అహ్మదాబాద్: ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ ఆరోపణ కారణంగా గుజరాత్ పేద ప్రజలకు చౌకబియ్యం అందడం లేదని ప్రధాని మోదీ సోదరుడు, రేషన్ దుకాణదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రహ్లాద్ మోదీ సంచలన ఆరోపణ చేశారు. జాతీయ ఆహార భద్రత చట్టం కింద గుజరాత్‌లోని దాదాపు 17వేల రేషన్ దుకాణాల్లో ‘మా అన్నపూర్ణ యోజన’ పేరుతో రేషన్ బియ్యాన్ని అందజేస్తున్నారు. ఈ రేషన్ దుకాణాలన్నీ ఈ–ఎఫ్‌పీఎస్ సాఫ్ట్‌వేర్ ద్వారా సెంట్రల్ డాటాబేస్‌తో అనుసంధానమై ఉన్నాయి. దీంతో లబ్ధిదారు తప్పనిసరిగా ఆధార్ వివరాలు, వేలిముద్ర ఇవ్వాలి. లేకుంటే రేషన్ బియ్యం రాదు. చాలా దుకాణాల్లో సాఫ్ట్‌వేర్ పనిచేయకపోవటంతో లబ్ధిదారులు ఒట్టి చేతుల్తో వెళ్తున్నారని ప్రహ్లాద్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment