబాయి బాలికను తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించింది. దీంతో కుటుంబసభ్యులు చిన్నారిని మహారాష్ట్ర దెగ్లూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్ల సూచన మేరకు చిన్నారిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందింది. కాగా, అదితి టర్పంటాయిల్ను అంగన్వాడీ కేం ద్రంలో తాగిందా.. లేక ఆ సమీపంలోని అంగన్ వాడీ కార్యకర్త ఇంట్లో తాగిందా? అనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ పాప టర్పం టాయిల్ తాగి మృతి చెందిందని, దీనికి కార్యకర్త నిర్లక్ష్యమే కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సీడీపీవో సునంద వివరణ కోరగా, ఆదివారం ఉదయం రాచూర్కు వెళ్లి విచారణ చేపడతామని, ఆ తర్వాతే పాప మృతికి గల కారణాలు వివరిస్తామని బదులిచ్చారు. -
పెరుగుతున్న నిరుద్యోగం: ‘ఆయా పోస్టు కూడా మేం చేస్తామయ్యా..’
సత్తుపల్లి టౌన్ : చిన్నపిల్లలను ఇంటి నుంచి తీసుకురావడం.. వారి ఆలనాపాలనా చూస్తూనే పౌష్టికాహారం వండిపెట్టడం.. ఆ తర్వాత ఇంటి వద్ద వదలడం.. ఇవీ అంగన్వాడీ కేంద్రాల్లో ఆయాల విధులు. ఈ పోస్టుకు కనీస విద్యార్హత పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కానీ ఇటీవల జిల్లాలోని కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తే పెద్దసంఖ్యలో దరఖాస్తులు రాగా.. ఇందులో ఉన్నత విద్యావంతులు కూడా ఉండడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. చదవండి: టీఆర్ఎస్ మీటింగ్‌ల్లో పస లేదు.. నాకే బ్రహ్మరథం ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాకపోవడం.. ఒకవేళ వచ్చినా కుటుంబాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి లేని కారణంగా ఉన్న ఊరిలోనే పనిచేయొచ్చనే భావనతో ఈ పోస్టుకు పోటీపడుతున్నట్లు దరఖాస్తులు చెబుతున్నారు. అసలు ఈపోస్టుకు అర్హత ఏమిటంటే.. అంగన్వాడీ ఆయా పోస్టుకు పదో తరగతి ఉత్తీర్ణులైన మహిళలు మాత్రమే అర్హులు, అంగన్వాడీ కేంద్రం పరిధిలోని చిన్నారులను కేంద్రానికి తీసుకురావటం, ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా వంట సిద్ధం చేసి చిన్నారులతో పాటు బాలింతలు, గర్భిణులకు వడ్డించడం వీరి విధి. ఆ తర్వాత కేంద్రాన్ని శుభ్రం చేయటం, పనివేళలు ముగిశాక పిల్లలను ఇంటివద్దకు పంపించి రావాల్సి ఉంటుంది. గతంలో ఆయాలకు నెలకు రూ.6వేల వేతనం ఇస్తుండగా, పీఆర్సీ అమలుతో ఈ వేతనం రూ.7,800కు పెరగనుంది. ఫలితంగా చిన్న పోస్టులో పని ఎలా ఉంటుందనే భావన పక్కన పెట్టి ఉన్నత విద్యావంతులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. 120 పోస్టుల భర్తీకి దరఖాస్తులు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 120 పోస్టులు భర్తీ చేసేందుకు అధికారులు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. ప్రాజెక్టుల వారీగా దరఖాస్తుల పరిశీలన, అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించాక జాబితా తయారీలో నిమగ్నమయ్యారు. దరఖాస్తుదారుల్లో అర్హులను కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఈనెల మొదటి వారంలో ఎంపిక చేయనుంది. అయితే, పరిశీలన సందర్భంగా అధికారులు కొందరి దరఖాస్తులు, సర్టిఫికెట్లను చూసి విస్తుపోయారు. దరఖాస్తుదారుల్లో పలువురు డిగ్రీ, పీజీ పూర్తిచేసి ఉండడంతో ఆశ్చర్యపోయిన వారు వివరాలు ఆరా తీశారు. వేతనం తక్కువైనా సరే.. సొంతూరిలో పనిచేసే అవకాశం ఉండడానికి తోడు కేంద్రంలోని ఇతర పిల్లలతో పాటు తమ పిల్లల ఆలనాపాలనా కూడా చూసుకోవచ్చనే భావనతో ఆయా పోస్టుకు దరఖాస్తు చేసుకున్నట్లు పలువురు చెప్పారని సమాచారం. అంతేకాకుండా ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాకపోవడం, ఒకవేళ నోటిఫికేషన్ వచ్చి ఎంపికైనా పోస్టింగ్ ఎక్కడ వస్తుందోనన్న భావనతో వెనుకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. ఇలా రకరకాల కారణాలతో అంగన్వాడీ కేంద్రాల్లో గరిటె తిప్పేందుకు ఉన్నత విద్యావంతులు సిద్ధమైనట్లు చెబుతున్నారు. చదవండి: యువ రైతు కన్నీటి వ్యథ: 13 ఎకరాల్లో పంట నీట మునక.. తట్టుకోలేక కుటుంబాన్ని వదిలి వెళ్లలేక.. నేను ఎంబీఏ పూర్తి చేసి ఆరేళ్లు అయింది. నా భర్త సురేష్ వ్యవసాయం చేస్తాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలి పనులు చేయలేను. అలాగని కుటుంబానికి దూరంగా ఉద్యోగానికి వెళ్లలేను. అందుకే అందుబాటులో ఉన్న ఆయా పోస్టుకు దరఖాస్తు చేసుకున్నా. ఇక్కడైతే నా పిల్లలతో పాటు కేంద్రానికి వచ్చే పిల్లల ఆలనాపాలనా చూసుకునే అవకాశం లభిస్తుంది. ఈ పోస్టు వస్తే అదృష్టంగా భావిస్తా. - హెచ్చు కల్పన, కాకర్లపల్లి, సత్తుపల్లి మండలం సొంతూరిలో ఉండొచ్చని... ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తిచేశా. నా భర్త వీరబాబు ఉపాధిహామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. మాకు ఇద్ద రు కుమారులు. మాది పేద కుటుంబమైనందున ఆయా పోస్టు చిన్నదా, పెద్దదా అని చూడలేదు. సొంత ఊళ్లో ఉపాధి లభిస్తుందని మాత్రమే ఆలోచించా. - నడ్డి కృష్ణవేణి, కాకర్లపల్లి, సత్తుపల్లి మండలం ఏర్పాట్లు చేస్తున్నాం.. శనివారం నుండి బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని ఆదేశాలు అందాయి. కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్ ఆదేశాలతో మండల కేంద్రాలకు చీరలు పంపించాం. అక్కడి నుంచి తహసీల్దార్ల పర్యవేక్షణలో గ్రామపంచాయతీలకు పంపిస్తాం. ఆహారభద్రత కార్డులో పేరు ఉండి 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ చీరలు అందిస్తాం. - ఎం.విద్యాచందన, డీఆర్డీఓ శుభ పరిణామం.. ఆయా పోస్టులకు ఉన్నత విద్యావంతులు కూడా దరఖాస్తు చేసుకోవటం శుభపరిణా మం. యూజీ, పీజీ పూర్తిచేసిన వారు ఎంపికైతే చిన్నారులకు ప్రీ స్కూల్ కార్యక్రమాలు టైం టేబుల్ ప్రకారం అందించడానికి ఉపయోగపడుతుంది. అలాగే, వర్క్‌బుక్స్ కూడా చదివించడం, రాయించడం, మెరుగైన విద్య అందించేందుకు దోహదం చేస్తాయి. - సీహెచ్ సంధ్యారాణి, ఐసీడీఎస్ పీడీ, ఖమ్మం -
అంగన్వాడీ టీచర్‌పై అమానుషం.. దుస్తులు చింపి.. సెల్‌ఫోన్ లాగేసుకుని
-
అంగన్వాడీ టీచర్‌పై అమానుషం.. దుస్తులు చింపి.. సెల్‌ఫోన్ లాగేసుకుని
మహబూబాబాద్ రూరల్: అంగన్వాడీ టీచర్‌పై స్థానికులు అమానుషంగా ప్రవర్తించారు. ఆమె రాజీనామా కోరుతూ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మానుకోట మండలంలోని ఇస్లావత్‌తండా గ్రామపరిధిలోని తేజావత్తండాలో చోటుచేసుకుంది. కురవి ఎస్సై బి.రాణాప్రతాప్ వివరాల ప్రకారం.. ఆ గ్రామంలోని అంగన్వాడీ టీచర్ కమల. అంగన్వాడీ కేంద్రం నిర్వహణ విషయంలో కొంతకాలంగా టీచర్‌కు, స్థానికులకు మధ్య వ్యక్తిగత గొడవలు జరుగుతున్నాయి. అవికాస్త పెరిగి సోమవారం రాత్రి ఘర్షణకు దారితీశాయి. స్థానికుల దాడిలో కమల గాయపడింది. పుస్తెలతాడు, సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లారని బాధితురాలు వాపోయింది. దుస్తులు చింపేసి దాడికి పాల్పడ్డారు. స్థానిక సర్పంచ్ రాజీనామా చేయాలని ఒత్తిడి చేశారని.. అందుకు అంగీకరించకపోవడంతో దాడి చేశారని ఆరోపించింది. దాడి అనంతరం కురవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్సై రాణా ప్రతాప్ తెలిపారు. ఉద్యోగానికి రాజీనామాచేయాలంటూ డిమాండ్ చేశారు. -
విషాదం: అక్కతో కలిసి పాఠశాలకు.. నీళ్లు పట్టుకుందామని వెళ్లి..
అడ్డాకుల: పాఠశాలలు తెరిచిన రెండో రోజే జరిగిన ఓ ప్రమాదం ఆ కుటుంబంలో విషాదం నింపింది. సంపు వద్ద నల్లా నీళ్లు పట్టుకుంటుండగా అందులో పడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని కందూర్ ప్రాథమిక పాఠశాలలో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కందూర్ గ్రామానికి చెందిన షాహీనాబేగం, మహ్మద్ రఫిక్ దంపతులకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అంగన్వాడీ కేంద్రానికి వెళ్లే చిన్న కుమార్తె షరీఫా (6) పాఠశాలలో చేరాల్సి ఉంది. కాగా, గురువారం అక్కతో కలసి పాఠశాలకు వెళ్లింది. మధ్యాహ్న భోజన సమయంలో నల్లా నీళ్ల కోసం వెళ్లి పాఠశాల ఆవరణలో ఉన్న సంపులో ప్రమాదవశాత్తు పడి చనిపోయింది. ఈ విషయం తెలియని తల్లిదండ్రులు ఊరంతా వెతికారు. శుక్రవారం ఉదయం సంపులో పాప మృతదేహం కనిపించడంతో కన్నీరు మున్నీరయ్యారు. అధికారుల విచారణ ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలాన్ని జిల్లా సంక్షేమ అధికారి రాజేశ్వరి, తహసీల్దార్ కిషన్, ఎంపీడీఓ మంజుల, ఎస్ఐ విజయకుమార్ తదితరులు పరిశీలించి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. వాస్తవానికి ఈ పాఠశాలలోని ఓ గదిలో అంగన్వాడీ కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు. లాక్డౌన్ కంటే ముందు షరీఫా అంగన్వాడీ కేంద్రానికి వెళ్లేది. ఈసారి పాఠశాలలో చేరాల్సి ఉన్నా తల్లిదండ్రులు ఇంకా చేర్పించలేదు. అక్కతోపాటు వెళ్లిన షరీఫా సంపులో పడి ప్రాణాలు కోల్పోయింది. -
తెలంగాణ అంగన్వాడీ టీచర్లకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కార్యకర్తలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అంగన్వాడీ టీచర్లు, సహాయ సిబ్బంది వేతనాలను 30 శాతం మేర పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా అంగన్వాడీ టీచర్ల వేతనం రూ.10,500 నుంచి రూ.13,650కి పెరగనుంది. అలాగే మినీ అంగన్వాడీ టీచర్ల వేతనం రూ.6 వేల నుంచి రూ.7800కు పెంచుతున్నట్లు ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీ టీచర్లకు పెరిగిన వేతనాలు జూలై నుంచి అమలు చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. (చదవండి: కోర్టు తీర్పును టైప్ చేస్తున్న స్టెనోగ్రాఫర్.. అంతలోనే..) -
ఏపీలోని అంగన్వాడీలు.. పారదర్శక కేంద్రాలు
సాక్షి, అమరావతి: అంగన్వాడీ కేంద్రాల సేవలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని పటిష్ట చర్యలు చేపట్టింది. అంగన్వాడీ కేంద్రాలంటే అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ అనే గత పరిస్థితిని చక్కదిద్ది తల్లీబిడ్డలకు ఉపయోగపడే కేంద్రాలుగా తీర్చిదిద్దింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఈ కేంద్రాలను మరింత పారదర్శకంగా నిర్వహించేలా తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలిస్తున్నాయి. పైన పేర్కొన్న రెండు యాప్‌లు ఈ కేంద్రాల సేవల్ని మరింత అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇప్పటికే యాప్‌ల నిర్వహణపై అంగన్వాడీ టీచర్లకు, అధికారులకు శిక్షణ ఇచ్చారు. ప్రతి మంగళవారం టీసీఎస్ సాంకేతిక నిపుణులతో వర్చువల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ యాప్‌లో అప్డేట్ రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో మొత్తం 32,59,042 మందికి అందించే పౌష్టికాహారంతోపాటు ఇతర సేవలను వైఎస్సార్ సంపూర్ణ పోషణ యాప్ (మొబైల్ అప్లికేషన్)లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. రాష్ట్ర మహిళా, శిశుసంక్షేమశాఖ పర్యవేక్షణలో ఈ ఏడాది జనవరి నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ అప్లికేషన్లో సాంకేతిక లోపాలను చక్కదిద్దడంతో కొద్దిరోజులుగా మంచి ఫలితాలు ఇస్తోంది. దీన్ని యూజర్ ఫ్రెండ్లీగా రూపొందించడంతో పనితీరు బాగుంది. రాష్ట్రంలోని మొత్తం అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు 3,24,378 మంది, బాలింతలు 2,23,085 మంది, మూడేళ్లలోపు చిన్నారులు 15,64,445 మంది, మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 11,47,134 మంది ఉన్నారు. వారి వివరాలను వైఎస్సార్ యాప్‌లో అప్డేట్ చేసి వారిలో ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం, వైద్యం వంటి సేవలు అందుతున్నది లేనిది అప్డేట్ చేస్తున్నారు. లబ్ధిదారుల వివరాలను ఆధార్ నంబరుతో సహా అనుసంధానం చేశారు. పౌష్టికాహారం అందించి లబ్ధిదారుల బయోమెట్రిక్ సేకరిస్తారు. దీనివల్ల ఏ అంగన్వాడీ కేంద్రంలో ఎంతమందికి, ఎప్పుడు పౌష్టికాహార పంపిణీ జరిగిందనేది క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి అధికారుల వరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి లోపాలను చక్కదిద్దే వీలు కలుగుతుంది. మిల్క్ వ్యాన్ ట్రాకింగ్ అంగన్వాడీ కేంద్రాలకు పాల సరఫరాలో లోపాలు లేకుండా చేసేందుకు ఏపీ డెయిరీ ‘మిల్క్ యాప్’ను కొద్దిరోజుల కిందట అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని 181 స్టాక్ పాయింట్లకు పాల వ్యాన్ చేరుకునే వరకు జియో ట్రాకింగ్ సిస్టంతో ప్రత్యేక పర్యవేక్షణ జరుగుతోంది. ప్రతినెల సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా తల్లీబిడ్డలకు పంపిణీచేసే పాలప్యాకెట్ల వివరాలను యాప్‌లో అప్డేట్ చేయాలి. యాప్‌లో లబ్ధిదారుల బయోమెట్రిక్ సేకరించడం ద్వారా ఎటువంటి అవకతవకలకు తావులేకుండా చేస్తున్నారు. రాష్ట్రంలో ఎంతమంది తల్లీబిడ్డలకు పౌష్టికాహార పంపిణీ జరిగింది. ఏయే ప్రాంతాల్లో పంపిణీ పూర్తయింది. ఇంకా ఎవరికైనా పౌష్టికాహారం అందకపోతే కారణాలేమిటి? ఇలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ యాప్’ దోహదం చేస్తుంది. ఏ పాల వ్యాన్ ఎక్కడ బయలుదేరింది. నిర్దేశించిన ప్రాంతానికి ఎప్పటికి చేరింది.. ఇలా పాల వ్యాన్ బయలుదేరిన దగ్గర్నుంచి పాలు అందించేవరకు దాన్ని కనిపెట్టేలా జియో ట్రాకింగ్ దోహదం చేస్తుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఏపీ డెయిరీ రూపొందించిన ‘మిల్క్ యాప్’లో అప్డేట్ అవుతుంటాయి. యాప్‌ల ద్వారా పారదర్శక పనితీరు అంగన్వాడీ కేంద్రాలను పారదర్శకంగా పనిచేసేలా, పాలు, పౌష్టికాహార పంపిణీ పర్యవేక్షణకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ, మిల్క్ యాప్‌లు ఉపయోగపడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 37 వేలు, పట్టణ ప్రాంతాల్లోని దాదాపు 10 వేల అంగన్వాడీ కేంద్రాల్లో ఈ యాప్‌ల నిర్వహణ బాగుంది. గిరిజన ప్రాంతాల్లోని 8 వేల కేంద్రాల్లో మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్ సమస్య కారణంగా సాంకేతిక సమస్యలు ఉన్నట్టు గుర్తించాం. దీన్ని అధిగమించేలా గిరిజన ప్రాంతాల్లోని అంగన్వాడీ నిర్వాహకులకు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశాం. వివరాలను నెట్వర్క్, ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నచోటకు వచ్చి అప్డేట్ చేసే వెసులుబాటు కల్పించాం. వారికి కొద్దిరోజులు గడువు ఇచ్చి యాప్‌ల ద్వారా డేటాను అప్డేట్ చేయాలని ఆదేశాలిచ్చాం. అనంతపురం జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో ఇవ్వాల్సిన పాలను నేలపాలు చేశారనే ఆరోపణల్లో నిజం లేదు. ఆ పాలు చెడిపోవడం వల్ల వాటిని అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేయడం సరికాదని, పూడ్చిపెట్టినట్లు విచారణలో తేలింది. – కృతికాశుక్లా, మహిళా, శిశుసంక్షేమశాఖ సంచాలకులు -
చిన్నారులకు ‘పౌష్టికాహార కిట్స్
సిద్దిపేటజోన్: సిద్దిపేటలో అంగన్వాడీ పిల్లల కోసం మంత్రి హరీశ్‌రావు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. చిన్నారులకు కరోనా థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉందన్న వైద్యుల హెచ్చరికలతో వారిలో రోగనిరోధక శక్తి పెంపే లక్ష్యంగా ‘పౌష్టికాహారం కిట్స్’ పంపిణీని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. కర్ణాటకలో సత్ఫలిస్తున్న ‘క్షీరభాగ్య’ తరహాలో చిన్నారుల్లో ఐరన్ లోపం, రక్తహీనత వంటి సమస్యలు అధిగమించే దిశగా ఇమ్యూనిటీ బూస్టర్ తరహాలో దీనిని రూపొందించారు. అన్నపూర్ణ ట్రస్ట్ సహకారం, దాతల తోడ్పాటుతో జిల్లాలోని చిన్నారులకు పౌష్టికాహారం అందించాలనుకుంటున్నారు. ఎన్ఐఎన్ నిర్ధారణతో... సిద్దిపేట జిల్లాలో ఆయా అంగన్వాడీ కేంద్రాల పరిధిలో గత ఏడాది జాతీయ పోషకాహర సంస్థ (ఎన్ఐఎన్) పర్యవేక్షణలో బృందాలు సర్వే చేసి చిన్నారులకు పోషకాహారలోపం ఉందని నిర్ధారించాయి. ఈ క్రమంలోనే కరోనా థర్డ్ వేవ్ రానుందని, ముఖ్యంగా చిన్నారులపై ప్రభావం చూపనుందని ప్రచారం సాగుతోంది. ఆరేళ్లలోపు చిన్నారుల పోషకాహారలోపం సరిదిద్ది బలవర్ధకమైన పౌష్టికాహారం అందించాలని మంత్రి హరీష్ సంకల్పించారు. ఈ నెల 8న స్థానిక ప్రభుత్వ ఇందిరానగర్ పాఠశాలలో దీనిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. కిట్స్‌లో ఇలా ►జిల్లా మహిళ, శిశు సంక్షేమ శాఖ రికార్డుల ప్రకారం సుమారు 60 వేలమంది చిన్నారులు ఉండగా, వారిలో మూడేళ్ల నుంచి ఆరేళ్ల వయసులోపు ఉన్నవారు సుమారు 25 వేలు. ►వీరిలోని ప్రతి ఒక్కరికీ నెలకు 450 గ్రాముల పౌష్టికాహారం కిట్స్ పంపిణీ చేయనున్నారు. ►కిట్స్‌లో పాలు, షుగర్‌తో పాటు న్యూట్రీషియన్ పౌడర్, విటమిన్ సి, కాల్షియం, జింక్, ఐరన్, మెగ్నీషియం వంటివిS ఉంటాయి. -
ఏపీలో మోడల్ అంగన్వాడీ కేంద్రాలు
-
అంగన్వాడిలు ఇక ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా ..
సాక్షి,శ్రీకాకుళం: కార్పొరేట్ ప్లే స్కూళ్లకు దీటుగా పేదింటి చిన్నారులకు ఆంగ్ల విద్యా బోధన అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అంగన్వాడీలను బలోపేతం చేస్తోంది. గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధనను ప్రారంభించిన వైఎస్సార్ సీ పీ సర్కారు ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలను వైఎ స్సార్ ప్రీ ప్రైమరీస్కూళ్లుగా మార్చి మూడేళ్ల ప్రా యం నుంచే చిన్నారులకు ఏబీసీడీలు నేర్పించేలా ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్య మా దిరిగా పీపీ–1, పీపీ–2 తరగతులను అందుబాటులోకి తెచ్చారు. నూతన విద్యా విధానం ప్రకారం రూపొందించిన పాఠ్యపుస్తకాలను ప్రతి అంగన్వాడీ కేంద్రానికి పంపిణీ చేశారు. 3–6 ఏళ్ల లోపు చిన్నారులకు ఆంగ్ల బోధన చేసేందుకు రూపొందించిన పా ఠ్యాంశాలను విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించేందుకు అవసరమైన శిక్షణను ఇప్పటికే కార్యకర్తలకు అందజేశారు. ఒక్కో కిట్‌లో 8 పుస్తకాలు ఈ విద్యా సంవత్సరం నుంచే అంగన్వాడీ కేంద్రా ల్లో పూర్వ ప్రాథమిక విద్యా విధానాన్ని అమలు చే సేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందు కోసం పీపీ–1, పీపీ–2 పాఠ్య పుస్తకాలు రూపొందించింది. ఆయా పుస్తకాల్లో ఆంగ్లం, తెలుగు, గణి త అక్షరాలు, చిన్నపాటి కథలను పాఠ్యాంశాలుగా పొందుపరిచింది. జిల్లా కేంద్రానికి వచ్చిన పుస్తకాలను ఐసీడీఎస్ అధికారులు 4,191 అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేశారు. కోవిడ్ తీవ్రత తగ్గి, కేంద్రాలు తెరిచిన తర్వాత వీటితోనే కార్యకర్తలు పూర్వ ప్రాథమిక విద్యను బోధించనున్నారు. మూడేళ్లు నిండిన చిన్నారులకు పీపీ–1 పుస్తకాలు, నాలుగేళ్లు నిండిన వారికి పీపీ–2 పుస్తకాలు ఇవ్వనున్నారు. ప్ర తి అంగన్వాడీ కేంద్రానికి ఒక్కో పీపీ–1, పీపీ–2 కిట్లను అందజేశారు. ఒక్కో కిట్‌లో 8 పుస్తకాలు చొ ప్పున ఉన్నాయి. ఆంగ్లం, తెలుగు, గణితం, ఆంగ్లం వర్క్‌బుక్, డ్రాయింగ్, యాక్టివిటీ తదితర సబ్జెక్టులు ఉన్న పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలు రావ డం లేదు. రానున్న రోజుల్లో కేంద్రాలు తెరిస్తే ప్ర భుత్వం ఇచ్చిన పుస్తకాలను చిన్నారులకు ఇచ్చి పాఠాలు చెప్పనున్నారు. -
అంగన్వాడీ పోస్టుల భర్తీకి సిద్ధం
సాక్షి, అమరావతి బ్యూరో: అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలు మార్చి వాటిని ప్రీప్రైమరీ స్కూళ్లుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే నాడు–నేడు పథకం ద్వారా ఈ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పిస్తోంది. దీనిలో భాగంగానే అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల పోస్టుల భర్తీకీ కార్యాచరణ చేపట్టింది. ఈ మేరకు సర్కారు నుంచి ఆదేశాలు రావడంతో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ రూపొందించి 250 పోస్టుల భర్తీకి కలెక్టర్ ఆమోదాన్నీ పొందింది. డివిజన్ల వారీగా త్వరలో నోటిఫికేషన్ జారీకి చర్యలు ప్రారంభించింది. ఈ పోస్టులకు రోస్టర్ పాయింట్ల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించనున్నారు. రోస్టర్, మెరిట్ ప్రకారం పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నారు. 250 ఉద్యోగాలు ఖాళీ జిల్లాలో 23 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా వీటి పరిధిలో మొత్తం 4,405 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 4,351 ప్రధాన కేంద్రాలు, 54 మినీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల ద్వారా 7 నెలల నుంచి 3 ఏళ్ల మధ్య ఉన్న చిన్నారులు 1,42,196 మంది, 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలు 85,328 మంది, బాలింతలు, గర్భిణులు మరో 61,818 మంది లబ్ధిపొందుతున్నారు. జిల్లాలో 50 అంగన్వాడీ కార్యకర్తలు, 200 సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కలెక్టర్ చైర్మన్‌గా నియామక కమిటీ ఈ పోస్టుల భర్తీకి కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు కానుంది. ఈ కమిటీలో మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి కనీ్వనర్‌గా, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి, ఆర్డీఓ, సంబంధిత ప్రాజెక్ట్ సీడీపీఓలు సభ్యులుగా ఉండనున్నారు. ఎస్సీ, ఎస్టీ హాబిటేషన్లలో ఖాళీగా ఉన్న పోస్టులను ఆయా సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులతోనే భర్తీ చేయాల్సి ఉంటుంది. మిగిలిన ఖాళీలకు రిజర్వేషన్ ప్రక్రియను అనుసరించి అర్హులను ఎంపిక చేయనున్నారు. అభ్యర్థికి ఉండాల్సిన అర్హతలు ఇలా.. ఈ ఏడాది జూలై 1వ తేదీకి 21 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి. పోస్టు ఖాళీ ఉన్న ప్రాంతానికి చెందిన వివాహితై ఉండాలి అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ట్రైబల్ ఏరియాల్లో కొంత వెసులుబాటు ఉంది. అంగన్వాడీ ఆయా పోస్టుకు ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. పారదర్శకంగా భర్తీ కలెక్టర్ ఆమోదం తెలపడంతో త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నాం. రెవెన్యూ డివిజన్ల వారీగా ఖాళీలను ఆర్డీఓలకు పంపాం. వారితో సమన్వయం చేసుకుని వీలైనంత త్వరగా భర్తీ ప్రక్రియ చేపడతాం. నియామకాలు పారదర్శకంగా నిబంధనల ప్రకారమే జరుగుతాయి. ఎవరూ దళారులను నమ్మొద్దు. – మనోరంజని, పీడీ, ఐసీడీఎస్, గుంటూరు -
అంగన్వాడీ కేంద్రాలకు ఫోర్టిఫైడ్ బియ్యం
సాక్షి, అమరావతి: అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఈ నెల నుంచి సార్టెక్స్ బియ్యానికి బదులు పోషకాలతో కూడిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందిస్తున్నట్టు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. పౌర సరఫరాల సంస్థ ద్వారా ఈ బియ్యాన్ని సరఫరా చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫోర్టిఫైడ్ బియ్యంలో సూక్ష్మపోషక విలువలతో పాటు రక్తహీనతను నివారించే ఐరన్, గర్భస్థ శిశువు వికాసానికి ఉపకరించే ఫోలిక్ ఆమ్లం, నాడీ వ్యవస్ధ బలోపేతానికి అవసరమైన విటమిన్ బి–12 వంటివి ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 7.15 లక్షల గర్భిణులు, బాలింతలు, 9.66 లక్షల పిల్లలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఈ బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలపై క్షేత్ర స్థాయిలో ప్రాజెక్ట్ డైరెక్టర్స్, సీడీపీవోలకు తగిన సూచనలు ఇచ్చి విస్తృత ప్రచారం చేయాల్సిందిగా ఆదేశించామన్నారు. అంగన్వాడీ కేంద్రాలతో అనుసంధానమైన లబ్ధిదారులంతా ఈ సదుపాయాన్ని వినియోగించుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాల్లోని లబ్ధిదారుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించడానికి వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని కృతికా శుక్లా గుర్తు చేశారు. -
నెట్టింట 'బుడి బుడి' బడి
సాక్షి, విజయవాడ: అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు విద్యపై ఆసక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకంగా ఆటపాటలతో రూపొందించిన పాఠాలు బోధిస్తున్నారు. కరోనా కాలంలో చిన్నారులకు ఈ బోధన చేయడం ఇబ్బందిగా మారింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ‘ఇంటివద్దకే విద్య’ పేరుతో వైఎస్సార్ ప్రీ–ప్రైమరీ విద్యను అందించాలని నిర్ణయించింది. వంద రోజుల ప్రణాళికను రూపొందించి ఈ శిక్షణ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభించారు. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చిన్నారుల తల్లిదండ్రుల సెల్‌ఫోన్ నంబర్లతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి విద్యార్థులకు అర్థమయ్యేలా రోజుకో అంశంపై పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. యూట్యూబ్ ద్వారా ఈ పాఠాలను ఎంపిక చేసిన వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తారు. దీనివల్ల చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లకుండా ఇంట్లో ఉంటూ ఆటపాటలతో విద్య అందుతోంది. 3,812 కేంద్రాల్లో విద్యాబోధన కృష్ణా జిల్లాలో 3,812 అంగన్వాడీ కేంద్రాల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి 67,357 మంది ప్రీ స్కూల్ పిల్లలకు విద్యాబోధన అందిస్తున్నారు. 32 నుంచి 72 నెలల వయసు కలిగిన చిన్నారులు ఇంట్లోనే ఆడుతూ పాడుతూ నేర్చుకునేలా పద్యాలు, పాటలు చిత్రాలు తల్లుల ఫోన్లకు పంపుతున్నారు. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో పొందుపరుస్తూ వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం సరుకుల వివరాలు అందుబాటులో ఉంచుతున్నారు. ఎవరికైనా అనారోగ్యం వస్తే తక్షణమే గ్రూపులో సమాచారం పొందుపరిస్తే దగ్గరలో ఉన్న ఏఎన్ఎంల ద్వారా అంగన్వాడీలు మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తున్నాయి. కోవిడ్‌పై అవగాహన చిన్నారులు, బాలింతలు, గర్భిణులు కోవిడ్ బారిన పడకుండా అంగన్వాడీలు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు సూచిస్తూ వారిని చైతన్యపరిచేందుకు ఆన్లైన్ విధానాన్ని వినియోగించుకుంటున్నారు. వ్యాక్సిన్‌పై అవగాహన కలిగిస్తూ అందరూ వ్యాక్సిన్ వేసుకున్నదీ, లేనిది వాట్సాప్ గ్రూపుల్లో పొందుపరుస్తున్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా అంగన్వాడీ నిర్వహణ సమయం కుదించి కర్ఫ్యూ సమయం కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా సమయంలో ఉపయుక్తంగా ఉంది.. కరోనా సమయంలో చిన్నారులు స్కూలుకు రావడం కుదరదు. విద్యార్థుల తల్లిదండ్రులు ఇళ్లలోనే ఉంటున్నారు. ఆన్లైన్లో పాఠాలు చెప్పడం వల్ల విద్యార్థుల్లో జిజ్ఞాస పెరుగుతోంది. తల్లుల వద్ద ఉండి పాఠాలు నేర్చుకుంటున్నారు. పిల్లలు ఉత్సాహంగా ఉన్నారు. – వెంకటలక్ష్మి, సీడీపీవో, గన్నవరం -
YSR Pre Primary Schools: బాల బడికి సొంత ఒడి
చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అందించే అంగన్వాడీ కేంద్రాలను అన్నివిధాలా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీటిని ‘వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లు’గా మార్చి.. పిల్లలకు పౌష్టికాహారంతో పాటు ఆంగ్ల విద్యనూ అందిస్తోంది. ఈ ‘బాల బడులు’ కొత్త రూపు సంతరించుకుంటుండటంతో చిన్నారులు ఆహ్లాదకర వాతావరణంలో ఉత్సాహంగా అక్షరాలు దిద్దుకోవడంతో పాటు తల్లిదండ్రుల్లోనూ ఎనలేని సంతోషాన్ని నింపుతోంది. – కర్నూలు (రాజ్‌విహార్) రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో తొలి విడతగా 8,047 కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు. వీటిలో 4,706 కేంద్రాలకు నూతన భవనాలు నిర్మించనున్నారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ.14 లక్షలు వెచ్చిస్తున్నారు. ఇందులో రూ.10.20 లక్షలతో భవన నిర్మాణ పనులు, రూ.2.80 లక్షలతో విద్యుత్, నీటి సౌకర్యం, ఫర్నిచర్, రూ.99 వేలతో టాయిలెట్లు, ఇంటర్నల్ పనులు చేయనున్నారు. అలాగే 3,341 కేంద్రాలను ఆధునికీకరిస్తారు. వీటిలో భవనాల అప్‌గ్రేడేషన్‌తో పాటు మౌలిక సదుపాయాలు, విద్యాబోధనకు అవసరమైన వసతులు కల్పిస్తారు. అవసరాన్ని బట్టి ఒక్కో కేంద్రానికి రూ.50 వేల నుంచి రూ.5.50 లక్షల వరకు ఖర్చు చేయనున్నారు. పనుల బాధ్యత గృహ నిర్మాణ సంస్థకు.. అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేసే పనులను గృహ నిర్మాణ సంస్థకు అప్పగించారు. గడువులోపు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆ సంస్థ ఇంజినీరింగ్ అధికారులతో ఐసీడీఎస్ ఉన్నతాధికారులు ఇప్పటికే సమీక్షలు నిర్వహించారు. పనుల్లో నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించారు. నాణ్యతపై ప్రశ్నించేందుకు వీలుగా బాలల తల్లులనూ ప్రభుత్వం భాగస్వామ్యం చేస్తోంది. ప్రతి అంగన్వాడీకి ఏడుగురితో కమిటీ ఏర్పాటు చేస్తోంది. కన్వీనర్‌గా సూపర్వైజర్, సభ్యులుగా అంగన్వాడీ టీచర్, గ్రామ/వార్డు మహిళా పోలీసు, ఇంజనీరింగ్ అసిస్టెంట్‌తో పాటు రెండేళ్ల నుంచి నాలుగేళ్ల వయసున్న చిన్నారుల తల్లులు ముగ్గురు ఉంటారు. ఈ కమిటీ పేరున బ్యాంకు ఖాతా తెరిచి.. ఇద్దరికి చెక్ పవర్ ఇస్తారు. వీరి ద్వారానే అవసరమైన నిధులు డ్రా చేయాల్సి ఉంటుంది. ప్రారంభమైన ఆంగ్ల బోధన అంగన్వాడీల్లో 3నుంచి 6 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు ఈ ఏడాది ఫిబ్రవరి 1నుంచే ఇంగ్లిష్ బోధిస్తున్నారు. పిల్లల్లో ఆసక్తి పెంచేలా ఆట వస్తువులు, బొమ్మలతో చదువు నేర్పిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక సిలబస్ రూపొందించడంతో పాటు సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 3–6 ఏళ్ల మధ్య వయసున్న 10,88,461 మంది చిన్నారులు ఏబీసీడీలు దిద్దుతున్నారు. చిన్నారుల్లో నూతనోత్తేజం ఐదేళ్లలోపు చిన్నారులకు గ్రహించే శక్తి బాగా ఉంటుంది. ఈ సమయంలో విద్యాపరమైన, మంచి విషయాలను చక్కగా గ్రహిస్తారు. అందుకే వాళ్లకు నాణ్యమైన ఆహారంతో పాటు మంచి విద్య అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంగన్వాడీ కేంద్రాలను వైఎస్సార్ ప్రీ ప్రైమరీ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మార్చాం. అందుకు తగ్గట్టుగా సిబ్బందికి అందరికీ శిక్షణ ఇచ్చాం. – కృతికా శుక్లా, స్టేట్ డైరెక్టర్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆడిస్తూ.. పాడిస్తూ.. పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడంతో పాటు వారిని ఆడిస్తూ, పాడిస్తూ విద్య నేర్పిస్తున్నాం. మాకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే పిల్లలకు ఇంగ్లిష్ నేర్పిస్తున్నాం. పిల్లల్లో ఆసక్తి కలిగేలా వస్తువులు, బొమ్మలతో బోధిస్తున్నాం. – శ్రీదేవి, అంగన్వాడీ టీచర్, కర్నూలు భవనాలు నిర్మిస్తే కొత్త లుక్ అంగన్వాడీ సెంటర్లకు కొత్త భవనాలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. దీనివల్ల సౌకర్యాలు ఏర్పడి కొత్త లుక్ వస్తుంది. అలాగే ఇంగ్లిష్ బోధించడం వల్ల పిల్లల బంగారు భవిష్యత్‌కు బాటలు వేసినట్లు అవుతుంది. – తరంగిణి, చిన్నారి తల్లి, కర్నూలు -
అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం ముమ్మరం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అద్దె భవనాల్లో అరకొర సౌకర్యాలతో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు పక్కా సొంత భవనాల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో 27,490 అద్దె భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలున్నట్లు గుర్తించారు. వీటిలో 25,455 కేంద్రాలకు ప్రభుత్వం సొంత స్థలాలను గుర్తించింది. ఇందులో ఇప్పటికే 9,143 కేంద్రాల భవన నిర్మాణాలకు రూ.386.88 కోట్లు మంజూరు చేసింది. వీటిలో 7,996 భవనాల నిర్మాణ పనులు ప్రారంభం కాగా, ఇప్పటికే 4,466 భవనాల నిర్మాణం కూడా పూర్తయింది. మరో 1,133 భవనాల పనులు బేస్మెంట్ స్థాయిలో, 1,025 భవనాలు గ్రౌండ్ ఫ్లోర్ శ్లాబ్ స్థాయిలో ఉన్నాయి. 1,372 భవనాలకు శ్లాబ్ కూడా పూర్తయింది. -
బాల్యం.. బలహీనం
సాక్షి, హైదరాబాద్: ‘తిండి కలిగితే కండ కల దోయ్.. కండ కలవాడేను మనిషోయ్’అన్నాడు కవి గురజాడ. సమయానుకూలంగా ఆహారం తీసుకోక పోవడంతో అనర్థాలు తలెత్తుతాయి. గర్భిణులు, బాలింతలు సరైన ఆహారం తీసుకోక పోవడం పుట్టబోయే, పుట్టిన పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. పుట్టినప్పటి నుంచి ఆర్నెల్ల వరకు పిల్లలు తల్లిపాల పైనే ఆధారపడతారు. తల్లి సరైన ఆహారం తీసుకోకుంటే పిల్లలకు సరిపడా పాలు అందక సమస్యల బారినపడే ప్రమాదం ఉం టుంది. అంగన్వాడీల్లో నమోదైన ప్రతి 100 మంది చిన్నారుల్లో 15 మంది పౌష్టికాహార లోపంతో సతమతమవుతున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిశీలన చెబుతోంది. 2.16 లక్షల మంది చిన్నారుల పరిశీలన రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నా రుల ఆరోగ్య స్థితిని వారి బరువు ఆధారంగా నిర్ధారిస్తున్నారు. ఈ క్రమంలో పక్షం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు వయసున్న 2,16,044 మంది చిన్నారుల బరువును కొలిచారు. వీరిలో 1,34,429 మంది చిన్నారులు సాధారణ బరువుతో ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించారు. మరో 33,034 మంది చిన్నారులు సాధారణ బరువు కంటే 15– 25 శాతం తక్కువగా ఉన్నారు. వీరిలో 8,191 మంది చిన్నారులు 35 శాతం కంటే తక్కువ బరువున్నట్లు తేల్చారు. ఆరోగ్యంగా ఉన్న చిన్నా రుల విషయంలో తల్లిదండ్రులకు సలహాలు, సూచ నలు ఇచ్చి సరిపెట్టగా... బరువు తక్కువున్న చిన్నా రుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని నిర్ణ యించారు. అదేవిధంగా ఆ పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే సాధారణ ఆహారంతో పాటు మరింత పోషకాలు అందే విధంగా అదనపు కోటా కింద ఆహార పంపిణీ చేయనున్నారు. ఈ రకం పిల్లలను ప్రతివారం పరిశీలించి ఆరోగ్య స్థితిని అంచనా వేయనున్నారు. మరో 48,581 మంది చిన్నారులు నిర్ణీత బరువు కంటే అధికంగా (ఓవర్ వెయిట్) ఉన్నట్లు గుర్తించారు. ఈ పిల్లల తల్లులకు సరైన జాగ్రత్తలు పాటించాలని, లేకుంటే ఊబకాయం బారినపడే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా పిల్లలకు ఇచ్చే ఆహారం క్రమపద్దతిలో ఉండాలని సూచిస్తూ మెనూను రూపొందించి ఇస్తున్నారు. పౌష్టిక పునరావాసానికి 1.2 శాతం పిల్లలు బరువును అంచనా వేస్తూ పిల్లల ఆరోగ్యస్థితిని గుర్తిస్తున్న అధికారులు... ప్రమాదకరంగా ఉన్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. ప్రస్తుతం బరువును పరిశీలించిన వారిలో 2,658 మంది చిన్నారులు తీవ్ర పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. వీరిని ఎన్ఆర్సీ (న్యూట్రీషియన్ రిహాబిలిటేషన్ సెంటర్)కి రిఫర్ చేస్తూ కొంతకాలం అక్కడే ఉండేలా అడ్మిట్‌కు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా 23,917 పిల్లల ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు. ఈ చిన్నారుల కోసం ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించి ఆరోగ్య స్థితిని నమోదు చేయాల్సిందిగా ఉన్నతాధికారులు వైద్యశాఖ సిబ్బందిని ఆదేశించారు. విటమిన్లు, మినరల్స్‌పై దృష్టి పెట్టాలి పిల్లలకు ఆహారాన్ని ఇచ్చే విషయంలో చాలామంది పరిమాణం (క్వాంటిటీ) పైనే ఎక్కువ దృష్టి పెడతారు. ఈ సమయంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని అందిస్తుంటారు. విటమిన్లు, మినరల్స్ ఉండే ఆహారాన్ని పెద్దగా పట్టించుకోరు. పిల్లలకు ఐరన్, కాల్షియం ఉన్న ఆహారం సమపాళ్లలో ఇస్తేనే వారి ఎదుగుదల ఆశాజనకంగా ఉంటుంది. ఏడాది దాటిన చిన్నారులకు అన్నిరకాల ఆహారాన్ని ఇవ్వొచ్చు. బలవర్ధకమైన ఆహారం పేరిట మార్కెట్లో దొరికే డబ్బాల కంటే ఇంట్లో తయారు చేసే ఉగ్గు శ్రేష్టమైనది. ఈ ఉగ్గులో తృణదాణ్యాలను కలిపి తయారు చేస్తే మంచిది. - డాక్టర్ స్పందన, న్యూట్రిషనిస్ట్ -
ఏక కాలంలో అంగన్వాడీ భవనాల పనులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏక కాలంలో అంగన్వాడీ కేంద్రాల భవనాల పనులు ప్రారంభం కావాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాలను నాడు–నేడు కింద అభివృద్ధి చేయడంతో పాటు, అద్దె భవనాల్లో ఉన్న వాటికి కొత్త నిర్మాణాలను త్వరితగతిన చేపట్టాలని చెప్పారు. ఇందులో 44,119 అంగన్వాడీ కేంద్రాలు మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో, మిగతావి పాఠశాల విద్యా శాఖ పరిధిలో ఉన్నాయన్నారు. రూ.4,600 కోట్లతో మూడు దశల్లో, మూడేళ్లలో వీటి నిర్మాణాలు, పనులు పూర్తి చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో నాడు–నేడు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం అమలుపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్కూళ్లలో పిల్లలకు ఇంగ్లిష్– తెలుగు డిక్షనరీ ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి రోజూ ఒక పదం చొప్పున నేర్చుకునేలా చూడాలని, ఈ తరహాలోనే అంగన్వాడీల్లో కూడా ఒక కార్యక్రమాన్ని అమలు చేయాలని సూచించారు. పీపీ–1 (వైఎస్సార్ ప్రీ ప్రైమరీ) పిల్లలకు 4,17,508 పుస్తకాలు, పీపీ–2 పిల్లలకు 4,17,508 పుస్తకాలను ప్రభుత్వం అందించనుందని అధికారులు వెల్లడించారు. మార్చి 20వ తేదీ నుంచి పుస్తకాల పంపిణీ ప్రారంభించి, ఏప్రిల్ 5 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు వివరించారు. వీటితో పాటు అంగన్వాడీలకు ఇవ్వనున్న 26 బోధనోపకరణాల్లో ఇప్పటికే 16 పంపిణీ చేశామని చెప్పారు. మిగిలిన 10 బోధనోపకరణాలను నెల లోగా పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా అంగన్వాడీల్లో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ఇవ్వనున్న పుస్తకాలు, బోధనోపకరణాలను సీఎం ఆసక్తిగా పరిశీలించారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్‌పై ప్రచారం వైఎస్సార్ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ పథకాలపై పోస్టర్ల ద్వారా వివరాలు అందిస్తున్నామని అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. గ్రామ, వార్డు సచివాలయం, అంగన్వాడీ సెంటర్లలో కూడా ఈ పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పిల్లలకు మంచి ఆహారం అందించడం, శుభ్రతపై నిర్దేశించిన విధివిధానాలతో కూడిన ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) బుక్ అందిస్తున్నామని చెప్పారు. దీనిపై రూపొందించిన వీడియోలను వారికి షేర్ చేస్తున్నామని వెల్లడించారు. ఈ సమీక్షలో మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇవీ ఒక్కో అంగన్వాడీ కేంద్రానికి ఇచ్చే బోధనోపకరణాలు అబాకస్, కలర్ పెన్సిల్ సెట్ (12 రంగుల్లో 5 సెట్లు), క్రేయాన్స్ (12 రంగుల్లో 5 సెట్లు), స్కిప్పింగ్ రోప్ (తాడాట కోసం), బొమ్మల పుస్తకాలు (ఆకారాలు, రంగులు, వాహనాలు, పువ్వులు) 3, పజిల్స్ (పండ్లు, కూరగాయలు, నంబర్లు, వన్యప్రాణులు, అపోజిట్స్), ప్లాస్టిక్ బాలు, బ్యాట్ (రెండు సెట్లు), ఐదు రంగుల్లో మౌల్డింగ్ క్లే (బొమ్మలు చేసేందుకు ఉపయోగించే ఒకరకమైన మట్టి – ఐదు సెట్లు), జంతువులు, పక్షులతో కూడిన చార్టులు, పండ్లు, ఇంగ్లిష్ అక్షరాలు, 1–20 నంబర్లు (ఒక్కో సెట్), సాఫ్ట్ బాల్స్ (2), ట్రేసింగ్ బోర్డు (0–9 నంబర్లు, ఇంగ్లిష్ అక్షరాలు (2 సెట్లు), వాటర్ కలర్స్ (2 సెట్లు), సార్టింగ్ కిట్, నంబర్ పప్పెట్స్–స్టిక్ పప్పెట్స్, శాండ్ పేపర్ నంబర్స్ – ఇంగిష్, తెలుగు అక్షరమాల, ఫ్లాష్ కార్డులు – స్టోరీలు, నంబర్లు, ఇంగ్లిష్ లెటర్స్, బిబ్స్– అల్ఫాబెట్స్, నంబర్స్, అక్షరమాల, ఫింగర్ పప్పెట్స్, సౌండ్ బాక్స్‌లు, నంబర్ డిస్క్–అల్ఫాబెటిక్ డిస్క్, నంబర్ డామినోస్, కాన్వర్జేషన్ కార్డ్స్ (సంభాషణ కోసం), ఎన్ఎస్సీ – నంబర్, షేప్, కలర్, సీవీవీ వర్డ్ బుక్. -
అంగన్వాడీ స్కూళ్లలో అధునాతన సౌకర్యాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ స్కూళ్లలో అధునాతన సౌకర్యాలు కల్పిస్తోంది. శాశ్వత భవనాలతో పాటు విద్యుత్, మరుగుదొడ్ల సౌకర్యం తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపట్టింది. అంగన్వాడీ స్కూళ్లను త్వరలో వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చనున్నందున.. చిన్నారులు స్వేచ్ఛగా చదువుకునేందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మన అంగన్వాడీ నాడు–నేడు కార్యక్రమం ద్వారా స్కూళ్లలో సౌకర్యాల కల్పనకు శ్రీకారం చుట్టింది. 55,607 అంగన్వాడీ స్కూళ్లుండగా.. ప్రభుత్వ భవనాలు 28,169 ఉన్నాయి. ఇవి కూడా 2010కి ముందు నిర్మించినవి కావడంతో.. చాలా వరకు మరమ్మతులకు గురయ్యాయి. దీంతో మరమ్మతులు చేయాల్సిన పనులను ఇంజినీర్ల ద్వారా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇప్పటికే గుర్తించింది. ప్రస్తుతం 27,438 అంగన్వాడీ స్కూళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇందులో 3,928 నూతన భవన నిర్మాణాలు 2016 నుంచి వివిధ దశల్లో ఆగిపోయి ఉన్నాయి. ఈ నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్(ఎస్ఎస్ఆర్) ప్రకారం అంచనాలు తయారు చేసి అసంపూర్తి భవన నిర్మాణాలను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మొత్తం ఈ నిర్మాణాల పూర్తికి ప్రభుత్వం రూ.214 కోట్ల నిధులు కేటాయించింది. అలాగే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా 29.17 కోట్లతో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇక కొత్తగా 8 వేల అంగన్వాడీ భవనాలను ప్రభుత్వం మంజూరు చేసింది. పిల్లలు ఆడుకునేందుకు, ఆహారం తీసుకునేందుకు వీలుగా ఈ భవనాల నిర్మాణాలుంటాయని అధికారులు చెప్పారు. ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాలు పూర్తయ్యి.. కొత్తగా మంజూరైన భవనాల నిర్మాణాలు కూడా పూర్తయితే కొత్తగా 11,928 భవనాలు వస్తాయి. అంటే మరో 15,510 అంగన్వాడీ స్కూళ్లు మాత్రమే అద్దె భవనాల్లో ఉంటాయి. అంగన్వాడీ కేంద్రాల్లో మంచి నీరు సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకు మెరుగైన మంచి నీటి వసతి, కుళాయి నీటిని అందించేందుకు ప్రధాని మోదీ ప్రారంభించిన పథకాన్ని 100 శాతం పూర్తి చేసినట్లు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాయి. గోవా, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు, హరియాణా, పంజాబ్ కూడా 100 శాతం టార్గెట్‌ను పూర్తిచేశాయి. -
తల్లికి టీకా వేసిన కూతురు
కేసముద్రం: ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బందికి వైద్యులు, వైద్యులకు సిబ్బంది కరోనా వ్యాక్సిన్ ఇస్తుండటం మనకు తెలిసిందే. అయితే మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మంగళవారం ఆసక్తికరమైన సంఘటన జరిగింది. తొలిదశలో మహమూద్‌పట్నం అంగన్వాడీ సెంటర్లో ఆయాగా పనిచేస్తున్న ఎల్లమ్మ పేరు జాబితాలో ఉంది. ఆమె పేరు రావడంతో అదే పీహెచ్సీలో పని చేస్తున్న ఎల్లమ్మ కూతురు, ఏఎన్ఎం యాకమ్మ విధుల్లో ఉండటంతో స్వయంగా తన తల్లికి టీకా వేశారు. దీంతో అక్కడున్న సిబ్బంది చప్పట్లు కొట్టి అభినందించారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ జోరుగా సాగుతోంది. రాష్ట్రంలో మొత్తం మూడు రోజుల్లో 69,625 మందికి వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మళ్లీ రేపు టీకాల పంపిణీ సాగనుంది. టీకాల పంపిణీ ముమ్మరంగా సాగుతుండడంతో కేంద్ర వైద్యారోగ్య శాఖ రాష్ట్రాన్ని అభినందించింది. -
ఆడుతూ.. పాడుతూ ఏబీసీడీ
► ప్రీ–స్కూల్ కార్యకలాపాలకు అవసరమైన అంశాలను అభివృద్ధి చేయడానికి అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్ విడుదల చేసింది. ఆటలు, చదువుకు సంబంధించిన సామగ్రితో ప్రీ–స్కూల్ కిట్‌ను అంగన్వాడీ కేంద్రాలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ► ఈ కిట్‌లో అన్ని రకాల పుస్తకాలు, వివిధ వస్తువులు ఉంటాయి. కిట్ విలువ రూ.5 వేలు ఉంటుంది. ప్రతి స్కూలుకు ఒక కిట్‌ను అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సాక్షి, అమరావతి: అంగన్వాడీ స్కూళ్లలో సమూల మార్పులు రాబోతున్నాయి. ఆట పాటల ద్వారా చిన్నారులను అలరిస్తూ విద్యా బుద్ధులు నేర్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానానికి అనుగుణంగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రీ స్కూల్ సిలబస్‌ను రూపొందించింది. ఇకపై రాష్ట్రంలో అంగన్వాడీ స్కూళ్లన్నీ వైఎస్సార్ ప్రీ ప్రైమరీ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మార్పు చెందుతాయి. ప్రీ–స్కూల్ సిలబస్‌కు అనుగుణంగా అన్ని ప్రాజెక్టుల చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్లు, సూపర్వైజర్లకు శిక్షణ పూర్తయింది. అంగన్వాడీ కార్యకర్త హోదాను అంగన్వాడీ టీచర్‌గా మారుస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో అంగన్వాడీ టీచర్లకు జనవరి 18 నుంచి 22 మధ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. వీరిలో ఆంగ్ల భాషా నైపుణ్యాన్ని మెరుగు పరచడానికి కూడా చర్యలు తీసుకుంటోంది. యూ ట్యూబ్ లింక్ ద్వారా భాగస్వామ్యం చేసి, వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని ప్రీ–స్కూల్ పిల్లలు సమర్థవంతంగా విద్య నేర్చుకోవటానికి 25 ముఖ్య కార్యకలాపాల కోసం గుర్తించిన, అభివృద్ధి చేసిన వీడియోలపై అంగన్వాడీ టీచర్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సహాయంతో ఈ వీడియోలను అభివృద్ధి చేశారు. 25 కొత్త కార్యకలాపాలు ఇలా.. క్రమబద్దీకరణ, తోలు బొమ్మలు – కర్రతోలు బొమ్మలు, ఇసుక పేపర్ సంఖ్యలు వర్ణమాలలు – అక్షరమాల, ఫ్లాష్ కార్డుల ద్వారా కథలు, సంఖ్యలు – అక్షరాలు, బిబ్స్ వర్ణమాలలు – సంఖ్యలు – అక్షరమాల (ఒక చిన్నారి మెడలో రంగు రంగుల అక్షరమాల వేసి, ఇతర పిల్లలతో వాటిని చెప్పించడం), వేలు తోలు బొమ్మలు, సౌండ్ బాక్స్‌లు, నంబర్ – వర్డ్ డిస్క్, నంబర్ పిక్చర్ మ్యాచింగ్, రేఖాగణిత ఆకార పెట్టె, సంఖ్య డొమినోస్ (వివిధ రంగుల్లో ఉన్న చుక్కలను గుర్తించి లెక్కపెట్టడం), సంభాషణ కార్డులు, స్టీరియో గ్నోస్టిక్ క్లాత్ బ్యాగ్ (కొన్ని వస్తువులను చూపుతూ ఒక సంచిలో వేశాక, అవి ఏమిటో చెప్పమనడం) ఎన్ఎస్సీ (సంఖ్య, ఆకారం, రంగు) బ్లైండ్ ఫోల్డ్ (కళ్లకు గంతలు కట్టాక, వస్తువులను గుర్తించడం), సీవీసీ వర్డ్ బుక్స్, బెల్స్ మోగించడం, ఉడెన్ బోర్డులను ఉపయోగించడం, దువ్వెన కార్యాచరణతో అద్దం (అద్దంలో చూసి చేయడం), మట్టితో కార్యకలాపాలు, తోలు బొమ్మ థియేటర్, సంఖ్య అసోసియేషన్ స్టాండ్ (వివిధ రంగుల్లో ఉన్న నంబర్లపై రింగ్ విసరడం), వ్యతిరేక పదాలు, ఏకవచనం– బహువచన పదాలు, సరదాగా సరిపోల్చండి అనే 25 రకాల యాక్టివిటీలతో ప్రీ స్కూళ్లలో పిల్లల మెదళ్లకు పదును పెట్టనున్నారు. వినూత్న విధానంలో బోధన కోసం ఓ అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన వస్తువులు వచ్చే నెల నుంచి అంగన్వాడీ స్కూళ్లు – ఫిబ్రవరి 1 నుంచి అంగన్వాడీ స్కూళ్లను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 55,600 అంగన్వాడీ స్కూళ్లలో సుమారు 8.50 లక్షల మంది పిల్లలు చదువుతో పాటు పౌష్టికాహారాన్ని అందుకుంటున్నారు. – తమ పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు 66.6 శాతం మంది తల్లులు సమ్మతించారు. పట్టణాల్లో కాస్త తక్కువ సుముఖత ఉంది. పల్లెల్లో పూర్తి స్థాయిలో పిల్లను పంపించేందుకు తల్లులు అంగీకరించారు. – కరోనా సమయాన్ని అధికారులు ఉపయోగించుకున్నారు. స్కూళ్లు మూసి వేయడం వల్ల పిల్లల రేషన్, గుడ్లు, పాలు వంటివి ఇంటి వద్దకు సరఫరా చేయడం వల్ల ఆ సమయంలో మూడేళ్ల వయసున్న (వెయ్యి రోజులు) పిల్లల సంరక్షణపై ప్రత్యేకంగా ప్రణాళిక తయారు చేశారు. ఇప్పుడు ఈ ప్రణాళికను ఉపయోగించాలని నిర్ణయించారు. పిల్లల పౌష్టికాహారానికి ప్రాధాన్యత ఇస్తూనే సైన్స్ పరంగా పిల్లలు ఆడుకుంటూ నేర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. యూ ట్యూబ్ చానల్ ఏర్పాటు – స్త్రీ శిశు సంక్షేమ శాఖ పిల్లల కోసం యూ ట్యూబ్ చానల్‌ను రూపొందించింది. ఛానల్లో టీచర్లకు అవసరమైన ఇంటర్వ్యూలు, పిల్లలకు అవసరమైన కార్యకలాపాలు ఉంటాయి. ఎర్లీ ఎడ్యుకేషన్‌లో మంచి మార్పులు పిల్లల్లో నూతన ఆలోచనలు తీసుకురావడంతో పాటు ఆడుకుంటూ అన్ని అంశాలను శాస్త్రీయ పద్ధతిలో నేర్చుకునే విధంగా అంగన్వాడీలలో కార్యకలాపాలు రూపొందించాము. ఎర్లీ ఎడ్యుకేషన్‌లో 25 రకాల నూతన పద్ధతులతో బోధన ఉంటుంది. ఇందుకు అనుగుణంగా సిలబస్ రూపొందించాము. స్కూళ్లు మొదలు కాగానే పుస్తకాలు సరఫరా చేస్తాము. పిల్లల్లో పౌష్టికాహార లోపాలను నివారించడంతో పాటు మంచి విద్యను ప్రాథమిక దశలో నేర్చుకునేందుకు ఈ కార్యకలాపాలు ఉపయోగపడతాయి. – డాక్టర్ కృతిక శుక్ల, డైరెక్టర్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ. -
పిల్లల్లో పెరుగుతున్న పౌష్టికాహార లోపం
సాక్షి, అమరావతి : పిల్లల్లో పౌష్టికాహార లోపం దేశంలో పెద్ద సవాలుగా తయారైందని పోషన్ అభియాన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఏడాది నుంచి నాలుగో ఏడాది వరకు పిల్లలు అత్యధికంగా రక్తహీనతతో బాధ పడుతున్నారని పోషన్ అభియాన్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో వెల్లడించిన మూడవ నివేదికలో స్పష్టం చేసింది. 5-9 సంవత్సరాల లోపు పిల్లలతో పాటు 10-19 సంవత్సరాల పిల్లల్లో రక్తహీనతతో పాటు విటమిన్ ఏ, విటమిన్-డి, బి-12, జింక్ లోపాలు అత్యధికంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. పట్టణ ప్రాంతాల పిల్లల్లో ఎక్కువ బరువు, ఊబకాయం పెరుగుతోందని.. ఇందుకు ప్రధాన కారణం ఆహారపు అలవాట్లేనని నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అదనపు పోషకాహారం అందించాలని సూచించింది. సమగ్ర శిశు అభివృద్ధి సర్వీసెస్-సంయుక్త అప్లికేషన్ సాఫ్ట్వేర్ ద్వారా పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలను, గర్భిణులను గుర్తించి అంగన్వాడీ కేంద్రాల ద్వారా సప్లిమెంటరీ పోషకాలను అందించాల్సి ఉందని స్పష్టం చేసింది. వివిధ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ఎక్కువ పౌష్టికాహార లోపం గల పిల్లలు ఉంటున్నారని, రక్తహీనత కూడా కొన్ని జిల్లాల్లో అత్యధికంగా ఉందని, ఆ జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొంది. దేశ వ్యాప్తంగా పోషకాహార లోపం ఉన్న పిల్లల వివరాలు రక్తహీనత 1-4 ఏళ్లలోపు పిల్లలు 41 శాతం 5-9 ఏళ్లలోపు పిల్లలు 24 శాతం 10-19 ఏళ్లలోపు పిల్లలు 28 శాతం విటమిన్-డి లోపం 1-4 ఏళ్లలోపు పిల్లలు 14 శాతం 5-9 ఏళ్లలోపు ప్లిలలు 18 శాతం 10-19 ఏళ్లలోపు పిల్లలు 24 శాతం విటమిన్ బి-12 లోపం 10-19 ఏళ్లలోపు పిల్లలు 31 శాతం 5-9 ఏళ్లలోపు పిల్లలు 17 శాతం 1-4 ఏళ్లలోపు పిల్లలు 14 శాతం పోలిక్ యాసిడ్ లోపం 10-19 ఏళ్లలోపు పిల్లలు 37 శాతం 5-9 ఏళ్లలోపు పిల్లలు 28 శాతం 1-4 ఏళ్లలోపు పిల్లలు 23 శాతం జింక్ లోపం 10-19 ఏళ్లలోపు పిల్లలు 32 శాతం 1-4 ఏళ్లలోపు పిల్లలు 19 శాతం 5-9 ఏళ్లలోపు పిల్లలు 17 శాతం -
రాష్ట్రంలో అంగన్వాడీలు భేష్
సాక్షి, అమరావతి: బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు పటిష్టంగా అమలవుతున్నాయి. గిరిజనులకు ప్రత్యేక పౌష్టికాహారం అందించేందుకు తీసుకున్న ప్రత్యేక చర్యలూ ప్రశంసలందుకుంటున్నాయి. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల పనితీరు బాగుందని, పౌష్టికాహారలోపం గల గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో బాగా పనిచేస్తున్నారని పోషణ్ అభియాన్ మూడో నివేదికలో స్పష్టంగా పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వివిధ రాష్ట్రాల్లో సమగ్ర శిశు అభివృద్ధి సర్వీసు–కామన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ (ఐసీడీఎస్–సీఏఎస్) వినియోగంపై పోషణ్ అభియాన్ సర్వే నిర్వహించి మూడో నివేదికను గత నెలలో సమర్పించింది. ఈ నివేదికలో వివిధ రాష్ట్రాల అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై రంగాల వారీగా ర్యాంకులు ఇచ్చింది. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టగానే అంగన్వాడీ కేంద్రాల పనితీరుపైన, గర్భిణులు, బాలింతలు, పిల్లల్లో పౌష్టికాహారలోపం మీద దృష్టి సారించిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల్లోనే గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారం అందించడంపైన దృష్టి సారించడమే కాకుండా సమీక్షలు నిర్వహించి మెనూను కూడా స్వయంగా సీఎం రూపొందించారు. దీంతో రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల పనితీరులో సమూల మార్పులతోపాటు పౌష్టికాహారం అందించడంలో పురోగతి పోషణ్ అభియాన్ నివేదికలో ప్రస్ఫుటం అయ్యింది. పోషణ్ అభియాన్ నివేదికలోని ముఖ్యాంశాలు ► 55,586 అంగన్వాడీ కేంద్రాల్లో ఐసీడీఎస్–సీఏఎస్ వినియోగిస్తున్నారు. ఇది 99.96 శాతం. రెండో ర్యాంకు. ► 2,210 మంది మహిళా సూపర్వైజర్లు సెల్‌ఫోన్ వినియోగిస్తున్నారు. ఇది 99.24 శాతం, మూడో ర్యాంకు. ► లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఇది 91.11 శాతం. రెండో ర్యాంకు. ► అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన పిల్లల ఎత్తు, బరువును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇది 93.96 శాతం. రెండో ర్యాంకు. ► కమ్యూనిటీ ఈవెంట్స్‌ను 99 శాతం నిర్వహిస్తున్నారు. ► అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన పిల్లల్లో 31.09 శాతం మంది ప్రీ స్కూల్స్‌కు హాజరవుతున్నారు. ఐదో ర్యాంకు. ► అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన గర్భిణులు, మూడునెలల నుంచి 36 నెలల పిల్లలకు ఇంటికే వెళ్లి రేషన్ అందిస్తున్నారు. ఇది 76.17 శాతం. ఆరో ర్యాంకు. ► రాష్ట్ర ప్రభుత్వం 55,607 అంగన్వాడీ కేంద్రాల్లోని దాదాపు 30.16 లక్షలమంది గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు ఏటా రూ.1,863.11 కోట్ల వ్యయంతో వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను అమలు చేస్తోంది. గిరిజనేతర, మైదాన ప్రాంతాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం అమలు చేస్తుండగా, గిరిజన ప్రాంతాల్లోని 77 మండలాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం అమలవుతున్నాయి. -
విద్యా పునాదులు మరింత పటిష్టం
సాక్షి, అమరావతి: విద్యారంగంలో సమూల మార్పుల దిశగా సంస్కరణలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రీప్రైమరీ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి సిలబస్, పుస్తకాలను రూపొందించింది. అంగన్వాడీ కేంద్రాల్లో వైఎస్సార్ ప్రీప్రైమరీ తరగతులను ప్రారంభించనుంది. ఇటీవల జగనన్న విద్యాకానుక పథకం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. పిల్లలకు ఆరేళ్ల వయసు వచ్చేనాటికి 85 శాతం మెదడు అభివృద్ధి చెందుతుందని వివిధ అధ్యయనాలు పేర్కొంటున్నందున ఆ దశలోనే వారిలో చదువుకు సంబంధించిన ప్రాథమిక నైపుణ్యాలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 55 వేల అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో దశలవారీగా ప్రీప్రైమరీ విధానానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రీప్రైమరీ కింద మూడేళ్ల పిల్లలకు పీపీ1, నాలుగేళ్ల పిల్లలకు పీపీ2 ఉంటాయి. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల సమయాల్లోనే ఈ పీపీ1, పీపీ2 తరగతులు కొనసాగనున్నాయి. ఇందుకు సంబంధించిన సిలబస్‌ను రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) రూపొందించింది. జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) రూపొందించిన కరిక్యులమ్‌ను అనుసరించి ఈ పీపీ1, పీపీ2 పుస్తకాలు ఉండనున్నాయి. బోధన, క్లాసులు ఇలా.. ⇔ టీచర్లకు హా్యండ్బుక్తో పాటు పిల్లలకు నాలుగేసి బొమ్మల పుస్తకాలను ఎస్సీఈఆర్టీ రూపొందించింది. ⇔ 3 సెమిస్టర్లుగా ఇవి ఉంటాయి. జూన్-సెప్టెంబర్, అక్టోబర్-డిసెంబర్, జనవరి-మార్చిగా విభజించి ఆ మేరకు హ్యాండ్‌బుక్‌ను రూపొందించారు. ⇔ పీపీ1, పీపీ2 పిల్లల కోసం వేర్వేరుగా బొమ్మల రూపంలో ఉన్న ఫన్‌బుక్, రైమ్స్ బుక్, స్టోరీ బుక్, వర్క్ బుక్ తయారుచేస్తున్నారు. ⇔ టీచర్లకు ఇచ్చే హ్యాండ్‌బుక్‌లో పాఠ్యాంశాలు పిల్లలకు ఎలా చెప్పాలో సూచనలు ఇస్తారు. ⇔ ఇంగ్లిష్, తెలుగు అక్షరమాల, అంకెలతో పాఠ్యపుస్తకాలు ఉంటాయి. పీపీ1లో పరిచయం చేసిన వాటినే పీపీ2లో కొంచెం వివరంగా చూపిస్తూ నేర్పిస్తారు. ⇔ పదినెలల బోధనా కాలంలో నెలకో అంశాన్ని బోధించేలా పుస్తకాలు రూపొందించారు. ⇔ టీచర్లు ఆ అంశాల గురించి చెబుతున్నపుడు వర్కుబుక్లో పిల్లలతో వాటిని గుర్తు పట్టేలా చేస్తారు. ⇔ పీపీ1 పిల్లలకు మౌఖికంగా తరగతులుంటాయి. పీపీ2లో రాతకు సంబంధించిన నైపుణ్యాన్ని అలవడేలా చేస్తారు. ⇔ ఉదయం 9-15కి తరగతులు ప్రారంభమవుతాయి. ఒక్కోటి అరగంట సేపు చొప్పున మొత్తం 6 పీరియడ్లుంటాయి. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు భోజనం, విశ్రాంతికి సమయం ఇస్తారు. ⇔ తరువాత 2 నుంచి 3 వరకు క్లాసులు కొనసాగించి 3.10కి ఇళ్లకు పంపిస్తారు. ఆటపాటలతో విద్యాబోధన: అరగంట కొక అంశాన్ని ఆటపాటలతో నేర్పించేలా కరిక్యులమ్ ఉంటుంది. ఆయా పీరియడ్లలో ఏం చెప్పాలో ఎన్సీఈఆర్టీ ఫ్రేమ్‌వర్క్‌ను అనుసరించి ఎస్సీఈఆర్టీ ఈ కరిక్యులమ్‌ను రూపొందించింది. అంగన్వాడీ టీచర్లకు వీటిపై శిక్షణ ఉంటుంది. దీనికి సంబంధించిన అంశాలను యూట్యూబ్‌లో పెట్టి అంగన్వాడీ టీచర్లు నేర్చుకొనేలా చేయనున్నారు.- ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి -
చక్కని వసతులు.. ఇంగ్లిష్ మాటలు
స్కూళ్ల తరహాలోనే అంగన్వాడీ కేంద్రాల్లోనూ నాడు–నేడు కార్యక్రమం కింద అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తాం. రన్నింగ్ వాటర్‌తో టాయిలెట్లు, తాగు నీరు, చిన్న, పెద్ద మరమ్మతులు, విద్యుదీకరణ,కిచెన్, రిఫ్రిజిరేటర్, ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డు, 55 అంగుళాల టీవీ, గోడలపై పెయింటింగ్స్‌తో పాటు ప్లే జోన్ (క్రీడా స్థలం) ఉండేలా మార్పులు చేయాలి. ఈ పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడొద్దు. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల రూపు రేఖలు పూర్తిగా మార్చబోతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. 55,607 అంగన్వాడీల్లో కొత్తగా 27,438 అంగన్వాడీ కేంద్రాల భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో తొలి దశలో 17,984 భవనాల నిర్మాణాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రారంభించాలని, రెండో దశలో 9,454 భవనాల నిర్మాణం వచ్చే ఏడాది నవంబర్ 14న ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. మిగతా వాటన్నింటిలో 10 రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో నాడు–నేడు, వైఎస్సార్ ప్రీప్రైమరీ స్కూళ్లపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. నాడు–నేడు, వైఎస్సార్ ప్రీప్రైమరీ స్కూళ్లపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో సీఎస్ నీలం సాహ్ని, మంత్రులు వనిత, ఆదిమూలపు సురేష్ తదితరులు వైఎస్సార్ ప్రీప్రైమరీ స్కూళ్లు.. పీపీ–1, పీపీ–2 ► అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మహిళా శక్తి కేంద్రాల (ఎంకేఎస్) సూపర్వైజర్లు ఇంగ్లిష్‌లో మాట్లాడడం కోసం సాధన ప్రారంభించాలి. ఇందుకు మొబైల్ యాప్ రూపొందించాలి. నవంబర్ రెండో వారం నుంచి పీపీ–1, పీపీ–2 స్కూళ్లు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలి. ► కిండర్ గార్టెన్ స్కూల్స్‌లో ఉన్న పాఠ్య ప్రణాళిక అధ్యయనం చేయాలి. అక్కడ అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు ఇక్కడ కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలి. అంగన్వాడీ టీచర్స్ ట్రైనింగ్ పక్కాగా ఉండాలి. మరింత ఛాలెంజింగ్‌గా ఉండాలి. ► ఈ సమీక్షలో మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, సీఎస్ నీలం సాహ్నితో పాటు, విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు, మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యా శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డిసెంబర్లో నాడు–నేడు పనులు ► నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ఈనెల 30వ తేదీ నాటికి స్థలాలు గుర్తింపు పూర్తి చేసి, ఆ తర్వాత అంగన్వాడీ అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేయాలి. మెటీరియల్ సేకరణ, ఇతర పనులన్నీ పూర్తి చేసుకుని, ఈ ఏడాది డిసెంబర్ 1న పనులు మొదలుపెట్టి, వచ్చే ఏడాది జూన్ 30 నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకోవాలి. ► కొత్తగా ఏర్పాటు చేస్తున్న అడ్వైజరీ కమిటీ, కరిక్యులమ్ కమిటీలు.. ఫుడ్, శానిటేషన్, బాత్రూమ్స్‌పై కూడా మానిటరింగ్ చేయాలి. -
ఆరోగ్య సలహానా... ట్వీట్ చెయ్!
‘‘పాఠశాలల మూసివేతతో పిల్లల దినచర్య గాడి తప్పింది. వారి అల్లరిని అదుపులో పెట్టే, క్రమ పద్ధతిలోకి తీసుకొచ్చేందుకు వారు చేయాలనుకునే పనులతో ప్రణాళిక తయారు చేయండి. ఇంట్లో పనులు చేసేందుకు అనుమతివ్వం డి. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చే పనుల్లో సాయం చేస్తే వారికి అలవాటవుతుంది.’’ ‘‘కోపాన్ని తగ్గించుకోవాలా? వెంటనే లోతైన శ్వాస తీసుకొండి. పది సెకన్లపాటు ఊపిరి బిగపట్టి వదిలేయండి. ఇలా ఐదు సార్లు చేస్తే చికాకు, కోపం తగ్గి సాధారణ స్థితికి చేరుకుంటారు’’ ‘‘చిన్నారుల మెదడు అభివృద్ధి కావాలంటే అయోడైజ్డ్ ఉప్పును వాడండి. అయోడిన్ శిశువు మెదడు అభివృద్ధికి సాయపడుతుంది, గర్భస్రావాల నుంచి రక్షిస్తుంది. తల్లి, పిల్లల క్షేమం కోసం అయోడైజ్డ్ ఉప్పును మాత్రమే వాడాలి’’ సాక్షి, హైదరాబాద్: ఈ సూచనలేమిటనుకుంటున్నారా...? అవేనండీ.. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ట్విట్టర్, ఫేస్బుక్ పేజీలో ఇస్తున్న సందేశాలు, సూచనలివి. మహిళలు, శిశువుల ఆరోగ్యం ప్రచారానికి సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంది. ఈ దిశగా ఆ శాఖ వినూత్న ప్రచారానికి తెరలేపింది. అంగన్వాడీ కేంద్రాల్లో నేరుగా ఇచ్చే సలహాలు, సూచనలతోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం కల్పిస్తోంది. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు ప్రత్యేక పేజీలున్నాయి. వీటికి వేలసంఖ్యలో ఫాలోవర్లూ ఉన్నారు. స్మార్ట్‌గా సలహాలు... స్మార్ట్ఫోన్ల వాడకం పెరుగుతుండటంతో అందుకు తగినట్లుగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అవగాహన కార్యక్రమాలను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల ద్వారా కార్యక్రమాలు ప్రారంభించింది. రెండేళ్ల క్రితమే ఈ ఖాతాలు తెరిచినప్పటికీ... లాక్డౌన్, అనంతర పరిస్థితుల నేపథ్యంలో వీటిపై విస్తృత ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించిన అంశాలే లక్ష్యంగా ఈ ప్రచారం చేపట్టింది. మహిళలు తీసుకునే ఆహారం మొదలు, ఆరోగ్య స్థితి, సమస్యలు, వాటికి సమాధానాలు ఇస్తూ ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో అంగన్వాడీలకు వచ్చే లబ్ధిదారులతో సలహా లిప్పిస్తున్నారు. వారి వ్యక్తిగత అనుభవాలతో కూడా వీడియోలు తీసి ట్విట్టర్లో అప్లోడ్ చేస్తున్నారు. ఫాలోవర్స్ లిస్టులో నీతి ఆయోగ్... రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. తాజాగా ప్రతి జిల్లాలో జిల్లా సంక్షేమాధికారి ట్విట్టర్, ఫేస్బుక్ ఖాతాను తెరిచారు. ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో సీడీపీవోలు కూడా ఇదే తరహాలో ఖాతాలు తెరిచి ఫాలో అవుతున్నారు. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఖా తాను కేంద్ర మహిళాభివృద్ధి శాఖ, నీతి ఆయోగ్ సైతం ఫాలో అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పోస్టులకు అవి లైక్ కొట్టడం, షేర్ చేయడంతోపాటు అభినందిస్తుండటం గమనార్హం. -
రూ. 4,000 కోట్లతో అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి
సాక్షి, అమరావతి: అంగన్వాడీ కేంద్రాలను రూ.4,000 కోట్లతో అభివృద్ధి చేసి నాడు–నేడు కార్యక్రమం ద్వారా రూపు రేఖలు మార్చనున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. స్కూళ్లలో సదుపాయాలు కల్పిస్తున్న తరహాలోనే అంగన్వాడీ కేంద్రాల్లో కూడా పరిశుభ్రమైన తాగు నీరు, రన్నింగ్ వాటర్‌తో బాత్‌రూమ్స్‌తోపాటు ఫర్నిచర్, ఫ్యాన్లు ఉండాలని సూచించారు. ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించామని, అంగన్వాడీలు ఇకపై వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా ఉంటాయని తెలిపారు. అంగన్వాడీల పాఠ్యప్రణాళికపై విద్యా శాఖ దృష్టి పెట్టాలని ఆదేశించారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా అంగన్వాడీ టీచర్లకు సులభమైన బోధనా విధానాలపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రీ స్కూల్ విద్యపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ... ► పిల్లలకు పాలు, గుడ్లు , తదితరాలు నిల్వ చేసేందుకు వీలుగా వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్ల (అంగన్వాడీ)లో ఫ్రిజ్‌లు ఏర్పాటు చేయాలి, ► అమ్మ ఒడి పథకం ద్వారా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తెచ్చాం. ఇప్పుడు ప్రీ ప్రైమరీ విద్యలోనూ అదే బాటలో నడుస్తున్నాం. ప్రాథమిక దశ నుంచే సంపూర్ణ మార్పులకు శ్రీకారం చుడుతున్నాం. అంగన్వాడీల్లో ఒకటో తరగతి పాఠ్యప్రణాళికతో ట్రాన్సిషన్ మొదలు కావాలి. అంగన్వాడీలకు ఇప్పుడున్న కనీస అర్హత పదో తరగతి కాగా వారికి ఏడాది పాటు డిప్లొమా కోర్సు నిర్వహించాలి. ఒకవేళ ఇంటర్, ఆపై కోర్సులు పూర్తి చేసిన వారుంటే ఆరు నెలల డిప్లొమా కోర్సు ఉండాలి. సులభమైన మార్గాల్లో పాఠాలు బోధించడంపై శిక్షణ ఇవ్వాలి. ► అంగన్వాడీలకు భవనాల నిర్మాణం, పాఠ్య ప్రణాళిక, టీచర్లకు డిప్లొమా కోర్సు, సులభమైన బోధనా పద్ధతుల్లో శిక్షణపై కార్యాచరణ సిద్ధం చేసి నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలి. ► వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్ల కోసం కొత్తగా రూపొందించిన పుస్తకాలను సమావేశంలో సీఎం పరిశీలించారు. పిల్లల ఆరోగ్యం, ఆహారం, చదువులపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు అంగన్వాడీలను ఇదివరకు ఉన్న బీఎల్వో లాంటి విధుల నుంచి మినహాయించాలని సమావేశంలో నిర్ణయించారు. సమీక్షలో మంత్రులు ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, సీఎస్ నీలం సాహ్నితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 9 నుంచి 4 గంటల వరకు.. ► ప్రీ ప్రైమరీ(పీపీ –1, 2) కి సంబంధించి ప్రతిపాదనలను మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృతిక శుక్లా సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ► రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీలలో 3 నుంచి 6 ఏళ్ల వయసున్న దాదాపు 8.70 లక్షల మంది చిన్నారులకు ప్రీ స్కూల్ విద్యా బోధన. చిన్నప్పటి నుంచే తెలుగుతోపాటు ఇంగ్లిష్‌లో కూడా ప్రావీణ్యం కల్పించేలా చర్యలు. నూతన సిలబస్‌పై అంగన్వాడీలకు శిక్షణ ఇచ్చి బోధనా విధానాలపై పుస్తకాల తయారీ. ► ప్రతి త్రైమాసికానికీ అసెస్మెంట్, ప్రతి చిన్నారికి బుక్స్, ప్రీ స్కూల్ కిట్స్, కలర్ కార్డులు, బిల్డింగ్ బ్లాక్స్, ఫ్లాష్ కార్డులు, పోస్టర్లు, చార్ట్స్, లెర్నింగ్ కిట్స్, బొమ్మలు అందచేసి చక్కటి వాతావరణంలో ప్రాథమిక విద్యకు పునాది. ► అంగన్వాడీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ప్రీ స్కూల్. చిన్నారులకు విశ్రాంతికోసం మధ్యలో గంటన్నర విరామం. రీడింగ్, స్టోరీ టైం, క్రియేటివ్ యాక్టివిటీ, యాక్షన్ సాంగ్, తదితర అంశాలతో రోజువారీ కార్యకలాపాల నిర్వహణ. ► రాష్ట్రంలోని అంగన్వాడీల్లో 11,448 కేంద్రాలు పాఠశాలల్లోనే కొనసాగుతుండగా వాటన్నిటిని నాడు–నేడు కార్యక్రమంలో బాగు చేస్తున్నామని అధికారులు తెలిపారు. మిగిలిన 44 వేల అంగన్వాడీలను కూడా నాడు–నేడు ద్వారా అభివృద్ధి చేయడంతోపాటు కొత్త నిర్మాణాలు చేపడతామన్నారు. -
ప్రీ ప్రైమరీ విద్యపై ఏపీ సర్కార్ ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి : ప్రీ ప్రైమరీ విద్యపై ఏపీ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. 4 వేల కోట్ల రూపాయలతో అంగన్వాడీల్లో నాడు–నేడు కింద అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ఇకపై వైఎస్సార్ ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా అంగన్ వాడీ కేంద్రాలు రూపుదిద్దుకోనున్నాయి. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రీ ప్రైమరీ స్కూల్స్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీల్లో పాఠ్య ప్రణాళిక-ఒకటో తరగతి పాఠ్య ప్రణాళికతో ట్రాన్సిషన్ ఉండాలన్నారు. ప్రీ ప్రైమరీకి ప్రత్యేక పాఠ్య ప్రణాళిక, విద్యాశాఖకు తయారీ బాధ్యతను అప్పగించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అంగన్వాడీ టీచర్లకు డిప్లమో కోర్సు ఉంటుందన్నారు. బోధనా పద్దతులు, పాఠ్య ప్రణాళిక, సులభమైన మార్గాల్లో పిల్లలకు విద్యా బోధనపై వారికి ట్రైనింగ్ ఇవ్వాలన్నారు. ( వారి పట్ల ఉదారంగా వ్యవహరించండి : సీఎం జగన్) నాడు– నేడు కింద అంగన్వాడీల అభివృద్ధి, కొత్త వాటి నిర్మాణం జరుగుతుందన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పరిశుభ్రమైన తాగునీరు, బాత్రూమ్స్ నాడు-నేడు కింద స్కూళ్లకు ఇప్పుడు ఇస్తున్న సదుపాయాలన్నీ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సీఎం అమ్మ ఒడి ద్వారా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకు వచ్చామన్నారు. ప్రీ ప్రైమరీ విద్యలో సంస్కరణలు తీసుకు వస్తున్నామని చెప్పారు. ప్రాథమిక దశ నుంచే సంపూర్ణ మార్పులకు శ్రీకారం చుడుతున్నామని అన్నారు. కార్యాచరణ తయారు చేసి నిర్ణీత సమయంలోగా వాటిని పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో ప్రీ ప్రైమరీ 1 (పీపీ–1), ప్రీ ప్రైమరీ 2 (పీపీ–2)కి సంబంధించి ప్రతిపాదిస్తున్న అంశాలను మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృతిక శుక్లా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రస్తుతం పిల్లలకు అందిస్తున్న పోషకాహారం, అంగన్వాడీల కార్యకలాపాలను వెల్లడించారు. అంగన్వాడీలు–కార్యకలాపాలు : వైఎస్సార్ సంపూర్ణ పోషక పథకంలో 7 నెలల వయసు నుంచి 6 ఏళ్ల వరకు పిల్లలతో పాటు, గర్భిణీలకు పోషకాహారం అందిస్తున్నట్లు కృతిక శుక్లా తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 55,607 అంగన్వాడీలలో 3 నుంచి 6 ఏళ్ల వరకు ఉన్న దాదాపు 8.70 లక్షల పిల్లలకు ప్రీ స్కూల్ విద్య అందిస్తున్నామని, వారికి చిన్నప్పటి నుంచే తెలుగుతో పాటు, ఇంగ్లిష్‌లో కూడా కొంచెం ప్రావీణ్యం కల్పించే చర్యలు చేపడుతున్నామని చెప్పారు. నైతిక విలువలు, టీమ్ వర్క్, సెల్ఫ్ అవేర్నెస్, మోరల్స్‌పై వారికి అవగాహన కల్పించడంతో పాటు, న్యూట్రిషన్, ప్రొటెక్షన్, స్టిమ్యులేషన్ లక్ష్యాలుగా అంగన్వాడీల పని చేస్తున్నాయని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృతిక శుక్లా వివరించారు. కొత్త సిలబస్–శిక్షణ : అంగన్వాడీల్లోని విద్యార్థులకు అనుగుణమైన సిలబస్‌ను నిపుణులతో రూపొందించడంతో పాటు, ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్‌పై అంగన్ వాడీ వర్కర్లకు శిక్షణ ఇస్తామని కృతిక శుక్లా చెప్పారు. ప్రతి నెలా వారు చెప్పాల్సిన సిలబస్‌పై శిక్షణలో భాగంగా, అంగన్వాడీ వర్కర్లకు బోధన విధానాలపై 4 పుస్తకాలు, పిల్లలకు 2 పుస్తకాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి త్రైమాసికానికీ అసెస్మెంట్, ప్రతి పిల్లాడికీ గ్రాడ్యుయేషన్ బుక్స్, పిల్లలకు ప్రీ స్కూల్ కిట్స్ కలర్ కార్డులు, బిల్డింగ్ బ్లాక్స్, ఫ్లాష్ కార్డులు, పోస్టర్లు, చార్ట్స్, లెర్నింగ్ కిట్స్, బొమ్మలు ఇస్తామని వివరించారు. డైలీ షెడ్యూల్ : అంగన్వాడీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ప్రీ స్కూల్ ఉంటుందన్న మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ పిల్లలకు మధ్యలో గంటన్నర నిద్రకు విరామం ఇస్తామని వెల్లడించారు. ఇంకా రీడింగ్, స్టోరీ టైం, క్రియేటివ్ యాక్టివిటీ, యాక్షన్ సాంగ్, తదితర అంశాలతో రోజువారీ కార్యకలాపాలు ఉంటాయని తెలిపారు. పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారంపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించడంతో పాటు, వారి ఆరోగ్యంపై ప్రత్యేక జాగ్రత్తలు వహిస్తామని ఆమె వివరించారు. అంగన్వాడీ కేంద్రాలు–మార్పులు : కాగా, రాష్ట్రంలోని మొత్తం అంగన్వాడీల్లోని 11,448 కేంద్రాలు పాఠశాలల్లోనే కొనసాగుతున్నాయని వివరించిన అధికారులు, వాటన్నింటిని కూడా నాడు–నేడు కార్యక్రమంలో బాగు చేస్తున్నామని వెల్లడించారు. మిగిలిన 44 వేల అంగన్వాడీలకు సంబంధించి కూడా నాడు–నేడు కింద అభివృద్ధి చేయడంతో పాటు, కొత్త నిర్మాణాలు చేపడతామని వివరించారు. -
దేశంలో ఎక్కడా లేని విధంగా..
సాక్షి, అమరావతి : దేశంలో ఎక్కడా లేని విధంగా పేద పిల్లలకు పోషక ఆహారాన్ని అందిస్తున్నామని, వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా రెట్టింపు పోషక ఆహారం అందిస్తున్నామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వర్గాల పేద పిల్లల కోసం అదనంగా 500 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. 1800 కోట్ల రూపాయలతో పోషక ఆహారాన్ని అందించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. అంగన్వాడీ కేంద్రాలను 1400 కోట్ల రూపాయలతో నాడు నేడు ద్వారా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకి పి1, పి2 విద్యా విధానాన్ని తెస్తున్నామన్నారు. పిల్లలకి ఎల్కేజీ, యూ కేజీ విద్యను అందిస్తామని, ఇది అంగన్వాడీ చరిత్రలోనే విప్లవాత్మకమైన మార్పుగా దేశంలో నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. -
అమ్మలకు,చిన్నారులకు సర్కారే అండ...
-
ఆన్లైన్లో అఆఇఈ
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీల రూపురేఖలు మారనున్నాయి. ఆన్లైన్లో అఆఇఈ నేర్పనున్నారు. చిన్నారుల్లో ప్రేరణకు కొత్త పాఠ్యాంశా లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివర కు పౌష్టికాహార పంపిణీ కేంద్రాలుగానే కొనసాగిన ఈ కేంద్రాలు త్వరలో ప్రీస్కూళ్లు(పూర్వ ప్రా థమిక పాఠశాల)గా మారనున్నాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో విద్యాసంస్థలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం మూసివేసింది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత అంగన్వాడీల బోధనను ఆన్లైన్లో సాగించేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే అంగన్వాడీల నిర్వహణకు సం బంధించిన కార్యాచరణను మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వెబ్సైట్లో ఉంచింది. ప్రీ స్కూళ్లుగా 35,700 అంగన్వాడీలు రాష్ట్రంలోని మొత్తం 149 ఐసీడీఎస్(సమగ్ర శిశు అభివృద్ధి పథకం) ప్రాజెక్టుల పరిధు ల్లో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నా యి. ఈ కేంద్రాల్లో మూడేళ్లలోపు చిన్నారులు 9.17 లక్షల మంది, మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 4.80 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు బాలామృతంతోపాటు ఇతర పౌష్టికాహారాన్ని అందించేవా రు. ఆ తర్వాత పిల్లల ఆసక్తిని బట్టి ఆడించడం లేదా ఇంటికి పంపడం జరిగేది. ఇక పై ఈ కేంద్రాలు పూర్వ ప్రాథమిక పాఠశాలలు గా మారనున్నాయి. కేంద్రం నిర్దేశించిన నిబంధనల ప్రకారం కనీ సం ఆరుగంటలపాటు ఈ కేంద్రాలను నిర్వహించాలి. రాష్ట్ర ప్రభుత్వం మా త్రం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగించాలని నిర్ణయించింది. ప్రత్యేక పాఠ్యాంశం అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల కోసం రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక పాఠ్యాంశాన్ని రూపొందించింది. స్థానిక పరిస్థితుల నేపథ్యంలో కథలు, పాటలు, ఆటలు, మా నసిక అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిం చింది. ఇవన్నీ వీడియోల రూపంలో తయారు చేసింది. పిల్లలకు అలవాట్లు, పరిసరాల గురిం చి ఎరుక పర్చడం, అక్షరాలు నేర్పడం, అంకెల తో కూడిన పాఠాలు, కథలు, నృత్యరూపక పా టలు, సృజనాత్మకత పెంచే పజిల్స్, తెలుగు, ఇంగ్లిష్ భాషలపై అవగాహన పెంచే పదాలు, పిల్లల అభివృద్ధి అంశాలతో కూడిన వీడియో లు, యానిమేషన్ రూపంలో వీడియోలను ఆ శాఖ సిద్ధం చేసింది. ఇవి అంగన్వాడీల్లో అందుబాటులో ఉంటాయి. పిల్లల తల్లిదండ్రుల కోసం ఈ వీడియోలను రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంచారు. -
గతంకంటే మిన్నగా..
అమలాపురం టౌన్: అంగన్వాడీ కేంద్రాల ద్వారా పేద కుటుంబాల్లోని ఆరు నెలల నుంచి ఆరేళ్ల వయస్సు పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు ఇక నుంచి పూర్తి పారదర్శకతతో, నాణ్యతతో భోజనం, ఆహార పదార్థాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను మొక్కుబడి తంతుగా నిర్వహించేది. సాదాసీదా బియ్యంతో భోజనం పెట్టి చేతులు దులుపుకొనేది. దీనికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం నాణ్యమైన బియ్యం, పౌష్టికాహారం అందించాలని నిశ్చయించింది. వారి ఆరోగ్యానికి మరింత ఊతమిచ్చేలా అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే భోజనం, ఆహార పదార్థాల నాణ్యతపై దృష్టి సారించింది. ధనికుల ఇళ్లల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతల మాదిరిగానే అంగన్వాడీ కేంద్రాల ద్వారా కూడా పేద పిల్లలకు, తల్లులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసిన బియ్యంలో రాళ్లు, మట్టిబెడ్డలు ఉండేవి. వాటిని ఏరిన తర్వాతే అన్నం వండాల్సిన పరిస్థితి. ఇటువంటి సమస్యలకు తావు లేకుండా ఇప్పుడు ప్రభుత్వం నాణ్యమైన సార్టెక్స్ బియ్యం సరఫరా చేస్తోంది. బాలామృతం పేరుతో చిన్నారులకు గతంలోనూ సిరిలాక్, నెస్లే వంటివి అందించేవారు. ఈ బాలామృతాన్ని కూడా ఇప్పుడు మరింత నాణ్యతతో అందిస్తున్నారు. కరోనాతో మారిన సరఫరా విధానం కరానాకు ముందు వరకూ జిల్లాలోని 5,546 అంగన్వాడీ కేంద్రాల్లో రోజూ అన్నం, ఇతర ఆహార పదార్థాలు వండి, పిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు భోజనం పెట్టేవారు. కోడిగుడ్లు, పాలు కూడా అందించేవారు. ప్రత్యేకించి గర్భిణులు, బాలింతలకు బాల సంజీవని పేరుతో అర కేజీ ఖర్జూరం, కేజీన్నర వేరుశనగ పప్పు అచ్చు, కేజీ చోడిపిండి, కేజీ పాత బెల్లం ఇచ్చేవారు. ఇక నుంచి ఇవి మరింత నాణ్యతగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కరోనా ఆంక్షలతో అంగన్వాడీ కేంద్రాలు ప్రస్తుతం తాత్కాలికంగా మూతపడ్డాయి. దీంతో భోజనం తయారీకి అవసరమైన దినుసులు, పౌష్టికాహార పదార్థాలను నెలకు లెక్క కట్టి అంగన్వాడీ సిబ్బంది నేరుగా ఇళ్లకే తీసుకుని వెళ్లి పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందజేస్తున్నారు. జిల్లాలో ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలు 85,770 మంది ఉన్నారు. ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు 15,540 మంది ఉన్నారు. గర్భిణులు, బాలింతలు 69,519 మంది ఉన్నారు. వీరి కోసం జిల్లాలో ప్రతి నెలా 2,085 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేస్తున్నామని ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ పుష్పమణి తెలిపారు. గర్భిణులు, బాలింతలకు నెలకు 3 కిలోల వంతున, మూడేళ్ల నుంచి ఆరేళ్ల పిల్లలకు నెలకు 2 కిలోల వంతున బియ్యం అందిస్తున్నారు. అరుగుదల బాగుంటుంది పిల్లలు, బాలింతలు, గర్భిణులు తినేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తోంది. దీనివలన వారి ఆరోగ్యం మరింత మెరుగు పడుతుంది. గతంలో బియ్యంలో రాళ్లు, బెడ్డలు ఉండేవి. ఇప్పుడు బియ్యం ఒక్క రాయి, బెడ్డ లేకుండా పూర్తి నాణ్యతతో ఇస్తున్నారు. ఇవి తిన్న వారికి అరుగుదల కూడా బాగుంటుంది. పిల్లలు, బాలింతలు, గర్భిణులకు నాణ్యమైన భోజనం అందించాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం వీటిని సరఫరా చేయడం మంచి పరిణామం. లాక్డౌన్ కారణంగా అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది నేరుగా ఇంటికే తీసుకు వెళ్లి బియ్యాన్ని లబి్ధదారులకు అందిస్తున్నారు. – ఐ.విమల, సీడీపీఓ, అమలాపురం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఇష్టంగా తింటున్నారు అంగన్వాడీ కేంద్రం ద్వారా ఇప్పుడు అందిస్తున్న బియ్యం చాలా బాగుంటున్నాయి. మా పిల్లాడు అంగన్వాడీ కేంద్రానికి వెళ్లేవాడు. ఇప్పుడు నెలకు సరిపడే బియ్యం, బలవర్ధక ఆహారాన్ని ఇంటికే తెచ్చి ఇవ్వడం చాలా బాగుంది. కరోనాతో ఇల్లు కదలకుండా ప్రభుత్వం ఇంటికే పంపించడం మంచి పని. గతంలో మామూలు బియ్యంతో వండిన అన్నాన్ని తినేందుకు పిల్లలు కొంత ఇబ్బంది పడేవారు. అప్పుడప్పుడు సరైన అరుగుదల లేక కడుపు ఇబ్బందిగా ఉందనేవారు. నాణ్యమైన బియ్యంతో ఇప్పుడు అన్నాన్ని చాలా ఇష్టంగా తింటున్నారు. – అరిగెల అన్నపూర్ణ, అంగన్వాడీ బాలుడి తల్లి, అంబాజీపేట -
బెంగ తీరిన అంగన్వాడీ
వీరఘట్టం: విరిగిన గచ్చులు, బీటలు వారిన గోడలు, వెలిసిపోయిన రంగులతో అధ్వానంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు ఇక మీదట మహర్దశ పట్టనుంది. వీటిని నాడు–నేడు పథకం ద్వారా అభివృద్ధి చేసేందుకు ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి శ్రీకారం చుట్టారు. ఇక మీదట చక్కటి వాతావరణం, చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా ఆట స్థలం, గర్భిణులు, బాలింతలకు వైద్య తనిఖీలు చేసేందుకు ప్రత్యేక గదులు ఉండేలా అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో కనీస మౌలిక వసతులు లేని 977 అంగన్వాడీ కేంద్రాలను గుర్తించారు. వీటిని అభివృద్ధి పరచేందుకు అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. అందరికీ అందుబాటులో ఉండే స్ధలంలో ఇక నుంచి సుందరంగా ముస్తాబైన అంగన్వాడీ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. వెనుకబడిన కేంద్రాలకు మహర్దశ.. జిల్లాలో 18 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 4,192 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 1,199 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయి. 1,743 అద్దె భవనాల్లో కొనసాగుతుండగా, 1,250 కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల్లోను, సామాజిక భవనాల్లోను నడుపుతున్నారు. ఈ కేంద్రాల్లో 36,083 మంది గర్భిణులు, బాలింతలు, 1.10 లక్షలమంది 0–6 వయస్సుగల చిన్నారులకు సేవలు అందుతున్నాయి. ఈ కేంద్రాల్లో కనీస మౌలిక వసతులు లేనటువంటి 977 కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు చేశారు. వీటికి సంబంధించిన ఫైలుకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆమోద ముద్ర వేశారు. ఒక్కో కేంద్రాన్ని రూ.7.50 లక్షల వ్యయంతో నిర్మించనున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.5 లక్షలు, ప్రభుత్వ నిధులు రూ.2.50 లక్షలు వెచ్చించనున్నారు. మొత్తం రూ.73.27 కోట్లను ఇందుకోసం కేటాయించారు. ప్రత్యేకంగా గదులు గతంలో వలే కాకుండా పూర్తిగా అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం సంకలి్పంచింది. అందరికీ అందుబాటులో ఉండే స్ధలంలోనే వీటి నిర్మాణం చేపట్టనున్నారు. ప్రధానంగా ప్రీ స్కూల్‌ను దృష్టిలో ఉంచుకొని వరండా, ఆటస్ధలం ఏర్పాటు చేసి వారికి ప్రత్యేక శిక్షణ అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున కేంద్రాలు అందుబాటులోకి రానుండడంతో అరకొర వసతులతో ఇబ్బందులు పడుతున్న చిన్నారులకు, గర్భిణులకు ఆ అవస్ధలు తప్పనున్నాయి. ఈ కేంద్రాల్లో నాలుగు గదులను నిర్మిస్తారు. హాల్, న్యూట్రిషన్ రూమ్, కిచెన్ రూమ్, ఒక స్టోర్ రూమ్‌లుగా వీటిని వినియోగిస్తారు. అన్ని మౌలిక వసతులతో నిర్మాణాలు జిల్లాలో కనీస మౌలిక వసతులు లేని 977 అంగన్వాడీ కేంద్రాలను గుర్తించాం. వీటిని అభివృద్ధి చేసి చిన్నారులు, బాలింతలకు ఉపయుక్తంగా తయారుచేస్తాం. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో పనులు జరగనున్నాయి. ప్రతి కేంద్రం అభివృద్ధికి రూ.7.50 లక్షలు మంజూరు చేశారు. త్వరలోనే పనులు చేపడతాం. –జి.జయదేవి, ఐసీడీఎస్, పీడీ, శ్రీకాకుళం -
అంగన్వాడీల్లోనూ ‘నాడు–నేడు’
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అంగన్వాడీల్లోనూ ‘నాడు-నేడు’ కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. దాదాపు 24 వేల అంగన్వాడీ భవనాల్లో చేపట్టాల్సిన పనులు, సదుపాయాలపై అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశాలు ఇచ్చారు. అలాగే అంగన్వాడీల్లో గర్భవతులకు, తల్లులకు, పిల్లలకు ఇచ్చే ఆహారం నాణ్యంగా ఉండాలని సూచించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి తానేటి వనిత, సీఎస్ నీలం సాహ్నితో పాటు ఇతర అధికారులు హాజరు అయ్యారు. ప్రభుత్వ పాఠశాలలో మాదిరిగానే అంగన్వాడీల్లో కూడా నాడు – నేడు కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. స్కూళ్లలో 9 రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని, అదే తరహాలో అంగన్వాడీల్లో కూడా నాడు – నేడు కింద అభివృద్ధి కార్యక్రమాలు, సదుపాయాలు కల్పించాలని సూచించారు. అంగన్వాడీల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండాలని, ఫర్నీచర్, ఫ్యాన్లు, ట్యూబులైట్లు, ఫ్రిజ్, పరిశుభ్రమైన తాగునీరు, మరుగుదొడ్లు, రంగులు, బ్లాక్ బోర్డులు, ప్రహరీగోడ సహా కావాల్సిన మరమ్మతులు చేసి, సదుపాయాలను కల్పించాలని సీఎం జగన్ పేర్కొన్నారు. (టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్) అలాగే అంగన్వాడీల్లో నాడు – నేడు కార్యక్రమాలపై విద్యాశాఖతో కలిసి పని చేయాలన్న ముఖ్యమంత్రి తెలిపారు. దాదాపు 24 వేల అంగన్వాడీ భవనాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, వాటిలో చేపట్టాల్సిన పనులు, సదుపాయాలపై అంచనాలు రూపొందించాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే భవనాల్లేని చోట్ల, 31వేల అంగన్వాడీల నిర్మాణానికి అంచనాలు కూడా రూపొందించాలన్నారు. అంగన్వాడీ స్కూళ్లన్నీ కూడా ప్రీ స్కూల్ తరహా విధానంలోకి రావాలని, అలాగే అంగన్వాడీల్లో గర్భవతులకు, తల్లులకు, పిల్లలకు ఇచ్చే ఆహారం నాణ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా వారు ఆరోగ్యంగా ఉండేలా చూడాలని, మంచి పౌష్టికాహారాన్ని తల్లులకు అందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సమర్పించాలన్నారు. (టీచింగ్ ఆసుపత్రులకు కొత్త హంగులు) గత ప్రభుత్వం హయాంలో తల్లులు, పిల్లలకు పౌష్టికాహారంపై కేవలం రూ.740 కోట్లు ఖర్చు చేస్తే, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019–2020లో రూ.1100 కోట్లు ఖర్చు చేసిందన్నారు. దీన్ని మరింతగా పెంచి ఈ ఏడాదిలోనే రూ.1862 కోట్లకు పైగా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ తెలిపారు. పటిష్టంగా కార్యచరణ ప్రణాళిక రూపొందించి జూలైలో తల్లులకు, పిల్లలకు పౌష్టికాహారం నాణ్యత పెంచడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే బకాయిలు లేకుండా గ్రీన్ ఛానల్లో చెల్లింపులు జరిగేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. (నాడు-నేడు దేశ చరిత్రలోనే నిలిచిపోతుంది..) -
అవి ఫోర్టిఫైడ్ రైస్ బాబూ...!
సాక్షి, బొబ్బిలి: అంగన్వాడీ పిల్లలు, మధ్యాహ్న భోజన విద్యార్థులకోసం ఇంటింటికీ అందజేస్తున్న బియ్యంలో ఫోర్టిఫైడ్‌రైస్‌ను చూసి ప్లాస్టిక్ బియ్యం అందజేస్తున్నారంటూ దుష్ప్రచారానికి దిగి వాస్తవాన్ని అధికారులు చెప్పగా కంగుతిన్న తెలుగుతమ్ముళ్ల ఉదంతమిది. ప్రతి చిన్న అవకాశాన్నీ ప్రభుత్వంపై బురద జల్లడానికి చేసే ప్రయత్నానికిది ఓ చక్కని ఉదాహరణ. ప్రజలకు బలవర్ధకమైన ఆహారం అందివ్వాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ చిన్నారులు, మధ్యాహ్న భోజనం చేసే విద్యార్థులకు అందించే బియ్యంలోనూ, రేషన్ బియ్యంలోనూ ఫోర్ట్‌ఫైడ్ రైస్ కలిపి ఇవ్వాలని సర్కారు యోచించింది ఇందుకు జిల్లాలో బొబ్బిలి నియోజవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. నియోజకవర్గంలో బొబ్బిలి, బాడంగి, రామభద్రపురం, తెర్లాం మండలాల్లోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు, పాఠశాలల్లో మధ్యా హ్న భోజనానికి పూర్తిస్థాయిలో ఫోర్టిఫైడ్ రైస్‌ను, రేషన్ బియ్యంలో ప్రతీ క్వింటాలులో ఒక కిలో ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ చేసింది. ఈ విషయం తెలీని టీడీపీ నాయకులు ఓ పథకం ప్రకారం ప్రభుత్వం ప్టాస్టిక్ బియ్యం పంపిణీ చేసిందని మండలంలోని మెట్టవలసలో బుధవారం దుష్ప్రచారం చేయడానికి యత్నించి అడ్డంగా బుక్కయ్యారు. తమకు అనుకూలంగా ఉన్న మీడియాను పిలిచి హడావుడి చేశా రు. దీంతో స్థానికంగా ఉన్న వైఎస్సార్సీపీ అభిమాని, సీనియర్ సిటిజన్ అడబాల కృష్ణారావు సాక్షికి సమాచారం అందించడంతో విచారణ చేస్తే తమ్ముళ్ల అవగాహన లేమి బయటపడింది. ఫోర్టిఫైడ్ రైస్ అంటే...? శ్రేష్టమైన ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు బియ్యానికి అదనంగా చేర్చడాన్ని రైస్ ఫోర్టిఫికేషన్ అంటారు. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్–బి12 వంటి కీలక సూక్ష్మ పోషకాలను బియ్యంలో అదనంగా చేర్చి పోషకాహార లోపాన్ని అధిగమించే యత్నం ప్రభుత్వం చేస్తోంది. దేశంలో 65 శాతం మందికి బియ్యమే ప్రధాన ఆహారం. 80కోట్ల జనాభాకు చేరువయ్యే అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, రేషన్ డిపోలద్వారా ప్రభుత్వం అందించి ఎప్పటిలాగే మంచి భోజనం పౌష్టికాహారంతో తినాలనే లక్ష్యంతో ఫోర్టిఫైడ్ రైస్‌ను పంపిణీ చేస్తున్నారు. అవగాహన లోపంతో దుష్ప్రచారం టీడీపీ నాయకులు, జనసేనకు చెందిన ఓ వ్యక్తి తమకు అనుకూలంగా ఉన్న మీడియా ద్వారా ప్రభు త్వం ప్లాíస్టిక్ రైస్ అందించిందని ఆధారం లేకుండా దుష్ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు. దీనిపై సీఎస్‌డీటీ గౌరీశంకరరావు, తహసీల్దార్ సీహెచ్.లక్ష్మణరావు అప్రమత్తమై అసలు విషయాన్ని గ్రామస్తులకు, నాయకులకు తెలిపారు. ప్రభుత్వం ఈ నెలనుంచి ఫోర్టిఫైడ్ రైస్ అంగన్వాడీలకు, మధ్యాహ్న భోజనానికి పూర్తిస్థాయిలో అందించిందని, రేషన్ డిపోలలో ప్రతీ క్వింటాలుకు కిలో ఫోరి్టఫైడ్ రైస్ కలిపి అందిస్తోందని వివరించారు. దీనిపై ఎవరి దు్రష్పచారాలు ప్రజలు నమ్మవద్దని వివరించారు. లేనిపోని వదంతులు సృష్టించారు ప్రభుత్వం బలవర్థక బియ్యం అందిస్తే కొందరు దీనిపై ప్లాస్టిక్ బియ్యమని దుష్ప్రచారం ప్రారంభించారు. వెంటనే మేం అప్రమత్తమై వాస్తవాలు తెలుసుకోవాలని మా మీడియాకు సమాచారం అందించాం. ఫోరి్టఫైడ్ రైస్ పంపిణీపై అధికారులు వివరించారు. – అడబాల కృష్ణారావు, సీనియర్ సిటిజన్, మెట్టవలస బలవర్థక బియ్యం బొబ్బిలి నియోజక వర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఫోర్టిఫైడ్ రైస్‌ను అందిస్తు న్నాం. విద్యార్థులకు, చిన్నారులకు పూర్తిస్థాయిలో అందిస్తూ, రేషన్ డిపోలలో మిక్సింగ్ ద్వారా పంపిణీ చేస్తున్నాం. వీటిలో ఐరన్, విటమిన్లు, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఎలాంటి అపోహ పడవద్దు. ఎలాంటి వదంతులు నమ్మవద్దు. – సీహెచ్.లక్ష్మణప్రసాద్, తహసీల్దార్, బొబ్బిలి -
ఇంటి వద్దకే అంగన్వాడీ సరుకులు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రాలను మూసేస్తున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారు. అయినప్పటికీ లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పౌష్టికాహార పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సోమవారం హైదరాబాద్‌లో అధికారులతో సమీక్ష సందర్భంగా ఆమె మాట్లాడుతూ బియ్యం, పప్పు, నూనె, పాలు, గుడ్లు, బాలామృతం, మురుకులు పంపిణీని గ్రామ కమిటీ ద్వారా చేపట్టాలన్నారు. ఈ కమిటీలో అంగన్వాడీ టీచర్, హెల్పర్, గ్రామ కార్యదర్శి, ఆశ వర్కర్, స్థానిక పోలీస్‌ను భాగస్వామ్యం చేసి ప్రభుత్వం ద్వారా ఇచ్చే ప్రతి వస్తువు సరైన పద్ధతిలో, సరైన సమయంలో లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ దివ్యను ఆదేశించారు. ప్రస్తుత అత్యవసర పరిస్థితి నేపథ్యంలో సెలవు రోజుల్లో కూడా రోజు మాదిరిగానే సరుకులు పంపిణీ చేయాలన్నారు. కరోనాపై అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు అప్రమత్తంగా ఉండాలని, విదేశాల నుంచి ఎవరైనా వస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలన్నారు. గర్భిణుల జాబితా సిద్ధం చేయాలి..: గ్రామాలు, పట్టణాల్లోని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ప్రసవ సమయానికి సిద్ధమైన గర్భిణుల జాబితా సిద్ధం చేయాలని మంత్రి సత్యవతి ఆదేశించారు. కాగా, రాష్ట్రంలో గర్భిణులు 3.3 లక్షలు ఆరోగ్య లక్ష్మి ద్వారా లబ్ధి పొందుతున్నారని కమిషనర్ దివ్య వివరించారు. మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు బాలబాలికలు 4.40 లక్షలు, 7 నెలల నుంచి 3 ఏళ్లలోపు శిశువులు 8.40 లక్షల మంది ఉన్నారన్నారు. -
'అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం ఆపొద్దు'
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ లబ్ధిదారులకు పౌష్టికాహారాన్ని అందించాల్సిందేనని, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకూ పౌష్టికాహార పంపిణీని ఆపవద్దని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో శుక్రవారం డీఎస్ఎస్ భవన్లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టీనా జెడ్ చోంగ్తూ తదితరులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఆరోగ్య లక్ష్మి పథకం కింద అందించే భోజనాన్ని ఉదయం 9 గంటల నుంచి 11 గంటల్లోపు వండి, పంపిణీ చేయాలన్నారు. ఈ పదార్థాలు వేడిగా ఉన్నప్పుడు తింటేనే మంచి ఫలితాలు వస్తాయని, ఈమేరకు చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేసే అంగన్వాడీ టీచర్లు, సహాయకులు కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. -
అంగన్వాడీలకు సెలవుల్లేవ్..
సాక్షి, నిజాంసాగర్(జుక్కల్): కరోనా విస్తరించకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించిన సర్కారు.. అంగన్వాడీ కేంద్రాలను మాత్రం విస్మరించింది. అన్ని విద్యాసంస్థలకు హాలీడేలు ఇచ్చి అంగన్వాడీ కేంద్రాలకు మాత్రం ఇవ్వకపోవడంతో విస్మయానికి గురిచేస్తోంది. కేవలం సమయం కుదిస్తూ ఐసీడీఎస్ అధికారులు టీచర్లను ఆదేశించారు. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు కేంద్రాలు తెరవాలని తెలిపారు. కేవలం రెండున్నర గంటల పాటు మాత్రమే పిల్లల్ని పంపడానికి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే గర్భిణులు, బాలింతలకు కూడా మధ్యాహ్నం పూట పెట్టే భోజనాన్ని ఉదయమే పెడుతున్నారు. వైరస్ సోకకుండా జాగ్రత్తలు జిల్లాలో 1,193 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా సుమారు 22,152 మంది చిన్నారుల ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు కరోనా వైరస్ బారిన పడకుండా అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు వైద్యశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. కేంద్రాలకు వచ్చే చిన్నారుల చేతులను శుభ్రంగా కడగడంతో పాటు నాణ్యమైన పౌష్టికాహారం అందించేలా చర్యలు చేపట్టారు. అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటిస్తే చిన్నారులకు పౌష్టికాహారం అందని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు సమయ పాలన ఉండగా ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి 11.30 నిమిషాలకు వరకు కుదించారు. అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యంపై టీచర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు సమయ పాలనను తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు. -
పేదల ఆరోగ్యానికి అయోడైజ్డ్ ఉప్పు
సాక్షి, అమరావతి: పేదల ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐరన్ ఫోర్టిఫైడ్ అయోడైజ్డ్ ఉప్పును రాయితీపై పంపిణీ చేస్తోంది. తాజాగా రేషన్ షాపుల ద్వారా బియ్యం కార్డులున్న లబ్ధిదారులందరికీ సబ్సిడీపై పంపిణీ చేయాలని నిర్ణయించింది. మరోవైపు అంగన్వాడీ సెంటర్లలోనూ ఈ ఉప్పును వినియోగించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఐసీడీఎస్ ద్వారా తయారు చేసే ఆహారంలో ఆయోడైజ్డ్ ఉప్పును వినియోగించనున్నారు. ఈ నేపథ్యంలో ఉప్పును సేకరించేందుకు పౌర సరఫరాల సంస్థ టెండర్లను ఆహ్వానించింది. ఏప్రిల్ నుండి నెలకు 45 మెట్రిక్ టన్నుల చొప్పున సెప్టెంబర్ వరకు 270 మెట్రిక్ టన్నుల ఉప్పును సేకరించనున్నారు. ప్రభుత్వం సూచించిన ప్రమాణాల ప్రకారం ఉప్పును సరఫరా చేయకపోతే టెండర్లను మధ్యలోనే రద్దు చేస్తామని అధికారులు ముందుగానే షరతు విధించారు. ఏడాదికి రూ.15 లక్షల వరకు టర్నోవర్ ఉన్న సంస్థలు మాత్రమే టెండర్లలో పాల్గొనాల్సి ఉంటుంది. - ఆహార పరిరక్షణ, ప్రమాణాల నిబంధన చట్టం–2006 ప్రకారం సాధారణ వ్యక్తులు రోజుకు 150 మైక్రో గ్రాములు, గర్భిణి లేదా పాలిచ్చే తల్లి 250 మైక్రో గ్రాములు, 11 నెలల చిన్నారులకు 50 మైక్రో గ్రాములు, 5 ఏళ్లలోపు బాలలకు 90 మైక్రో గ్రాములు, 6 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులకు 150 మైక్రో గ్రాముల అయోడైజ్డ్ ఉప్పు అవసరం. - కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించిన సర్వే ప్రకారం.. జనాభాలో సగం మందికి పైగా అయోడైజ్డ్ ఉప్పు తీసుకోవడం లేదని వెల్లడైంది. - చిన్న పిల్లల్లో శారీరక ఎదుగుదలకు అయోడైజ్డ్ ఉప్పు ఎంతో అవసరం. - గర్భిణులకు, పాలిచ్చే తల్లులు తగినంతగా అయోడిన్ వాడాల్సి ఉంటుంది. అయోడిన్ లోపం వల్ల కలిగే నష్టాలు - చిన్న పిల్లల్లో వయసు పెరిగే కొద్దీ దానికి తగ్గట్టు చురుకుదనం లేకపోవడం. - చాలామందిలో జ్ఞాపకశక్తి మందగించడం. - గర్భిణుల్లో గర్భస్రావం లేదా బిడ్డ కడుపులోనే మృతి చెందడం, మృతి చెందిన శిశువు జన్మించడం. - పిల్లలు మరుగుజ్జుతనంతో జన్మించే అవకాశాలు ఎక్కువ. - గాయిటర్ (గొంతువాపు) లేదా అంగవైకల్యంతో జన్మించడం - నరాల బలహీనతతో బాధపడటం. - చెవుడు, మూగతనంతో పిల్ల లు పుట్టే అవకాశం ఎక్కువ. -
‘ఏపీలో 5 వేల అంగన్వాడీ పోస్టులు ఖాళీ’
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో 5 వేల అంగన్వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. 2019 డిసెంబర్ 31 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 1665 అంగన్వాడీ వర్కర్లు, 3347 అంగన్వాడి హెల్పర్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా సంప్రదింపులు జరుపుతూ ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల ఖాళీలను జిల్లా కలెక్టర్లు భర్తీ చేయడానికి వీలుగా తగిన ఆదేశాలు ఇవ్వవలసిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నట్లు మంత్రి చెప్పారు. (జేసీ ట్రావెల్స్ రిజిస్టేషన్ల రద్దుకు చర్యలు) కేంద్ర ప్రభుత్వం 2018 అక్టోబర్ 1 నుంచి అంగన్వాడీ వర్కర్ల గౌరవ వేతనాన్ని నెలకు 3 వేల నుంచి 4 వేల రూపాయలకు, హెల్పర్ల గౌరవ వేతనాన్ని నెలకు 1500 నుంచి 2250 రూపాయలకు పెంచిందిని మంత్రి తెలిపారు. అలాగే పనితీరు ప్రాతిపదికన హెల్పర్లకు ప్రోత్సాహకం కింద నెలకు 250 రూపాయలు చెల్లించడం జరుగుతోందన్నారు. ఐసీడీఎస్-సీఏఎస్ వినియోగించే అంగన్వాడీ వర్కర్లకు పోషణ్ అభియాన్ ప్రోత్సాహకం కింద నెలకు 500 రూపాయలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం ఇచ్చే గౌరవ వేతనానికి అదనంగా అనేక రాష్ట్రాలు తమ సొంత వనరుల నుంచి అంగన్వాడీలకు అదనంగా ప్రోత్సాహక నగదును చెల్లిస్తున్నాయన్నారు ఇవి కాకుండా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సౌకర్యాలను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. (అధిక బరువుతో బాధపడుతున్నారా..) అదే విధంగా 180 రోజుల వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు, పనితీరును గుర్తిస్తూ వారికి ప్రేరణ కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం స్థాయిలో రూ.50 వేల నగదు అవార్డుతోపాటు ప్రశంసాపత్రం, రాష్ట్ర స్థాయిలో 10 వేల నగదు అవార్డుతోపాటు ప్రశంసాపత్రం అందచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే అంగన్వాడీలకు ఏడాదికి 400 రూపాయల విలువైన చీర కలిగిన రెండు యూనిఫారాలు, 18-50 ఏళ్ళ మధ్య వయస్సు కలిగిన వర్కర్లు, హెల్పర్లకు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం కింద జీవిత బీమా, 51 నుంచి 59 ఏళ్ళ మధ్య వయస్సు కలిగిన వారికి ప్రధాన మంత్రి సురక్ష బీమా పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు. తీవ్ర అనారోగ్య బారిన పడినట్లుగా గుర్తించిన అంగన్వాడీలకు 20 వేల రూపాయల వరకు చికిత్స ఖర్చులు, 9 నుంచి 12వ తరగతి చుదువుతున్న అంగన్వాడీల సంతానానికి స్కాలర్షిప్లు, సూపర్వైజర్ల నియామకంలో వారికి 50 శాతం రిజర్వేషన్ వంటి పలు సౌకర్యాలను అంగన్వాడీలకు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోందని మంత్రి వివరించారు.(‘మాలోకాన్ని కరోనా క్వారంటైన్ వార్డులో పెట్టాలి’) చదవండి: ‘కడపలో బ్యాంక్ శాఖలను తగ్గించలేదు’ -
అంగన్వాడీ కేంద్రాల్లో పాల సరఫరా సమస్య పరిష్కారం
సాక్షి, అమరావతి: అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న పాల రేటుపై ఏర్పడ్డ సమస్య పరిష్కారమైంది. పాలను సరఫరా చేస్తున్న కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ఈ నెల 21 నుంచి కొత్త రేట్లు అమలులోకి వచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం లీటరు పాలకు చెల్లిస్తున్న రూ.42లను రూ.47.25లకు, గిరిజన ప్రాంతాల్లో రూ.53లకు ధరను పెంచింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని మొత్తం 51 వేల అంగన్వాడీ కేంద్రాల్లో పసిపిల్లలు, బాలింతలు, గర్భిణులకు రోజుకు రెండు లక్షల లీటర్ల పాలు సరఫరా అవుతాయి. పెరిగిన రవాణా ఖర్చులను పరిగణనలోకి తీసుకుని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ధరలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరింది. దీంతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని పరిశీలించి రేట్లపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమ శాఖ, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ, పశు సంవర్థక శాఖలతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఫెడరేషన్తో సంప్రదింపులు జరిపి రేట్లు పెంచాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది. బకాయిలను చెల్లించని గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకమైన ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ (ఐసీడీఎస్) కింద రాష్ట్రంలో అంగన్వాడీల నిర్వహణ జరుగుతోంది. ఇందుకయ్యే ఖర్చులో కేంద్ర ప్రభుత్వం 70 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం భరిస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాలకు రోజువారీ అవసరమైన పాలను సరఫరా చేసే సమర్థత విజయ డెయిరీకి లేకపోవడంతో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ పాలను సరఫరా చేస్తోంది. దాదాపు రూ.77 కోట్ల విలువైన పాలను సరఫరా చేసినా గత టీడీపీ ప్రభుత్వం ఫెడరేషన్‌కు బిల్లులు చెల్లించలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాల ధరలను పెంచాలని, పాత బకాయిలు చెల్లించాలని ఫెడరేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీంతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసి బకాయిల్లో రూ.40 కోట్ల వరకు చెల్లించింది. మిగిలిన మొత్తాన్ని త్వరలో చెల్లిస్తామని తెలిపింది. కాగా, ఒకటి రెండు రోజుల్లో పాల ధరల పెంపునకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడతాయని ఐసీడీఎస్ కమిషనర్ కృతికా శుక్లా తెలిపారు. -
రాష్ట్రవ్యాప్తంగా పంపిణీలో భారీగా గోల్మాల్
సాక్షి, హైదరాబాద్ : బాలల్లో పోషక సమస్యలను అధిగమించే లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బాలామృతం దారి తప్పుతోంది. అధికారుల నిఘా కొరవడటం, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై పర్యవేక్షణ లోపించడంతో అంగన్వాడీలకు చేరుతున్న బాలామృతం లబ్ధిదారుల చెంతకు చేరకుండానే గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్‌మార్కెట్‌కు తరలుతోంది. అంగన్వాడీ కేంద్రాలను సకాలంలో తెరవకపోవడం, లబ్ధిదారులకు పంపిణీలో జాప్యం చేస్తుండటంతో పేరుకుపోయిన స్టాకును వెనక్కి పంపకుండా నిర్వాహకులు టోకుగా వ్యాపారులు, రైతులకు విక్రయిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బాలామృతం పంపిణీ ప్రక్రియ తంతు ఇదే తరహాలో జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే గుడ్లు, నూనె ప్యాకెట్లు, బియ్యం కోటాను కూడా అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. మెనూ ప్రకారం ఇవ్వాల్సి ఉన్నా... రాష్ట్రంలో 149 సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) ప్రాజెక్టులున్నాయి. ఇందులో 99 ప్రాజెక్టులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా 25 ప్రాజెక్టులు పట్టణ ప్రాంతాల్లో, మరో 25 ప్రాజెక్టులు గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి. వాటి పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. గత నెల గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల పరిధిలో 4,31,310 మంది గర్భిణులు, బాలింతలు ఉన్నారు. అలాగే ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు ఉన్న చిన్నారులు 10,42,675 మంది, మూడు నుంచి ఆరేళ్లలోపు ఉన్న చిన్నారులు 6,54,165 మంది ఉన్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు మెనూ ప్రకారం పాలు, గుడ్డు, భోజనంతోపాటు బాలామృతంతో చేసిన పదార్థాలను పంపిణీ చేయాలి. దీనికి అదనంగా ఇంటి వద్ద కూడా తినేందుకు వీలుగా నిర్దేశిత మొత్తాన్ని ప్యాకెట్ రూపంలో ఇవ్వాలి. కానీ చాలా చోట్ల బాలామృతం పంపిణీ జరగట్లేదు. అంగన్వాడీ కేంద్రాల్లో సమయపాలన సాగకపోవడం, తెరిచిన సమయంలో పిల్లల హాజరు లేకపోవడంతో బాలామృతం పంపిణీ ఆశించిన స్థాయిలో లేదు. పంపిణీ కాదు... వెనక్కు రాదు... అంగన్వాడీలకు సరఫరా చేసే బాలామృతం స్టాకును చిన్నారులకు ఇవ్వడంలో అవకతవకలు జరుగుతున్న అంశంపై ఫిర్యాదులు అధికంగా ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో ఆరేళ్లలోపు చిన్నారులు దాదాపు 17 లక్షల మంది నమోదైనప్పటికీ వారి హాజరు శాతం ఆధారంగా బాలామృతాన్ని సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం నెలకు సగటున 325 మెట్రిక్ టన్నుల బాలామృతాన్ని పంపుతున్నా ఇందులో సగం కూడా పిల్లలకు చేరడం లేదనే ఆరోపణలున్నాయి. అంగన్వాడీ కేంద్రాలకు హాజరయ్యే చిన్నారుల్లో మూడేళ్లలోపు వారికి రోజుకు వంద గ్రాములు, ఆరేళ్లలోపు వారికి రోజుకు 50 గ్రాముల చొప్పున బాలామృతాన్ని ఇవ్వాలి. వాటికి అధనంగా ప్రతిరోజూ పాలు, ఉడికించిన కోడిగుడ్డు, మినీ మీల్ ఇవ్వాలి. మూడేళ్లలోపు చిన్నారికి అదనంగా తల్లిపాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మెజారిటీ అంగన్వాడీ కేంద్రాలు సమయానికి తెరుచుకోవడం లేదు. కొన్నిచోట్ల తెరిచినప్పటికీ చిన్నారుల హాజరు శాతం ఆశాజనకంగా లేదు. ఈ నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో బాలామృతం, ఇతర ఆహారాల పంపిణీ అంతంత మాత్రంగానే ఉంటోంది. అయితే నెలావారీగా ఈ కేంద్రాలకు ప్రభుత్వం స్టాకు పంపిణీ చేస్తున్నప్పటికీ అంతటా పూర్తిస్థాయి కోటాను లబ్ధిదారులకు ఇస్తున్నట్లు రికార్డులున్నాయి. ఎక్కడ కూడా స్టాకు మిగిలిందంటూ తిరిగి వెనక్కు పంపడమో లేదా తదుపరి కోటాను తగ్గించి తీసుకోవడమో చోటుచేసుకోవట్లేదు. మరి పంపిణీ కాని స్టాకు ఎక్కడికి వెళ్తోందనే దానిపై అధికారులకు సందేహాలున్నప్పటికీ ఇప్పటిదాకా చర్యలు మాత్రం లేవు. చాలాచోట్ల బాలామృతం కోటాను రైతులకు, ఇతర ఫీడ్ దుకాణాలకు నిర్వాహకులు విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. బాలామృతాన్ని పశువుల దాణాగా చాలా మంది రైతులు వినియోగిస్తున్నట్లు సమాచారం. బాలామృతం అంటే... చిన్నారులకు అత్యధిక పోషకాలు అందేందుకు వీలుగా ప్రత్యేకంగా తయారు చేసిన ఆహారమే బాలామృతం. పాలపొడితోపాటు బియ్యం, గోదుమలు, శనగలు, చక్కెర ముడిపదార్థాలతో దీన్ని తయారు చేస్తారు. వంద గ్రాముల బాలామృతం తినిపించే బాలలకు 11 గ్రాముల ప్రొటీన్లు, 367 మిల్లీగ్రాముల కాల్షియం అందడంతోపాటు మొత్తంగా 414 కేలరీల శక్తి లభిస్తుంది. మూడేళ్లలోపు చిన్నారులకు రోజుకు సగటున వంద గ్రాముల బాలామృతాన్ని (బాలామృతంతోపాటు తల్లిపాలు, ఘనాహారం కూడా ఇవ్వాలి) అందిస్తే సమతుల్య పోషకాహారం అందినట్లే. ఆకస్మిక తనిఖీలు... అంగన్వాడీల ద్వారా పిల్లలకిచ్చే పోషకాహార పంపిణీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తుండటంతో అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు. క్షేత్రస్థాయిలో వాటి నిర్వహణ ఎలా ఉందనే అంశంపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి ప్రాథమికంగా నిర్ణయించారు. తనిఖీలకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని, గోప్యంగా పర్యటనలు సాగాలని నిర్ణయించినట్లు సమాచారం. తనిఖీలు ఎలా చేయాలి? తనిఖీల్లో ఎవరెవరు ఉండాలనే అంశంపై ఆ శాఖలో చర్చ జరుగుతోంది. త్వరలోనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అంగన్వాడీ కేంద్రాల స్థితిని తేల్చేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. సెంటర్ తెరవరు... సరుకు ఇవ్వరు మా ఊర్లోని అంగన్వాడీ కేంద్రం ఎన్నడూ టైమ్‌కు తెరుచుకోదు. బాలామృతం, గుడ్లు, బియ్యం, నూనె ప్యాకెట్లను పంపిణీ చేయరు. ఎందుకు ఇవ్వట్లేదని అడిగితే సరుకులు రాలేదని చెబుతున్నారు. సరుకులు వచ్చేదెన్నడో, ఇచ్చేదెన్నడో అర్థమే కాదు. అందుకే సెంటర్‌కు రావడమే మానేశాం. – శ్రీనివాస్, ఓ రెండేళ్ల బాలుడి తండ్రి పాపకు అనారోగ్యం... మా దగ్గరున్న అంగన్వాడీ సెంటర్లో బాలామృతం ఇస్తున్నా అది తినిపించిన వెంటనే పాపకు విరేచనాలవుతున్నాయి. నాలుగైదు సార్లు తినిపిస్తే మోషన్స్ కావ డంతో తినిపించడం మానేశా. బాలామృ తం బదులు ఇంటి దగ్గరే ఇతర ఆహారం తినిపిస్తున్నా. – స్వాతి, ఏడాదిన్నర బాలిక తల్లి -
అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ విద్య : మంత్రి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అర్బన్ ప్రాంతాల్లో ఉన్న అంగనవాడీ కేంద్రాలను విలీనం చేసి ఒక యూనిట్‌గా ఏర్పాటు చేస్తున్నట్టు మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత వెల్లడించారు. మంగళవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విశాఖలో 20 సెంటర్లను ఒక యూనిట్‌గా, శ్రీకాకుళంలో 7 సెంటర్లను ఒక యూనిట్‌గా, కడపలో 10 సెంటర్లను ఒక యూనిట్‌గా ఏర్పాటు చేసి అందులో చిన్నారులకు కిండర్ గార్డెన్ విద్యను అందిస్తున్నామని వివరించారు. యూనిట్లను ఏర్పాటు చేసిన తర్వాత పిల్లల సంఖ్య 18,041కు పెరిగిందని పేర్కొన్నారు. నర్సరీ విద్యను బోధించేందుకు అంగన్వాడీ సిబ్బందికి ప్రీ స్కూల్ ట్రైనింగ్ ఇచ్చామని తెలిపారు. అంగన్వాడీ సెంటర్లలో గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం తీసుకునేందుకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే.. వాటిని కూడా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. -
పిల్లలు తక్కువున్న అంగన్వాడీల మూసివేత!
సాక్షి, హైదరాబాద్: తక్కువ పిల్లలున్న అంగన్వాడీ కేంద్రాలకు మంగళం పాడాలని సర్కారు భావిస్తోంది. పిల్లల నమోదులో వెనుకబాటు, లబ్ధిదారుల సంఖ్య తక్కువగా ఉండటం లాంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించిన ప్రభుత్వం.. సేవలను విస్తృతం చేసే క్రమంలో ఒకేచోట రెండు, మూడు అంగన్వాడీ కేంద్రాలుంటే వాటి సంఖ్యను సైతం కుదించాలని యోచిస్తోంది. ఈ మేరకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తోంది. హేతుబద్ధీకరణకు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలనే దానిపై రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతమున్న అంగన్వాడీ కేంద్రాల్లో తక్కువ మంది లబ్ధిదారులు, స్వల్ప నమోదు ఉన్న కేంద్రాల జాబితాను రూపొందిస్తోంది. వీటితో పాటు నమోదైన వారి హాజరు శాతాన్ని కూడా పరిశీలిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 3 వేలకు పైగా గల కేంద్రాల్లో తక్కువ నమోదు ఉన్నట్లు అధికారుల గణాంకాలు చెబుతు న్నాయి. ఈ నేపథ్యంలో వీటి బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను ఆ శాఖ పరి శీలిస్తోంది. కొన్నిచోట్ల దగ్గరగా ఉన్న కేం ద్రాలను విలీనం చేసే అంశాన్నీ పరిశీలి స్తోంది. నమోదు సంఖ్యకు తగ్గట్లు అంగన్వాడీ టీచర్లు, వర్కర్లను నియమిస్తారు. దీనిపై నెలలో నివేదికలు రూపొందించాల ని జిల్లా సంక్షేమాధికారులకు రాష్ట్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. -
నాణ్యత అక్కర్లేదా..?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఫుడ్స్‌కు ముడిసరుకుల సరఫరాలో నాణ్యత ప్రమాణాలు అటకెక్కాయి. నాసిరకం సరుకులను కాంట్రాక్టు సంస్థ సరఫరా చేస్తుందనే అభియోగాలను అధికారులు అట్టిపెట్టారు. వాటిపై నిజానిజాలు తేల్చేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వేసిన థర్డ్ పార్టీ ఎంక్వైరీ విచారణ ప్రక్రియకే పరిమితమైంది. కాంట్రాక్టు సంస్థ కాలపరిమితి ముగుస్తుందన్న సాకుతో టీఎస్ ఫుడ్స్ అధికారులు థర్డ్ పార్టీ నివేదిక కోసం వేచి చూడకుండా.. నిజాలు తేలే వరకు టెండర్లు తెరవొద్దని మంత్రి తేల్చిచెప్పినా కూడా అధికారగణం మాత్రం టెండర్లు తెరిచేందుకే మొగ్గు చూపింది. టీఎస్ ఫుడ్స్‌కు ముడిసరుకుల సరఫరాకు వచ్చిన టెండర్లను అధికారులు సోమవారం తెరిచారు. ఇందులో సాంకేతిక పరమైన అంశాలను మాత్రమే పరిశీలించినట్లు తెలిసింది. కాగా, ముడిసరుకుల కాంట్రాక్టు సంస్థను ఈనెల 29న ఖరారు చేస్తారు. సోమవారం సాంకేతిక అంశాలను పరిశీలించిన టీఎస్ ఫుడ్స్ అధికారులు 29న ఆర్థికపరమైన అంశాలను పరిశీలిస్తారు. ఈ క్రమంలో తక్కువ ధరలు కోట్ చేసి ఎల్1ని గుర్తించిన సంస్థకు కాంట్రాక్టు బాధ్యతను అప్పగిస్తారు. తాజా టెండర్ల ప్రక్రియలో కొన్ని ప్రధాన సంస్థలే టెండర్లు వేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో పాల్గొన్న సంస్థలే ఈసారి కూడా టెండర్లు వేసినట్లు సమాచారం. గతంలో అనుసరించిన వ్యూహాల ప్రకారమే ఈసారి కూడా టెండర్ల ప్రక్రియ జరిగిందని, గతంలో సరఫరా చేసిన కాంట్రాక్టర్‌కే టెండర్ దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. అంతా సిండికేటుదే అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆరేళ్ల లోపు చిన్నారులకు ఇస్తున్న బాలామృతం, న్యూట్రీమిక్స్, స్నాక్ ఫుడ్ వంటి ఆహార పదార్థాలన్నీ తెలంగాణ ఫుడ్స్ ద్వారా సరఫరా చేస్తున్నారు. వీటి తయారీకి అవసరమై న ముడిసరుకును టెండర్ల ద్వారా ఎంపిక చేసిన కాంట్రాక్టు సంస్థ నుంచి తెలంగాణ ఫుడ్స్ కొనుగోలు చేస్తుంది. ముడిసరుకులను సరఫరా చేసే కాంట్రాక్టులో నాలుగైదు సంస్థలే కీలకంగా ఉంటున్నాయి. దాదాపు పన్నెండేళ్లుగా ఈ సంస్థలే టెండర్లు దక్కించుకుంటున్నాయి. ఈ సంస్థలే సిండికేట్‌గా మారి టెండర్లు వేస్తున్నాయని, అందుకే ఆ సిండికేటులోని సంస్థలే ఏటా కాంట్రాక్టు దక్కించుకుంటున్నట్లు విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఫుడ్ నాణ్యతపై ఫిర్యాదులు అందడం తో మంత్రితో పాటు అధికారులు సీరియస్ అయ్యారు. -
పిల్లల బువ్వ కల్తీ.. హవ్వ!
సాక్షి, హైదరాబాద్: చిన్నారుల్లో పౌష్టికాహార లోపాల్ని అరికట్టేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే ఆహార పదార్థాలు కల్తీమయ మవుతున్నాయి. ఇటీవల అధికార యంత్రాంగం అంతర్గత తనిఖీల్లో ఇది వెలుగుచూసింది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆరేళ్లలోపు చిన్నారులకు బా లామృతం, న్యూట్రిమిక్స్, స్నాక్ ఫుడ్ ఇస్తున్నారు. వీటిని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో తెలంగాణ ఫుడ్స్ విభాగం తయారు చేసి అంగన్వా డీలకు సరఫరా చేస్తుంది. రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 31,711 ప్రధాన అంగన్వాడీ, 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 4,31,310 మంది గర్భిణులు, బాలింత లు, 10,42,675 మంది మూడేళ్లలోపు చిన్నారులు, 6,54,165 మంది మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముడిసరుకుల సరఫరా కాంట్రాక్టర్లదే.. ఈ ఆహార పదార్థాల తయారీకి ముడిసరుకును ప్రైవేటు వ్యక్తుల నుంచి తెలంగాణ ఫుడ్స్ కొనుగోలు చేస్తుంది. ఎస్‌ృ30 షుగర్, శనగపప్పు, మొక్కజొన్న, కారం, పసుపు, గోధుమలు తదితరాలను కాంట్రాక్టర్ల నుంచి తీసుకుని బాలామృతం, న్యూట్రిమిక్స్, స్నాక్ ఫుడ్‌ను తయారు చేసి అంగన్వాడీలకు సరఫరా చేస్తారు. అయితే ఈ సరుకులను ప్యాకేజీ రూపంలో పంపిణీ చేస్తుండగా.. చాలా వరకు కల్తీ ఉంటోందని తెలిసింది. కాగా, ఇటీవల రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శాఖ పరమైన కార్యక్రమాల్లో భాగంగా తయారీ కేంద్రాన్ని, ఇతర హోమ్‌లను సందర్శించిన సందర్భంలో సరుకుల నాణ్యతలో లోపాలను గుర్తించారు. థర్డ్ పార్టీ ద్వారా విచారణ.. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫుడ్స్‌కు సరఫరా చేస్తు న్న సరుకుల నాణ్యతను పరిశీలించాలని ప్రభు త్వం నిర్ణయించింది. దీనిపై థర్డ్ పార్టీ విచారణ చేయించాలని మంత్రి నిర్ణయించినట్లు తెలుస్తోం ది. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్లు సరఫరా చేసిన సరుకుల శాంపిల్స్‌ను ప్రైవేటు సంస్థకు ఇచ్చినట్లు సమాచారం. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. గడువు దాటినా తెరుచుకోని టెండర్లు తెలంగాణ ఫుడ్స్ విభాగానికి ముడిసరుకుల పంపిణీ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. అక్టోబర్ 11న తెలంగాణ ఫుడ్స్ ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు ఆహ్వానించిగా.. మళ్లీ ఈ కాంట్రాక్టర్లే టెండర్లు వేసినట్లు తెలిసింది. గత నెల 31తో టెండర్ల దాఖలు గడువు ముగిసింది. వాస్తవానికి ఈ నెల 1న టెండర్లు తెరవాల్సి ఉంది. కానీ సరుకుల నాణ్యతపై ఆందోళన కలగడంతో వాటిని తెరవొద్దని మంత్రి ఆదేశించినట్లు తెలిసింది. థర్డ్ పార్టీ నివేదిక వచ్చాక కాంట్రాక్టర్ల ఎంపిక చేపట్టాలని, కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలా? లేక క్రిమిన ల్ కేసులు నమోదు చేయాలా? అనే దానిపై నిర్ణ యం తీసుకుంటామని ఓ అధికారి చెప్పారు. -
ఇదే మెనూ.. పెట్టింది తిను
సాక్షి, ఆదిలాబాద్ : అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులకు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం ఆవశ్యకతపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో సెప్టెంబర్ 1 నుంచి నెల చివరి వరకు పోషణ్ అభియాన్ కార్యక్రమం చేపట్టింది. నెల పాటు అవగాహన కల్పించినా ఫలితం లేకుండాపోయింది. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాలకు పూర్తిస్థాయిలో సరుకులు సరఫరా కాకపోవడంతో పౌష్టికాహారం అందడం లేదు. ఇటీవల జరిగిన స్టాడింగ్ కమిటీ సమావేశంలో సైతం ప్రజాప్రతినిధులు తమ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు సరఫరా కావడం లేదని లేవనెత్తిన విషయం తెలిసిందే. దీనిని బట్టి చూస్తే ఐసీడీఎస్ నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. ఆకుకూరలు, కోడిగుడ్లు, పాలు, పెరుగుతో కూడిన పౌష్టికాహారం అందించాల్సి ఉండగా పప్పు, అన్నం కూడా కొన్ని కేంద్రాల్లో పెట్టడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు అంగన్వాడీ కేంద్రాలను శుక్రవారం ‘సాక్షి’ విజిట్ చేయగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలా కేంద్రాలు సమయానికి తెరువలేదు. తెరిచిన కేంద్రాల్లో పిల్లల సంఖ్య ముగ్గురు, నలుగురే ఉండడం గమనార్హం. జిల్లాలోని 18 మండలాల్లో 5 ప్రాజెక్టులు, 51 సెక్టార్లు ఉన్నాయి. మొత్తం 1,256 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 987 ప్రధాన కేంద్రాలు కాగా, 269 మినీ కేంద్రాలు ఉన్నాయి. ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలు సుమారు 21,685 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 30,503 మంది, గర్భిణులు, బాలింతలు 10,520 మంది ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ప్రతీరోజు ఒక పూట మధ్యాహ్నం పూర్తిస్థాయి భోజనం వండిపెట్టాలి. కాని జిల్లాలో ఏ కేంద్రంలో కూడా ఇది అమలు కావడం లేదు. ప్రస్తుతం చాలా కేంద్రాల్లో పాలు, నూనె, పప్పుతోపాటు ఇతర సరుకులు లేవు. కొన్ని కేంద్రాల్లో ఉన్నా నిర్వాహకులు వండి పెట్టడం లేదని సాక్షి విజిట్‌లో తేలింది. లోపించిన పర్యవేక్షణ అంగన్వాడీ కేంద్రాలపై ఐసీడీఎస్ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించింది. దీంతో అంగన్వాడీ కార్యకర్తలు చాలా మంది సమయపాలన పాటించడం లేదు. సక్రమంగా కేంద్రాలు తెరవడం లేదు. దీంతో పిల్లలు, గర్భిణులు, బాలింతలు కేంద్రాలకు రావడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కేంద్రాలు తెరిచిన వారిలో చాలా మంది భోజనం సక్రమంగా వండి పెట్టలేదు. సరుకులు ఉన్న కేంద్రాల్లో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. పర్యవేక్షించాల్సిన కొంత మంది సూపర్వైజర్లు కార్యాలయానికే పరిమితం ఆవుతున్నారు. దీంతో కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలు లబ్ధిదారులకు అందజేయాల్సిన కోడిగుడ్లు, ఇతర సరుకులు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మెనూ ప్రకారం భోజనం పెట్టాలి. కాని ఏ కేంద్రంలోనూ మెనూ పాటించడం లేదు. ఆకుకూరలు, పెరుగు జాడ లేదు. అలాగే కొన్ని కేంద్రాల్లో పప్పు కూడా లేదు. -
అంగన్వాడీ వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం
సాక్షి, అమరావతి : అంగన్వాడీ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. 'గత ప్రభుత్వంలో అంగన్ వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేశారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇవ్వాల్సిన పౌష్టికాహారం నాసిరకంగా ఇచ్చారు. పిల్లలకు ఇవ్వాల్సిన గుడ్లు, పౌష్టికాహారం కూడా నాసిరకంగా అందించి అవినీతికి పాల్పడ్డారు. కానీ నేడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్వర్యంలో అంగన్వాడీ వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాం. పిల్లలు, గర్భిణీలకు సరైన పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో 53శాతం మహిళలకు రక్తహీనత ఉంది. దానిని తగ్గించేందుకు సరైన పౌష్టికాహారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. గతంలో అంగన్వాడీ కేంద్రాల ఆహారం బిల్లులు కూడా పెండింగ్ పెట్టి వెళ్లిపోయారు. వీటన్నిటిని సరిదిద్దుకుంటూ రాష్ట్రాన్ని మహిళా పక్షపాతిగా సీఎం జగన్ పాలిస్తున్నారు. మద్యం ధరలు పెంచి మద్యాన్ని పేదలకు దూరం చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం. సీఎం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మహిళలంతా స్వాగతిస్తున్నారు. కానీ ప్రతిపక్షనేత చంద్రబాబు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నా'రని విమర్శించారు. -
పిల్లల సొమ్ము.. పెద్దల భోజ్యం
పసిపిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాల్సిన అంగన్వాడీ కేంద్రాలు అక్రమాలకు నిలయాలుగా మారుతున్నాయి. ప్రభుత్వం సరఫరా చేసే సరుకులను నిర్వాహకులు దర్జాగా నల్లబజారుకు తరలిస్తున్నారు. పిల్లల పొట్టకొడుతూ తమ బొజ్జలు నింపుకుంటున్నారు. చిన్నారుల ఆకలి తీర్చే ఆహారాన్ని ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా జిల్లాలోని పలు కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం అందించే మాట అటుంచితే అసలు ఆహారమే అందించడం లేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కేంద్రాల్లో నిర్వహణ లోపాలు, అవినీతి అక్రమాలపై జిల్లావ్యాప్తంగా స్త్రీశిశు సంక్షేమశాఖ కార్యాలయాలకు నిత్యం ఫిర్యాదులు అందడమే ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది. సాక్షి, నెల్లూరు: చిన్నారులకు, బాలింతలు, గర్భిణులకు ప్రతినెలా అన్న అమృతహస్తం, బాలామృతం, మధ్యాహ్న భోజన పథకం, బాల సంజీవని ఇలా వివిధ రూపాల్లో పౌష్టికాహారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తాయి. ప్రతినెలా రూ.కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం ఇందుకోసం వెచ్చిస్తుండగా అవన్నీ సక్రమంగా విద్యార్థులకు అందించాల్సిన బాధ్యత అంగన్వాడీ కేంద్రాలపై ఉంది. ఆయా పథకాలను మాత్రం స్త్రీ అభివృద్ధి, శిశుసంక్షేమశాఖ అధికారులు, ఉద్యోగులు పర్యవేక్షించాల్సిఉంది. కానీ అంగన్వాడీ కేంద్రాల్లో ఇందుకు భిన్నంగా జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేంద్రాల్లో అవినీతి, అక్రమాలపై స్థానికులే ఫిర్యాదులు చేస్తున్నారు. జిల్లా శిశు సంక్షేమశాఖ ప్రాజెక్ట్ డైరక్టర్ కార్యాలయానికి ఫిర్యాదుల పరంపరం వెల్లువెత్తుతోంది. నాలుగు నెలల వ్యవధిలో దాదాపు 20కు పైగా ఫిర్యాదులు వచ్చాయి. ఇటీవల ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై సర్వే చేయిస్తే దాదాపు 10 వేల మంది విద్యార్థులు హాజరు పట్టికలో చూపి వారికి కేటాయించే నిధులు మాత్రం ఆ శాఖ చిరుద్యోగుల నుంచి అధికారుల వరకు వాటాలు పంచుకుంటున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇటీవల అంగన్వాడీ కేంద్రాలపై విజిలెన్స్ ఎన్పోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేయగా పథకాల అమలులో, విద్యార్థులు హాజరులో తేడాలున్నట్లు గుర్తించారు. ఇవిగో అక్రమాలు ♦ ఇటీవల వెంకటగిరి పట్టణం కోళ్లఫారం సెంటర్లో సిబ్బంది మధ్య వివాదం చిన్నారుల కడుపు మాడ్చింది. కేంద్రానికి వచ్చిన పౌష్టికాహారం పనికిరాకుండా పోయింది. పిండి ముక్కిపోగా, గుడ్లు చెడిపోయాయి. దీనిపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ♦ ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూ రు, ఉదయగిరి ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 440 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో చాలా కేంద్రాల్లో అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పోషకాహారం పంపిణీ పక్కదారి పడుతోంది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందజేసే పోషకాహారం అరకొరగా పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని కేంద్రాల్లో కార్యకర్తలు సమయపాలన పాటించడం లేదని విమర్శలు ఉన్నాయి. బాలసంజీవిని, కోడిగుడ్లను కేంద్రాల్లో లబ్ధిదారులకు అందజేయకుండా కార్యకర్తలు పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ♦ కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం నేతల కక్కుర్తి చిన్నారులకు పౌష్టికాహారాన్ని దూరం చేసింది. తమ స్వలాభం కోసం తమ సొంత భవనాలనే అద్దెకు ఇచ్చి ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటున్నారు. అంతేకాకుండా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఇచ్చే పౌష్టికాహారం వారికి దూరమతోంది. ♦ ఆత్మకూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అనంతసాగరం మండలం కొత్తూరు అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్న మహిళ గత 9 నెలలుగా విధులకు డుమ్మా కొట్టింది. ఆ తొమ్మిది నెలలపాటు హాజరు రిజిస్టర్లో గైర్హాజరుగానే చూపిస్తున్నారు. కానీ ఆమెకు మాత్రం ప్రతి నెలా జీతం మాత్రం ఇస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఆమెకు ఇచ్చే నెల జీతంలో 70 శాతం స్థానిక సూపర్వైజర్ నుంచి ప్రాజెక్టు అధికారి వరకు వాటాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో మరో ట్విస్ట్ ఏమిటంటే ఆమె వయస్సు 60 సంవత్సరాలు దాటి రిటైర్డ్ అయినా కూడా ఆమె ఆధార్ కార్డులో వయస్సు తగ్గించి మళ్లీ విధుల్లోకి తీసుకోవడం ఆ ప్రాజెక్టు పరిధిలో జరిగే అవినీతికి పరాకాష్టగా నిలిచింది. అలాగే గతంలో ఆయా కూడా అంగన్వాడీ కేంద్రంలో గ్యాస్ స్టౌ వెలిగించి ఇంటికి వెళ్లిపోవడంతో అగ్నిప్రమాదం జరిగే సమయంలో స్థానికులు గుర్తించి పిల్లలను బయటకు తరలించిన ఘటన జరిగింది. అప్పట్లో స్థానికులు ఆయాను తొలగించాలని ఫిర్యాదులు చేసినా టీడీపీ పెద్దల అండతో అధికారులు ఆమెను కొనసాగించారు. ♦ ఆత్మకూరు ప్రాజెక్టు పరిధిలోని శంకరనగరం గ్రామంలో కూడా గత రెండేళ్లుగా ఆయా విధులకు గైర్హాజరు అవుతున్నా ఆమెకు జీతం ఠంచన్‌గా ప్రతినెలా ఇస్తూ అధికారులు వాటాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంకా ఇలాంటి ఫిర్యాదులు జిల్లా కార్యాలయానికి వెల్లువెత్తుండడంతో ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు నేను బాధ్యతలు చేపట్టి నెల రోజులే అయింది. జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల్లో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై ఆరా తీస్తున్నాం. అంగన్వాడీ కేంద్రాలపై ఫిర్యాదులు వస్తున్న మాట వాస్తవమే. నేనే రంగంలోకి దిగి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాను. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ సక్రమంగా లేకున్నా, పిల్లల హాజరులో తేడాలు ఉన్నా చర్యలు తీసుకుంటాం.– బి.సుధా భారతి, ఐసీడీఎస్ పీఓ -
వారు ఎలా ఇస్తే.. అలానే....!
చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యమే లక్ష్యంగా ఏర్పాటైన అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న పౌష్టికాహారంలో అనేక లోటుపాట్లు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఆహార పదార్ధాల సరఫరా చేసే సమయంలో ప్రభుత్వ నిబంధనలు సంబంధిత కాంట్రాక్టర్లు పాటించడం లేదు. ఇది ఏంటని అడిగే పరిస్థితి కేంద్రాల నిర్వాహకులకు లేదు. ఒకవేళ అడిగినా... సరఫరా చేసే వారు ఎటువంటి సమాధానం చెప్పకుండా తమ పని తాము కానిచ్చేసి ఆదరాబాదరాగా వెళ్లిపోతున్నారు. సంబంధిత కాంట్రాక్టర్ కేంద్రాలకు ఏం సరఫరా చేస్తే అవే తీసుకోవాలి మరి. వారు ఎలా ఇస్తే...అలా తీసుకోవాల్సిందే...! సాక్షి,బలిజిపేట(విజయనగరం) : పౌష్టికాహారంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే గుడ్లును కేంద్రం వద్ద అట్టలతో కలిపి తూకాలు వేసి కార్యకర్తలకు అప్పగించాల్సి ఉంది. కానీ గుడ్లు వ్యానుతో తెచ్చేవారు అట్టలను కార్యకర్తల చేతికి అందించి వెళ్లిపోవడమే తప్ప వాటిని తూచి ఇచ్చిన దాఖలాలు లేవు. తూకం వేసి ఇమ్మని కేంద్రం నిర్వాహకులు అడిగినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ క్రమంలో ఇచ్చే గుడ్లులో చాలా వరకు పాడైనవి వస్తున్నాయి. అట్టలతో దొంతులుగా ఇచ్చేసి ఆదరాబాదరాగా వ్యాన్‌తో వెళ్లిపోవడమే తప్ప వాటి నాణ్యతను పరిశీలించే పరిస్థితులు ఎక్కడా కానరావడం లేదు. దీంతో కార్యకర్తలు స్థానికులకు సమాధానం చెప్పలేక అవస్థలు పడుతున్నారు. గుడ్లు చిన్న, పెద్ద ఉండడంతో పాటు ఒకే బరువుతో ఉండనందున తూకం వేసి కేంద్రాలకు అప్పగించాల్సి ఉంది. ఒక అట్టలో 30 గుడ్లు ఉంటాయి. దీని బరువు కేజిన్నర నుంచి 1600 గ్రాములు ఉండాలి. ఈ ప్రాప్తికి తూనిక వేసి కేంద్రాలకు అప్పగించాల్సి ఉంది. కాంట్రాక్టు ప్రకారం గుడ్లు తెచ్చే వ్యాన్‌లో కాటాను తీసుకువచ్చి కేంద్రాలకు అప్పగించేటప్పుడు తూకం వేసి అందించాల్సి ఉంది. కాంట్రాక్టర్ ఈ నిబంధనను పాటించకున్నా అధికారులు పట్టించుకునే దాఖలాల్లేవు. మెనూ ప్రకారం గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పంపిణీ చేసే గుడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవ్వాల్సిన మెనూ... ► గర్భిణులు, బాలింతలు, ప్రీస్కూలు పిల్లలకు : సోమ, గురువారాల్లో సాంబారు, అన్నం, మంగళ, శుక్రవారాల్లో పప్పు, ఆకుకూర, అన్నం, బుధ, శనివారాల్లో కాయగూర దీనికి బదులు ఆకుకూరతో పప్పున్నం. ►గర్భిణులు, బాలింతలకు: గుడ్లు, పాలు, శనగ చెక్కీలు సోమవారం నుంచి శనివారం వరకు ఇవ్వాలి. ►మూడు నుంచి ఆరేళ్ల చిన్నారులకు వారానికి నాలుగు రోజులు గుడ్లు ఇవ్వాలి.(గురువారం, శనివారం ఉండవు) ►మూడేళ్లలోపు వారికి వారానికి రెండు రోజులు మాత్రమే గుడ్లు పంపిణీ చేస్తారు. ►మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులలో బరువు తక్కువ ఉండే వారికి బరువు పెరిగే వరకు పాలు పంపిణీ చేస్తారు. ►గుడ్లు పది రోజులకు ఒకసారి కేంద్రాలకు పంపిణీ చేస్తున్నారు. ►కొత్త మెనూలో బాలసంజీవిని అమలు చేయాలి: గర్భిణులకు, బాలింతలకు నెలకు కిలో ఖర్జూరం, అరకిలో బెల్లం, కిలో రాగి పిండిని అందిస్తున్నారు. -
చుట్టపుచూపుగా అంగన్వాడీ కేంద్రానికి..
సాక్షి, కావలి: దగదర్తి మండలంలోని కాట్రాయపాడు గ్రామంలోని మెయిన్ అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్తగా పని చేస్తున్న పి.మాలతి ఎనిమిదేళ్లుగా గ్రామంలో నివాసం ఉండటం లేదు. దీంతో ఆమె అంగన్వాడీ కేంద్రానికి చుట్టపుచూపుగా వీలు కుదురినప్పుడు వస్తుండటంతో గ్రామస్తులు మండిపడుతున్నారు. గత 18 ఏళ్ల నుంచి అంగన్వాడీ కార్యకర్తగా పని చేస్తున్న మాలతి, ఎనిమిదేళ్ల క్రితం నెల్లూరుకు వెళ్లిపోయారు. ఆమె కుటుంబం నెల్లూరు నగరానికి వెళ్లిపోవడంతో, కాట్రాయపాడు గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి వచ్చి విధులు నిర్వర్తిచడానికి ఆమెకు వీలు కుదురడం లేదు. ఎప్పుడో ఒకసారి మాత్రమే..! వాస్తవంగా ఉదయం 9 గంటలు నుంచి సాయంత్రం 4 గంటలు వరకు అంగన్వాడీ కేంద్రంలో ఉండి పిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని అందించాలి. అలాగే వారి ఆరోగ్య పరిస్థితులను గమనిస్తుండాలి. పిల్లలకు ఆటలతో పాటు అక్షరాలు నేర్పుతూ మానసిక వికాసానికి తోడ్పడాలి. అయితే నెల్లూరు నగరం నుంచి దగదర్తి మండలలలోని కాట్రాయపాడు గ్రామానికి రావడానికి రోజూ రావడానికి సదరు కార్యకర్తకు సాధ్యపడటం లేదు. దీంతో అప్పుడప్పుడు ఉదయం 11 గంటలకు అంగన్వాడీ కేంద్రానికి వచ్చి, మధ్యాహ్నం 2 గంటలకు నెల్లూరుకు వెళ్లే బస్సు ఎక్కి వెళ్లిపోతుంది. ఆమె పనితీరు ప్రభుత్వ లక్ష్యాన్ని వెక్కిరిస్తున్నట్లుగా ఉన్న విషయం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులకు తెలిసినప్పటికీ, టీడీపీ నాయకుల అండ ఉండటంతో ఆమెపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి అప్పట్లో భయపడ్డారు. దీనిని అలుసుగా తీసుకొనే అంగన్వాడీ కార్యకర్త ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. అధికారులకు గ్రామస్తుల ఫిర్యాదు గ్రామస్తులు ఆమె ద్వారా ప్రభుత్వ సేవలు అందకుండా పోతుండటంతో పాటు ఆమె వ్యవహారశైలిపై తీవ్రమైన ఆగ్రహంతో కాట్రాయపాడు గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం బుచ్చిరెడ్డిపాలెం సీడీపీవో జియోన్‌కుమారి, దగదర్తి సూపర్వైజర్ ఎన్.సునీతలు గ్రామంలో విచారణకు వచ్చారు. అప్పుడు కూడా కార్యకర్త మాలతి అంగన్వాడీ కేంద్రంలో లేరు. అయితే ఆమెకు ఫోన్ చేసి రావాల్సిందిగా సీడీపీవో చెప్పారు. ఆమె హడావుడిగా నెల్లూరులో బయలుదేరి కాట్రాయపాడు గ్రామానికి చేరుకొనేలాగా, ఆమెకు మద్దతుగా గ్రామంలోని టీడీపీ నాయకులు అంగన్వాడీ కేంద్రానికి చేరుకొన్నారు. దీంతో సీడీపీవో, సూపర్వైజర్లు విస్తుపోయారు. శాఖాపరమైన విచారణకు టీడీపీ నాయకులు అంగన్వాడీ కేంద్రానికి రావడం ఏమిటని విస్మయం వ్యక్తం చేశారు. నివేదికను జిల్లా అధికారులకు అందజేస్తామని సీడీపీవో చెప్పారు. అంగన్వాడీ కేంద్రంలో విచారిస్తున్న సీడీపీవో. అక్కడే కుర్చీలో కూర్చొన్న టీడీపీ నాయకులు -
బరువు చెప్పని యంత్రాలు..!
అంగన్వాడీల సేవల్లో బరువు తూసే యంత్రాలే కీలకం. పిల్లలు, గర్భిణుల బరువును నెలనెలా రికార్డుల్లో నమోదు చేస్తారు. దాని ఆధారంగా పోషకాహారం అందజేస్తారు. బరువు పెరగకపోతే అదనపు పోషకాహారం ఇస్తారు. ఇది నిత్యప్రక్రియ. వీటికి బరువుతూసే యంత్రమే ఆధారం. గత టీడీపీ ప్రభుత్వం ఏడాది కిందట ఇచ్చిన వేయింగ్ మిషన్లు పనిచేయకపోవడంతో అంగన్వాడీలు అవస్థలు పడుతున్నారు. బరువు సరిగా తెలియక అయోమయానికి గురవుతున్నారు. సాక్షి, విజయనగరం ఫోర్ట్: అంగన్వాడీ కేంద్రాలకు టీడీపీ ప్రభుత్వం సరఫరా చేసిన వేయింగ్ మిషన్లు సక్రమంగా పనిచేయడం లేదు. వీటితో అంగన్వాడీలు అవస్థలు పడుతున్నారు. తరచూ మరమ్మతులకు గురికావడం, బరువులో కచ్చితత్వం లేక పోవడంతో అంగన్వాడీలు పాత వేయింగ్ మిషన్ (బరువుతూసే పరికరం) వాడాల్సిన పరిస్థితి. తూకం సరిగా రాక... జిల్లాలోని 17 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో 2,987 అంగన్వాడీ, 742 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 7 నెలలు నుంచి మూడేళ్ల లోపు పిల్లలు 64,024 మంది, 3 నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 41,714 మంది, గర్భిణులు 16,124 మంది, బాలింతలు 15,418 మంది ఉన్నారు. మొత్తం 1,37,280 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఏడాది కిందట వేయింగ్ మిషన్లు సరఫరా.. అంగన్వాడీ కేంద్రాలకు ఏడాది కిందట గత టీడీపీ ప్రభుత్వం వేయింగ్ మిషన్లు పంపిణీ చేసింది. జిల్లాలో మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు 2,987, మినీ అంగన్వాడీ కేంద్రాలు 742కు సోలార్ వేయింగ్ మిషన్లు సరఫరా చేశారు. ఇవి సక్రమంగా పనిచేయడం లేదు. కొన్ని వేయింగ్ మిషన్లు ఆన్కావడం లేదు. కొన్ని మిషన్లు బరువులో తేడాలు చూపుతున్నాయి. దీంతో పిల్లలు, గర్భిణుల బరువును ఎలా పరిగణలోకి తీసుకోవాలో తెలియక తికమకపడుతున్నారు. కొత్త వేయింగ్ మిషన్లు సక్రమంగా పనిచేయకపోవడంతో కొన్నిచోట్ల పాత వేయింగ్ మిషన్లను వినియోగిస్తున్నారు. గర్భిణుల బరువు తూయడం కోసం... అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని గర్భిణుల బరువు తూయడం కోసం వేయింగ్ మిషన్లను సరఫరా చేశారు. ప్రతీనెలా గర్భిణుల బరువు తూసి వాటి వివరాలు అంగన్వాడీలు రికార్డుల్లో నమోదు చేస్తారు. బరువులో పెరగకపోతే వారికి అదనపు పౌష్టికాహారం ఇస్తారు. అయితే వేయింగ్ మిషన్లు సక్రమంగా పనిచేయకపోవడం అంగన్వాడీలు అయోమయానికి గురవుతున్నారు. బాగుచేయించి ఇస్తున్నాం.. అంగన్వాడీ కేంద్రాలకు ఏడాది కిందట సోలార్ వేయింగ్ మిషన్లు సరఫరా చేశాం. మరమ్మతులకు గురైన వాటిని జిల్లా కేంద్రానికి తీసుకొస్తే బాగు చేయించి ఇస్తున్నాం. పనిచేయని మిషన్లను తమదృష్టికి తీసుకుని వస్తే బాగు చేయించి ఇస్తాం. – శాంతకుమారి, ఏపీడీ, ఐసీడీఎస్ -
అంగన్వాడీ వంట.. ఇంటి పంట!
కంకిపాడు: అదొక అంగన్వాడీ కేంద్రం. అద్దె భవనంలో నడుస్తోంది. అయినా అక్కడ ఉన్న పెరడును సద్వినియోగం చేసుకుని నూట్రీ గార్డెన్‌ను ముచ్చటగా తీర్చిదిద్దారు. అంగన్వాడీ కేంద్రానికి అవసరమైన కూరగాయలను స్థానికంగానే సమకూర్చుకుంటున్నారు. న్యూటీ గార్డెన్ నిర్వహణతో మిగతా అంగన్వాడీ కేంద్రాలకూ ఆదర్శంగా నిలుస్తోంది కంకిపాడులోని ఐదో నంబరు అంగన్వాడీ కేంద్రం. స్థలం చిన్నదే.. ఈ అంగన్వాడీ కేంద్రం పట్టణంలోని రజక రామాలయం సమీపంలో నడుస్తోంది. ఈ కేంద్రానికి టీచరుగా వై.నళినీకుమారి, ఆయాగా బి.రజని విధులు నిర్వహిస్తున్నారు. కేంద్రానికి ఎదురుగా సుమారు అర సెంటు స్థలం ఉంది. ఈ స్థలంలో న్యూట్రీ గార్డెన్ ఏర్పాటు చేయాలని అంగన్వాడీ సిబ్బంది నిర్ణయించుకున్నారు. ఆలోచన వచ్చిందే తడువుగా విజయవాడ నుంచి కూరగాయల విత్తనాలను కొనుగోలు చేశారు. ఉన్న కొద్ది స్థలంలోనే బెండ, వంగ, మిర్చి, గోరుచిక్కుడు, వీటితో పాటు ఆకుకూరల విత్తనాలు చల్లారు. పోషకాలతో కూడిన ఆహారం కొద్ది రోజులుగా ఈ గార్డెన్లో పండిన ఆకుకూరలు, ఇతర కూరగాయలనే అంగన్వాడీ కేంద్రంలో కూరలు సిద్ధం చేసేందుకు వినియోగిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో కూరగాయలను పండిస్తున్నారు. ప్రతి రోజూ వంటలో ఆకుకూరలు, బెండకాయలు, వంకాయలు, చిక్కుడు వినియోగిస్తున్నారు. ప్రతి రెండు రోజులకు ఒకసారి పెరడును శుభ్రం చేస్తూ అంగన్వాడీ కేంద్రానికి అవసరమైన కూరగాయలు, ఆకుకూరలను సమకూర్చుకుంటున్నారు. అన్ని అంగన్‌వాడీకేంద్రాల్లోనూ గార్డెన్లు అన్ని అంగన్వాడీ కేంద్రాల వద్ద న్యూట్రీ గార్డెన్లను ఏర్పాటు చేస్తున్నాం. ఈ కేంద్రంలో నిర్వహణ చాలా బావుంది. ప్రతి ఒక్కరూ గార్డెన్ల నిర్వహణపై శ్రద్ధ వహించి చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య సంరక్షణకు బాధ్యతగా పనిచేయాలి.– జి.ఉమాదేవి, సీడీపీవో,కంకిపాడు -
హరితలోగిళ్లు.. ఈ అంగన్వాడీలు
సాక్షి, బీర్కూర్ (కామారెడ్డి): తెలంగాణ వ్యాప్తంగా మొక్కల పెంపకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనిలో భాగంగా హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతీ ప్రభుత్వ శాఖను హరితహారంలో భాగం చేస్తు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే శాశ్వత అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు స్వచ్చందంగా ముందుకు వచ్చి తమ కేంద్రాలను అందమైన హరితలోగిళ్లుగా మార్చుతున్నారు. తమ కేంద్రాల ఆవరణలో అనేక రకాల పూల మొక్కలతో పాటు కూరగాయల మొక్కలు, ఆకు కూరల పాదులు ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటి ద్వారా వచ్చిన కూరగాయలు, ఆకు కూరలను పౌష్టికాహారంలో భాగంగా గర్బవతులకు, బాలింతలకు, చిన్నారులకు మంచి ఆకుకూరలతో భోజనాన్ని వడ్డిస్తున్నారు. ఎక్కువగా సొంత భవనాల్లోనే.. సొంత భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయా గ్రామాల్లోని అంగన్వాడీ కార్యకర్తలు తమ కేంద్రాల పరిదిలో హరితవనాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. బీర్కూర్ మండలంలో మొత్తం 25 కేంద్రాలు ఉండగా వాటిలో 14 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు కార్యకర్తలు మొక్కలు నాటి వాటిని పోషించే బాధ్యతను స్వీకరించారు. బీర్కూర్ మండల కేంద్రంలోని హరిజనవాడ, కిష్టాపూర్,అన్నారం, దామరంచ, రైతునగర్ త దితర గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల ఆవరణలో మొక్క లు పెంచుతున్నారు. బీర్కూర్ మండలంతో పాటు బాన్సువాడ ప్రాజెక్ట్ పరిధిలోని ఐదు మండలాల్లో మొత్తం 222 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వాటిలో 94 కేంద్రాలు సొంత భవనాల్లో కొనసాగుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో 1198 అంగన్వాడీ కేంద్రాలుండగా కొన్నే సొంత భవనాలు ఉన్నాయి. బీర్కూర్ మండలంలో.. బీర్కూర్ మండలంతో పాటు బాన్సువాడ ప్రాజెక్ట్ పరిధిలో కొన్ని కేంద్రాలకు సొంత భవనాలు ఉండటంతో మొక్కల పెంపకం చేపట్టడం జరిగిందని అయితే అద్దె భవనాల్లో ఈ సదుపాయం లేకుండా పోతోందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే మరికొంత మంది మాత్రం సొంత భవనాలు ఉన్నప్పటికి మొక్కల పెంపకంపై ఆసక్తి కనబరచడం లేదు. బీర్కూర్ గ్రామంలోని హరిజనవాడ అంగన్వాడీ కేంద్రాల్లో అనేక రకాల పూల మొక్కలతో పాటు ఆకుకూరల పాదులను ఏర్పాటు చేసి సాగు చేస్తున్నారు. ఆట పాటలతో విద్యాబోధన కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు ఆట పాటలతో చిన్నారులకు విద్యాభోదన చేస్తున్నారు. దీంతో పాటు గర్భవతులకు, బాలింతలకు ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యం మేరకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుండటంతో కొంత మేర మార్పు కనిపిస్తోందని ఆయా గ్రామాల ప్రజలు అభిప్రాయపడ్తున్నారు. పచ్చదనంతో నిండి ఉంటుంది.. బీర్కూర్ మండల కేంద్రంలోని హరిజనవాడలో అన్న అంగన్వాడీ కేంద్రం పచ్చదనంతో నిండి ఉంటుంది. అం గన్వాడీ కేంద్రానికి వస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. తమ పిల్లలు కేంద్రంలో చక్కగా భోజనం చేస్తూ ఆటలు ఆడుకుంటూ చదువు నేర్చుకుంటున్నారు. సొంత భవనం లేనప్పుడు పిల్లలు కూడా ఇబ్బందులు పడేవారు. – కల్యాణి, బాలింతరాలు, బీర్కూర్ కొన్ని కేంద్రాలు ఎంతో బాగున్నాయి బీర్కూర్ మండలంలో మొత్తం 25 కేంద్రాలకు గాను 14 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు హరితహారంలో భాగంగా మొక్కలు నాటుతూ కార్యకర్తలు కూరగాయ మొక్కలను సైతం పెంచు తున్నారు. దీనివల్ల గర్భవతులకు పౌష్టికాహారం అందించే సమయంలో వీటిని ఉపయోగిస్తున్నారు. – కళావతి, ఐసీడీఎస్ సూపర్వైజర్ బీర్కూర్ -
ప్రతి అంగన్వాడీలో మరుగుదొడ్డి!
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్డిని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. మహిళాభివృద్ధి సంక్షేమ శాఖ ద్వారా అమలవుతున్న కార్యక్రమాల్లో అత్యధిక లబ్ధిదారులైన గర్భిణులు, బాలింతలు ఈ కేంద్రాన్ని సందర్శించే సమయంలో వారికి అత్యవసర సమయంలో వసతి కల్పించేందుకు వీటిని ఏర్పాటు చేస్తోంది. ఈమేరకు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 31,711 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాచరణ రూపొందించింది. చాలాచోట్ల అంగన్వాడీలు ప్రభుత్వ పాఠశాల ఆవరణకు సమీపంలో, ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో ఉండడంతో స్కూల్‌కు కేటాయించిన మరుగుదొడ్లను వినియోగిస్తున్నారు. వీటి నిర్మాణాలను ప్రాధాన్యత క్రమంలో కేంద్రం మంజూరు చేస్తున్న నేపథ్యంలో స్థానిక అవసరాలు, లబ్ధిదారుల నిష్పత్తిని బట్టి అధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఏటా 25శాతం చొప్పున కార్యాచరణ ప్రణాళికలో పొందుపర్చి నిర్మాణాలు చేపట్టనున్నారు. మొత్తంగా నాలుగేళ్లలో ప్రతి కేంద్రంలో మరుగుదొడ్డి ఉండాల్సిందే. మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులిస్తే రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటాను భరించాల్సి ఉంటుంది. తాగునీరూ అవసరమే లబ్ధిదారులకు వసతుల కల్పనలో భాగంగా ప్రతి అంగన్వాడీ కేంద్రానికి తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాగునీటి వసతికి ప్రభుత్వం నిధులివ్వనుండగా.. మరుగుదొడ్ల నిర్వహణ ఇతరత్రా కార్యక్రమాలకు అవసరమయ్యే వాడుక నీటికి సంబంధించిన ఏర్పాట్లు మాత్రం స్థానిక పాలకులు చూడాల్సిందిగా సూచించింది. మరుగుదొడ్లు, తాగునీటి వసతులను ఒకే కార్యాచరణ ప్రణాళికలో రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తే విడుదల వారీగా కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. -
బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం
గిద్దలూరు: కంభం మండల కేంద్రంలోని కోనేటి వీధిలో బాలుడి కిడ్నాప్ వ్యవహారం గురువారం కలకలం రేపింది. అంగన్వాడీ స్కూల్‌కు వెళ్లిన ఆరేళ్ల తన కుమారుడు కనిపించకుండా పోయాడని తండ్రి కేతు వెంకటరామ్ గిరిధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారికి ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఆరు గంటల్లోనే బాలుడిని రక్షించారు. వివరాలు.. కోనేటి వీధికి చెందిన కేతు వెంకటరామ్ గిరిధర్, శ్రావణిలకు ముగ్గురు కుమారులు. దంపతులు పొలం పనులకు వెళ్తూ వారి రెండో కుమారుడు గిరిధర్‌ను స్థానికంగా ఉన్న అంగన్వాడీ కేంద్రానికి పంపించారు. దంపతులు తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చే సమయానికి గిరిధర్ ఇంటికి రాకపోవడంతో అక్కడక్కడా వెతికారు. గిరిధర్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫొటో ఆధారంగా పోలీసులు కంభంలోని అన్ని వీధులను కలియదిరిగారు. ప్రజలను విచారించగా బాలుడు మరో వ్యక్తితో కలిసి బస్టాండ్ సమీపంలో తిరుగుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు రోడ్డుపై ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. బాలుడితో ఉన్న వ్యక్తిని గుర్తించిన పోలీసులు ఎక్కడకు వెళ్లారనేది తెలుసుకునేందుకు బృందాలుగా ఏర్పడి విచారించారు. గిద్దలూరు మండలంలోని ముండ్లపాడు నుంచి బురుజుపల్లెకు వెళ్లే రోడ్డులో బాలుడిని గుర్తించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని బాలుడిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. బాలుడిని సురక్షితంగా అతని తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. విచారణ అనంతరం కోర్టులో హాజరు పరచనున్నట్లు ఎస్ఐ మాధవరావు తెలిపారు. తక్కువ సమయంలో కిడ్నాప్ కేసును ఛేదించిన ఎస్ఐను సీఐ రాఘవేంద్ర, మండల ప్రజలు అభినందించారు. -
...నాట్ గుడ్!
సాక్షి, హైదరాబాద్: పౌష్టికాహార లోపాలను అధిగమించేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా తీసుకుంటున్న చర్యలు ఆశించిన ఫలితాలివ్వడం లేదు. ఐదేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషక సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఆరోగ్య లక్ష్మి, పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రతిరోజు 200 మిల్లీలీటర్ల పాలు, ఉడికించిన కోడిగుడ్డు ఇవ్వాలి. వీటితోపాటు అధిక పోషక విలువలున్న ఆహారాన్ని వండి వడ్డించాలి. అయితే గత కొన్ని నెలలుగా ఈ ప్రక్రియ గాడి తప్పింది. సకాలంలో కోడిగుడ్ల స్టాకును కాంట్రాక్టర్లు అంగన్వాడీ కేంద్రాలకు చేర్చడం లేదు. దీంతో క్రమం తప్పకుండా ఇవ్వాల్సిన ఉడికించిన కోడిగుడ్లు లబ్ధిదారులకు అందండం లేదు. సకాలంలో స్టాకును ఇవ్వకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతున్నట్లు అంగన్వాడీ టీచర్లు పేర్కొంటున్నారు. సెపె్టంబర్ నెలకు అవసరమైన స్టాకు ఇప్పటివరకు అంగన్వాడీ కేంద్రాలకు చేరలేదు. రాష్ట్రవ్యాప్తంగా 32,217 కేంద్రాలనుంచి కోడిగుడ్ల ఇండెంట్లు ఆన్లైన్లో ప్రవేశపెట్టారు. కానీ ఇప్పటివరకు 2,139 కేంద్రాలకు మాత్రమే స్టాకు చేరినట్లు తెలుస్తోంది. మొత్తంగా 86.66 లక్షల కోడిగుడ్లకుగాను ఇప్పటివరకు 6.32 లక్షల గుడ్లు మాత్రమే సరఫరా అయ్యాయి. దీంతో పూర్తిస్థాయి పోషకాహారాన్ని ఇవ్వాలన్న లక్ష్యం నెరవేరడం లేదు. సాంకేతిక కారణాలను చూపుతూ డీలర్లు స్టాకును సకాలంలో ఇవ్వడం లేదు. కొందరు డీలర్లు బిల్లులు చెల్లించని సాకుతో ఆలస్యంగా సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పెట్టిన ఇండెంట్లు, గుడ్ల సరఫరా ఇండెంట్లు పంపిన కేంద్రాలు- 32,217 ఇప్పటివరకు పంపిణీ- 2,139 శాతం- 6% ఇండెంట్ పరిమాణం- 8,66,6551 ఉత్పత్తి అయిన పరిమాణం- 6,32,565 శాతం- 7.3% -
నేటి నుంచి కొత్తమెనూ
సాక్షి, రామభద్రపురం: అంగన్వాడీల ఆధ్వర్యంలో కొత్తమెనూ అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పోషకాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు మంగళవారం నుంచి అదనపు ఆహారం అందజేయనుంది. పోషణ అభియాన్ పథకంలో భాగంగా పోషకాహారం పంపిణీకి చర్యలు చేపట్టింది. షెడ్యూల్ కులాలు, తెగలు, ఇతర జనాభాలో గర్భిణులు, బాలింతలు, 6 సంవత్సరాలలోపు ఉన్న పిల్లల పోషణ స్థితి మెరుగుదలకు జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు ద్వారా ఈ పథకాన్ని అమలు చేయనుంది. అమలు: అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో ఇచ్చే సరుకులు: ప్రస్తుతం ఇస్తున్న పాలు, గుడ్లు, శనగ చెక్కీలకు అదనంగా ప్రతినెలా కిలో ఖర్జూరం, రాగిపిండి, బెల్లం ఎవరికి: రక్తహీనత కలిగిన పిల్లలు, గర్భిణులు, బాలింతలకు.. (గిరిజన ప్రాంతాల్లో లబ్ధిదారులందరికీ) ఎంతమందికి లబ్ధి: జిల్లాలో 20,872 మంది చిన్నారులు, 31,596 మంది గర్భిణులు, బాలింతలకు లబ్ధి పంపిణీ ఇలా... జిల్లాలో 17 ఐసీడీఎస్ ప్రాజెక్టులలో 3,729 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 1,60,674 మంది చిన్నారులు, 31,444 మంది గర్భిణులు, బాలింతలు ఉన్నారు. అయితే, జిల్లాలో షెడ్యూల కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన గర్భిణులు, బాలింతలకు రక్తహీనత, హైరిస్క్‌తో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరికీ కొత్తమెనూ ప్రకారం పోషకాహారం అందిచనున్నారు. అలాగే, ఇతర ప్రాంతాల గర్భిణులు, బాలింతల్లో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడంతో పాటు పొడవు 45 సెంటీ మీటర్లు, బరువు 35 కిలోలు కంటే తక్కువ ఉన్నవారికి, చిన్న వయసులో వివాహం జరిగి గర్భం దాల్చిన వారికి, 35 సంవత్సరాలు తరువాత గర్భందాల్చిన వారికి అదనపు పోషకాహారం అందించనున్నారు. సుమారుగా గర్భిణులు, బాలింతలు 31 వేల మంది పోషకాహార లబ్ధిపొందనున్నారు. రక్తహీనత, పోషకాహార లోపం ఉన్న చిన్నారులు 20,872 మందికి కొత్త మెనూ అందించనున్నారు. వీరందరికీ రోజూ అందిస్తున్న పాలు, గుడ్లు, శనగ చెక్కీలతో పాటు నెలకు సరిపడా ఒక కేజీ రాగి పిండి, కేజీ ఖర్జూరం, కిలో బెల్లం కొత్త మెనూ ప్రకారం అదనంగా ఇవ్వనున్నారు. రక్తహీనత, హైరిస్క్ గల గర్భిణులు, బాలింతలకు, చిన్నారులకు గతంలో ఇచ్చిన నువ్వుల చెక్కీలు ఆపేసి ఈ మూడు రకాల పోషక పదార్థాలు అందిచనున్నారు. సంతోషంగా ఉంది... గతంలో గర్భిణులు, బాలింతలకు అదనపు పోషకాహారం అందించేందుకు ‘నేను సైతం’ అనే పథకాన్ని ప్రారంభించాం. ఈ పథకం నిర్వహణకు దాతల ఆర్థిక సహాయాన్ని అర్జించేవారం. తాజాగా ప్రభుత్వమే అదనపు పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకోవడం అభినందించాల్సిన అంశం. ఆరోగ్యానికి పెద్దపీట వేసినట్టే. ఇకపై దాతలను ఆశ్రయించాల్సిన పని ఉండదు. – యర్రయ్యమ్మ, ఐసీడీఎస్ సూపర్వైజర్, రామభద్రపురం పోషకలోపాన్ని అధిగమించేందుకు... గర్భిణులు, బాలింతలలో రక్తహీనత, హైరిస్క్ అధికంగా ఉంటోంది. పిల్లల్లో పొడవు, బరువు తగ్గే అవకాశం ఎక్కువ. వారికి శనగ చెక్కీలు, పాలు, గుడ్లుతో పాటు ఖర్జూరం, రాగి పిండి, బెల్లం వంటి పౌష్టికాహారం అందించడం వల్ల వారిలో ఉన్న పోషక లోపాన్ని అధిగమించవచ్చు. – హెచ్‌కే కామాక్షి, సీడీపీవో, సాలూరు -
అంగన్వాడీల్లో ఆటలు లేవు..
సాక్షి, చిల్లకూరు (నెల్లూరు): ఆట వస్తువులు తుప్పు పట్టిపోవడంతో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఆటలకు దూరమవుతున్నారు. కార్పొరేట్‌కు దీటుగా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణను చేపడతామని గత ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసింది. అయితే ఎన్నికలు సమీపంచే సమయంలో భారీగా నిధులను ఐసీడీఎస్‌కు విడుదల చేస్తున్నట్టు ప్రకటించి, ఎన్నికలు రావడంతో ఏమీ చేయలేమని చేతులెత్తేసింది. దీంతో అంగన్వాడీ కేంద్రాల్లో సరైన వసతులు లేక చిన్నారులు ఆటలకు దూరమవుతున్నారు. ఈ క్రమంలో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపితే అక్కడ ఆటలు ఆడుకునేందుకు అవసరమైన సామగ్రి అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. ఫలితంగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య తగ్గనుంది. మండలంలో ఇది పరిస్థితి చిల్లకూరు మండలంలోని అంగన్వాడీ కేంద్రాలు గూడూరురూరల్ ఐసీడీఎస్ పరిధిలోకి వస్తాయి. మండలంలో సుమారు 85 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 11 మినీ కేంద్రాలు కాగా ప్రతి కేంద్రంలో 15 మందికి తక్కువ కాకుండా పిల్లలు ఉన్నారు. వీరంతా ఇంటి నుంచి వచ్చిన తర్వాత కేంద్రంలో ఉండి సాయంత్రం కొద్దిసేపు బయట ఉన్న కొద్ది స్థలంలో ఆడుకుని వెళ్తున్నారు. గతంలో అయితే సగా నికి పైగా కేంద్రాల్లో వివిధ రకాల అట పరికరాలు, బొమ్మలు ఉండేవి. అయితే గత ప్రభుత్వం కేంద్రాలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చి దిద్దుతామని చెప్పి కేంద్రాలకు అవసరమైన ఆట వస్తువలు జాబితాలను తెప్పించుకుంది. ఇందుకు గాను నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఎన్నికలు సమీపంచడంతో వాటి ఊసే ఎత్తలేదు. పూరి గుడిసెల్లో కేంద్రాలు చిల్లకూరు మండలంలో కొన్ని అంగన్వాడీ కేం ద్రాలకు సొంత భవనాలు ఉండగా మరికొన్ని గతంలో ప్రాథమిక పాఠశాలలకు నిర్మించిన అదనపు గదుల్లో కొనసాగుతున్నాయి. అలాగే 12 కేంద్రాలను అద్దె ఇళ్లలో నడుపుతుండగా వాటిలో అధిక శాతం పూరి గుడిసెల్లో ఉన్నాయి. వీటిని కూడా నిర్మించేందుకు గత ప్రభుత్వ హాయంలో నిధులు విడుదల చేస్తున్నామని చెప్పి కాంట్రార్లకు పనులు అప్పగించారు. వారు పనులు మొదలు పెట్టి నిధులు విడుదల చేయకపోవడంతో మధ్యలోనే నిలిపేసారు. ఇలా అర్ధంతరంగా నిలిచిన భవనాలకు మోక్షం లేకుండా పోయింది. కాగా ప్రస్తుత ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించి చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను అందించేలా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆదేశాలు అందాల్సి ఉంది అంగన్వాడి కేంద్రాలలో మౌళ వసతుల కల్పనకు సంబందించి నివేదకలను పంపేందుకు తాము సిద్దంగా ఉన్నాము. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాల్సి ఉంది. అసంపూర్తి భవనాలకు నిదులు విడుదల చేసి భవనాలను పూర్తి చేయించాలి. – ఈశ్వరమ్మ, సీడీపీఓ, ఐసీడీఎస్ రూరల్ ప్రాజెక్ట్ -
ఐసీడీఎస్‌లో అవినీతి కోణం
సాక్షి, మందమర్రి(ఆదిలాబాద్) : ఐసీడీఎస్‌లో జరిగిన అవినీతి బట్టబయలు అయింది. ఆయా చనిపోయి నాలుగు సంవత్సరాలు అయినా ఆమె బ్యాంక్ అకౌంట్లో గౌరవ వేతనం జమ చేస్తూ వచ్చారు. అయితే ఆమె స్థానంలో కొత్తగా నియామకం అయినా ఆయా వేతనం అందడం లేదని అధికారలకు ఫిర్యాదు చేయడంతో అవినీతి బయట పడింది. మందమర్రి మండలంలోని ఆదిల్పేట్ అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పని చేసే పసునూటి మల్లక్క అనారోగ్యంతో ఏప్రిల్ 2015లో మృతి చెందింది. అయితే ఈ విషయాన్ని సీడీపీవో ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులకు తెలియజేసి వేతనాన్ని నిలుపుదల చేయడంలో సూపర్వైజర్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో 2019 వరకు మృతిరాలి బ్యాంకు ఖాతాలో లక్షా 96వేల 579 రూపాయల గౌరవ వేతనం జమ అయింది. అయితే కొత్తగా ఫిబ్రవరి 2019లో సీడీపీవో ద్వారా సహాయకురాలిగా నియామకమైన మోర్ల రజిని ఇంత వరకు వేతనం రాకపోయేసరికి విషయాన్ని అధికారుల దృష్తికి తీసుకువెళ్లగా అసలు విషయం బయటకు పొక్కింది. దీనికి మందమర్రి సెక్టార్ సూపర్వైజర్ రమాదేవి బాధ్యత వహించాలని సీడీపీవో నోటీస్ ఇచ్చారు. అయితే అధికారులు ముందుగా మృతురాలి అకౌంట్ నుంచి గౌరవ వేతనాన్ని గుట్టు చప్పుడు కాకుండా వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. కొత్త ఆయా నియామకం.. ఆదిల్పేట్ అంగన్వాడీ కేంద్రం ఆయా 2015లో చనిపోగా గత సంవత్సరం మే నెలలో కొత్త ఆయా కోసం నోటిఫికేషన్ వేసి ఫిబ్రవరి 2019 మాసంలో కొత్త ఆయాగా మోర్ల రజినిని నియమించారు. రజిని ఆరు మాసాలుగా ఆయాగా విధులు నిర్వహిస్తుంది. ఆరు నెలలుగా రజినికి గౌరవ వేతనం రాకపోవడంతో ఐసీడీఎస్ కార్యాలయంలో సంప్రదించగా మృతురాలు మల్లక్క అకౌంట్లోనే గౌరవ వేతనం జమ అవుతుందన్న విషయం బయటకు వచ్చింది. ఆరు నెలలుగా ఆదిల్పేట్ అంగన్వాడీ కేంద్రంలో ఆయా పనులు చేస్తున్నానని తనకు గౌరవ వేతనం చెల్లించాలని రజిని డిమాండ్ చేసింది. సంజాయిషీ ఇవ్వాలని... ఆయాగా పని చేసిన మల్లక్క మృతి చెందిన విషయాన్ని తెలియజేయక పోవడంతోనే మృతురాలి బ్యాంక్ అకౌంట్లో గౌరవ వేతనం జమ అయిందని దానికి మందమర్రి సెక్టార్ సూపర్వైజర్ నిర్లక్ష్యమే కారణమంటూ రమాదేవికి నోటీసు పంపించారు. నోటీసులో మల్లక్క డ్యూటీ చేస్తుందని అటెండెన్సీ ఏ కారణం చేత ఇవ్వవలసి వచ్చిందో తెలపాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన తనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో రాత పూర్వకంగా సంజాయిషీ ఇవ్వాలని తదితర అంశాలను రమాదేవికి సీడీపీవో అందించిన సంజాయిషీ నోటీసులో పేర్కొన్నారు. కొట్టొచ్చినట్లు అధికారుల నిర్లక్ష్యం.. ఆయాగా పని చేసిన మల్లక్క చనిపోయిన తర్వాత ఇద్దరు సూపర్వైజర్లు మారారు. చనిపోయినప్పుడు పని చేసిన సూపర్వైజర్ వేరు. ప్రస్తుతం సూపర్వైజర్గా పని చేస్తున్న రమాదేవి ఆదిల్‌పేట్‌లోని అంగన్వాడీ ఆయా మల్లక్క చనిసోయినప్పుడు అక్కడ విధులు నిర్వహించడం లేదు. అంతే కాకుండా ఆయా చనిపోయినందుకే ఆ కేంద్రానికి ఆయా కావాలని నోటిఫికేషన్ వేయడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారానే కొత్తగా మోర్ల రజినిని ఆయాగా నియమించడం జరిగింది. కొత్తగా నోటిఫికేషన్ వేసినప్పుడైనా మల్లక్క పేరును తొలగించాల్సి ఉంది. అయినా అలా జరగలేదు. దీంతో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. కాని కింది స్థాయి అధికారులను బలి చేసి చేతులు దులుపుకుందామనే విధంగా అధికారులు వ్యవహరిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి బాధ్యులుగా ఉన్న ఉన్నతాధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
గుడ్డు గుటుక్కు!
సాక్షి, సిటీబ్యూరో: అందరికీ సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాలపై పర్యవేక్షణ కొరవడింది. ఆశయం ఘనంగా ఉన్నా అమలు మాత్రం అస్తవ్యస్తంగా తయారైంది. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది చేతివాటంతో కేంద్రాల్లో పౌష్టికాహారం పంపిణీ అంతంతగా మారింది. కోడిగుడ్లు సరఫరా కాకుండానే మాయమవుతున్నాయి. చిన్నారులు, కౌమార బాలికలు, గర్భిణులు, బాలింతలకు సమగ్ర పోషకాహారం అందించాలనే లక్ష్యం గాడి తప్పుతోంది. అంగన్వాడీ కేంద్రాల్లో మూడేళ్లలోపు బాలబాలికలు బాలామృతం, ప్రతినెలా పదహారు కోడిగుడ్ల చొప్పున పంపిణీ చేయాల్సి ఉంది. కేంద్రానికి వచ్చే వారికి పోషక పదార్థాలతో కూడిన ఆరోగ్యలక్ష్మి, బాలామృతం ఆరు సంవత్సరాల లోపు చిన్నారులకు, తక్కువ బరువున్న పిల్లలకు, గర్భిణులకు సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ (ఎస్ఎన్పీ) ఆహారాన్ని అందిస్తారు. తక్కువ బరువున్న చిన్నారులకు రూ.9, గర్భిణులకు రూ.7 చొప్పున ఖర్చు చేస్తారు. చిన్నారులకు 12– 15 గ్రాములు, గర్భిణులకు 18– 20 గ్రాముల ప్రొటీన్లు అందేందుకు రోజువారీ ఆహారంలో గుడ్డు అందించటం తప్పనిసరి. గర్భిణులకు రోజూ పోషకాహారంతోపాటు పాలు కూడా అందించాల్సి ఉంటుంది. కానీ అంగన్ వాడీ కేంద్రాల్లో అమలవుతున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలో సుమారు 35– 45 శాతం అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్లు, పాలు పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది. అడపాదడపా సంబంధిత అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనలో నిర్వాహకుల చేతివాటం బయటపడుతున్న ప్పటికీ చర్యలు మాత్రం కానరావడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భిన్నంగా హాజరు శాతం.. అంగన్వాడీ కేంద్రాల్లో హాజరు శాతం వాస్తవికతను భిన్నంగా కనిపిస్తోంది. సుమారు 63,894 చిన్నారులు నమోదై ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. చిన్నారుల హజరు శాతం సగానికిపైగా తక్కువగా ఉంటున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. గత ఏడాది అప్పటి కలెక్టర్ యోగితా రాణా ఆకస్మిక తనిఖీ చేసినప్పుడు హాజరు శాతాన్ని తీవ్రంగా పరిగణించారు. ముఖ్యంగా చిన్నారుల హాజరు శాతం పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినా ఫలితం లేకుండాపోయింది. అంగన్వాడీల సూపర్వైజర్లు, వర్కర్లు కమిటీగా ఏర్పడి బస్తీలు, కాలనీలో ప్రజలకు అవగాహన కల్పించేలా చేపట్టిన చర్యలు ముందుకు సాగలేదు. -
అంగన్వాడీ కేంద్రాల్లో బుడి‘బడి’ అడుగులు
సాక్షి, హుజూరాబాద్: అంగన్వాడీ కేంద్రాలను చిన్నారులను బుడి‘బడి’ అడుగులు వేయిస్తున్నాయి. పౌష్టికాహారం అందించడంతోపాటు ఆటపాటలతో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన సాగిస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో కొంతమేరకు విద్య నేర్చుకున్న తర్వాత తల్లిదండ్రులు చిన్నారులను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారని గుర్తించిన ప్రభుత్వం ఈ ఏడాది నుంచే ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించింది. ఎల్కేజీ, యూకేజీ తరగతుల బోధనకు కార్యాచరణ సిద్ధం చేసి నూతన విధానాన్ని అమలు చేస్తోంది. కరీంనగర్ జిల్లాలో మొత్తం 777 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 752 ప్రధాన కేంద్రాలు ఉండగా, 25 మినీ కేంద్రాలు ఉన్నాయి. ఏడు నెలల నుంచి ఏడాది వయసు లోపు విద్యార్థులు 5,416 మంది ఉన్నారు. ఏడాది నుంచి మూడేళ్లలోపు విద్యార్థులు 1,181 మంది ఉండగా, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు విద్యార్థులు 9,210 మంది ఉన్నారు. జిల్లా వివరాలు.. జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు 4 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు 752 మినీ కేంద్రాలు 25 ఏడాదిలోపు విద్యార్థులు 5,416 మూడేళ్లలోపు విద్యార్థులు 1,181 ఆరేళ్లలోపు విద్యార్థులు 9,210 ఆటపాటలతో విద్య... అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే విద్యార్థుల్లో మానసిక, శారీరక వికాసాన్ని పెంపొందించేలా బోధన జరుగుతోంది. చిన్నారులను గ్రూపులుగా విభజించి రోజూ కనీసం 2 గంటలకు తగ్గకుండా పీరియడ్లు విభజించుకుని బోధన చేస్తున్నారు. నర్సరీ పిల్లలకు ఆటపాటలు, బొమ్మలు, మూడు, నాలుగేళ్లలోపు వారికి ఎల్కేజీ, నాలుగు, ఐదేళ్లలోపు వారికి యూకేజీ పాఠాలు బోధిస్తున్నారు. ఆంగ్లంలో రూపొందించిన చార్టులు బోధనకు అనుగుణంగా తరగతి గదుల్లో ప్రదర్శిస్తున్నారు. ఆంగ్లం వర్క్ బుక్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, పుస్తకం, నేను నా పరిసరాల పేరుతో ఉన్న పుస్తకాలతో పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నారు. చిన్నారులకు బోధన ఎలా చేయాలనే దానిపై అంగన్వాడీ కార్యకర్తలకు ప్రత్యేకంగా సంసిద్ధ పేరుతో ఉన్న పుస్తకాలను అందజేయగా, ఇందులో పాఠాలు ఏ విధంగా బోధించాలో రూపొందించారు. ఆ పుస్తకాల ఆధారంగా బోధన చేస్తున్నారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతోపాటు ఆటపాటలతో కూడిన ప్రాథమిక విద్యాబోధన పేరుతో మూడు రకాల అభ్యాస దీపికలను అందించారు. వీటితో బోధన చేస్తున్నారు. కొందరు చిన్నారుల తల్లిదండ్రులు మూడు, నాలుగేళ్లు దాటగానే చిన్నారులను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఇదీ పేదవారికి భారమే అయినా పిల్లల భవిష్యత్ కోసం భరిస్తున్నామని పలువురు చిన్నారుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో ఆంగ్ల మాధ్యమంలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, బోధనకు చర్యలు చేపట్టగా, జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో విజయవంతంగా అమలవుతోంది. విద్యార్థుల సంఖ్య పెరిగింది అంగన్వాడీ కేంద్రాల్లో ఆంగ్ల బోధన చేస్తుండడంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యను కేంద్రాల్లోనే చెబుతున్నాం. తల్లిదండ్రులకు కూడా ప్రైవేట్ పాఠశాలల ఫీజు భారం కొంత మేరకు తగ్గుతుంది. ప్రభుత్వం ఎంతో సదుద్దేశంతో చేపట్టిన ఆంగ్ల విద్య విధానం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ప్రభుత్వం ఆంగ్ల విద్య బోధనకు మాకు అందజేసిన సంసిద్ధ పుస్తకంలో చెప్పినట్లు బోధన చేస్తున్నాం. – రాణి, అంగన్వాడీ టీచర్,హుజురాబాద్ ఆంగ్ల బోధన మంచి ఉద్దేశం అంగన్వాడీ కేంద్రాల్లో ఆంగ్ల బోధన అమలు చేయడం మంచి ఉద్దేశం. ఈ ఏడాది నుంచి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యాబోధన వర్క్‌బుక్స్ ద్వారా చేయడం జరుగుతుంది. విద్యార్థులకు అర్థమయ్యే విధానంలో ఆటపాటలతో కూడా విద్యా బోధన చేస్తున్నాం. ఆంగ్ల బోధన ద్వారా కేంద్రాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య పెరిగింది. తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చిన్నారులను అంగన్వాడీల్లో చేర్పించాలి. – బండి ఉష, ప్రాజెక్టు అధ్యక్షురాలు విజయవంతంగా సాగుతోంది అంగన్వాడీ కేంద్రాల్లో ఆంగ్ల విద్యాబోధన విజయవంతంగా సాగుతోంది. ప్రాథమిక స్థాయిలో విద్యా విధానంలో వస్తున్న పోటీ కారణంగా ప్రభుత్వం ప్రాథమిక స్థాయిలో చిన్నారులకు ఆంగ్ల బోధన జరగాలని సంకల్పించి, అంగన్వాడీ కేంద్రాల్లో ఆంగ్ల బోధన అమలు చేస్తోంది. చిన్నారులకు అర్థమయ్యే రీతిలో ఫ్లాష్కారŠుడ్స ద్వారా, ఆట పాటలతో కూడిన విద్యాబోధన చేస్తున్నాం. మంచి ఫలితాలు వస్తున్నాయి. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు ఆంగ్ల బోధన ఎంతగానో దోహదపడుతుంది. – శారద, ఐసీడీఎస్, సీడీపిఓ, హుజురాబాద్ -
గుడ్లు చాలవు.. పాలు అందవు
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీల్లో పౌష్టికాహార పంపిణీ గాడి తప్పుతోంది. పంపిణీలో సమస్యలను పరిష్కరించకపోవడం... పలు చోట్ల పంపిణీ దారులను ఎంపిక చేయకపోవడం... స్టాకు ఉన్నా క్షేత్రస్థాయి సిబ్బంది ఉదాశీన వైఖరితో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషక సమస్యలు తీవ్రమవుతున్నాయి.ఐదేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార సమస్యలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఆరోగ్య లక్ష్మి, పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రతీ రోజు 200 మిల్లీలీటర్ల పాలు, ఉడికించిన కోడిగుడ్డు ఇవ్వాలి. పౌష్టికాహారలోపం తీవ్రంగా ఉన్న పిల్లలు, బాలింతకు అదనంగా మరో 100 మిల్లీ లీటర్ల పాలు అందజేయాలి. వీటితో పాటు పూర్తి పోషక విలువలున్న ఆహారాన్ని సైతం వడ్డించాలి. కానీ చాలా అంగన్వాడీ కేంద్రాల్లో పాలు, గుడ్ల పంపిణీ గందరగోళంగా మారింది. పలు జిల్లాల్లో పాలు, గుడ్ల సరఫరాదారుల ఎంపిక ప్రక్రియే పూర్తి కాలేదు. కొన్ని చోట్ల సరఫరా దారులను ఎంపిక చేసినప్పటికీ సాంకేతిక కారణాలు, సరఫరాలో సమస్యలను అధిగమించకపోవడంతో అది అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 31,711 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు. వీటి పరిధిలో 5.31లక్షల మంది గర్భిణులు, పాలిచ్చే తల్లులు, 7నెలల నుంచి 3 ఏళ్ల లోపు వయసున్న వారు 10.42 లక్షల మంది, ఆరేళ్ల లోపు వయసున్న చిన్నారులు 6.54లక్షల మంది నమోదయ్యారు. వీరికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా పాలు, గుడ్లు, పౌష్టికాహారాన్ని అందివ్వాలి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధి పొందిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి. ఈ క్రమంలో అంగన్వాడీల్లో హాజరు శాతం సంతృప్తికరంగా ఉన్నప్పటికీ పాలు, గుడ్లు పొందిన వారి సంఖ్య మాత్రం తక్కువగా ఉంటోంది. సిద్దిపేట, ఆసీఫాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో హాజరు, లబ్ధి వత్యాసం అధికంగా ఉంది. ఈ వత్యాసాన్ని లోతుగా పరిశీలిస్తే అక్కడ సరుకుల పంపిణీలోని లొసుగులు బయటపడుతున్నాయి. రెండు నెలలుగా అరకొరే... అంగన్వాడీ కేంద్రాలకు గత రెండు నెలలుగా పాలు, గుడ్ల సరఫరా లోపభూయిష్టంగా ఉంది. కేంద్రాలకు హాజరవుతున్న విద్యార్థుల ఆధార్ వివరాలు అప్డేట్ కాకపోవడంతో సరఫరా కావడం లేదని కొన్నిచోట్ల నిర్వాహకులు చెబుతున్నారు. మరికొన్ని చోట్ల ఓటీపీలు రావడం లేదని, సాంకేతిక సమస్యలు తలెత్తడంతో గుడ్లు ఇవ్వలేక పోయామని కాంట్రాక్టర్లు అంటున్నారు. వాస్తవానికి ఓటీపీలు రాకపోతే సీడీపీఓలకు మరోమారు అర్జీ పెడితే సరిపోయేదని, కాంట్రాక్టర్లు తప్పించుకునే ధోరణితో ఇలా సరఫరా చేయడం లేదంటున్నారు. పలురకాల సమస్యలతో అంగన్వాడీ కేంద్రాలకు సకాలంలో సరుకులు చేరడం లేదు. ఈ అంశంపై రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం గమనార్హం. అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ ఆగమాగం కావడంతో చిన్నారులు, బాలింతల్లో పోషకాహార సమస్యలు తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. -
‘మరుగుదొడ్లో వంట.. అయితే ఏంటి’
ముంబై: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లలో వంట చేస్తున్నారనే వార్తలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఇమర్తి దేవి స్పందిస్తూ.. ‘టాయిలెట్లలో వంట చేస్తే తప్పేంటి. టాయిలేట్ సీట్‌కు, స్టవ్‌కు మధ్య విభజన ఉంటే అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం మన ఇళ్లలో అటాచ్డ్ బాత్రూంలు ఉంటున్నాయి. అంతమాత్రాన ఇంటికి వచ్చిన బంధువులు భోజనం చేయడం మానేయడం లేదు కదా. ప్రస్తుతం ఆ బాత్రూంను వినియోగించడం లేదు. దాన్ని గులకరాళ్లతో నింపేశారు. అలాంటప్పుడు పాత్రలను బాత్రూం సీట్ మీద ఉంచితే ఏం అవుతుంది. మన ఇళ్లలో కూడా పాత్రలను కిందే పెడతాం కదా’ అన్నారు. ఏది ఏమైనా ఈ విషయంలో పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని తెలిపారు ఇమర్తి దేవి. ఈ విషయంపై జిల్లా అధికారి దేవేంద్ర సుంద్రియాల్ స్పందిస్తూ.. ‘మధ్యాహ్న భోజన పథకాన్ని స్వయం సహాయక బృందానికి అప్పగించాం. వారే టాయిలెట్‌ను కిచెన్‌గా మార్చారు. ఇందుకు బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకుంటాం’ అన్నారు. -
ఉన్నారా.. లేరా?
మహబూబ్‌నగర్ రూరల్: పాలమూరు అర్బన్ ప్రాజెక్టు పరిధిలోని హన్వాడ, గండీడ్, మహబూబ్‌నగర్ పట్టణంలో గల అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్రాల పనితీరును పర్యవేక్షించేందుకు గాను ఐసీడీఎస్‌తో సంబంధం లేని వ్యక్తులను పర్యవేక్షకులుగా నియమించారు. వారునేరుగా అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి వారి పనితీరును పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా మెనూ ప్రకారం చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు భోజనం అందుతుందా.. లేదా అనే విషయాలను గురించి పరిశీలిస్తున్నారు. అంతేకాక చిన్నారుల విద్యాభ్యాసం గురించి ఆరా తీస్తున్నారు. ఇటీవల కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసిన సమయంలో హన్వాడ మండలంలోని కొనగట్టుపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఆయా చిన్నారులను కేంద్రంలోనే ఉంచి తలుపులు మూసివేసి తమ ఇళ్లకు వెళ్లి వారి సొంత పనులు చేసుకుండటం గమనించిన కలెక్టర్ ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు. అంతటితో ఆగకుండా సీడీపీఓకు మెమో జారీ చేశారు. సీక్రేట్ పర్యవేక్షకులు ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకుని జిల్లాలోని అన్ని కేంద్రాల పరిస్థితి ఎలాగుందో తెలుసుకోవడానికి కలెక్టర్ ప్రైవేట్ వ్యక్తులను పర్యవేక్షకులుగా నియమించి సమాచార సేకరణ జరుపుతున్నట్లు తెలిసింది. కేంద్రాలకు వెళ్తున్న ప్రైవేట్ పర్యవేక్షకులు అంగన్వాడీల పనితీరును పర్యవేక్షిస్తూ సమాచారం సేకరించి నేరుగా కలెక్టర్‌కు నివేదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసినప్పటినుంచి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సమయానికి కేంద్రాల్లో అందుబాటులో ఉంటున్నారు. పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అధికారులు ఎప్పుడు ఏ కేంద్రానికి వచ్చి సమాచార సేకరణ జరిపి వెళ్తారో, ఎవరి ఉద్యోగాలకు ముప్పు వాటిళ్లుతుందోనని తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాక తమ పనితీరును చట్టబెట్టుకొని ఉద్యోగాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. -
అంగన్వాడీ కార్యకర్తపై క్రిమినల్ కేసు
రాజమహేంద్రవరం : అంగన్వాడీ కార్యకర్తపై క్రిమినల్ కేసు నమోదైంది. విజిలెన్స్ జిల్లా ఎస్పీ రెడ్డి గంగాధరరావు కథనం ప్రకారం.. శంఖవరం గ్రామంలో ఈ నెల 6వ తేదీన విజిలెన్స్ అధికారులు అంగన్ వాడీ కేంద్రం నంబర్ 03ను (ఎస్సీ పేట లో ఉన్న) తనిఖీ చేసి కేంద్రంలో పిల్లలకు, గర్భిణులు, బాలింతలకు సరఫరా చేసిన సరుకులు జూలై నెలకు సంబంధించినవి ఏమీ లేకపోవడం గుర్తించారు. అంగన్ వాడీ కార్యకర్త మేడిద లక్ష్మి సరుకులను ఈ నెల 4వ తేదీన తీసుకొని పీఎఫ్ షాపులో ఉంచామని తెలిపారు. పీఎఫ్ షాపులో తనిఖీ చేసిన అధికారులు అక్కడ అంగన్ వాడీ కేంద్రానికి సంబంధించిన సరుకులు లేకపోవడం, నాలుగో తేదీన లక్ష్మి అంగన్ వాడీ కేంద్రానికి సరుకులు తీసుకువెళ్లినట్టు విచారణలో తేలడంలో ఆమె ఇంటిని తనిఖీ చేయగా 82 కోడిగుడ్లు, 25 కిలోల పీడీఎస్ బియ్యం, చోడిపిండి 22 ప్యాకెట్లు గుర్తించారు. శంఖవరం మండలం అంగన్వాడీ సూపర్ వైజర్ ఫిర్యాదు మేరకు అన్నవరం పోలీస్ స్టేషన్లో లక్ష్మిపై సెక్షన్ ఐపీసీ 406, 7 ఈసీఏ (ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన నిత్యావసర వస్తువులు దుర్వినియోగం) ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ అంగన్ వాడీ కేంద్రానికి జూలైæ నెలకు సంబంధించిన మొత్తం సరుకులు బియ్యం 130 కేజీలు, పప్పు 29 కేజీలు, ఆయిల్ ఆరు ప్యాకెట్లు, శనగలు 7.5 కేజీలు, ఉప్పు 2 ప్యాకెట్లు, ఉండాల్సి ఉండగా మేడిద లక్ష్మి ఇంటి వద్ద తక్కువగా ఉండడం గమనించారు. విచారణలో లక్ష్మి సరుకులు బయట మార్కెట్లో అమ్ముతున్నారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దీనిపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపిస్తామని విజిలెన్స్ జిల్లా ఎస్పీ రెడ్డి గంగాధరరావు తెలిపారు. -
అద్దె ఇంటిలో అంగన్వాడీ..!
సాక్షి, విజయనగరం : అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణంలో గత టీడీపీ ప్రభుత్వం అలసత్వం చూపింది. చిన్నారులు, కార్యకర్తలు, ఆయాలను కష్టాల్లోకి నెట్టింది. నాటి నిర్లక్ష్యం ఫలితంగా భవన నిర్మాణాలు ప్రారంభించి మూడేళ్లు గడిచినా సగం నిర్మాణాలు పూర్తికాలేదు. 111 భవనాలకు అసలు పునాది రాయికూడా వేయలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల భవనాలు మంజూరైనా అంగన్వాడీ కేంద్రాలను అద్దె భవనాల్లో నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. నిర్మాణాలకు దూరంగా... 2016 –17 సంవత్సరంలో 596 అంగన్వాడీ కేంద్రాలకు, 2018–19లో 349 అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు మంజూరయ్యాయి. మొత్తంగా 945 భవనాలు మంజూరుకాగా వీటిలో కేవలం 411 భవనాల పనులు మాత్రమే పూర్తయ్యాయి. 111 భవనా లకు ఇంకా పునాది రాయి కూడా వేయలేదు. అయితే, ప్రస్తుతం భవనాలు మంజూరై కూడా నిర్మాణం పూర్తికాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇరుకు గదులు, సరైన వసతులు లేనిఅద్దె భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఒక్కో భవనానికి రూ.7.50 లక్షలు.. ఒక్కో భవనానికి రూ.7.50 లక్షల నిధులు మంజూరయ్యాయి. భవన నిర్మాణం 600 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించాలి. కిచెన్, స్టోర్ రూమ్, హాల్, మరుగుదొడ్డి నిర్మించాలి. రూ.7.50 లక్షల్లో రూ.5 లక్షలు ఉపాధిహామి నిధులు, రెండు లక్షలు ఐసీడీఎస్ శాఖ, పంచాయతీ నుంచి రూ.50 వేలు మంజూరు చేస్తారు. జిల్లాలో 2,977 అంగన్వాడీ కేంద్రాలు, 745 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో వెయ్యి కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. 700 కేంద్రాలు సామాజిక భవనాల్లో నడుస్తున్నాయి. మిగిలిన కేంద్రాలు అద్దెభవనాల్లో నడుస్తున్నాయి. గ్రామీ ణ ప్రాంతాల్లో రూ.750, పట్టణ కేంద్రాల్లో రూ.3వేలు చొప్పున ప్రస్తుతం అద్దె చెల్లిస్తున్నారు. అద్దె కేంద్రాలు కూడా విశాలంగా లేకపోవడంతో పిల్లల ఆటపాటలకు ఇబ్బందిగా మారింది. -
ఎగ్ వెరీ స్మాల్..!
నల్లబెల్లి: అందరికీ సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సెం టర్లను నిర్వహిస్తున్న విషయం విధితమే. కాని ఆశయం ఘనంగా ఉన్నా అమలు మాత్రం అస్తవ్యస్తంగా ఉంది. అంగన్వాడీల్లో పౌష్టికాహారం అందని ద్రాక్షలాగే మారుతోంది. ఏదో ఒక కొర్రీ చూపెట్టి నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారనే ఆరోపణలు మెండుగా వినిపిస్తున్నాయి. బలహీనతను పోగొట్టే కోడిగుడ్ల సరఫరాలో సైతం అవినీతి జరుగుతుండడం అంగన్వాడీల పనితీరుకు నిదర్శనం. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక తక్కువ పరిమాణం కలిగిన గుడ్లు కాంట్రాక్టర్ సరఫరా చేస్తున్నాడు. అంగన్వాడీ నిర్వాహకులు చిన్నసైజు గుడ్లను తిరస్కరిస్తే గుడ్లు సరఫరా చేసేవారు తీసుకుంటారా లేదా అని వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఎవరైనా లబ్ధిదారులు ఇంత చిన్న గుడ్డా అన్ని ప్రశ్నిస్తే తీసుకుంటే తీసుకో.. లేకపోతే లేదని అంగన్వాడీ నిర్వాహకులు సమాధానమిస్తున్నట్లు సమాచారం. అధికారుల కనుసన్నల్లోనే ఈ వ్యవహరం నడుస్తుందని జిల్లా వ్యాప్తంగా పలు విమర్శలు వెల్లువెత్తున్నాయి. జిల్లాలో ఐసీడీఎస్ పరిదిలో నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల ప్రాజెక్టులో 908 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 832 మెయిన్, 76 మినీ అంగన్వాడీలు ఉన్నాయి. ప్రతి రోజు 17,338 మంది గర్భిణీలు, బాలింతలతో పాటుగా ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాల్లోపు పిల్లలు 54,296 మంది వచ్చి పౌషికాహారంతో పాటు భోజనం చేసి వెళుతున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వీరికి అందించాల్సిన గుడ్డు ఈ ప్రాజెక్టుల పరిధిలో నిర్ణీత పరిమాణానికి మించి తక్కువగా గుడ్లు సరఫరా అవుతున్నాయి. గుడ్డు మాయాజాలం గుడ్డు ఇస్తున్నారు కదా.. చిన్నదైతే నేమి అని అనుకోవచ్చు. జరిగే మాయాజలామంతా అందులోనే ఉంది. సాధారణంగా నిర్ణీత బరువు 50 గ్రాములున్న గుడ్లను పంపిణీ చేయాలి. ఫారం కోళ్లు పెట్టే గుడ్లు చాలా వరకు హెచ్చు తగ్గులుగా ఉంటాయి. వీటిని సంబంధిత కాంట్రాక్టర్ చిన్న సైజు గుడ్లను ఏరిపించి అంగన్వాడీ కేంద్రాలకు చాలా వరకు చిన్న సైజు గుడ్లను పంపిణీ చేస్తున్నారు. నిర్ణీత బరువు కలిగిన గుడ్డు ధర నెక్ రేటుకు సరాసరి ధరతో పాటు రవాణా చార్జీలు అదనంగా చెల్లిస్తారు. పరిమాణం తక్కు వల్ల దాదాపు లక్షల్లో స్వార్థపరుల జేబుల్లోకి కమిషన్ రూపంలో చేరుతోంది. దీనికి తోడు 15 రోజుల సరుకు ముందుగానే నిర్వహకులకు ఇవ్వడంతో ముందుగానే కాంట్రాక్టర్ గుడ్లు అమ్ముకుంటున్నారు. ఇలా భారీగానే అవినీతి జరుగుతోందని పలువురు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. నిర్వాహకుల తప్పే.. అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నాం. పంపిణీ విషయంలో మాకెలాంటి ఫిర్యాదులు అందలేదు. గుడ్ల విషయానికి వస్తే పరిమాణం తక్కువైనా, నలిగినా వాటిని సంబంధిత కాంట్రాక్టర్‌కు ఇచ్చేయాలని అంగన్వాడీ నిర్వాహకులకు సూచించాం. తక్కువ పరిమాణం గల గుడ్లు తీసుకొంటే తప్పు నిర్వహకులదే. ఫిర్యాదులు వస్తే సంబంధిత నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. సరస్వతి, సూపర్వైజర్, పీడీ, నల్లబెల్లి సరఫరా జరిగేలా చూస్తా.. అంగన్వాడీ కేంద్రాలకు టెండర్ నిబంధనల మేరకు గుడ్లు సరఫరా జరిగేలా చూస్తాం. త్వరలోనే అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేస్తాం. నిబంధనలకు విరుద్ధంగా చిన్న సైజు గుడ్లు సరఫరా చేసినట్లు గుర్తిస్తే సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటాం. చిన్న సైజు గుడ్ల సరఫరా జరిగితే సమస్యను అంగన్వాడీ టీచర్, లబ్ధిదారులు గుర్తించి ఐసీడీఎస్ అధికారుల దృష్టికి తీసుకరావాలి. –సబిత, పీడీ, ఐసీడీఎస్, వరంగల్ రూరల్ -
అసంపూర్తిగా అంగన్వాడీ భవనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అనేక అంగన్వాడీ కేంద్రాలు సొంత భవనాలు లేక అరకొర వసతులు, అద్దె భవనాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో కొన్ని అద్దె భవనాల్లో, మరికొన్ని ప్రాథమిక పాఠశాలల్లో, కొన్ని శాశ్వత భవనాల్లో నడుస్తున్నాయి. అయితే ఆశించిన మేర సొంత భవనాలు లేక ఐసీడీఎస్ లక్ష్యం నీరుగారుతోంది. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పరిస్థితులు మరీ దారుణంగా తయారయ్యాయి. సొంత భవనాలు, అదిరిపోయే హంగులతో చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేలా అంగన్వాడీ కేంద్రాలు ఉండాలని ఉండాలని ఆ శాఖ నిర్ణయించినప్పటికి అమలుకు నోచుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం, బడ్జెట్‌లోపం వెరసి అంగన్వాడీలు సమస్యల వలయంలో చిక్కుకుంటున్నాయి. నిధులు రావు.. పనులు కావు సిరిసిల్ల జిల్లాలో రెండు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కింద 587 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. వేములవాడ పరిధిలో 40 భవనాలు ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయా యి. వీటిని ప్రారంభించి రెండేళ్లయినా నిర్మా ణాలు పూర్తి కాలేదని పలువురు వాపోతున్నారు. సిద్దిపేట, దుబ్బాక, చేర్యాల, గజ్వేల్, హుస్నాబాద్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 1,150 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో సొంతభవనా ల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాలు 298 ఉండగా, 422 అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో 368 అంగన్వాడీ కేంద్రాలు, 430 కేంద్రాలను అద్దె లేకుండా జీపీలు, కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్నారు. అద్దె భవనాల్లో తరచూ సమస్యలు తలెత్తుతుండడంతో అంగన్వాడీలు నడపలేకపోతున్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.. అంగన్వాడీ భవన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఎంజీ నరేగా, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (ఆర్ఐడీఎఫ్), ఏపీఐపీల ద్వారా నిధులు కేటాయిస్తారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా పరిషత్ ఫండ్ నుంచి 15 శాతం, మండల పరిషత్ ఫండ్ నుంచి 15 శాతం తీర్మానాలు చేసి పరిమిత బిల్డింగ్‌లకు కేటాయిస్తుంటారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులతో రాష్ట్ర పరిధిలోని పంచాయతీరాజ్ ఏఈలు నిర్మాణ పనులు చేపడతారు. కొన్ని సందర్భాల్లో నిధులు విడుదలైనప్పటికీ అధికారుల అలసత్వం, నిధుల దుర్వినియోగంతో భవన నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించకపోవడంతో కొన్ని మధ్యలోనే ఆగిపోతున్నాయని పలువురు అధికారులు చెబుతున్నారు. కాగా, అంగన్వాడీ కేంద్రాలకు కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందని మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. -
‘అంగన్వాడీ’ల బడిబాట
ఖమ్మంమయూరిసెంటర్: చిన్నారులను బడిబాట పట్టించేందుకు అంగన్వాడీ టీచర్లు రోడ్డుబాట పట్టనున్నారు. ఐదేళ్లలోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కోరుతూ ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రుల్లో చైతన్యం కలిగించేందుకు ప్రయత్నించనున్నారు. బాలబాలికలు, ఐదేళ్లలోపు పిల్లలు అంగన్వాడీ కేంద్రాల్లో, ఐదేళ్లు దాటితే పాఠశాలల్లో ఉండాలనే నినాదంతో పట్టణాలు, గ్రామాల్లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు బడిబాట నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, స్థానిక పెద్దలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాలు నిర్వహించాలని ఉన్నతాధికారులు జిల్లాస్థాయి అధికారులను ఆదేశించారు. దీంతో 11వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి అంగన్వాడీ కేంద్రం పరిధిలో ప్రదర్శనలు నిర్వహించి.. చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల్లో చేరేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మూడేళ్లు వచ్చిన ప్రతి చిన్నారి అంగన్వాడీ కేంద్రంలో చేరాల్సిన ఆవశ్యకత, అవసరాన్ని స్థానికులకు వివరించేలా అంగన్వాడీ టీచర్లను సన్నద్ధం చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలు, పోషక పదార్థాల వివరాలు బడిబాటలో ప్రతి ఒక్కరికి వివరించనున్నారు. మంచి విద్యను అందించేందుకు.. అంగన్వాడీ కేంద్రాల్లో మూడేళ్లు నిండిన పిల్లలను చేర్చేందుకు బడిబాట కార్యక్రమం నిర్వహించాల ని ఇప్పటికే నిర్ణయించారు. గతంలో అంగన్వాడీ కేంద్రాలను ప్రీ–స్కూల్ కార్యక్రమంగా భావించేవారు. పాఠశాలకు వెళ్లడం చిన్నారులకు అలవాటు చేసేందుకు ఉపయోగపడగా.. మరోవైపు చిన్నారులకు పౌష్టికాహారం అందించి.. వారితో ఆటలు ఆడించి.. పాఠశాల అంటే భయం పోగొట్టేందుకు పనిచేసేవారు. అయితే ఈ విద్యాసంవత్సరం నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మార్పులు తెచ్చారు. కేవలం పౌష్టికాహారం అందించడం.. ఆట పాటలతో గడపడమే కాకుండా.. వారికి విజ్ఞానాన్ని అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. చిన్నారులకు వర్క్‌బుక్‌లను అందించి.. వారితో హోమ్ వర్క్ చేయించాలని నిర్ణయించారు. జిల్లాలో 7 ప్రాజెక్టుల కింద మొత్తం 1,896 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 1,605 మెయిన్ కేంద్రాలు కాగా.. 291 ఉప కేంద్రాలున్నాయి. వీటిలో చిన్నారులను చేర్పించేందుకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కార్యక్రమాలు ఇలా.. బడిబాట సందర్భంగా ఏ రోజు.. ఏ కార్యక్రమం చేపట్టాలో అధికారుల నుంచి వివరాలు వచ్చా యి. ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నారు. బుధవా రం గ్రామాల్లో ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఇందు లో అంగన్వాడీ టీచర్లతోపాటు ఆయాలు, స్వ యం సహాయక సంఘాలు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, యువత, స్వచ్ఛంద సంస్థలు పాల్గొనాల్సి ఉంటుంది. అలాగే బడి మానేసిన ఆడపిల్లలను కూడా తిరిగి బడిలో చేర్పించేందుకు వీరు కృషి చేయాల్సి ఉంటుంది. ఇక ఈనెల 7, 8 తేదీల్లో ఇంటింటికీ తిరిగి రెండున్నరేళ్ల పిల్లలను గుర్తించాల్సి ఉంటుంది. చిన్నారుల తల్లిదండ్రులకు అంగన్వాడీ కేంద్రాల్లో అడ్మిషన్ల గురించి.. ప్రీ–స్కూల్ సిలబస్ గురించి, అక్కడ ఉండే టైమ్ టేబుల్, వర్క్ బుక్స్, పిల్లలకు ఇచ్చే యాక్టివిటీ బుక్స్, ప్రీ–స్కూల్ కిట్ మెటీరియల్ గురించి వివరిస్తారు. ఇక 10వ తేదీన అంగన్వాడీలో చేరిన పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యను అందించాల్సిన ఆవశ్యకతపై తల్లిదండ్రులకు వివరిస్తారు. ప్రత్యేక కార్యక్రమాలను అంగన్వాడీ కేంద్రాల్లో ఏర్పాటు చేసి పిల్లల తల్లిదండ్రులు, వారి బంధువులను ఆహ్వానిస్తారు. గ్రామ పెద్దలను ముఖ్యఅతిథులుగా ఆహ్వానించి.. అంగన్వాడీ కేంద్రాల్లో తమ పిల్లలను ఎందుకు చేర్పించాలో వివరించేలా ఏర్పాట్లు చేస్తారు. ప్రీ–స్కూల్ మెటీరియల్‌ను బహిరంగంగా ప్రదర్శనలో ఉంచుతారు. ఆరోగ్యవంతులుగా ఉన్న పిల్లలను గుర్తించి.. తల్లిదండ్రులకు బహుమతులు అందించనున్నారు. ఇక 11వ తేదీన స్వచ్ఛ అంగన్వాడీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని శుభ్రపరచడం, ఆవరణను శుభ్రం చేసి అనవసరంగా ఉన్న సామగ్రిని తొలగిస్తారు. ఆవరణలో మొక్కలు నాటుతారు. మంచినీటి సదుపాయం కల్పించడంతోపాటు టాయిలెట్లు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటారు. దీంతో అంగన్వాడీ బడిబాట కార్యక్రమం ముగిసినట్లవుతుంది. ప్రతి వాడలో అంగన్వాడీ బడిబాట.. జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు, ప్రతి వీధిలో, వాడలో అంగన్వాడీ బడిబాట నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. బుధవారం నుంచి ఈనెల 11వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాల పరిధిలో వివిధ రకాల కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజలు, గ్రామ పెద్దలు, పిల్లల తల్లిదండ్రులను పాల్గొనేలా చేసి.. వారికి ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా అందిస్తున్న సంక్షేమ ఫలాలను వివరించి, వాటిపై అవగాహన కల్పిస్తాం. అంగన్వాడీల్లో ఐదేళ్ల వయసులోపు పిల్లలు ఎందుకు చేరాలనే ఆవశ్యకతను బాడిబాటలో వివరించనున్నాం. – ఆర్.వరలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ -
అంగన్వాడీ పిలుస్తోంది
కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసి చిన్నారులు, గర్భిణులు, బా లింతలకు సంపూర్ణ ఆరోగ్యం అందించేందుకు స్త్రీ శిశు సంక్షేమశాఖ ప్రత్యేక ప్రణాళికలను రూపొం దిస్తోంది. ఇప్పటికే పౌష్టికాహారంతోపాటు నూతన భవనాలు, చిన్నారులు కూర్చొనేందుకు కుర్చీలు, అలాగే కేంద్రాలలో కూరగాయలు పండించేందుకు తోటలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ప్రైవేటు పాఠశాలలకు దీటుగా పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు అంగన్వాడీ కేంద్రాలకు కొత్తరూపు తీసుకు వస్తోంది. ప్రతి కేంద్రంలో చిన్నారుల సంఖ్యను పెంచేందుకు అంగన్వాడీ పిలుస్తోంది అనే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈనెల 1 నుంచి 15 రోజులపాటు ప్రతి కేంద్రంలో చిన్నారులను చేర్పించే ప్రక్రియను చేపడుతోంది. కార్యక్రమాల నిర్వహణ ఇలా.. ∙స్త్రీ శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మన అంగన్వాడీ పిలుస్తోంది అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో రోజుకో కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రభుత్వ సెలవు దినాలు మినహాయించి మిగిలిన అన్ని రోజుల్లో ప్రత్యేక కార్యక్రమాలు కేంద్రాల్లో జరుగుతాయి. తొలిరోజు ఆయా గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో మూడేళ్ల నుంచి ఐదేళ్ల వయస్సు కలిగిన చిన్నారులు ఎంతమంది ఉన్నారు? వారు ఏదైనా ప్రైవేటు పాఠశాలకు వెళుతున్నారా? అనే దానిపై కార్యకర్తలు సర్వే చేశారు. రెండో రోజు ఆదివారం కావడంతో సెలవు దినం. ≈ మూడవ రోజు ప్రతి అంగన్వాడీ కేంద్రం పరిధిలో ర్యాలీలు చేపట్టి అవగాహన కార్యక్రమం చేపట్టాలి. అందులో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, స్వయం సహాయక బృందాలు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, యువజన సమాఖ్యలు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొని తల్లిదండ్రులను చైతన్య పరచాలి. ≈ నాల్గవరోజు అంగన్వాడీ దినోత్సవ కార్యక్రమం చేపట్టాలి. అందులో అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు లభించే పూర్వ, ప్రాథమిక విద్య కార్యక్రమాలు చేపట్టడం, చిన్నారులకు మంచి అలవాట్లు నేర్పడం తదితర కార్యక్రమాలు చేయాలి. ≈ ఆరవరోజు ప్రైవేటు పాఠశాలలు, కాన్వెంట్లకు పంపించే తల్లిదండ్రుల కుటుంబాల ఇళ్లకు వెళ్లి అంగన్వాడీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులను తీసుకెళ్లి వారికి సంపూర్ణ అవగాహన కల్పించేలా చూడాలి. ≈ ఏడవరోజు వివిధ ప్రభుత్వ పథకాలలో మంజూరైన నూతన అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించాలి. ≈ పదవరోజు అంగ్వాడీ కేంద్రాలలో లభించే పూర్వ ప్రాథమిక వస్తువుల ప్రదర్శనతోపాటు తక్కువ ఖర్చుతో లభించే టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్‌ను తయారు చేయాలి. ≈ పదకొండవరోజు అంగన్వాడీ కేంద్రాలకు వస్తూ ఐదేళ్లు పూర్తి చేసుకున్న చిన్నారులకు బహుమతులు ఇవ్వడం, గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ల మాదిరిగా పత్రాలు ఇవ్వాలి. ఇందులో స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు చిన్నారుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పాల్గొనేలా చేసి పంచాయతీ, మండల స్థాయిలో వారికి జ్ఞాపికలు అందించాలి. ≈ పన్నెండవ రోజు ఫుడ్‌ఫెస్టివల్ నిర్వహించాలి. తక్కువ ధరలతో లభించే పౌష్టికాహారం తయారు చేసి చిన్నారులు చూసేలా ప్రదర్శన నిర్వహించాలి. చిరు ధాన్యాల ప్రయోజనాలను వివరించాలి. ≈ పదమూడవ రోజు మూడేళ్ల నుంచి ఐదేళ్ల వయస్సుగల చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించాలి. ≈ పద్నాలుగవ రోజు ఐదేళ్లు నిండిన చిన్నారులను పాఠశాలలో చేర్పించే కార్యక్రమాలు చేపట్టాలి. ≈ పదహేనవ రోజు గ్రామ పంచాయతీల వారీగా మూడేళ్ల వయస్సున్న చిన్నారులకు అక్షరాభ్యాసం చేపట్టాలి. బలోపేతానికి సహకరించాలి జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నాం. ఈనెల 1 నుంచి 15వ తేదీ వరకు ప్రతిరోజు నిర్దేశించిన కార్యక్రమాలు చేపట్టి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ సంఖ్యలో చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల్లో చేరేలా చర్యలు చేపడుతున్నాం. అలాగే అంగన్వాడీ కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్యతోపాటు పౌష్టికాహారం కూడా అందిస్తున్నాం. ప్రైవేటు పాఠశాలల కంటే దీటుగా అంగన్వాడీ కేంద్రాలలో వసతులు కూడా కల్పిస్తున్నాం. తల్లిదండ్రులు ఆలోచించి చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు పంపేలా చూడాలి. – పద్మజ, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్, కడప అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులు -
అంగన్వాడీల్లో ప్రీ స్కూల్స్ బోధన జాడేదీ?
అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్స్‌గా మారుస్తామన్న గత తెలుగుదేశం ప్రభుత్వం మాటలు నీటిమూటలయ్యాయి. కార్పొరెట్ స్కూల్స్‌కు ధీటుగా తీర్చి దిద్దుతామని చిన్నారులకు చిన్ననాటి నుంచే ఇంగ్లిష్ బోధన అలావాటు చేస్తామని టీవీ, ప్రొజెక్టర్ ద్వారా విద్యా బోధన అందిస్తామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు ఎర్పాటు చేస్తామని మాజీ మంత్రి నారాయణ చెప్పిన మాటలకు అక్షరాల నాలుగు సంవత్సరాలు. అవి ఇప్పటికీ ఆతీగతీ లేదు. ప్రీ స్కూల్స్ బోధన దేవుడెరుగు.అంగన్వాడీ సెంటర్లలో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించటంలో గత ప్రభుత్వంఅలసత్వం వహించింది. ఒంగోలు వన్‌టౌన్: జిల్లా వ్యాప్తంగా సగనికి పైగా అంగన్వాడీ కేంద్రాలు ఆధ్వానంగా ఉన్నాయి. గత పాలకులు అంగన్వాడీ సెంటర్లను నిర్లక్ష్యం చేశారు. గొప్పలకు పోయి పబ్లిసిటీ చేసుకోటానికి కొన్ని సెంటర్లకు రంగులు వేయించారు. అంగన్వాడీ సెంటర్లను ఆదర్శంగా తీర్చిదిద్దుతామాని ప్రగల్భాలు పలికారు. ప్రభుత్వ ఉద్యోగులను ఎన్ని విధాల వాడుకోవాలో టీడీపీ పాలకులకు తేలిసిన విధంగా ప్రపంచంలో ఎవరికీ తెలియదంటే అతిశయోక్తి కాదేమో. ప్రభుత్వ పథకాలు ప్రచారం చేయటమే కాదు పల్స్ సర్వే, పల్స్ పోలియో జనాభా లెక్కలు, ఇలా ఒకటేమిటి ప్రభుత్వం చేసే ప్రతి పనికీ ఉద్యోగులతో పాటు అంగన్వాడీ కార్యకర్తలు ముఖ్య పాత్ర పోషిస్తుంటారు. అంగన్వాడీ కార్యకర్తలు సెంటర్లలో కంటే ఎక్కువ రోజులు ప్రభుత్వ పథకాల ప్రచారంతోనే బయట గడుపుతారు. సగనికిపైగా అంగన్వాడీ కేంద్రాల్లో టీవీ, ప్రొజెక్టర్ నిరుపయోగంగా ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ఇంగ్లిష్ మీడియం బుక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవి కేంద్రాల్లో నిరుపయోగంగా పడి ఉన్నాయి. ప్రీ స్కూల్స్ జిల్లా కోఆర్డినేటర్‌గా గత ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం ఒక అధికారిని కుడా నియమించింది. అయినా అంగన్వాడీ కేంద్రాల్లో ఎటువంటి మార్పు రాలేదు. పర్యవేక్షణ లోపంతో పాటు అంగన్వాడీ కార్యకర్తలకు సక్రమంగా దిశా నిర్దేశం చేయటంలో కోఆర్డినేటర్ పూర్తిగా విఫలమయ్యారని చెప్పాలి. జిల్లా వ్యాప్తంగా 534 అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్స్‌గా గత ప్రభుత్వం ఎన్నుకోవడం జరిగింది. సుమారు 50 వేల మంది చిన్నారులు ప్రీ స్కూల్స్ సెంటర్లలో ఉన్నారు. గడిచిన ఎడాది నుంచి అంగన్వాడీ కార్యకర్తలకు సార్వత్రిక ఎన్నికల హడావిడిలో గడిపారు. గత ఏడాది చిన్నారులకు విద్య కుడా సక్రమంగా చేప్పలేని పరిస్థితి. ఈ వేసవిలో అంగన్వాడీ కార్యకర్తలకు మే 15 నుంచి 31 వరకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. జూన్ 1 నుంచి చిన్నారులకు కొత్త విద్యా సంవత్సరం బోధన ప్రారంభం కాబోతుంది. కోంత మంది అధికారులు కేంద్రాల్లో చిన్నారులకు విద్యతో పాటు పౌష్టికాహారం సక్రమంగా అందుతుందో లేదో పర్యేవేక్షించాల్సింది పోయి. మిగతా వాటిపై ఎక్కువ దృష్టి సాధిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో పక్క కార్యకర్తలకు సక్రమంగా జీతలను కుడా అందడంలేదని గత ప్రభుత్వాలు. మూడు నెలలకు ఒకసారి నాల్గు నెలలకు ఒక సారి ఇచ్చే జీతాలను కాకుండా సేంటర్లకు కనీసం అద్దెలు కుడా సక్రమంగా అందించలేని పరిస్థితి నెలకొని ఉందని కార్యకర్తలు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు నిద్రమత్తు వదిలి చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలి తల్లిదండ్రులు కోరుతున్నారు. -
అంగన్‌వాడీలఅవస్థలు
చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించే అంగన్వాడీ కార్యకర్తల పరిస్థితి దయనీయంగా ఉంది. గత పాలకులు చిన్నచూపు చూశారు. కేంద్రాల నిర్వహణకు సంబంధించిన బకాయిలు చెల్లించకుండా మోసం చేసింది. ప్రయివేటు భవనాలకు సైతం అద్దెలు చెల్లించకుండా మోసం చేసింది. ఫలితంగా జిల్లాలోని 3,774 అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ భారంగా మారింది. కార్యకర్తలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు.. ఉదయగిరి: జిల్లాలో అంగన్వాడీల కేంద్రాల నిర్వహణ కార్యకర్తలకు తలకుమించిన భారంగా మారింది. అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజన నిర్వహణకు సంబంధించి కూరగాయలు, పోపు సామగ్రిని అంగన్వాడీ కార్యకర్తలే సమకూర్చుకోవాల్సి ఉంది. దీంతో వారు అప్పోసొప్పో తెచ్చి నిర్వహిస్తున్నా సకాలంలో బిల్లులు అందలేదు. దీంతో వారిపై ఆర్థిక భారం పడింది. మూడేళ్లనుంచి కూరగాయలు బిల్లులు, పోపు సామగ్రికి నగదు ఇవ్వవ్వాల్సి ఉన్నా అధికారులు మాత్రం సరైన సమాధానం చెప్పడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు. పేరుకుపోయిన బిల్లులు జిల్లా పరిధిలో 17 అంగన్వాడీ ప్రాజెక్ట్‌లు ఉండగా అందులో 3,774 కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో 2.13 లక్షలమంది చిన్నారులు మరో 41 వేల మంది గర్భిణులు, బాలింతలున్నారు. జిల్లాలో 2,700 కేంద్రాలకు పైగా కూరగాయాలు, పోపు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఒక్కో కేంద్రానికి రూ.10 వేలకు పైగా బకాయిలు రావాల్సి ఉంది. ఈ విధంగా దాదాపు రూ.2.70 కోట్ల కూరగాయాలు, పోపు సామగ్రి బిల్లులు చెల్లించాల్సి ఉంది. కొన్ని కేంద్రాల్లో సీడీపీఓలు, సూపర్వైజర్లు కలిసి ఈ బిల్లులు స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి. ఇంతవరకు దీనిపై స్పష్టత రాలేదు. అద్దెలు చెల్లింపులోనూ జాప్యం జిల్లాలోని చాలా అంగన్వాడీలు ఇప్పటికీ అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లో ఒక్కో అంగన్వాడీ కేంద్రానికి రూ.3 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.750 చెల్లించాల్సి ఉంది. దీనికి సంబంధించిన బకాయిలు సుమారు రూ.80 లక్షల వరకు ఇవ్వాల్సి ఉంది. సుమారు 18 నెలలుగా ఇంటి అద్దెలు చెల్లించకపోవడంతో భవనాలు ఖాళీచేయాలని యజమానులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కేంద్రాల నిర్వహణే సమస్యగా మారిందని పలువురు అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణను ఆన్లైన్ చేసేందుకు ఒక్కో కేంద్రానికి నెలకు రూ.300–400 వరకు ఖర్చవుతోంది. ఈ వ్యయాన్ని కూడా కార్యకర్తలే భరించాల్సివస్తోంది. సూపర్వైజర్లు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీలు జరిపినప్పుడు, సీడీపీఓలు తనిఖీలకు వచ్చినప్పుడు రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదంటూ కార్యకర్తలను బెదిరించి కొంత మొత్తం లాగుతున్నారు. అదేవిధంగా నెలనెలా ఇవ్వాల్సిన గ్యాస్ బిల్లులు కూడా కార్యకర్తలకు సక్రమంగా ఇవ్వడం లేదు. మొత్తమ్మీద జిల్లాలో సుమారు రూ.3.5 కోట్ల బకాయిలు నిలిచాయి. గత ప్రభుత్వం ఈ బకాయిలు ఇవ్వాల్సిన ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడంతో ఆ భారం కొత్త ప్రభుత్వంపై పడింది. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో ఈ బకాయిలు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. టీడీపీ ప్రభుత్వం మోసం చేసింది టీడీపీ ప్రభుత్వంలో అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి కూరగాయాలు, పోపు సామగ్రి, అద్దె బకాయి, గ్యాస్ బిల్లులు నెలల తరబడి రావాల్సి ఉంది. సుమారు రూ.3.5 కోట్లు పైగా బకాయిలు ఇవ్వాల్సి ఉన్నా జాప్యం చేస్తూ వచ్చింది. టీడీపీ ప్రభుత్వం దిగిపోయేంతవరకు బిల్లులు ఇవ్వకుండా అంగన్వాడీలను మోసం చేశారు. దీంతో కార్యకర్తలు తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు. –మహాలక్ష్మి, అంగన్వాడీ యూనియన్ నాయకురాలు నిధులు ఇస్తే ఖాతాల్లో వేస్తాం ప్రాజెక్ట్‌లో కొన్ని నెలలకు సంబంధించి కొన్ని బిల్లులు పెండింగ్‌లో ఉన్నమాట వాస్తవమే. ప్రభుత్వం నిధులు ఇచ్చిన వెంటనే కార్యకర్తలకు వారి ఖాతాల్లో వేస్తాం. ఎంత సమయం పడుతుందో కచ్చితంగా చెప్పలేం.– ఈస్టర్‌రాణి, సీడీపీఓ, ఉదయగిరి -
విడ్డూరం కాక ఇంకేంటి?
ప్రకాశం ,కందుకూరు రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు వేసవి సెలవులు ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రాలకు మాత్రం సెలవులు ప్రకటించ లేదు. ఆరేళ్ల పైబడిన వారు పాఠశాలలకు వెళ్తుంటారు. అంగన్వాడీ కేంద్రాల్లో మాత్రం ఆరేళ్లలోపు చిన్నారులు మాత్రమే ఉంటారు. వీరికి ఆటపాటలతో కూడిన విద్యను అందించాలి. పాఠశాలలకు వేసవి సెలవులు ఉన్నాయి గానీ అంగన్వాడీ చిన్నారులకు మాత్రం సెలవులు లేవు. దీనిపై ఐసీడీఎస్ అధికారుల వద్ద క్లారిటీ కూడా లేదు. ప్రస్తుతం కాస్తున్న తీవ్ర ఎండలకు చిన్నారులను కేంద్రాలకు పంపించేందుకు తల్లిదండ్రులు నిరాకరిస్తున్నారు. అయినా కేంద్రాల్లో తప్పకుండా పిల్లలు ఉండాలని ఐసీడీఎస్ అధికారులు కార్యకర్తలపై ఒత్తిడి చేస్తుండటంతో ఇటు తల్లిదండ్రులను ఒప్పించలేక అటు అధికారులకు చెప్పుకోలేక పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండల్లో ఇళ్ల చుట్టూ తిరిగి పిల్లలను తీసుకొచ్చేందుకు నానా అవస్థలు పడుతున్నారు. అంతా గందరగోళం జిల్లాలో 25 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా వీటి కింద 2951 ప్రధాన, మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో పని చేసే కార్యకర్త, ఆయాలకు మాత్రం మే నెలలో సెలవులు ప్రకటించారు. అవి కూడా మే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆయాకు సెలవులు, 16 నుంచి 31వ తేదీ వరకు కార్యకర్తలకు సెలవులు ప్రకటించారు. కార్యకర్తల డ్యూటీలో ఉన్నప్పుడు చిన్నారులను కార్యకర్తలే ఇళ్లకు వెళ్లి కేంద్రాలకు తీసుకురావాలి. ఆయాలు డ్యూటీలో ఉన్నప్పుడు ఆయాలే పిల్లలను తీసురావాలి. పిల్లలను కేంద్రాలకు తీసుకొచ్చి మధ్యాహ్న భోజనం తయారు చేసి చిన్నారులకు పెట్టాలి. తీవ్ర వడగాడ్పులు, మండుటెండల్లో చిన్నారులను తీసుకొచ్చి భోజనం తయారు చేసి పెట్టాల్సి ఉండగా కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంగన్వాడీ కేంద్రాలు ఎక్కువ శాతం ఇరుకు గదులు కావడంతో ఉక్కపోతకు అల్లాడిపోతున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు మే నెలలో చేరి పదిహేను రోజులు చొప్పున సెలవులు ప్రకటించారు. కానీ చిన్నారులకు మాత్రం సెలవులు ప్రకటించలేదు. ఎండలకు చిన్నారులను బయటకు పంపించొద్దని ఒక పక్క ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. 9 గంటలకు అంగన్వాడీ కేంద్రాలకు చిన్నారులను తీసుకొచ్చి 11 గంటల సమయంలో తిరిగి పిల్లలను ఇళ్లకు పంపించాలంటే ఇబ్బందిగా ఉంది. కార్యకర్తలు, ఆయాలు కొందరు పెద్ద వారు కూడా ఉన్నారు. వారూ ఎండలకు బయటకు రావాలంటే పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. పిల్లలకు సెలవులు ప్రకటించక పోవడంపై తల్లిదండ్రుల నుంచి కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. ఐసీడీఎస్ అధికారులు మాత్రం తప్పకుండా కేంద్రాలను నడిపించాలని తీవ్ర ఒత్తిడి చేస్తుండడంతో చేసేది ఏమీ లేక కార్యకర్తలు తల్లిదండ్రులను బతిమాలి.. బామాలి పిల్లలను కేంద్రాలకు తీసుకొస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి కార్యకర్తలు, ఆయాలతో పాటు చిన్నారులకు పూర్తిగా వేసవి సెలవులు ప్రకటించాల్సిన అవసరం ఉంది. -
అంగన్వాడీ సెంటర్లకు కాలిపోయిన కోడిగుడ్ల సరఫరా?
గుంటూరు, మాచర్ల: పట్టణంలోని అంగన్వాడీ సెంటర్లకు గుడ్లను సరఫరా చేసే నిల్వ కేంద్రం ఆదివారం దగ్ధమైంది. మంటల్లో అధికశాతం గుడ్లు దగ్ధమయ్యాయి. అధికార పార్టీకి చెందిన ఓ కాంట్రాక్టర్ మాచర్ల ఐసీడీఎస్ పరిధిలోని అన్ని అంగన్వాడీ సెంటర్లకు గుడ్లను సరఫరా చేస్తారు. అయితే ఆ తరువాత ఇదే కాంట్రాక్టర్ చాలా కేంద్రాలకు బార్కోడ్ ప్రకారం గుడ్లను మూడు రోజులుగా హడావుడిగా సరఫరా చేశారు. అందులో చాలా సెంటర్లకు ఈ దగ్ధమైన కేంద్రంలో పాక్షికంగా దెబ్బతిన్న గుడ్లను బాగున్న కేసులతో కలిపి సరఫరా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయా అంగన్వాడీ సెంటర్ల వారు గుడ్లను తీసుకోవడానికి నిరాకరించడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. మాచర్ల, వెల్దుర్తి మండలాలలోని కేంద్రాలకు ఈ గుడ్లు సరఫరా అయినట్లు తెలుస్తోంది. స్థానిక ప్రాజెక్టు అధికారి కూడా ఈ విషయం పై స్పందించలేదని సమాచారం. ఈ గుడ్లు నిల్వ కేంద్రం దగ్ధమైనప్పుడు కరెంట్ సరఫరా లేదని తెలుస్తోంది. అటువంటప్పుడు ఏ విధంగా అగ్ని ప్రమాదం జరిగిందనే దానిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. జిల్లా అధికారుల తనిఖీ మొత్తంగా ఈ వివాదం జిల్లా అధికారులకు చేరింది. వారు స్పందించి బుధవారం జిల్లా కేంద్రం నుంచి ఐసీడీఎస్ అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి మేరి భారతిని విచారణ నిమిత్తం పంపారు. ఆమె వచ్చి మొదటగా గుంటూరు రోడ్డులోని కోడిగుడ్ల నిల్వ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఇందులో ఉన్న గుడ్లన్నీ బాగానే ఉన్నా.. పక్కనే మరో రూంలో దగ్ధమైన వాటిలో కొన్నింటిని వేరు చేసి నిల్వ ఉంచినట్లు తెలిసింది. ఈ రూంను మాత్రం ఆమెకు చూపించలేదు. దాన్ని కూడా తనిఖీ చేసి ఉంటే దగ్ధమైన గుడ్లు నిల్వ విషయం వెల్లడయ్యేది. దీనిపై మళ్లీ సమాచారం అదుకున్న జిల్లా అధికారి వెనక్కి తిరిగి వచ్చి సదరు కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసినట్లు తెలిసింది. తాళాలు తమ వద్ద లేదని చెప్పి తప్పించుకోగా, అధికారులు వారి కోసం కొంత సేపు వేచి చూసి వెళ్లి పోయారు. తూతూమంత్రంగా విచారణ కాకుండా అన్నికోణాల్లో విచారించినప్పుడే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పలువురు తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు కూడా విషయాన్ని సీరియస్‌గా తీసుకుని అన్ని కోణాల్లో విచారించినప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పలువురు అంగన్వాడీ కార్యకర్తలు కోరుతున్నారు. -
మాకు సెలవులు లేవా?
మండుటెండలో చిన్నారులతో కలిసి తల్లిదండ్రులు, పెద్దలు నడు స్తుంటే తాము ఎండ వేడిమిని భరించి అయినా సరే.. చిన్నారులకు నీడనిచ్చి తాము ఎండలోఅడుగులేస్తారు. కానీ ప్రస్తుతప్రభుత్వం ప్రతి ఏడాది పాఠశాలలకు సెలవులిచ్చి చిన్నారులుఉండే అంగన్వాడీ కేంద్రాలకుమాత్రం ససేమిరా అంటుండడంతో ఐదేళ్లలోపు వయసున్న పిల్లలుఅవస్థలు పడుతున్నారు. కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో చదివే పిల్లలకు ఈ ఏడాది కూడా వేసవి సెగ తప్పేట్టు లేదు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 50 రోజులపాటు వేసవి సెలవులను ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం ఈనెల 23వ తేదీ ముగియడంతో 24వ తేదీ నుంచి పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించారు. అయితే అంగన్వాడీ కేంద్రాలను మండుటెండలో సైతం నిర్వహిస్తుండడంతో చిన్నారులకు వేసవి సెగ తప్పదని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 3621 అంగన్వాడీ కేంద్రాల్లో ఆరేళ్లలోపు వయసున్న 2.30 లక్షల మంది చిన్నారులు ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు. వర్తించని వేసవి సెలవులు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పోలిస్తే అంగన్వాడీ కేంద్రంలో పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న చిన్నారులంతా ఏడాది నుంచి ఐదేళ్లలోపు వయసున్న వారే. అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించకుండా వేళల కుదింపుతో సరిపెట్టడం చిన్నారులకు అగ్ని పరీక్షగా మారిందని చిన్నారుల తల్లిదండ్రులు వాపోతున్నారు. వసతుల లేమి, అద్దె భవనాలు, మండుటెండలు చిన్నారులకు శాపంగా మారాయి. జిల్లాలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో సగానికి పైగా కేంద్రాలకు సొంత భవనాలు లేవు. అరకొరగా ఉన్న ప్రభుత్వ భవనాల్లో వసతులు లేవు. వర్షాభావ పరిస్థితుల కారణంగా గత ఏడాది డిసెంబరు నుంచి ఎండలు అధికమయ్యాయి. అంగన్వాడీ కేంద్రాలలో ఫ్యాన్లు కూడా లేవు. అద్దె భవనాలకు తగినంత బాడుగ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో గ్రామాలలో వసతులు లేని ఇరుకైన ఇళ్లల్లో కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాలలో ఫ్యాన్లు అటుంచితే గాలి, వెలుతురు లేక చిన్నారుల కష్టాలు వర్ణణాతీతం. జిల్లాలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఉదయం నుంచే భానుడి విశ్వరూపానికి చిన్నారులు విలవిల్లాడిపోతున్నారు. చిన్నారులతో చెలగాటం అంగన్వాడీ కేంద్రాలను ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాల్సి ఉంది. అయితే వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పనివేళలను కుదించింది. ఈ ఏడాది మార్చి 18వ తేది నుంచి ఉదయం 8 నుంచి 11 గంటల వరకు కేంద్రాలను నిర్వహిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 50 రోజుల వేసవి సెలవులు ఉండగా, ఐదేళ్లలోపు చిన్నారులు అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లాల్సి ఉండడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు వర్తింపజేయాలని కోరుతున్నారు. వేసవి సెలవులు ఇవ్వాలి ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలతోపాటు అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు వర్తింపజేయాలి. ఐదేళ్లలోపు చిన్నారులు వేసవిలో అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లాలంటే ఎండ తీవ్రతతో అల్లాడుతున్నారు. అధికారులు చర్యలు చేపట్టి పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న చిన్నారులకు వేసవి సెలవులు ఇవ్వాలి. – లక్ష్మిదేవి, జిల్లా కార్యదర్శి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్