అవి ఫోర్టిఫైడ్‌ రైస్‌ బాబూ...!  | First Chandrababu Should Know About Fortified Rice | Sakshi
Sakshi News home page

అవి ఫోర్టిఫైడ్‌ రైస్‌ బాబూ...! 

Published Thu, Apr 16 2020 11:47 AM | Last Updated on Thu, Apr 16 2020 11:47 AM

First Chandrababu Should Know About Fortified Rice - Sakshi

సాక్షి, బొబ్బిలి: అంగన్వాడీ పిల్లలు, మధ్యాహ్న భోజన విద్యార్థులకోసం ఇంటింటికీ అందజేస్తున్న బియ్యంలో ఫోర్టిఫైడ్‌రైస్‌ను చూసి ప్లాస్టిక్‌ బియ్యం అందజేస్తున్నారంటూ దుష్ప్రచారానికి దిగి వాస్తవాన్ని అధికారులు చెప్పగా కంగుతిన్న తెలుగుతమ్ముళ్ల ఉదంతమిది. ప్రతి చిన్న అవకాశాన్నీ ప్రభుత్వంపై బురద జల్లడానికి చేసే ప్రయత్నానికిది ఓ చక్కని ఉదాహరణ. ప్రజలకు బలవర్ధకమైన ఆహారం అందివ్వాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ చిన్నారులు, మధ్యాహ్న భోజనం చేసే విద్యార్థులకు అందించే బియ్యంలోనూ, రేషన్‌ బియ్యంలోనూ ఫోర్ట్‌ఫైడ్‌ రైస్‌ కలిపి ఇవ్వాలని సర్కారు యోచించింది

ఇందుకు జిల్లాలో బొబ్బిలి నియోజవర్గాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. నియోజకవర్గంలో బొబ్బిలి, బాడంగి, రామభద్రపురం, తెర్లాం మండలాల్లోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు, పాఠశాలల్లో మధ్యా హ్న భోజనానికి పూర్తిస్థాయిలో ఫోర్టిఫైడ్‌ రైస్‌ను, రేషన్‌ బియ్యంలో ప్రతీ క్వింటాలులో ఒక కిలో ఫోర్టిఫైడ్‌ రైస్‌ పంపిణీ చేసింది. ఈ విషయం తెలీని టీడీపీ నాయకులు ఓ పథకం ప్రకారం ప్రభుత్వం ప్టాస్టిక్‌ బియ్యం పంపిణీ చేసిందని మండలంలోని మెట్టవలసలో బుధవారం దుష్ప్రచారం చేయడానికి యత్నించి అడ్డంగా బుక్కయ్యారు. తమకు అనుకూలంగా ఉన్న మీడియాను పిలిచి హడావుడి చేశా రు. దీంతో స్థానికంగా ఉన్న వైఎస్సార్‌సీపీ అభిమాని, సీనియర్‌ సిటిజన్‌ అడబాల కృష్ణారావు సాక్షికి సమాచారం అందించడంతో విచారణ చేస్తే తమ్ముళ్ల అవగాహన లేమి బయటపడింది. 

ఫోర్టిఫైడ్‌ రైస్‌ అంటే...? 
శ్రేష్టమైన ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు బియ్యానికి అదనంగా చేర్చడాన్ని రైస్‌ ఫోర్టిఫికేషన్‌ అంటారు. ఐరన్, ఫోలిక్‌ యాసిడ్, విటమిన్‌–బి12 వంటి కీలక సూక్ష్మ పోషకాలను బియ్యంలో అదనంగా చేర్చి పోషకాహార లోపాన్ని అధిగమించే యత్నం ప్రభుత్వం చేస్తోంది. దేశంలో 65 శాతం మందికి బియ్యమే ప్రధాన ఆహారం. 80కోట్ల జనాభాకు చేరువయ్యే అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, రేషన్‌ డిపోలద్వారా ప్రభుత్వం అందించి ఎప్పటిలాగే మంచి భోజనం పౌష్టికాహారంతో తినాలనే లక్ష్యంతో ఫోర్టిఫైడ్‌ రైస్‌ను పంపిణీ చేస్తున్నారు.  

అవగాహన లోపంతో దుష్ప్రచారం 
టీడీపీ నాయకులు, జనసేనకు చెందిన ఓ వ్యక్తి తమకు అనుకూలంగా ఉన్న మీడియా ద్వారా ప్రభు త్వం ప్లాíస్టిక్‌ రైస్‌ అందించిందని ఆధారం లేకుండా దుష్ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు. దీనిపై సీఎస్‌డీటీ గౌరీశంకరరావు, తహసీల్దార్‌ సీహెచ్‌.లక్ష్మణరావు అప్రమత్తమై అసలు విషయాన్ని గ్రామస్తులకు, నాయకులకు తెలిపారు. ప్రభుత్వం ఈ నెలనుంచి ఫోర్టిఫైడ్‌ రైస్‌ అంగన్వాడీలకు, మధ్యాహ్న భోజనానికి పూర్తిస్థాయిలో అందించిందని, రేషన్‌ డిపోలలో ప్రతీ క్వింటాలుకు కిలో ఫోరి్టఫైడ్‌ రైస్‌ కలిపి అందిస్తోందని వివరించారు. దీనిపై ఎవరి దు్రష్పచారాలు ప్రజలు నమ్మవద్దని వివరించారు.  

లేనిపోని వదంతులు సృష్టించారు 
ప్రభుత్వం బలవర్థక బియ్యం అందిస్తే కొందరు దీనిపై ప్లాస్టిక్‌ బియ్యమని దుష్ప్రచారం ప్రారంభించారు. వెంటనే మేం అప్రమత్తమై వాస్తవాలు తెలుసుకోవాలని మా మీడియాకు సమాచారం అందించాం. ఫోరి్టఫైడ్‌ రైస్‌ పంపిణీపై అధికారులు వివరించారు.  – అడబాల కృష్ణారావు, సీనియర్‌ సిటిజన్, మెట్టవలస 

బలవర్థక బియ్యం 
బొబ్బిలి నియోజక వర్గాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఫోర్టిఫైడ్‌ రైస్‌ను అందిస్తు న్నాం. విద్యార్థులకు, చిన్నారులకు పూర్తిస్థాయిలో అందిస్తూ, రేషన్‌ డిపోలలో మిక్సింగ్‌ ద్వారా పంపిణీ చేస్తున్నాం. వీటిలో ఐరన్, విటమిన్లు, ఫోలిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఎలాంటి అపోహ పడవద్దు. ఎలాంటి వదంతులు నమ్మవద్దు.
– సీహెచ్‌.లక్ష్మణప్రసాద్, తహసీల్దార్, బొబ్బిలి   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement