సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అర్బన్ ప్రాంతాల్లో ఉన్న అంగనవాడీ కేంద్రాలను విలీనం చేసి ఒక యూనిట్‌గా ఏర్పాటు చేస్తున్నట్టు మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత వెల్లడించారు. మంగళవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విశాఖలో 20 సెంటర్లను ఒక యూనిట్‌గా, శ్రీకాకుళంలో 7 సెంటర్లను ఒక యూనిట్‌గా, కడపలో 10 సెంటర్లను ఒక యూనిట్‌గా ఏర్పాటు చేసి అందులో చిన్నారులకు కిండర్ గార్డెన్ విద్యను అందిస్తున్నామని వివరించారు. యూనిట్లను ఏర్పాటు చేసిన తర్వాత పిల్లల సంఖ్య 18,041కు పెరిగిందని పేర్కొన్నారు. నర్సరీ విద్యను బోధించేందుకు అంగన్‌వాడీ సిబ్బందికి ప్రీ స్కూల్ ట్రైనింగ్ ఇచ్చామని తెలిపారు. అంగన్‌వాడీ సెంటర్లలో గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం తీసుకునేందుకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే.. వాటిని కూడా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment