Ration rice
-
కేంద్రం కీలక నిర్ణయం, వాళ్లకి ఉచిత రేషన్ కట్.. అందులో మీరున్నారా?
ఢిల్లీ : ఉచిత రేషన్ బియ్య పంపిణీ ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన (పీఎంజేకేఏవై) పథకంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ ట్యాక్స్ చెల్లింపు దారులకు రేషన్ బియ్యం పంపిణీని నిలిపివేసే దిశగా అడుగులు వేస్తోంది.ఇందులో భాగంగా ఇన్ కమ్ ట్యాక్స్ విభాగం పన్నులు చెల్లింపు దారుల డేటాను కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖకు పంచుకోనుంది. తద్వారా పన్నుచెల్లింపు దారులు ఎవరైనా ఉచిత రేషన్ బియ్యం పొందుతుంటే.. వారిని అనర్హులుగా గుర్తిస్తుంది. అనంతరం, ఉచిత రేషన్‌ను నిలిపి వేయనుంది.ఆదాయపు పన్ను చెల్లించలేని వారికి పీఎంజేకేఏవై పథకంలో భాగంగా పేద కుటుంబాలకు కేంద్రం ఉచిత రేషన్ అందిస్తుంది. అయితే పీఎంజేఏఏవైలో పన్ను చెల్లింపు దారులకు సైతం రేషన్ అందుతుందని కేంద్రానికి ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదులపై కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. ఆదాయపు పన్ను శాఖ వద్ద ఉన్న పన్ను చెల్లింపు దారుల డేటాను పరిశీలించనుంది. ఈ మేరకు సంబంధిత శాఖల్ని సమన్వయం చేస్తోంది. ఉచిత రేషన్ పథకంలో అనర్హుల డేటాను వెలికి తీయనుంది. ఆ తర్వాత కేంద్రం చర్యలు తీసుకోనుంది. దేశంలో కోవిడ్-19 కారణంగా తలెత్తిన ఆర్ధిక ఇబ్బందుల నుంచి నిరు పేదల్ని గట్టెక్కించేలా కేంద్రం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద పేదలకు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తుంది. ఉచిత రేషన్ వ్యవధిని జనవరి 1, 2024 నుండి ఐదు సంవత్సరాల పాటు పొడిగించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి తాజా బడ్జెట్లో రూ.2.03 లక్షల కోట్లను ప్రతిపాదించింది. -
కూటమి ప్రభుత్వం అక్రమ కేసు.. పేర్ని నాని సతీమణికి ఊరట
సాక్షి,కృష్ణా : కూటమి ప్రభుత్వం నమోదు చేసిన రేషన్ బియ్యం అక్రమ కేసులో మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి ఊరట దక్కింది. పేర్ని నానీ సతీమణి పేర్ని జయసుధకు మచిలీపట్నం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రేషన్ బియ్యం కేసులో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) ఇప్పటికే ఖండించారు. ఈ విషయంలో అధికారుల దర్యాప్తు కంటే సోషల్ మీడియాలో రచ్చ ఎక్కువైందని, పోలీసుల విచారణ పూర్తి కాకముందే ఉద్దేశపూర్వకంగా తనను దొంగగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారాయన. శనివారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘అద్దె కోసమే గోడౌన్ కట్టుకున్నాం. తప్పుడు పనులు చేయడానికి కాదు. సివిల్ సప్లై అధికారులు నా భార్య జయసుధకు చెందిన గోడౌన్లో స్టాక్ ఉంచారు. మా గోడౌన్లో బియ్యం తగ్గిందని అధికారులు చెప్పారు. టెక్నికల్‌గా మా తప్పు లేకపోయినా.. నైతికంగా బాధ్యత తీసుకుంటామని చెప్పాం. అధికారులు 3,800 బస్తాలు తగ్గాయని చెబితే.. నగదు చెల్లించాం. అయినా సరే మాపై కక్షగట్టి కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ పూర్తి కాలేదని పోలీసులే చెబుతున్నారు. ఏదీ తేలకముందే నేనే దొంగనంటూ కూటమి(Kutami) నేతలు కొద్దిరోజులుగా నాపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు’’ అని అన్నారాయన.అయినా కూడా ఈ వ్యవహారంలో డిపార్ట్మెంట్ విచారణ కంటే సోషల్ మీడియా(Social Media) రచ్చ ఎక్కువైంది. మాపై ఎల్లో మీడియా, ఐటీడీపీ తప్పుడు రాతలు రాస్తోంది. కూటమి అనుకూల నేతలు, విశ్లేషకులు ఈ తప్పుడు ప్రచారంలో భాగం అయ్యారు. నేను పారిపోయానంటూ ప్రచారాలు చేశారు. నేనెక్కడికి పారిపోలేదు. 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు బందరులోనే ఉన్నా. కేవలం లాయర్ల సూచన మేరకే ఇంతకాలం మీడియా ముందుకు రాలేదు.నాపై ప్రతీకారం తీర్చుకోవాలని నా ఇంట్లో ఆడవాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. గోడౌన్ మేనేజర్‌ను అరెస్ట్ చేసి.. ఆయన ద్వారా నా పేరు చేర్చడానికి ప్లాన్ చేశారు. గోడౌన్‌ను పగలగొట్టి సరుకును తీసుకెళ్లారు. ఓ సీఐ ఈ స్వామికార్యాన్ని దగ్గరుండి జరిపించారు. ఇలా ఏదో ఒక రకంగా నన్ను, నా భార్యను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. కొన్ని యూట్యూబ్ చానెల్స్‌లో నా భార్య గురించి దారుణమైన కామెంట్స్ పెట్టారు. ఇప్పటికే చాలామంది స్టేషన్‌కు తీసుకెళ్లి కొడుతున్నారు. రాజకీయ కక్ష ఉంటే నాపై తీర్చుకోండి. నా ఇంట్లో ఆడవాళ్లతో ఏం పని?’’.... సామాన్య ప్రజలు ఆలోచించాలి. నేను మూడుసార్లు ఎమ్మెల్యేగా చేశా. ప్రభుత్వం రూల్స్ ఏంటో నాకు తెలుసు. నేను మంత్రిగా చేసినప్పుడు.. ఇదే డీజీపీ నా శాఖలో పని చేశారు. ఆయనకు నేనేంటో తెలుసు. నా తల్లి మీద ఒట్టేసి చెబుతున్నా.. ఎలాంటి తప్పు చేయలేదు. నేను, నా భార్య ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. తప్పుడు మార్గంలో సంపాదించాలనే ఆలోచన ఏనాడూ నాకు లేదు. కేవలం నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. తప్పు చేసి ఉంటే ఈ ఐదు నెలలు ఏం చేశారు?. నా మీద అధికార పార్టీ, ఎల్లో మీడియా కక్ష కట్టాయి. వైఎస్ జగన్ కంటే నేనే వాళ్ల మొదటి టార్గెట్. అందుకే నన్ను తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేయాలనుకుంటున్నారు. త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయి.ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్తే రకరకాల కుట్రలు చేశారు. పీపీలను మారుస్తూ అడ్డంకులు సృష్టించారు. జనవరి 2వ తేదీలోగా నన్ను, నా కుమారుడిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారని తెలిసింది. ఇంకోవైపు.. నా దగ్గర రూ.5 వేల కోట్లు ఉన్నాయని టీడీపీ పత్రికల్లో అసత్య ప్రచారం చేస్తున్నారు. నా దగ్గరే అంత డబ్బు ఉంటే సీజ్ చేస్కోండి. 3 శాతం లంచాలు తీసుకునేవాళ్లు కూడా నాపై ఆరోపణలు చేస్తున్నారు. మంత్రిగా ఉంటూ తన శాఖలోని ఉద్యోగుల బదిలీలకు లంచాలు తీసుకున్నవాళ్లు కూడా నాపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ నెల 30న బెయిల్ తీర్పు ఉన్నందున అన్ని విషయాల గురించి మాట్లాడలేకపోతున్నా’’ అని పేర్ని నాని అన్నారు. -
నెల్లూరులో అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియ్యం
-
ఏపీలో రేషన్ డోర్ డెలివరీ బంద్!
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ సరుకుల డోర్ డెలివరీకి మంగళం పాడాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తాజాగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆ దిశగా స్పష్టమైన వ్యాఖ్యలతో సంకేతాలిచ్చారు.రేషన్ డోర్ డెలివరీ కోసం కొన్న వాహనాల వల్ల కార్పొరేషన్‌పై రూ.1,500 కోట్ల భారం పడింది. అన్ని వర్గాలతో చర్చించి ఒక నివేదిక సిద్ధం చేస్తాం. కేబినెట్లో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటాం.కాగా, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజా పంపిణీ వ్యవస్థలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. జనవరి 21, 2021 పౌరసరఫరాల శాఖ పరిధిలో రేషన్ డోర్ డెలివరీ వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారాయన. -
పైన కూరగాయలు, కింద రేషన్ బియ్యం!
పెబ్బేరు: డబ్బు సంపాదనే లక్ష్యంగా కొందరు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తూ సోమవారం పోలీసులకు చిక్కారు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్ఐ జగదీశ్వర్ తెలిపిన వివరాలు... కర్నూల్ జిల్లా నుంచి గోపాల్‌నాయక్ ఏపీ 31టిఎ 9799 నంబర్ గల మినీ డీసీఎంలో 40 క్వింటాళ్ల రేషన్ బియ్యం నింపి బియ్యంపై కూరగాయల బాక్స్‌లు వేసుకుని బాలనగర్‌కు తరలిస్తుండగా, పక్కా సమాచారంతో పోలీసులు, సివిల్ సప్లయ్ అధికారులు సోమవారం తెల్లవారుజామున పెబ్బేరు సమీపంలో డీసీఎంను పట్టుకున్నారు. బాలనగర్ మండలం కుచర్లతండాకు చెందిన డ్రైవర్ గోపాల్‌నాయక్, అనంతపురం జిల్లా ధర్మవరంలో ఉంటూ అదే గ్రామానికి చెందిన గిరి అనే వ్యక్తితో కలిసి చుట్టుపక్కల గ్రామాలలో ప్రజల నుంచి తక్కువ ధరకు రేషన్ బియ్యం కొని బాలనగర్, షాద్‌నగర్ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక్కడ ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఈవిషయం తెలియడంతో సివిల్ సప్లయ్ అధికారులు డీటీ వేణు, నందకిశోర్ డీసీఎంలో ఉన్న బియ్యాన్ని పరిశీలించి రేషన్ బియ్యంగా గుర్తించారు. డ్రైవర్ గోపాల్‌నాయక్, గిరిపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
గుడ్‌న్యూస్.. మరో ఏడాది పాటు రేషన్ బియ్యం ఫ్రీ..!
సాక్షి, సిటీబ్యూరో: ఆహార భద్రత కార్డుదారులకు శుభవార్త. మరో ఏడాది పాటు ఉచిత రేషన్ అందనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్Œఎఫ్ఎస్ఏ) కింద పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో జనవరి నుంచి కూడా ఉచితంగానే రేషన్ బియ్యం పంపిణీ కానున్నాయి. కేంద్రం కోటాకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత కలిపి ఉచితంగా పంపిణీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ కోటాపై నిర్ణయం తీసుకోలేదు. ఉచిత కోటాతో ఆరి్థక భారంపై తర్జనభర్జన పడుతోంది. దీంతో కేవలం కేంద్రం కేటాయించే యూనిట్‌కు 5 కిలోలు మాత్రమే వర్తింపజేస్తుందా..లేక గతంలో మాదిరిగా అదనంగా మరో ఐదు కిలోలు కలిపి 10 కిలోలు వర్తింప చేస్తుందా ? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. 2020 నుంచి ఉచితంగానే.. కేంద్ర ప్రభుత్వం కరోనా ఆర్థిక సంక్షోభం నేపధ్యంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజికేఎవై) పథకం కింద 2020 ఏప్రిల్ నుంచి యూనిట్æ(ఒక్కొక్కరికి) ఉచితంగా 5 కేజీల చొప్పున బియ్యం కోటా కేటాయిస్తూ వచి్చంది. అప్పటి నుంచి పలు పర్యాయాలుగా ఈనెల 31 దాకా పొడిగిస్తూ వచి్చంది.తాజాగా ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏతో పీఎంజీకేఏవైని విలీనం చేసి ఆహార భద్రత చట్టం కింద ఉచితంగా అందించాలని నిర్ణయించింది. సగం కార్డుదారులు... మహానగర పరిధిలోని ఆహార భద్రత కార్డులు కలిగిన కుటుంబాల్లో సగానికి పైగా అనర్హత కలిగిన కుటుంబాలు ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్లుగా ఉచిత బియ్యం 70 నుంచి 80 శాతం కుటుంబాలు ప్రతి నెలా డ్రా చేస్తున్నారు. మిగిలిన 20నుంచి 30 శాతం మాత్రం కార్దులు రద్దు కాకుండా రెండు నెలలకు ఒకసారి సరుకులు డ్రా చేస్తూ వస్తున్నారు. మొత్తం మీద బియ్యం డ్రా చేసే కుటుంబాల్లో 10 శాతం మంది డీలర్లకే కిలో ఒక్కంటికి రూ. 8 నుంచి 10 లకు విక్రయిస్తుండగా, మిగిలిన 20 శాతం కటుంబాలు కిరాణం, ఇడ్లీ బండి, చిరు వ్యాపారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. చదవండి: తల్లి హీరాబెన్ పాడె మోసిన ప్రధాని మోదీ -
భారీ షాకిచ్చిన కేంద్రం.. 10 లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఇదే!
తప్పుడు సమాచారంతో రేషన్ కార్డులు పొందిన వారందరికి కేంద్రం షాక్ ఇవ్వనుంది. ఇటువంటి కార్డ్‌లను రద్దు చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం 10 లక్షల రేషన్ కార్డులను ప్రభుత్వం రద్దు చేయబోతోంది. దీనిపై సమీక్ష ప్రక్రియ ఇంకా కొనసాగుతోందట. అయితే రాబోయే రోజుల్లో దీని సంఖ్య పెరిగే అవకాశం ఉండవచ్చుని సమాచారం. 10 లక్షల కార్డులు కట్! ఇప్పటివరకు ప్రభుత్వం 10 లక్షల మంది లబ్ధిదారులను అనర్హులగా గుర్తించింది. ఈ జాబితాను స్థానిక రేషన్ డీలర్లకు పంపనుంది. ఈ నకిలీ లబ్ధిదారుల పేర్ల జాబితాను తయారు చేసి, అలాంటి కార్డుదారుల నివేదికను జిల్లా కేంద్రానికి పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సమాచారాన్ని పరిశీలించిన తర్వాత అటువంటి లబ్ధిదారుల రేషన్ కార్డులను రద్దు చేయాలని సంబంధిత శాఖకు తెలపనుంది. వీళ్లంతా అనర్హులే ఎన్ఎఫ్ఎస్ఏ (NFSA) ప్రకారం వీరు రేషన్ పొందేందుకు అనర్హులుగా ప్రకటించింది. ఆదాయపు పన్ను చెల్లించే వారు, 10 బిగాల కంటే ఎక్కువ భూమి ( 6 ఎకరాల భూమి) ఉన్న వ్యక్తుల కార్డులను రద్దు చేయనుంది. వీటితో పాటు రేషన్‌ను ఉచితంగా విక్రయిస్తూ కొందరు అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో ఈ విషయంపై సీరియస్ అయిన ప్రభుత్వం వారిపై కూడా చర్యలు తీసుకోవాలని అధికారులని ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌లో చాలా వరకు రేషన్ కార్డులు దుర్వినియోగం జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గత కొంత కాలంగా ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద, ప్రాధాన్యత కలిగిన పసుపు, గులాబీ రేషన్ కార్డుదారులకు ప్రతి నెలా ఐదు కిలోల బియ్యం ఉచితంగా లభిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్ కార్డు కట్!
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఉచిత రేషన్ అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ఇంధనంతో పాటు కూరగాయల ధరలు మండుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ పథకాన్ని మరో 6 నెలల పాటు పొడిగించే యోచనలో ఉంది. ఇందులో చాలా మంది అనర్హులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం పారదర్శకంగా అమలయ్యేందుకు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. రద్దు దిశగా రేషన్ కార్డులు రేషన్ కార్డు రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది. దీని ప్రకారం మీరు అనర్హులుగా తేలితే మీ రేషన్ కార్డు కూడా రద్దవుతుంది వీటతో పాటు ప్రభుత్వం మరో విజ్ఞప్తి కూడా చేస్తోంది. అనర్హులు ఎవరైనా, వారి రేషన్ కార్డును వారి స్వంతంగా రద్దు చేయాలని లేదంటే ప్రభుత్వం గుర్తించి రేషన్ రద్దుతో పాటు వారిపై చర్యలు కూడా తీసుకోనున్నట్లు తెలిపింది. రూల్స్ ఏంటో చూద్దాం.. మీ సొంత ఆదాయంతో సంపాదించిన 100 చదరపు మీటర్ల ప్లాట్/ఫ్లాట్ లేదా ఇల్లు, ఫోర్ వీలర్ వెహికిల్/ట్రాక్టర్, ఆయుధాల లైసెన్స్, కుటుంబ ఆదాయం రెండు లక్షల కంటే ఎక్కువ (గ్రామంలో), అదే నగరంలో సంవత్సరానికి మూడు లక్షలు ఉంటే, అలాంటి వారు వారి రేషన్ కార్డును ప్రభుత్వ సంబంధిత కార్యాలయంలో సరెండర్ చేయాలి. మరిన్ని నెలలు ఉచిత రేషన్ మీడియా నివేదికల ప్రకారం, ప్రభుత్వం ప్రస్తుతం పేదలకు 5 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తోంది. ఈ పథకాన్ని మరో 3 నుంచి 6 నెలల వరకు పెంచనున్నట్లు సమాచారం. అయితే, దీనివల్ల ప్రభుత్వానికి 10 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది. -
‘రేషన్ షాపుల మూసివేతపై కొన్ని పత్రికలు అపోహలు సృష్టిస్తున్నాయి’
తాడేపల్లి: కరోనా సమయంలో రాష్ట్రంలో కోటి 46 లక్షల రేషన్ కార్డులుంటే కేంద్రం 89 లక్షల కార్డులకు మాత్రమే బియ్యం ఇచ్చిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమురి నాగేశ్వరరావు తెలిపారు. కేంద్రం ఇచ్చే 89 లక్షల కార్డులకి బియ్యం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. 9 వెనుకబడ్డ జిల్లాలు, ఎస్సీ, ఎస్టీలు అందరికి ఇస్తామని, ఈ విషయాన్ని కేంద్రానికి కూడా తెలియజేశామని స్పష్టం చేశారు. ప్రతి నెలా ఇచ్చే రేషన్‌కి అదనంగా కేంద్రం ఇచ్చే కార్డుల బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. రేషన్ షాపులను మూసేస్తామని వస్తున్న వాదనలు పచ్చి అబద్ధమని పేర్కొన్నారు. కొన్ని పత్రికలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని, రాష్ట్రంలో ఒక్క రేషన్ కార్డు తొలగించలేదన్నారు. కొత్తగా 7 లక్షల కార్డులు మంజూరు చేశామని గుర్తు చేశారు. కోటీ 50 లక్షల మందికి అదనంగా ఇస్తున్నాం: మంత్రి బొత్స రాష్ట్రంలో 4 కోట్ల 23 లక్షల మందికి రేషన్ పంపిణీ చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రూపాయికే కిలో బియ్యం అందిస్తున్నామని, కరోనా వైపరీత్యం వచ్చినప్పుడు కేంద్రం పీఎంజీకేవై పథకం తీసుకొచ్చిందని గుర్తు చేశారు మంత్రి. 2 కోట్ల 68 లక్షల మందికి మాత్రమే ఆ పథకం అమలు చేసిందన్నారు. తాము కోటి 50 లక్షల మందికి అదనంగా అందించామని తెలిపారు. ‘ప్రస్తుతం కరోనా తగ్గింది కాబట్టి 3 నెలల నుంచి పునరాలోచన చేశాం. దేశంలో ఎక్కడా లేని విధంగా 86 శాతం మందికి లబ్ది చేస్తున్నది మన రాష్ట్రమే. దీనిపై మంత్రివర్గ ఉప సంఘంలో చర్చించాం. కేంద్రం ఇచ్చే కార్డులకు అదనపు బియ్యాన్ని ప్రత్యేకంగా పంపిణీ చేస్తాం.’ అని మంత్రి పేర్కొన్నారు. ఇదీ చదవండి: వనరుల సమీకరణపై సీఎం జగన్ సమీక్ష -
రేషన్ బియ్యం స్కాం బట్టబయలు చేస్తాం
నారాయణపేట: రేషన్ బియ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న కుంభకోణాన్ని బట్టబయలు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రజాసంగ్రామ యాత్ర 18వ రోజు ఆదివారం నారాయణపేట జిల్లాలోని అంత్వార్స్టేజీ, కొల్లంపల్లి, లింగపల్లి, ధన్వాడలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై నిలదీస్తున్న ప్రజలను, బీజేపీ కార్యకర్తలను వేధిస్తున్నారని, వారిపై అక్రమ కేసులు పెట్టి భయపెడుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది కొద్దిరోజులేనని, రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ నేతలు చేస్తున్న అరాచకాలకు తగిన బుద్ధి చెబుతామని బండి హెచ్చరించారు. బీజేపీ అధికారంలోకి వస్తే కోయిల్‌సాగర్ ద్వారా ధన్వాడ చెరువు నింపి ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ చార్జీలు పెంచి జనంపై భారాన్ని మోపిన కేసీఆర్‌కు కార్మికుల సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. అవినీతిలో రాష్ట్ర ప్రభుత్వం నంబర్ వన్: లక్ష్మణ్ అవినీతిలో రాష్ట్ర ప్రభుత్వం నంబర్ వన్‌గా నిలిచిందని జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డా.లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాదయాత్రకు ప్రజలు బ్రహ్మర«థం పడుతున్నారన్నారు. ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కుటుంబం దోచుకోవడం తప్ప ప్రజాసంక్షేమం పట్టడం లేదన్నారు. మూడు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. పాదయాత్రలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమ స్ఫూర్తి.. పంజాబ్‌లోనూ ఏపీ తరహా పథకం..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తినిస్తున్నాయి. తాజాగా పంజాబ్‌లో అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇంటి వద్దకే రేషన్ పంపిణి చేయాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా రేషన్ దుకాణాల వద్ద గంటల తరబడి వేచి చూసే ఇబ్బందులు ఉండవని, ఒక్క ఫోన్ కాల్‌తో రేషన్ సరుకులు లబ్దిదారుల ఇంటి ముందు ఉంటాయని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తెలిపారు. చదవండి: స్టీల్‌ప్లాంట్‌పై విజయసాయిరెడ్డి కీలక ప్రసంగం -
ఫలించిన పాజిటివ్ మంత్రం
ఉత్తరప్రదేశ్ ఓటర్లు చరిత్ర సృష్టించారు. యోగి ఆదిత్యనాథ్ పాలనకు జై కొట్టారు. మూడున్నర దశాబ్దాల ఆనవాయితీని తిరగరాస్తూ అధికార పార్టీ బీజేపీకి రెండోసారి అధికారం కట్టబెట్టారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఒంటరి పోరాటం ఫలించలేదు. బీఎస్పీ పూర్తిగా చతికిలపడటం, కాంగ్రెస్ కనుమరుగవడం, బీజేపీ హిందూత్వ ప్రచారం, పాజిటివ్ మంత్రం తదితరాలు అఖిలేశ్ సారథ్యంలోని ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమిని దెబ్బతీశాయి. శాంతిభద్రతలు, మోదీ ప్రజాదరణ, ఉచిత రేషన్, అభివృద్ధి వంటి సానుకూలాంశాలు యోగిని గట్టెక్కించాయి. సవ్యమైన శాంతిభద్రతలు యోగి పాలనలో సైతం గత ఐదేళ్లలో యూపీలో దారుణమైన నేరాలు అనేకం జరిగాయి. కానీ వాటికి పాల్పడ్డ వారిని యోగి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచేసిన తీరు ప్రజలకు నచ్చింది. నేరాలకు పాల్పడిన మాఫియా నేతలను ఎన్కౌంటర్లలో మట్టుపెట్టిన యోగి ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూలంగా స్పందించారు. ‘యోగి వల్ల మేం రాత్రి 12 గంటలకు కూడా రోడ్డుపై తిరగగలుగుతున్నాం. అంతకంటే మాకేం కావాలి?’ అని లక్నోకు చెందిన సురేఖ రాణి ప్రశ్నించారు. నేరస్తుల పట్ల యోగి అత్యంత కఠినంగా వ్యవహరించారని ప్రజలు విశ్వసించారు. గతంతో పోలిస్తే యూపీలో హత్యలు, అత్యాచారాలు తగ్గాయని రాయ్‌బరేలీకి చెందిన కిషన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘నేను యూపీలో విస్తృతంగా పర్యటించాను. యోగి ప్రభుత్వం పట్ల మహిళల్లో మంచి ఆదరణ కన్పించింది. దానికి మరో అవకాశం ఇవ్వాలన్న పట్టుదల చాలామందిలో గమనించా’ అని ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్ విశ్లేషించారు. బీజేపీ మళ్లీ అధికారంలో రావడానికి మహిళల మద్దతు ప్రధాన కారణమని ఆయనన్నారు. అవినీతి నియంత్రణ యోగి తన ఐదేళ్ల పాలనలో అవినీతిని కొంతమేరకు నియంత్రించగలిగారు. ఇది కూడా ఆయనను మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి దోహదపడిందని రాజకీయ విళ్లేషకులు అంటున్నారు. ‘మరీ ముఖ్యంగా పై స్థాయిలో అవినీతిని యోగి బాగా నియంత్రించారని ప్రజలు నమ్మారు. మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిని అదుపు చేయడంలో యోగి సఫలమయ్యారు. ఏ నియోజకవర్గంలో నేరాలు జరిగినా సంబంధిత ఎమ్మెల్యేదే బాధ్యత అన్న యోగి హెచ్చరికలు కూడా ప్రజలకు నచ్చాయి’ అని సెంటర్ ఫర్ పొలిటికల్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు ప్రవీణ్ వర్మ అన్నారు. ‘కిందిస్థాయిలో అవినీతి ఉన్నా ప్రజలను ఇబ్బంది పెట్టేంతగా లేదని ప్రజలు విశ్వసించారు. మరోసారి యోగి గెలిస్తే అవినీతి మరింత తగ్గుతుందని కూడా నమ్మారు’ అని ప్రముఖ సెఫాలజిస్ట్ ప్రదీప్ గుప్తా విశ్లేషించారు. పన్నులు పెంచినా వృద్ధీ ఉంది యోగి హయాంలో పన్నులు బాగా పెంచారన్న అసంతృప్తి ప్రజల్లో లేకపోలేదు. కానీ అభివృద్ధి జరగాలంటే నిధులు కావాలి కదా అని సర్దుకుపోయే ధోరణిలో మాట్లాడుతున్న వాళ్లే ఎక్కువ. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల పనితీరు కూడా ఐదేళ్లలో బాగానే మెరుగుపడిందని ప్రజలు బహిరంగంగా చెపుతున్నారు. యోగికి మరో ఐదేళ్లు అవకాశం ఇవ్వడానికి ఇవీ కారణాలేనన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. సమాజ్‌వాదీ ఓటమికి కారణాలెన్నో.. అఖిలేశ్‌ను ఎలాగైనా మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలంటూ ముస్లింలలో వచ్చిన పెద్ద మార్పు యూపీలో హిందువుల పోలరైజేషన్‌కు ఉపయోగపడింది. బహుశా ఇదే బీజేపీని గెలిపించినట్టు కన్పిస్తోందని ప్రముఖ సెఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యాదవులకు వ్యతిరేకంగా ఓబీసీలు బీజేపీ వైపు ర్యాలీ అయ్యారని ఆయన విశ్లేషించారు. ఇక బీఎస్పీ అధినేత్రి మాయావతి రాజకీయంగా దాదాపుగా కనుమరుగు కావడం కూడా అఖిలేశ్‌కు అతి పెద్ద మైనస్‌గా మారిందనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో ఆమె పెద్దగా ప్రచారం కూడా చేయలేదు. మాయావతి అనాసక్తిని కనిపెట్టిన కొందరు దళితులు బీజేపీ పంచన చేరారు. మరికొందరు ఎస్పీకి వ్యతిరేకంగా పని చేశారు. నిజానికి ఈసారి ముస్లింలు, యాదవులు అఖిలేశ్‌కు ఏకమొత్తంగా మద్దతు పలికారు. అలా చూస్తే ఆయన పోరాటం నేరుగా 24 శాతం ఓట్లతో మొదలైంది! 2013 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇది ఏకంగా 4 శాతం అధికం. మరో 16 శాతానికి అటూఇటుగా ఓట్లు తెచ్చుకోగలిగి ఉంటే అధికారం ఆయన సొంతమయ్యేదే. కానీ అది చెప్పినంత తేలిక కాదు. యూపీ రాజకీయాల్లో బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువే. వారు ఏ పార్టీకి మద్దతిస్తే వారి తరపున జోరుగా ప్రచారం చేస్తారు. పైగా మరో విశేషమేమంటే ఆ వర్గానికి చెందిన వారు కనీసం 90 శాతం దాకా కచ్చితంగా ఓటు వేస్తారు. ఇది ఈసారి అఖిలేశ్‌కు బాగా మైనస్‌గా మారింది. గత ఐదేళ్లలో అఖిలేశ్ పార్టీని పటిష్టపరచుకోగలిగారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పెద్దగా పోరాటాలు చేయలేదన్న అపవాదుంది. ప్రజలను చైతన్యవంతులను చేసే ప్రయత్నంలో కూడా విఫలమయ్యారన్న విమర్శలు ఎక్కువయ్యాయి. అలాగే యాదవులు, ముస్లింలు మినహా మిగతా వర్గాలను అఖిలేశ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఆయనకు ప్రజల్లో మంచి ఆదరణే ఉంది. కానీ, దాన్ని ఓట్లుగా మలుచుకోలేకపోయారు. అందుకు కావాల్సిన యంత్రాంగం, దాన్ని ముందుండి నడిపే వనరుల లేమి కూడా మైనస్ అయింది. బీజేపీ ఈ ఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. మోదీ మంత్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల యూపీ ప్రజలకున్న విశ్వాసం ఏమాత్రం సడలకపోవడం కూడా యోగికి ఈసారి పెద్ద వరమైంది. ‘యోగి కంటే మోదీకే యూపీలో ఎక్కువ పాపులారిటీ ఉంది. ఆయనపై ప్రజలకున్న తిరుగులేని విశ్వాసం కూడా అఖిలేశ్‌కు బాగా మైనస్ అయింది’ అని సెఫాలజిస్ట్ యశ్వంత్ దేశ్‌ముఖ్ అన్నారు. వీటికి తోడు రాష్ట్రంలో కాంగ్రెస్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోవడం కూడా అఖిలేశ్‌కు మరో పెద్ద మైనస్‌గా మారింది. ఎక్కడా కాంగ్రెస్ కనీసం ఐదు శాతం ఓట్లు కూడా చీల్చే పరిస్థితి కన్పించలేదు. దాంతో అధికార బీజేపీ ఓట్లు చీలలేదు. – (సాక్షి ప్రత్యేక ప్రతినిధి కంచర్ల యాదగిరిరెడ్డి) -
టీడీపీ మాజీ ఎంపీపీ భర్త పద్మనాభరాజుపై కేసు నమోదు
పిచ్చాటూరు (చిత్తూరు): లారీ సహా 7.5 టన్నుల అక్రమ రేషన్ బియ్యాన్ని నాగలాపురం ఎస్ఐ ప్రతాప్ తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. పట్టుబడ్డ రేషన్ బియ్యం లారీ, నిందితులను సత్యవేడు సీఐ శివకుమార్‌రెడ్డి, నాగలాపురం ఎస్ఐ ప్రతాప్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. నాగలాపురం మీదుగా తమిళనాడుకు అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు స్థానిక పోలీసులకు సమాచారం అందింది. నందనం వద్ద శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎస్ఐ ప్రతాప్ తన సిబ్బందితో మాటు వేశారు. చెన్నై వైపు వెళ్తున్న లారీ (ఏపీ03టీబీ2444)ని తనిఖీ చేయగా 150 బస్తాల (ఒక్కో బస్తా 50 కిలోలు) రేషన్ బియ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. లారీలో ఉన్న పిచ్చాటూరు మండలం కీళపూడికి చెందిన రఘు (46) అనే వ్యక్తిని పోలీసులు పట్టుకోగా అదే గ్రామానికి చెందిన తంగరాజ్ అనే మరో వ్యక్తి పరారయ్యాడు. పట్టుబడ్డ వ్యక్తిని విచారించగా లారీ, బియ్యం టీడీపీ మాజీ ఎంపీపీ భర్త డి.పద్మనాభరాజుకు చెందినవిగా వివరించాడు. లారీ సహా బియ్యాన్ని నాగలాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రఘురామయ్య, తంగరాజ్లతో పాటు టీడీపీకి చెందిన మాజీ ఎంపీపీ భర్త పద్మనాభరాజుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
రేషన్ బియ్యం పంపిణీ 4నుంచి
సాక్షి, హైదరాబాద్: ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని ఈనెల నాలుగో తేదీ నుంచి పంపిణీ చేస్తామని పౌరసరఫరాలశాఖ తెలిపింది. సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అవుతోందని ఈ విషయాన్ని రేషన్‌దారులు గమనించాలని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
తెలంగాణ: డిసెంబరులో ఉచిత బియ్యం 5 కిలోలే.. రాష్ట్ర వాటా బందు!
సాక్షి, సిటీబ్యూరో: కరోనా కష్ట కాలంలో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా ఉచిత బియ్యం ఇక యూనిట్ (లబ్ధిదారు)కు 5 కిలోల చొప్పున మాత్రమే పంపిణి జరగనుంది. కేంద్రం ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం (పీఎంజీకేవై) కింద ఉచిత బియ్యం పంపిణీ ప్రక్రియ గడువు 2022 మార్చి వరకు పొడిగించి కోటా విడుదల చేసినప్పటికీ రాష్ట్ర కోటాపై నిర్ణయం జరగలేదు. ఇప్పటి వరకు పీఎంజీకేవై కింద కేంద్రం యూనిట్‌కు అయిదు కిలోలు మాత్రమే కోటా కేటాయించినా.. రాష్ట్ర ప్రభుత్వం మరో అయిదు కిలోలు కలిపి యూనిట్‌కు 10 కిలోల చొప్పున పంపిణీ చేస్తూ వచ్చింది. తాజాగా కేంద్రం ఉచితం బియ్యం గడువు పొడిగించినా.. రాష్ట్ర ప్రభుత్వ మాత్రం కేంద్రం కోటాకే పరిమితమైంది. ఈ నెలలో ఉచిత బియ్యం కోటాను 5 కిలోలకు పరిమితం చేస్తూ పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. (చదవండి: Police Slapped Man Video: ఎందుకు కొట్టావు? పోలీసులకు చుక్కలు చూపించిన వ్యక్తి) ఉచిత బియ్యం ఇలా.. ► కరోనా కష్టకాలంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభమైంది. గతేడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు యూనిట్‌కు 12 కిలోల చొప్పున, ఆ తర్వాత జూలై నుంచి ఆగస్టు వరకు యూనిట్‌కు 10 కిలోల చొప్పున పంపిణీ చేశారు. ► సెకండ్ వేవ్ నేపథ్యంలో మొదటగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉచిత బియ్యం పంపిణీ చేయాలని భావించినా.. కరోనా సంక్షోభం వెంటాడుతుండటంతో నవంబరు వరకు గడువు పొడిగించారు. తాజాగా మరో నాలుగు నెలల వరకు పొడిగించారు. ► హైదరాబాద్ మహానగరంలో ఆహార భత్రద కార్డులు కలిగిన సుమారు 17.21 లక్షల కుటుంబాలున్నాయి. ఇందులో 59.55 లక్షల యూనిట్లు ఉన్నాయి. -
సామాన్యులకు షాక్.. ఇక ఉచిత రేషన్ బంద్!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా పెద ప్రజలకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనలో భాగంగా అందిస్తున్న ఉచిత రేషన్ అందించే కార్యక్రమాన్ని ఈ నెల 30 తర్వాత పొడిగించే ప్రతిపాదనేది లేదని కేంద్ర ప్రభుత్వ ఆహార, ప్రజాపంపిణీ విభాగం కార్యదర్శి సుధాన్షు పాండే తెలిపారు. కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం వల్ల ప్రతిపాదన చేయలేదని ఆయన వెల్లడించారు. గతేడాది కోవిడ్-19 వల్ల విధించిన లాక్డౌన్ దృష్ట్యా పెదప్రజలకు ఉచితంగా రేషన్ అందించడానికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన(పీఎంజీకెఏవై)ని మార్చి 2020లో ప్రకటించారు. 2020 ఏప్రిల్‌లో ఈ పథకం మొదలైంది. కరోనా సెకండ్ వేవ్‌లో ఈ ఏడాది మే, జూన్ వరకు అమలు చేశారు. ఆ తర్వాత కరోనా పరిస్థితుల వల్ల పేదలు ఇబ్బంది పడకుండా.. జూన్‌లో మరో ఐదు నెలలు( 2021 నవంబర్ 30 వరకు) పొడిగించారు. "ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, ఆహార ధాన్యాల ఒఎమ్ఎస్ఎస్(ఓపెన్ మార్కెట్ అమ్మకపు పథకం) డిస్పోజల్ కూడా ఈ సంవత్సరం మంచిగా ఉంది. కాబట్టి, పీఎంజీకెఏవైని పొడిగించే ప్రతిపాదన లేదు" అని సుధాన్షు పాండే విలేకరులకు విలేకరులకు తెలిపారు. దేశవ్యాప్తంగా జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఎ) కింద గుర్తించిన 80 కోట్ల రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ సరఫరా చేస్తుంది. (చదవండి: సామాన్యులకు శుభవార్త, వంటనూనె ధరల్ని తగ్గించిన కేంద్రం!) -
900 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
జహీరాబాద్: అక్రమంగా తరలిస్తున్న 900 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని సత్వార్ గ్రామ సమీపంలోని కోహినూర్ దాబా వద్ద బియ్యం లారీలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పౌరసరఫరాల అధికారులు.. పోలీసు, విజిలెన్స్ అధికారుల సహాయంతో తనిఖీ చేయగా మూడు లారీల్లో 900 క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమంగా హైదరాబాద్ నుంచి గుజరాత్‌కు తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనాలను సీజ్ చేసి ఎస్‌డబ్ల్యూసీ గోదాముకు తరలించారు. ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా బియ్యం లోడ్ చేసి ఉన్నందున ఓ లారీ డ్రైవర్ గుల్జార్, యజమాని ఇర్ఫాన్, మరో లారీ డ్రైవర్ అవేష్జీ, యజమాని ఇస్మాయిల్బాయ్, మరో లారీ డ్రైవర్ షకీల్ అహ్మద్, యజమాని ఇస్మాయిల్ మతకియాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తనిఖీల్లో పౌరసరఫరాల శాఖ అధికారులు సురేశ్ కుమార్, ఎండీ షఫీ, శ్రీనివాస్, విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు. -
తెలంగాణ: ఆగస్టులో 15 కిలోల రేషన్ బియ్యం
సాక్షి, హైదరాబాద్: రేషన్ దుకాణాల ద్వారా ఆగస్టు నెలలో పదిహేను కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర నిర్ణయం మేరకు జూలై నుంచి నవంబర్ వరకు నెలకు పది కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేయాల్సి ఉన్నా, వివిధ కారణాలతో జూలైలో 5 కిలోలే పంపిణీ చేశారు. ఈ నెలలో జూలై కోటా కలుపుకొని 15 కిలోల బియ్యాన్ని పాత కార్డుదారులందరికీ పంపిణీ చేయనుంది. ఈ నేపథ్యంలో అన్ని రకాల ఆహార భద్రతా కార్డులు కలిగిన వారికి ఒక్కొక్కరికి 15 కిలోలు, కొత్తగా ఈ కార్డులు పొందిన వారికి ఒక్కొక్కరికి 10 కిలోలు, అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోలు ఉచితంగా ఇవ్వాలని పౌర సరఫరాల కమిషనర్ అనిల్‌కుమార్ శుక్రవారం అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటే అంత్యోదయ కార్డుదారులకు కుటుంబానికి కిలో చక్కెరను రూ.13.50కి, గోధుమలు జీహెచ్ఎంసీ పరిధిలో 3 కిలోలు, మునిసిపల్‌లో 2 కిలోలు, కార్పొరేషన్లో ఒక కిలో చొప్పున కిలో రూ.7కు ఇవ్వాలని ఆదేశించారు. -
RATION SHOP: సాధారణ నెలవారీ కోటాలో కోత..
సాక్షి, సిటీబ్యూరో: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసే సబ్సిడీ బియ్యం ఈ నెల కూడా ఉచితంగా అందనున్నాయి. సాధారణ నెలవారీ కోటాలో మాత్రం ఉచితం కారణంగా యూనిట్‌కు ఒక కిలో చొప్పున కోత పడింది. కరోనా నేపథ్యంలో ఆహార భద్రత కార్డులోని యూనిట్‌కు 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సోమవారం నుంచి ఉచిత బియ్యం కోటా పంపిణీ ప్రారంభం కానుంది. వాస్తవంగా ఆహార భధ్రత (రేషన్) కార్డుదారులకు కిలో ఒక్కింటికి రూ.1 లెక్కన.. యూనిట్‌కు ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ వస్తోంది. కరోనా కష్టకాలం నేపథ్యంలో జాతీయ ఆహార చట్టం పరిధిలోని కార్డుదారుల కు కేంద్రం 5 కిలోల ఉచిత బియ్యం ప్రకటింంది. కేంద్ర పరిధితో పాటు రాష్ట్ర పరిధిలోని కార్డులు కూడా ఉండటంతో అందరికి ఒకే రకంగా ఉతం బియ్యం కోటాను పంపిణీ చేసేందుకు 5 కిలోలకు పరిమితం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆహార భద్రత కార్డుదారులందరికి యూనిట్‌కు 5 కిలోల చొప్పున పంపిణీ జరగనుంది. ఈ నెల 27 వరకు ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా బియ్యం కోటాను డ్రా చేసుకునేలా పౌరసరఫరాల శాఖ వెసులుబాటు కల్పించింది. -
తెలంగాణలో నాణ్యమైన బియ్యానికి.. చెల్లిన 'నూకలు'
►కింద ఫొటోలో బియ్యం చెరుగుతున్న మహిళ పేరు కవిత. మెదక్ జిల్లా రేగోడ్ మండలం సంగమేశ్వర తండాకు చెందిన ఆమె కుటుంబానికి నెలకు 12 కిలోల రేషన్ బియ్యం వస్తాయి. ఈసారి కూడా ఎప్పట్లాగే డీలర్ వద్దకు వెళ్లి బియ్యం తెచ్చుకుంది. కానీ సంచి విప్పితే సగం దాకా నూకలే. జల్లెడ పట్టి చూస్తే.. 12 కిలోల బియ్యంలో నాలుగున్నర కిలోల నూకలు వచ్చాయి. ►ఇదే జిల్లా చిన్నశంకరం పేట మండలం రుద్రారానికి చెందిన శివలింగం లింగయ్య కుటుంబానికి ప్రతి నెలా 30 కిలోల రేషన్ వస్తుంది. ఈ నెల వచ్చిన బియ్యాన్ని జల్లెడ పడితే పది కిలోల దాకా నూకలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి. బియ్యంలో గరిష్టంగా 20–25 శాతం వరకు నూకలు ఉండొచ్చు. కానీ పేదలకు అందుతున్న రేషన్ బియ్యంలో ఏకంగా 40–45 శాతం వరకు నూకలు ఉంటున్నాయి. సాక్షి, మెదక్(ఆదిలాబాద్/మహబూబ్‌నగర్) : రూపాయికే కిలో బియ్యం.. నాణ్యమైన బియ్యం.. రాష్ట్రంలో నిరుపేదల కడుపు నింపేందుకు అమలవుతున్న ప్రతిష్టాత్మక పథకం. లక్ష్యం అదుర్స్! కానీ పథకం అమల్లోనే పందికొక్కులు చొరబడ్డాయి. ప్రజలకు చేరాల్సిన మేలు రకం (ఫైన్ వెరైటీ) బియ్యం దారితప్పి విదేశాలు, పక్క రాష్ట్రాలకు తరలుతుండగా.. నిరుపేదలకేమో 40–45 శాతం వరకు నూకలే ఉన్న బియ్యం సరఫరా అవుతున్నాయి. కొన్ని నెలలుగా ఇలా నూకల బియ్యం నిరుపేదలకు సరఫరా అవుతున్న వైనంపై ‘సాక్షి’పరిశోధన చేపట్టింది. మార్చి నెలలో రేషన్ షాపుల ద్వారా మెదక్, ఆదిలాబాద్, జోగులాంబ, నారాయణపేట జిల్లాల్లో సరఫరా చేసిన బియ్యాన్ని పరిశీలించింది. ఇటీవల పలువురు లబ్ధిదారులు రేషన్ షాపుల నుంచి తెచ్చుకున్న బియ్యాన్ని కొలత వేయించి, జల్లెడ పట్టించి.. నూకలను వేరుచేసి చూసింది. దాదాపు అన్నిచోట్ల కూడా ప్రభుత్వం గరిష్టంగా నిర్దేశించిన 25శాతం (కిలోకు పావు కిలో) కంటే మించి.. ఏకంగా నలభై, నలభై ఐదు శాతం వరకు నూకలు ఉన్నట్టు గుర్తించింది. దీనికి కారణమెవరు? కొందరు మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై నిరుపేదలకు నాణ్యతలేని, నూకల బియ్యం అంటగడుతున్నట్టు ‘సాక్షి’పరిశీలనలో వెల్లడైంది. వాస్తవానికి మిల్లర్లు ఎఫ్‌సీఐ/పౌర సరఫరాల శాఖ పంపిన ధాన్యాన్నే మిల్లింగ్ చేసి అలా వచ్చిన బియ్యాన్ని తిరిగి ఇవ్వాలి. కానీ కొందరు మిల్లర్లు మంచి ధాన్యాన్ని తాము వాడేసుకుంటున్నారు. తాము బయట నేరుగా తక్కువ ధరకు కొన్న తడిసిన, నాణ్యతలేని ధాన్యాన్ని మిల్లింగ్ చేసి పౌరసరఫరాల శాఖకు పంపుతున్నారు. అందుకే బియ్యంలో నాణ్యత తక్కువగా, నూకలు ఎక్కువగా ఉంటున్నట్టు వెల్లడైంది. అక్రమాలకు తోడ్పడుతున్నదెవరు? మిల్లర్లకు ధాన్యాన్ని పంపి.. తిరిగి బియ్యాన్ని తీసుకోవడాన్ని ‘కస్టమ్ మిల్లింగ్’అంటారు. ఇందుకు ప్రభుత్వం మిల్లర్లకు చార్జీలు చెల్లిస్తుంది. ఇలా ధాన్యాన్ని పంపి, మిల్లింగ్ అయ్యాక బియ్యాన్ని తిరిగి తీసుకునే క్రమంలో.. అధికారులు నాలుగు స్టేజీల్లో నాణ్యతను పరిశీలించాలి. కానీ కొందరు ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల అధికారులు డబ్బులకు కక్కుర్తిపడి మిల్లర్లకు సహకరిస్తున్నారు. ప్రతి స్టేజీలో ఓ రేటు మాట్లాడుకుని వదిలేస్తున్నారు. దీంతో నాణ్యత లేని బియ్యం గోదాములకు, అక్కడి నుంచి రేష¯Œ షాపులకు చేరుతున్నాయి. మంచి బియ్యం ఎక్కడికి పోతున్నాయి? నాణ్యతలేని, నూకల బియ్యాన్ని ప్రభుత్వానికి అంటగడుతున్న మిల్లర్లు.. ఎఫ్‌సీఐ నుంచి వచ్చిన మంచి ధాన్యాన్ని మిల్లింగ్ చేసి నాణ్యమైన బియ్యాన్ని ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఫైన్ క్వాలిటీ బియ్యాన్ని క్వింటాల్ రూ.2,500 నుంచి రూ.2,600 రేటుతో.. ఏపీలోని పెద్దాపురం, కాకినాడ కేంద్రంగా చైనా, వియత్నాం, దుబాయ్, థాయ్‌లాండ్, పలు ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు తెలిసింది. ఈ సీజన్లో ఇప్పటికే పది లక్షల టన్నుల బియ్యం ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి అయినట్టు అంచనా. ఇందులో చాలావరకు కస్టమ్ మిల్లింగ్ కోసం ఎఫ్‌సీఐ పంపిన ధాన్యం నుంచి వచ్చిన బియ్యమే ఉండటం గమనార్హం. కాకినాడ పోర్టులో షిప్పులోకి బియ్యం లోడింగ్ (ఫైల్) కస్టమ్ మిల్లింగ్ ధాన్యం మాయం.. బియ్యం ఇవ్వలేదు.. శనివారం పెద్దపల్లి జిల్లాలోని ఒక రైస్‌మిల్లులో బియ్యం మిల్లింగ్ రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఖరీఫ్, యాసంగి సీజన్లలో ఐకేపీ, పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతుల నుంచి ధాన్యం కొంటుంది. ఆ ధాన్యాన్ని సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) కింద మిల్లర్లకు ఇస్తుంది. మిల్లర్లు ధాన్యాన్ని మర ఆడించి.. ముడి బియ్యం అయితే 67 కిలోలు, బాయిల్డ్ రైస్ అయితే 68 కిలోల చొప్పున తిరిగి అందజేయాలి. ఇందుకు ప్రభుత్వం మిల్లర్లకు క్వింటాల్ బాయిల్డ్ రైస్‌కు రూ.50 చొప్పున, ముడి బియ్యానికి రూ.30 చొప్పున చార్జీలు చెల్లిస్తుంది. పారాబాయిల్డ్ బియ్యమైతే గరిష్టంగా నూకలు 16 శాతం, డిస్కలర్ (రంగుమారిన) 5 శాతం, డ్యామేజ్ 4 శాతంలోపు ఉండాలి. ముడి బియ్యమైతే గరిష్టంగా నూకలు 25 శాతం, డిస్కలర్ 5, డ్యామేజ్ 5 శాతంలోపు ఉండాలి. వానాకాలం ధాన్యాన్ని ఏటా మార్చి 31 లోపు.. యాసంగి ధాన్యాన్ని సెప్టెంబర్ 31లోపు మర ఆడించి బియ్యం తిరిగివ్వాలి. కానీ మిల్లర్లు ఓ సీజన్‌కు సంబంధించిన బియ్యాన్ని మరో సీజన్లో ఇస్తున్నారు. ఈ గ్యాప్‌లోనే అక్రమాలకు పాల్పడుతున్నారు. వరంగల్, పెద్దపల్లి, కరీంనగర్, మిర్యాలగూడ, నిజామాబాద్ జిల్లాల్లో ఈ దందా భారీ స్థాయిలోనే నడుస్తోంది. ఇప్పుడు కూడా ఈ వ్యవహారం కొనసాగుతూనే ఉంది. పలు జిల్లాల్లో మిల్లర్లు గత వేసవిలో తీసుకున్న ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ బియ్యాన్ని ఇంకా సర్కారుకు ఇవ్వలేదు. అంటే ముడి ధాన్యంగానీ, బియ్యంగానీ రైస్ మిల్లులు, గోదాముల్లోనే ఉండాలి. కానీ ఆయా ప్రాంతాల్లోని రైస్ మిల్లులు, గోదాములను ‘సాక్షి’పరిశీలించగా.. ఎక్కడా సీఎంఆర్ ధాన్యంగానీ, బియ్యం నిల్వలు గానీ లేవు. అంటే మిల్లర్లు ఇప్పటికే అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్టు అర్థమవుతోంది. చాలా చోట్ల ఇదే తీరు.. ►జోగులాంబ గద్వాల జిల్లా రాజోలికి చెందిన రాములమ్మ కుటుంబానికి నెలకు 24 కిలోల రేషన్ బియ్యం వస్తుంది. ఇటీవల వచ్చిన బియ్యాన్ని జల్లెడ పడితే ఆరు కిలోలపైన నూకలు వచ్చాయి. ►ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలో నివసించే శాతల నాగమ్మ కుటుంబానికి ప్రతినెలా 35 కిలోల రేషన్ బియ్యం అందుతుంది. ఈ నెల తీసుకున్న బియ్యం చెరిగితే ఎనిమిది కిలోల దాకా నూకలు వచ్చాయి. ►మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణానికి చెందిన సర్గం మల్లమ్మ తనకు వచ్చిన 12 కిలోల బియ్యాన్ని చెరిగితే నాలుగు కిలోలకుపైగా నూకలు వచ్చాయి. ఇలాగైతే ఎలా అని ఆమె వాపోయింది. ►మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గూడూరుకు చెందిన పాలకుల లక్ష్మి రేషన్ బియ్యం తీరుపై మండిపడింది. ‘గత నెలలో వచ్చిన బియ్యం ముక్కవాసన వచ్చాయి. ఈసారి వచ్చిన బియ్యంలో నూకలే ఎక్కువగా ఉన్నాయి’అని వాపోయింది. సగం నూకలే.. అన్నం ముద్ద అవుతోంది రేషన్ షాపులో మంచి బియ్యం ఇస్తున్నారని సంతోషించినం. బియ్యం జల్లెడ పట్టి చూశాక ఉన్న సంతోషం పోయింది. సగం నూకలే ఉన్నాయి. వండిన అన్నం మెత్తగా ముద్దగా అవుతోంది. దొడ్డు బియ్యమే నయం అనిపిస్తున్నది. డీలర్‌ను అడిగితే గోదాం నుంచే బియ్యం అట్లా వస్తున్నయని చెప్తున్నడు. – స్వరూప, రేషన్ లబ్ధిదారు, చిలప్‌చెడ్, మెదక్ ఒక్కోసారి సగానికి సగం నూకలే.. 3 నెలల నుంచి బియ్యం ఒక్కో సంచిలో ఒక్కో రకం వస్తున్నాయి. ఒక్కోసారి సగానికి సగం నూకలు వస్తున్నాయి. ఈ మధ్య వస్తున్న బియ్యంలో మరీ ఎక్కువగా ఉంటున్నాయి. లబ్ధిదారులు గొడవ పడుతున్నారు. సముదాయించలేక తలపట్టుకోవాల్సి వస్తోంది. – నర్సింహులు, డీలర్, రుద్రారం, చిన్నశంకరంపేట, మెదక్ -
విజయవంతమైన ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం
సాక్షి, ఏలూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో ఘనంగా ప్రారంభమయ్యింది. ఉదయాన్నే రేషన్ పంపిణీ వాహనాల్లో బియ్యాన్ని నింపుకున్న వాలంటీర్లు, ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు. ఇప్పటి వరకు లబ్ధిదారులు రేషన్ షాప్‌కి వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి రేషన్ తీసుకోవాల్సి వచ్చేది. దీని కోసం వారు ఒక రోజు పనిని కూడా కోల్పోవాల్సి వచ్చేది. అయితే ప్రభుత్వమే ఇంటింటికి వాహనాల ద్వారా బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడంతో రేషన్ తీసుకోవడం చాలా సులభతరమైందని లబ్ధిదారులకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముందుగా కేటాయించిన సమయానికి రేషన్ నేరుగా ఇంటికే రావడంతో లబ్ధిదారుల ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. లబ్ధిదారుల కళ్లెదుటే బియ్యాన్ని కాటా వేసి, ప్రత్యేక సంచుల్లో వారికి అందిస్తున్నారు. నాణ్యమైన బియ్యం ఇంటికే రావడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. -
ఆధార్ ఉంటేనే రేషన్ బియ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు తీసుకోవాలంటే ఇక నుంచి ఆధార్ నమోదు తప్పనిసరి కానుంది. ఇప్పటివరకు రేషన్ దుకాణాల్లో ఆధార్ వివరాలు ఇవ్వని కార్డుదారులంతా వెంటనే వివరాలు సమర్పించి నిర్ధారణ చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ ఎక్స్అఫీషియో కార్యదర్శి వి.అనిల్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు బయోమెట్రిక్, ఐరిష్ నిర్ధారణల ద్వారా రేషన్ సరుకులు ఇచ్చే విధానం ఉండగా, ఇప్పుడు వాటికి తోడు ఆధార్ నమోదు కూడా తప్పనిసరి కానుంది. ఈ ఉత్తర్వుల మేరకు కార్డు సభ్యులందరూ వారి ఆధార్ వివరాలను రేషన్ డీలర్ల వద్ద సమర్పించాల్సి ఉంటుందని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. (చదవండి: 6 నుంచి ఐసెట్ ప్రవేశాలు) ఒకవేళ ఇప్పటివరకు ఆధార్ నమోదు చేసుకోని లబ్ధిదారులు ఇకపై నిత్యావసరాలు కావాలంటే ఆధార్ రిజిస్టర్ చేసుకోవాలని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వారికి సరుకులు ఇవ్వొచ్చని, లబ్ధిదారులంతా ఆధార్ వివరాలు నమోదు చేసుకునేందుకు స్థానిక యూఐడీఏఐ అధికారులతో కలసి సెంటర్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆధార్ వివరాలను కూడా బయోమెట్రిక్, ఐరిష్ నిర్ధారణల ద్వారా నమోదు చేయాలని, వీలుకాని పక్షంలో లబ్ధిదారులకు వన్‌టైం పాస్వర్డ్ (ఓటీపీ) పంపడం ద్వారా ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. బయోమెట్రిక్, ఐరిష్ విధానంలో నిర్ధారణకు వీలుకాని అంధులు, కుష్టు వ్యాధిగ్రస్తులు, అనారోగ్య సమస్యలతో మంచం పట్టిన లబ్ధిదారులకు మాత్రం ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని ఆదేశించారు. -
డిసెంబర్ నుంచి పాత విధానమే..!
ఆదిలాబాద్‌అర్బన్: కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెల్లరేషన్ కార్డుదారులకు అందించిన ఉచిత రేషన్ బియ్యం సరఫరా గడువు ముగిసింది. డిసెంబర్ 1 నుంచి జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల్లో రూపాయికి కిలో బియ్యం ఒక్కొక్కరికి ఆరుకిలోల చొప్పున అందించనున్నారు. బుధవారంలోగా డీడీలు కట్టాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉండడంతో డీలర్లందరు డీడీలు అందజేశారు. కరోనా వైరస్ దృష్ట్యా ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ సమయంలో సామాన్య, మద్యతరగతి ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు రేషన్ బియ్యాన్ని ఉచితంగా అందజేశారు. దీంతో కార్డుదారులు యూనిట్‌కు పదికిలోల చొప్పున ఎనిమిది నెలల పాటు ఉచితంగా తీసుకున్నారు. ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాల్సిన బాధ్యత డీలర్లకే అప్పగించడంతో కార్డుదారులు నేరుగా షాపుకు వెళ్లి బియ్యం తీసుకున్నారు. జిల్లాలోని 355 రేషన్ దుకాణాల ద్వారా 1,88,549 మంది కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ జరిగింది. ఒకరికి 12 కిలోల చొప్పున నాలుగు నెలలు 10కిలోల చొప్పున మరో నాలుగు నెలలు అందించారు. దీంతో ప్రతినెల జిల్లాకు 8,032 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమైంది. తెల్లరేషన్, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు అనే తేడా లేకుండా అన్నిరకాల కార్డుదారులకు ఎనిమిది నెలలు ఉచితంగా అందజేయడంతో 1,88,549 కార్డుల పరిధిలో 6 లక్షలకుపైగా లబ్ధిపొందారు. అయితే ఉచిత బియ్యాన్ని చౌక ధరల దుకాణాల ద్వారా ఈ పాస్ విధానంతో కాకుండా నేరుగా అందించారు. ఇక నుంచి పాత విధానమే తెల్లరేషన్ కార్డుదారులకు ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ బియ్యం ఇక నుంచి పాత పద్ధతి ద్వారానే పంపిణీ చేయనున్నారు. కరోనాకు ముందు ఎలా పంపిణీ జరిగిందో ఇక నుంచి అలాగే కొనసాగనుంది. రేషన్ షాపులో ఈ పాస్ విధానం ద్వారా వేలిముద్ర వేసి కిలో బియ్యానికి రూపాయి చెల్లించి యూనిట్‌కు ఆరు కిలోల చొప్పున పంపిణీ జరుగనుంది. అయితే జిల్లాలో ఇంకా కొన్ని రేషన్ షాపుల్లో ఈపాస్ విధానం అమలు కాకపోవడంతో రిజిస్టర్లో పేర్లు చూసుకొని లబ్ధిదారుల నుంచి సంతకాలు తీసుకుని బియ్యం పంపిణీ చేస్తున్నారు. సెకండ్ వేవ్ ముప్పుందా? దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆందోళనకర పరిస్థితి ఏర్పడుతోంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయా రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ సైతం నిర్వహించారు. సెకండ్ వేవ్‌ను దృష్టిలో ఉంచుకొని మరో మూడు లేదా నాలుగు నెలల పాటు రేషన్ బియ్యాన్ని ఉచితంగా అందజేసేందుకు కేంద్రం సమాలోచనలు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఐదు నెలల వరకు బియ్యాన్ని ఉచితంగా అందిస్తామని జూలై1న ప్రకటించారు. దీంతో ఈ సారి కూడా డిసెంబర్ 1 వరకు వేచిచూడాల్సిన అవసరముందని పలువురు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా పీఎం ప్రకటిస్తే ఉచిత బియ్యం లేదంటే రూపాయి కిలో బియ్యం అందనున్నాయి. -
ఏపీలో నాలుగో విడత రేషన్ పంపిణీ ప్రారంభం
సాక్షి, అమరావతి : ఏపీలో నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీ శనివారం ప్రారంభమైంది. కార్డుదారులకు మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం, కేజీ శనగలు అందజేయనున్నారు. రాష్ట్రంలోని 28, 354 రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపీణీ చేయనున్నారు. రేషన్ తీసుకునేందుకు దుకాణాల వారీగా టైం స్లాట్ కూపన్లు అందజేయనున్నారు. కాగా కార్డుదారలకు బయో మెట్రిక్ తప్పనిసరి కావడంతో రేషన్ షాప్ కౌంటర్ల వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. అయితే రేషన్ పోర్టబిలిటీ ఎక్కడ ఉంటే రేషన్ అక్కడే లభించనుంది. దీని ద్వారా మొత్తం 1,48,05,879 కుటుంబాలకు లబ్ధి కలగనుంది. ఇందులో బియ్యంకార్డు ఉన్న కుటుంబాలు 1,47,24,017 ఉండగా, కొత్తగా దరఖాస్తు చేసుకున్న పేద కుటుంబాలు 81,862 ఉన్నాయి. -
పేదలకు రూ.1,500 నగదు సాయం ఆపొద్దు
సాక్షి, హైదరాబాద్: వరుసగా మూడు నెలలు రేషన్ బియ్యం తీసుకోని తెల్ల రేషన్ కార్డు దారులకు రూ.1,500 నగదు సాయం ఆపేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. లాక్డౌన్ లాంటి కష్టకాలంలో నగదు సాయం ఎలా నిలిపేస్తారని ప్రశ్నించింది. మూడు సార్లు బియ్యం తీసుకున్న వారికే కాకుండా బియ్యం తీసుకోని వారికీ నగదు పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో వరుసగా 3 నెలలు రేషన్ బియ్యం తీసుకోని వారికి రూ.1,500 నగదు సాయం నిలిపివేత అన్యాయమంటూ హైదరాబాద్‌కు చెందిన ఎ.సృజన రాసిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి బుధవారం విచారణ చేపట్టింది. లాక్డౌన్ వేళ నిత్యావసర వస్తువుల కొనుగోలుకు తెల్ల రేషన్ కార్డు దారులకు నెలకు రూ.1,500 వంతున ఆర్థిక సాయం అందించాల్సిందేనని న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్‌ల ధర్మాసనం ఆదేశించింది. రేషన్‌కార్డుదారులకు ఇతర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చెప్పిన జవాబు పట్ల ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.ఈ ఏడాది మార్చి 20న జారీ చేసిన జీవో 45 ప్రకారం తెల్ల రేషన్ కార్డుదారులందరికీ రూ.1,500 వంతున అందజేయాలంది. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం విచారణను జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది. 8 లక్షల కార్డుల్నిఎలా రద్దు చేస్తారు.. విచారణ సందర్భంగా హైకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. ‘రాష్ట్రంలో 8 లక్షల కార్డుల్ని ఒక్కసారిగా ఎలా రద్దు చేస్తారు.. వారికి నోటీసు లేకుండా రద్దు చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. లాక్డౌన్ వేళ కార్డు లేదని బియ్యం ఇవ్వకపోయినా, నిత్యావసరాలకు నగదు పంపిణీ చేయకపోయినా ఆకలితో అలమటించే వారి సంఖ్య పెరుగుతుంది. ధనవంతులు బాగానే ఉంటారు. పేదరికంలోని వారికే దయనీయ స్థితి. కార్డుదారుల అర్హతలన్నీ చూశాకే తెల్ల కార్డుల్ని జారీ చేసినప్పుడు రద్దు చేసేప్పుడు వారి వివరణ కోరాలి కదా ’అని వ్యాఖ్యానించింది. అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. పిటిషనర్ చెబుతున్న స్థాయిలో కార్డులు రద్దు కాలేదని చెప్పారు. పూర్తి వివరాల కోసం సమయం కావాలని కోరడంతో విచారణను కోర్టు జూన్ 2కి వాయిదా పడింది. కార్డులు లేకపోయినా ఇవ్వండి లాక్డౌన్ వేళ పేదలకు రేషన్ కార్డులున్నా లేకున్నా నెలకు 12 కిలోల బియ్యాన్ని పంపిణీ చేయాలని మరో పిల్ విచారణ సందర్భంగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెల్ల కార్డు చూపిస్తేనే రేషన్ ఇస్తామని అధికారులు చెబుతున్నారని, పెద్ద ఎత్తున రద్దు చేసిన కార్డులను పునరుద్ధరించాలని అభ్యర్థిస్తూ సామాజిక కార్యకర్త ఎస్.క్యూ మసూద్ రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా పరిగణించి బుధవారం మరోసారి విచారించింది. అటవీ ప్రాంతంలోగానీ, లాక్డౌన్ అమలు ఉన్న ప్రాంతాల్లోని పేదలు, కూలీలు, వలస కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీకి విధిగా బయోమెట్రిక్ కింద వేలి ముద్రల కోసం ఒత్తిడి చేయరాదని, అది లేకుండానే నిత్యావసరాలు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
రేషన్ తీసుకోని వారికి సాయం ఎలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరుసగా మూడు నెలలు రేషన్ బియ్యం తీసుకోని వారికి రూ.1,500 సాయం నిలిపివేతపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఏప్రిల్ నెలకు సంబంధించి పూర్తిగా సాయాన్ని నిలిపివేసిన పౌర సరఫరాల శాఖ, లబ్ధిదారుల నుంచి వస్తున్న వినతుల నేపథ్యంలో పునః పరిశీలన చేయనుంది. దీనికి సంబంధించిన ఫైలును ప్రభుత్వ పరిశీలనకు పంపింది. రాష్ట్రంలో 87.54 లక్షల కుటుంబాలు ఉండగా, గడిచిన జనవరి నుంచి మూడు నెలలుగా రేషన్ తీసుకోని కుటుంబాల సంఖ్య 6 లక్షల వరకుందని పౌర సరఫరాల శాఖ గుర్తించింది. ప్రభుత్వం 12 కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేసిన ఏప్రిల్ నెలలో 79.60 లక్షల కుటుంబాలు రేషన్ తీసుకోగా, మరో 7.94 లక్షల కుటుంబాలు తీసుకోలేదు. ఇందులో గత మూడు నెలలుగా రేషన్ తీసుకోని వారూ ఉన్నారు. ఇక ఏప్రిల్‌లో రూ.1,500 సాయం కింద 79.40 లక్షల కుటుంబాలకు రూ.1,109 కోట్ల మేర ప్రభుత్వం పంపిణీ చేసింది. మరికొందరికి పోస్టాఫీసుల ద్వారా సాయం అందించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కుటుంబాలన్నీ పోనూ మరో 6 లక్షల కుటుంబాలు పూర్తిగా రేషన్ తీసుకోని కుటుంబాలే ఉన్నాయి. ఈ కుటుంబాలకు రూ.1,500 ఇవ్వరాదని నిర్ణయించి, పంపిణీ నిలిపివేశారు. అయితే సాయం అందని కుటుంబాల నుంచి పౌరసరఫరాల శాఖకు విపరీతంగా వినతులు పెరిగాయి. రేషన్ బియ్యం తీసుకోని కారణంగా ప్రభుత్వం సాయం నిలిపివేయరాదని వారు కోరుతున్నారు. దీంతో పౌర సరఫరాల శాఖ ఇదే విషయాన్ని ప్రభుత్వానికి విన్నవించింది. సాయం నిలిపివేసిన లబ్ధిదారుల విషయంలో ఎలా స్పందించాలో తెలపాలని కోరింది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని శాఖ వర్గాలు వెల్లడించాయి. చదవండి: విమానాల్లో ఇక దూరం దూరం -
ఏపీలో ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌తో పేద ప్రజలు ఇబ్బంది పడకుండా వారిని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ముందుకొచ్చింది. ఇప్పటికే రెండు విడతల ఉచిత రేషన్ సరుకులను పంపిణీ చేయగా బుధవారం అన్ని జిల్లాల్లో మూడో విడత కింద ఉచిత రేషన్ సరుకుల పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం కార్డు ఉన్న 1,47,24,017 కుటుంబాలు లబ్ది పొందనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 43,685 రేషన్ దుకాణాల కౌంటర్ల ద్వారా సరుకుల పంపిణీ జరుగుతోంది. ఉదయం 6 గంటల నుంచి సరుకులు పంపిణీ చేస్తున్నారు. (చదువే ఆస్తి.. నాదే పూచీ) కృష్ణా: జిల్లాలో మూడో విడత ఉచిత రేషన్ పంపిణీ ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైంది. జిల్లాలో 2300 రేషన్ షాపుల ద్వారా పంపిణీ జరుగుతోంది. బియ్యం కార్డుదారులకు మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం, కేజీ కందిపప్పు అందిస్తున్నారు. కేంద్రప్రభుత్వ నిబంధనలతో కార్డుదారుల బయో మెట్రిక్ తప్పనిసరి చేశారు. రేషన్ షాప్ కౌంటర్ల వద్ద అందుబాటులో శానిటైజర్లు ఉంచారు. సరుకులు తీసుకునే ముందు, ఆ తరువాత కూడా శానిటైజ్ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. భౌతిక దూరంను పాటిస్తూ రేషన్ తీసుకునేందుకు టైం స్లాట్ కూపన్లు అందజేస్తున్నారు. చిత్తూరు: జిల్లాలో మూడో విడత కింద ఉచిత రేషన్ సరుకులను పంపిణీ ఉదయం నుంచి మొదలైంది. తెల్ల రేషన్ కార్డు దారులకు బియ్యం, కందిపప్పును అందిస్తున్నారు. ఇక జిల్లాలో మొత్తం 299 రేషన్ షాపుల వద్ద బియ్యం, కంది పప్పు పంపిణీ చేస్తుస్తున్నారు. రేషన్ షాపుల వద్ద భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే సానిటీజర్లను అందుబాటులో ఉంచారు. కరోనా వల్ల కష్టకాలంలో ఉన్న తమను సీఎం జగన్మోహన్రెడ్డి ఆదుకొంటున్నారని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు: జిల్లాలో మూడో విడత రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమం మొదలైంది. వాలంటీర్లు ద్వారా రేషన్ పంపిణీ, రేషన్ దుకాణాల వద్ద మాస్క్‌ల పంపిణీ జరుగుతోంది. అధికారులు రేషన్ దుకాణం వద్ద భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. విశాఖపట్నం: జిల్లాలో మూడో విడత రేషన్ పంపిణీ ప్రారంభించి, తెల్ల రేషన్ కార్డుదారులకు బియ్యం, కందిపప్పును అందిస్తున్నారు. అలాగే రేషన్ షాపుల వద్ద డీలర్లు సానిటీజర్లను అందుబాటులో ఉంచారు. పశ్చిమ గోదావరి: జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి మూడోవిడత ఉచిత రేషణ్ పంపిణీ కార్యక్రమాన్ని డీలర్లు మొదలుపెట్టారు. జిల్లాలోని అర్హత కలిగిన 12.48 లక్షల కుటుంబాలకు సరుకులను అందజేయనున్నారు. ప్రతి రేషణ్ డిపో వద్ద భౌతిక దూరం ఉండేట్లు వాలంటీర్లు చర్యలు తీసుకుంటున్నారు. ఏలూరులోని ఉచిత రేషణ్ పంపిణీ కార్యక్రమాని జిల్లా కలెక్టర్ రమాణారెడ్డి పరిశీలించారు. కర్నూలు: జిల్లాలో మూడోవ విడత బియ్యం, కందిపప్పు పంపిణీ ప్రారంభమైంది. జిల్లాలోని 2436 రేషన్ షాపుల్లో 11.91 లక్షల కార్డుదారులకు బియ్యం పంపిణీ జరగనుంది. సామాజిక దూరం పాటించి బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రేషన్ డీలర్లు నిర్వహిస్తున్నారు. -
అవి ఫోర్టిఫైడ్ రైస్ బాబూ...!
సాక్షి, బొబ్బిలి: అంగన్వాడీ పిల్లలు, మధ్యాహ్న భోజన విద్యార్థులకోసం ఇంటింటికీ అందజేస్తున్న బియ్యంలో ఫోర్టిఫైడ్‌రైస్‌ను చూసి ప్లాస్టిక్ బియ్యం అందజేస్తున్నారంటూ దుష్ప్రచారానికి దిగి వాస్తవాన్ని అధికారులు చెప్పగా కంగుతిన్న తెలుగుతమ్ముళ్ల ఉదంతమిది. ప్రతి చిన్న అవకాశాన్నీ ప్రభుత్వంపై బురద జల్లడానికి చేసే ప్రయత్నానికిది ఓ చక్కని ఉదాహరణ. ప్రజలకు బలవర్ధకమైన ఆహారం అందివ్వాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ చిన్నారులు, మధ్యాహ్న భోజనం చేసే విద్యార్థులకు అందించే బియ్యంలోనూ, రేషన్ బియ్యంలోనూ ఫోర్ట్‌ఫైడ్ రైస్ కలిపి ఇవ్వాలని సర్కారు యోచించింది ఇందుకు జిల్లాలో బొబ్బిలి నియోజవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. నియోజకవర్గంలో బొబ్బిలి, బాడంగి, రామభద్రపురం, తెర్లాం మండలాల్లోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు, పాఠశాలల్లో మధ్యా హ్న భోజనానికి పూర్తిస్థాయిలో ఫోర్టిఫైడ్ రైస్‌ను, రేషన్ బియ్యంలో ప్రతీ క్వింటాలులో ఒక కిలో ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ చేసింది. ఈ విషయం తెలీని టీడీపీ నాయకులు ఓ పథకం ప్రకారం ప్రభుత్వం ప్టాస్టిక్ బియ్యం పంపిణీ చేసిందని మండలంలోని మెట్టవలసలో బుధవారం దుష్ప్రచారం చేయడానికి యత్నించి అడ్డంగా బుక్కయ్యారు. తమకు అనుకూలంగా ఉన్న మీడియాను పిలిచి హడావుడి చేశా రు. దీంతో స్థానికంగా ఉన్న వైఎస్సార్సీపీ అభిమాని, సీనియర్ సిటిజన్ అడబాల కృష్ణారావు సాక్షికి సమాచారం అందించడంతో విచారణ చేస్తే తమ్ముళ్ల అవగాహన లేమి బయటపడింది. ఫోర్టిఫైడ్ రైస్ అంటే...? శ్రేష్టమైన ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు బియ్యానికి అదనంగా చేర్చడాన్ని రైస్ ఫోర్టిఫికేషన్ అంటారు. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్–బి12 వంటి కీలక సూక్ష్మ పోషకాలను బియ్యంలో అదనంగా చేర్చి పోషకాహార లోపాన్ని అధిగమించే యత్నం ప్రభుత్వం చేస్తోంది. దేశంలో 65 శాతం మందికి బియ్యమే ప్రధాన ఆహారం. 80కోట్ల జనాభాకు చేరువయ్యే అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, రేషన్ డిపోలద్వారా ప్రభుత్వం అందించి ఎప్పటిలాగే మంచి భోజనం పౌష్టికాహారంతో తినాలనే లక్ష్యంతో ఫోర్టిఫైడ్ రైస్‌ను పంపిణీ చేస్తున్నారు. అవగాహన లోపంతో దుష్ప్రచారం టీడీపీ నాయకులు, జనసేనకు చెందిన ఓ వ్యక్తి తమకు అనుకూలంగా ఉన్న మీడియా ద్వారా ప్రభు త్వం ప్లాíస్టిక్ రైస్ అందించిందని ఆధారం లేకుండా దుష్ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు. దీనిపై సీఎస్‌డీటీ గౌరీశంకరరావు, తహసీల్దార్ సీహెచ్.లక్ష్మణరావు అప్రమత్తమై అసలు విషయాన్ని గ్రామస్తులకు, నాయకులకు తెలిపారు. ప్రభుత్వం ఈ నెలనుంచి ఫోర్టిఫైడ్ రైస్ అంగన్వాడీలకు, మధ్యాహ్న భోజనానికి పూర్తిస్థాయిలో అందించిందని, రేషన్ డిపోలలో ప్రతీ క్వింటాలుకు కిలో ఫోరి్టఫైడ్ రైస్ కలిపి అందిస్తోందని వివరించారు. దీనిపై ఎవరి దు్రష్పచారాలు ప్రజలు నమ్మవద్దని వివరించారు. లేనిపోని వదంతులు సృష్టించారు ప్రభుత్వం బలవర్థక బియ్యం అందిస్తే కొందరు దీనిపై ప్లాస్టిక్ బియ్యమని దుష్ప్రచారం ప్రారంభించారు. వెంటనే మేం అప్రమత్తమై వాస్తవాలు తెలుసుకోవాలని మా మీడియాకు సమాచారం అందించాం. ఫోరి్టఫైడ్ రైస్ పంపిణీపై అధికారులు వివరించారు. – అడబాల కృష్ణారావు, సీనియర్ సిటిజన్, మెట్టవలస బలవర్థక బియ్యం బొబ్బిలి నియోజక వర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఫోర్టిఫైడ్ రైస్‌ను అందిస్తు న్నాం. విద్యార్థులకు, చిన్నారులకు పూర్తిస్థాయిలో అందిస్తూ, రేషన్ డిపోలలో మిక్సింగ్ ద్వారా పంపిణీ చేస్తున్నాం. వీటిలో ఐరన్, విటమిన్లు, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఎలాంటి అపోహ పడవద్దు. ఎలాంటి వదంతులు నమ్మవద్దు. – సీహెచ్.లక్ష్మణప్రసాద్, తహసీల్దార్, బొబ్బిలి -
పేదలకు అండగా నిలిచిన ఏపీ ప్రభుత్వం
-
ఏపీలో రెండో విడత రేషన్ పంపిణీ
-
రేషన్ కోసం తొందర వద్దు
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా జిల్లాలోని 12.45 లక్షల మంది రేషన్ కార్డుదారులకూ సరుకులు అందుతాయని జాయింట్ కలెక్టరు ఎల్.శివశంకర్ భరోసా ఇచ్చారు. బియ్యం, కందిపప్పు ఉచితంగా ఇస్తున్నందున తమకు అందవనే ఆందోళనను కార్డుదారులు వీడాలని కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి చేపట్టిన చర్యల్లో భాగంగా రోజుకు వంద నుంచి 150 కార్డుదారులకు మాత్రమే రేషన్ ఇచ్చేలా ప్రతి రేషన్ డిపో వద్ద డీలర్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒకటో తేదీ నుంచి ప్రారంభించాల్సిన రేషన్ సరుకుల పంపిణీని లాక్డౌన్ దృష్ట్యా ఈనెల 29వ తేదీ నుంచే ప్రారంభించినట్లు చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలన్నారు. ఇందుకోసం ప్రతి రోజూ ఒక్కో డిపో వద్ద వంద నుంచి 150 మందికి మాత్రమే రేషన్ సరుకులు ఇచ్చేలా డీలర్లు, సంబంధిత వార్డు సచి వాలయంలోని వలంటీర్లు ఏర్పాట్లు చేస్తారని చెప్పారు. ప్రతి రోజు ఉదయం 6 నుంచి 11 గంటల మధ్యకాలంలో ఎవరెవరు ఏ సమయంలో డిపోకు రావాలో వారు చెబుతారని, లబ్ధిదారులు వారికి సహకరించాలని కోరారు. ఏప్రిల్ 15వ తేదీ వరకూ సరుకుల పంపిణీ కొనసాగుతుందన్నారు. ఏ ప్రాంతం వారైనా పోర్లబులిటీ సౌకర్యం ద్వారా తమకు అందుబాటులో ఉన్న డిపో నుంచి సరుకులు తీసుకోవచ్చన్నారు. అక్కయ్యపాలెం/సీతమ్మధార (విశాఖ ఉత్తర) : రేషన్ డిపోల వద్ద సామాజిక దూరం పాటించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్.శివశంకర్ అన్నారు. నగరంలోని 25, 26, 43, 44 వార్డుల్లో రేషన్ షాపుల్లో జరుతున్న రేషన్ పంపిణీని పరిశీలించారు. సీతంపేట, అక్కయ్యపాలెం ప్రాంతాలలో రేషన్ షాపులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సరఫరా అధికారి నిర్మలాభాయి, అర్బన్ తహసీల్దార్ ఎ.జ్ఞానవేణి , వైఎస్సార్ సీపీ నమన్వయకర్త కె.కె.రాజు, పార్టీ నాయకురాలు పెద్దిశెట్టి ఉషశ్రీ పాల్గొన్నారు. అలాగే 24వ వార్డు గాంధీనగర్ 565 వార్డుల్లో రేషన్ షాప్‌ను జేసీ శివశంకర్ పరిశీలించారు. అందరికీ రేషన్ సరకులు భీమునిపట్నం: రేషన్ సరకుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైఎ స్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి ముత్తంశెట్టి మహేష్ అన్నారు. సోమవారం ఆయన భీమి లిలో రేషన్ సరకుల పంపిణీని పరిశీలించారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని కోరారు. ఒకేసారి ఎక్కువ మంది రాకుండా టోకెన్లు అందించాలని సూచించారు. -
5 కిలోల ఉచిత బియ్యం
-
విశాఖలో రేషన్ డిపోల్లో సరుకుల సరఫరా
-
రేపటి నుంచి రేషన్ బియ్యం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ప్రకటించిన 12 కిలోల రేషన్ బియ్యాన్ని గురువారం నుంచి లబ్ధిదారులకు అందించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 1.57 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని చౌక ధరల దుకాణాలకు సరఫరా చేయగా, మరో 1.60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇప్పటికే సరఫరా మొదలుపెట్టారు. ఈ ప్రక్రియ బుధ, గురువారం సైతం కొనసాగనుంది. గురువారం నుంచి గ్రామాల్లో సరఫరా చేసిన బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. అయితే చౌక ధరల దుకాణాల వద్ద ఇబ్బంది రాకుండా, జనాలు ఎగబడకుండా చర్యలు తీసుకోనున్నారు. గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా టోకెన్లు జారీ చేసి రేషన్ సరఫరా చేయనున్నారు. టోకెన్‌లో పేర్కొన్న తేదీనే లబ్ధిదారులు రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బాధ్యతను గ్రామాల కార్యదర్శులు, మున్సిపల్ శాఖ అధికారులు తీసుకోనున్నారు. ఇక రాష్ట్రంలోని 87.59 లక్షల రేషన్ కుటుంబాల వారికి నిత్యావసర సరుకుల కొనుగోళ్లకై రూ.1,500 లబ్ధిదారుల ఖాతాల్లోనే వేయనున్నారు. దీనికి సంబంధించి లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను ఇప్పటికే పౌర సరఫరాల శాఖ ఆరంభించింది. నా లుగైదు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తికానుంది. ఆధార్ అధికారులతో సమన్వయం చేసుకుం టూ బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నారు. ఈ–కుబేర్ యాప్‌ను వాడనున్నారు. -
బియ్యం సరఫరాపై చర్చ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం లాక్డౌన్ అయిన నేపథ్యంలో తెల్లకార్డు దారులకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన అమలుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. దీన్ని పాత రేషన్ విధానం ద్వారానే పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా ఉన్న చౌక ధరల దుకాణాల నుంచే లబ్ధిదారులకు ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఉచితంగా ఇచ్చేలా కసరత్తు చేస్తోంది. చౌక ధరల దుకాణాల వద్ద సామాజిక దూరం పాటిస్తూ ఎలా సరఫరా చేయాలన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. లబ్ధిదారులకు రూ.1,500 ఆర్థిక సాయం ఎలా అందించాలన్న దానిపై కూడా అధికారులు చర్చలు జరుపుతున్నారు. కాగా రాష్ట్రంలోని 87.59 లక్షల రేషన్ కార్డు కుటుంబాల్లోని ప్రతి కార్డుదారుకు 12 కిలోల బియ్యం ఉచితంగా సరఫరా చేస్తామని ఆదివారం సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. దానికోసం ఏకంగా 3.58 లక్షల టన్నుల బియ్యాన్ని సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ బియ్యాన్ని జిల్లా కేంద్రాల నుంచి స్థానిక రేషన్ దుకాణాలకు రవాణా చేయించడం, అక్కడి నుంచి లబ్ధిదారులకు పంపిణీ వంటి అంశాలపై సోమవారం సంస్థ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు అధికారులతో సమీక్ష జరిపారు. రవాణా వాహనాలను పెంచి బియ్యం రవాణాను త్వరితగతిన చేపట్టాలని నిర్ణయిం చారు.ఆ దిశగా రవాణా వాహనాల కాంట్రాక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఇక ఈ నిల్వలను స్థానికంగా అందుబాటులో ఉండే పాఠశాల ప్రాంగణాల్లోనూ, లేదా అక్కడ సమకూరిన గిడ్డంగులలోనూ పంపిణీకి అనుకూలంగా నిల్వచేసుకోవాలని పేర్కొన్నారు. మంగళవారం నుంచే బియ్యం రవాణా మొదలుకానుంది. రేషన్ దుకాణాల వద్ద జనం సామాజిక దూరం పాటించేలా ఏ రోజు, ఎంతమందికి, ఏ సమయంలో ఇవ్వాలన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.ఒక రోజులో సగం మందికి, మిగతా రోజు మిగిలిన వారికివ్వడమా? లేక ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రాలుగా విడగొట్టి ఆ సమయంలోనే రేషన్ తీసుకునేలా విభజన చేయడమా? అన్నదానిపై చర్చిస్తున్నారు. దీనిపై మంగళవారం స్పష్టత వస్తుందని పౌర సరఫరాల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆధార్ వివరాల ఆధారంగా.. ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.1,500 ఆర్థిక సాయం అందించేందుకు కూడా పౌరసరఫరాల కమిషనర్ సత్యనారాయణ రెడ్డి చర్యలు ప్రారంభించారు. ఈ అంశంపై రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో ఆయన చర్చలు జరిపారు. నగదును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా పంపించేం దుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు ఆధార్ వివరాలతో అనుసంధానం చేసుకొని నగదును బదిలీ చేయాలని యోచిస్తున్నారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ధరల నియంత్రణకు కమిటీలు.. ఇక నిత్యావసర ధరలను వ్యాపారులు ఇష్టారీతిన పెంచేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేయాలని శాఖ నిర్ణయించింది. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఈ కమిటీలు ధరల నియంత్రణకు చర్యలు తీసుకునేలా ఆదేశాలిచ్చారు. -
30 గోడౌన్లలో బియ్యం ప్యాకింగ్ యంత్రాలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వం ఏప్రిల్ నుంచి నాణ్యమైన బియ్యాన్ని వలంటీర్ల ద్వారా రేషన్ కార్డుదారుల ఇళ్లకే పంపిణీ చేయనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మొదటి విడతగా 30 గోడౌన్లలో బియ్యం ప్యాకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నిర్ణయించింది. తూకాల్లో మోసాలకు తావు లేకుండా 5, 10, 15, 20 కిలోల బ్యాగుల్లో బియ్యం ఇచ్చేందుకు వీలుగా అవసరమైన ప్యాకింగ్ యంత్రాలను ఏర్పాటు చేయనుంది. ప్యాకింగ్ ఏజెన్సీల కోసం ఇప్పటికే టెండర్లను ఆహ్వానించింది. గత ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన బియ్యాన్ని తినలేక ప్రజలు బహిరంగ మార్కెట్లో అమ్ముకునేవారు. దీంతో నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేస్తే ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వంపై అదనపు భారం పడుతున్నప్పటికీ ఏప్రిల్ నుంచి రాష్ట్రమంతటా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు పంపిణీ చేసిన బియ్యంలో నూకలు 25 శాతం ఉండేవి. ప్రస్తుతం దీన్ని 15 శాతానికి తగ్గించనున్నారు. అలాగే 3 శాతం ఉండే డ్యామేజీ, రంగు మారిన బియ్యాన్ని 0.75 శాతానికి పరిమితం చేయనున్నారు. గతంలో 5 శాతం ఉన్న షాకీగ్రేన్ ఒక్క శాతం మించకూడదని సీఎం అధికారులను ఆదేశించారు. ప్యాకింగ్ మిషన్ల ఏర్పాటు కోసం ఈ నెల 23న టెండర్లు ఖరారు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
బియ్యం ‘నో స్టాక్...!
సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వ చౌక ధరల దుకాణాల్లో ‘పేదల బియ్యానికి’ కొరత ఏర్పడింది. అక్టోబర్ కోటా గడువు చివరి రోజైన మంగళవారం రేషన్ దుకాణాల ఎదుట ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిచ్చాయి. ఒక వైపు అదనపు కోటా కేటాయింపు లేకుండానే రేషన్ పోర్టబిలిటీ లావాదేవీలు.. మరోవైపు పూర్తి స్థాయి కోటాను డీలర్లు లిఫ్ట్ చేయకపోవడం పేదల పాలిట శాపంగా మారింది. ఫలితంగా గడువు చివరి రోజుల్లో పేదలకు బియ్యం అందని దాక్ష్రగా మారింది. హైదరాబాద్ నగరంలో స్టేట్, జిల్లా పోర్టబిలిటీ తోపాటు నేషనల్ పోర్టబిలిటీ సైతం ప్రయోగాత్మకంగా అమలవుతోంది. దీనికి తగినట్లుగా అదనపు కోటా కేటాయించకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో ప్రభుత్వ చౌక ధరల దుకాణాలపై తీవ్ర ప్రభావం పడుతున్నట్లు సమాచారం. దీనిపై ఫిర్యాదులు అందుతున్నా సంబంధిత అధికారగణం పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినవస్తున్నాయి. ఇదీ పరిస్థితి.. హైదరాబాద్ జిల్లా పరిధిలో అక్టోబర్ నెలకు గాను మొత్తం 1,37,75,936 కిలోల బియ్యం కోటా అవసరం కాగా పౌరసరఫరాల శాఖ 1,25,78,130 కిలోల బియ్యాన్ని కేటాయించింది. అందులో ఏఎఫ్ఎస్సీ కింద 10,62,390 కిలోలకు గాను 9,23,978 కిలోలు, ఎఫ్ఎస్సీ కింద 1,26,99,816 కిలోలకు గాను 1,16,44,110 కిలోలు, ఏఏపీ కింద 13,730 కిలోలకు గాను 10,042 కిలోలు కేటాయించారు. బియ్యం కోటాకు సంబంధించి సుమారు 1630 ఆర్వోలను విడుదల చేసింది. అందులో 1319 ఆర్వోలకు సంబంధించిన సరుకులు మాత్రమే డీలర్లు లిఫ్ట్ చేశారు. మిగిలిన 311 ఆర్వోలకు సంబంధించిన బియ్యం నిల్వలు లిఫ్ట్ చేయలేదని అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవంగా ఎంఎల్ఎస్ పాయింట్లో సుమారు 3,744,57 క్వింటాళ్ల బియ్యం నిల్వ ఉండగా, ప్రధాన గోదాంలో బియ్యం నిల్వలు లేకుండా పోయాయి. కార్డులు ఇలా.. హైదరాబాద్ పౌరసరఫరాల శాఖ పరిధిలో సుమారు 5,86,107 ఆహార భద్రత (రేషన్) కార్డులు ఉండగా, అందులో 21,94,444 మంది లబ్దిదారులు ఉన్నారు. మొత్తం కార్డుల్లో 30,271 ఏఎఫ్ఎస్సీ కార్డులు అందులో 80,344 యూనిట్లు, ఎఫ్ఎస్సీ కింద 5,54,520 కార్డులు అందులో 21,12,728 లబ్ధిదారులు, ఏఏపీ కింద 1316 కార్డులు అందులో 1372 యూనిట్లు ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సరుకుల డ్రా ఇలా. ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా అక్టోబర్ కోటా డ్రా లబ్ధిదారులకు చుక్కలు చూపించింది. సుమారు 20 శాతం లబ్ధి కుటుంబాలు సరుకులను డ్రా చేయలేక పోయారు. చౌకధరల దుకాణాల ద్వారా ప్రతి నెల 1 నుంచి 15 వరకు నెలసరి కోటా పంపిణీ జరుగుతుంది. మొత్తం 7,06,146 లావాదేవీలు జరుగగా అందులో సరుకుల డ్రాకు చివరి రోజైన మంళవారం 13,792 లావాదేవీల ద్వారా సరుకుల డ్రా జరిగినట్లు ఆన్లైన్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవంగా రేషన్ పోర్టబిలిటీ పేదల బియ్యం కోటాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లా పోర్ట్టబిలిటీ కింద 2,12,912 లావాదేవీలు జరగగా, అం దులో చివరిరోజు 7,577 లావాదేవీలు జరిగాయి. రాష్ట్ర పోర్టబిలిటీ కింద మొత్తం 56,884 లావాదేవీలు, అందులో చివరి రోజు 1380 లావాదేవీలు జరిగినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే తమకు కేటాయించిన దుకాణాల్లో మొత్తం 4,36,360 కార్డుదారులు సరుకులు డ్రా చేసుకున్నారు. అందులో చివరి రోజైన మంగళవారం 4,835 మంది సరుకులు డ్రా చేసుకున్నట్లు ఆన్లైన్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పూర్తిస్థాయిలో బియ్యం లిఫ్ట్ చేయలేదు అక్టోబర్ మాసానికి అవసరమైన రేషన్ కోటాను కేటాయించడం జరిగింది. డీలర్ల వారీగా ఆర్వోలను సైతం విడుదల చేశాం, అయితే సుమారు 20 శాతం వరకు డీలర్లు తమ కోటా పూర్తి స్థాయిలో లిఫ్ట్ చేసుకోలేక పోయారు. మరోవైపు పొర్టబిలిటీ విధానం కూడా కొంత వరకు ప్రభావం చూపింది. – తనూజ, డీఏం. హైదరాబాద్ -
‘రూపాయి’పై రాబందుల కన్ను
సాక్షి, వరంగల్ : మహారాష్ట్ర గొండియా సమీపంలోని ఓ రైసుమిల్లుకు తరలిస్తున్న 184 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఈనెల 5న కమలాపూర్ మండలం వంగపల్లి శివారులో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, పౌరసరఫరాలశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్‌కు చెందిన ఓ రేషన్ బియ్యం డాన్.. బినామీ పేరిట మహారాష్ట్రలో మిల్లు నడుపుతున్నాడు. ఆ మిల్లుకే బియ్యం పంపిస్తుండగా పట్టుకున్నారు. అయితే, ఆ డాన్ చేసే దందా మొత్తం రెండు రాష్ట్రాల అధికారులకు తెలిసినా పట్టించుకోకుండా.. అప్పుడప్పుడు ఇలా సీజ్ చేస్తున్నారని చెబుతున్నారు. సరిగ్గా నెల క్రితం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం తిరుమలాపూర్ గ్రామ శివారు రాంచంద్రాపూర్ జడల్పేట గ్రామాల మధ్య అక్రమంగా తరలిస్తున్న 278 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నర్సంపేట, పరకాలకు చెందిన కొందరు సిండికేట్‌గా మారి దళారుల నుంచి ఈ బియ్యాన్ని సేకరించినట్లు తేలింది. ఈ బియ్యం కూడా మహారాష్ట్రలోని సదరు మిల్లుకే వెళ్తున్నట్లు వెల్లడైంది. ఇలా వరంగల్ ఉమ్మడి జిల్లాలో 10 రోజుల వ్యవధిలో 1,425 క్వింటాళ్ల రేషన్ బియ్యం వివిధ ప్రభుత్వశాఖల అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని హుజూరాబాద్, ఎల్కతుర్తి, కమలాపూర్, పరకాల, హన్మకొండ, నర్సంపేట కేంద్రాలుగా... వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తున్న దళారులు రూ.లక్షలు గడిస్తున్నారు. కరీంనగర్‌కు చెందిన ఓ వ్యాపారి మహారాష్ట్రలో బినామీ పేరుతో ఏర్పాటు చేసిన రైసుమిల్లుకు ఈ బియ్యం తరలిస్తున్నారు. అటు మహారాష్ట్ర, ఇటు వరంగల్, కరీంనగర్ జిల్లాల అధికారులకు ఇదంతా తెలిసినా.. మొక్కుబడి దాడులతో ‘మమ’ అనిపిస్తుండడంతో దందా యథేచ్ఛగా సాగుతుండగా.. మరో పక్క అధికారులకు కాసులు కురిపిస్తోంది. బియ్యానికి పాలిష్ పెట్టి... బహిరంగ మార్కెట్లో కిలో బియ్యం ధర రూ.35 నుంచి రూ.48 వరకు పలుకుతుండటంతో రేషన్ బియ్యానికి గిరాకీ పెరుగుతోంది. సంచులు మార్చి.. పాలిష్ పెడుతున్న దళారులు ఎల్లలు దాటిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దులోని ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల చివరి గ్రామాల అడ్డాలుగా కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన ద్వారా మహారాష్ట్రలోని గొండియాకు తరలిస్తున్నారు. ఇలా గొండియాకు తరలిస్తున్న రెండు లారీల(400 క్వింటాళ్లు) రేషన్ బియ్యాన్ని పట్టుకున్న సంఘటన మరచిపోకముందే ఈ నెల 5న కమలాపూర్ మండలం వంగపల్లి శివారులో రూ.16.15 లక్షల విలువైన 184 క్వింటాళ్ల బియ్యాన్ని విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యం కూడా సైతం గతంలో రెండు లారీల బియ్యం తరలింపు కేసులో నిందితుడుగా ఉన్న హుజూరాబాద్‌కు చెందిన సాయిల్ల రాజు, ఆయన అనుచరులకు చెందినవిగా గుర్తించారు. జమ్మికుంట మండలం ఇల్లంతకుంట నుంచి పంగిడిపల్లి, వంగపల్లి ద్వారా భూపాలపల్లి, కాళేశ్వరం వంతెన మీదుగా మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతకు ముందు వరంగల్ నుంచి మహారాష్ట్రకు లారీ(సీజీ 04 జేసీ 0996)లో 200 క్వింటాళ్ల బియ్యం తరలిస్తుండగా మహదేవపూర్ మండలం కుదురుపల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు. అప్పట్లో వ్యాపారి సాదుల నవీన్, అతని గుమస్తా సదానందం, లారీ డ్రైవర్ భూపేంద్ర కుమార్‌పై కేసులు నమోదయ్యాయి. ఇక వరంగల్, కరీంనగర్ జిల్లాల సరిహద్దులో మరో 50 క్వింటాళ్ల బియ్యాన్ని భూపాలపల్లి జిల్లా అధికారులు పట్టుకోగా, హుజూరాబాద్ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న లారీ, 400 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో బాగోతం బయటపడింది. ఈ వ్యవహారంలోనూ సాయిళ్ల రాజుతో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. తాజాగా 184 క్వింటాళ్ల బియ్యం పట్టుబడగా, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి మహారాష్ట్రకు బియ్యం తరలింపు దందా నిత్యకృత్యంగా సాగుతున్నట్లు తేలింది. ఇలా బియ్యాన్ని తరలించే క్రమంలో హుజూరాబాద్, పరకాల నుంచి కాళేశ్వరం వంతెన మీదుగా మహారాష్ట్ర వరకు ఉండే ప్రతీ పోలీసుస్టేషన్, రెవెన్యూ, రవాణా, వాణిజ్య పన్నుల శాఖల అధికారులకు కొందరు లెక్క ప్రకారం నెల నెల మామూళ్లు ఇస్తున్నట్లు వ్యాపారులే ప్రచారం చేస్తున్నారు. కాగా, బియ్యం పట్టుబడిన సమయంలో కేవలం 6ఏ కేసులతో సరిపుచ్చుతున్న అధికారులు.. పదే పదే దొరుకుతున్న సదరు వ్యాపారులపై ‘పీడీ’ అస్త్రం ప్రయోగించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మరో మోసానికి తెరతీసే యత్నం రెండు, మూడు రోజుల్లో ఖరీఫ్ ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే పనిలో ప్రభుత్వం ఉంది. ఈ ఖరీఫ్ కొనుగోళ్లకు ముందే ‘రేషన్ బియ్యం’ సూత్రధారి మరో మోసానికి తెరతీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మహారాష్ట్రలో బినామీల పేరిట మిల్లులు నడుపుతున్న సదరు వ్యాపారి ఇక్కడ దళారుల నుంచి క్వింటాకు రూ.1500 నుంచి రూ.1600 చొప్పున చెల్లించి కొనుగోలు చేశాక మహారాష్ట్ర ప్రభుత్వానికి క్వింటాల్‌కు రూ.2100 చొప్పున ముందస్తు లెవీగా ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. దీని ద్వారా ఒక్కో క్వింటాల్‌పై రూ.500 నుంచి రూ.600 వరకు లబ్ధి జరుగుతుంది. ఇలా రోజుకు ఒక్కో లారీ(200 క్విం టాళ్లపై) రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల వరకు అక్రమంగా సంపాదిస్తున్నారు. కాగా, రైసు మి ల్లు ద్వారా చెల్లించే ఒక ఏ.సీ.కే.(270 క్వింటాళ్లు) బియ్యం కింద మహారాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన 400 క్వింటాళ్ల ధాన్యాన్ని తిరిగి ఇస్తుంది. అంటే తొలుత 270 క్వింటాళ్లపై రూ.1,35,000 నుంచి రూ. 1,62,000 వరకు సంపాదించిన వ్యాపారులు ప్రభుత్వం ఇచ్చే 400 క్వింటాళ్ల ధాన్యాన్ని క్వింటాకు రూ.1,800 చొప్పున విక్రయించి రూ.7.20 లక్షల వరకు సంపాదించనున్నారు. ఇలా చేయడం ద్వారా నెలలో కనీసం 15 నుంచి 20 ఏ.సీ.కే.ల టర్నోవర్ చేస్తున్న సదరు వ్యాపారులు రూ.22 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు గడించే ఎత్తుగడతో ముందుకెళ్తుండగా.. కొన్నిచోట్ల బియ్యం పట్టుబడిన క్రమంలో వారి పన్నాగం బయటపడుతోంది. -
బయటపడిన బియ్యం బాగోతం
సాక్షి, లక్కిరెడ్డిపల్లె(కడప) : చౌక బియ్యంలో కొందరు వ్యక్తులు చేస్తున్న దోపీడీని సాక్షి బహిర్గం చేసింది. లక్కిరెడ్డిపల్లె..రామాపురం..గాలివీడు మండలాల్లోని స్కూళ్ల వసతి గృహాలకు లక్కిరెడ్డిపల్లె బియ్యం గోడౌన్ నుంచి ప్రభుత్వ సబ్ కాంట్రాక్టర్ నిత్యావసర సరుకులను తరలిస్తుంటారు..చిన్నమండ్యెంకు చెందిన గోడౌన్ స్టాకిస్టు వంశీకృష్ణ ఇక్కడి గోడౌన్ ఇన్చార్జ్గా ఉన్నారు. ఇక్కడ ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులను నియమించుకొని గుట్టుచప్పుడు కాకుండా ఆయన దళారులను అడ్డుపెట్టుకొని బియ్యం దందా సాగిస్తున్నారని తెలిసింది. దీనిపై సాక్షి నిఘా పెట్టింది. ప్రతి నెలా దాదాపు 200 క్వింటాళ్లు పైబడే బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నట్లు సమాచారం. సబ్ కాంట్రాక్టర్‌కు హమాలీలు కూడా తోడవుతున్నట్లు భోగట్టా. తూకాలు వేసి ఇవ్వాలని చాలా మంది డీలర్లు అడుగుతున్నా పట్టించుకోకపోవడంలేదు. దీంతో బస్తాకు 3 నుంచి 5 కేజీలు తరుగు వస్తోందని డీలర్లు వాపోతున్నారు. రెవెన్యూ అధికారులు గానీ సిబ్బంది గాని పట్టించుకోవడం లేదు. ప్రతి నెలా చౌకదుకాణాలతో పాటు వసతి గృహాలకు బియ్యం తరలింపు ప్రక్రియ చేపడుతూ మధ్య మధ్యలో కొంత బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున 182 బస్తాల చౌక బియ్యాన్ని ఇదే విధంగాబ్లాక్ మార్కెట్‌కు తరలించేందకు ప్రయత్నం చేశారు. బియ్యంలోడున్న వాహనం రాయచోటికి బయలుదేరినట్లు సాక్షికి సమాచారం అందింది. టెంపో వాహనాన్ని రాయచోటి మాసాపేట వద్ద సాక్షి విలేకరి అడ్డుకున్నారు. చిత్తూరు వెళుతున్నట్లు వాహన డ్రైవరు తెలిపారు. బియ్యం లోడ్‌పై పట్టను తొలగించగాగా 182 బస్తాల బియ్యం కనిపించాయి. వెంటనే డ్రైవర్ తప్పించుకునే తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అప్పటికే అక్కడున్న కొందరు మీడియాను వెంబడించి ద్విచక్రవాహనం తాళాలు,సెల్ ఫోన్లు లాక్కుని బెదిరించారు. ఈలోగా బియ్యం వాహనం ముందుకు వేగంగా కదిలిపోయింది. విషయం తెలుసుకున్న ఆర్డీఓ వెంటనే లక్కిరెడ్డిపల్లె గౌడౌన్‌ను తనిఖీ చేశారు. ఆ సమయానికి అక్కడ సిబ్బంది,సబ్ కాంట్రాక్టర్ లేరు. రికార్డులు కూడా అందుబాటులో లేవు. కడప ఆర్డీఓ మలోలాను సాక్షి సంప్రదించగా అక్రమంగా తరలిపోయిన 182 బస్తాల చౌకబియ్యం లక్కిరెడ్డిపల్లె గౌడౌన్‌కు చెందినవేనని స్పష్టం చేవారు. సీసీ పుటేజీ ఆధారంగా ఈ విషయాన్ని గుర్తించామన్నారు. సమగ్ర విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు చేపడతామన్నారు. -
రేషన్ బియ్యాన్ని నూకలుగా మార్చి..
సాక్షి, కామారెడ్డి: రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా సర్కారు ఎన్ని చర్యలు తీసుకుంటుందో.. తమ దందా కొనసాగించడానికి బియ్యం మాఫియా అంతకన్నా ఎక్కువే ప్రయత్నిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుకుతూ దర్జాగా అక్రమ దందా సాగిస్తోంది. తాజాగా అధికారుల కళ్లుగప్పేందుకు రేషన్ బియ్యాన్ని నూకలుగా మార్చి సరిహద్దులు దాటిస్తూ సొమ్ము చేసుకుంటోంది. బియ్యం స్మగ్లర్లు చట్టానికి చిక్కకుండా ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుకుతున్నారు. ముఖ్యంగా పేదలకు పంపిణీ చేసే రే షన్ బియ్యంతో సొమ్ము చేసుకోవడానికి అలవా టుపడ్డ కొందరు.. తమ దందాలో కొత్తదారులు వెతుకుతూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. రేషన్ బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు రవాణా చేయాలంటే అనేక సమస్యలు ఎదురవుతాయి. ఎక్కడో ఒక చోట లీకై లారీలకు లారీలు సీజ్ అవుతున్న నేపథ్యంలో స్మగ్లర్లు బియ్యాన్ని నూకలుగా మార్చి కొత్త దందా మొదలుపెట్టారు. వేరే రాష్ట్రాల్లో నూక క్వింటాలుకు రూ. 2 వేల నుంచి రూ. 2,200 వరకు ధర పలుకుతోంది. దీంతో వారు ఈ కొత్తదారి వెతుక్కున్నారు. నూకలుగా మార్చి.. బియ్యం మాఫియా రేషన్‌కార్డుదారులకు కిలోకు రూ. 10 నుంచి రూ. 12 చొప్పున ఇస్తూ రేషన్ బియ్యం సేకరిస్తోంది. అనంతరం రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి నూకలుగా మారుస్తున్నారు. నూకలను బస్తాల్లో నింపి ఏదో ఒక రైస్‌మిల్లు పేరుతో దర్జాగా ఇతర రాష్ట్రాలకు సర ఫరా చేస్తున్నారు. రేషన్ బియ్యం అమ్మడానికి ఎందరినో మేనేజ్ చేయాల్సి రావడం, అంత చే సినా ఎక్కడో ఒక చోట చిక్కుతుండడంతో ఏ ఇబ్బందీ లేకుండా నూక దందా మొదలుపెట్టారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నూక ఇతర రాష్ట్రాలకు తరలుతోంది. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు రాయలసీమ ప్రాంతానికి పెద్ద ఎత్తున నూకలు రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. నూకలకు సంబంధించిన అన్ని పత్రాలను వెంట తీసుకుని వెళుతుండడంతో ఎవనూ ఆపడం లేదు. చిక్కకుండా ఉండేందుకు.. రేషన్ బియ్యంతో సొమ్ము చేసుకోవడానికి అలవాటుపడ్డ కొందరు బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి అనుమానం రాకుండా ఇతర బస్తాల్లో నింపి తరలించేవారు. అయితే ఎక్కడో ఒక చోట ఆ బియ్యం తనిఖీలలో చిక్కుతుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంతో ఎవరికీ చిక్కకుండా ఉండేందుకు బియ్యాన్ని నూకలుగా మారుస్తున్నట్టు తెలుస్తోంది. రీసైక్లింగ్ సమయంలో బియ్యాన్ని నూకగా మార్చి బస్తాల్లో నింపుతున్నారు. అనంతరం రైస్‌మిల్లు వేబిల్లులపై నూకను దర్జాగా తరలిస్తున్నారు. ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి మిల్లర్లకు అప్పగిస్తోంది. వాళ్లు మరపట్టి బియ్యాన్ని ప్రభుత్వానికి ఇస్తారు. అయితే కస్టమ్ మిల్లింగ్‌కు సంబంధించి బియ్యం మరపట్టినపుడు వచ్చే నూక కొంతే అయినప్పటికీ కొన్ని మిల్లుల నుంచి పెద్ద ఎత్తున నూక ఇతర రాష్ట్రాలకు తరలివెళుతోంది. రేషన్ బియ్యాన్ని నూకగా రీ సైక్లింగ్ చేస్తుండడం వల్లే ఇది సాధ్యమవుతోందని తెలుస్తోంది. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. రైతుల నుంచి పూర్తిస్థాయిలో ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నపుడు ఆయా మిల్లులకు ఇచ్చిన ధాన్యానికి ఎంత బియ్యం వస్తుంది, అందుకు నూక ఎంత మిగులుతుందన్నదానిని అధికారులు పరిశీలించాల్సి ఉంది. ఆయా రైస్‌మిల్లుల్లో జరిగిన ధాన్యం మిల్లింగ్ ద్వారా వచ్చే నూక ఎంత? మిల్లు పేరిట వెళుతున్న నూక ఎంత? అన్నదాన్ని పరిశీలిస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశాలుంటాయి. అధికార యంత్రాంగం నూకల రవాణా విషయంలో లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. -
అక్రమ రవాణా.. ఆపై ధ్వంసం
సాక్షి, మంచిర్యాల : రైలుమార్గం ద్వారా రేషన్‌బియ్యం తరలించడం అక్రమార్కులకు వరంగా మారింది. రైల్వే పోలీసులు గానీ, టీసీ గాని ఎవరైనా అడ్డు పడితే చాలు నయానో.. బయానో ముట్టజెప్పి తమ పని యథేచ్ఛగా సాగించుకుంటున్నారు. ఇదంతా అధికంగా కాజిపేట నుంచి మహారాష్ట్రకు వెళ్లే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్, అజ్ని ప్యాసింజర్ రైళ్లలో అధికంగా జరుగుతోంది. భాగ్యనగర్ టూ మహారాష్ట్ర కాజిపేట నుంచి ప్రతిరోజూ సాయంత్రం 6గంటలకు బయలు దేరిన భాగ్యనగర్ ప్యాసింజర్ రైలు అర్ధరాత్రి 2గంటల ప్రాంతంలో వీరూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. భాగ్యనగర్ వెనకాల వచ్చే మరో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వెళ్లేందుకు ఉప్పల్, పోత్కపల్లి, ఓదెల, తదితర కొన్నిస్టేషన్లలో క్రాసింగ్ పెట్టి నిలిపి వేయడంతో బియ్యం రైలులో ఎక్కించుకునేందుకు అక్రమార్కులకు సమయం కలిసి వస్తోంది. దీంతో రైళ్లోని టాయిలెట్ రూమ్‌లన్నీ రేషన్ బియ్యం బస్తాలతో నింపేసి డోర్లు వెళ్లకుండా చేస్తున్నారు. నిత్యం హసన్పర్తిరోడ్, ఉప్పల్, బిజిగిరిషరీఫ్, పొత్కపల్లి, ఓదెల, కొలనూర్, కొత్తపల్లి, రాఘవపురం, పెద్దంపేట, మంచిర్యా ల, రవీంద్రఖని, మందమర్రి, రేచినిరోడ్ ఈ రైల్వేస్టేషన్ల నుంచి నిత్యం సుమారు 70నుంచి 80 క్వింటాళ్ల రేషన్ బియ్యం మహారాష్ట్రకు తరలిస్తున్నారు. టాయిలెట్ డోర్లు ధ్వంసం గతంలో రేషన్‌బియ్యం రైల్వే పోలీసులకు పట్టుబడితే బియ్యం స్వాధీనం చేసుకోవడం లేదా బ్యాగులు చింపేసి పడేయడం లాంటివి జరిగేవి. దీంతో బియ్యం స్మగ్లర్లు తమ పంథాను మార్చుకున్నారు. టాయిలెట్ రూముల్లో సుమా రు 30. నుంచి 40 బస్తాలు భద్రపరుస్తున్నారు. ఒక వ్యక్తి లోపలే ఉండి డోర్ లాక్ చేసుకొని కూర్చుంటాడు. దిగాల్సిన స్టేషన్ రాగానే లోపల కూర్చున్న వ్యక్తి లాక్ తీసుకొని బయటకు వచ్చి తమ పనిని కానిచ్చేస్తారు. ఒకవేళ లాక్‌లు వెళ్లకపోతే డోర్లను సైతం పగలగొట్టి మరీ తమ బియ్యాన్ని దించుకుంటారు. దీంతో భాగ్యనగర్ రైల్లో టాయిలెట్ రూములకు లాక్‌లు ఉండడం లేదు. మరికొన్ని చోట్ల డోర్లు పూర్తిగా విరిగిపోయి ఉండడంతో టాయిలెట్ రూములోకి వెళ్లలేని పరిస్థితి ఉందని పలువురు ప్రయాణికులు మొర పెట్టుకుంటున్నారు. రైల్వే అధికారుల అండతోనే దందా... రేషన్ బియ్యం అక్రమ రవాణా రైల్వే అధికారుల అండతోనే సాగుతోందన్న ఆరోపనలు వి నిపిస్తున్నాయి. రైల్వేపోలీసులు, (ఆర్పీఎఫ్) జీఆర్పీ సిబ్బంది అక్రమార్కులతో దోస్తి చేయడంతో ఈ దందా మూడుపువ్వులు ఆరుకాయ లుగా నడుస్తోందన్న విమర్షలు ఉన్నాయి. ప్రతి రోజు రైళ్లలో గస్తీ తిరుగుతున్న రైల్వే పోలీసులు రేషన్‌బియ్యం స్మగ్లర్లను గుర్తించక పోవడంపై సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. రైల్వే అధికా ర యాంత్రంగం ఈ వ్యవహారం అంతా మాములుగా తీసుకోవడం తోనే రేషన్ స్మగ్లర్ల ఆ గడాలకు అంతులేకుండా పోయింది. రైల్వే ఉన్నతాధికారు ల ఆదేశాల మేరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు క్షేత్రస్థాయి సిబ్బందికి తెలియగానే బియ్యం రవాణా చేసే వారికి కోవర్టుగా మారి సమాచారం అందిస్తున్నారన్న ఆరోపనలున్నాయి. దీంతో అక్రమ రవాణాదారులు అప్రమత్తమై మరుసటి రోజుకు వాయిదా వేసుకుంటున్నారు. దీంతో రైల్వే పోలీసులు తమ ఉనికిని చాటుకునేందుకు ఏదో ఒకరోజు టార్గెట్ కోసం తూతూమంత్రంగా దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. ఈ కేసుల్లో సైతం బియ్యం మాత్రమే దొరుకుతాయి కానీ రవాణాదారులు తప్పించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అధిక ఆదాయం వస్తుండడంతోనే... ప్రభుత్వం రూపాయికి కిలో రేషన్‌బియ్యాన్ని పేద మధ్యతరగతి కుటుంబాలకు అందజేస్తుం టే దళారులు రూ.7 నుంచి రూ.8వరకు కొనుగోలు చేసి రైలుమార్గం ద్వారా మహారాష్ట్రలోని వీరుర్ ప్రాంతంలోని వ్యాపారులకు రూ.18 నుంచి రూ. 20 వరకు విక్రయిస్తున్నారు. -
గుట్టుగా.. రేషన్ దందా!
నిఘా నిద్రపోతోంది. పేదల బియ్యం పక్కదారి పడుతోంది. నిరుపేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.కిలో బియ్యం పథకం జిల్లాలో దళారుల పొట్ట నింపుతోంది. జిల్లాకు చెందిన కొందరు దళారులు రోడ్డు మార్గమే రాచమార్గంగా ఈ బియ్యాన్ని గద్వాల మీదుగా గుట్టుగా సరిహద్దు దాటిస్తున్నారు. ఇంకొందరు జిల్లాలోని రైస్ మిల్లులకు తరలిస్తుండగా ఆ బియ్యాన్ని మిల్లర్లు రీ సైక్లింగ్ చేసి అదే బియ్యాన్ని మళ్లీ బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల ఇదే బియ్యం కోళ్ల దాణాగా మారుతోంది. నిఘా నిద్రపోతోంది. పేదల బియ్యం పక్కదారి పడుతోంది. నిరుపేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.కిలో బియ్యం పథకం జిల్లాలో దళారుల పొట్ట నింపుతోంది. జిల్లాకు చెందిన కొందరు దళారులు రోడ్డు మార్గమే రాచమార్గంగా ఈ బియ్యాన్ని గద్వాల మీదుగా గుట్టుగా సరిహద్దు దాటిస్తున్నారు. ఇంకొందరు జిల్లాలోని రైస్ మిల్లులకు తరలిస్తుండగా ఆ బియ్యాన్ని మిల్లర్లు రీ సైక్లింగ్ చేసి అదే బియ్యాన్ని మళ్లీ బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల ఇదే బియ్యం కోళ్ల దాణాగా మారుతోంది. సాక్షి, మహబూబ్‌నగర్ : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రేషన్ బియ్యం దందా బహిరంగ రహస్యంగా సాగుతోంది. గ్రామాల్లో తిరిగి సేకరించిన బియ్యాన్ని నిల్వ ఉంచి రెండ్రోజులకోసారి కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్నారు. ఆటోలు, డీసీఎం, ప్యాసింజర్ ఆటోలు, జీపుల్లో తరలిస్తూ ఉమ్మడి జిల్లాలో ఏదో చోటా నిత్యం పట్టుబడుతూనే ఉన్నారు. గడిచిన మూడు నెలల వ్యవధిలో వేలాది క్వింటాళ్ల బియ్యం పట్టుబడింది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ దందా మితిమీరగా స్పందించిన పౌరసరఫరాల అధికారి వనజాత ఆరుగురు డీలర్లపై చర్యలు తీసుకున్నారు. ఈ–పాస్ వచ్చినా.. గతంలో కొందరు డీలర్లు తమ దుకాణానికి వచ్చిన కోటా నుంచి కొంత బియ్యం మిగుల్చుకునే వారు. ఇంకొందరు పేదలకు ఇవ్వాల్సిన బియ్యంలో సగం కోటా ఇవ్వకుండా దళారులకు విక్రయించి జేబులు నింపుకునే వారు. దళారు లు ఆ బియ్యాన్ని రైస్ మిల్లర్లకు విక్రయించేవారు. మిల్లర్లు ఆ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ఎవరికీ చిక్కకుండా బహిరంగ మార్కెట్లో విక్రయించేవారు. అక్రమంగా తరలుతున్న, నిల్వ ఉంచిన బియ్యం ప్రతీరోజు ఏదో చోటా పట్టుబడేది. విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో బియ్యం నేరుగా లబ్ధిదారులకే చెందేలా ఈ పాస్ (బయోమెట్రిక్ ) విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం లబ్ధిదారులు వేలి ముద్రలు వేసి రేషన్‌షాపుల ద్వారా బియ్యాన్ని తీసుకుంటున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. అయితే ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో డీలర్లు అందించిన రేషన్‌బియ్యాన్ని దళారులు గ్రామాల్లో తిరిగి సేకరించి కిలోకు రూ. 5 నుంచి రూ.7లకు విక్రయిస్తున్నారు. దళారులు ఆ బియ్యాన్ని కిలోకు రూ. 10ల చొప్పున పలు రైస్‌మిల్లుల యజమానులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. మిల్లర్లు అదే బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి, బహిరంగ మార్కెట్లో రూ. 25 నుంచి రూ. 30 చొప్పున అమ్ముతున్నారు. ఇంకొందరు దళారులు బియ్యాన్ని గద్వాల మీదుగా రాయిచూర్‌కు తరలించి అక్కడ రూ.12 నుంచి రూ.15 చొప్పున విక్రయిస్తున్నారు. నిఘా వైఫ్యలమే.. పేదలకు చెందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నా సంబంధిత అధికారులు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పక్షంరోజుల వ్యవధిలో బిజినేపల్లి మండలంలో రెండు సార్లు దాడులు నిర్వహించిన హైదరాబాద్‌కు చెందిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 150 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బిజినపల్లి కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ దందా పెద్ద ఎత్తున సాగుతున్నా స్ధానిక అధికారులకు సమాచారం లేకపోవడం గమనార్హం. మరోపక్క ఉమ్మడి జిల్లాలో చాలా వరకు బియ్యం వివిధ మార్గాల్లో పోలీసుల తనిఖీల్లోనే పట్టుబడుతుంది. ఇలాంటి సంఘటనలు అక్రమంగా తరలుతున్న బియ్యంపై స్ధానిక అధికారుల నిఘా వైఫల్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. భారీ మొత్తంలో బియ్యం ఇతర ప్రాంతానికి తరలుతుంటే అధికారులు మొద్దునిద్ర పోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్టవేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. -
పిల్లల బియ్యం మట్టిపాలు
సాక్షి, రణస్థలం (శ్రీకాకుళం): నిత్యం లక్షలాది మంది ప్రజలు తిండికి నోచుకోక ఆకలితో అలమటిస్తున్నారు. ఎంతోమంది పేదలు బక్కిచిక్కిపోతున్నారు. చిన్నారుల డొక్కలు తేలుతున్నాయి. ఇటువంటి ఎన్నో అంశాలు పాఠ్యాంశంగా బోధిస్తున్న ఉపాధ్యాయులే ఘోర తప్పిదం చేశారు. విద్యార్థులకు తిండి పెట్టాలని పంపించిన రేషన్ బియ్యాన్ని వృథా పాల్జేశారు. వీరి నిర్లక్ష్యం మూలంగా 22 బస్తాల బియ్యం ముక్కిపోయి పనికి రాకుండా పోయాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని జేఆర్‌పురం (రణస్థలం)లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిది వందలకుపైగా విద్యార్థులు ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుతున్నారు. వీరందరికీగాను మధ్యాహ్న భోజనంగా పెట్టేందుకు మార్చిలో 22 బస్తాలు అంటే 11 క్వింటాళ్లు రేషన్ బియ్యం వచ్చాయి. పౌర సరఫరాల అధికారులు ఆయా పాఠశాలలు ఇచ్చిన ఇండెంట్ ప్రకారమే రేషన్ బియ్యాన్ని పాఠశాలలకు పంపిస్తారు. జేఆర్‌పురం హైస్కూలు ఉపాధ్యాయులు మాత్రం ముందస్తు ఆలోచన లేకుండా రేషన్ బియ్యం వృథా చేశారు. మార్చి, ఏప్రిల్‌లో ఒంటిపూట బడుల నిమిత్తం ఎక్కువ మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసేందుకు ఆసక్తి చూపరు. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు గుర్తించలేదు. దీంతో ఇటు విద్యార్థులు తినడం కుదరక, అటు తిరిగి పౌర సరఫరాల అధికారులకు అప్పగించక వదిలేయడంతో పట్టులుపట్టి, ముక్కిపోయి తినేందుకు పనికిరాకుండా పోయాయి. శనివారం ఇక్కడకు కొత్తగా రేషన్ బియ్యం రావడంతో మార్చిలో విడుదల చేసిన రేషన్ బియ్యం పాడవడంతో పాఠశాల ఆవరణలో వృథాగా పడేశారు. స్థానికులు కొంతమంది ఆ బియ్యాన్ని చూసి ఇంతలా దుర్వినియోగం చేయడం దారుణమని చర్చించుకుంటున్నారు. తిరిగి మార్చేస్తాం మార్చిలో బియ్యం విడుదల చేయించాం. విద్యార్థులు తినకపోవడంతో మిగిలిపోయా యి. తహసీల్దారుతో మాట్లాడి తిరిగి పంపించేస్తాం. అందులో జూనియర్ కళాశాలకు సంబంధించి బియ్యం ఆరున్నర క్వింటాళ్లు ఉన్నాయి. – జీ రాజాకిషోర్, హెచ్ఎం, జెడ్పీ హైస్కూల్ రణస్థలం పరిశీలించి చర్యలు తీసుకుంటాం బియ్యం వృథా జరగిందని ఎవరూ చెప్పలేదు. తక్కువ మోతాదు బియ్యం అయితే మార్చవచ్చు. 11 క్వింటాళ్లంటే ఉన్నతాధికారులకు తెలియజేయాలి. అయితే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – బీ రాజేశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్, సివిల్ సప్లయి -
రేషన్ రీ సైక్లింగ్ టోకరా!
పేదలు కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం డీలర్ల నుంచి దళారులు, మిల్లర్లు, వ్యాపారుల జేబులు నింపుతోంది. రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేస్తూ ఏటా కోట్లాది రూపాయిలు దోచుకుంటున్నారు. ప్రజలకు చేరాల్సిన బియ్యం దొడ్డిదారిలో మిల్లులకు చేర్చి అక్కడ పాలిష్ పట్టించి వివిధ రకాల బ్రాండ్ల పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్నారు. పీడీఎస్ బియ్యాన్నే పాలిష్ పెట్టి సీఎంఆర్‌కు సరఫరా చేస్తూ ప్రభుత్వానికే టోకరా వేస్తున్నారు. అధికార యంత్రాంగం సహకారంతో జరుగుతున్న ఈ అక్రమ దందాకు జిల్లా వేదికగా మారింది. సాక్షి, నెల్లూరు: జిల్లాలో నెల్లూరు రూరల్, కావలి పరిధిలో దాదాపు 35 రైస్ మిల్లులు ఉన్నాయి. జాతీయ రహదారికి సమీపంలో రైస్ మిల్లులు ఉండడంతో కొన్ని మిల్లుల యజమానులు రేషన్ బియ్యం సేకరించి రహస్యంగా మిల్లుల్లో నిల్వ చేసి రీసైక్లింగ్ చేస్తున్నారు. రెండు దశాబ్దాల కాలంగా పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఏదైనా సరే రాజకీయ నేతలను ప్రసన్నం చేసుకోవడం, అధికారులతో లాలూచీ పెట్టుకొని పేదల బియ్యాన్ని పాలిష్ పెట్టి వివిధ రకాల బ్రాండ్ల పేరిట మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. రీసైక్లింగ్ చేసిన బియ్యాన్ని పాత బియ్యం పేరుతో మార్కెట్లో రూ.45 నుంచి రూ.55 వంతున విక్రయాలు చేస్తున్నారు. మరి కొందరు పాలిష్ పెట్టిన బియ్యాన్ని జాక్‌పాట్ లారీల ద్వారా చెన్నైకు రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇతర జిల్లాల్లో సేకరణ నెల్లూరు రూరల్ ప్రాంతంలోని అల్లీపురం, నవలాకుతోట, గుడిపల్లిపాడు, నరుకూరు, కొత్తకాలువ సెంటర్, సౌత్ రాజుపాళెం ప్రాంతాల్లో రైస్ మిల్లులు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో దాదాపు 15 రైస్ మిల్లుల్లో రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరుగుతున్నట్లు సమాచారం. కావలి, జలదంకి ప్రాంతంలో ఉన్న రైస్ మిల్లుల్లో కూడా రీసైక్లింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 9 లక్షలకు పైగా కార్డులు అండగా, అందులో లక్షకు పైగా బోగస్ కార్డులు ఉన్నట్లు సమాచారం. కొంత మంది డీలర్లు ఏఏవై కార్డులు సృష్టించారు. ఏఏవై కార్డులకు 35 కేజీల బియ్యం పంపిణీ చేస్తారు. ఇలా ప్రతి నెల సుమారు 14 వేల మెట్రిక్ టన్నుల బియ్యం చౌకదుకాణాల ద్వారా కార్డు దారులకు పంపిణీ చేస్తున్నారు. ఇందులో 30 శాతం మంది కార్డుదారులు బియ్యం తీసుకోకుండా చౌక దుకాణం డీలర్లకు కేజీ రూ.6 చొప్పున విక్రయిస్తారు. జిల్లాలోని రేషన్ డీలర్ల నుంచి రైస్ మిల్లుల యజమానులు ఏర్పాటు చేసిన కొందరు దళారుల ద్వారా పీడీఎస్ బియ్యం సేకరిస్తున్నారు. డీలర్ దళారులకు కేజీ రూ.15 వంతున విక్రయాలు చేస్తున్నారు. జిల్లాలోని డీలర్ల నుంచి నెలవారీగా సేకరణలో పాటు ఎంఎల్ఎస్, పాయింట్ల వద్ద కూడా సిబ్బంది కక్కుర్తితో అక్కడ నుంచి కూడా బియ్యం సేకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా నెలవారీగా దాదాపు 4 వేల మెట్రిక్ టన్నుల వరకు దళారీ వ్యవస్థ ద్వారా రైస్ మిల్లులోకి వెళ్తున్నాయని సమాచారం. పీడీఎస్ బియ్యం సేకరణ నెల్లూరుకే పరిమితం చేయకుండా ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల నుంచి కూడా అధికారుల సహకారంతో నెల్లూరుకు అక్రమ రవాణా సాగిస్తున్నట్లు సమాచారం. సీఎంఆర్‌కు రేషన్ బియ్యం పౌరసరఫరా శాఖ ద్వారా సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించి వాటిని మర ఆడించిన బియ్యాన్ని సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)గా తిరిగి ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. ఇలా ఏటా జరిగే ప్రక్రియ అయితే పలువురు రైస్ మిల్లుల యజమానులు రేషన్ బియ్యాన్ని పాలిష్ పట్టి సీఎంఆర్‌కు ఇస్తున్నట్లుగా విజిలెన్స్ అధికారుల విచారణలో తేలింది. వివిధ జిల్లా నుంచి రహస్యంగా సేకరించిన రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ప్రభుత్వానికి అందజేస్తున్నట్లు సమాచారం. బ్రాండ్ల పేరుతో ఎగుమతి పీడీఎస్ బియ్యాన్ని మూడు దఫాలుగా పాలిష్ పడుతారు. దీంతో ఆ బియ్యం సన్నాలుగా కనిపించేలా చేస్తారు. ఆ బియ్యాన్ని పలు రకాల బ్రాండ్ పేరుతో ఉన్న బ్యాగుల్లో నింపి రాత్రి వేళల్లో చెన్నై, బెంగళూరు ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆ బియ్యాన్ని తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా జాక్‌పాట్ (బిల్లులు లేకుండా సరుకు తీసుకెళ్లే వాహనాలు) లారీల నుంచి చెన్నైకు తరలిస్తుంటారు. రెండు దశాబ్దాలుగా ప్రతి నిత్యం జాక్‌పాట్ లారీల ద్వారా బియ్యం తరలిస్తున్నారు. జాక్‌పాట్ లారీలను హైవేపై ఏ శాఖ అధికారులు తనిఖీలు చేయకుండా నెలవారీగా మామూళ్లు కూడా ఇస్తుంటారు. ఇది జగమెరిగిన సత్యమే. రీసైక్లింగ్ బియ్యం అధిక శాతం చెన్నైకు తరలిస్తుంటారు. ప్రతి నెల సుమారు 60 లారీల బియ్యం చెన్నైకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. నెల్లూరు మొలగొలుకలు, సన్నాలకు జాతీయ స్థాయి మార్కెట్లో డిమాండ్ ఉండడంతో ఆ బ్రాండ్ పేరుతో పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మాఫియాకు టీడీపీ నేతలు అండ టీడీపీ ఐదేళ్ల పాలనలో అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లుల యజమానులకు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అండగా నిలిచారు. పేదల బియ్యాన్ని సేకరించి రీౖసైక్లింగ్ చేసి బ్రాండ్ల పేరుతో మార్కెట్లోకి విడుదల చేసే ప్రక్రియపై ఎలాంటి దాడులు జరగకుండా మాజీమంత్రి అండగా నిలవడంతో అక్రమ దందా ఐదేళ్ల కాలం యథేచ్ఛగా సాగింది. ప్రభుత్వం మారడంతోనే విజిలెన్స్ అధికారులకు స్వేచ్ఛ రావడంతో పక్కా సమాచారంతో దాడులు చేస్తున్నారు. ఇటీవల అల్లీపురంలోని ఓ రైస్ మిల్లులో నిల్వ ఉంచిన 1,500 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
సెప్టెంబర్ 1 నుంచి ఇంటికే రేషన్
ప్రజాపంపిణీలో సమూల మార్పులు చోటుచేసుకోనున్నాయి. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా వంట సరుకులు డోర్ డెలివరీ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రతి కార్డుదారుకీ బియ్యంతోపాటు చక్కెర, కంది పప్పు, ఉప్పు, పామాయిల్, గోధుమ పిండి ప్యాకెట్ల రూపంలో అందించాలని యోచిస్తోంది. ఈ విధానాన్ని సెప్టెంబర్ ఒకటి నుంచి అమలు చేసేందుకు ప్రణాళిక రచించింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సాక్షి, చిత్తూరు రూరల్: ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు కళ్లెం వేసి.. లబ్ధి దారుల ఇంటి వద్దకే రేషన్ అందించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సంకల్పించింది. అదే సమయంలో నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని యోచిస్తోంది. జిల్లాలో 2,877 చౌక దుకాణాలు ఉన్నాయి. ఈ షాపుల కింద మొత్తం 11,07,886 రేషన్‌కార్డులు ఉన్నాయి. 2016లో అక్రమాలకు కళ్లెం వేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఈ–పాస్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. అయితే ఈ విధానం ద్వారా అక్రమాలకు చెక్ పడలేదు. పైగా కార్డుదారులను ఇబ్బందులకు గురిచేశారు. ఆధార్ లింక్, వేలిముద్రలు, ఐరిష్ ఇలా సవాలక్ష సమస్యల పేరుతో కార్డుదారులకు సరుకులు అందించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కార్డుదారులు ప్రతినెలా సరుకులు తీసుకునేందుకు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో రేషన్‌కార్డుల వివరాలు మొత్తం చౌకదుకాణాలు : 2,877 రేషన్‌కార్డులు : 11,07,886 ఎంఎల్ఎస్ పాయింట్లు : 28 ప్రతినెలా సరఫరా అవుతున్న బియ్యం : 18,864.95 మెట్రిక్ టన్నులు చక్కెర : 600.22 మెట్రిక్ టన్నులు గోధుమపిండి : 1,113.67 మెట్రిక్ టన్నులు రాగులు : 3,315.81 మెట్రిక్ టన్నులు కందిపప్పు : 2,227.35 మెట్రిక్ టన్నులు సమస్యలు ఇలా.. జిల్లాలోని మొత్తం కార్డుదారుల్లో 1.10 లక్షల మంది మాన్యువల్‌గా రేషన్ తీసుకుంటున్నారు. 90 శాతం మంది కార్డుదారులు తీసుకుంటుండగా, 10 శాతం మంది రేషన్ తీసుకోవడానికి రావడం లేదు. 8 వేల మంది కార్డుదారులకు వివిధ కారణాల వల్ల వారి వేలిముద్రలు ఈ–పాస్ యంత్రం తీసుకోవడం లేదు. సింగిల్ కార్డు ఉన్న వారి వేలిముద్రలు యంత్రంలో సరిపోవడం లేదు. ఇలా సుమారు 8 వేల మంది కార్డుదారులకు నెలనెలా సమస్యలు వస్తున్నాయి. వృద్ధులు, బయోమెట్రిక్ నమోదు కానీ వారికోసం సంబంధిత ఎన్ఫోర్సుమెంట్ డిప్యూటీ తహసీల్దార్లు, ఆహార తనిఖీ అధికారులు, ఏఎస్ఓలు దుకాణం పరిధిలో ఈ తరహా కార్డుదారులందరినీ ఒక విడతలో పిలిచి వారికి సంబంధిత అధికారి వేలిముద్ర వేసి సరుకులను ఇస్తున్నారు. ఈ విధానంలో అధికారికి తీరిక దొరికినప్పుడు మాత్రమే సరుకులను తీసుకెళ్లాలి. అధికారికి ఎప్పు డు ఖాళీ దొరుకుతుందో సమాచారాన్ని సంబంధిత చౌక ధరల దుకాణదారునికి తెలియజేస్తారు. కొందరు వృద్ధులు సరుకులను తీసుకెళ్లడానికి ఓపిక లేక దుకాణాల వైపు రావడం లేదు. ఈ తరహా సమస్యలతో 10 శాతం కార్డుదారులు జిల్లా వ్యా ప్తంగా సరుకులను తీసుకెళ్లడం లేదని అధికారుల రికార్డులతో తెలుస్తోంది. ఎన్నికల వేళ డీఎస్ఓ పర్యవేక్షణలో వృద్ధులకు బయోమెట్రిక్ పడని వారికి సరుకులను వారి ఇంటి వద్దకే వెళ్లి అందజేశారు. ఒకటి, రెండు రోజులు తూతూమంత్రంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి చేతులు దులుపుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అందుకు భిన్నంగా కార్డుదారుని ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు వచ్చే విధంగా వ్యవస్థను రూపకల్పన చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సరఫరాలో లోటుపాట్లు జిల్లాలో 28 ఎంఎల్ఎస్ పాయింట్లకు ప్రతి నెలా 18,864.90 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తోంది. అదే చక్కెర 600.22, రాగులు 3,315.81, కందిపప్పు 2,227.35 మెట్రిక్ టన్నులు సరఫరా చేస్తోంది. బియ్యం ఇలా బస్తాల్లో చేరుతున్నాయి. అక్కడ తూకాలు వేసి కార్డుదారులకు తలసరి ఐదు కిలోల లెక్కన కంది పప్పు రెండు కిలోలు, చక్కెర అరకిలో ఇస్తున్నారు. ఇందులోనూ కోత విధిస్తున్నారు. ఎంఎల్ఎస్ పాయింట్లలో, దుకాణాల్లో తూకాల్లో తేడాలు వస్తున్నాయి. వినియోగదారులు బాగా నష్టపోతున్నారు. బియ్యం పక్కదారి పడుతోంది. సరుకుల అక్రమ తరలింపు జరుగుతోంది. వీటిని అడ్డుకోవడానికి విజిలెన్స్ తనిఖీలు చేయాల్సి వస్తోం ది. మరోవైపు దుకాణదారులు, ఎన్ఫోర్సుమెంట్ విభాగం లాలూచీ పడి సబ్సిడీ సరుకుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. వీటిని నిరోధించేందుకు ప్రభుత్వం ప్రజా పంపిణీలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. రేషన్ సరుకులన్నీ ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేయడానికి నిర్ణయం తీసుకుంది. నాణ్యమైన బియ్యం అందేలా కార్డుదారులకు ఇస్తున్న బియ్యంలో నాణ్యత ఉండాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. జగన్మోహన్రెడ్డి మంత్రి మండలిలో చర్చించి నిర్ణయాన్ని తీసుకోవడం గమనార్హం. ప్రస్తుతానికి రకరకాల బియ్యం చౌక దుకాణాల నుంచి పంపిణీ చేస్తున్నారు. కొత్త బియ్యం, స్వల్పకాలిక పంటలు కావడంతో అన్నం పిండి అవుతోంది. అందుకే కొందరు ఈ రకాలను ఇష్టపడం లేదు. ఈ బియ్యమే తిరిగి రీసైక్లింగ్ చేసి బహిరంగ మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో నాణ్యమైన బియ్యం కార్డుదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం తలచింది. తలుపు తట్టి.. రేషన్ బియ్యాన్ని ఇక నుంచి 5, 10, 20 కిలోల ప్యాకెట్లుగా తయారుచేసి పౌరసరఫరాల శాఖ పంపిణీ చేయనుంది. గ్రామ వాలంటీర్ల ద్వారా ఈ ప్యాకెట్లను సరఫరా చేస్తారు. కార్డులో ఒక లబ్ధిదారుడే ఉంటే ఐదు కిలోలు, ఇద్దరు ఉన్న కార్డుకు 10 కిలోలు, ముగ్గురు ఉన్న కార్డులకు 15 కిలోల ప్యాకెట్లు, నలుగురు సభ్యులుంటే 20 కిలోల ప్యాకెట్లు పంపిణీ చేస్తారు. వీటితో పాటు ఐదు రకాల నిత్యావసర సరుకులు అందజేస్తారు. చక్కెర, కందిపప్పు, ఉప్పు, పామాయిల్, గోధుమ పిండి ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాగులు, జొన్నల పంపిణీ పరిశీలనలో ఉంది. యంత్రాల ద్వారా తూకాలు వేసి ప్యాకెట్ల రూపంలో ప్రజలకు పంపిణీ చేస్తారు. బియ్యం ప్యాకెట్లు తయారు చేయడానికి 35 కేంద్రాలను నెలకొల్పాలని ప్రాథమికంగా అంచనా వేశారు. సెప్టెంబర్ ఒకటి నుంచి ఈ విధానంలో సరుకులను పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. -
ఐరిస్‌తోనే రేషన్!
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): పౌర సరఫరాల శాఖ మరో సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఐరిస్ ద్వారా లబ్ధిదారులకు రేషన్ అందించే ప్రక్రియను మే నెల నుంచి ప్రారంభించనుంది. ఇందుకోసం ఇప్పటికే ఐరిస్ మిషన్లు జిల్లాకు వచ్చేశాయి. వీటిని వారం రోజుల్లో రేషన్ డీలర్లకు పంపిణీ చేయనున్నారు. మే నెల 1వ తేదీ నుంచి జిల్లాలోని 751 రేషన్ దుకాణాల్లో ఇకపై ఈ నూతన విధానం ద్వారా సరుకులు పంపిణీ కానున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టంగా, జవాబుదారీతనంగా చేయడానికి ఇప్పటికే రేషన్ దుకాణాల్లో ఈ–పాస్ బయోమెట్రిక్ విధానం అమలవుతున్న విషయం తెలిసిందే. రేషన్ దుకాణాల్లో అక్రమాలకు అరికట్టేందుకు 2017లో ఈ–పాస్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. దీంతో అక్రమాలకు కళ్లెం పడడంతో పాటు ప్రభుత్వానికి మిగులు బియ్యం పెరి గి ఖర్చు తగ్గినట్లయింది. అయితే, కొంత మంది లబ్ధిదారుల వేలి ముద్రలు వివిధ కారణాలతో బయోమెట్రిక్ మెషిన్లో రాకపోవడంతో వారికి రేషన్ అందించడం కష్టమవుతోంది. స్థానిక వీఆర్వో సర్టిఫికేషన్ చేస్తేనే రేషన్ డీలర్లు లబ్ధిదారులకు బియ్యం అందజేస్తున్నారు. జిల్లాలో మొత్తం 751 రేషన్ దుకాణాల పరిధిలో 3,89,827 రేషన్ కార్డులు ఉన్నాయి. ఆయా లబ్ధిదారులందరికీ కలిపి ప్రతి నెలా దాదాపు 8,185 మెట్రిక్ టన్నుల బియ్యంతో పాటు కిరోసిన్, గోధుమలను ఈ–పాస్ విధానంతో అందజేస్తున్నారు. వేలి ముద్రలు రాక ప్రతి నెలా దాదాపు 5,500 మందికి పైగా లబ్దిదారులు వీఆర్వో సర్టిఫికేషన్‌తో సరుకులు పొందాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే రేషన్ డీలర్లు వీఆర్వోలతో కుమ్మక్కై చేతివాటం ప్రదర్శించి సరుకులకు కాజేసి ఎక్కువ ధరకు బాక్ల్ మార్కెట్ తరలిస్తున్నారనే ఆరోపణలు ఇంకా వినిపిస్తున్నాయి. అలాగే లబ్ధిదారులు చనిపోయినా, రేషన్ తీసుకోకపోయినా డీలర్ వారి సరుకులను పొందినట్లుగా రికార్డుల్లో చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఐరిస్ విధానాన్ని తీసుకొచ్చారు. దీంతో నూరు శాతం అక్రమాలకు చెక్ పడనుంది. ఐరిస్ మిషన్లను, బయోమెట్రిక్ మిషన్‌కు అనుసంధానం చేస్తారు. లబ్ధిదారులకు ముందుగా వారి వేలి ముద్రల ఆధారంగా రేషన్ ఇస్తారు. వేలి ముద్రలు రాని పక్షంలో ఐరిస్ ద్వారా సరుకులు అందజేస్తారు. ఇక నుంచి ఐరిస్‌తోనే.. ప్రజా పంపిణీలో ఐరిస్ విధానం మే నెల నుంచి అమలు కానుంది. ఇందుకు సంబంధించిన ఐరిస్ మెషిన్లు జిల్లాకు వచ్చాయి. వీటిని త్వరలో డీలర్లకు అందజేసి వాటి వినియోగంపై అవగాహన కల్పిస్తాం. వేలి ముద్రలు రాని లబ్ధిదారులకు ఈ విధానం ద్వారా, ఇకపై వీఆర్వో సర్టిఫికేషన్‌తో సంబంధం లేకుండా సరుకులు పొందవచ్చు. ప్రజా పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా జరగనుంది. – కృష్ణప్రసాద్, డీఎస్వో -
రేషన్ కోట.. సరుకుల కోత
కెరమెరి: ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకం ప్రస్తుతం కనుమరుగైంది. రేషన్ దుకాణాల ద్వారా వినియోగదారులకు 9 రకాల సరుకులను అందించాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. కొంత కాలం పాటు సజావుగా సాగిన సరుకుల పంపిణీ ప్రత్యేక రాష్ట్రం తర్వాత ఆగిపోయింది. అప్పుడు పంపిణీ చేసిన 9 రకాల సరుకుల్లో ప్రస్తుతం బియ్యం, కిరోసిన్ మాత్రమే సరఫరా అవుతున్నాయి. మూడు మాసాల క్రితం వరకు ఇచ్చిన పంచదార కూడా నిలిచి పోవడంతో ప్రధానంగా రేషన్ దుకాణాలు బియ్యానికే పరిమితమయ్యాయి. వాస్తవ పరిస్థితి ఇలా.. మండలంలోని 16 చౌరధరల దుకాణాల్లో నాలేగళ్ల క్రితం వరకు రేషన్ దుకాణాల్లో అన్ని రకాల సరుకులు దొరిగేవి. పేదలకు 9 రకాల సరుకులు ఇచ్చేవారు. తెలంగాణేర్పడిన తర్వాత బియ్యం. కిరొసోన్ తప్ప మరే ఇతర నిత్యావసర వస్తువులు అందడం లేదు.మండలంలో 16 చౌకధరల దుకాణాలున్నాయి. 8,446 రేషన్ కార్డులుండగా.. 194.568 క్వింటాళ్ల బియ్యంతో పంపిణీ అవుతుంది. కాగా 8,446 లీటర్ల కిరోసిన్ అందజేస్తున్నారు. వీరంతా పేదలు. ప్రభుత్వం కల్పించే నిత్యావసర సరుకులపై ఆధారపడి జీవిస్తున్నారు. గతంలో బియ్యం, గోధుములు, చక్కెర, కందిపప్పు, ఉప్పు, మంచినూనె, కారంపొడి, పసుపు, చింతపండు, ఉప్పు, తదితర నిత్యావసర వస్తువులు ప్రభుత్వం సరఫరా చేసేది. ప్రస్తుతం లబ్ధిదారులకు 6 కిలోల చొప్పున బియ్యం. లీటరు కిరోసిన్ మాత్రమే అందిస్తున్నారు. పోరాగి సిద్ధించుకున్న తెలంగాణలో పూర్తి స్థాయి సరుకులు ఎందుకు సరఫరా చేయడం లేదని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. బియ్యం కూడా నాణ్యతగా లేవని మహిళలు అంటున్నారు. కాగా ఒక బియ్యం బస్తాలో 3 నుంచి 4 కిలోల వరకు కోత వస్తుందని పలువురి ద్వారా తెలిసింది. లబ్ధిదారుల ఆందోళన అయితే ఇటీవల రాష్ట్రం ప్రభుత్వం 10 ఎకరాల భూమి ఉన్న వారికి రేషన్ సరుకులు నిలిపి వేయనున్నట్లు ప్రకటించడంతో అనేక మందిలో ఆందోళన మొదలైంది. మండలంలో వివిధ గ్రామాల్లో అనేక మందికి 10 ఎకరాలు పైగానే సాగు భూముల పట్టాల ఉన్నాయని, అయినా వారందరు ప్రభుత్వం అందించే రేషన్ సరుకులపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వం అనుకున్న ప్రకారంగానే 10 ఏకరాలు ఉన్నవారికి రేషన్ సరుకులు నిలిపి వేస్తే సుమారు వెయ్యి మంది లబ్ధిదారులకు చెందిన రేషన్ సరుకులు అందకుండా పోయే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇచ్చేది బియ్యం, కిరోసిన్ అదికూడా నిలిపి వేస్తే ఏం తిని బతకాలని వారు ఆందోళన, ఆవేదన చెందుతున్నారు. తక్షణమే ప్రభుత్వం తన నిర్ణయం వెనక్కు తీసుకోవాలని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. రేషన్ బియ్యం జోకుతున్న డీలర్ , కిరోసిన్ పోస్తున్న సిబ్బంది -
రేషన్ ఇక సులువు
ఉట్నూర్‌రూరల్(ఖానాపూర్): రేషన్ సరుకుల పంపిణీ మరింత సులభతరం కానుంది. వేలిముద్రలు ఈపాస్ యంత్రాల్లో సరిపోలకపోవడంతో రేషన్ దుకాణం వద్ద గంటలతరబడి నిలబడాల్సి వచ్చేది. ఇక నుంచి ఐరిస్‌తో సమస్య తీరనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈపాస్ విధానం నిత్యావసర సరుకుల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. ఈవిధానం ద్వారా గతంలో జరిగిన బియ్యం, కిరోసిన్ అక్రమ రవాణాకు అడ్డుకట్టపడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రారంభంలో ఇబ్బందులు తలెత్తినప్పటికీ ప్రస్తుతం ఈపాస్ విధానం సక్సెస్ అయింది. ఈ తరుణంలో తలెత్తిన వేలిముద్రల సమస్య కొంత ఇబ్బందులకు గురి చేసింది. ఈపాస్ విధానంతో పరికరంపై వేలిముద్ర తీసుకొని బియ్యం సరఫరా చేస్తున్నారు. కొంతమంది లబ్ధిదారులు కూలీ, వ్యవసాయ, వయసు పైబడడంతో ఈపాస్ పరికరంపై వేలిముద్రలు సరిగా పడకపోవడంతో డీలర్లకు తలనొప్పిగా మారింది. ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం రెవెన్యూశాఖ వీఆర్వోల వేలిముద్రలతో లబ్ధిదారులకు బియ్యం సరఫరా చేయడం మొదలెట్టింది. ఈ తరుణంలో వీఆర్వో వేలిముద్రల ద్వారా బియ్యం అక్రమాలకు గురవుతున్నాయని అక్కడక్కడ వెల్లువెత్తిన ఆరోపణలతో ప్రభుత్వం మరోఅడుగు ముందుకేసింది. ఈ తరుణంలో నేరుగా లబ్ధిదారుడికే నిత్యావసర సరుకులు అందించాలనే యోచనతో ఏకంగా ఐరిస్ పరికరాలు అందుబాటులో తీసుకువచ్చారు. లబ్ధిదారుడి కంటి చూపు ద్వారా ఇక సులువైన పద్ధతిలో బియ్యాన్ని తీసుకునేలా సులువైన విధానం రావడంతో లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు అక్రమాలకు మరింత అడ్డుకట్టపడనుంది. మూడు జిల్లాలకు 1077 ఐరిస్ పరికరాలు పంపిణీ ఉమ్మడి జిల్లాలోని కొమురంభీం మినహా, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకుగాను మొత్తం 1077 పరికరాలు పంపిణీ అయ్యాయి. ఈ ఐరిస్ పరికరాల వినియోగం ద్వారా జనవరి ప్రారంభం నుంచి ఇప్పటివరకు మొత్తం 15,276 క్వింటాళ్ల బియ్యం పంపిణీ జరిగింది. దీంతో ప్రతీనెల వేలిముద్రల వినియోగంతో ఇబ్బందులుపడే లబ్ధిదారుల సమస్య పరిష్కారం కావడంతో అంతటా సంతృప్తి వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోనే 2500 క్వింటాళ్లు బియ్యం పంపిణీ కాగా మిగతా ఏడురోజుల్లో 6 వేల క్వింటాళ్ల బియ్యం పంపిణీ కానున్నట్లు అధికారుల అంచనా. కాగా ఈ పరికరాలు రాష్ట్రవ్యాప్తంగా అమలు కావాల్సి ఉండగా ప్రస్తుతం వినియోగంలో భాగంగా మొత్తం 16 జిల్లాల్లో ఐరిస్ సేవలు ప్రారంభించారు. మునుముందు రాష్ట్రవ్యాప్తంగా ఈ పరికరాలు అందుబాటులోకి తెచ్చిసేవలు అందించనున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట.. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 355 నిత్యవసర సరుకుల దుకాణాలు ఉండగా అందులో 321 కొనసాగుతుండగా 34 ప్రస్తుతం సెల్‌సిగ్నల్స్ తదితర సమస్యలతో సేవలు నిలిచిపోయాయి. ఈపాస్ ప్రారంభనెలలో జిల్లాలోని 18 మండలాలకు 2,200 క్వింట్లాళ్ల బియ్యం పక్కదారి పట్టకుండా మిగిలాయి. ప్రభుత్వం కిలోకు రూ.24 చెల్లించి బియ్యం కొనుగోలు చేస్తుండగా దాదాపు ప్రారంభనెలలో రూ.50 లక్షలు ఆదాయం మిగులుతోంది. ఇలా ఈ పాస్ విధానం ప్రారంభనెలలో రాష్ట్రవ్యాప్తంగా రూ.500 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారుల అంచనా. ఇక కిరోసిన్ కూడా ఆన్లైన్లోనే.. కిరోసిన్ అంటేనే కొంత మంది వ్యాపారులకు బిజినెస్‌గా మారింది. వివిధ వాహనాల వినియోగానికి కిరోసిన్ విచ్చలవిడిగా వాడేవారు. దుకాణాల్లోనూ ఎలాంటి అడ్డూఅదుపు లేకపోవడంతో గతంలో డ్రమ్ములు నింపి విక్రయాలు జరిపినట్లు ఆరోపణలు లేకపోలేదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దీనికీ చెక్ పెట్టింది. జనవరి నుంచి కిరోసిన్ కూడా ఆన్లైన్ చేస్తోంది. ఈ తరుణంలో సరుకులు తీసుకుంటున్న విధంగానే ఇక కిరోసిన్ కూడా ఈపాస్ ద్వారానే లబ్ధిదారుడికి అందించనుంది. దీంతో కిరోసిన్ కూడా అడ్డదారిన వెళ్లకుండా అడ్డుకట్ట పడనుంది. కిరోసిన్ పంపిణీ త్వరలో ప్రారంభించనుండడంతో ఈనెల15న గడువుకావడంతో ఇంకో రెండుమూడురోజులు పెంచి కిరోసిన్ పంపిణీకి యోచిస్తున్నారు. ఇంతటి ఈపాస్ కార్యక్రమాన్ని ఓయాసిస్ బృందం ఆధ్వర్యంలో ఈపాస్ జిల్లా మేనేజర్ అశోక్, టెక్నిషియన్లు టీం సభ్యులు సీహెచ్ నాగరాజు, ఈ.రాందాస్, ఎస్ఏ రాజు, టి. ప్రశాంత్ ఆధ్వర్యంలో ఒక్కొక్కరు నాలుగు మండలాల్లో పరికరాల పని తీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కార్యక్రమాన్ని ముందుకుతీసుకెళ్తున్నారు. అన్నిరంగాల్లో టెక్నాలజీపరంగా దూసుకెళ్తున్న తరుణంలో ప్రభుత్వం ఈపాస్ విధానంతో లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పనున్నాయి. దీంతోపాటు ఏళ్లనాటి అక్రమాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలితాలు తెచ్చిపెట్టనుంది. ఇక ఎలాంటి ఇబ్బందులు లేవు.. ఈపాస్ విధానం ప్రారంభంలో అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాని రానురాను ఇబ్బందులు తొలగాయి. ముఖ్యంగా వేలిముద్రలు పడని వారికి రేషన్ అందించడానికి ఇబ్బందిగా ఉండే. వేరే గ్రామాల నుంచి వచ్చి తిరిగి వెళ్లిపోయే వారు. ప్రస్తుతం ఐరిస్ ద్వారా బియ్యం అందిస్తుండడంతో ఎవరిని కూడా తిరిగి పంపించకుండా అందరికీ బియ్యం అందిస్తున్నాం. దీంతో ఇబ్బందులు తప్పినాయి. – ఆత్రం తిరుపతి, రేషన్ డీలర్సుద్దగూడ అక్రమాలకు అడ్డుకట్ట రేషన్ దుకాణాల్లో అందించే సరుకులు పక్కదారి పట్టకుండా పక్కా ప్రణాళికతో ప్రభుత్వం ఈపాస్ విధానం ప్రవేశపెట్టింది. దీంతో ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా రేషన్ సరుకులు నేరుగా లబ్ధిదారులకు సరఫరా అవుతున్నాయి. వేలిముద్ర ఇబ్బందులు గుర్తించి ఐరిస్ పరికరాలు అందుబాటులోకి తెచ్చి సరుకులు అందిస్తున్నాం. అంతేకాకుండా కిరోసిన్ కూడా ఈపాస్ ఆన్లైన్ ద్వారానే పంపిణీ అవుతుంది. – అశోక్, ఈపాస్, జిల్లా మేనేజర్ -
218 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
నెల్లికుదురు (మహబూబాబాద్) : 218క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తుండగా పట్టుకుని లారీ సీజ్ చేసి 15మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో తొర్రూర్ డీఎస్పీ జి.మదన్‌లాల్, సీఐ వి.చేరాలు, ఎస్సై పెండ్యాల దేవేందర్‌లతో కలసి మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. నెల్లికుదురు, చిన్నగూడూరు, నర్శింహులపేట మండలాల్లో పోలీసులు అలర్ట్‌గా ఉన్నప్పటికీ రేషన్ బియ్యం, ఇసుక అక్రమ దందాలు నిర్వహిస్తున్నారని వారిపై ప్రత్యేక నిఘా పెంచనున్నట్లు తెలిపారు. మండలంలోని శ్రీరామగిరి, వావిలాల, బంజర, ఆలేరు గ్రామాలల్లోని రేషన్ డీలర్లు తండ్రీకొడుకులు సంద సీతయ్య, కుమారుడు సంద అనిల్ (ఇద్దరు), ఆవుల సంధ్యారాణి, భర్త వెంకటనర్సయ్య (ఇద్దరు), గట్టు వేణు, బాద ఉప్పలయ్యల, గొట్టె నర్సయ్యలతో మహబూబాబాద్ మండలం అమనగల్ గ్రామానికి చెందిన బానోతు రాములు, వేముల రామారావు, జంగిలిగొండకు చెందిన కొయ్యాల కొమురెల్లి, వావిలాల గ్రామానికి చెందిన మార్త యుగేందర్, ఓ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న గోగుల ప్రశాంత్(సాక్షికాదు), శామకూరి వెంకన్న, చిన్నముప్పారం గ్రామానికి చెందిన ఒబిలిశెట్టి నర్సయ్య, ఈస్ట్‌గోదావరి జిల్లా అద్దెటిగల్ మండల కేంద్రానికి చెందిన గొలుసు శ్రీనివాసరావులు కుమ్మకై పీడీఎస్ బియ్యాన్ని వివిధ గ్రామాల్లో సేకరించినట్లు తెలిపారు. సేకరించిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు నెల్లికుదురు ఎస్సై పెండ్యాల దేవేందర్‌కు వచ్చిన సమాచారంతో పోలీసు సిబ్బందితో కలసి వెళ్లి మండల కేంద్రంలోని క్రాస్ రోడ్ వద్ద వాహానాల తనిఖీ నిర్వహిస్తుండగా 218క్వింటాళ్ళ లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్, మరో వ్యక్తి పోలీసులను చూసి పారిపోతున్నారని తెలిపారు. వారిని పట్టుకుని విచారించి తనిఖీ చేయగా లారీలో రేషన్ బియ్యం ఉన్నట్లు తెలిపారు. రేషన్ బియ్యం లోడు లారీని సీజ్ చేసి, 15 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బానోతు రాములు, సంద అనిల్, అవుల వెంకటనర్సయ్య (ఇద్దరు), గట్టు వేణు, బాద ఉప్పలయ్యల, ఒబిలిశెట్టి నర్సయ్య, గొలుసు శ్రీనివాసరావు ఏడుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మిగిల వారు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. చాకచక్యంగా వ్యవహరించి రెండోసారి భారీ మొత్తంలో రేషన్ బియ్యాన్ని పట్టుకున్న ఎస్సై దేవేందర్, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. రివార్డులు అందజేస్తామని తెలిపారు. బియ్యం వ్యాపారంలో డీలర్లు ఉండటం విచారకరం ప్రభుత్వ సొమ్ము తింటూ రేషన్ బియ్యం దందాలో నలుగురు డీలర్లు, వారి కుటుంబ సభ్యులు ఇద్దరు ఉండడం విచారకరమని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. ఈ వ్యాపారంలో ఎంతటివారు ఉన్నా వదిలిపెట్టేది లేదని, రేషన్ డీలర్లపై, అక్రమ వ్యాపారంలో అరెస్టు అయిన వారిపై పీడీయాక్టును ఉపయోగించేందుకు నివేదికను కలెక్టర్‌కు అందిస్తామన్నారు. -
ఇవి రేషన్ బియ్యమేనా?
నవాబుపేట: ప్రభుత్వం పేద ప్రజల కోసం రూపాయికే కిలో రేషన్ బియ్యం పథకం ప్రవేశపెట్టింది. కాని ఈ నెల ప్రజలకు పురుగులు, మట్టితో నిండిన బియ్యం పంపిణీ చేశారు. దీంతో ప్రజలు ఆ బియ్యాన్ని తీనాలంటేనే జంకుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల సరఫరా చేసినా బియ్యం పందికొక్కులు తినగా మిగిలిన బియ్యంగా ఉన్నాయి. ప్రభుత్వమే ఇలాంటి బియ్యం సరఫరా చేస్తుందా, లేక గోదాంలో ఏమైనా తారుమారు అవుతున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. గత రెండు రోజులుగా మండలంలోని 44 రేషన్ షాపుల్లో రేషన్ బియ్యాన్ని డీలర్లు విక్రయిస్తున్నారు. దాదాపు అన్ని షాపుల్లో విక్రయిస్తున్న రేషన్ బియ్యంలో నల్లటి పురుగులు, దుమ్ముధూళితో అధ్వానంగా ఉన్నాయి. బియ్యం ఇలా ఉన్నాయని పలువురు రేషన్ డీలర్లను ప్రశ్నించగా తమకు తెలియదని గోదాం నుంచి వచ్చిన బియ్యాన్నే తాము విక్రయిస్తున్నట్లు చెప్పారు. చేసేదేమీ లేక ప్రజలు అధ్వానంగా ఉన్న బియ్యాన్ని తీసుకెళ్లారు. అధికారుల దృష్టికి తీసుకెళ్తా రేషన్ బియ్యంలో పూర్తిగా పురుగులు, దుమ్ముధూళి ఉండటంతో ఆ బియ్యాన్ని ప్రజలు తినలేని పరిస్థితి నెలకొంది. అధ్వానంగా ఉన్న బియ్యం సరఫరా చేస్తే తాము ఎలా తినాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్ శ్రీనివాస్‌ను వివరణ కోరగా బియ్యంలో పురుగులు వచ్చాయని చాలా గ్రామాల నుంచి తమకు ఫిర్యాదులు వచ్చాయని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులు, సివిల్‌సప్లయి అధికారులకు లేక రాస్తున్నట్లు ఆయన తెలిపారు. -
పకడ్బందీగా రేషన్ బియ్యం పంపిణీ
జడ్చర్ల : జిల్లాలో రేషన్‌బియ్యం పంపిణీకి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. రేషన్ డీలర్ల సమ్మె నేపథ్యంలో మంగళవారం ఆయన జడ్చర్ల స్టాక్ పాయింట్‌ను పరిశీలించి బియ్యం పంపిణీకి సంబంధించి ఆరా తీశారు. సకాలంలో లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు. అనంతరం జేసీ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 804 రేషన్ దుకాణాలకు సంబంధించి 420 దుకాణాలకు డీలర్లు డీడీలు కట్టారని మిగతా 384 రేషన్ దుకాణాలకు ఐకేపీ, మెప్మా ద్వారా ఆర్ఓలు జారీ చేశామని తెలిపారు. ఇప్పటికే 121 దుకాణాలకు బియ్యం స్టాక్ పాయింట్ల నుండి తరలించామని చెప్పారు. రాతీ, పగలు తేడా లేకుండా అదనపు లారీలను ఏర్పాటు చేసి గోదాముల నుండి అన్ని దుకాణాలకు బియ్యాన్ని చేరుస్తామని తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే 08542–241330 నంబర్ ఫోన్ చేయాలని సూచించారు. మండల స్థాయిలో తహసీల్దార్‌ను నోడల్ అధికారిగా నియమించగా, గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఓ, ఐకేపీ సీసీలను పర్యవేక్షకులుగా ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా పోలీసుల సహకారాన్ని కూడా తీసుకుంటామని తెలిపారు. స్థానిక తహసీల్దార్ లక్ష్మీనారాయణ, సివిల్ సప్లయీస్ డీటీ హరికృష్ణ, ఆర్ఐ రఘు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు మహబూబ్‌నగర్ న్యూటౌన్ : ప్రజాపంపిణీ కార్యక్రమంలో భాగంగా సరుకుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్.వెంకట్రావు సూచించారు. జడ్చర్ల నుండి మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందితో సమీక్షించగా కలెక్టరేట్ నుండి డీసీఎస్ఓ శారదా ప్రియదర్శిని, సివిల్ సప్లయీస్ డీఎం బిక్షపతి పాల్గొన్నారు. జిల్లాలో మొత్తం 420 మంది డీలర్లు డీడీలు కట్టారని, మిగిలిన స్థానాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అన్నిచోట్ల ఈ నెల 5వ తేదీ నుండి 10వ తేదీ వరకు సరుకుల పంపిణీ చేయించాలని సూచించారు. భూసేకరణ ప్రక్రియలో ఆలస్యం చేయొద్దు మహబూబ్‌నగర్ న్యూటౌన్ : జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం చేయొ ద్దని జేసీ ఎస్.వెంకట్రావు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళ వారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలమూరు–రంగారెడ్డి, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులతో పాటు జాతీయ రహదారి నిర్మాణం ప్రాజెక్టులకు భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. -
రేషన్ టెన్షన్
సాక్షి, మెదక్: రేషన్ డీలర్లు సమ్మె బాట పట్టడంతో జిల్లాలో రేషన్ పంపిణీపై ఉత్కంఠ నెలకొంది. డీలర్లను భయపెట్టి దారిలోకి తీసుకురావాలన్న ప్రభుత్వం యత్నం ఫలించడం లేదు. జిల్లాలో మెజార్టీ డీలర్లు డీడీలు కట్టకపోవటంతో సమ్మె సాగుతోంది. డీలర్ల సస్పెన్షన్ వేటుపై ప్రభుత్వం వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో సరుకుల కోసం డీడీలు చెల్లించని డీలర్లను సస్పెండ్ చేస్తామంటూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసే ఆలోచనను మాత్రం విరమించుకున్నట్లు సమాచారం. సస్పెన్షన్ల అంశం పక్కనబెట్టి లబ్ధిదారులకు సకాలంలో సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో అధికారులు సరుకుల పంపిణీకి ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించారు. రేషన్ డీలర్లు గౌరవ వేతనంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డీలర్లకు రూ.20 కమీషన్ వస్తోంది. కమీషన్‌ను రూ.70 పెంచాలని, రూ.30వేల గౌరవ వేతనం ఇవ్వాలని డీలర్ల సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె విరమించేదిలేదని వారు స్పష్టం చేస్తున్నారు ఇద్దరు మాత్రమే.. ఈ–పాస్ విధానంతో రేషన్ డీలర్ల కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఈ పాస్ విధానంతో వారి అదనపు ఆదాయం పడిపోయింది. దీంతో డీలర్లు దుకాణాలను నడపటం కష్టం అవుతోంది. దీంతో డీలర్లు కమీషన్ పెంచాలని, గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. జూలై మాసానికి 28 తేదీలోగా డీడీలు కట్టాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కేవలం జిల్లాలో కేవలం ఇద్దరు డీలర్లు మాత్రమే డీడీలు కట్టారు. దీంతో కలెక్టర్ ధర్మారెడ్డి స్వయంగా డీలర్లు వెంటనే డీడీ కట్టాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినా రేషన్ డీలర్లు స్పందించడం లేదు. ఇప్పటికీ 519 మంది డీలర్లు డీడీలు కట్టలేదు. దీంతో కలెక్టర్ డీలర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు జిల్లాలోని 519 మంది రేషన్ డీలర్లకు శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. చాలా మంది డీలర్లు షోకాజ్ నోటీసులు అందుకునేందుకు విముఖత చూపారు. దీంతో రెవెన్యూ సిబ్బంది షోకాజ్ నోటీసులను రేషన్ షాపులకు దగ్గర అతికించారు. షోకాజ్ నోటీసులు ఇచ్చినా రేషన్ డీలర్లు డీడీలు చెల్లించడానికి ముందుకు రావడం లేదు. దీంతో రేషన్ డీలర్లకు సస్పెన్షన్ ఉత్తర్వులు ఇవ్వాలని కలెక్టర్ మొదట నిర్ణయించారు. అయితే సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయవద్దని సరుకుల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేపట్టాలని ప్రభుత్వం సూచించటంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రత్యామ్నాయ చర్యలు షురూ రేషన్‌డీలర్లు డీడీలు చెల్లించేందుకు సిద్ధంగా లేకపోవడంతో పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో మెప్మా, గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక గ్రూపుల ద్వారా రేషన్ సరుకుల పంపిణీకి ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఇందుకోసం సోమ, మంగళవారం రెండు రోజులు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఐకేపీ సంఘాలకు రేషన్ సరుకుల పంపిణీపై శిక్షణ ఇవ్వనున్నారు. సరుకుల పంపిణీ కోసం జిల్లా వ్యాప్తంగా 499 సహాయ సంఘాలను, పట్టణాల్లో 20 మెప్మా గ్రూప్‌లను గుర్తించారు. సరుకులను ఉంచడానికి 417 గ్రామ పంచాయతీ భవనాలు, 46 ఐకేపీ భవనాలు, 10 కమ్యూనిటీ హాల్స్‌ను, 46 వేరొక భవనాలను గుర్తించారు. ఈ పాస్ విధానంలో ఐకేపీ సంఘాలు సరుకుల పంపిణీ చేపడితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీంతో అధికారులు పాత పద్ధతిలోనే సరుకుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు. ఈనెల 5 నుంచి 10వ తేదీ వరకు ఐకేపీ సంఘాల ద్వారా రేషన్‌కార్డు లబ్ధిదారులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సమయంలో ఏవైన ఫిర్యాదులుంటే 9985390891 నంబర్‌కు ఫోన్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. -
బియ్యం ఇంకా రాలే..
ఆదిలాబాద్ అర్బన్ : జూలై ఒకటో తారీఖు గడిచిపోయింది. ఫస్టు కాకముందే ప్రతి నెల బియ్యం కంట్రోల్ దుకాణానికి వస్తుండే. కానీ ఈ నెల రేషన్ బియ్యం ఇంకా రాలేదు. రేపెళ్లుండి వసాయేమో.. అని గ్రామాల్లో కొందరు కార్డుదారులు చర్చించుకుంటున్నారు. అయితే వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రేషన్ డీలర్లు సమ్మెలో ఉండడం, పంపిణీ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించడం.. వెరసి ఈ నెల కోటా బియ్యం రేషన్ దుకాణాలకు వచ్చేందుకు మరికొన్ని రోజులు పట్టే వచ్చే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లోని ఎంఎల్ఎస్ పాయింట్ (మండలస్థాయి నిల్వ గిడ్డంగి)ల నుంచి ఇంకా గ్రామాలకు రేషన్ బియ్యం సరఫరా కాలేదు. డీడీలు కట్టిన డీలర్లకు ఒక్కో లోడ్ లారీ బియ్యం చొప్పున సరఫరా చేస్తున్న అధికారులు, డీడీలు కట్టని డీలర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ నెల 29తో డీలర్ల డీడీల సమర్పణ గడువు ముగిసినా.. జూలై 1 ఆదివారం వరకు పొడిగించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ గడువు సైతం ముగియడంతో మహిళా సంఘాల ద్వారా డీడీలు తీసి కట్టించేందుకు సిద్ధమవుతున్నారు. 112 చోట్ల డీలర్లు.. 243 చోట్ల సంఘాలు.. జిల్లాలో ఎప్పుడు జరగని వింత పరిస్థితి చోటు చేసుకుంటోంది. జిల్లాలో 355 చౌక ధరల దుకాణాల పరిధిలో 1,81,922 కార్డుదారులకు నెలకు 4,020 క్వింటాళ్ల బియ్యం పంపిణీ అవుతున్నాయి. ఈ నెల రేషన్ బియ్యాన్ని 112 చోట్ల డీలర్లు, 243 చోట్లలో మహిళా సంఘాలు గ్రామాలో, విలేజ్ ఆర్గనైజర్లు (వీవో) పట్టణాల్లో పంపిణీ చేయనున్నారు. అయితే డీలర్లు ఇదివరకు పంపిణీ చేసిన స్థలాల్లోనే పంపిణీ చేయనుండగా, సంఘాల ద్వారా పంపిణీ చేసే బియ్యాన్ని గ్రామ పంచాయతీ, కమ్యూనిటీ, యూత్ భవనాల్లో పంపిణీ చేయనున్నారు. ఇందుకు అధికారులు సంబంధిత భవనాల వివరాలు సేకరించి బియ్యాన్ని నిల్వ చేసేందుకు అనువుగా ఉన్నాయని గుర్తించారు. బియ్యం పంపిణీకి గుర్తించిన మహిళా సంఘాలతో సోమవారం నుంచి డీడీలు కట్టించి అదే రోజు నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వనున్నారు. అయితే డీడీలు సంఘం డబ్బుల ద్వారా పంపిణీ చేయగా వచ్చిన డబ్బును తమకు జమ చేసుకోనున్నారు. సరిపడా డబ్బు సంఘాల వద్ద అందుబాటులో లేకుంటే క్రెడిట్ ఆర్వో (బియ్యం పంపిణీ చేశాకే డబ్బు చెల్లింపు చేయడం)తో బియ్యం సరఫరా చేయనున్నట్లు అధికారులు ఇది వరకే స్పష్టం చేశారు. ఈ నెల 5 నుంచి 10 వరకు బియ్యం పంపిణీ చేసి స్థానిక పరిస్థితులను బట్టి అవసరమైన చోట గడువును పొడిగించనున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సరుకులు అందకపోయినా, సరఫరాలో ఇబ్బందులున్నా టోల్ ఫ్రీ నంబర్ 1967కు లేదా వాట్సాప్ నంబర్ 7330774444కు సమాచారం ఇవ్వవచ్చని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. సంఘాలతో సాధ్యమేనా..? రేషన్ బియ్యాన్ని మహిళా ద్వారా పంపిణీ చేయడంపై డీలర్లు గుర్రుగా ఉన్నారు. ప్రస్తుతం మహిళా సంఘాల వద్ద తూకం మిషన్లు లేవు. వాటిపై వారికి అవగాహన లేదు. పక్క జిల్లాలో ఇది వరకే మహిళా సంఘాలకు తూకం మిషన్ల వాడకంపై, రికార్డుల నిర్వహణపై శిక్షణ ఇస్తున్నా.. మన జిల్లాలో అధికారులు ఇంకా మొదలు పెట్టలేదు. అయితే ఈ–పాస్ సమయంలో ప్రభుత్వం సరఫరా చేసిన ఉచిత ఎలక్ట్రానిక్ తూకం మిషన్లు డీలర్ల వద్ద ఉన్నాయి. డీలర్లతో మాట్లాడి వారి వద్ద ఉన్న తూకం మిషన్లను మహిళా సంఘాలకు ఇప్పించే బాధ్యతను జిల్లా యంత్రాంగం తహసీల్దార్లకు అప్పగించింది. అయితే పంపిణీ గడువు దగ్గర పడుతున్నా ఇంత వరకు ఏ ఒక్క తహసీల్దార్ ఆ దిశగా అడుగు వేయలేదు. దీంతో మహిళా సంఘాల ద్వారా బియ్యం పంపిణీ సాధ్యమేనన్నా అనుమానాలు కలుగుతున్నాయి. ఏదేమైనా కార్డుదారులకు బియ్యం సరఫరా కావడం ముఖ్యమని పలువురు చర్చించుకోవడం గమనార్హం. -
సమ్మర్ క్యాంపులకు బియ్యం ఇయ్యం!
సాక్షి, హైదరాబాద్ : గురుకుల సొసైటీలు సంకటంలో పడ్డాయి. సమ్మర్ క్యాంపు(వేసవి శిబి రం)లకు బియ్యం కోటా ఇవ్వలేమని పౌర సరఫరాలశాఖ తేల్చి చెప్పడంతో ఆందోళన చెందుతున్నాయి. గురుకుల విద్యాలయాల సొసైటీలు ఏటా సమ్మర్ క్యాంపుల్లో భాగంగా గురు కుల పాఠశాలల్లోని చురుకైన విద్యార్థులకు పలు కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వ హిస్తాయి. క్రీడలు, నృత్యాలతోపాటు సబ్జెక్ట్‌కు సంబంధించి అవగాహన, భావ వ్యక్తీకరణ నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు. వీటికి రోజంతా సమ యం పడుతుండడంతో విద్యార్థులకు వసతితోపాటు భోజన సదుపాయాన్ని కూడా గురుకుల సొసైటీలే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రత్యేకంగా బియ్యం కోటా ఇవ్వాలని గురుకుల సొసైటీలు కోరగా ఇవ్వలేమని పౌర సరఫరాల శాఖ తేల్చి చెప్పింది. -
‘బయో’బాధలు..!
సాక్షి, యాదాద్రి : రేషన్ దుకాణాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం జనవరి 1 నుంచి ఈ పాస్ విధానం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ విధానం ద్వారా సరుకులు తీసుకోవాలంటే బయోమెట్రిక్ యంత్రాల్లో లబ్ధిదారుల వేలిముద్రలను తప్పనిసరి చేసింది. అయితే వయస్సు మళ్లిన వృద్ధులు, రక్తహీనత రోగులు, కష్టజీవులు, రోజువారి కూలీలు చేతి వేళ్ల రేఖలు కనిపించపోవడంతో వారి వేలిముద్రలు బయోమెట్రిక్ యంత్రాల్లో పడడం లేదు. జిల్లాలో ప్రతి నెలా వేలాది యూనిట్లకు ఇలాంటి సమస్య తలెత్తుతోంది. ఫలితంగా లబ్ధిదారులకు నెలనెలా ఇవ్వాల్సిన బియ్యం కోటా అందడం లేదు. వీటికి తోడు సాంకేతిక సమస్యలు, సిగ్నల్స్ అందకపోవడం కూడా వేలిముద్రలు పడకపోవడానికి కారణమవుతున్నాయి. శాపంగా మారిన ఒక్క శాతం నిబంధనఅక్రమాల నివారణ కోసం ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానం లబ్ధిదారులకు శాపంగా మారుతోంది. వేలి ముద్రలు పడని వారికి వీఆర్వోల ధ్రువీకరణ ద్వారా బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. అయితే ప్రతి రేషన్ దుకాణంలో ఒక్క శాతం మేరకే వీటిని ఇవ్వాలని ఉత్తర్వులు ఉన్నాయి. దీంతో ప్రతి రేషన్ దుకాణంలో పదుల సంఖ్యలో వేలిముద్రలు పడని వారు ఉంటున్నప్పటికీ అందరికీ బియ్యం అందడం లేదు. వారందరికీ రేషన్ ఇవ్వడం డీలర్లకు ఇబ్బందిగా మారింది. తమకు బియ్యం ఇప్పించాలని లబ్ధిదారులు రేషన్ దుకాణం, గ్రామంలోని వీఆర్వో, మండలంలోని తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తులు పెట్టుకుంటున్నా వారికి న్యాయం జరగడం లేదు. భువనగిరిలో 823 మంది భువనగిరి పట్టణం, మండల పరిధిలో 36 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటిలోని 712 మంది లబ్ధిదారుల వేలిముద్రలు బయోమెట్రిక్ యంత్రాల్లో పడడం లేదు. వేలిముద్రలు పడనివారికి ఒక్క శాతం రేషన్ ఇవ్వాలన్న నిబంధన ప్రకారం కేవలం 192మందికి మాత్రమే బియ్యం అందుతున్నాయి. మిగతా 520 మందికి బియ్యం నెలనెలా అందడం లేదు. ఈపరిస్థితి జిల్లా వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల్లో ఉంది. అర్హులందరికీ బియ్యం ఇవ్వాలి వేలిముద్రలు పడనివారందరికీ నెలనెలా రేషన్ బియ్యం ఇవ్వాలి. ఒక్క శాతం నిబంధనతో పేదలందరికీ బియ్యం అందడం లేదు. ఈ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని బియ్యం పంపిణీ సక్రమంగా జరిగేటట్లు చూడాలి. –చల్లగురుగుల రఘుబాబు, మైఫ్రెండ్ సోషల్ ఆర్గనైషన్ అధ్యక్షుడు ఆధార్ ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి వేలిముద్రలు రానివారు తమ ఆధార్‌కార్డును ఆధార్ సెంటర్ ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. వేలిముద్రలను కూడా ఆన్లైన్ చేసుకోవాలి. వేలిముద్రలు రాని వారికి వీఆర్వో ద్వారా బియ్యం, సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కో రేషన్‌షాపుకు వీఆర్వోలను కేటాయించాం. –కొప్పుల వెంకట్‌రెడ్డి, భువనగిరి తహసీల్దార్ -
తెర వెనక ఎవరు..?
సాక్షి ప్రతినిధి, వరంగల్ : వేర్లను వదిలేసి పైపై కొమ్మలను కొడుతుండడంతో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. దాడులు జరుగుతున్న సందర్భాల్లో ప్రధాన వ్యక్తులను పక్కకు తప్పిస్తుండడంతో ఈ దందా మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లుగా కొనసాగుతూనే ఉంది. దీంతో పేదలకు ప్రభుత్వం అందించే రూపాయికి కిలోబియ్యం అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. రేషన్ బియ్యం దుర్వినియోగం అవుతున్న విషయాన్ని గ్రహించి అక్రమ రవాణా చేస్తున్నవారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. వరుస దాడులు చేయడంతోపాటు పీడీ యాక్టు సైతం ప్రయోగిస్తోంది. అయితే.. ఎన్ని సార్లు దాడులు జరిగినా, తిరిగి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. దీనికి ప్రధాన కారణం అక్రమ రవాణాకు కేంద్ర బిందువుగా వ్యవహరించే వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే పక్కకు తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. అక్రమ రవాణా సజావుగా సాగినంత వరకు వీరే అన్ని తామై వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఏదైనా తేడా వచ్చి దాడులు జరిగి బియ్యంతో పట్టుబడిన సందర్భాల్లో నేర్పుగా పక్కకు తప్పుకుని కింది స్థాయి వ్యక్తులను కేసుల్లో ఇరికిస్తున్నారు. ఫలితంగా బియ్యం అక్రమ రవాణా కొంత కాలం మందగించినా ... మళ్లీ తిరిగి జోరుగా సాగుతోంది. సగటున ప్రతి రెండు రోజులకు ఒక లారీ లోడు బియ్యం వరంగల్ నుంచి అక్రమ రవాణా అవుతున్నట్లు సమాచారం. కేసుల్లో ఉండరు తొర్రూరు, జనగామ ఏరియాల్లో ఏర్పాటు చేసుకున్న ఏజెంట్ల ద్వారా గ్రామాల్లో బియ్యాన్ని సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని ఆటోలు, ట్రాలీల ద్వారా వరంగల్‌లో ఉన్న ప్రధాన కేంద్రంలో నిల్వ చేస్తున్నారు. లారీకి సరిపడా లోడు రాగానే.. వెంటనే వరంగల్ నుంచి తరలిస్తున్నారు. ఈ తరహాలో బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి పక్కా సమాచారం లభించడంతో మంగళవారం ఖిలావరంగల్ మండలం బొల్లికుంట శివారు సింగారం క్రాస్ సమీపంలో 500 క్వింటాళ్ల నిల్వ చేసిన బియ్యాన్ని స్టేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను టాస్క్ఫోర్సు అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తులను మామునూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలు వ్యక్తి ఎక్కడ.. వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఈ అక్రమ రవాణాలో కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. గతంలో కొబ్బరికాయల వ్యాపారం చేసి... ప్రస్తుతం బియ్యం అక్రమ రవాణాలో కీలక వ్యక్తిగా మారాడు. ఇతను సాగిస్తున్న దందాకు సంబంధించిన సమాచారాన్ని అనేక సార్లు స్థానికంగా ఉన్న పోలీసులు, విజిలెన్సు సిబ్బందికి అందించినా ఫలితం లేకుండా పోయింది. లోకల్ స్థాయిలో పోలీసు సిబ్బందితో ఉన్న పరిచయాల కారణంగా ఎప్పటికప్పుడు సేఫ్ అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో నేరుగా పౌరసరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయానికి పక్కా ఆధారాలతో సమాచారం అందించారు. దీంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా నేరుగా టాస్క్‌ఫోర్స్ అధికారులు మంగళవారం దాడి చేశారు. దీనికి సంబంధించి కనీసం స్థానిక పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. టాస్క్‌ఫోర్స్, సివిల్ సప్లయీస్ అధికారులు అక్రమ రవాణాపై విచారణ చేస్తున్నారు. మొక్కజొన్న కంకుల వ్యాపారం చేస్తామంటూ మిల్లును లీజుకు తీసుకుని, బియ్యం అక్రమ రవాణాకు అడ్డాగా మార్చినట్లు ఇప్పటికే తేలింది. ఈ మేరకు బియ్యం అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నది ఎవరు, అతనికి అండదండలు అందిస్తున్న వారు ఎవరు అనే అంశాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. పక్కా ఆధారాలు సేకరించిన అనంతరం కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 11 మంది వ్యాపారులపై కేసు నమోదు మామునూరు: ఖిలావరంగల్ మండలం బొల్లికుంట గ్రామ శివారు సింగారం గ్రామ ప్రధాన రహదారిలోని ఓ పాత రైస్ మిల్లు గోదాంలో ప్రజల నుంచి భారీగా సేకరించి అక్రమంగా నిల్వ చేసిన ప్రజాపంపిణీ బియ్యం పట్టుబడింది. వరంగల్ మండల డిప్యూటీ తహసీల్దార్ దురిశెట్టి శ్రీధర్ ఫిర్యాదు మేరకు గురువారం సాయంత్రం 11 మంది వ్యాపారులపై కేసు నమోదు చేసినట్లు మామునూరు సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట గ్రామ సమీపంలోని సింగారం రహదారిలో ఓ పాత రైసు మిల్లు గోదాములో పలు ప్రాంతాలకు చెందిన బియ్యం వ్యాపారులు మాలగాని రమేష్, దొడ్డ శ్రీనివాస్, పులిశేరి శ్రీను, పస్తం మహేందర్, సిరిగి సంపత్, పస్తం నరేందర్, తూర్పాటి కుమారస్వామి, చిదురాల నవీన్, వెంకన్న, ఇమ్మడి సోమ నర్సయ్య, సందీప్ మొత్తం 11 మంది ఒక బృందంగా ఏర్పడ్డారు. వీరందరూ నగర శివార్లల్లోని పాత బడ్డ భవనాలు, గోదాంలను ఎంచుకుని ప్రజల నుంచి అక్రమంగా సేకరించిన రేషన్ బియ్యాన్ని భారీగా నిల్వ చేశారు. రెవెన్యూ, సివిల్ సప్లయీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ శాఖ విజిలెన్స్ బృందం ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 425.22 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 22.17 క్వింటాళ్ల నూకలు పట్టుబడ్డాయి. వీటి విలువ రూ.10,79,519 రూపాయలు ఉంటుందని అంచనా. వీటితోపాటు బియ్యాన్ని తరలించేందుకు సిద్ధంగా ఉన్న 2 ట్రాలీ ఆటోలను సైతం సీజ్ చేసి స్టేషన్లో ఆప్పగించారు. -
గుజరాత్లో రేషన్ బియ్యం అందట్లేదు
అహ్మదాబాద్: ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ ఆరోపణ కారణంగా గుజరాత్ పేద ప్రజలకు చౌకబియ్యం అందడం లేదని ప్రధాని మోదీ సోదరుడు, రేషన్ దుకాణదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రహ్లాద్ మోదీ సంచలన ఆరోపణ చేశారు. జాతీయ ఆహార భద్రత చట్టం కింద గుజరాత్‌లోని దాదాపు 17వేల రేషన్ దుకాణాల్లో ‘మా అన్నపూర్ణ యోజన’ పేరుతో రేషన్ బియ్యాన్ని అందజేస్తున్నారు. ఈ రేషన్ దుకాణాలన్నీ ఈ–ఎఫ్‌పీఎస్ సాఫ్ట్వేర్ ద్వారా సెంట్రల్ డాటాబేస్‌తో అనుసంధానమై ఉన్నాయి. దీంతో లబ్ధిదారు తప్పనిసరిగా ఆధార్ వివరాలు, వేలిముద్ర ఇవ్వాలి. లేకుంటే రేషన్ బియ్యం రాదు. చాలా దుకాణాల్లో సాఫ్ట్వేర్ పనిచేయకపోవటంతో లబ్ధిదారులు ఒట్టి చేతుల్తో వెళ్తున్నారని ప్రహ్లాద్ చెప్పారు. -
అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు
కరీంనగర్‌క్రైం : కొన్నేళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అధిక ధరలున్న బియ్యాన్ని నమూనాగా చూపించి రేషన్‌బియ్యం అంటగడుతున్న ముఠాను సోమవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్ హెడ్‌క్వార్టర్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో సీఐలు మాధవి, కిరణ్ విలేకరులతో వివరాలు తెలిపారు. ఖమ్మం జిల్లా తల్లడ మండలం అన్నారుగూడెంకు చెందిన సుంకర కనకరావు(42), సోదా వెంకటేశ్వర్లు(35), నర్సింహరావుపేటకు చెందిన గోపిశెట్టి నాగేశ్వర్రావు(35) ముఠాగా ఏర్పడ్డారు. ఆటోలో తిరుగుతూ రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్నారు. వీటినే ఇంటివద్ద 25 కిలోల బస్తాల్లో నింపి ఊరూరా తిరుగుతూ సన్నబియ్యమని విక్రయిస్తున్నారు. తక్కువ ధరకే సన్నబియ్యం వస్తుండడంతో జనం కూడా కొనుగోలు చేస్తున్నారు. తీరా ఇంటికెళ్లి చూసేలోగానే వారు అక్కడి నుంచి పరారయ్యేవారు. ఇలా పలు జిల్లాల్లో పదేళ్లుగా మోసాలకు పాల్పడుతున్నారు. వీరిపై ఆయా ప్రాంతాల్లో కేసులు సైతం నమోదయ్యాయి. కరీంనగర్‌లోని తిరుమల్‌నగర్‌కు చెందిన అజ్మీరా రాజు గత నెల 31న ఆటోలో వచ్చిన వీరి నుంచి సన్నబియ్యం మూడు క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ఇంటికెళ్లి చూడగా రేషన్‌బియ్యంగా గుర్తించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వన్‌టౌన్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. సోమవారం తిరుమల్‌నగర్‌కు వచ్చిన వారిని అదుపులోకి తీసుకుని.. వారి నుంచి రూ.10,500, ఆటో, బియ్యంబస్తాలు, మెషిన్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. -
ముక్కిపోయి మూడేళ్లు!
నేలకొండపల్లి : అక్రమార్కులు తరలిస్తున్న బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు.. సివిల్ సప్లై గోడౌన్లో నిల్వ చేశారు.. ఆ తర్వాత కన్నెత్తి చూడలేదు.. మూడేళ్లు గడిచింది.. బియ్యం ముక్కిపోయి.. తుట్టెలుపట్టి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నేలకొండపల్లి ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలో అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా.. అధికారులు మూడేళ్ల క్రితం పట్టుకున్నారు. 23 టన్నుల(232 క్వింటాళ్లు) బియ్యాన్ని స్థానిక గోడౌన్లో నిల్వ చేశారు. ఆ తర్వాత అధికారులు అటువైపు వెళ్లలేదు. బియ్యానికి పురుగులు పట్టి ముక్కిపోయాయి. ఆ పురుగులన్నీ గోడౌన్ పక్కనే ఉన్న బాలికల వసతి గృహంలోకి ప్రవేశించి విద్యార్థినులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గోడౌన్లలో పనిచేసే హమాలీలు కూడా పురుగుల వాసనతో అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ విషయాన్ని హమాలీలు పలుమార్లు సివిల్ సప్లై అధికారులకు తెలియజేసినా.. పట్టించుకునేవారు కరువయ్యారు. దాదాపు 232 క్వింటాళ్ల బియ్యం మట్టిపాలు కావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లా.. పట్టుకున్న బియ్యాన్ని ఇక్కడి నుంచి తరలించాలని గతంలోనే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. బియ్యం పురుగుపట్టి.. దుర్వాసన వస్తుందని చెప్పాను. అధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటాం. – రామచందర్‌రావు, సివిల్ సప్లై గోడౌన్ ఇన్చార్జ్, నేలకొండపల్లి చర్య తీసుకోవాలి.. పేదల బియ్యం అంటే అంత నిర్లక్ష్యమా. లక్షలాది రూపాయలు విలువ చేసే బియ్యం పనికిరాకుండా చేసిన అధికారులపై చర్య తీసుకోవాలి. వారి జీతాల నుంచి రికవరీ చేయాలి. పేదల సొమ్మంటే లెక్కలేదు. – కాశిబోయిన అయోధ్య, వ్యవసాయ కార్మికుడు -
ఈ నేరం మాది కాదు
పెరవలి : రాష్ట్రంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం డీలర్ల వద్ద నుంచి కొనుగోలు చేసింది కాదని ఈ బియ్యం అంతా స్టాక్ పాయింట్ల నుంచే రవాణా జరుగుతుందని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలా మాధవరావు ఆరోపించారు. నల్లాకులవారిపాలెంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సోమవారం కొవ్వూరు డివిజన్ రేషన్ డీలర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రేషన్ దుకాణాలకు సరుకును పంపిణీ చేసే స్టాక్ పాయింట్లు 266 ఉన్నాయని వీటి ద్వారా ప్రతి నెలా 400 లారీల సరుకు పక్కదారి పడుతుందని తెలిపారు. సరుకును అక్రమంగా తరలించి ఆ నిందను రేషన్ డీలర్లపై నెడుతున్నారని ఆరోపించారు. ఈ నెల నుంచి నేరుగా పాయింట్ల నుంచి వచ్చే సరుకును తూకం వేయకుండా ఇస్తే వాటిని తీసుకోకుండా వెనక్కి పంపించాలని తెలిపారు. రేషన్ బియ్యం బొక్కేదెవరో తెలియాలంటే స్టాక్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు. జిల్లా అధ్యక్షుడు రాజులపాటి గంగాధర్, ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి నర్సింహరావు, చంటి అజేయరెడ్డి, నల్లాకుల వెంకటేశ్వరరావు, వీరబ్రహ్మం పాల్గొన్నారు. -
70 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
మద్దిపాడు: అక్రమంగా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న 70 బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లి గ్రామ సమీపంలో ఓ లారీలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు లారీని స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని వెల్లంపల్లి కేంద్రంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపణలు ఉండటంతో.. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిఘావేసి బియ్యం లోడుతో వస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నారు. -
‘బ్లాక్’ ముఠా ఆటకట్టు
120 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత గ్యాంగ్‌లోని నలుగురి అరెస్టు రాంగోపాల్‌పేట్: పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని బ్లాక్‌మార్కెట్ తరలిస్తున్న ముఠా గుట్టును టాస్క్‌పోర్స్ పోలీసులు రట్టు చేశారు. గ్యాంగ్‌లోని నలుగురిని అరెస్టు చేసి 120 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో డీసీపీ లింబారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కిషన్‌బాగ్‌కు చెందిన ఆటోడ్రైవర్ సయ్యద్ ఫిరోజ్, మున్వర్ (కిషన్‌బాగ్)లు హమాలీ మహ్మద్ ఇమ్రాన్, ఫరీద్ (జహీరాబాద్), మహ్మద్ అబ్దుల్ అల్మాస్ (కాలాపత్తర్)లతో కలిసి ముఠా ఏర్పాటు చేశారు. వీరు మంగళ్‌హాట్ జెన్సీచౌరాకు చెందిన రేషన్ డీలర్ ఓంప్రకాశ్‌తో పాటు నగరంలోని పలువురు రేషన్ డీలర్ల నుంచి కిలో రూపాయి బియ్యాన్ని రూ.14 చొప్పున కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. డీలర్ ఓంప్రకాశ్ ప్రభుత్వం నుంచి తనకు వచ్చే కోటా బియ్యంలో సగం మాత్రమే కార్డుదారులకు పంపిణీ చేసి.. మిగతా ‘సరుకు’ను మున్వర్, ఫిరోజ్‌లకు విక్రయిస్తున్నాడు. అలాగే కొందరు కార్డుదారులు రేషన్ బియ్యాన్ని కిలో రూ.10కి కిరాణాషాపుల్లో విక్రయిస్తున్నారు. వీటిని కూడా మున్వర్, ఫిరోజ్ ధ్వయం కిరాణా యజమానుల నుంచి కొనుగోలు చేస్తోంది. వివిధ మార్గాల్లో సేకరించిన బియ్యాన్ని జహీరాబాద్‌లో ఉన్న గోడౌన్‌కు తరలిస్తారు. ఆ గోడౌన్ ఇన్చార్జిగా మహ్మద్ ఇమ్రాన్‌ఖాన్ వ్యవహరిస్తున్నాడు. ఇతనికి స్థానికుడు ఫరీద్ సహకరిస్తున్నాడు. ఇతర రాష్ట్రాలకు విక్రయం:ఇలా పెద్ద మొత్తంలో బియ్యాన్ని సేకరించి ఏడాది పాటు భద్రపరుస్తారు. బియ్యానికి రేటు రాగానే రైస్ మిల్లులకు తరలించి వాటిని పాలిష్ పట్టి సన్న బియ్యంగా మారుస్తారు. ఈ బియ్యాన్ని అధిక ధరకు కర్ణాటక, జహీరాబాద్, బోధన్ తదితర ప్రాంతాలకు తరలించి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఇదే క్రమంలో ఇటీవల కిషన్‌బాగ్‌లోని ఓ గోడౌన్లో రేషన్ బియ్యం అక్రమంగా దాచి బ్లాక్ మార్కెట్‌కు తరలించేందుకు ఉంచారన్న సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు, సివిల్ సప్లై అధికారులు కలిసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా భద్రపరిచిన 250 బ్యాగుల్లోని 120 క్వింటాళ్ల బియ్యాన్ని, గోధుమలు, డీసీఎంను స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని నలుగురిని అరెస్టు చేయగా మున్వర్, ఫరీద్ తప్పించుకున్నారు. ఈ ముఠా కొన్నేళ్లుగా ఈ బ్లాక్ మార్కెట్ దందా చేస్తోందని పోలీసులు తెలిపారు. ఈ ముఠా సభ్యులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. సమావేశంలో వెస్ట్‌జోన్ ఇన్స్పెక్టర్ రాజా వెంకటరెడ్డి, ఎస్సైలు జలంధర్‌రెడ్డి, మల్లికార్జున్, వెంకటేశ్వరగౌడ్ పాల్గొన్నారు. -
నల్లబోతోంది!
ప్రజా పంపిణీ అవస్థ రేషన్ బియ్యం పక్కదారి నెలకు 6 వేల మెట్రిక్ టన్నులు గోల్మాల్ బ్లాక్‌మార్కెట్‌కి తరలింపు..తిరిగి అదే బియ్యం రేషన్పాపులకి.. డీలర్లతో పాటు అధికారులకూ అక్రమాల్లో వాటా సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : రేషన్ డీలర్లు పేదల పొట్టకొడుతున్నారు. బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ ‘గిట్టుబాటు’ అయిన మేరకు సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో 7,54,714 తెల్లరేషన్ కార్డులు, 54,999 అంత్యోదయ కార్డులు కలిపి మొత్తం 8,09,713 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. తెల్లరేషన్ కార్డుదారులకు ఒక్కరికి 6 కిలోల చొప్పున.. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికీ కిలో రూపాయికే పంపిణీ చేస్తున్నారు. అంత్యోదయ కార్డుకు సభ్యులతో సంబంధం లేకుండా 35 కిలోల బియ్యం ఇస్తున్నారు. తెల్ల, అంత్యోదయ ఆహార భద్రత కార్డులకు కలిపి నెలనెలా 17,096.223 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్ల చేతిలో పెడుతోంది. ఈ బియ్యం ద్వారా 26.84 లక్షల మంది ప్రజలు రోజుకు కనీసం రెండు పూటలైనా భోజనం చేస్తారని సర్కారు భావిస్తోంది. కానీ రేషన్ డీలర్లు ఇందులో సగం బియ్యాన్ని నొక్కేస్తున్నారు. అవే బియ్యాన్ని మళ్లీ రైస్ మిల్లుల ద్వారా ప్రభుత్వానికే అమ్ముతున్నారు. విద్యార్థి వసతి గృహాలకు, మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం పథకం అమల్లోకి వచ్చాక వీళ్ల ‘గోల్మాల్’ దందా మరింత సులువైంది. రేషన్ డీలర్లు నెలలో గరిష్టంగా పది రోజులైనా దుకాణాలు తెరవట్లేదు. ఒకవేళ తెరిచినా సమయ పాలన ఉండదు. తమ వీలు చూసుకుని నాలుగైదు గంటలు తెరుస్తున్నారు. ఇలా చేయటం కూడా పథకంలో భాగమే. దుకాణం చుట్టూ తిరిగి తిరిగి కార్డుదారులు సరుకులు తీసుకోకుండానే వెళ్లిపోతారు. కనీసం 2 శాతం మంది ఇలానే వెళ్లిపోతారని అంచనా. మరోవైపు ఆహార భద్రత కార్డు ఉన్నవారికి రేషన్ ఎక్కడ కేటాయించారో తెలియదు. దీంతో కనీసం 10 శాతం మంది కార్డుదారులు రేషన్ తీసుకోవట్లేదు. ఇక గ్రామాల్లో కనీసం 20 శాతం మంది వలసలు, ఇతర కారణాల వల్ల రేషన్ షాపుల ముఖం చూడట్లేదు. మరో 3 శాతం మంది రేషన్ కార్డులు డీలర్ల వద్దే ఉన్నాయి. మొత్తానికి సగటున 35 శాతం మంది రేషన్‌కార్డుదారులు నెలనెలా బియ్యం పొందడం లేదని పౌరసరఫరాల శాఖ అధికారులే లెక్క తేలుస్తున్నారు. నిబంధనల ప్రకారం ఈ 35 శాతం బియ్యాన్ని డీలర్లు తిరిగి సివిల్ సఫ్లై శాఖకు అప్పగించాలి. నిజానికి ఆ శాఖ అధికారులు దగ్గరుండి మిగులు సరుకుల వివరాలు తీసుకొని వచ్చే నెల కోటాకు సర్దుబాటు చేయాలి. కానీ ఇప్పటి వరకు క్వింటాల్ బియ్యం కూడా సివిల్ సప్లై శాఖకు రికవరీ కాలేదు. 35 శాతం.. అంటే దాదాపు 6 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రతి నెలా పక్కదారి పడుతోంది. పౌర సరఫరాల శాఖకు బియ్యం అందిస్తున్న రైస్ మిల్లర్లు అవే బియ్యాన్ని రేషన్ డీలర్ల ద్వారా మళ్లీ బయట మార్కెట్లో కొంటూ రీసైక్లింగ్ చేస్తూ తిరిగి పౌర సరఫరాల శాఖకే పంపిస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థపై నిఘా లేకపోవడంతో అక్రమార్కుల దందా దర్జాగా సాగిపోతోంది. డీలర్ల నుంచి బియ్యం కొనుగోలు చేసి.. రైసు మిల్లుకు తరలించి.. మరపట్టి, తిరిగి దాన్ని సివిల్ సప్లై శాఖకు అప్పగించే వరకు చూసుకునేందుకు ఒక ‘వ్యవస్థ’ బలంగా పనిచేస్తోంది. ఒక్కో డీలర్ నెలకు సగటున 5 నుంచి 7 క్వింటాళ్ల బియ్యం పోగు చేస్తున్నారు. ఈ బియ్యాన్ని కిలో రూ.10 నుంచి రూ.15 చొప్పున నమ్మకస్తులైన మధ్యవర్తులకు అమ్ముకుంటున్నారు. మధ్యవర్తులు మరో రూ.2 మార్జిన్ చూసుకొని ప్రైవేటు ఏజన్సీకి చేరవేస్తున్నారు. ఏజెన్సీలు టోకున రైస్‌మిల్లులకు తరలిస్తున్నాయి. వీటిని మరపట్టి సన్నగా పాలిష్ చేసి రూ.26 రేటుకు మహారాష్ట్రకు అమ్ముకుంటున్నారు. మరికొంత బియ్యాన్ని నేరుగా మిల్లుల ద్వారా సివిల్ సఫ్లై శాఖకు ఇస్తున్నారు. మండల కేంద్రాలకు దూరంగా ఉన్న గ్రామాలను ఎంచుకొన్న అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల మండల కేంద్రమైన చేగుంటలో అక్రమంగా తరలిస్తున్న రెండు బియ్యం లారీలను పట్టుకున్నారు. పౌర సరఫరాల శాఖ విచారణలో ఇవి రేషన్ బియ్యమని తేలింది. -
అక్రమాలు ఆగలె!
ఖమ్మం జడ్పీసెంటర్ : జిల్లాలో బియ్యం అక్రమ దందా కొనసాగుతూనే ఉంది. పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. డీలర్లు, మిల్లర్ల మాయజాలంలతో రీసైక్లింగ్ రూపంలో దారి మళ్లుతోంది. దీనిని అరికట్టాల్సిన అధికారులు తూతూమంత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. జూన్, జూలై నెలలో చేసిన నామమాత్రపు దాడుల్లో దొరికిన రేషన్ సరకుల విలువ రూ.36,39 లక్షల్లో ఉంది. పూర్తి స్థాయిలో దాడులు చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. అయినా అధికారులు ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదని తెలుస్తోంది. కింది స్థాయి అధికారులపై జిల్లా అధికారుల అజమాయిషీ లేక పోవడమే బియ్యం అక్రమ దందాకు కారణమనే విమర్శలు వస్తున్నాయి. అక్రమార్జనకు ఇదే నిదర్శనం రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం తెల్లరేషన్‌కార్డుపై రూపాయికి పంపిణీ చేస్తోంది. డీలర్లు, ప్రజల నుంచి చిరువ్యాపారులు రేషన్ బియాన్ని రూ.8 నుంచి రూ.10కు కొనుగోలు చేస్తున్నారు. దీనిని కొద్ది మొత్తం రేటు పెంచి మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారు. మిల్లులకు తరలిన బియ్యాన్ని రీసైక్లింగ్ ద్వారా సన్నగా మార్చి, ఇతర రకాల్లో కలిపి బహిరంగ మార్కెట్లకు తరలిస్తున్నారు. కిలో రూ.25 నుంచి రూ.30 వరకు అమ్మకాలు సాగిస్తున్నారు. జిల్లా కేంద్రం సమీపంలో వైరా కేంద్రంగా బియ్యం రీ సైక్లింగ్ అక్రమ వ్యాపారం సాగుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయినా అధికారులు మిల్లర్లపై దాడులు నిర్వహించిన దాఖలాలు లేవు. బినామీల జోరు రేషన్ వ్యవస్థలో ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టినట్లు జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. కానీ జిల్లా వ్యాప్తంగా రేషన్ డీలర్లలో సగానికిపైగా బినామీలే ఉన్నట్లు సాక్షాత్తు సివిల్ సప్లై అధికారులు చెబతున్నారు. రాజకీయ పలుకుబడితో అధిక సంఖ్యలో బినామీల గుప్పిట్లో షాపులు నడుస్తుండడంతో అధికారులు దాడులు చేయడం లేదనేది బహిరంగ రహస్యం. జిల్లా వ్యాప్తంగా ఉన్న రేషన్ వ్యవస్థపై దృష్టి సారించి అసలు, న కిలీల జాబితాను తేల్చితేనే పౌరసరఫరాల వ్యవస్థ గాడిలో పడే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మామూళ్ల మత్తులో యంత్రాంగం నిత్యావసర సరకులపై నిత్యం నిఘా ఉంచాల్సిన అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలు వెలు ్లవెత్తుతున్నాయి. ప్రతినెలా జిల్లా స్థాయి అధికారుల ఆదేశాల మేరకు నామమాత్రపు డాడులు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. గడిచిన రెండు నెలల్లో జిల్లా వ్యాప్తంగా చేసిన దాడుల్లో 838.63 క్వింటాళ్ల బియ్యం పట్టుబడినట్లు అధికారులు చెబుతున్నారు. అదే పూర్తిస్థాయిలో నిఘాను పెంచి షాపులు, మిల్లర్లపై దాడులు చేస్తే మరింత ఫలితం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. జూన్‌లో పౌర సరఫరాల శాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో 57 కేసులు నమోదు చేశారు. దాడుల్లో రేషన్ బియ్యం 460 క్వింటాళ్లు, కందిపప్పు 3 క్వింటాళ్లు, కిరోసిన్ 1,730 లీటర్లు, 27 గ్యాస్ సిలిండర్లు పట్టుబడ్డాయి. వీటి విలువ రూ. 12,06,173గా గుర్తించారు. అలాగే జూలైలో 47 కేసులు నమోదు కాగా బియ్యం 378.63 క్వింటాళ్లు, 2.770 లీటర్ల కిరోసిన్, 376 కేజీల కందిపప్పు, 5 క్వింటాళ్ల పంచదార పట్టుబడింది. కానరాని విజిలెన్స్ దాడులు జిల్లా వ్యాప్తంగా ఉన్న మిల్లుల్లో అక్రమ బియ్యం, కందిపప్పు నిల్వలు ఉన్నప్పటికీ జిల్లా అధికారులు దాడులు నిర్వహించకపోవడం వెనుక పెద్దల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిల్లుల్లో అక్రమ నిల్వలపై గతంలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి వేల క్వింటాళ్ల నిత్యావసర వస్తువులు స్వాధీనం చేసుకున్న సంఘటనలు అనేక ఉన్నాయి. అయితే ఇటీవల మిల్లర్లపై దాడులు నిర్వహించేందుకు విజిలెన్స్ అధికారులు సాహసించడంలేదనే వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి. అక్రమ నిల్వలపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.